కోయిల్ తిరువాయ్మొళి – 7.2 – కంగులుమ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 6.10 – ఉలగముణ్డ

పరాంకుశ నాయకి, శ్రీ రంగనాథుడు

    పరాంకుశ నాయకి, శ్రీ రంగనాథుడు

భగవానుడితో  నమ్మాళ్వార్ల విరహ వేదన శిఖరానికి చేరి వారు స్త్రీ యొక్క మానసిక భావనను పొందుతారు. పరాంకుశ నాయకిగా  శ్రీరంగనాధుని పట్ల అంతులేని ప్రేమ కారణంగా, ఇక మాట్లాడలేని స్థితికి చేరి విరహ వేదనలో ఒక అడుగు ముందుకు వేసి పరాంకుశ నాయకి యొక్క దివ్య మాత (తల్లి) పాత్రను వహిస్తారు. ఆ తల్లి తన కుమార్తెను తీసుకొని పెరియ పెరుమాళ్ళ ముందు ఉన్న దివ్య స్థంభాల మధ్య ఉంచి, ఆమె దయనీయ స్థితిని అతడికి తెలియజేస్తూ, “నీవు సర్వ విధాలుగా ఆమెకు రక్షణనివ్వాలి” అని ప్రార్థిస్తుంది.

మొదటి పాశురము: పరాంకుశ నాయకి యొక్క తల్లి తన కుమార్తె యొక్క స్పృహలేని స్థితిని పెరియ పెరుమాళ్ళకి తెలియజేసి, “ఆమెను ఏమి చేయాలనుకుంటున్నావు?” అని అడుగుతుంది.

కంగులుం పగలుం కణ్‌ తుయిల్‌ అఱియాళ్ కణ్ణి నీర్‌ కైగళాల్‌ ఇఱైక్కుం
శంగు శక్కరంగళ్‌ ఎన్ఱు కై కూప్పుం తామరై కణ్‌ ఎన్ఱే తళరుం
ఎఙ్గనే తరిక్కేన్‌ ఉన్నై విట్టిన్నుం ఇరు నిలం కై తుళావిరుక్కుం
శెంగయల్‌ పాయ్‌ నీర్‌ త్తిరువరంగత్తాయ్‌ ఇవళ్‌ తిఱత్తెన్‌ శెయ్గిన్ఱాయే?

‌నా కూతురి కళ్ళు రాత్రుల్లో  నిద్రపోవాలని కూడా గ్రహించుటలేదు; కళ్ళ నుండి కారుతున్న బాష్పాలను తన చేతులతో ఆమె తుడుచుకుంటుంది; అతడు వచ్చాడని ఊహించుకొని శంఖం చక్రం అని అంటూ అంజలి పెడుతుంది; “కమల నేత్రాలు” అని అంటూ అలసిపోతుంది; ఆమె “నీవు లేకుండా నేను ఎలా ఉండగలను” అని రోధిస్తుంది; తన చేతులతో నేలని శోధిస్తూ చలము లేకుండా మారిపోతుంది; ఎర్రటి చేపలు ఎగిరి గెంతులు వేసే నీటి సరస్సులు చుట్టూ వ్యాపించి ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో నివాసుడై ఉన్న ఓ భగవానుడా! ఇంతటి అద్భుత భావములున్న ఈ అమ్మాయిని నీవు ఏమి చేయాలనుకుంటున్నావు? అంటే “నీవు ఆమె బాధను తొలగించాలనుకుంటున్నావా లేక పెంచాలనుకుంటున్నావా?” అని అర్థము.

రెండవ పాశురము: “నీవు అన్ని విధాలుగా ఆమె రక్షకుడవు, కానీ ఆమె యొక్క ఈ స్థితి ఎటువెళుతుంది దేనికి దారితీస్తుంది?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి ప్రశ్నిస్తుంది.

ఎన్‌ శెయ్గిన్ఱాయ్ ఎన్‌ తామరై క్కణ్ణా  ఎన్నుం కణ్ణీర్‌ మల్గ ఇరుక్కుం
ఎన్‌ శెయ్గేన్ ‌ ఎఱినీర్‌ త్తిరువరంగత్తాయ్ ‌ఎన్నుం వెవ్వుయిర్ త్తుయిర్తురుగుం
మున్‌ శెయ్ద వినైయే ముగప్పడాయ్‌ ఎన్నుం ముగిల్వణ్ఞా తగువదో ఎన్నుం
మున్‌ శెయ్దివ్వులగం ఉండుమిళ్ న్దళందాయ్‌ ఎంగొలో ముడిగిన్ఱాదివట్కే

“అనంతమైన ఆకర్శణ ఉన్న దివ్య నేత్రములు ఉన్న ఓ భగవానుడా! నేను కేవలము నీ కోసమే ఉన్నాను, నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావు?” అని కంటినిండా కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతుంది. “ఎత్తైన అలలు వచ్చే నీటి సంపద ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో నివసించే ఓ భగవానుడా! నేను ఏమి చేయాలి?” ఆమె మళ్ళీమళ్లీ పదేపదే ఊపిరి పీల్చుకొని లోపల ఆ వేడిలో ఆమె కరిగిపోతుంది; తాను చేసుకున్న గత కర్మలు తన ముందుకి ఇలా వాచ్చి బాధిస్తున్నాయి అని అంటుంది; భూమికి నీటికి మధ్య తేడా చూపకుండా వర్షాన్ని కురిపించే మేఘమువంటి ఔన్నత్యముగల ఓ భగవానుడా! నా ముందు ప్రత్యక్షము కాకుండా ఉండటం నీ ఔన్నత్యానికి సరిపోతుందా?” అని ప్రశ్నిస్తుంది. మొదట ప్రపంచాలని సృష్టించి, ఆపై మ్రింగి, తరువాత ఉమ్మి, కొలిచి స్వీకరించిన ఓ భగవానుడా! ఆమె కథను ఎలా ముగుస్తావు? అంటే – “ఆమె ఈ బాధను దూరం చేయడానికి, నీ సంరక్షణలోకి తీసుకుంటావా లేక బయటకి నెట్టివేస్తావా?” అని అర్థము.

మూడవ పాశురము:  “నీ భక్తుల శత్రువులను నాశనము చేయుటకు ఎన్నో అవతారాలు ఎత్తిన  భక్త వత్సలుడువని కీర్తిస్తారు నిన్ను, ఆమె ఈ స్థితికి రావడానికి నీవు ఆమెను ఏమి చేశావు?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి అడుగుతుంది.

వట్కిలళ్‌ ఇఱైయుం మణివణ్ణా ఎన్నుం వానమే నోక్కుం మైయాక్కుం
ఉట్కుడై అశురర్‌ ఉయిర్‌ ఎల్లాం ఉండ ఒరువనే ! ఎన్నుం ఉళ్ళురుగుం
కట్కిలీ  ఉన్నై క్కాణుమాఱరుళాయ్‌ కాగుత్తా కణ్ణనే! ఎన్నుం
తిట్కొడి మదిళ్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్‌ ఇవళ్ తిఱత్తెన్‌ శెయ్దిట్టాయే?

నా కూతురు తన ఈ స్థితికి కొంచెం కూడా సిగ్గు పడట్లేదు; ఆమె “ఆకాశం వైపు చూస్తూ  అకస్మాత్తుగా మూర్చపోతుంది”, “అహంకారంతో నిండిన రాక్షసుల ప్రాణాలను మింగిన ఓ భగవానుడా! ” అంటూ ఆమె తనలో తాను క్రుంగిపోయింది; “ఈ కళ్ళకి కనబడుట కష్టమైన ఓ భగవానుడా! దయతో నీవు నాకు కనిపించేలా చేయి”;  “పుంసాం దృష్ఠి చిత్తాపహారిణం”, “దద్రుశుః విస్మితాకారాః” అని చెప్పినట్లుగా, దశరథ పుత్రునిగా అవతరించి నగర అరణ్య వాసులకు దర్శనమీయలేదా?”, “తాసాం అవిరభూత్“? అని చెప్పినట్లుగా కృష్ణుడిగా నీ సౌందర్యాన్ని గోపికలకి ప్రదర్శించలేదా?”.  బలమైన ధ్వజాలతో ఉన్న కోటలు చుట్టూ వ్యాపించి ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో వాసమున్న ఓ భగవానుడా! నీవు ఆమెను ఏమిచేశావు, ఆమె ఇంత బాధను అనుభవిస్తుంది?” అని ఆమె తల్లి ప్రశ్నిస్తుంది.

నాలుగవ పాశురము:  “మీ దయతో ఈమెను ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి పెరియ పెరుమాళ్ళని అభ్యర్థిస్తుంది.

ఇట్టకాల్‌ ఇట్ట కైగళాయ్‌ ఇరుక్కుం ఎళున్దులాయ్ మయంగుం కై కూప్పుం
కట్టమే కాదల్‌ ఎన్ఱు మూర్చ్చిక్కుం కడల్వణ్ణా | కడియై కాణ్‌ ఎన్నుం
వట్ట వాయ్‌ నేమి వలంగైయా ఎన్నుం వందిడాయ్‌ ఎన్ఱెన్ఱే మయంగుం
శిట్టనే! శెణు నీర్‌ త్తిరువరంగత్తాయ్‌ ! ఇవళ్ తిఱత్తెన్‌ శిందిత్తాయే?

నా కూతురికి కాళ్ళు చేతులు ఆడట్లేదు; స్పృహ తిరిగి వచ్చిన తరువాత, ఆమె లేచి నిలుచొని కొంత నడిచి తరువాత మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది; నమస్కారము పెడుతుంది; కలవరంగా “ఈ ప్రేమను భరించడం కష్టం” అని చెప్పి కలత చెందుతూ మళ్ళీ ఆమె స్పృహ కోల్పోతుంది; “ అన్నింటినీ జాగ్రత్తగా  తనలో భద్రపర్చుకునే,  కొలతకు అందని మహా సాగరము లాంటివాడా! నీవు నా పట్ల అతి క్రూరంగా వ్యవహరిస్తున్నావు!”, “ కుడి హస్థంలో దివ్య చక్రాన్ని ధరించిన ఓ భగవానుడా!” అని అంటూ పదే పదే “నీ దివ్య చక్రముతో ఇక్కడికి రా” అని ఆమె అతడిని పదేపదే అభ్యర్థిస్తోంది, “అతడిని పదేపదే పిలవడం వల్ల నేను నా స్వభావాన్ని కోల్పోయాను, అతడు రాకపోయేసరికి నా కోరిక కూడా నశించిపోయింది” అని ఆలోచిస్తూ ఆమె మతి బ్రమించిపోయింది”; ” ఆహ్లాదకరమైన నది ఒడ్డున శయనించి మహోన్నతుడివిగా నటిస్తున్న ఓ భగవానుడా! ఆమె విషయంలో నీవు ఏమి ఆలోచించావు?” అని ఆ తల్లి మొరపెట్టుకుంటుంది. అంటే –  “నీవు ఆమెను భ్రమలోనే ఉంచాలనుకుంటున్నావా లేక ఆమెను ఉద్దరించాలనుకుంటున్నావా?” అని అర్థము.

ఐదవ పాశురము: పరాంకుశ నాయకి యొక్క తల్లి తన కూతురు ప్రతి క్షణం మారుతున్న ఆమె పరివర్తనలను గురించి తెలుపుతూ “ఈ విధంగా ఆమెను బాధపెట్టుట ‘ఆశ్రిత వత్సలుడు’ అన్న నీ బిరుదుకి సరిపోతుందా?” అని ప్రార్థిస్తుంది.

శిందిక్కుం తిశైక్కుం తేఱుం కై కూప్పుం తిరువరంగత్తుళ్ళాయ్‌ ఎన్నుం
వందిక్కుం ఆంగే మళైక్కణ్ణీర్‌ మల్గ వందిడాయ్‌ ఎన్ఱెన్ఱే మయంగుం
అందిప్పోదవుణన్‌ ఉడల్‌ ఇడందానే! అలై కడల్‌ కడైంద ఆరముదే!
శందిత్తున్‌ శరణం శార్వదే వలిత్త తైయలై మైయల్‌ శెయ్ధనే

సంధ్యాసమయములో హిరణ్యుని శరీరాన్ని చీల్చి వేశావు, అలాగే పెద్ద పెద్ద అలలు వచ్చేలా సముద్రాన్ని చిలికిన ఓ భగవానుడా! కేవలము నీ చరణాలనే పొంది ఆనందించాలని తపించి పోతున్న చక్కటి స్వరూపమున్న ఈ అమ్మాయిని భ్రమ పెట్టావు. ఇంతకు ముందు నీవు ఆమెతో ఎలా ఐక్యమయ్యావో తలచుకొని, కలవరపడి తిరిగి ఆత్మ నిగ్రహం పొంది నమస్కారము చేస్తుంది; “ఓ శ్రీరంగవాసుడా!” అని ఆర్తితో పిలుస్తూ ఆమె తన తల వంచుకుంటుంది; అక్కడే ఉండి, చల్లటి కన్నీళ్లతో నిండిన కళ్ళతో, “వచ్చి నన్ను స్వీకరించు” అని పదేపదే అంటూ స్పృహతప్పి పడిపోతుంది. అంటే భగవానుడికి సంబంధించి ఆమె పడుతున్న విరహ వేదన యొక్క రకరకాల పరివర్తనలను సూచిస్తుంది.

ఆరవ పాశురము:  “మీ భక్తులను రక్షించడానికి అవసరమైన ఆయుధాలు నీ వద్ద ఉన్నప్పటికీ  నా కుతురిని బాధపెట్టావు, నేను ఆమె కోసం ఏమి చేయాలో నీవే చెప్పుము”. అని పరాంకుశ నాయకి యొక్క తల్లి ప్రార్థిస్తుంది.

మైయల్‌ శెయ్దున్నై మనం కవర్ న్దానే ! ఎన్నుం మామాయనే ! ఎన్నుం
శెయ్య వాయ్‌ మణియే! ఎన్నుం తణ్‌ పునల్‌ శూళ్ ‌తిరువరంగత్తుళ్ళాయ్‌ ఎన్నుం
వెయ్య వాళ్‌ తండు శంగు చక్కరం విల్ ‌ఏందుం విణ్ణోర్‌ ముదల్‌! ఎన్నుం
పై కొళ్‌ పాంబణైయాయ్‌ ! ఇవళ్‌ తిఱత్తరుళాయ్‌  పావియేన్‌ శెయఱ్పాలదువే

“నా హృదయాన్ని దోచి నన్ను పిచ్చిదానిని చేసిన ఓ భగవానుడా!”, “ఎర్రటి పండు వంటి అధరములు కలిగినవాడా! విలువైన రత్నము వలే సులువుగా చేతిలోకి తీసుకోగలిగేవాడా!”,”అందమైన నీటి వనరులతో చుట్టుముట్టబడిన శ్రీరంగంలో నివాసమున్న ఈ భగవానుడా!”; ఆమె “శరణాగతుల రక్షణ కొరకు క్షణం కూడా ఆలస్యము కాకూడదని సర్వదా నీ పంచ దివ్యాయుధాలను ధరించి ఉండువాడా!”;  “నిత్యసూరుల ఉనికికి కారణమైన వాడా!”, “తిరు అనంతుడు తన శయ్యగా ఉన్నవాడా!” అని నిన్ను కీర్తిస్తుంది. “నేను చేసుకున్న పాపాల కారణంగా నా బిడ్డ యొక్క ఈ దారుణమైన స్థితిని నేను చూడాల్సివస్తుంది”. “దయచేసి  ఆమె గురించి నీవు ఏమనుకుంటున్నావో తెలుపుము” అని ఆ తల్లి ప్రార్థిస్తుంది.

ఏడవ పాశురము:  “తన భక్తుల రక్షణ కొరకై క్షీర సాగరములో శయనించి ఉన్నాడు, అని భగవానుడి అనేక గుణాలను వేదనతో నా బిడ్డ కీర్తిస్తుంది” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి తెలియజేస్తుంది.

పాల తున్బంగళ్‌ ఇన్బంగళ్‌ పడైత్తాయ్‌ పఱ్ఱిలార్ పఱ్ఱ‌ నిన్ఱానే!
కాల శక్కరత్తాయ్‌ ! కడల్‌ ఇడం కొండకడల్వణ్ణా ! కణ్ణనే ! ఎన్నుం
శేల్‌ కొళ్‌ తణ్‌ పునల్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్‌! ఎన్నుం ఎన్‌ తీర్తనే! ఎన్నుం
కోల మా మళైక్కణ్‌ పని మల్గ ఇరుక్కుం ఎన్నుడై క్కోమళ క్కొళుందే

సన్నని తీగలాంటి సున్నిత స్వభావం ఉన్న నా కూతురు ఇలా అంటుంది: “నీవు ప్రతి చోట శరణాగతి చేసినవారికి సుఖాలు శరణాగతి చేయనివారికి దుఃఖాలను కలిగించావు; ఆశ్రయించిన వారికి ఆశ్రితుడివిగా, నీ పట్ల ప్రపత్తులు లేని జయంత వంటి  వారికి కూడా ఆశ్రయం కలిపించిన వాడవు. కాల చక్రాన్ని నియంత్రించువాడా! దివ్య క్షీర సముద్రంలో శయనించి ఉన్న నీ విశాల దివ్య స్వరూపము, ఒక మహాసాగరము మరొక మహాసాగరముపైన శయనించి ఉన్నట్లున్నది;  భక్త రక్షణకై కృష్ణుడిగా అవతరించినవాడా! చేపలతో నిండి ఉన్న  చల్లని కావేరి నీటితో చుట్టుముట్టబడిన కోయిల్ (శ్రీరంగం) లో కొలువై ఉన్నవాడా! నీవు నాకు సులువుగా మునక వేయడానికి వీలైన  పవిత్ర నదీ తీరము వంటి వాడవు!” అని కీర్తిస్తుంది. ఆమె తన అందమైన కళ్ళలో కన్నీళ్లను నింపుకొని అలా నిచ్చేష్ఠురాలై నిలిచి ఉంటుంది.

ఎనిమిదవ పాశురము:  “నా కూతురిపైకి వచ్చిన ఈ ఆపదకి పరిష్కారము నేనెలా తీసేది?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి అంటుంది.

కొళుందు వానవర్గట్కు!  ఎన్నుం కున్ఱేంది క్కోనిరై కాత్తవన్‌ | ఎన్నుం
అళుం తొళుం ఆవి అనల వెవ్వుయిర్కుం అంజన వణ్ణనే! ఎన్నుం
ఎళుందు మేల్‌ నోక్కి ఇమైప్పీలళ్‌ ఇరుక్కుం ఎంగనే నోక్కుగేన్?‌ ఎన్నుం
శెళుం‌ తడం పునల్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్ ! ఎన్‌ శెయ్గేన్‌ ఎన్‌ తిరుమగట్కే

“అతడు నిత్యసూరులకు అధిపతి” అని నా బిడ్డ వర్ణిస్తుంది; ” గోవులను రక్షించడానికి పర్వతాన్ని ఎత్తి అతిమానుషమైన పనులు చేసినవాడా!” అని భక్తిలో మునిగిపోయిన వారిలా ఆమె కన్నీటి కళ్ళతో అలా ఉండిపోతుంది; ఆమె శరణాగతులవలే చేతులు జోడించి నమస్కరిస్తుంది; వేడి ఊపిరిని పీల్చుకొని ఆమె దహించలేని ఆత్మను దహించివేయాలనే ప్రయత్నము చేస్తుంది. “ఓ నన్ను వేదిస్తున్న నల్లనివాడా!” అని అంటూ లేచి నిలబడుతుంది, ఏమీ తోచక అలా కళ్ళ రెప్ప వార్చకుండా చూస్తూ నిలుచుంటుంది!”; “నేను ఎలా చూస్తాను?” అని అంటుంది.  ఓహ్, విశాల మనోహరమైన నీటి సరస్సులతో చుట్టుముట్టబడి ఉన్న కోయిల్ (శ్రీరంగం) వాసా! లక్ష్మితో పోల్చదగిన నా కుమార్తెని నేను ఏమి చేయాలి? తనకి బాధ కలిగించే ఆమె ప్రేమను నేను నియంత్రించగలనా? లేదా రాని నిన్ను వచ్చేలా చేయగలనా? రెండూ అసాధ్యమని సూచిస్తుంది.

తొమ్మిదవ పాశురము:  “లక్ష్మీ దేవి, భుదేవి, నీళా దేవి యొక్క దివ్య పతి అయిన నీకు ఆకర్షితురాలై అమితమైన ప్రేమను పెంచుకున్న ఆమె కోరికను, నేనెలా తీర్చగలను” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి తన వేదనను తెలుపుకుంటుంది.

ఎన్‌ తిరుమగళ్‌ శేర్‌ మార్బనే! ఎన్నుం ఎన్నుడై అవియే! ఎన్నుం
నిన్‌ తిరువెయిఱ్ఱాల్ ఇడందు నీ కొండ నిలమగళ్‌ కేళ్వనే ! ఎన్నుం
అన్ఱురువేళుం తళువి నీ కొండ ఆయ్మగళ్‌ అన్బనే ! ఎన్నుం
తెన్‌ తిరువరంగం కోయిల్‌ కొండానే! తెళిగిలేన్‌ ముడివివళ్‌ తనక్కే

“మహా లక్ష్మి నీలో ఐక్యమై ఉండాలని తన నివాస స్థలముగా ఏంచుకున్న ఆ దివ్య వక్షస్థలము కలిగి ఉన్న ఓ భగవానుడా!”, “నీ దివ్య కోరలతో తవ్వి శ్రీ భూమి పిరాట్టిని వేలికి తీసి నీ ప్రియమైన పత్నిగా స్వీకరించిన ఓ భగవానుడా!”, అని ఆర్తితో నిన్ను పొగుడుతుంది. “నీకోసము నీతో సరిపోలిన వంశంలో అవతరించిన నప్పిన్నై పిరాట్టిని స్వీకరించి ఒక నిధిలా ఆమెను నీ వద్ద దాచుకున్న ఓ భగవానుడా!”, అని నా బిడ్డ నిన్ను వర్ణిస్తుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన శ్రీరంగ క్షేత్రాన్ని నీ నివాసంగా స్వీకరించిన ఓ భగవానుడా!”. ఆమె బాధకి మందు ఏదో నాకు అంతుచిక్కట్లేదు.

పదవ పాశురము: తమకు తాము ప్రభువుగా భావించే దేవతలకు అంతరాత్మగా ఉండే సర్వేశ్వరుడు, ఆమే పడుతున్న బాధను గమనించి, అతిలోక సుందరుడు మరియు అతి సౌశీల్యుడు అయిన భగవానుడు విరహముతో బాధపడుతున్న ఆమెకు బాహ్య అనుభవాన్ని ప్రసాదిస్తారు. దీనితో పరాంకుశ నాయకి విశ్వాసాన్ని పొందుతుంది; ఇది చూసిన ఆమె తల్లి సంతృప్తి చెందుతుంది.

ముడివు ఇవళ్‌ తనక్కొన్ఱఱిగిలేన్‌ ఎన్నుం మూవులగాళియే!  ఎన్నుం
కడికమళ్‌ కొన్ఱై చ్చడైయనే ! ఎన్నుం నాన్ముగ క్కడవుళే! ఎన్నుం
వడివుడై వానోర్‌ తలైవనే ! ఎన్నుం వణ్‌ తిరువరంగనే ! ఎన్నుం
అడి యడైయాదాళ్‌ పోలివళ్‌ అణుగి అడైందనళ్ ముగిల్వణ్ణన్‌ అడియే

“దీనికి పరిష్కారమేమిటో నాకు తెలియదు” అని ఆమె అంటూ, ఇంద్రుని అంతరాత్మగా ముల్లోకాలకి (భూః, భూవః, సువః) అధిపతి అయిన ఓ భగవానుడా!”, అని నీ గురించే తలచుచూ “రేల పూలతో అలంకరించబడిన జటాజూటాన్ని ధరించిన రుద్రని అంతరాత్మగా ఉన్నవాడా!”, “చతుర్ముఖ బ్రహ్మలో అంతరాత్మగా ఉన్న ఓ భగవానుడా!”, “నీకు పోలిన స్వరూపము కలిగి ఉన్న నిత్యసూరులకు ప్రభువుగా ఉన్న ఈ భగవానుడా!”, “కోయిల్ (శ్రీరంగం) వంటి మహాక్షేత్రాన్ని ఏలే వాడా!” అని నిన్ను కీర్తిస్తుంది. నేల నీళ్ళకి తేడా చూపకుండా వర్షాన్ని కురిపించే నీల మేఘ స్వరూపుడైన భగవానుడి దివ్య పాదాలను చేరుకోలేదని అనిపించిన నా కూతురు, అతడి కృపతో అతడి దివ్య పాదాలను చేరుకుంది.

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని పఠించే వారు నా లాంటి హింసకు గురికాకుండా, పరమపదము చేరుకుంటారు, అక్కడ నిత్యసూరుల సమూహములో   అనంతమైన పరమానందంతో చిరకాలము ఉంటారు”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

ముగిల్వణ్ణన్‌ అడియై అడైందరుళ్‌ శూడి ఉయ్‌ందవన్ మొయ్‌ పునల్‌ పొరునల్
తుగిల్‌ వణ్ణ త్తూనీర్‌ చ్చేర్ ప్పన్‌ వణ్‌ పొళిల్‌ శూళ్‌ వణ్ కురుగూర్ చ్చడగోపన్
ముగిల్వణ్ణన్‌ అడిమేల్‌ శొన్న శొల్‌ మాలై ఆయిరత్తిప్పత్తుం వల్లార్
ముగిల్‌ వణ్ణ వానత్తిమైయవర్‌ శూల ఇరుప్పర్‌ పేరిన్బ వెళ్ళత్తే

స్వచ్ఛమైన నీటితో సమృద్ధిగా నిండి ఉన్న దివ్య తామ్రపరిణి నది  దివ్య పీతాంబర వస్త్రములా మెరుస్తుంది; చుట్టూ పూలు తేనెలు మొదలైన అనేక తోటలతో అనంత సుసంపన్నమైన ఆళ్వార్తిరునగరి, ఈ నది ఒడ్డున ఉంది; అటువంటి ఆళ్వార్తిరునగరికి నాయకుడు నమ్మాళ్వార్లు, నీలమేఘము వలే ఉదార స్వరూపుడైన పెరియ పెరుమాళ్ళ దివ్య తిరువడిని పొంది విముక్తులైనారు. వారు పాడిన వేయి పాశురముల పదమాలలో  ఈ పదిగాన్ని మేఘ సౌందర్యము కలిగి ఉన్న పెరియ పెరుమాళ్ళ దివ్య చరణాలపై పాడారు; నిష్ఠతో ఈ దశకాన్ని అనుసంధానము చేసినవారు నీల వర్ణములో ఉన్న అనంతమైన ఆనంద సాగరము పరమపదములో నిత్యసూరుల మధ్య  ఉంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-7-2-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment