శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<<తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 1 – 10
పాశురము 11
అవతారిక: ఆళ్వార్లు సకల చేతనాచేతన పదార్థాలు తనలాగానే పరమాత్మ ఎడబాటును సహించలేక విలపిస్తున్నట్లు భావించి పాడిన తిరువాయ్మొళి భావాన్ని ఈ పాశురంలో మాముణులు వివరిస్తున్నారు.
వాయుం తిరుమాల్ మరై య నిర్క ఆట్రామై
పోయ్ వింజి మిక్క పులంబుదలాల్ ఆయ
అరియాదవట్రోడు అణ్ఐన్ దళుద మాఱన్
శెరివారై నోక్కుమ్ తిణిన్ దు
ప్రతిపదార్థము :
వాయుం = పొంద తగిన
తిరుమాల్ = శ్రీఃపతి (మహాలక్ష్మికి పతి)
మరైయ నిర్క = దృగ్గోచరము కాకపోవటము వలన
ఆట్రామై పోయ్ వింజి = విచారము ద్విగుణీకృతమై
మిక్క పులంబుదలాల్ = మిక్కిలి కలవరించి
ఆయ అరియాదవట్రోడు = ఎవరికీ అంతు పట్టనంత దుఃఖమును
అణ్ఐన్ దు = పొంది
అళుద = విలపించిన
మాఱన్ = ఆళ్వార్లు
శెరివారై = భక్తులను
తిణిన్దు నోక్కుమ్ = దయతో నిశ్చలమైన చూపులను సారిస్తారు.
భావము: పరమాత్మ తన భక్తులను అనుగ్రహించకుండా, తాను కనపడకుండా ఉన్నారు. అది సహించలేని ఆళ్వార్లు మిక్కిలి దుఃఖంతో విలపించారు. అంతే కాక అచేతనములను చూసి అవి కూడా తనలాగా పరమాత్మ కనపడక విలపిస్తున్నాయని భావించి వాటిని ఆలింగనము చేసుకొని విలపించారు. ఇలాంటి ఆళ్వార్ల భక్తులు తమ కరుణాద్రుక్కులను మనపై ప్రసరించి ఉజ్జీవింప చేస్తారు.
పాశురము 12
అవతారిక: పరమాత్మ పరత్వాన్ని కిందటి దశకంతో సంబంధం లేని విధంగా ఆళ్వార్లు ఈ దశకంలో అనుభవించారు. దానిని లోకులకు కూడా తెలియజేయాలని ఈ దశకంలో పాడారు అని ఇక్కడ మాముణులు భావిస్తున్నారు.
తిణ్ణిదా మారన్ తిరుమాల్ పరత్తువైత
నణ్ణియవదారత్తే నంగురైత్త వణ్ణ మరిందు
అట్రార్గళ యావరడిక్కే ఆంగవర్ పాల్
ఉట్రారై మేలిడాదూన్
ప్రతిపదార్థము:
తిణ్ణిదా మారన్ = ధృడ విశ్వాసము గల మాఱన్ (ఆళ్వార్లు)
తిరుమాల్ = పరమాత్మ
పరత్తువైత = పరత్వాన్ని
అవదారత్తే నణ్ణి = ఆయన అవతారాలలో చూపిన విధానాన్ని
నంగురైత్త వణ్ణ మరిందు = తెలుసుకున్న ఆళ్వార్లు తమ పాశురాలలో చక్కగా వివరించారు
అట్రార్గళ యావర్ = ఆళ్వార్ల
అవర్ అడిక్కే = వారి శ్రీపాదములకే
ఆంగు = అక్కడ
అవర్ పాల్ ఉట్రారై = మహావిశ్వాసముతో దరి చెరినవారిని
ఉన్ = ఈ లోకంలోని శారీరక సంబంధములు
మేలిడాదు = ఏమి చేయలేదు
భావము: పరమాత్మ పరత్వాన్ని ఆయన అవతారాలలో చూపి కృప చేశారని ధృడ విశ్వాసముతో మాఱన్ (ఆళ్వార్లు) తమ పాశురాలలో పాడారు. అందుకే ఆయన (ఆళ్వార్లు) శ్రీపాదములను మహా విశ్వాసముతో చెరిన వారిని లోకంలోని లౌకిక బంధనాలు ఏమి చేయ జాలవు అని మాముణులు మనకు ప్రబోధిస్తున్నారు.
పాశురము 13
అవతారిక: ఆళ్వార్లు పరమతంతో తనకు ఏకత్వము కలిగిన విధానాన్ని అనుభవించారు. ఆ కాలంలో తనతో పాటుగా ఉండి పరమాత్మ గుణానుభవం చేసి తన సత్తను పెంపు చేయటానికి అనుకూలురను వెతుకుతున్న విధంగా ఉన్న శ్రీసూక్తులను ఇక్కడ అనుగ్రహించారు.
ఊనమరవే వందు ఉళ్ కలంద మాలినిమై
యానదు అనుభవిత్తర్కూమ్ తుణయియా – వానిల్
అడియార్ కుళామ్ కూడ ఆశై యుట్ర మారన్
అడియారుడనెమ్ జే యాడు
ప్రతిపదార్థము :
నెమ్ జే = ఓ మనసా
ఊనమరవే = దోషములే లేని స్వామి
వందు = వచ్చి
ఉళ్ కలంద = నాతో కలసిన
మాలినిమై యానదు = స్వామి యొక్క కలయిక వలన కలిగిన తీయదనమును
అనుభవిత్తర్కూమ్ = అనుభవించినవారికి
ఆమ్ తుణయియా = తోడుగా వుండడానికి
వానిల్ = పరమపదములో
కుళామ్ కూడ = గోష్టిగా చేరాలని
ఆశై యుట్ర = కోరుకున్న
అడియార్ = దాసులకు (భక్తులు )
మారన్ = నమ్మాళ్వార్లు
అడియారుడన్ = దాసులతో తోడుగా
యాడు = ఉండుగాక
భావము: ఆళ్వార్లు అనుకూలరితో చేరి ఉన్నారు. దోషములే లేని స్వామివ్వచ్చి కలిశారు. ఆ స్వామి యొక్క కలయిక వలన కలిగిన తీయదనమును తోటి భక్తులతో పంచుకోవాలనుకున్నారు. ఆ అనుభవము నిరంతము అనుభవిస్తున్న పరమపదములోని నిత్యసూరుల గోష్టితో చేరాలని కోరుకున్నారు. అలాంటి మాఱన్ అనే నమ్మాళ్వార్లు దాసులకు తోడుగా ఉండుగాక.
పాశురము 14
అవతారిక: ఈ పాశురము తల్లి భావనలో చెప్పబడింది. నాయిక అవస్థను తల్లి పరమాత్మకు, ఆయన భక్తులకు వివరిస్తున్నారు. నమ్మాళ్వార్లు తిరువాయ్మొళిలోని ఆడి ఆడి అనే దశకంలో చెప్పిన తల్లి అవస్థను మాముణులు ఇక్కడ వివరిస్తున్నారు.
ఆడి మగిళ్ వానిల్ అడియార్ కుళామ్ గుళుడన్
కూడి ఇన్బమ్ ఎయిదా కురైయదనాల్ వాడిమిగ
అణ్పుట్రార్ నిలమై ఆయ్ న్దురైక్క మొగిత్తు
తుణ్పుత్తార్ మారన్ అందో
ప్రతిపదార్థము:
ఆడి మగిళ్ = ఆనందంగా నృత్యం చేసి ( ఆనందించే భగవంతుడికి )
వానిల్ = పరమపదములో
అడియార్ కుళామ్ గుళుడన్ = భక్తుల గుంపుతో కూడి
కూడి = చేరి
ఇన్బమ్ ఎయిదా కురైయదనాల్ = ఆనందం పొందలేదన్న కలత వలన
మిగవాడి = చాలా వాడిపోయి
అణ్పుట్రార్ = ప్రేమాస్పదులు ( మధురకవి ఆళ్వార్ల వంటి వారు )
తన్ నిలమై = తన స్థితిని
ఆయ్ న్దురైక్క = విశ్లేషించి
మొగిత్తు = వివరించడానికి
తుణ్పుత్తార్ = బాధ పడ్డారు
మారన్ అందో = అయ్యో మారన్ !
భావము: నమ్మాళ్వార్లు నాయికా భావనలో పరమపదంలో ఉండే నిత్యసూరుల గోష్టిలో చేరి వారితో కూడి ఆనంద నృత్యం చేయలేకపోయానని కలత చెందారు. అది చూసిన తల్లి తన కుమార్తె పడే వేదనను వివరించినట్లు నమ్మాళ్వార్లె పాడుతున్నారు. పరమాత్మకు ఎంతో ప్రేమాస్పదులైన మధురకవి ఆళ్వార్ల వంటి వారు ఈమె బాధను చూసి జాలిపడి, ఆమె దుఃఖాన్ని విశ్లేషించి వివరించడానికి కూడా మాటలు చాలక బాధపడ్డారు కదా! అయ్యో! మారన్! అని తల్లి కలత చెందినది అని నమ్మాళ్వార్లు పడిన విషయాన్ని మాముణులు ఈ పాశురంలో పాడారు.
పాశురము 15
అవతారిక: పరమాత్మ నిత్యసూరులను కూడి తన ఆయుధాలు, ఆభరణాలతో సహా వచ్చి ఆళ్వార్లకు దర్శన భాగ్యం కలుగజేశారు. ఆళ్వార్ల దుఃఖాన్ని పోగొట్టారు అని ఆళ్వార్లే ఇంతకు ముందు ‘ఆడి ఆడి’ లో పాడారు. ఇప్పుడు పరమాత్మ ఆళ్వార్లతో చేరడం వలన కొత్తగా పొందిన కాంతిని చూసి సంతోషిస్తున్నారు అని ‘అన్ దామత్తు’ లో పాడారు దానినే మాముణులు ఇక్కడ పాడారు.
అన్ దామత్తన్ పాల్ అడియార్ గాళోడిరైవన్
వన్ దారత్తాన్ కలందదర్ వణ్ మయినాల్ శన్ దాబమ్
తీరనద శడగోపన్ తిరువడిక్ కే నెన్ జమే
వాయ్ న్ద అన్ బై నాడోరుమ్ వై
ప్రతిపదార్థము :
నెన్ జమే = ఓ హృదయమా!
అన్ దామత్తన్ పాల్ = ఆ శ్రీవైకుంఠముపై ప్రేమతో
లో అడియార్ గాళోడు = ఆయుధాలు, ఆభరణాల రూపంలో ఉన్న నిత్యసూరులు, ముక్త పురుషులను ధరించి
ఇరైవన్ త్తాన్ = సర్వేశ్వరుడు తానే
వన్ దార = వచ్చి ఆర్తిని పోగొట్టి
కలందదర్ = కూడి ఉన్నట్లుగా
వణ్ మయినాల్ = భావించటం వలన
శన్ దాబమ్ = ఆర్తి, సంతాపము
తీర్ న్ద = తీరింది అని
శడగోపన్ = అంటున్న నమ్మాళ్వార్ల
తిరువడిక్ కే = శ్రీపాదాలపైనే
వాయ్ న్ద అన్ బై = యోగ్యమైన భక్తిని
నాడోరుమ్ వై = నిరంతరము కలిగి యుండునట్లు చేయి మనసా !
భావము: ఓ హృదయమా! ఆ శ్రీవైకుంఠముపై ప్రేమతో ఆయుధాలు, ఆభరణాల రూపంలో ఉన్న నిత్యసూరులు, ముక్త పురుషులను ధరించి సర్వేశ్వరుడు తానే వచ్చి ఆర్తిని పోగొట్టి కూడి ఉన్నట్లుగా భావించాను. అందువలన నా ఆర్తి, సంతాపము తీరింది అని అంటున్న నమ్మాళ్వార్ల శ్రీపాదాలపైనే యోగ్యమైన భక్తిని నిరంతరము కలిగి యుండు నట్లు చేయి మనసా! అని మాముణులు ప్రార్థిస్తున్నారు.
పాశురము 16
అవతారిక: ఆళ్వార్లు తనను ఎంత అనుభవించినా తీరని అతృప్తామృత మని ఇంత సేపు పాడారు. ఇంతలో తనలో అల్పత్వాన్ని ఆరోపించుకొని నైచ్యయానుసంధానం చేసి వెళ్లిపోతారా! అని పెరుమాళ్లు సందేహించారు అని ఆళ్వార్లు పాడిన విషయాన్నే మాముణులు ఈ పాశురంలో సంక్షిప్తంగా చెప్పారు.
వైకుందన్ వందు * కలందఱ్పిన్ వాళ్ మాఱన్*
శెయ్ గిన్ఱ * నైచ్చి యత్తై చ్చిందిత్తు * నైగిన్ఱ
తన్ మైదనై కండు * ఉన్నైత్తాన్ విడేనెన్ఱురైక్క *
వన్మై యడైందాన్ * కేశవన్ * (16)
ప్రతిపదార్థము:
వైకుందన్ = నిత్య విభూతి నాయకుడు
వందు * కలందఱ్పిన్ = వచ్చి కలిసిన తరువాత
వాళ్ = ఉజ్జీవయించిన
మాఱన్* = ఆళ్వార్లు
శెయ్ గిన్ఱ * నైచ్చి యత్తై = చేస్తున్న నైచ్యానుసంధానాన్ని
కండు = చూసి
చ్చిందిత్తు *= చింతించి, ఆందోళన చెందుతున్న
నైగిన్ఱ తన్ మైదనై = పరమాత్మ కరిగిపోవటాన్ని
కండు = చూసి భయపడ్డారు (అప్పుడు ఆళ్వార్లు)
* ఉన్నైత్తాన్ విడేనెన్ఱురైక్క *= నేను నిన్ను వదిలి వెళ్ళి పోనని చెప్పగా
కేశవన్ *= కేశిని సంహరించినవాడు
వన్మై యడైందాన్ * = స్థిమితపడ్డాడు
భావము: నిత్యవిభూ
పాశురము 17
అవతారిక: ఈ పాశురములో ఆళ్వార్ల సంబంధీకులు, ముందు ఏడుతరాలు వెనక ఏడుతరాలు కూడా ఉజ్జీవించి తేజస్సును పొందుతారు అని చెపుతున్నారు.
కేశవనాల్ ఎన్దమర్గళ్ * కీళ్ మే లెళుపిఱప్పుమ్ *
తేశడైందారెన్ఱు * శిఱందురైత్త * వీశుపుగళ్
మాఱన్ మలరడియే * మన్నుయిర్కెల్లాం ఉయ్ గైక్కు
ఆఱెన్ఱు నెంజే అణై*
ప్రతిపాదార్థము:
నెంజే = ఓ మనసా
కేశవనాల్ = కేశిని సంహరించిన వాడి వలన
ఎన్దమర్గళ్ * = నా సంబంధీకులు
కీళ్ మేలెళుపిఱప్పుమ్ *= ముందు ఏడు తరాలు వెనక ఏడు తరాలు
తేశడైందారెన్ఱు * = తేజస్సును పొందారు అని
శిఱందురైత్త *= గొప్పగా చెప్పినట్లు
వీశుపుగళ్ = అంతటా వ్యాపించిన కీర్తి కల
మాఱన్ = ఆళ్వార్ల యొక్క
మలరడియే *= తామరల వంటి దివ్యా పాదలను
మన్నుయిర్కెల్లాం = ఉజ్జీవింపగోరే వాళ్ళందరికి
ఉయ్ గైక్కు ఆఱెన్ఱు = ఉజ్జీవించే మార్గమని తెలుసుకొని
అణై* = శరణాగతి చెయ్యి
భావము: ఓ మనసా! కేశిని సంహరించిన వాడి కృప వలన ఆళ్వార్ల సంబంధీకులు, ముందు ఏడుతరాలు వెనక ఏడుతరాలు కూడా తేజస్సును పొందుతారు అని పరమాత్మ ఘనంగా చెప్పారు, ఆళ్వార్లు దశదిశల కీర్తి వ్యాపించిన వారు. ఈ లోకంలో ఉజ్జీవింపగోరె వాళ్ళందరికి ఆయనే మార్గమని తెలుసుకొని ఆళ్వార్ల యొక్క తామరల వంటి దివ్యా పాదలకు శరణాగతి చెయ్యి‘ అని ఈ పాశురంలో మాముణులు కేశవన్ తమర్ అనే దశకంలో నమ్మాళ్వార్లు చెప్పిన విషయాలను క్లుప్తంగా చెప్పారు.
పాశురము 18
అవతారిక: ఈ పాశురములో పరమాత్మ కళ్యాణ గుణాలలోని మోక్ష ప్రదత్వమును, కారుణ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. నమ్మాళ్వార్ల అణైందవర్గళ్ తమ్ముడనే అనే దశక సారాన్నిఈ పాశురంలో చెపుతున్నారు.
అణైందవర్గళ్ తమ్ముడనే * ఆయనరుట్కాళామ్ *
కుణందనైయే కొండు* ఉలగైకూట్ట * ఇణంగిమిగ
మాశి ఉపదేశం శెయ్ * మారన్ మలరడియే *
వీశుపుగళ్ ఎమ్మావీడు *
ప్రతిపదార్థము :
అణైందవర్గళ్ తమ్ముడనే *= నిత్యసూరులతో చేరి పరమాత్మ కైంకర్యములో ఈడుపడి
ఆయనరుట్కాళామ్ *= కృష్ణుడి కృపాకు పాత్రులై
కుణందనైయే కొండు*= మోక్షాధికారం పొంది
ఉలగై = నిత్య సంసారులను
కూట్ట * = చేరడానికి
కూట్ట * = చేరడానికి
మాశు ఇల్ = దోష రహిత
ఉపదేశం = ఉపదేశమును
శెయ్ = కృపతో చేయండి
మారన్ = నమ్మాళ్వార్ల
మలరడియే *= తామరల వంటి తాపమును పోగొట్టే శ్రీపాదాలు
వీశుపుగళ్ = వ్యాపించిన కీర్తి
ఎమ్మావీడు = పరమపదమే మాకు నివాస స్థానము
భావము: ఆళ్వార్లు కృపతో దోష రహితమైన పరమాత్మ కళ్యాణ గుణాలలోని మోక్ష ప్రదత్వాన్ని, కారుణ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. నిత్యసూరులతో చేరి పరమాత్మ కైంకర్యములో ఈడుపడి కృష్ణుడి కృపకు పాత్రులై మోక్షాధికారం పొందడానికి సంసారులకు తగిన సూచనలను ఇచ్చారు. సంసారులు పరమపదాన్ని చేరడానికి అర్హతలను పొందాలంటే తాపమును పోగొట్టే తామరల వంటి నమ్మాళ్వార్ల శ్రీపాదాలే నిత్య నివాస స్థానముగా చేసుకోవాలని ఈ పాశురంలో మాముణులు చెప్తున్నారు.
పాశురము 19
అవతారిక: ఈ పాశురములో పేరుమాళ్ళపై ఆళ్వార్లకు ఉన్న దృఢ విశ్వాసాన్ని మాముణులు మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ఆళ్వార్ల శ్రీపాదాలే మనకు రక్ష అని కూడా అంటున్నారు.
ఎమ్మావీడుం వేండా * ఎందననుక్కు ఉన్ తాళిణైయై *
అమ్మా అమైయుమెన * ఆయ్ందురైత్త * నమ్ముడైయ
వాళ్ ముదలాం మాఱన్ మలర్ తాళిణైశూడి *
కీళ్మై యత్తు నెంజే * కిళర్ *
ప్రతిపదార్థము :
అమ్మా = ఓ ప్రభూ !
ఎమ్మావీడుం వేండా = ఎంతో ఉన్నతమైన పరమపదము కూడా నాకు వద్దు
ఎందననుక్కు ఉన్ తాళిణైయై = నాకు నీ శ్రీపాదలే
అమైయుమెన = (నా తలపై) అమరుతాయని
ఆయ్ందురైత్త = దృఢంగా చెప్పిన
నమ్ముడైయ వాళ్ ముదలాం = మా ఉజ్జీవనానికి హేతువయిన
మాఱన్ = ఆళ్వార్ల
మలర్ తాళిణై = పూవులవంటి శ్రీపాదాలను
శూడి = తలపై ధరించి ఉజ్జీవించాలి
నెంజే = ఓ మనసా!
కీళ్మై యత్తు = అంత కంటే అల్పమైన ఫలితాలనిచ్చే కోరికలు లేకుండా చేయి
కిళర్ = నువ్వు కూడా ఉజ్జీవిస్తావు
భావము: ఓ మనసా! ఎంతో ఉన్నతమైన పరమపదము కూడా నాకు వద్దు నాకు నీ శ్రీపాదలే (నా తలపై) అమరుతాయని అని దృఢంగా చెప్పారు ఆళ్వార్లు. మా ఉజ్జీవనానికి హేతువయిన అటువంటి ఆళ్వార్ల పూవులవంటి శ్రీపాదాలను తలపై ధరించి ఉజ్జీవించాలి ఓ మనసా! నువ్వు అంత కంటే అల్పమైన ఫలితాలనిచ్చే కోరికలు లేకుండా చేయాలి. అలా చేస్తే నువ్వు కూడా ఉజ్జీవిస్తావు అని మాముణులు అంటున్నారు.
పాశురము 20
అవతారిక: తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను చేరి పరమపదాన్ని పొందమని ఆళ్వార్లు చెప్పిన విషయాన్ని మాముణులు ఈ పాశురములో చెపుతున్నారు .
కిళరొళి శేర్ కీళురైత్త * పేఱుకిడైక్క *
పళరొళి మాళ్ * శోలైమలైక్కే * తళర్వఱవే
నెంజై వైత్తు చ్చేరు మెనుం * నీడుపుగళ్ మాఱన్ తాల్ *
మున్ శెలుత్తువోం ఎమ్ముడి *
ప్రతిపదార్థము :
కీళురైత్త = మునుపే చెప్పిన విధంగా
కిళరొళి శేర్ = లేత కాంతితో ప్రకాశమానంగా విరాజిల్లుతున్న
పేఱుకిడైక్క = పరమపదమును చేరడానికి
వళరొళి మాళ్ = నిరంతరం ప్రవర్తమానమవుతున్న కాంతిని కలిగి వున్న
శోలైమలైక్కే= తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను (పెరుమాళ్లు వేంచేసి ఉన్న కొండ)
తళర్వఱవే = అలసట లేని హృదయంతో
నెంజై వైత్తు = ఏకాగ్ర చిత్తంతో
చ్చేరు మెనుం = చేరుకోండి అని చెపుతున్న
నీడుపుగళ్ = కీర్తిమంతుడైన
మాఱన్ = ఆళ్వార్ల
తాల్ మున్ = శ్రీపాదల ముందు
ఎమ్ముడి = నా శిరస్సును
శెలుత్తువోం = నిలుపుతాను
భావము: కిందటి పాశురంలో చెప్పిన విషయానికి ఈ పాశురంలో ఇంకా కొంత వివరణ చేరుస్తున్నారు. లేత కాంతితో ప్రకాశమానంగా విరాజిల్లుతున్న పరమపదమును చేరడానికి నిరంతరం ప్రవర్తమానమవుతున్న కాంతిని కలిగి వున్న తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను అనుమానం లేని హృదయంతో, ఏకాగ్ర చిత్తంతో ఆశ్రయించండి అని ఆళ్వార్లు తిరువాయ్మొలిలో చెప్పారు. అటువంటి కీర్తిమంతుడైన ఆళ్వార్ల శ్రీపాదల ముందు నా శిరస్సును నిలుపుతాను అని మాముణులు ఈ పాశురములో చెపుతున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-11-20-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org