నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

అల్లి నాళ్ తామరై మేల్ ఆరణంగిన్ ఇన్తుణైవి
మల్లి నాడాణ్డ మడ మయిల్ – మెల్లియలాళ్
ఆయర్ కుల వేందన్ ఆగత్తాళ్ తెన్ పుదువై
వేయర్ పయణ్ద విళక్కు

ఆండాళ్ నాచ్చియార్ అతి మృదు స్వభావి; అప్పుడే వికసిన్చిన తామర పుష్పములో నిత్య నివాసి అయిన పెరియ పిరాట్టి యొక్క ప్రియ సఖి,  తిరుమల్లి దేశాన్ని ఏలే అందమైన మయూరి ఆమె. యదుకుల నాయకుడైన శ్రీ కృష్ణుడి దివ్య స్వరూపానికి పరిపూర్ణత చేకూరుస్తుంది ఆమె.  అలాగే అందమైన శ్రీవిల్లిపుత్తూర్లోని బ్రాహ్మణ కులోత్తముడైన పెరియాళ్వార్ల దివ్య కుల దీపము.

కోల చ్చురిశంగై మాయన్ శెవ్వాయిన్ గుణం వినవుం
శీలత్తనళ్ తెన్ తిరుమల్లి నాడి శెళుంగుళల్ మేల్
మాలై త్తొడై తెన్నరంగరుక్కు ఈయుమ్ మదిప్పుడైయ
శోలైక్కిళి అవళ్ తూయ నఱ్పాదం తుణై నమక్కే

అందంగా మెలిక తిరిగి ఉన్న శ్రీ పాన్చజన్యాని (దివ్య శంఖం) చూసి ఆ పై, అద్భుత దివ్య లీలలాడిన ఎంబెరుమానుడి దివ్య అధరముల రుచి గురించి విచారిన్చగల గొప్పతనము ఆండాళ్ కి గలదు. ఆమె తిరుమల్లి దేశానికి నాయకురాలు. ఆమె తాను తనపై అలంకరించుకొని తీసిన దందలను తిరువరంగనాథుడికి సమర్పించగల గొప్పతనము ఆండాళ్ కి గలదు. ఆమె తోటలోని చిలుక లాంటిది. అలాంటి మాధుర్యము మరియు స్వచ్ఛతతో అలంకరించి ఉన్న ఆండాళ్ దివ్య పాదాలే మనకు శరణు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-thaniyans-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment