ఆర్తి ప్రబంధం – 54

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 53

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు తనను ఈ లోకము నుండి విముక్తులను చేసి ఉన్నత గతికి చేర్చమని శ్రీ రామానుజులతో విజ్ఞప్తి చేశారు. తన కోరికను శ్రీ రామానుజులు నెరవేరుస్తారని మాముణులు ఆశిస్తున్నారు. అయితే, మాముణులు అంతటితో సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే, “ఒరు పగల్ ఆయిరం ఊళియాయ్” అని తిరువాయ్మొళి 10.3.1వ పాశురములో చెప్పినట్లుగా , మాముణులకు ఈ ప్రపంచంలో గడిపే ప్రతి క్షణం ఒక యుగములాగా అనిపిస్తుంది. మాముణులు శ్రీ రామానుజులను అభ్యర్థిస్తూ, “అన్ని విధాలుగా మీరు నాకు బంధువు. మీరు నన్ను ఈ శరీరంతో ఈ లోకంలో ఈ బాధను అనుభవించమని వదిలిపెట్టకూడదు. మీరు నన్ను ఎప్పుడు ఇక్కడి నుండి విముక్తులను చేసి అనంతమైన పరమానందముతో (పరమపదము) నిండి ఉన్న చోటికి తీసుకొని వెళతారో ఏమో నాకు తెలియదు”.

పాశురము 53:

ఇన్నం ఎత్తనై నాళ్ ఇవ్వుడంబుడన్
ఇరుందు నోవు పడక్కడవేన్ ఐయో
ఎన్నై ఇదినిన్ఱుం విడువిత్తు నీర్
ఎన్ఱు తాన్ తిరునాట్టినుళ్ యేఱ్ఱువీర్
అన్నైయుం అత్తనుం అల్లాద శుఱ్ఱముం ఆగి
ఎన్నై అళిత్తరుళ్ నాదనే
ఎన్ ఇదత్తై ఇరాప్పగల్ ఇన్ఱియే
ఏగమెణ్ణుం ఎతిరాశ వళ్ళలే!!!

ప్రతి పద్ధార్ధములు:

నాదనే– ఓ!!! నా స్వామి
అళిత్తరుళ్ – (నీవు) ఆశీర్వదించుము
ఎన్నై – నన్ను
ఆగి – నాతో ఉండి
అన్నైయుం – తల్లిగా ప్రేమను కురిపించి
అత్తనుం – తండ్రిగా హితాన్ని చూపించి
అల్లాద శుఱ్ఱముం – కావాల్సిన దగ్గర బంధువులు.
ఎతిరాశ వళ్ళలే – “ఎంబెరుమానార్” అని పిలువబడు యతులకు రాజు!!!
ఇరాప్పగల్ ఇన్ఱియే ఏగమెణ్ణుం – రాత్రిం బగళ్ళు ఏకధాటిగా ధ్యానించివాడు
ఎన్ – నా
ఇదత్తై – కోరిక
(నీ చరణాల యందు పడిన తరువాత కూడా)
ఎత్తనై నాళ్ – బంధువులూ
ఇన్నం –ఇంకా
నోవు పడక్కడవేన్ – నేను బాధపడాలి
ఇవ్వుడంబుడనే ఇరుందు – ఈ శరీరముతో?
ఐయో – అయ్యో!!!
విడువిత్తు – దయచేసి ముక్తినివ్వు
ఎన్నై – నేను
ఇదినిన్ఱుం – అవరోధమైన ఈ శరీరములో
ఎన్ఱు తాన్ – ఎప్పుడు
నీర్ – నీవు
యేఱ్ఱువీర్– తీసుకొని
తిరునాట్టినుళ్ – పరమపదము?

సరళ అనువాదము:

ఈ పాశురములో, ఎంబెరుమానార్లు తనకు తల్లి, తండ్రి, మంచి బంధువు అని మాముణులు తెలుపుతున్నారు. వారు ఎల్లప్పుడూ తన శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. అందుకని, ఎప్పుడు ఈ బంధనము నుండి తనని ముక్తి చేసి పరమానంద భరితమైన పరమపదాన్ని అనుగ్రహిస్తారని మాముణులు అడుగుతున్నారు.  ఈ శరీరంతో ఈ లోకములో ఇంకా అతను ఎంతకాలం ఇలా బాధపడాలి అని మాముణులు శోకిస్తున్నారు.

వివరణ: 

“అన్నైయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్డిడుం తన్మైయాన్” అని  కణ్ణినున్ చిరుత్తాంబు 4వ పాశురములో మధురకవి ఆళ్వార్లు చెప్పినట్లుగా,  ఎంబెరుమానారే! మీరు నాకు, బిడ్డ పట్ల ఎంతో ప్రేమను కురిపించే తల్లి వంటి వారు. మీరు నాకు, తన బిడ్డ శ్రేయస్సు కోరే తండ్రి వంటి వారు. విలువైన శాస్త్ర సూత్రాలతో జీవితాన్ని గడుపుతున్న నా దగ్గరి బంధువు వంటి వారు. మీరు యతీలకు నాయకులు! “ఎన్ మనమేగమెన్నుం ఇరాప్పగలిన్ఱియే” అని తిరువాయ్మొళి 9.3.7వ పాశురములో చెప్పినట్లుగా, ఏకధాటి శ్రద్ధతో రాత్రింబగళ్ళు నా శ్రేయస్సు గురించి మీరు ఆలోచిస్తారు. “ఉనక్కాట్పట్టుం అడియేన్ ఇన్నుం ఉళల్వేనో” అని తిరువాయ్మొళి 5.8.10వ పాశురములో వివరించిన విధంగా, మీ పాద పద్మాల యందు శరణాగతి చేసిన తరువాత కూడా, ఈ శరీరముతో ఈ ప్రపంచంలో ఇంకా ఎంత కాలం బాధపడాలి? అయ్యో!!! “శరీరం” అనే ఈ అవరోధము నుండి మీరు నన్ను ఎప్పుడు విముక్తి చేస్తారో, అనంతమైన ఆనందంతో కూడిన పరమపదానికి నన్ను ఎప్పుడు చేరుస్తారో? ఆ రోజు ఒక అసమానమైన రోజు అవుతుంది అని మాముణులు చెప్పుచున్నారు.  వళ్ళల్ అంటే – గొప్ప ఔన్నత్యము ఉన్న గొప్ప వ్యక్తి,  వారు చేసిన మహోపకారానికి తిరిగి ఏమీ ఇచ్చుకోలేము.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము :  http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-54/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment