కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 2 – నావినాల్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుత్తాంబు

<< పాశురం 1

azhwar-emperumanar-2

నమ్మాళ్వార్, ఎంపెరుమానార్(నమ్మాళ్వార్ల శ్రీపాదములని వ్యవహారము)ఆళ్వార్ తిరునగరి

పాశురము -2

నంజీయర్ అవతారిక:

నమ్మాళ్వార్ల వైభవమును ఈ శరీరముతోనే అనుభవించ వచ్చు అని మధురకవి ఆళ్వార్ చెప్పినట్లుగా నంజీయర్ అభిప్రాయ పడుతున్నారు.
నంపిళ్ళై అవతారిక:

మధురకవి ఆళ్వార్,  నమ్మాళ్వార్ల పాశురములను పాడుతూ ఉజ్జీవించారని నంపిళ్ళై అభిప్రాయము.

పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక:

పెరియవాచ్చాన్ పిళ్ళై అభిప్రాయము ప్రకారము నమ్మాళ్వార్ల పాశురములు మధురకవి ఆళ్వార్లకు చాలా రుచికరములని మొదటి పాశురములోనే చెప్పుకున్నారు. వాటి ఆధారముగానే ఉజ్జీవిస్తున్నారని ఇక్కడ ధ్రువపరచుచున్నారు..

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అవతారిక:

నమ్మాళ్వార్లు తమ ఆచార్యులనే భగవంతుడిగా భావించారు. మధురకవి ఆళ్వార్ తమ ఆచార్యులైన నమ్మాళ్వార్లను భగవంతుడిగా భావించారు అని అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అభిప్రాయ పడుతున్నారు.

తల్లి యశోద కృష్ణుడి అల్లరి చేష్ఠితములను తాళలేక కన్నయ్యను శిక్షించటము నిత్యకృత్యముగా మారిపోయింది ( సంధ్యా వందనము, అధ్యయన ఉత్సవము లాగా). నమ్మాళ్వార్లు కృష్ణానుభవమును స్మరిస్తూ పూర్తిగా ఆయనకే దాసుడైనట్లు కృష్ణుడు తల్లి కట్టి వేసినపుదు వేరెవరైనాడిపించాలని కూడా చూడదు. మధురకవి ఆళ్వార్ తమ ఆచార్యుల కిష్టమైన కృష్ణానుభవ రుచి తెలిసినా దానినుండి విడివడి తమ ఆచార్యుల మీదే దృష్టిని నిలిపారు.

మధురకవి ఆళ్వార్లను “ఎందుకని మీరు కృష్ణానుభవమును స్మరిస్తూ పూర్తిగా ఆయనకే దాసులైపోలేదు” అని ప్రశ్నిస్తే, దానికి వారు “ఈ లోకములోనూ ,పైలోకములోనూ ఆనందదాయకమైన విషయములు దొరికితే వాటితో కాలము గడుపుతారు.కాని మాకు ఈ లోకములోనూ ,పైలోకములోనూ నమ్మాళ్వార్లు ఒక్కరే నాధుడు, లక్ష్యము. అందుకని మాకు భగవత్ విషయము తో పని లేదు.” అని చెప్పారు.
పాశురము -2

నావినాల్ నవిఱ్ఱు ఇన్ బం ఎయ్ తినేన్

మేవినేన్ అవన్ పొన్నడి మెయ్ మ్మైయే

దేవు మఱ్ఱరియేన్

కురుకూర్ నంబి పావిన్ ఇన్నిసై పాడిత్ తిరివనే
ప్రతి పదార్థము:

నావినాల్ = జిహ్వతో

నవిఱ్ఱు = ఆలపిస్తూ

ఇన్ బం = ఆనందము

ఎయ్ తినేన్ = పొందాను

అవన్ = వాడి

పొన్నడి = శ్రీపాదములను

మేవినేన్ = ఆశ్రయించాను

మెయ్ మ్మైయే = నిజముగా

మఱ్ఱధేవు = మరొక దేవుడిని

అరియేన్ = ఎరుగను

కురుకూర్ నంబి = కురుకూర్ నాయకుడి

పావిన్ = పాశురములు

ఇన్నిసై = తీయని స్వరములతో

పాడి = పాడుతూ

త్తిరివనే = సంచరిస్తూ వుంటాను
భావము:

జిహ్వతో నమ్మాళ్వార్ పాశురములను ఆలపిస్తూ ఆనందము పొందాను. వాడి శ్రీపాదములను ఆశ్రయించాను. నిజముగా మరొక దేవుడిని ఎరుగను. కురుకూర్ నాయకుడి పాశురములు తీయని స్వరములతో పాడుతూ సంచరిస్తూ వుంటాను.

నంజీయర్ వ్యాఖ్యానము:

*“మన: పూర్వో వాగుత్తర:” అంటారు. అది కూడా అవసరము లేదు. నమ్మాళ్వార్ల గొప్పతనమును అసంకల్పితముగా అన్న మాటలు చాలును.

* “ప్రత్యక్షే గురవ: స్థుత్యా:” జిహ్వ ఉన్నందుకు ఆచార్యులను కీర్తించుటే ప్రయోజనము.

* “భావో నాన్యత్ర గచ్చతి” అని హనుమాన్ అన్నట్లుగా మధురకవి ఆళ్వార్ “మత్తఱియేన్“ అంటున్నారు.

* తిరువిరుత్తం-53 లో నమ్మాళ్వార్ “దైవత్తణ్ణన్ తుంజాయ్ త్తారాయినుం తళైయాయినుం తణ్ కొంబతాయినుం కీళ్ వేరాయినుం నిన్ఱ మణ్ణాయినుం కొణ్దు వీసుమినే”. భగవంతుడి తుళసి మాల అయినా, దాని నార అయినా, ఆకులైనా, కట్టె అయినా, వేరు అయినా, ఆమట్టి అయినా సరే నా ప్రాణాలు నిలపటాని చాలు అన్నారు. అలాగే ఇక్కడ మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ల పాశురము ఒక్కటే చాలు అంటున్నారు.

నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

* మధురకవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్ల శ్రీపాదములు ఉపాయము మాత్రమే కాదు, పురుషార్థము కూడా.

* మధురకవి ఆళ్వార్లు ఐశ్వర్యము, కైవల్యము, భగవల్లాభమును కూడా వదిలి వేశారు. నమ్మాళ్వార్లు ఒక్కరే చాలనుకున్నారు.

* నమ్మాళ్వార్ తిరువాయిమొళి లో “కురుకూర్ చ్చడకోపన్” అని తనను చెప్పుకున్నారు. ఇక్కడ మధురకవి ఆళ్వార్లు “కురుకూర్ నంబి“అన్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

* నమ్మాళ్వార్ తిరువాయిమొళి 4.5.3 లో “వీవిలింబం మిగ ఎల్లై నిగన్ళంతనన్ మేవి” (భగవంతుడిని శరణాగతి చేయటము వలన అంతు లేని ఆనందమును పొందాను.)అన్నారు. మధురకవి ఆళ్వార్లు “ఇన్బమెయ్ తినేన్” (ఆనందమును పొందాను.)అన్నారు. నమ్మాళ్వార్ భగవంతుడి విషయములో ఏ అనుభూతిని పొందారో అదే అనుభూతిని మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల విషయములో

పొందారు.

* నమ్మాళ్వార్ (చింతైయాలుం చొల్లాలుం చెయ్కైయినాలుం – తిరువాయిమొళి 6.5.11) మనో వాక్కాయ కర్మణా ఏ అనుభవమును పొందారో అదే అనుభవమును (నావినాల్ నవిఱ్ఱు) మధురకవి ఆళ్వార్లు పొందారు.

* మధురకవి ఆళ్వార్లు “మెయ్మైయే మేవినేన్” (పర లోకములో శరణాగతి చేశాను.) అన్నారు. ఆళవంధార్ స్తోత్ర రత్నము-2లో “అత్ర పరత్ర చాపి” (ఈ లోకములోను, పర లోకములోను) అన్నారు.

* “ఉణ్దు తిరివన్” (తిని తిరుగుతాను) అన్నట్లు “పాడిత్తిరివన్”(పాడుతూ తిరుగుతాను)అన్నారు మధురకవి..

అజ్హగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

* మనసు సహకరించకున్నా నోరు మాత్రము ఎప్పుడూ పాడుతూ వుంటుంది.అన్న అర్థములో మధురకవి ఆళ్వార్లు “నావినాల్ నవిఱ్ఱు” అని అన్నారు.

* మధురకవి ఆళ్వార్లు “మెయ్ తినేన్” అని అన్నారు.ఈ ప్రయోగము భూతకాలములో వున్నది. భగవతుడి విషయములో ఫలితము భవిష్యత్తులో, పరమపదములో లభిస్తుంది.కాని ఆచార్యుల విషయములో ఫలితము వెంటనే లభిస్తుంది.

* “పొన్నడి”(బంగారు పాదములు) అన్నారు మధురకవి ఆళ్వార్లు. “ఉలగమళంద పొన్నడి”(పెరియ తిరుమొళి) – ముల్లోకాలను కొలిచిన బంగారు పాదముల గురించి కాదు. “త్రైవిద్య వృత్త జన మూర్థ విభూషణ” (పరాంకుశాష్టకం)-ఆ బంగారు పాదలు ఙ్ఞానుల శిరస్సులను అలంకరిస్తుంది. నేను సృశించడము వలన వాటి పవిత్రత తరిగి పోదు.

* – మధురకవి ఆళ్వార్ శాస్త్రమును పూర్తిగా పాటిస్తున్నారు. “ఆచార్య దేవో భవ”అని తైత్తరీయ ఉపనిషద్ లొ  చెప్పినట్లుగా దేవు మఱ్ఱఱియేన్ అన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. భగవతుడి విషయములో

“ఎన్నప్పన్ (నా స్వామి)” అని ఎందుకు అన్నారు? దానికి జవాబు ఏమిటంటే నమ్మాళ్వార్లకు భగవతుడి విషయములో ప్రీతి వున్నది కదా! అందుకని. సీతా పిరాట్టి శ్రీరంగనాధునికి , శ్రీరాముడు తిరువారాధనము చేయు సమయములో సహాయము చేసినట్లుగా అని అర్థము. ఆమెకు ప్రత్యేకముగా తిరువారాధనము నందు ఆసక్తి ఉండి కాదు, శ్రీరాముడికి సహాయము చేయటమే ఆమె కోరిక.

* “మెయ్మైయే”- సత్యం. “అవన్ పొన్నడి మెయ్మైయే” శ్రీ శడకోపం (శ్రీ శటారి – నమ్మాళ్వార్) శిరస్సు మీద ఉండగా ఎవరైనా అసత్యము చెప్పగలరా?

* కురుకూర్ నంబి – కురుకూర్ నాయకుడు -సుగుణాల రాశి. తిరువాయిమొళి 3.9.11 “ఏఱ్కుం పెరుంపుగళ్ వానవర్ ఈశన్ కణ్ణన్ తనక్కు ఏఱ్కుం పెరుం పుగళ్ వణ్కురుకూర్ శటకోపన్” (కణ్ణన్ ఎంపెరుమాన్, నిత్యసూరుల, ముక్తాత్మల నాయకుడు,గుణ పరిపూర్ణుడు పొగడ్తలకు అర్హుడు. నమ్మాళ్వార్ కురుకూర్ నాయకుడు కణ్ణన్ ఎంపెరుమాన్  పొగడుటకు అర్హత గల వాడు. భగవంతుడు పరత్వ, సౌలభ్య పూర్ణుడు. నమ్మాళ్వార్ ఙ్ఞాన, భక్తి పరిపూర్ణుడు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

ఆధారము: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-2-navinal/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment