శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీరంగనాథుడు
తొండరడిప్పొడి ఆళ్వార్
తొండరడిపొడి ఆళ్వార్లు భగవత్కైంకర్యం కంటే భాగవత కైంకర్యం ఉన్నతమైనదిగా భావించారు. వారి తిరునామంలోని తొండర్ –అడి-పొడి అన్న మాటల అర్థాలను చూస్తె వారి భాగవత భక్తి ఎంతటిదో బోధపడుతుంది. తొండర్ – అంటే భాగవతులు, అడి- అంటే వారి శ్రీపాదాలు , పొడి- అంటే ధూళి …అర్తాత్ భాగవత శ్రీపాద ధూళి. సంప్రదాయంలో దీనినే చరమపర్వనిష్ట అని అంటారు. వీరు తిరుమాలై, తిరుపళ్ళియెళుచ్చి అని రెండు ప్రబంధాలను వెలయించారు. ఈ రెండు ప్రబందాలు శ్రీరంగనాధుని గురించి పాడినవే కావటం విశేషం. తిరుమాలైలో ఆళ్వార్లలోని శేషత్వ జ్ఞానాన్ని శ్రీరంగనాధుడు మేలుకొలిపారు. తిరుపళ్ళియెళుచ్చిలో ఆశ్రితులను అనుగ్రహించటం కోసం శ్రీరంగనాధునికి ఆళ్వార్లు మేలుకొలుపు పాడటం విశేషం.
ఒక ప్రబంధం గురించి తెలుసుకునే ముందు ప్రబంధకర్త విశిష్టత తెలుసుకోవాలి. తరువాత ఆ ప్రబంధ విశిష్టత, ప్రబంధంలోని విషయ విశిష్టత తెలుసుకోవాలి. ప్రబంధకర్త అయిన తొండరడిపొడి ఆళ్వార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విప్రనారాయణ. వీరు బ్రాహ్మణ కుటుంబలో అవతరించారు. కల్యాది 289 ప్రభవ నామసంవత్సరంలో ధనుర్మాసం, జ్యేష్టానక్షత్రంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు అవతరించారు. చోళదేశంలోని కుంబకోణం దగ్గర తిరుమణ్డంగుడి అనే గ్రామంలో వైజయంతిమాల అంశగా అవతరించారు. బాల్యం నుండే లౌకిక విషయాల మీద ఆసక్తి చూపేవారు కాదు. బ్రహ్మచారిగా ఉండి భగవత్కైంకర్యం చేస్తూ ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీరంగం దగ్గరలో ఒక చక్కటి పూలతోటను పెంచి ఆ పూలతో రోజూ మాలలు కట్టి శ్రీరంగనాధుడికి సమర్పించటమే నిత్య కైంకర్యంగా చేస్తూ వుండేవారు.
ఒకరోజు వీరు యధాప్రకారం తోటలో పనిచేసుకుంటూ ఉండగా ఇద్దరు దేవదాసులు ఆ దారి వెంట వచ్చారు. అందులో ఒకామె పేరు దేవదేవి రెండవ స్త్రీ ఆమె అక్క. ఇద్దరూ చాల అందమైనవాళ్ళు. విప్రనారాయణునులు వీళ్ళ వైపు కన్నైనా ఎత్తి చూడలేదు. అది గమనించిన దేవదేవికి చాలా అవమానంగా భావించింది. లోకంలో అందరూ తనవైపు చూడాలని తపించి పోతారు అలాంటిది ఇతను తన ఉనికినే గమనించకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు అని కోపంతో ఉడికి పోయింది. ఆమె అక్క విప్రనారాయణుని గురించి వివరంగా చెప్పి ఆయన భగవత్ కైంకర్యం తప్ప ఇతర విషయాలను కలలో కూడా తలచడు అని చెప్పింది. దేవదేవి దానిని సవాలుగా తీసుకోని ఆరు నెలల్లో అతడిని నావశం చేసుకొని చూపించకపొతే నేను దేవదేవినే కాదు అని చెప్పింది. ఆమె సోదరి అది జరగని పని అన్నది. అలా చేసి చూపిస్తే నువ్వు నాకు ఆరునెలలు దాస్యం చేయాలి, నేను ఓడిపోతే నేను నీకు దాస్యం చేస్తాను’ అని సవాలు విసిరింది. అప్పటికి ఇద్దరూ అక్కడి నుండి కదిలారు.
కొంత కాలం తరువాత విప్రనారాయణుడి తోట దగ్గరకు దేవదేవి వచ్చి తాను తోట చూడాలని వచ్చానని లోపలకు అనుమతించమని అడిగింది. దానికి అయన ఒప్పుకోలేదు. దానికి ఆమె తన తల్లి తనను కులవృ త్తి చేయమని బలవంత పెడుతున్నదని తనకు ఆ పాపిష్టి జీవితం ఇష్టం లేదు భాగవతుల సేవలో జీవితం గడపాలని ఉంది’ అని కల్లబొల్లి మాటలు చెప్పి ఎలాగో లోపలకు వచ్చి క్రమంగా ఆయనకు తోట పనులలో సహాయం చేస్తూ అక్కడే ఉండి పోయింది.
ఒక రోజు ఆయన దేవదేవి మాయకులోనై ఆమెకు వశ్యుడయ్యాడు. తరువాత ఇద్దరూ ఒకేకుటీరంలో ఉండడం మొదలు పెట్టారు. కొంతకాలానికి దేవదేవి ఆయనను గెలిచానన్న గర్వంతో తన సొంత ఊరైన తిరుకరంబనూరుకు వెళ్ళిపోయింది. విప్రనారాయణుడు ఆమె లేకుండా ఉండలేకపోయాడు. ఆమె ఇంటికి వళ్ళాడు, కానీ ఆమె దాసీలు సొమ్ములేని విప్రనారాయణని లోపలికి రానీయలేదు. విప్రనారాయణ ఆమె వాకిటి ముందే కూర్చుని కూర్చుని అలసిపోయి ఆఖరికి అలాగే నిద్రపోయాడు. ఆశ్చర్యంగా ఒకపిల్లవాడు బంగారుతీర్థపాత్రను (వట్టిల్) తీసు కువచ్చి దేవదేవి ఇంట్లో వాళ్ళకిచ్చి విప్రనారాయణే దేవదేవికిచ్చిరమ్మన్నాడని చెప్పాడు. ఆ బంగారు తీర్థపాత్రను చూసిన దేవదేవి దాసీలు ఆయనను లోపలి ఆహ్వానిస్తారు. జరిగిన విషయం విప్రనారాయణకు తెలియదు. దేవదేవితో సంతోషంగా ఉన్నాడు.
మరునాడు శ్రీరంగనాధకోవెలను యధాప్రకారం తెరవగా అక్కడ ఒక బంగారు తీర్థపాత్ర తక్కువగా ఉంది. దేవాలయ అర్చక స్వాములు వెంటనే విషయాన్ని రాజుగారికి తెలియజేసారు. రాజాజ్ఞ ప్రకారం దేవాలయ ఉద్యోగులందరినీ సోదాచేసారు. అందులో ఒకరు దేవదేవి పనిమనిషి చుట్టం కూడా ఉంది. ఆమె దేవదేవి ఇంట్లో బంగారు తీర్థపాత్ర ఉందని , అది ఆమెకు విప్రనారాయణ ఇచ్చాడని చెప్పింది. రాజు విప్రనారాయణను చెరసాలలో పెట్టాడు. అప్పుడు ఆజగన్నాటక సూత్రదారి రాజుగారికి కలలోకనిపించి తానే ఈ ఆటకు కారణమని విప్రనారాయణ నిర్దోషి అని చెప్పాడు. రాజు మరుసటిరోజు నిర్దోషి అయిన విప్రనారాయణను బంధ విముక్తుడిని చేసి తన తోందరపాటుకు ప్రాయిశ్చిత్తంగా విప్రనారాయణకు సన్మానం చేసి పంపాడు. విప్రనారాయణ కూడా తాను లౌకికమైన క్షుద్ర విషయాలకు బానిస అయినందుకు సిగ్గుపడి అప్పటినుండి భగవద్కైంకర్యంలో మళ్ళీ మునిగిపోయాడు అనిచరిత్ర.
ఆతరువాత అయన తొండరడిపొడి ఆళ్వార్లని తన పేరును మార్చుకొని అలాగే శేషజీవితం గడిపారు.
తిరుమాలై ప్రబంధంరాసిలో చిన్నదైనా చాలా సాంద్రమైనది. మనవంటి సామాన్యులకు అర్థంకాదు నమ్బిళ్ళై శిష్యులైన వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై దీనికి వ్యాఖ్యానం రాసారు. తనియన్లను అర్థము చేసుకుంటే ప్రబంధ విశిష్టత బోధపడుతుంది. ముందుగా తనియన్లను , వాటి వ్యాఖ్యానలను చూద్దాం.
- తనియన్
- అవతారిక
- పాసురం 1
- పాసురం 2
- భాగం 1
- భాగం 2
- పాసురం 3
- పాసురం 4
- పాసురం 5
- పాసురం 6
- పాసురం 7
- పాసురం 8
- పాసురం 9
- పాసురం 10
- పాసురం 11
- పాసురం 12
- పాసురం 13
- పాసురం 14
- పాసురం 15
- పాసురం 16
- పాసురం 17
- పాసురం 18
- పాసురం 19
- పాసురం 20
- పాసురం 21
- పాసురం 22
- పాసురం 23
- పాసురం 24
- పాసురం 25
- పాసురం 26
- పాసురం 27
- పాసురం 28
- పాసురం 29
- పాసురం 30
- పాసురం 31
- పాసురం 32
- పాసురం 33
- పాసురం 34
- పాసురం 35
- పాసురం 36
- పాసురం 37
- పాసురం 38
- భాగం 1
- భాగం 2
- భాగం 3
- పాసురం 39
- పాసురం 40
- పాసురం 41
- పాసురం 42
- పాసురం 43
- పాసురం 44
- పాసురం 45
- సంగతి (పాసురముల మధ్య సంబంధం)
అడియెన్ చూడామణి రామానుజ దాసి
హిందీలో – https://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai/
మూలము : https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org
Adiyen dasoham
Can you load the meanings of tirumalai pasurams in telugu please.