కణ్ణినుణ్ శిరుతాంబు – 3 – తిరితంతాగిలుం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 2

paramapadhanathan

 నంజీయర్  అవతారిక:

మధురకవి ఆళ్వార్ భగవంతుడి చేష్ఠితాలను అనుభవించింది  నమ్మాళ్వార్లకు  భగవంతుడు ప్రీతికరమైన వాడు కావున.

నంపిళ్ళైఅవతారిక:

  • మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్లకు శరణాగతుడు.  అందువలన ఆయన కిష్ఠమైన భగవంతుడిని తను కూడా సేవించాడు.
  • ఎంపెరుమాన్  జీవప్రకృతికి వ్యతిరేకమైన శూర్ఫణకను  ఒంటరిగా వస్తే పట్టుకున్నాడు. అదే ఎంపెరుమాన్  ఆణ్డాళ్ వంటి ఆచార్య నిష్ట కల వారికి తాను సులభుడు. ఇదే విషయాన్ని ఆండాల్ నాచ్చియార్ తిరుమొళి 13.10 లో “తంగళ్ తేవరై వల్ల పరిసు వరువిప్పరేల్” (పెరియాళ్వార్ల  దేవుడు వస్తే ఆయనను నేను ఆశ్రయిస్తాను.) అన్నది.
  • త్రిపురా దేవి ఎంపెరుమానార్ కాని, రుధ్రుడిని దేవుళ్ళలో ఉన్నతునిగా గుర్తిస్తే  ఆయననే  సంపూర్ణముగా  ఆశ్రయిస్తాను అన్నది. అమేకున్న ఆచార్య నిష్ట అలాంటిది.
  • నంపిళ్ళై వ్యాఖ్యానానికి అదనముగా పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ సంఘటనను ఎత్తి చూపుతున్నారు. ఎంపెరుమానార్  తిరునారాయణ పురములో ఉండగా ఒక సారి కూరత్తాళ్వాన్, శ్రీరంగములో కోవెలకు వెళ్ళారు. ఆ రోజులలో ఎంపెరుమానార్  సంబంధీకులెవరిని కోవెలలోనికి రానీయరాదని  రాజు ఆఙ.   అందువలన ఆయనను లోనికి వెళ్ళకుండా ఆపేసారు. భటులలో ఒకడు “కూరత్తాళ్వాన్  ఆత్మగుణ సంపన్నుడని ఆయనను లోనికి వెళ్ళనివ్వ వచ్చ”ని చెప్పాడు. కాని కూరత్తాళ్వాన్ “రామానుజ సంబంధమును వదిలి ఆత్మ గుణములను  చూసేట్టైతే అవి నిరుపయోగములు.” అని చెప్పి వెనకకు మరలి పోయారు. ఇది ఆచార్య నిష్టకు పరాకాష్ట.

* అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అభిప్రాయము:

మధురకవి ఆళ్వార్  ఇంతకు ముందు పాసురములో  “దేవు మఱ్ఱఱియేన్” అన్నటము వలన, తన దేవుడెవరో చెప్పుకున్నారు.

  • ఎవరైతే తమ ఆచార్య నిష్ట కలిగి వుంటారో వారంటే భగవంతునకు అమిత ప్రీతి.ఈ విషయమును గీతలోని 7.17 లో ఇలా చెప్పారు, “ప్రియో హి  ఙ్ఞానిన: అత్యర్త్తం  అహం స చ మ ప్రియ:” (ఎవరైతే నా మీద ప్రీతి కలిగి వుంటారో వారంటే నాకు  అమిత ప్రీతి.)
  • భగవంతుడు మధురకవి ఆళ్వార్లకు తన అప్రాకృత స్వరూపమును చూపించారు. మధురకవి ఆళ్వార్లకు, నమ్మాళ్వార్ల పట్ల వున్న ఆచార్య నిష్ట దానికి కారణము. ఈవిషయమును మధురకవి ఆళ్వార్లు గుర్తెరిగి నమ్మాళ్వార్లను శరణాగతి చేయటము తప్ప తన ఙ్ఞానమో అనుష్టానమో దానికి కారణము కాదని చెప్పుకున్నారు.

తిరితంతాగిలుం
దేవపిరానుడై కరియకోల త్తిరువురు కాణ్బన్ నాన్
పెరియ వణ్ కురుకూర్ నగర్ నంబిక్కు ఆళురియనాయ్
అడియేన్ పెఱ్ఱ నన్మైయే

తిరితంతాగిలుం = నేను ఒక వేళ జారి పోయినా(నమ్మాళ్వార్ల భక్తి నుండి)
దేవపిరానుడై = నిత్య సూరులకు నాయకుడైన భగవంతుడు
క్కరియ =నల్లని(మఘముల వలె)
కోలం = అందమైన
త్తిరువురు = తిరుమేని
నాన్ క్కాణ్బన్  = నేను చూస్తాను
పెరియ వణ్ కురుకూర్ నగర్ నంబిక్కు = ఆళ్వార్తిరునగరి నయకుడైన
ఆళురియనాయ్ = నిజమైన సేవకుడిగా
అడియేన్ పెఱ్ఱ నన్మైయే = నేను పొందిన అదృష్ఠము

భావము:   ఒక వేళ దాసుడు ఆచార్య నిష్ట నుండి జారినా, నీలమేఘశ్యాముడు, నిత్యసూరుల నాయకుడు అయిన శ్రీమన్నారాయణని ఆళ్వార్తిరునగరిలో అవతరించిన నమ్మాళ్వార్ల అనుగ్రహము వలన చూడగలుగుతాడు.

 నంజీయర్ వ్యాఖ్యానము:

  • భగవత్ విషయములో, చాందోగ్య ఉపనిషద్ లో “న చ పునర్ ఆవర్తతే” (ఒక సారి  పరమపదము చేరిన వారు మరల తిరిగిరారు.) మోక్ష సాధనలో ఇది మొదటి మెట్టు. భాగవతుల పట్ల, ఆచార్యుల పట్ల చేసే సంపూర్ణ శరణాగతి ఆఖరి మెట్టు.  ఆఖరి మెట్టు నుండి జారిన వాడు (ఆచార్య కైంకర్యము నుండి జారిన వాడు) మొదటి మెట్టు (భాగవత్కైంకర్యము)మీద పడతాడు.
  • భాగవతుల స్వస్వరూపము చాలా అందముగా వుంటుంది. లక్ష్మణుడి చేత శిక్షింపబడిన శూ ర్పణక, ఖరుడితో  రామ లక్ష్మణుల గురించి చెప్పే సందర్భములో వారి అందమును  గొప్పగా చెపుతుంది. (శ్రీ రామాయణం-ఆరణ్య 19.14) “తరుణౌ రూపసంపన్నౌ”.( చాలా రూప వంతులు, యవ్వన వంతులు)
  • పెరియ వణ్ కురుకూర్ –భగవంతుడి అనుగ్రహము సంపూర్ణముగా గల నమ్మాళ్వార్లను అనుగ్రహించిన, సుఙ్ఞానులతో నిండిన ఆళ్వార్తిరునగరి ఎంతో గొప్ప ఊరు. ఈ విషయము స్వయముగా నమ్మాళ్వార్లు తిరువాయిమొళి 8.1.11 “పెరియ వణ్కురుకూర్ వణ్ శటకోపన్“ అని చెప్పుకున్నారు.

  నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

  • ఆచార్య నిష్ట నుండి జారగానే, భగవంతుడి గురించి పాడటము మొదలు పెట్టారు. యోగ భ్రష్టులైన వారు  ఊర్వశి అందమును  గురించి పాడటము మొదలు పెట్టినట్లు, మధురకవి ఆళ్వార్ భగవత్ గుణములను గురించి పాడారు.
  • ఇక్కడ కూరత్తాళ్వాన్కు  శ్రీరంగములో జరిగిన విషయమును గుర్తు చేయటము జరిగింది.
  • మధురకవి  ఆళ్వార్ “అడియేన్” అన్నారు. అది నమ్మళ్వార్ల పట్ల వీరికున్న వినయమును తెలియ జేస్తుంది.
  • భగవంతుడి విషయములో నమ్మళ్వార్లకు, మధురకవి ఆళ్వార్లకు ఉన్న అభిమానము  “నన్మైయే” (మంచి) అనే ప్రయోగము వలన తెలుస్తున్నది.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

  • “తిరితంతాగిలుం” (వదలి వేయుట) మార్గ నిర్దేశము చేస్తున్నది.  తిరువాయిమొళి పాసురము (2వ పాసురం )లోను ఇదే విషయము చెప్పబడింది.  అంతిమముగా  మధురకవి ఆళ్వార్ అన్నింటిని వదలి ఎంపెరుమాన్ శ్రీపాదములను చేరుకున్నారు.
  • దేవపిరాన్ – ఒక వేళ మధురకవి ఆళ్వార్ ఆచార్య నిష్ట నుండి జారినా,  నిత్యసూరుల నాయకుడు అయిన శ్రీమన్నారాయణుని  శ్రీపాదములపై  పడి నిత్యసూరి అవుతారు.
  • నమ్మళ్వార్  చీకటి  కాలమైన  కలియుగములో అవతరించారు. శ్రీమన్నారాయణుని దయను ఇక్కడ చూడలేము. నమ్మాళ్వార్లు అవతరించిన ఆళ్వార్తిరునగరిని “కురుకూర్ నగర్” అని ప్రత్యేకముగా పేర్కొనటము వలన ఆ వూరిని  శ్రీవైకుంఠముగా  భావించారని తెలుస్తున్నది.  పరమపధం మీద  నమ్మళ్వార్లకు ఎటువంటి  అభిప్రాయము వుందో “అయర్వఱుం అమరర్గళ్ అధిపతి” (తిరువాయిమొళి 1.1.1 ) అనే పాసురము ద్వారా తెలుస్తున్నది. “తిరునగరి” అన్నప్పుడు అదే అభిప్రాయము మధురకవి ఆళ్వార్లకు వుంది.
  • ఆళురియనాయ్ –  నమ్మళ్వార్లకు పరతంత్రుడు. వారి ఇష్టయిష్టాలు వీరికి ఇష్టయిష్టాలు అవుతాయి.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

  • తిరితంతాగిలుం –అన్న ప్రయోగానికి నాయనార్ కొత్త అర్థమును చెప్పారు. భగవంతుడి గురించి కాకుండా  నమ్మళ్వార్ల పాసురములను పాడుతూ  తిరుగుతుండగా  భగవంతుడు తన కృపా దృష్టిని మధురకవి  ఆళ్వార్ల మీద కురిపించారు.
  • జితంతే స్తోత్రము 1.5 లో చెప్పినట్లుగా “భక్తానాం త్వం ప్రకాశసే” ( నీ భక్తులకు నీ స్వరూపమును విశద పరచు)  నమ్మళ్వార్లకు  భగవంతుడి మీద వున్న ప్రేమ, మధురకవి ఆళ్వార్లకు నమ్మళ్వార్ల మీద వుంది. అందు వలన భగవంతుడు  మధురకవి ఆళ్వార్లకు తన స్వరూపమును విశద పరచారు.
  • కరియ – నీల  నిత్యసూరులు అనుభవించిన రూపము నీలి మేఘ వర్ణము కాదు. నమ్మళ్వార్లు అనుభవించిన రూపము కూద నీలి మేఘ వర్ణ రూపము కాదు. బంగారు వర్ణము 2.5.1 “ఎన్నావి సేర్  అమ్మానుక్కు సెంపొన్ తిరువుడంబు” (నేనుసేవించు  స్వామి బంగారు వర్ణుడు.)  మధురకవి ఆళ్వార్లకు మాత్రమే  నీలి మేఘ రూపమును చూపి తన  ఔధార్యమును ప్రకటించారు.
  • తిరువురు – నాయనార్ ఈ ప్రయోగానికి శ్రీ మహాలక్ష్మి అని అర్థము చెప్పారు.
  • వకుళ మాల పరిమళమునకు బదులుగా తుళసి పరిమళము వ్యాపించినది. నమ్మళ్వార్లు అనుభవించిన రూపమునకు  భిన్నముగా  దాసుడికి  అనుగ్రహించాడు. మనసులో కొంచెము భీతితో  స్వామి రూపాన్ని చూడగలిగాను.
  • పెరియ వణ్ కురుకూర్  – మధురకవి ఆళ్వార్లకు ఆళ్వార్తిరునగరి  కంటే  పరమపదము చిన్నదిగా తోచింది. నమ్మాళ్వార్  పెరియ తిరువంతాది 75 లో  “పువియుం ఇరువిసుంబుం నిన్నగత్త నీ ఎన్ సెవియిన్ వళి పుగుంతు ఎన్నుళ్ళాయ్” (ఈరేడు భువనములు నీలో నిలిచి వుండగా నువూ నాచెవి గుండా నాలో ప్రవేశించావు.అనగా శాస్త్రము రూపములో నాలో నిలిచి వున్నావు అని అర్థము.) విభూతిమాంతుడు, విభుతి  (ఐశ్వర్యము)  నమ్మళ్వార్లలో వుండగా, ఆయన ఆళ్వార్తిరునగరిలో వున్నారు. అందువలన అది ఉన్నతమైనది
  • నమ్మళ్వార్ పరమపదనాధుడి మీద అపారమైన భక్తి గలవారు.  నమ్మళ్వార్లకు  దాసుడవటము వలన  పరమపదనాధుడే  అనుగ్రహించాడు.   నాన్ముగన్ తిరువంతాది 15 లో “ఏత్తియిరుప్పారై వెల్లుమే మఱ్ఱవరైచ్ చాత్తియిరుప్పార్ తవం” (భగవంతుడి దాసులకన్నా భాగవత దాసులది ఉన్నత స్థానము.)  మధురకవి ఆళ్వార్లు ఈ విషయమును బాగా  తెలిసిన వారు.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-3-thirithanthagilum/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment