తిరుమాలై – అవతారిక 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

వ్యాఖ్యానచక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధానికిచేసిన వ్యాఖ్యానములో

విపులమైన  అవ తారికను రాసారు. లీలావిభూతిలో ఉన్న వారైనా సరే నిత్యవిభూతిలో ఉన్నవారైనా సరే చేతనులందరికి శ్రీమన్నా రాయనుడే పురుషార్దము. నిత్యవిభూతిలో ఉన్న నిత్యశూరులు ఈ విషయాన్ని బాగా తెలిసినవారవటం చేత నిరం తరం పరమాత్మ అనుభవాన్ని పొందుతుంటారు, కానీ లీలావిభూతిలో ఉన్నవారు మాత్రం ఈ సత్యాన్ని మరచిపో యి దేహమేఆత్మ అన్న భ్రమలో దేహావసరాలను తృప్తిపరచటంలో మాత్రమే తమ శక్తియుక్తులనువెచ్చిస్తూ కాలం గడుపుతారు. ఇది అనాదికాలంగా జరుగుతున్నవిషయం. తొండరడిపొడి ఆళ్వార్లు కూడా మొదట ఈదుస్థితిని అనుభవించినవారే. శ్రీమన్నారాయనుడే అపారమైన కృపను ఆయనపై చూపి తమ స్వరూప, రూప, గుణ, విభూ తులను దర్శింపజేసి వారి మార్గాన్ని మళ్ళించారు. తిరుమాలైలోని మొదటి మూడు పాశురాలలో భగవంతుడి నామమును, తరువాతి 11 పాశురాలలో భగవంతుడి స్వరూప, రూప, గుణ, విభూతులను గురించి విపులంగా చెప్పారు. అది సేవించిన సంసారులు కూడా ఆళ్వార్ల మార్గంలో నడవాలని వారి కోరిక . తొండరడిపొడి ఆళ్వార్ల ప్రబంధాన్ని విన్న భగవంతుడే 45వ పాశురంలో మురిసిపోయాడు .

(పెరియవాచ్చాన్ పిళ్ళై సంసారమంటే ఏవిటి? సంసారులు ఎవరు? అని విరించబోతున్నారు. అదితెలిసిన తరు వాత మనం ఈసంసారాన్ని వదలడానికి ప్రయత్నించాలి, కనీసం సంసారం మీద అరుచి అయినా కలగాలి. లేకపోతె ఆళ్వార్ల రచనలు, శాస్త్రాలు, ఇతిహాస పురాణాలూ, ఉపనిషత్తులు అన్నీ వృధా అయిపోతాయి. మనము తరచుగా ఈఅవతారికను చదువుతూ వుంటే లౌకిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. )

సంసారులు నిత్యం అనేక పనులు చేస్తూ శాస్త్ర విహిత కర్మలను ఆచరించి పుణ్యాలను, శాస్త్ర వ్యతిరేక కర్మలను ఆచరించి పాపలను పోగువేసుకుంటారు. దేహావసాన కాలంలో వాటి ప్రకారంగా స్వర్గనరకాలకు చేరు కుంటారు. అవి పూర్తి అయిన తరువాత మళ్ళీ లీలావిభూతిలో పుడతారు. చాందోద్యోగంలోని పంచాగ్ని విద్యాప్ర కరణంలో ఈవిషయాన్నీ చాలాస్పష్టంగా చెప్పరు.

ఆత్మ నరకంలో పాపాన్ని, స్వర్గంలో పుణ్యాన్ని అనుభవించిన తరువాత శూన్యంలోకి నేట్టబడుతుంది. శూన్యంలో ఉండగా దానిని ఆవరించిన మంచును సూర్యడు తనకిరణాలవేడివలన కరిగించివేస్తాడు. ఆతరువాత అది మేఘాలలో చేరుతుంది. సమయమాసన్నమవగానే మేఘాలు ద్రవీభవించి వర్షంగా భూమి మీద కురుస్తున్న  ప్పుడు ఆత్మ కూడా ఆవర్షంతోకలసి భూమిని చేరుతుంది.  వర్షపు నీరు పంట భూములకుచేరి పంట పండటానికి ఆధారమవుతుంది. నీటిలో చేరినఆత్మ పంటలోచేరుతుంది. పండినపంట అనేక దశలనుదాటి ఒకగృహస్తు ఇంటికి చేరుతుంది. వారిఇంట్లో పక్వంచేసిన పదార్థాలతో కూడి ఆహారమవుతుంది . ఆహారంద్వారా పురుషుడి గర్భంలోకి చేరుతుంది. అక్కడ మూడునెలలు వాసంచేసిన తరువాత స్త్రీగర్భంలోకిగాని, భయటకు గాని వెళ్ళిపోతుంది. స్త్రీ గర్భంలోకిచేరిన ఆత్మ ఫలదీకరణం జరిగితే పురుషుడుగా పిలవబడుతుంది . స్వర్గనరకాల నుండి భయటపడిన ఆత్మలన్నీ స్త్రీగర్భంలోకి ప్రవేసించవు. ఈ రెండుచర్యలకు మధ్య అనేకఆటంకాలు ఏర్పడతాయి. మేఘాలలో చేరిన ఆత్మలుఅన్నీ నీటిలోచేరవు కొన్ని గాలిలోనే కొట్టుకుపోవచ్చు, కొన్ని అడవులలో పడిపోవచ్చు , కొన్ని సముద్రపు నీటిలో పడిపోవచ్చు. పంటలో కూడా చాలా గింజలు వృధాకావచ్చు. పరమాత్మ కృపవలన ఏ ఆత్మలు పురుషు డుగా మారాలో అవి మాత్రమే పురుషుడుగా మారుతాయి. తల్లి గర్భంలో ఉండగా బొడ్డుతాడు ద్వారా ఆ తల్లి ఆహార పుటలవాట్ల వలన ఆత్మ అనేక క్లేశాలను అనుభవిస్తుంది. తల్లి గర్భంలోఉన్నప్పుడు ఒక లావా సముద్రంలో చిక్కు పడ్డట్టుగా బాధలను అనుభవిస్తుంది. శిశువు పెరుగుతున్నప్పుడు కనీసం కాలు చాచడానికి కూడా వీలుకాదు. ఏడవ నెలలో ఈ బాధలనుండి విముక్తికలిగించి మొక్షాన్నిఇవ్వమని భగవంతుడిని ప్రార్థిస్తుంది. కానీ అప్పుడు భగ వంతుడు శఠమ్ అనేవాయువును ఆవరింపచేస్తాడు. దానిఫలితంగా ఆ ఆత్మకు జ్ఞానం నశిస్తుంది. నెలలు నిండిన తరువాత తల్లిగర్భంనుండి ఎంతో బాధను అనుభవిస్తూ ఆ ఆత్మ స్వర్గనరకాల నుండి ఎలాగైతే తలకిందులుగా భయ టికి వస్తుందో అలాగే తలకిందులుగా ఈ లోకంలోకి వచ్చిపడుతుంది.

శైశవంలో తన అవసరాలను తాను తీర్చుకోలేక పరాధీనంగా కాలంగడపాల్సివస్తుంది. కొంచెం పెరిగిన తరువాత తనఅవసరాలను తాను తీర్చుకోగలుగుతుంది. 15 సంవత్సరాలు వచ్చేదాకా ఆటపాటలతో గడచిపోతుం ది, భగవంతుడి గురించి చింతన చేయడానికి సమయం వినియోగించడు. యవ్వనంలో ప్రాపంచిక సుఖాలకు లోన వుతాడు. అప్పుడూ  భగవంతుడి గురించి చింతన చేయడానికి సమయం వినియోగించడు. తరువాత వివాహం, సంసారం, పిల్లలు వాళ్ల పెంపకంతో గడచిపోతుంది. ఆపిల్లలు వాళ్లజీవితాన్ని వెతుకుతూ వెళ్ళేసమయానికి వీడికి ముదిమి ప్రాప్తిస్తుంది. అప్పుడు తాను జీవితంలో ప్రధానమైనకాలాన్ని భగవంతుడిని స్మరించకుండా వృధా చేసా నని చింతిస్తాడు.  భగవంతుడిని గురించి చింతన మొదలుపెడతాడు, కానీ అవయవపటుత్వం తగ్గిపోవటం వలన కైంకర్యాలేవి చేయలేక పోతాడు. యవ్వనంలో శరీరం దృడంగానేఉండింది కానీ మనసు సహకరించలేదు. వార్థక్యం లో మనసు కోరుకుంది కానీ శరీరం సహకరించదు. కర్మపరిపక్వం అయ్యాక మృత్యువాత పడతాడు. మళ్ళీ చక్రం ఇలాగే తిరుగుతుంది. స్వర్గనరకమనే ఊర్ద్వలోకాల నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించే వరకు జరిగే ప్రక్రియలను పంచా గ్నివిద్య అంటారు.

శాస్త్రము సంసారమనే చీకటిని చేదించడానికి కరదీపిక వంటిది. శ్వేతేతర ఉపనిషత్తులో చిత్, అచిత్, ఈశ్వరుడు అని తత్వత్రయం గురించి చెప్పబడింది. జీవాత్మ కష్టాలనుచూసిన పరమాత్మ కృపతో సుహృత్ (హృద యంలో మంచిని)ను ఇస్తాడు. దానితో జీవాత్మ తనగురించి, తన చుట్టూవున్న సంసారంగురించి, తనలో ఉన్న పర మాత్మ గురించి, తెలుసుకునే ప్రయత్నంచేస్తాడు.

పరమాత్మ అంతర్యామిబ్రాహ్మణంలో(సుభాలోపనిషత్)అపహతపాప్మ అయిన నారాయణుడే పర మాత్మఅని తెలుసుకుంటాడు. అప్పటినుంచి జీవాత్మ అచిత్తు(లౌకిక) విషయానుభావాలనువదిలి క్రమంగా ఈశ్వ రతత్వాన్ని తెలుసుకొని అంతిమంగా జననమరణ చక్రాన్నుండి భయటపడతాడు. ఇది గుడ్డివాడికి చూపు రావటం లాంటిది, చీకటిలో దీపం లాంటిది. పరమాత్మకు చిత్ అచిత్ రెండూ ఆధేయాలే. ఆయన అవయవి, అవి అవయ వాలు. ముండకోపనిష త్తులో చిత్ అచిత్తుకు లోబడటానికి కారణం కర్మ అని చెప్పబడింది. ఇంకా కర్మబంధం నుండి విడివడినప్పుడు శ్రీవైకుంఠంచేరి నిత్యసూరులతో కలసి శ్రీమన్నారాయణుని కైంకర్యప్రాప్తిని పొందుతారని చెప్పబడింది.

చేతనులు భగవంతుడు శాస్త్రములో(వేదము) విధించిన విధంగా జీవనం సాగించక వేదబాహ్యులు గానో, కుద్రుష్టులుగానో (వేదమును విపరీతదృష్టితో చూసి విమర్సించటం) జీవిస్తారు. అప్పుడు పరమాత్మా ఈ లోకంలో సామాన్యుల మధ్య తాను ఒకడుగా అవతరించి వారిని సరిదిద్దుతాడు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైన వారిని అలాగే సంహరించాడు. అలాగే విదుర, విభీషణాదులను రక్షించాడు.

భగవంతుడు తన కృపవలన చేతనులహృదయంలో మార్పును తీసుకువస్తాడు. అందువలన తరు వారి కాలంలో అయన దయకు పాత్రులవుతారు. క్రమంగా భగవంతుని వైపు అడుగులు పడతాయి. సదాచార్యుల ను ఆశ్రయించి వారి అనుగ్రహంతో శాస్త్రవిషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. భగవంతుడే సకల చరాచర ప్రపంచానికి నాధుడు, స్వామి అని సమస్త చేతనాచేతనములు ఆయనకు అధీనములని, దాసులని తెలుసుకుం టాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత భగవంతుడిని చేరుకోవటమే పరమపురుషార్థం అని అర్థమవుతుంది. అప్పుడు భగవంతుడిని చేరుకోవటానికి మార్గమేమిటని శాస్త్రాలను వెతుకుతాడు. కర్మయోగం,జ్ఞానయోగం,భక్తి యోగాల గురించి తెలుసుకొని ఆచరణలో క్లేశాలను అర్థం చేసుకుంటాడు. అంతిమంగా ఉపనిషత్తులలో చెప్పిన శర ణాగతి మార్గాన్ని అనుసరిస్తాడు. మొదట చెప్పిన కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగాలను సాధ్యోపాయాలం టారు. తరువాత చెప్పిన శరణాగతి మార్గాన్ని సిద్దోపాయమంటారు. ఈ మార్గాన్ని అనుసరించినవాడు ప్రపన్నుడు. అతని దృడమైన భగవద్విస్వాసం సంసారం క్లేశం నుండి దూరం చేసి శ్రీవైకుంఠానికి తీసుకువెళుతుంది. దీనినే మహావిస్వాసం అంటారు.

చేతనులకు భగవంతుడు నామసంకీర్తనమనె మరో సులభ మార్గాన్ని కూడా అనుగ్రహించాడు.ఇది  మోక్షానికి మార్గం కాదు కానీ మహావిస్వాసం కలిగి వుండడానికి సహకరిస్తుంది, పాపాలనుండి దూరంచేసి  తద్వారా క్రమంగా భగవంతుడిని శరణాగతి చేయటానికి ఉపకరిస్తుంది. అలాగే శరణాగతి చేసిన తరువాత మోక్షం దొరికేదాకా కాలక్షేపానికి ఈ నామసంకీర్తన ఉపకరిస్తుంది. నామసంకీర్తనచేస్తూ పురుషార్థాన్ని వెతకటం కాక నామసంకీర్తనం చేయటమే మనకు పురుషార్థంగా భావించాలి.

అవతారికలో మిగిలి అంశాలను తరువాతి భాగంలో చూద్దాము.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

హిందీలో – http://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai-introduction-1/

మూలము : http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment