శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 1
అవతారిక: (ఉయర్వేపరన్పడి… ) మాముణులు ఈ పాశురములో నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయ్మొళిలోని మొదటి దశకం యొక్క సారాన్ని సంక్షేపంగా రాశారు. పరమాత్మ స్వామిత్వాన్ని తెలియజేసి, ’ఆయన శ్రీపాదాలే చేతనుడు ఉజ్జీవించడానికి (మోక్షాన్ని పొందడానికి) ఉపాయం’ అని వివరించారు.
ఉయర్వేపరన్పడియై ఉళ్ళదెల్లామ్ తాన్ కణ్డు
ఉయర్వేదనేర్ కొణ్డురైత్తు – మయర్వేదుమ్
వారామల్ మానిడరై వాళ్విక్కుమ్ మాఱన్ శొల్
వేరాకవే విళైయుమ్ వీడు !
ప్రతిపదార్థము :
ఉయర్వే= ఔన్నత్యాన్ని పొంది ఉన్న
పరన్ = పరమాత్మ యొక్క
పడియై ఉళ్ళదెల్లామ్ = ప్రకారముగా ఉన్నవాటిన్నన్నిటిని
తాన్ కణ్డు = గ్రహించి
ఉయర్వేదనేర్ కొణ్డురైత్తు = ఉన్నతమైన వేదములోని సారాంశమును గ్రహించి
మయర్వేదుమ్ = అజ్ఞాన లేశామయినా
వారామల్ = రాకుండా ఉండేటట్లు
మానిడరై = మనుష్యులను
వాళ్విక్కుమ్ = ఉజ్జీవింపజేయు
మాఱన్ = నమ్మాళ్వార్లు
శొల్ వేరాకవే = శ్రీసూక్తులు
విళైయుమ్ వీడు = మోక్షము లభింపజేస్తుంది
సంక్షిప్త వివరణ : ఉన్నతమైన శ్రుతిని ప్రమాణంగా స్వీకరించి దాని సారాన్ని తిరువాయ్మొళిగా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. పరమాత్మ స్వామిత్వాన్ని దర్శించిన ఆళ్వార్లు శృతిలో పరమాత్మను వర్ణించిన విధంగానే తాను ద్రావిడ భాషలో పాడారు. వాటిని నేర్చిన మానవులు లవలేశం కూడా అజ్ఞానం లేకుండా జ్ఞానాన్ని పొంది ఉజ్జీవిస్తారు, అంతిమంగా మోక్షాన్ని పొందుతారు అని చెపుతున్నారు.
పాశురము 2
అవతారిక: ఈ పాశురములో మామునులు నమ్మాళ్వార్లు సంసారులను (ఈ భూమి మీద పుట్టి కర్మలను అనుభవించేవారు) ఆదేశించిన విధానాన్ని తెలియజేశారు. సంసారులను ప్రవర్తనను సంస్కరించుకొని హృదయములో అధిష్టించి వున్న పరమాత్మతో కూడివుండండి అని నమ్మాళ్వార్లు ఆదేశించారు.
వీడు సెయ్దు మఱ్ఱెవయుమ్ మిక్క పుగళ్ నారణన్ తాళ్
నాడు నలత్తాల్ అడైయ నన్ గురైక్కుమ్ – నీడు పుగళ్
వణ్ కురుగూర్ మాఱన్ ఇన్ద మానిలత్తోర్ తామ్ వాళ
పణ్ బుడనే పాడి అరుళ్ పత్తు !
ప్రతిపదార్థము :
నీడు పుగళ్ = విస్తరించిన కీర్తిగల
వణ్ = సమృద్దమైన
కురుగూర్ = తిరునగరి నిర్వాహకులు
మాఱన్ =నమ్మాళ్వార్లు
ఇన్ద మానిలత్తోర్ = ఈ భూమి మీద ఉన్నవారు
తామ్ వాళ = ఉజ్జీవించుటకు
పణ్బుడనే = దయతో
పాడి అరుళ్ పత్తు = పాడి కృప చేసిన
పత్తైయుమ్ = ఈ పది పాశురాలను
మఱ్ఱెవయుమ్ = భగవద్వ రిక్తమైన సమస్త విషయాలను
వీడు సెయ్దు = వదిలెట్లుగా చేసి
మిక్క పుగళ్ = ఉన్నతమైన కీర్తిగల
నారణన్ తాళ్ = శ్రీమన్నారాయణుని శ్రీపాదాలను
నాడు = లోకములోని వారందరూ
నలత్తాల్ అడైయ = ఆపేక్షతో ఆశ్రయించుటకు
నన్ గురైక్కుమ్ = చక్కగా అనుగ్రహించారు.
సంక్షిప్తవివరణ: ఈ పది పాశురాలలో నమ్మాళ్వార్లు కృపతో సంసారులు ఉజ్జీవించే మార్గాన్ని ఉపదేశించారు. ఈ లోకంలోని అల్ప విషయాలను త్యజించమని చెప్పారు. సంసారులపై నిర్హేతుక కృపతో వారికి శాశ్వత ఆనందాన్ని ఇచ్చే శ్రీమన్నారాయణుని శ్రీపాదాలను పట్టి ఉజ్జీవించమని ఉపదేశించారు.
పాశురము 3
అవతారిక: నమ్మాళ్వార్లు మూడవ దశకంలో పరమాత్మ సౌలభ్య గుణాన్ని వివరించారు. ఈ పాశురములో ఆ వైభవాన్ని మాముణులు పాడారు.
పత్తుడైయోర్కెన్ఱుమ్ పరన్ ఎళియనామ్ పిఱప్పాల్
ముత్తి తరుమ్ మానిలత్తీర్ మూణ్డవన్ పాల్ –పత్తిశెయ్యుమ్
ఎన్ఱురైత్త మాఱన్ తనిన్ శొల్లాల్ పోమ్ నెడుగ
చెన్ఱ పిఱప్పామ్ అఞ్జిఱై !
ప్రతిపదార్థము :
పరన్ = పరమాత్మ
పత్తుడైయోరుక్కు = భక్తి గలవారికి
ఎన్ఱుమ్ = ఎప్పుడు
ఎళియనామ్ పిఱప్పాల్= అవతారము చేత సులభుడు
ముత్తి తరుమ్ = మోక్షము ఇప్పించును
మానిలత్తీర్ = ఈ భూమి మీద జీవిస్తున్న చేతనులరా!
మూణ్డవన్ పార్ –= అత్యంత ప్రేమతో
పత్తిశెయ్యుమ్ = భక్తి చేయ్యి
మాఱన్ = నమ్మాళ్వార్లు
తనిన్ శొల్లాల్ = శ్రీసూక్తి అయిన తిరువాయ్మొళిని అనుసంధానము చేయటము వలన
నెడుగ = దీర్ఘముగా
అఞ్జిఱై = అందమైన చెర
పోమ్ = తొలగిపోతుంది.
సంక్షిప్త వివరణ: సర్వేశ్వరుడే చేతనులు సులభంగా ఆశ్రయించదగిన దేవుడు అని నమ్మాళ్వార్లు తమ అమృత తుల్యమైన వాక్కులతో ఈ తిరువాయ్మొళిలో ఉపదేశించారు. అలా ఆశ్రయించైనా వారికి శ్రీమన్నారాయణుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాడు. చేతనులకు అందుబాటులో ఉండడము కోసమే ఈ లోకంలో అర్చారూపములో వేంచేసి ఉన్నాడు. ఒక్కసారి భక్తి చేసి ప్రేమతో ఆయనను ఆశ్రయించరా ఇక ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొందవచ్చు.
పాశురము:4
అవతారిక: నాలుగవ దశకంలో నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని ఎడబాటును తాళలేక పక్షులను ఆయన దగ్గరకు రాయభారం పంపారు. ఆయన అపరాధసహిష్ణత గలవాడు కాబట్టి తన అపరాధములేమన్నా ఉంటే క్షమించి వెంటనే కృప చూపని ప్రార్థించారు. ఆ విషయాన్నే మాముణులు ఈ పాశురములో వివరించారు.
అఞ్జిఱైయ పుట్కళ్ తమ్మై ఆళియానుక్కు నీర్
ఎన్ శెయలై చొల్లుమ్ యెన ఇరందు –విఞ్ఙ
నలఞ్ఙియదుమ్ మాఱనిఙ్గే నాయగనై తేడి
మలంగియదుమ్ పత్తివళమ్ !
ప్రతిపదార్థము :
మాఱన్ = నమ్మాళ్వార్లు
అఞ్జిఱై = అందమైన రెక్కలుగల
పుట్కళ్ తమ్మై = పక్షులను
ఆళియానుక్కు = చక్రాయుధాన్ని ధరించిన పరమాత్మకు
నీర్ = మీరు
ఎన్ శెయలై = నా చేష్టితాలను
చొల్లుమ్ యెన = విన్నవిస్తుందని
ఇరందు –= ప్రార్థించి
విఞ్ఙ = మిక్కిలి
నలఞ్ఙియదుమ్ = ఉత్సాహము తగ్గి ఉన్న
ఇఙ్గే = ఈ లోకములో
నాయగనై = నాయకుడైన శ్రీయఃపతిని
తేడి = వెదకి
మలంగియదుమ్ = చాంచల్యమును బొందియుండుటకు
పత్తివళమ్ = భక్తి ప్రవహమే కారణము అగును
సంక్షిప్త వివరణ: నమ్మాళ్వార్లు పక్షులను, వాటి అందమైన రెక్కలను చూసి వాటిని ఇలా ప్రార్థించారు. ‘మీరు ఆ చక్రాయుధము ధరించిన సర్వేశ్వరుడి దగ్గరకు వెళ్ళి నా స్థితిని తెలియజేయండి. అత్మోజ్జీవన విషయముపై విసుగుచెంది ఉందటం, సర్వేశ్వరుని విషయంలో చాలా చాప్ల్యము కలిగి ఉందటం మొదలైనవి భక్తి తీవ్రత వలననే అని ఆయనకు చెప్పండి. లోక నాయకుడైన వాడు ఇంత క్రూరంగా మారటం న్యాయమా అని అడగండి‘ అని పక్షులను సర్వేశ్వరుడి దగ్గరకు రాయభారం పంపారు.
పాశురము:5
అవతారిక: ఈ పాశురములో మాముణులు అందరికి ఆశ్రయాన్నివ్వగల పరమాత్మ సౌశీల్యగుణమును తెలియజేస్తున్నారు.
వళంమిక్కమాల్ పెరుమై మన్నుయిరిన్ తణ్మై
ఉళముఱ్ఱంగూడురువ వోర్దు తళర్వుఱ్ఱు
నీఙ్గనినై మాఱనై మాల్ నీడిలగు శీలత్తాల్
పాఙ్గుడనే శేరత్తాన్ పరిందు
ప్రతిపదార్థము :
వళం = సౌందర్యము
మిక్కమాల్ = అతిశయించి యుండు సర్వేశరుని యొక్క
పెరుమై = మహిమైయును
మన్నుయిరిన్ తణ్మై = అనువైన ఆత్మయొక్క స్వభావము
ఉళ్ళ ముఱ్ఱు = హృదయమందు పడుటచే
అఙ్గు = ఆ దశలో
ఊడురువ = నిరూపించినపుడు
ఓర్దు = పూర్తిగా విచారించి
తళర్వుఱ్ఱు = మిక్కిలి శైథిల్యమునొంది
నీఙ్గ= విడిచి
నినై మాఱనై = ఆ శ్రీయఃపతికి శ్లాఘ్యమును కలుగజేయ తలచు నమ్మాళ్వార్లను
మాల్ = ఆశ్రిత వ్యామోహము గల సర్వేశ్వరుడు
నీడిలగు = దీర్గంగా ప్రకాశించే
శీలత్తాల్ = శీలగుణములచే
పరిందు= స్నేహించి
పాఙ్గుడనే = సంతోషంతో
శేరత్తాన్ = ఆలింగనము చేసికొనెను
సంక్షిప్త వివరణ:: సకలవిధ సంపదలు అతిశయించివుండే సర్వేశ్వరుని మహిమను, ఈ చేతనుని స్వభావమును హృదయంలో తలచి, చక్కగా విచారించి శైథిల్యమును మనసు పొందుతున్నది. ఆ శ్రీయఃపతికి ఆనందాన్ని కలుగచేయ తలచిన నమ్మాళ్వార్లను సర్వేశ్వరుడు ఘాడంగా ఆలింగనం చేసుకొన్నాడు.
పాశురము:6
అవతారిక: ఈ పాశురములో పరమాత్మ దుర్లభుడు కాదని ఆశ్రయించదగిన వాడని సులభుడని నమ్మాళ్వార్లు 6వ దశకములో చెప్పిన విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేశారు.
వరివదిలీశన్ ప్పడియై పణ్బుడనే పేశి
అరియనలన్ ఆరాదనైక్కెన్ఱు ఉరిమైయుడన్
ఓది యరుళ్ మాఱన్ ఒళివిత్తాన్ ఇవ్వులగిల్
పేదైయర్ గళ్ తంగళ్ పిఱప్పు
ప్రతిపాదార్థము:
వరివదిల్ = నిఖిల హేయ ప్రత్యనీకుడై, కళ్యాణ గుణములకు నిలయుభూతుడైన
ఈ శన్ ప్పడియై = సర్వేశ్వరుడిని ఆరాధించే స్వభావాన్ని
పణ్బుడనే = ఇచ్చిందే చాలని స్వీకరించే పరిపూర్ణ స్వభావముతో
పేశి = అనుగ్రహించి
ఆరాదనైక్కు = తిరువారాధనకు
అరియన్ = దుర్బలుడైనవాడు
అల్లన్ ఎన్ఱు = కాడు అని
ఉరిమైయుడన్ = ప్రేమతో కూడిన స్వతంత్రంతో
ఓది యరుళ్ = చెప్పిన
మాఱన్ = నమ్మాళ్వార్లు
ఇవ్వులగిల్ = ఈ లోకంలో
పేదైయర్ గళ్ తంగళ్ = జ్ఞానహీనుల
పిఱప్పు= జన్మము
ఒళివిత్తాన్ = పోగొట్టేట్లుగా చేసారు
అరియనలన్ = సులభుడు
సంక్షిప్త వివరణ: సకల కళ్యాణ గుణ సంపన్నుడైయిన పరమాత్మ మహిమ ఈ చేతనుడి హృదయాన్ని చేరింది. అక్కడకు చేరి అది ఊరుకుంటుందా! ఆ హృదయాన్ని శైధిల్యము చేసింది. అయినా ఆ హృదయంతో పరమాత్మకు మేలు చేయాలని తలంచే నమ్మాళ్వార్లకు పరమాత్మ ఉపకారం చేశారు. ఆయన శీల గుణాలతో స్నేహించి సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు.
పాశురము 7
అవతారిక: ఈ పాశురములో పరమాత్మ శ్రీపాదల
పిరవి అఱ్ఱు నీళ్విశుంబిల్ పె
తిఱమళిక్కుం శీల తిరుమాల్ -అఱవినియన్
పఱ్ఱుమవరకెన్ఱు పగర్ మాఱన్ పా
ఉఱ్ఱ తునై ఎన్ఱు ఉళ్ళమే! ఓడు
ప్రతిపాదార్థము:
ఉళ్ళమే ! = ఓ మనసా
పిరవి అఱ్ఱు = జనన మరణ చక్రం నుండి విడివడిన
నీళ్విశుంబిల్ = పరమాకాశములో (
పెరిన్బమ్ ఉయ్ క్కుం తిఱం = సం
అళిక్కుం శీలమ్ = కృప చేయగల శీ
తిరుమాల్ = పరమాత్మ
పఱ్ఱుమవరక్కు = శరణాగతి చేసిన వా
అఱవినియన్ = సౌలభ్య స్వరూపుడు
ఎన్ఱు = అని
పగర్ = ఆనందంగా చెప్పే
మారన్ = నమళ్వార్ల
పాదమే = శ్రీపాదమే
ఉఱ్ఱ తునై ఎన్ఱు = నాకు తోడు అ
ఓడు = ఈ క్షణాన పరుగెత్తు
సంక్షిప్త వివరణ:: ఓ మనసా! శ్రీయఃపతి అయిన సర్వేశ్వరుడు తన
పాశురము 8
అవతారిక: ఈ పాశురములో పరమాత్మ శీల సంపన్నులను శీలమే లేని వారిని సమానంగానే ఆదరిస్తాడు అని చెప్పే దశక భావాన్ని ఇక్కడ మాముణులు తెలియజేస్తున్నా
ఓడు మనం శేయ్గై ఉరై ఒన్ఱి నిల్లాదా
కూడి నెడుమాల్ అడిమై కొళ్ళుమ్ ని
ఓర్ం దవన్ తన్శెమ్మై ఉరై శెయ్ద మాఱన్ ఎన
ఏయ్ందు నిఱ్కుమ్ వాళ్వామివై
ప్రతిపాదార్థము:
ఓడుమ్ = పరుగెత్తే
మనం = మనసా
శేయ్గై = శరీరము
ఉరై = వాక్కు పై
ఒన్ఱి నిల్లాదారుడనే = నిగ్రహము
కూడి = చేరిన వారిని సహితము
అడిమైకొళ్ళుమ్ నిలై = దసుడుగా స్వీ
నెడుమాల్ = సర్వేశ్వరుడుకి
నాడఱియ= లోకమంతా ప్రకటితమయ్యే విధంగా
ఓర్ం దు = వివరంగా
అవన్ తన్శెమ్మై = కృపతో
ఉరై శెయ్ద = చెప్పిన వారు
మాఱన్ ఎన = మారన్ అని
వాళ్వామివై = జీవించే వారి ఈ
ఏయ్ందు నిఱ్కుమ్ = ఎప్పటికీ నిలిచి వుంటుంది
సంక్షిప్త వివరణ: శీలము లేనివారిని ఉందని మనసు, కరణములు, వాక్కును తమ వశములో ఉంచుకోలేని అర్థాత్ నిగ్రహము లేని వాడిని కూడా సర్వేశ్వరుడు ప్రేయమతో అనుగ్రహిం
పాశురము 9
ఇవైయఱిందోర్ తమ్మళవిల్ ఈశాన్ ఉవన్ దాఱ్ఱ
అవయవంగళ్ తోఱుమ్ అణైయుమ్ శువైయదనై
పెఱ్ఱు ఆర్వత్తాల్ మాఱన్ పేశిన శొల్పేశ మాల్
పొఱ్ఱాళ్ నమ్ శెన్ని పొరుమ్ |9|
ప్రతిపాదార్థము :
ఇవై = గతంలో ఆయన చూపిన ఆర్జవము వంటి కళ్యాణ గుణములు
యఱిందోర్ తమ్మళవిల్ = తమ శక్తి కొద్ది తెలుసుకొన్న వారిని
ఈశాన్ = సర్వేశ్వరుడు
ఉవన్ దు = మెచ్చి
ఆఱ్ఱ = క్రమముగా
అవయవంగళ్ తోఱుమ్ = శరీరములోని అన్ని అవయవములను
అణైయుమ్ = ఆర్జవముతో కలిసిన
శువైయదనై పెఱ్ఱు = ఆ ప్రేమను అనుభవించిన
ఆర్వత్తాల్ = ఆతృతతో
మాఱన్ పేశిన = మాఱన్ అనే నమ్మాళ్వార్లు చెప్పిన
పేశ = చెప్పినవారి
మాల్ = సర్వేశ్వరుడి
పొఱ్ఱాళ్ = బంగారు పాదాలు
నమ్ శెన్ని = మన శిరస్సు మీద
పొరుమ్ = అమరుగాక
సంక్షిప్త వివరణ: మునుపటి దశకములో మనం సర్వేశ్వరుడి కళ్యాణ గుణములను గురించి చెప్పుకున్నాము. అందులో ఆర్జవము ఒక గుణము. అ గుణముతో ఆయన తన భక్తుడి శరీరములోని సర్వావయవములను నింపి ప్రేమతో అనుభవించిన క్రమమును ఆతృతతో మాఱన్ అనే నమ్మాళ్వార్లు చెప్పిన పరమ పవిత్రమైన మాటలు చెప్పిన వారికి సర్వేశ్వరుడి బంగారు పాదాలు శిరస్సు మీద అమరుగాక.
పాశురము 10
అవతారిక: ఈ పాశురాములో మాముణులు పరమాత్మ నిర్హేతుక కృపతో తన శరీరములోని సకల అవయవములను ఆక్రమించుకున్న తృప్తి వలన కలిగిన ఆనందాన్ని వివరిస్తున్నారు.
పొరిమాళిశంగుడైయాన్ పూదలత్తే వందు
తరుమాఱోరే తువఱతన్నై తిరమాగ
పోర్తురైశెయ్యాఱన్ పదం పణిగవెన్ శెన్ని
వాళ్తిడుగవెన్నుడైయ వాయ్
ప్రతిపదార్థము :
పొరిమ్ = శత్రువులతో చేయు యుద్ధములో
ఆళి = సుదర్శన చక్రము
శంగు = శ్రీ పాంచజన్యము
ఉడైయాన్ = ధరించి ఉన్న పరమాత్మ
పూదలత్తే వందు = భూలోకానికి వచ్చి
ఱోరే తువఱతన్నై = నిర్హేతుక కృపతో తనను
తరుమారు = నాకు ఇచ్చుటకు
తిరమాగ = ధృడముగా నన్ను
పార్తు = చూశారని
ఉరైశెయ్ = దయతో పలికిన
మాఱన్ = మాఱన్ అనే నమ్మాళ్వార్ల
పాదం = శ్రీపాదం
ఎన్ శెన్ని = నా శిరస్సు పై
పణిగ = అమరు గాక
ఎన్నుడైయవాయ్ = (నమ్మాళ్వావార్లను) నానోరు
వాళ్తిడుగ = మంగాళాశాసనము చేయుగాక
సంక్షిప్త వివరణ: శత్రువులతో యుద్ధము చేయుటకు నిరంతరము తన చేతులలో సుదర్శన చక్రమును, శ్రీపాంచజన్యమును, ధరించి ఉన్న పరమాత్మ భూలోకానికి వచ్చి నిర్హేతుక కృపతో తనను నాకు ఇచ్చుటకు ధృడముగా నన్ను చూశారని దయతో పలికిన మాఱన్ అనే నమ్మాళ్వార్ల శ్రీపాదం నా శిరస్సు పై అమరు గాక ! నానోరు ఆయనను (నమ్మాళ్వావార్లను) మంగాళాశాసనము చేయుగాక ! అని మాముణులు ఈ పాశురములో చెపుతున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము:https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-1-10-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Telugu Pasurams available only up to 40. I would be grateful if you can upload the full list of pasurams in Telugu with meaning