తిరుమాలై – తనియన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుమాలై

సంపూర్ణ క్రమం

Mandangudi Thondaradipodi Azhwar-003

తొండరడిపొడి ఆళ్వార్లు తిరుమాలై ప్రబంధాన్ని అనుగ్రహించారు . అందులో 45 పాశురాలు ఉన్నాయి. ముందుగా ఈ ప్రబంధానికి తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానాన్ని చూద్దాం .

తిరువరంగపెరుమాళ్ అరయర్ అనుగ్రహించిన తనియన్:

మత్తోన్ఱుమ్ వేణ్డామనమే|మదిళరజ్ఞర్ |

కత్తినమ్ మేయ్ త్త | కళలిణైకీళ్ |ఉత్త

తిరుమాలై పాడుమ్ శీర్ | తొండరడిపొడి ఎన్నుమ్

బెరుమానై|ఎప్పోళుదుమ్ పేశు||

ప్రతిపదార్థము:

మనమే = ఓ మనసా

మదిళరజ్ఞర్ = సప్తప్రాకారములతో కూడిన కోయిల్ లో వేంచేసిఉన్నశ్రీరంగనాధుడు

కత్తినమ్ = పాలనిచ్చేవయసులో ఉన్న పశువులను

మేయ్ త్త = కాసినవాడూ అయిన శ్రీరంగనాధుడి

కళలిణైకీళ్ = శ్రీపాదల దగ్గర

ఉత్త శీర్ = అసాధారణమైన భక్తి, ప్రపత్తిగల

తొండరడిపొడి = తొండరడిపొడి అనే పేరుగల

ఎన్నుమ్బెరుమానై = మాస్వామిని (మా ఆచార్యుని) గురించి

ఎప్పోళుదుమ్ = ఎప్పుడు.

పేశు = మాట్లాడు

మత్తొన్ఱుమ్ వేణ్డా = ఇతరవిషయలేవి మట్లాడవద్దు

భావము

తొండరడిపొడి ఆళ్వార్లను తప్ప ఇతర విషయాలేవీ మట్లాడకూడదని తిరువరంగ పెరుమాళ్ అరయర్ తన మనసును అదేశించారు. దానికి మనసు ‘ఎందుకలా చేయాలి?’ అని ప్రశ్నించింది. పాలనిచ్చే పశువులను  కాసినవాడు ఇక్కడ సప్తప్రాకరములతో కూడిన కోయిల్ లో వేంచేసి ఉన్నశ్రీరంగనాధుడే. అయన శ్రీపాదల మీద  అపారమైన భక్తి, ప్రపత్తి గల మాస్వామి(మా ఆచార్యుని) అయిన తొండరడిపొడి ఆళ్వార్లను గురించి మాత్రమే స్మరించు మానసా! అన్నారు తిరువరంగ పెరుమాళ్ అరయర్

వ్యాఖ్యానము:

మత్తోన్ఱుమ్ వేణ్డా :

మత్తోన్ఱుమ్ వేణ్డా…. అంటే ఇతర విషయాలు ఏవి వద్దు అని అర్థం. ఇక్కడ బ్రహ్మ, శివ, ఇంద్రాది అన్య దేవతా ప్రార్థన అని మాత్రమే అర్థం కాదు. పరమాత్మ ఇతర రూపాలైన పర, వ్యూహ, విభవ, అంతర్యామిని కూడా స్మరించవద్దు. ఇంకా భగవన్నామ సంకీర్తన కూడా చేయవద్దు. కేవలం ఇష్టప్రాప్తిని గురించి మాత్రమే స్మరించు అని తిరువరంగ పెరుమాళ్ అరయర్ మనసుకు చెప్పారు. మరి ఏది ఇష్టప్రాప్తి అంటే భాగవత కైంకర్యం, వారి నామ సంకీర్తన మాత్రమే ఇష్ట ప్రాప్తి. భగవత్కైంకర్య పరులు ప్రధమ కైంకర్యనిష్ట పరులు. భాగవత కైంకర్యం చరమ కైంకర్య పరులు అర్దాత్ భాగవతకైంకర్య నిష్టాపరులు చివరిమెట్టులో నిలిచినవారు .

మనమే:

లౌకిక విషయాలలో పట్టును కలిగి ఉండటానికి, వదిలించు కోవటానికి కూడా మనసే కారణము. అందుకే అరయర్ స్వామి లౌకిక విషయాలను, అభాస బంధుత్వాలను వదిలించు కోవాలని  మనసుకే చెపుతున్నారు.

మదిళరజ్ఞర్:

తిరుమంగై ఆళ్వార్లు కట్టించిన సప్తప్రాకరముల మధ్య ఆనందంగా కొలువైవున శ్రీరంగనాధుడు .

కత్తినమ్ మేయ్ త్త | కళ లిణై కీళ్ |ఉత్త తిరుమాలై పాడుమ్ :

ఈ శ్రీరంగనాధుడే అప్పుడు పశువులను మేపినవాడు అని అరయర్ స్వామి అంటున్నారు.

తొండరడిపొడి ఆళ్వార్లు శ్రీరంగనాధుడిని తిరుమాలై ప్రబంధంలో మూడుసార్లు  (9,36, 45దవ పాశురాలలో) శ్రీకృష్ణునిగానే భావించి పాడారు.

కళలిణై కీళ్ :

‘కళలిణై’‘ అంటే శ్రీపాద ద్వయాలు. శ్రీరంగనాధుడి శ్రీపాదాలనే అయన స్వరూపంగా, తన సర్వస్వంగా భావించారు ఆళ్వార్లు.

కళ లిణై కీళ్ |ఉత్త తిరుమాలై పాడుమ్ :

తొండరడిపొడి ఆళ్వార్లు, శ్రీరంగనాధుడే ద్వాపరయుగంలో పశువుల మందలను మేపిన శ్రీకృష్ణునిగా తలచి, ఆయన శ్రీపాదాలనే తన సర్వస్వంగా భావించి సేవిస్తున్నారు. ఆశ్రీపాదాలను తన అందమైన పామాల (పాటల మాల) తో అలంకరించాలనుకుంటున్నారు. నమ్మాళ్వార్లు ‘అడిసూట్టలాగుం అందామం’ (ఆ శ్రీపాదాలను అలంకరించడం అవుతుంది) అని తిరువయిమోళి 2.4.11లో పాడారు.

పాడుమ్ శీర్ :

తొండరడిపొడి ఆళ్వార్లు పామల కైంకర్యం చేసారు. పామల అంటే పాడటం ….సంకీర్తనం.

శీర్ తొండరడిపొడి ఎన్నుమ్ :

‘తుళవ తోండాయ్ తోల్ శీర్,  తొండరడిపొడి సొల్ ‘ అని శ్రీరంగనాధుడికి ఆళ్వార్లు తన పాటల సంపదను సమర్పించాను అని వీరే తిరుమాలై 45 వ పాశురములో చెప్పుకున్నారు.

తొండరడిపొడి ఎమ్బెరుమానై:

తొండరడిపొడి ఆళ్వార్లకు శ్రీరంగనాధుడే స్వామి. ఈ తనియన్ అనుగ్రహించిన తిరువరంగ పెరుమాళ్ అరయర్లకు తొండరడిపొడి ఆళ్వార్లు స్వామి. తొండరడిపొడి ఆళ్వార్లను అరయర్లు తన స్వామిగా భావించడం తప్పు కాదా! అంటే కానే కాదు అని చెప్పుకోవాల్సి వుంటుంది. ఎందుకని అంటే శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడికి శేషుడైనవాడే మనకు స్వామి.  ఆవిధంగానే తిరువరంగ పెరుమాళ్ అరయర్లకు తొండరడిపొడి ఆళ్వార్లు స్వామి అయ్యారు .

ఎప్పోళుదుమ్ పేశు :

పైన చెప్పుకున్నట్లుగా తిరువరంగ పెరుమాళ్ అరయర్లు తన స్వామిని గురించి తప్ప మిగిలిన విషయాలేవీ తలచకు అని తన మనసును ఆదేశించారు.

ఇక ప్రబందానికి పెరియవచ్చాన్ పిళ్ళై చేసిన వ్యాఖ్యానము చూద్దాం.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

హిందీలో – http://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai-thaniyan/

మూలము : http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment