కోయిల్ తిరువాయ్మొళి – 10.7 – సెంజోల్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 10.1 – తాళతామరై

ఆళ్వారు త్వరగా పరమపదానికి చేరుకోవాలనుకున్నారు. భగవానుడు కూడా దానికి అంగీకరించారు. కానీ ఆళ్వారు యొక్క దివ్య తిరుమేనితో పాటు వారిని పరమపదానికి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఆనందించాలని అనుకున్నాడు భగవానుడు. అది గమనించిన ఆళ్వారు భగవానుడికి అలా చేయవద్దని సలహా ఇవ్వగా చివరకు ఆతడు దానికి అంగీకరించారు. భగవానుడి శీల గుణాన్ని (సరళత) చూసి ఎంతో సంతృప్తి పడి, ఆ భావాన్ని ఈ పదిగములో ఆళ్వారు వెల్లడి చేస్తున్నారు.

మొదటి పాశురము: “భగవానుడు నా హృదయంలోకి ప్రవేశించి ‘నేను నీతో తిరువాయ్మొళిని పాడిస్తాను’ అని అన్నారు. నా పట్ల ఆయనకున్న ప్రేమను చూడండి.  అతడిని సేవించే వాళ్ళారా! అతడి గుణాల సాగరములో మునిగిపోకండి”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

శెంజొఱ్కవిగాళ్‌! ఉయిర్కాత్తాట్చెయ్మిన్ తిరుమాలిరుంజోలై
వంజ క్కళ్వన్‌ మామాయన్‌  మాయక్కవియాయ్‌ వందు ఎన్‌
నెంజుం ఉయిరుం ఉళ్‌ కలందు  నిన్ఱార్‌ అఱియ వణ్ణం ఎన్‌
నెంజుం ఉయిరుం అవైయుండు తానేయాగి నిఱైందానే

తిరుమలలో ఉన్న భగవానుడికి అద్భుతమైన సుందర స్వరూపము, గుణాలు మొదలైనవి ఉంటాయి. అతడు ఎవరినైతే  దోచుకోవాలనుకుంటాడో, వారికి తెలియకుండానే సమస్థం దోచేస్తాడు. నాతో పాశురాలు పాడించాలని, తన చిలిపి చేష్ఠలతో నా యందు ఉండి, నా హృదయంలోకి ప్రవేశించి లక్ష్మికి కూడా తెలియకుండ నాలోనే ఉండి నన్ను నా హృదయాన్ని ఆవహించివేస్తూ  ఆనందించి అవాప్త సమాస్థ కాముడు అయ్యాడు. కపటము లేని శుద్దమైన పదాలతో పాటలు పాడగల మీరందరూ! మిమ్ములను మరియు మీ వస్తువుల అపహరణ కాకుండా కాపాడుకొని మీ వాక్కు సేవని అతడికి అందించే ప్రయత్నము చేయండి. భగవానుడిలో అనన్యప్రయోజనులుగా (కైంకర్యం తప్ప వేరే కోరిక లేనివారు) మునిగి ఉన్నవారు, తమను, తమ వస్తువులను అతడి అపహరణ నుండి తప్పించలేము అని సూచిస్తుంది.

రెండవ పాశురము:  తనతో కలిసిన తరువాత భగవానుడికి కలిగిన భాగ్యాన్ని గురించి తలచుకొని ఆళ్వారు ఆనందపడుతున్నారు.

తానేయాగి నిఱైందు ఎల్లా ఉలగుం ఉయిరుం తానేయాయ్‌
తానే యాన్‌ ఎన్నాన్‌ ఆగి తన్నై త్తానే తుదిత్తు ఎనక్కు
త్తేనే పాలే కన్నలే అముదే తిరుమాలిరుంజోలై
క్కోనే యాగి నిన్ఱొళిందాన్‌ ఎన్నై ముఱ్ఱుం ఉయిరుండే

అతడు అన్ని విధాలుగా నన్ను సంపూర్ణముగా ఆనందిస్తున్నాడు; అతడే ఆది మరియు అతడే అంతము; అతడే సమస్థ లోకాలు మరియు అతడే ఆ లోకాలలోని జీవులు కూడా [ప్రతిదీ అతని శరీరములోని భాగము]; అతడు ‘నేను’ అన్న జ్ఞానము యొక్క ఉనికి తెలియజేసే ఆది తత్వము; అతడు స్తుతించేవాడు, స్తుతించబడేవాడు; తేనె, పాలు, తీపి, మధువు మరియు అనేక వస్తువులలో ‘రుచి’ గా ఉండి, ఇవాన్నీ నాకు వెల్లడి చేస్తూ, ఎక్కడికీ వెళ్ళకుండా అతడు తిరుమాలిరుంజోలైలో దయతో నివాసుడై ఉన్నాడు. అంటే అతడు ఆనందించేవాడు మరియు ఆనందింపజేసేవాడు అని సూచిస్తుంది.

మూడవ పాశురము: ప్రతి నిమిషము తన పట్ల పెరుగుతున్న అంతులేని భగవానుడి ఆప్యాయతను ఆళ్వారు వివరిస్తున్నారు.

ఎన్నై ముఱ్ఱుం ఉయిరుండు ఎన్‌ మాయ ఆక్కై ఇదనుళ్‌ పుక్కు
ఎన్నై ముఱ్ఱుం  తానేయాయ్‌ నిన్ఱ మాయ అమ్మాన్‌ శేర్‌
తెన్నన్‌ తిరుమాలిరుంజోలై తిశై కై కూప్పి చ్చేర్ న్ద యాన్
ఇన్నుం పోవేనేకొలో? ఎన్గొల్‌ అమ్మాన్‌ తిరువరుళే

అన్ని విధాలుగా నా ఆత్మను ఆస్వాదిస్తూ, అజ్ఞానము మొదలైన వాటికి కారణమైన నా శరీరంలోకి భగవానుడు ప్రవేశించి, నన్ను మరియు నా శరీరాన్నినియంత్రిస్తూ,  అద్భుతమైన గుణాలు మరియు అద్భుతమైన లీలలు చేయు నిరహేతుక భగవానుడిగా దక్షిణ దిశలో ఉన్న ప్రశంసనీయమైన తిరుమలపై నివాసుడై ఉన్నాడు; దాసుడిగా నేను ఆ దివ్యదేశానికి చేరుకున్నాను; ఆ స్థితిని పొందిన తరువాత, సముచితమైన ప్రదేశము ఇంకేదో ఉందని ఇంకెక్కడికైన వెళతామా? నిరపేక్షుడైన నా భగవానుడి ప్రేమ ఎంత గొప్పది? ఎన్నో అనుగ్రహాలున్నట్లు, తాను అనుగ్రహిస్తున్నట్లు నిలబడి ఉన్నాడని సూచిస్తుంది. ‘తెన్నన్’ –  ఆ ప్రాంతపు రాజు అని అర్థము.

నాలుగవ పాశురము: ఆళ్వారుతో ఆనందించగల తన నివాసమైన తిరుమల పట్ల, తన శరీరము పట్ల భగవానుడికి ఉన్న ప్రేమను ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

ఎన్గొల్‌ అమ్మాన్‌ తిరువరుళ్గళ్‌? ఉలగుం ఉయిరుం తానేయాయ్‌
నంగెన్నుడలం కైవిడాన్ ఞాలత్తూడే నడందుళక్కి
తెంకోళ్‌ తిశైక్కు త్తిలదమాయ్‌ నిన్ఱ తిరుమాలిరుంజోలై
నంగళ్‌ కున్ఱం కైవిడాన్‌ నణ్ఞా అశురర్‌ నలియవే

సమస్థ లోకాలకు, సమస్థ జీవరాశులకు సర్వకారకుడిగా ఉన్న భగవానుడు, అతడి పట్ల ఆసక్తి లేని అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళని నాశనం చేసి, ఈ భూమిపైన తన పాదము మోపి నడయాడాడు; మనలాంటి వారు ఆనందించేలా, దక్షిణ దిశలో శిఖామణి అయిన తిరుమాలిరుంజోలై అనే దివ్య మలైను (కొండను) అతను విడువడు; ఖచ్చితంగా అతడు నా ఈ దేహాన్ని విడువడు. భగవానుడు సౌశీల్యతతో మనకు అన్ని అనుగ్రహాలు ప్రసాదిస్తారు.

ఐదవ పాశురము: “భగవానుడు నాతో ఐక్యమై, నా నోటి నుండి తిరువాయ్మొళి విన్నాడు. తిరువాయ్మొళిని విన్నప్పుడు పొంగిపొరలుతూ అంతులేని పరమానందముతో నిత్యసూరులలా మరియు ముక్తాత్మలులా పాడుతూ ఆతడు తల ఊపుతున్నారు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

నణ్ణా అశురర్‌ నలివెయ్ద నల్ల అమరర్‌ పొలివెయ్ద
ఎణ్ణాదనగళ్‌ ఎణ్ణుం నన్మునివర్‌ ఇన్నం తలైశిఱప్ప
పణ్ణార్‌ పాడల్‌ ఇంకవిగళ్‌ యానాయ్‌ త్తన్నై త్తాన్‌ పాడి
తెన్నావెన్నుం ఎన్నమ్మాన్‌ తిరుమాలిరుంజోలైయానే

భగవానుడిని పొందాలని ఆశించి భక్తి మార్గములో నడిచే గొప్ప వ్యక్తులకు ఐశ్వర్యము, భక్తి, పరమానందము పొందాలి.  అవాప్త సమస్థ కాముడైన భగవానుడి గుణాలను ధ్యానించే గొప్ప భక్తులకు అడ్డంకులుగా ఉన్న రాక్షసులు (భగవానుడిని చేరుకోవాలని ఆశించనివారు) నశించాలి. అటువంటి భగవానుడు, తిరుమారుంజోలైలో నిలబడి ఉన్న ఆ స్వామి, ఈ మధురమైన పద్యాలకు సంగీతాన్ని కూర్చి నా ద్వారా పాడించారు; తన తలను ఊపుతూ ఈ పాశురములను పాడారు.

ఆరవ పాశురము:  “శ్రియః పతి అయిన భగవానుడు నన్ను ఏలాలన్న ఆతృతతో  ఎంతో దయతో తిరుమలలో కొలువై ఉన్నాడు”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

తిరుమాలిరుంజోలైయానే ఆగి చ్చెళుమూమూవులగుం తన్‌
ఒరుమా వయిఱ్ఱినుళ్ళే వైత్తు ఊళి ఊళి తలైయళిక్కుం
తిరుమాల్‌ ఎన్నై ఆళుమాల్‌ శివనుం పిరమనుం కాణాదు
అరుమాల్‌ ఎయ్ది అడి పరవ అరుళై ఈంద అమ్మానే

బ్రహ్మ రుద్రులు  భగవానుడుని చూడలేక, సాధించడనికి కష్టమైన అతడి దివ్య పాదాలను ఎంతో గొప్ప భక్తితో స్తుతించారు, వారి కోరికను దయతో భగవానుడు నెరవేర్చాడు; సర్వోత్తముడైన అటువంటి భగవానుడు ప్రతి కల్పంలో, విరుద్ధమైన అంశాలను ఏకం చేసే ప్రత్యేకమైన నైపుణ్య సామర్థ్యం తో, ముల్లోకాలను తన దివ్య అదరములో ఒక ప్రత్యేక రీతిలో పదిలపరచుకొని రక్షిస్తాడు. శ్రియః పతిత్వం కలవాడు నా సేవను స్వీకరించాలన్న మొహతో తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నాడు. ‘ఒరుమా’ చాలా తక్కువ, స్వల్పమైన (అతడి అదరములో) అని సూచిస్తుంది.

ఏడవ పాశురము: ఆళ్వారు తనకి కలిగిన ఫలితాలకు కారణమైన తిరుమలని  కీర్తిస్తున్నారు.

అరుళై ఈ ఎనమ్మానే ! ఎన్నుం ముక్కణ్‌ అమ్మానుం
తెరుళ్‌కొళ్‌ పిరమన్‌ అమ్మానుం  తేవర్కోనుం తేవరుం
ఇరుళ్గళ్‌ కడియుం మునివరుం ఏత్తుం అమ్మాన్‌ తిరుమలై
మరుళ్గళ్‌ కడియుం మణిమలై తిరుమాలిరుంజోలై మలైయే

జ్ఞానము మొదలైన లక్షణాలను కలిగి ఉండి సృష్టికర్త అని పేరుగాంచిన బ్రహ్మ, దేవతలను నియంత్రించు ఇంద్రుడు, పూరాణాల రూపంలో ఉపదేశాలను ఇస్తూ చీకటిని తొలగించగల దేవతలు మరియు మహా ఋషులు, జ్ఞానము మొదలైన లక్షణాలను కలిగి ఉన్న త్రినేత్రుడు కూడా,” ఓ స్వామీ! మీ దయ చూపించుము” అని భగవానుడిని ప్రార్థించారు. అటువంటి భగవానుడి దివ్య నివాసమైన  ఆ దివ్య కొండ, మన లక్ష్యానికి అడ్డంకులైన అవిధ్య, అజ్ఞానములను, మన భ్రమలను, తికమకలను తొలగించగలదు. అత్యుత్తమ ఆనందాన్ని అనుగ్రహించేదిగా కీర్తిగాంచినది ఆ తిరుమాలిరుంజోలై.

ఎనిమిదవ పాశురము:  “తిరుమలతో మొదలు పెట్టి మిగిలిన దేవాలయాల పట్ల ఉన్న కోరికలన్నీ నా అవయవాల వైపు భగవానుడిచే చూపించబడుతున్నాయి, ఒక్క క్షణం కూడా నా నుండి వేరు కావడం లేదు; ఎంతటి అద్భుతమైన స్థితి ఇది!”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

తిరుమాలిరుంజోలై మలైయే తిరుప్పాఱ్కడలే ఎన్‌ తలైయే
తిరుమాల్‌ వైగుందమే  తణ్‌ తిరువేంగడమే ఎనదుడలే
అరుమా మాయత్తెనదుయిరే మనమే వాక్కే కరుమమే
ఒరుమా నొడియుం పిరియాన్‌ ఎన్‌ ఊళి ముదల్వన్‌ ఒరువనే

కాలముచేత నియంత్రించబడే అన్ని తత్వాలకు కారణభూతుడైన భగవానుడు, నన్ను పొందాలనే కారణంతో, తిరుమాలిరుంజోలై కొండ, క్షీరసాగరము, నా శిరస్సు,   “శ్రియాసార్ధం” అని చెప్పినట్లుగా శ్రియః పతిగా నివసిస్తున్న పరమపదము,   ఉత్తేజింపజేసే పెరియ తిరుమల, నా దేహము, నా ఆత్మ, అద్భుతమైన ప్రకృతి, నా మనస్సు, వాక్కు, క్రియలను ఒక్క అణు క్షణము కూడా విడువడంలేదు. ఎంతటి వైశిస్ట్యం కలవాడు అతడు!  ‘ఏ కారములు’ (చివరికి ‘ఏ’ ఉన్న పొడవైన అక్షరాలు), గణనను సూచిస్తాయి. లేదా ప్రతి దానినీ అతడు ఎంతగా ఇష్టపడుతున్నాడో సూచిస్తుంది.

తొమ్మిదవ పాశురము: “తిరుమల ద్వారా మనకి ఈ సంపద అంతా ఫలించినది; అందువల్ల, ఈ తిరుమలని వదలకూడదు” అని ఆళ్వారు తమ దివ్య హృదయంతో చెప్పుకుంటున్నారు; ఆళ్వారిని తన దేహముతో సహా పరమపదానికి తీసుకెళ్లాలనే భగవానుడి కోరికను చూసిన ఆళ్వారు “త్యజించ బడవలసిన ఈ శరీరాన్ని తొలగించి నన్ను పరమపదానికి నీవు తీసుకు వెళ్లాలి”, అని ఆళ్వారు భగవానుడి ప్రార్థిస్తున్నారు.

ఊళి ముదల్వన్‌ ఒరువనే ఎన్నుం ఒరువన్‌ ఉలగెల్లాం
ఊళి దోఱుం తన్నుళ్ళే పడైత్తు  కాత్తు క్కెడుత్తుళలుం
ఆళి వణ్ణన్‌ ఎన్‌ అమ్మాన్‌  అందణ్‌ తిరుమాలిరుంజోలై
వాళి మనమే! కై విడేల్‌ ఉడలుం ఉయిరుం మంగవొట్టే

ఓ హృదయమా! మనము ఒకనాడు వదలివేసే మన ఈ శరీరము, ప్రాణాధార వాయువు నశ్వరమైయ్యే లోపల, శక్తిని కలుగజేయు. అందమైన తిరుమాలిరుంజోలైలో నివాసుడై ఉంటున్న మన నిత్య సంబంధి అయిన భగవానుడికి దగ్గరగా వెళ్లి శరణాగతులై పోవాలి.  “ఎకమేవా” అన్న కారణ వాక్యములలో చెప్పినట్లుగా, సమయ నియంత్రణలో ఉన్న అన్ని తత్వాలకు అశిష్థ ఏకైక కారణభూతుడు అతడు; అనంతుడైన అతడు తన నిత్యకృత్యముగా తన దివ్య సంకల్పముతో  అన్ని కాలాలలో సమస్థ లోకాల సృష్టి, లయ, స్థితులను నిర్వహిస్తూ ఉంటారు. మన కార్యము సంపూర్ణమైయ్యే వరకు ఆతడిని వదిపెట్టవద్దు. మీరు ఈ దివ్య కొండకు శరణాగతి చేయుట ద్వారా దీర్ఘ కాలం జీవించాలి. “‘ఆళి వణ్ణన్’ కూడా  అనంతమైన పరమానందాన్ని కలుగజేయునది అతడి దివ్య స్వరూపము” అని సూచిస్తుంది.

పదవ పాశురము: భగవానుడిని ఆళ్వారు ప్రార్థించిన తరువాత కూడా, ఆళ్వారు యొక్క శరీరంపై ఉన్న ప్రీతి కారణంగా భగవానుడు ఆళ్వారు ప్రార్థనలను స్వీకరించలేదు; అందువల్ల ఇరవై నాలుగు తత్వాలతో తయారైన ప్రకృతి గురించి ఆళ్వారు భగవానుడికి తెలియజేసి, వాటి పట్ల ఎటువంటి కోరిక లేకుండా వాటిని వదులుకోవాలి, దయతో వాటిని తొలగించమని భగవానుడిని అభ్యర్థిస్తున్నారు.

మంగవొట్టు ఉన్ మామాయై తిరుమాలిరుంజోలై మేయ
నంగళ్‌ కోనే! యానే నీ ఆగి ఎన్నై అళిత్తానే!
పొంగైం పులనుం పొఱియైందుం  కరుమేందిరియం ఐంబూదం
ఇంగు ఇవ్వుయిరేయ్ పిరకిరుది మానాంగార మనంగళే

నా లాంటి వారికి స్వామిగా ఉండటం, మన మధ్య ఎటువంటి భేదము చూపకుండ ఉండి నన్ను రక్షిస్తూ తిరుమాలిరుంజోలైలో నిత్య నివాసమై ఉంటున్న ఓ భగవానుడా!  స్పర్శ ధ్వనులు, రూప  గంధములు, రుచులను వశము చేసుకునే కన్ను, చెవి, ముక్కు, నాలుక మరియు చర్మం వంటి  ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు, భూమి, నీరు, ఆకాశము,  వాయువు, అగ్ని వంటి శబ్దానికి నిలయమైన పంచ భూతములు, ఇంద్రియాలతో కూడి ఉన్న మన శరీరానికి కారణములు మరియు మన ఆత్మని ఈ సంసారంలో  బంధింపజేయడనికి మూల కారణములు, సృష్టిని ప్రోత్సహించే ‘మహాన్’, ‘అహంకారము’ని ప్రోత్సహించే అహం / బుద్ధి మరియు మనస్సుని ప్రోత్సహించే మన సంకల్ప కారణములు వంటి నీ ప్రకృతిని మరియు వాటి ప్రభావాలను నశ్వరం చేయడానికి నన్ను దయతో అనుమతింపుము.

పదకొండవ పాశురము: “ఈ పదిగము తిరుమల యొక్క ‘మహత్’ మరియు ‘అహంకారము’ విషయములను వివరించును”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

మానాంగార మనం కెడ ఐవర్‌ వంకైయర్‌ మంగ
తానాంగారమాయ్బుక్కు త్తానే తానే ఆనానై
తేనాంగార ప్పొళిల్‌ కురుగూర్‌ శడగోబన్‌ శొల్లాయిరత్తుళ్‌
మానాంగారత్తివై పత్తుం తిరుమాలిరుంజోలై మలైక్కే

మహన్, అహంకారము మరియు మనస్సు ద్వారా శరీరంతో సంబంధం కలిగి ఉన్న ఐదు ఇంద్రియాలు నాలో ప్రవేశించి నాలో భాగములైన వాటిని, ఎంతో కృపతో భగవానుడు నాశనం చేశారు; తుమ్మెదలు స్వేచ్ఛగా విహరించే  తోటలతో గర్వించదగిన ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్లు పాడిన వెయ్యి పాశురములలో, దయతో తిరుమాలిరుంజోలై కొండపై విశేషముగా ఈ పదిగాన్ని పాడారు; ఈ పదిగము ‘మహత్’ మరియు ‘అహంకారము’ అని సూచించబడే అవరోధాలపై కేంద్రీకృతమై ఉంది. ఈ పదిగాన్ని నేర్చుకున్నవారిని ‘మహత్’, ‘అహంకారము’ మొదలైన అడ్డంకులు సులువుగా విడిచి వెళ్ళిపోతాయని సూచిస్తుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-7-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment