కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 1.2 – వీడుమిన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

1-1 ఉయర్వఱ

sriman narayanan-nanmazhwar

భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని పూర్తిగా ఆస్వాదించిన పిదప, ఆళ్వార్ ఈ పదిగంలో ఆ భగవానుడిని పొందే మార్గాలను వివరించడం ప్రారంభిస్తున్నారు. తాను అనుభవించిన విషయం యొక్క గొప్పతనం కారణంగా, ఆళ్వార్ ఇతరులతో ఆ విషయాన్ని పంచుకోవాలనుకొని ఈ సంసారులవైపు చూస్తే, వాళ్ళు  ప్రాపంచిక విషయాలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. గొప్ప దయతో వాళ్ళకి సహాయం చేయాలనుకున్నారు. భౌతిక ఆసక్తి  వదులుకోవాలని, భగవాన్ పట్ల భక్తిని పెంచుకోవాలని వాళ్ళకి బోధించారు.

మొదటి పాశురము:  భౌతికాంశాల పట్ల అనుబంధము వదులుకోవాల్సిన కనీస అవసరం ఉన్న మనకి, భగవానుడికి ఆత్మ సమర్పణం చేయమని ప్రతి ఒక్కరినీ నమ్మాళ్వార్  ఆదేశిస్తున్నారు.

వీడుమిన్ ముఱ్ఱవుం వీడు శెయు ఉమ్ముయిర్
వీడుడై యానిడై  వీడు శెయ్‌మ్మినే‌

భగవత్ ఆరాధనకి అడ్డంకులుగా ఉన్న స్వార్థపు మార్గాలన్నీ వదిలి వేయండి. వదిలిన తరువాత, మోక్షాన్ని అనుగ్రహించగల ఆచర్యులను ఆశ్రయించి తమను తాము సమర్పించుకోండి.

రెండవ పాశురము: తరువాత, పరిత్యాగము (వదలడం) సులభతరం చేయడానికి, క్షణభంగురమైన అల్ప అంశాలను త్యాగము చేయమని నమ్మాళ్వార్ బోధిస్తున్నారు.

మిన్నిన్ నిలైయిల మన్నుయిర్ ఆక్కైగళ్
అన్నుం ఇడైత్తు ఇఱై ఉన్నుమిన్ నీరే

జీవాత్మ అనేకానేక శరీరాలను ధరిస్తాడు. కానీ ఈ శరీరాలన్నీ ఎంత అస్థిరమైనవంటే, వాటి జీవితం ఒక మెరుపు మెరిసి అలా మాయమైపోయినంత కాలము కూడా ఉండవు, అలా కనిపించి అదృశ్యమైపోతాయి. ఇది గమనించి మీరు క్షణం ఆలస్యము చేయకుండా మహోన్నతుడైన ఆ భగవానుడిని ధ్యానించండి.

మూడవ పాశురము: పరిత్యాగ క్రమాన్ని ఇక్కడ కృపతో నమ్మాళ్వారులు సంక్షిప్తంగా వివరిస్తున్నారు.

నీర్‌ నుమ దెన్ఱివై  వేర్‌ ముదల్‌ మాయ్‌త్తు ఇఱై
శేర్మిన్ ఉయిర్‌క్కు అదనేర్‌ నిఱై ఇల్లే

అహంకర మమకారాలను వదలి ఆచర్యులను ఆశ్రయించండి. జీవాత్మకి తగినది అంతకన్నా మరొకటి లేదు.

నాలుగవ పాశురము:  భౌతిక ఆసక్తిని విడిచి పెట్టిన తరువాత, భగవానిడి విభిన్న విలక్షణ స్వరూపాల ఆరాధనను  నమ్మాళ్వారులు సంక్షిప్తంగా వివరిస్తున్నారు.

ఇల్లదుం ఉళ్ళదుం అల్లదవన్ ఉరు
ఎల్లియిల్‌ అన్నలం పుల్గు పఱ్ఱే

నిత్యమైన  చిత్ (చేతనులు) లకి,  నిరంతరం వివిధ రూపాల్లో మారుతూ ఉన్న అచిత్ (అచేతనులు) లకి భిన్నమైనవాడు భగవానుడు. కాబట్టి, ఇతర అల్ప భౌతికాంశాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టిన తరువాత, ఆనంద స్వరూపుడైన భగవానుడిని భక్తితో ఆశ్రయించండి.

ఐదవ పాశురము: ఆరధ్యనీయుడైన భగవానుడిని పొందడము మనకి అత్యంత సముచితమైన లక్ష్యం అని నమ్మాళ్వారులు  వివరిస్తున్నారు.

అఱ్ఱదు పఱ్ఱెనిల్‌ ఉఱ్ఱదు వీడుయిర్
శెఱ్ఱదు మన్నుఱిల్ అఱ్ఱిఱై  పఱ్ఱే

‌భగవత్ విషయాలు కాని వాటిపైన ఆసక్తి తగ్గినప్పుడు, ఆత్మ  మోక్షము (కైవల్య [సంసారం నుండి విముక్తి పొందడం మరియు తనను తాను ఆనందించడం]) పొందేందుకు అర్హత పొందుతుంది. కైవల్య మోక్ష ఆలోచన తొలగడానికి, మిగతా వాటి పట్ల అనుబంధాన్ని త్యజించడానికి, భగవానుడితో దృఢంగా నిమగ్నమవ్వడానికి ఆ పరమేశ్వరుడికి తమను తాము సమర్పించుకోవాలి.

ఆరవ పాశురము: భగవానుడికి అందరి పట్ల ఉన్న సమతుల్యత భావాన్ని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు.

పఱ్ఱిల నీశనుం ముఱ్ఱవుం నిన్ఱనన్
పఱ్ఱిలైయాయ్‌  అవన్ ముపఱ్ఱిల్‌ అడంగే

‌అతను సర్వేశ్వరుడు అయినప్పటికీ, తన దివ్య పత్నులను, నిత్యాసూరులను  నిత్యము తనతో ఉండే ముక్తులను (ఇప్పటికే అతనితో చేరి ఉన్నవారు) విడిచిపెట్టి, అతను మనకోసం(కొత్తగా అతనిని సమీపించేవారు) అభిముఖుడై ఉండి, ఆయనను నిలబెట్టేది, పోషించేది మరియు ఆనందం కలిగించేది మనమే అని అయన పరిగణిస్తారు.  మీరు కూడా ప్రాపంచిక అనుబంధాలను వదలి, ధారకుడు పోషకుడు భోగ్యుడు అన్న అతడి గుణాలను పరిగణనలోకి తీసుకొని అతని యందు ధ్యానించండి. 

ఏడవ పాశురము: భగవానుడి సంపదను (ఉభయ విభూతి) చూసి సిగ్గు పడి దూరంగా ఉండే బదులు, భగవాన్ మరియు ఉభయ విభూతుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకొని, తాను ఆ భగవత్సంపదలో కొంత భాగమని అర్థం చేసుకోవాలని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు.

అడంగెళిల్‌ శమ్బత్తు అడంగ క్కండు ఈశన్
అడంగెళిల్‌ అహ్ తెన్ఱు  అడంగుగ ఉళ్ళే

అతి సుందరమైన అతడి సంపదపై ధ్యానించడం (ఇందులో ఒక్క వస్తువును కూడా వదలకుండా ప్రతిదీ అతడి సంపదే), ప్రతిదీ అందంగా అతడి అధీనములో ఉందన్న సత్యాన్ని తెలుసుకోవడం, పరస్పర సంబంధాన్ని తెలుసుకోవడం కూడా ఈ సంపదలో భాగమౌతుంది. ఒక సారి మన యదార్థ సంబంధాన్ని అర్థం చేసుకున్న తర్వాత, మనము అతడి సంపద / ఆస్తిలో భాగమైపోతాము.

ఎనిమిదవ పాశురము: భగవానుడిని ఆరాధించే/సేవిచే విధానాన్ని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు.

ఉళ్ళం ఉరై శెయల్ ఉళ్ళ ఇమ్మూన్ ఱైయుం
ఉళ్ళి కెడుత్తు ఇఱై ఉళ్ళిల్ ఒడుంగే

మనకి అతి సులువుగా లభ్యమైన మన మనస్సు, వాక్కు, శరీరం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం, ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తిని వదిలి, మనకి తగినవాడైన భగవాన్ అధీనుడై ఉండాలి.

తొమ్మిదవ పాశురము: భగవానుడిని ఆరాధించడం వల్ల తొలగే అడ్డంకుల నివారణ గురించి నమ్మాళ్వార్  వివరిస్తున్నారు.

ఒడుంగ అవన్ కణ్ ఒడుంగలుం ఎల్లాం
విడుం పిన్నుం ఆక్కై విడుం పొళుదు ఎన్ఱే

భగవానుడికి శరణాగతి చేసిన తరువాత అజ్ఞానము తొలగి ఆత్మ  జ్ఞానం వికసిస్తుంది.  ఆ తరువాత, తానను తాను భగవానుడికి సమర్పించుకొని ఈ శరీరము విడిచిన తరువాత నిత్య కైంకార్యాన్ని ప్రసాదించమని వేడుకోవచ్చు.

పదవ పాశురము: నమ్మాళ్వార్ మనకి పరమ లక్ష్యమైన ఎంబెరుమాన్ యొక్క సంపూర్ణ స్వరూపాన్ని గురించి వివరిస్తున్నారు.

ఎణ్‌ పెరు క్కన్న లత్తు ఒణ్‌ పారుళ్‌ ఈఱిల
వణ్‌ పుగళ్‌ నారణన్ తిణ్‌ కళల్‌ శేరే

అనంత కోటి జీవాత్మలకి అధిపతి నారాయణుడు, శుద్ద మంగళ గుణాలు కలిగి ఉన్న ఆనంద స్వరూపుడు. అతడికి లెక్కలేనన్ని మంగళ గుణాలు ఉన్నాయి. నారాయణ అని పిలువబడే ఆ స్వామి పాద పద్మాల యందు శరణాగతి చేయండి.

పదకొండవ పాశురము:  మొత్తం ప్రబంధంలో ఈ తిరువాయ్మొళి (పదిగం) యొక్క అతి అద్భుత స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే ఫలితం అని నమ్మాళ్వార్ తెలుపుతున్నారు.

శేర్‌త్తడ తెన్కురుగూర్‌ చ్చడగోబన్ శొల్
శీర్‌ త్తొడై ఆయిరత్తు ఓర్‌త్త ఇప్పత్తే

సుందరమైన సరోవరాలతో అలంకరించబడి ఉన్న ఆళ్వార్తిరునగరి యొక్క నమ్మాళ్వార్ల మనకి చక్కటి ఈ వేయి పాశురముల ప్రబంధ రూపములో అందమైన భావార్థములతో ఈ పదిగాన్ని మనకి అనుగ్రహించింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-1-2-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment