ప్రమేయసారము 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

 

<< పాశురము 7

paramapadhanathan

 

అవతారిక:

                అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ ప్రబంధంలో తిరు మంత్రములోని “ఓం” కార అర్థాన్ని మోదటి మూడు పాశురాలైన “ అవ్వానవర్”, “ కులం ఒన్రు  ” , “ పలం కొణ్డు ” లో చెప్పి, తరువాతి నాలుగు పాశురాలైన  “కరుమత్తాల్”, “వళియావదు”, “ఉళ్ళ పడి ఉణరిల్” , “ఇల్లై ఇరువరుక్కుం”, లో నమః పద అర్థాన్ని చర్చించారు. ఈ పాశురాలో  “నారాయణాయ” అనే పదము యొక్క అర్థాన్ని చెపుతున్నారు. శ్రీమన్నారయణునకు సమస్త చరా చర జగత్తు ఆయనకు సొత్తు, ఆయనకు కైంకర్యం చెయటమే చేతనుల పరమావధి అని శాస్త్రాలలో చెప్పబడింది.   “నారాయణాయ” శబ్దంలో అనేక అర్థాలు ఇమిడి వున్నాయి.  శ్రీమన్నారయణుని సేవించుకోవాలనే తపన , ఆర్తి, పరబ్రహ్మ తప్ప ఇతరమైన వేవి సత్యానందాన్ని, నిత్యానందాన్ని ఇవ్వలేవన్నసత్యాన్ని తెలుసుకోవటం  , ఆయనకు నిరంతర కైంకర్యం చేసే భాగ్యాన్ని పొందే మార్గం, అంతిమంగా పరమపదం చేరి ఆయనకు నిత్య కైంకర్యం చేసే భాగ్యాన్ని పొందే మార్గం అన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ విషయాలనే అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు  ఈ పాశురంలో వివరిస్తున్నారు .

పాశురము:

విత్తం ఇళవు ఇన్ బం తున్ బం నోయి వీకాలం

తత్తం అవయే తలై అళిక్కుం  – అత్తై విడీర్

ఇచ్చియాన్ ఇచ్చియాదేద ఎళిల్ వానత్తు

ఉచ్చియాన్ ఉచ్చియానాం

 

ప్రతి పదార్థము:

విత్తం = సంపదను

ఇళవు = నష్టము

ఇన్బం = సుఖము

తున్ బం  = దుఖఃము

నోయి = అనారోగ్యము

వీకాలం = మరణ కాలము

తత్తం అవయే = వాటి వాటి కర్మానుసారము

తలై అళిక్కుం  = ఫలితాన్నిస్తుంది

విడీర్ = వదిలి వేయండీ

అత్తై = కాబట్టి వాటికి సంబంధించిన చింతన

ఇచ్చియాన్ = చేయని వాడు శ్రీమన్నారాయణుని మాత్రమే తలచే వాడు

ఇచ్చియాదు = ఇతర ప్రయోజనాలను ఇష్టపడడు

ఏదద్ = శ్రీమన్నారాయణుని స్థుతించడానికి

ఎళిల్ వానత్తు = అందమైన పరమపదములో

ఉచ్చియాన్ = ఉన్నతుడైన శ్రీమన్నారాయణుడు

ఉచ్చియానాం  = శిరసా వహించదగిన గొప్పతనము కలవాడౌతాడు

వ్యాఖ్యానం :

                “నారాయణాయ” అనే పదానికి అర్థం చెప్పేటప్పుడు  “ఇళైయ పెరుమాళైప్పోలే ఇరువరుమాన సేర్తియిలే అడిమై సెయిగై ముఱై ” సీతారాములు కలిసి ఉన్నప్పుడు ఆ మిధునానికి లక్ష్మణునిలాగా కైంకర్యము చెయాలి ‘ అని చెప్పి “అత్తై నిత్యమాగ ప్రార్తిత్తే  పెఱ వేణుం ” ఆ “కైంకర్య భాగ్యం నిత్యముగా కావాలని కోరి పొందాలి” అనిచెపుతారు. శ్రీరామాయణంలో శ్రీరాముడు లక్ష్మణుడు తన తోబుట్టువుగా కాక సాక్షాత్ పరమాత్మగా భావించి  కైంకర్యము చేసాడు. ఆ విషయాన్నే కంబ రామాయణంలో ఈ క్రింది విధంగా చెప్పారు.

“ఎందైయుం  యాయుం ఎంబిరానుం ఎమ్మునుం

అందం ఇల్ పెరుంగుణత్తు ఇరామన్ ఆదలాల్

వందనై అవన్ కళల్ వైత్త పోదు అల్లాల్

సిందై వెంగొదుంతుయర్ తీర్కిలేన్”

( కంబ రామాయణం, అయోధ్యా కాణ్డం, పళ్ళిడైప్పడలం 58)

 

సకల సంబంధాలు రాముడితోనే అని ,ఆయనకు కైంకర్యం చేయటమే తన విధి అని, తలచి లక్ష్మణు

శ్రీ రాముడి  వెంట అడవికి వెళ్ళాడు.

 

“అగాదదు అన్ఱాల్ ఉనకు అవ్వనం ఇవ్వయోత్తి

మాకాదల్ ఇరామన్ నం మన్నవన్ వైయ్యమీందుం

పోగా ఉయిర్త్తాయర్ నం పూంకుళల్ సీతై  – ఎన్ఱే

యేగాఇ: ఇని ఇవ్వయిన్ నిఱ్ఱలుం యేదం”

(కంబ రామాయణం, అయోధ్యా కాణ్డం, నగర్ నీంగు పడలం146)

“పిన్నుం పగర్వాళ్. “మగనే! ఇవంపిన్ సెల్; తంబి

ఎన్నుంపది అన్ఱు, అడియారినిన్ యేవల్ సెయ్ది;

మన్నుం నగర్కే ఇవన్ వందిదిన్ వా: అదు అన్ఱేల్

మున్నం ముడి” ఎన్ఱనళ్ వార్ విళి సోర నిన్రాళ్ ‘

( తల్లి సుమిత్ర కుమారా ఈయన వెంట వెళ్ళు తముడిలా కాక చక్రవర్తికి చేసినట్లుగా నిన్ను దాసుడిగా భావించి సేవలు చేయి అని చెప్పింది)

( కంబ రామాయణం, అయోధ్యా కాణ్డం, నగర్ నీంగు పడలం147)

  “అడియారినిన్ యేవల్ సెయ్ది” అని అన్నారు . అనగా  శ్రీలక్ష్మణస్వామి శ్రీరాముడితో తప్ప ఇతరులందరితో తన సంబంధమును వదులుకుని ఆయన వెంట అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు కైంకర్యం చేసారు , అంతే కాక ఆజీవనము శ్రీరాముడికి  కైంకర్యం చేస్తూనే వున్నాడు. ఇది జీవాత్మకుండవలసిన లక్షణము. ఇది పరమాత్మను ప్రార్థించి పొందవలసినది. గోదా దేవి తమ తిరుప్పావైలో ” వేదమనైత్తుక్కుం విత్తాగుం ” అన్నది. “ఎత్తైక్కుం ఏళేళు  పిరవిక్కుం ఉంతన్నోడు ఉత్తోమే యావోం ఉమక్కే నాం ఆట్చెయ్వోం మత్తై నంకామంగళ్ మాత్తు” అని అన్నారు.

పెరియాళ్వార్లు “ ఉనక్కుప్పణి సెయితిరుక్కుం తవం ఉడైయేన్”అని, నమ్మాళ్వార్లు “ఒళివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్ని వఱువిలా అడిమై సెయ్య వేణ్డుం నాం, తిరుమంగై ఆళ్వార్లు “ఆళుం పణియుం అడియేనై కొండాన్” అని “ఉనక్కాగ తొండు పత్త నల్లేనై ”అని అన్నారు .

        జ్ఞానులైన పెరియాళ్వార్లు ఇత్యాదులు పరమాత్మ కైంకర్యమే జీవన లక్ష్యంగా భావించారు. వీరు ఈ లీలా విభూతిలో ఉన్న కాలంలో సంపద వలన ఆనందమో, అది కోల్పోయినందున ధుఃఖమో పొంద లేదు.

“వేణ్దేన్ మనై వాళ్కయై ”అని ,“కూఱు సోఱు ఇవై వేడుందువతిల్లై” అని,  “నీళ్ సెల్వం వేణ్డాదాన్” అని ఆళ్వార్ల చేత సంపదలు విసర్జించ బడ్డాయి . అన్ని కృష్ణుడే అన్నదే వారి విశ్వాసము. పరమాత్మ కైంకర్యములో ఈడుపడిన మనసును తాత్కాలిక ప్రయోజనాన్నిచ్చే సంపదల మీదికి వారు పోనీయలేదు. ఇంకా పరమాత్మయే లక్ష్యముగా కలిగి వున్న వారు ఎలా ఉండాలో చెపుతున్నారు.

విత్తం……డబ్బు , బంగారము ఇత్యాదులు

ఇళవు ……..వాటిని పోగొట్టుకున్న స్థితి

తిరువళ్ళువర్ ఈ విషయంగా  “నిల్లాధవఱ్ఱై నిలైయిన ఎన్ఱు ఉణరుం పుల్లఱివాన్మై కడై” ( నిలవని వాటిని శాస్వతమనుకొనే గొప్ప జ్ఞానులు) అని వ్యంగ్యంగా అన్నారు.

ఇన్ బం …….సుఖ దుఃఖాలకు హేతువైన వస్తువులిచ్చే సుఖము

తున్ బం ……దుఃఖాలనిచ్చే సంఘటనల వలన కలిగే ..దుఃఖం

నోయి………శరీరమును ఆశ్రయించే రోగాలు

వీకాలం……..శరీరమును యొక్క అంతిమ కాలము (మరణము) మొదలైనవన్నిటికి

తత్తం అవయే………కారణము సంచిత కర్మలు

తలై అళిక్కుం  ……….తగిన సమయంలో ఫలితాన్నిస్తాయి జన్మతో వచ్చిన కర్మలు అయా కాలాలో ఫలితానిస్తాయి. తిరువళ్ళువర్  “ఊళు” “ఆకూళాఱ్ తోన్ఱుం అసైవిన్మై కైప్పొరుళ్ పోకూళాఱ్ తోన్ఱుం మడి”.

(సంపదలు దొరకడానికి, అది తొలగి పోవతానికి కారణము పురాకృత కర్మలు.) అన్నారు .

“పేదై పడుక్కుం ఇళవూళ్ అఱివగఱ్ఱుం

 ఆగలూళ్ ఉఱ్ఱక్ కడై”.

      ఒకడు లౌకిక జ్ఞానము కలివున్నా పురాకృత కర్మ వలన సంపదను పోగొట్టుకునే సమయంలో ఆ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఒకడు లౌకిక జ్ఞానము లేని వాడైనా వాడికి  పురాకృత కర్మ వలన సంపదలు పొందడానికి లౌకిక జ్ఞానము పొంద గలుగుతాడు. పురాకృత కర్మలు మంచిని చెడుగాను, చెడును మంచిగాను మార్చగలదు. తిరువళ్ళువర్ ఈ పురాకృత కర్మల గురించి విస్తృతంగా వివరించారు.

అత్తై విడీర్………పురాకృత కర్మల గురించి మంచినో చెడునో ఎంచకుండా ఉండే వారి గురించి కింద వివరించారు.

ఇచ్చియాన్………..సంపదల వంటివాటిని కోరని వారు  పరమాత్మ కైంకార్యానికి అర్హులవుతారు. తిరుమళిసై ఆళ్వార్లు ఈ విషయంగా  “అడకరుం పులంగళ్ ఐందడక్కి ఆసైయామవై తొడకఱుత్తు వందు నిన్ తొళిఱ్కణ్ నిన్ఱ ఎన్నై” అన్నారు .

   ఇచ్చియాదేత్త ……….పరమాత్మ కైంకర్యం చేసేవారు ఆ కైంకర్య ఫలితంగా తాత్కాలిక ప్రయోజనాలనిచ్చే లౌకిక సంపదలనో ,ఉన్నత ఫలమైన పరామపదాన్నో, కోరకుండా, మధురకవి ఆళ్వార్లు “పావిన్ ఇన్నిసై పాడి తిరివనే ”  అన్నట్లు కేవలం పరమాత్మను కీర్తించటమే ప్రధాన ఫలితంగా కోరుకోవాలి .   పరమాత్మను కీర్తించటమంటే

 “పయన్ తెరిందుణర్ ఒన్ఱిన్మయాల్ తీవినయేన్ వాళా ఇరుందొళిందేన్ కీళ్నాళెల్లాం కరందురువిల్ అమ్మానై అన్నాన్రు పిన్ తొడరంద ఆళియంగై అమ్మానై యేత్తాదు అయర్తు ” (తిరువందాది). ఇక్కడ కీర్తించటమంటే ఒక్క వాచా కైంకర్యమే కాక త్రికరణములతో చేసే కైంకర్యంగా స్వీకరించాలి అని చెపుతున్నారు.

ఎళిల్ వానత్తు ఉచ్చియాన్ ఉచ్చియానాం……….వైకుంఠంలో వేంచేసి వుండే పరమపద నాధుడే  శిరస్సుపై ధరించేటంత గొప్ప వాడవుతాడు. ‘ఎళిల్ వానం ‘ అంటే పరమపదము. దానినే ‘ విణ్ణగం ‘ అంటారు. అక్కడ ఉండే స్వామిని ‘  విణ్ణ్మీదిరుప్పవన్ ‘ అంటారు. ఎళిల్ వానం అంటే వేదాంతంలో పరమాకాశము. అందులో ఉన్నతమైన ప్రదేశం పరమపదం , అదే ‘ ఉచ్చి ‘, అక్కడ వశించే వాడు ‘ ఉచ్చియాన్ ‘ . ‘ ఎళిల్ వానత్తు ఉచ్చియాన్ ఉచ్చియానాం ‘ ఆ వైకుంఠ నాధుడు. ఆయన శిరస్సు మీద ధరింపబడే వాడు ఆయన పరం భక్తుడు, దాసుడు..’ ఎళిల్ వానత్తు ఉచ్చియాన్ ఉచ్చియానాం ‘ అని చెప్పబడింది.

  ఇక్కడ  భక్తుడు, దాసుడు..అని చెప్పబడిన వాడు ద్వందాతీతుడు …అంటే సుఖ ధుఃఖాలకు, కష్ట నష్టాలకు, లాభా లాభాలకు , రోగాలు, మరణాలు వంటి వాటికి చలించని వాడు. అందు వలన వాడి మనసు పరిశుధ్ధంగా ఉంటుంది. ఆ పరిశుధ్ధ మనసులో లౌకికమైన కోరికలేమీ ఉండవు. ఏ ప్రయోజనము ఆశించకుండా పరమాత్మకు కైంకర్యం చేయటమే పరమ ప్రయోజనంగా భావించి కైంకర్యం చేసే వాడు. కాబట్టి పరమాత్మకు కైంకర్యం చేసే వారు ఇతర ప్రయోజనాలను ఆశించ కుండా పరమాత్మకు కైంకర్యం చేయటమే పరమ  ప్రయోజనంగా భావించి కైంకర్యం చేయాలి అని అర్థము. మనోవాక్కాయ కర్మణ కైంకర్యం చేయాలి అప్పుడే ఫలితాన్నిస్తుంది. మనసులో ఇతర కోరికలు తలయెత్తకుండా, నోటితో పరమాత్మ నామం తప్ప మరేదీ పలక కుండా, కరణాలతో పరమాత్మలు సంబంధించిన కార్యములు తప్ప ఇతరములేవీ చేయకుండా ఉండటమే త్రికరణ శుధ్ధి అంటారు.

దీనికి సంబంధించిన ఉదాహరణలు నాలాయిర దివ్యప్రబంధంలో చాలా కనపడతాయి. అందులో కొన్ని ఈ క్రింద చూడవచ్చు.

  1.   వాయి అవనై అల్లాదు వాళ్త్తాదు (209) ( నోరు ఆయనను తప్ప కీర్తించదు)
  2.   నాక్కు నిన్నై అల్లాల్ అఱియాదు (433)( నాలుకకు నువ్వు  తప్ప తెలియదు)
  3.    యేతుగిన్ఱోం నాతళుంబ (1863) (నాలుక అలసి పోయేట్లుగా నిన్ను కీర్తిస్తున్నాను )
  4.    నాతళుంబ నారాయణా ఎన్ఱళైతు (561) (నాలుక అలసి పోయేట్లుగా నారాయణా అనిపిలిచి)
  5.    ఇరవు నంపగలుం విడాదు ఎన్రుం యేతుదల్ మనం వైమినో (2954)(రాత్రిపగలు విడువక నిన్ను కీర్తించచటమే మనసుకు పని)
  6.    పేసుమిన్ కూసమిన్ఱి (3681)(సంకోచం లేకుండా మాట్లాడు)
  7.    వాయినాల్ పాడి (478) (నోటితో పాడి)

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-8/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment