ఆర్తి ప్రబంధం – 39

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 38

పరిచయము:

ఈ పాశురములో, మాముణులు తమ దగ్గరలో ఉన్న ఒక సమూహానికి కలిగిన ప్రశ్నకి సమాధానమిస్తున్నారు.  మాముణుల దగ్గర ఉన్న వాళ్ళు వారిని “హే మాముని!!! మీ మునుపటి పాశురములో శ్రీ రామానుజుల (“ఉన తాళ్ ఒళిదవఱ్ఱయే ఉగక్కుం”) దివ్య పాద పద్మాలు తప్పా మిగతా వాటిపై మీ మనస్సు మరలుతుందని మీరు అన్నారు. ఇలా ఉన్న మీరు ఆ అల్ప ప్రాపంచిక విషయాలన్నిటితో జతబడి ఉన్నారు కాబట్టి,  ఏ సారము లేని  మిమ్మల్ని శ్రీ రామానుజులు ఎలా స్వీకరించారు? లౌకిక సంబంధము కారణంగా ప్రతికూల నడవడితో నిండి ఉన్న మిమ్మల్ని శ్రీ రామానుజులు ఎలా ఆమోదించారు”? మాముణులు సమాధానమిస్తూ, “నేను వారి పాద పద్మాల యందు శరణాగతులైన సమయంలో, ఎన్నో విరుధ అంశాలతో నిండి ఉన్న నన్ను చూసి వారు తమ భోగ్య వస్తువులుగా స్వీకరించారు. వాటిని వారు అనుకూలముగా భావించి నన్ను స్వీకరించారు”. మాముణులు ఒక ఉదాహరణ ఇస్తూ ఈ విషయాన్ని నిరూపింస్తున్నారు.

పాశురము 39:

వేంబు కఱియాగ విరుంబినార్ కైత్తెన్ఱు
తాం పుగడాదే పుశిక్కుం తన్మైపోల్
తీంబన్ ఇవన్ ఎన్ఱు నినైత్తు ఎన్నై ఇగళార్ ఎతిరాశర్
అన్ఱు అఱిందు అంగీకరిక్కైయాల్

ప్రతి పద్ధార్ధములు:

విరుంబినార్ తాం – ఆనందించే వారు
వేంబు – వేప ఆకులు
కఱియాగ – పక్కన కూరతో నంచుకొనేటట్టుగా
పుగడాదే – వాటిని పారి వేయరు
కైత్తెన్ఱు–  “చేదుగా ఉంటుందని” అనుకొని.
పుశిక్కుం – ఎంతో ఆనందంగా తింటారు
తన్మైపోల్– ఇది ఆ వ్యక్తుల స్వభావము

(అదేవిధంగా)
ఎతిరాశర్– ఎంబెరుమానారే!!!
ఇగళార్ – నన్ను త్యజించరు
నినైత్తు – అని అనుకొని
ఎన్నై – నేను (మాముణులు)
తీంబన్ ఇవన్ ఎన్ఱు  – పాపాత్ముడను
అన్ఱు – వారికి శరణాగతి చేసిన ఆ రోజు
అఱిందు – నేను పాపాత్ముడిని అని తెలిసి కూడా
అంగీకరిక్కైయాల్– వారు నా పాపాలను తన ఆనందముగా భావించారు, నన్ను సంతోషంగా స్వీకరించారు.

సరళ అనువాదము:

మాముణులు ఈ పాశురములో శ్రీ రామానుజుల వాత్సల్య గుణాన్ని కీర్తిస్తున్నారు. వారు తన పాపాలను తన భోగ్య వస్తువుగా భావించారని వివరిస్తున్నారు. కొంతమంది తమ భోజనములో వేప ఆకులు ఉంటే, అవి చేదని తీసి పారేయకుండా యిష్టంగా భుజిస్తారు, అన్న ఉదాహరణను వారు ఉల్లేఖిస్తున్నారు.

వివరణ: 

తిరుమళిశై ఆళ్వార్ల నాన్ముగన్ తిరువందాది పాశురము 94 – “వేంబుం కఱియాగుమెన్ఱు” ప్రకారం, కొంతమంది వేపను, వేప ఆకులను కాయ కూరలాగా తమ భోజనములో భాగముగా భుజిస్తారు. మాముణులు ఈ పాశురాన్ని ఉల్లేఖిస్తూ తమ విషయాన్ని నిరూపిస్తున్నారు.  “కొంతమంది  తీపి కాని చేదు ఆహార పదార్థాలను ఇష్థపడుతుంటారు. అలాంటి వాళ్ళు చేదు వస్తువులైన వేపను తమ ఆహారములో కలిపి తింటుంటారు. వారు స్వయంగా వాటిని సేకరించి వాటిని యిష్టపడి తింటుంటారు. చాలా చేదుగా ఉంది అని తలచుకుంటూ మరి తింటుంటారు. అదేవిధంగా, నేను నా స్వామి అయిన శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలకు శరణాగతి చేసినప్పుడు, నేను పాపాలతో నిండిన వాడనని వారికి తెలుసు. అయినా కానీ వారు నేను పాపినని నిర్లక్ష్యము చేయలేదు. బదులుగా వారు నాలోని ఆ అపరాధాలను మరియు పాపాలను తమ భోగ్య వస్తువుగా భావించారు”, అని మాముణులు వివరిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-39/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment