పూర్వ దినచర్య – శ్లోకం 32 – తతః శ్శుభాశ్రయే

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 31

శ్లోకం 32

తతః  శ్శుభాశ్రయే తస్మిన్ నిమగ్నం నిభృతం మనః ।

యతీంద్ర ప్రవణం కర్తుం యతమానం నమామి తం ।।

ప్రతి పదార్థము:

తతః = యోగమైన భగధ్యానమును చేసిన తరువాత

తస్మిన్ = మునుపు చెప్పిన విధముగా

శ్శుభాశ్రయే = యోగులచే ధ్యానింప బడు పరమాత్మ విషయములో

నిమగ్నం = నిమగ్నమైన

నిభృతం = నిశ్చలమైన

మనః! = మనస్సుతో

యతీంద్రప్రవణం = యతీంద్రులని పిలివబడే శ్రీమద్రామానుజా చార్యుల విషయములో ప్రవణులుగా

కర్తుం = చేయుటకు

యతమానం = ప్రయత్నము చేయుచున్న

తం = ఆ మామునులను

నమామి -నమస్కరిస్తున్నాను

భావము:

ఇక్కడ ‘ యతీంద్రప్రవణం కర్తుం ‘ అనునది ‘ యతీంద్రప్రవణమేవ కర్తుం ‘ అని అర్థము. 16వ  శ్లోకములో ‘ యతీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేనైవ చేతసా ‘ అని చెప్పారు. అనగా శ్రీమద్రామానుజాచార్యుల శ్రీచరణములను మనస్సులో నిలుపుకొని భవదాభిగమనము మొదలైన అనుష్ఠానములన్నీ చేసినట్లుగా చెప్పారు. అర్థాత్..మామునులు తమ ఆచార్యులను,వారికి ఇష్ఠమైన పరమాత్మను తమ మనస్సులో నిలుపుకున్నావారై ,క్రమముగా తమ ఆచార్యులైన శ్రీమద్రామానుజాచార్యులను మాత్రమే మనస్సులో నిలుపుకునుటకే అని చెప్పుతున్నారు. ధ్యానము చేయువారి హేయమైన దు:ఖమును పోగొట్టునది, వారి మనసును తనయందే లగ్నము చేయ గలది అయిన పరమాత్మ దివ్యమంగల విగ్రహము  ‘ శుభాశ్రయము ‘ అని చెప్పుతున్నారు.

ఎఱుంబిఅప్పా దీని వలన మామునుల యతీంద్రప్రవణతను (చరమ పర్వ నిష్ఠను )అనుసంధానము చేసి వారికి దాసోహములు సమర్పించిన తమకు కూడా చరమ పర్వ నిష్ఠ సిధ్ధిస్తుందని ‘ యతీంద్రప్రవణం కర్తుం యతమానం నమామి తం! ‘  వ్యక్త పరుస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-32/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment