ఆర్తి ప్రబంధం – 53

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 52

పరిచయము:

మునుపటి పాశురములో మాముణులు, ఈ ప్రపంచంలో తన శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు తాను ఉన్న చోటికి ఎలా వస్తాడో వివరించారు. పెరియ పెరుమాళ్ళు తన వాహమైన పెరియ తిరువడిపై వస్తారని వారు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది, “తన చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు  తాను ఉన్న చోటికి వస్తారు సరే, కానీ ఆ చివరి క్షణాలు వచ్చేవరకు మాముణులు ఏంచేస్తారు?”.  “ఆ అంతిమ క్షణం వచ్చేవరకు, చేసిన పాపాలకు ప్రపంచంలో పరిణామాలను అనుభవిస్తూ ఈ నా శరీరం శిధిలమైపోవాలి. ఈ శరీరం వల్ల కలిగే కర్మలను వాటి ప్రభవాలను అనుభవించుకుంటూ నేను ఇక్కదే ఎప్పటికీ ఉండలేను. కాబట్టి, హే శ్రీ రామానుజ!!!, మీరు నాకు ఉత్తమమైనది అవసరమైనది ప్రసాదించుము. బాధలు, కష్థాలతో నిండి ఉన్న ఈ లోకము నుండి నన్ను మీరు విముక్తి చేయాలి”, అని మాముణులు ప్రార్థిస్తున్నారు.

పాశురము 53:

ఇదత్తాలే తెన్నరంగర్ శెయ్గిఱదు ఎన్ఱఱిందే
ఇరుందాలుం తఱ్కాల వేదనైయిన్ కనత్తాల్
పదైత్తు ఆవో ఎన్నుం ఇందప్పావ ఉడంబుడనే
పల నోవుం అనుబవిత్తు ఇప్పవత్తు ఇరుక్కప్పోమో?
మదత్తాలే వల్వినైయిన్ వళి ఉళన్ఱు తిరింద
వల్వినైయేన్ తన్నై ఉనక్కు ఆళాక్కి క్కొణ్డ
ఇదత్తాయుం తందైయుమాం ఎతిరాశా! ఏన్నై
ఇనిక్కడుగ ఇప్పవత్తినిన్ఱుం ఎడుత్తరుళే!!!

ప్రతి పద్ధార్ధములు:

ఇదత్తాలే – “హితము” కారణంగా (ఒక వ్యక్తి మంచిని ఆలోచించి ఆ ప్రకారము నడుచుకొనుట)
తెన్నరంగర్ – పెరియ పెరుమాళ్ళు (శ్రీ రంగనాధులు)
య్గిఱదు ఎన్ఱఱిందే ఇరుందాలుం – వారి కృప కారణంగా, నా కర్మల ఫలితాన్ని నేను అనుభవించుట. వారు నా మంచి కోసమే చేస్తున్నారని నాకు తెలుసినా
తఱ్కాల వేదనైయిన్ కనత్తాల్ – ఆ సమయంలో నేను అనుభవించే క్షణిక బాధ
పదైత్తు – నొప్పితో గిలగిలలాడుట
ఆవో ఎన్నుం – “ఆ”, “ఓ” అని బాధను తట్టుకోలేక వచ్చే శబ్దాలు
ఇరుక్కప్పోమో? – నేను జీవించగలనా
ఇప్పవత్తు – ఈ సంసారములో
ఇందప్పావ ఉడంబుడనే – ఈ శరీరముతో (ఈ శరీరమే ఒక పాపి)
పల నోవుం అనుబవిత్తు – అనేక బాధలను అనుభవించాను
మదత్తాలే – ఈ శరీర సంబంధము కారణంగా
ల్వినైయిన్ వళి ఉళన్ఱు తిరింద – నా కర్మల నిర్దేశించిన మార్గంలో అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
వల్వినైయేన్ తన్నై– అతి కౄరుడిని, పాపి అయిన నేను
ఆళాక్కి క్కొణ్డ – మీ దాసులుగా చేసుకున్నారు
ఉనక్కు – సమస్థ ఆత్మలకు ఆధారము
ఇదత్తాయుం – మీరు నా తల్లి లాగా (“హితము” చేశారు)
తందైయుమాం – తండ్రి
ఎతిరాశా! – హే! ఎంబెరుమానారే!!!
ఇని – ఇకపై
కడుగ – త్వరగా
ఎడుత్తరుళే – సంస్కరించి ముక్తిని
ఎన్నై – నన్ను
ఇప్పవత్తినిన్ఱుం – ఈ సంసారము నుండి

సరళ అనువాదము:

నిరంతరము మాముణులు తనను విముక్తులను చేయమని శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళ వల్ల తాను ఇంత బాధను అనుభవిస్తున్నానని గ్రహిస్తారు, ఎందుకంటే వారి మంచితనము కారణంగా, తన కర్మ ఫలాలను పూర్తిగా అనుభవింపజేయాలనే ఉద్దేశ్యముతో  తనని ఇంత బాధ పెడుతున్నాడని గ్రహిస్తారు. పెరియ పెరుమాళ్ళ ఉద్దేశ్యము అర్థం చేసుకున్నప్పటికీ, కర్మ పరిణామాలను అనుభవించే సమయము వచ్చినపుడు భరించలేమని మాముణులు వివరిస్తున్నారు. ఈ శరీర సంబంధం కారణంగానే ముళ్ళతో నిండిన ఈ అంతులేని ప్రయాణాన్ని చేస్తున్నాను. అందువల్ల, ఈ పాప ప్రపంచం నుండి వీలైనంత త్వరగా తనను విముక్తి చేయమని తన తల్లి, తండ్రి అయిన శ్రీ రామానుజులను వేడుకుంటున్నారు.

వివరణ: 

మాముణులు వివరిస్తున్నారు – “ఆరప్పెరుంతుయరే సెయ్దిడినుం” అని జ్ఞాన సారము 21వ పాశురము మొదలైన వాటిలో వివరించినట్లుగా,  అతడి “హితము” (ఒక వ్యక్తికి ఏది మంచిదో దాని గురించి నిత్యము ఆలోచించుట మరియు చేయుట) వల్ల, అతడి అనుగ్రహము వల్లనే తాను కష్థాలను అనుభవిస్తున్నాను (ఎందుకంటే కర్మలు ఏదో ఒక విధంగా కరిగి పోవాలి, అందుకని బాధలు అనుభవించక తప్పదు) అని నేను అర్థం చేసుకున్నాను. నేను దీనిని గ్రహించి, అర్థం చేసుకున్నప్పటికీ, ఆ బాధల విషయానికి వస్తే, ఆ నొప్పి భవించలేము. అది నాకు ఎంత బాధ కలిగిస్తుంది అంటే, నేను “హా”, “ఓహ్” అన్న నా కేకలతో ఎంత విసుగు చెందానో తెలుస్తుంది. అన్ని పాపాలకు మూలం అయిన ఈ శరీరంతో నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. ఈ లోకములో నేను ఎంతో కాలంగా ఇలా బాధపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇలాగే ఉండటం సముచితమా?  “పావమే సెయ్దు పావి ఆనేన్” అని పెరియ తిరుమోళి 1.9.9వ పాశురములో తిరుమంగై ఆళ్వార్లు చెప్పినట్లుగా, ఈ శరీర సంబంధం కారణంగా నేను అపరాధములు తప్ప మరేమీ చేయట్లేదు. దురదృష్టవశాత్తు పాపాలతో నిండిన ఈ నా శరీరం నన్ను లాగి తీసుకెళ్ళే వైపు నేను వెళ్ళి దిగజారిపోతున్నాను. ఫలితంగా అంతులేని పాప పరిణామాలను అనుభవిస్తున్నాను, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణం విసుగు చెందుతున్నాను. కానీ ఎంబెరుమానారే !!! నా తండ్రిగా, తల్లిగా మీ “హితము” అను గుణము కారణంగా నా మెరుగుదల కోసం నన్ను అనుగ్రహించారు, నన్ను స్వీకరించారు. అందువల్ల, నా ఈ అంతులేని బాధల నుండి వెలికి తీసి, ఈ సంసార సంకెళ్ళ నుండి నన్ను విముక్తులను చేయుము అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-53/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment