ప్రమేయసారము 7

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురము 6

yasoda_and_krishna

 

ఇల్లై ఇరువరుక్కుం ఎన్ఱు ఇఱైయై వెన్ఱిరుపార్

ఇల్లై అక్దొరువరుక్కు ఎట్టుమదో ఇల్లై

కుఱైయుడైమై తానెన్ఱు  కూఱినారిల్లా

మఱైయుడైయ మార్గత్తే కాణ్

 

ప్రతిపదార్థము:

ఇరువరుక్కుం = జీవాత్మకు ,పరమాత్మకు

ఇల్లై ఎన్ఱు = లోటు ఏదీలేదని భావించడం వలన

ఇఱైయై = భగవంతుడిని

వెన్ఱిరుపార్ ఇల్లై = గెలిచే వారు లేరు

అక్దు = ఆ విధంగా

ఒరువరుక్కు = ఒకరికి

ఎట్టుమదో = అందేదేనా

కుఱైతాన్ = పుచ్చుకునే లోపము

ఇల్లై = లేదు

ఎన్ఱు  = ఈ విధంగా

కూఱినారిల్లా = ఎవరిచేత చెప్పబడ లేదు

మఱైయుడైయ మార్గత్తే = వేద మార్గములో నిలిచి

కాణ్ = తెలుసుకోగలరు

 

వ్యాఖ్యానము:

ఇల్లై ఇరువరుక్కుం ఎన్ఱు …..పరమాత్మకు జీవాత్మకు ఒక పోలిక ఉంది . పరమాత్మకు లోటు ఏమీ లేదు. ఆయన “కుఱై ఒన్ఱుం ఇల్లాద గోవిందన్” ( లోటే లేని గోవిందుడు ).  జీవాత్మలు  సంపద, జ్ఞానము ఏమీ లేని గొల్ల వాళ్ళు “అఱివొన్ఱుమిల్లాద ఆయర్ కులం ” ( తెలివి ఏమీ లేని గొల్ల వాళ్ళు ) . ఇది ఇద్దరికి ఉన్న నిజమైన స్థితి. దీనిని తెలుసుకోవటమే జీవాత్మల విధి. ఈ జ్ఞానం ఉన్న వారికి  శ్రీమన్నారాయణుడు సులభుడై వుంటాడు.   “వళవేల్ ఉలగు”, “మిన్నిడై మడవార్”, “కణ్గళ్ సివంద”   “ఓరాయిరమాయి ” మొదలైన  తిరువాయిమొళిలోని  నమ్మాళ్వార్ల పాశురాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది . పై పాశురాలను పరిశీలిస్తె భగవంతుడు ఆళ్వార్ల కోసం దిగివచ్చి దర్శన భాగ్యం కలిగించడం కనబడుతుంది. వీరిద్దరి స్థితి తెలియని వారికి పరమాత్మ వైభవం అర్థము కాదు  అని తరువాత వచ్చే పాశుర భాగంలో చూడవచ్చు.

ఇఱైయై వెన్ఱిరుపార్ ఇల్లై ……..భగవంతుడు ఎవరికీ కట్టుబడని వాడు. సర్వ స్వతంత్రుడు. తన ఇష్టాను సారముగా నడుచుకునే వాడు. అటువంటి వాడిని లోబరచు కోవటము సాద్యము కాదు. పైన చెప్పి నట్లుగా పరమాత్మ , జీవాత్మల తత్వము తెలిసిన వారికే అది సాధ్యము.  “పఱ్ఱుడై అడియవర్కు ఎళియవన్” ( భక్తి ,ప్రేమ గలవారికి సులభుడు) .ఆయనను లోబరచు కోగలిగిన భక్తులను చూడగలమా?

అక్దొరువరుక్కు ఎట్టుమదో ……..పరమాత్మ పూర్ణత్వము, జీవాత్మ ఆకించన్యమును తెలుసుకోగల వారుంటారా? నేను ,నాది  అని అహంకారంతో ఉండే ఈ లోకంలో అది అంత సులభం కాదే! అతి దుర్లభాం కదా! అందు వలననే పరమాత్మను లోబరచుకోవటము అసాధ్యమన్నారు. తైలదారావత్ అవ్యవధానంగా  తలచుకోవాల్సిన విషయం ఏమిటనేది తరువాత వచ్చే పాశుర భాగంలో తెలుపబడింది.

ఇల్లై కుఱైయుడైమై తానెన్ఱు ………కుఱై  తాన్ ఇల్లై…యుడైమై తాన్ ఇల్….’ తాన్ ‘ అంటే ఇక్కడ దోషములు లేని….స్వతంత్రము లేని…భగవంతుడికి చేతనుల దగ్గర పొందవలసినదేదీ లేదు. చేతనుల దగ్గర ఆయనకు ఇవ్వదగినవి ఏవీ లేవు. ఇదియే ఇద్దరి సహజ స్వభావము. ఈ జ్ఞానము కలగడం అంత సులభం కాదు.

కూఱినారిల్లా మఱైయుడైయ మార్గత్తే కాణ్……వేదములో దాగి ఉండడం వలన భగవత్తత్వం దర్శించడానికి సాధ్యం కావడం లేదు. వేదములు అపౌరుషేయాలు, అనాదిగా వున్నవి . అందు వలన ఇందులో అస్పష్టతగాని , అన్యధా అర్థములు కానీ లేవు.   వేదములను నేర్చి పైన చెప్పిన అర్థాలను గ్రహించాలి. ఇక్కడ ” కాణ్ ” (చూడు ) అన్న ప్రయోగం వలన శ్రోతతో ప్రత్యక్షంగా మాట్లాడినట్లు అమరింది. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లుగా ఉన్నా ఇది లోకోపకారానికి  చేసిన ఉపదేశం. పరమాత్మ పరిపూర్ణుడు, ఆయనను పూర్తి చేయడానికి ఇతరమైనవి ఏవీ లేవు. ఈ విషయాలే వేదములలోను చెప్పబడ్డ రహస్యాలు . వేదములను అభ్యసించిన వారికే పూర్తిగా అర్థము కాని విషయాలు, సామాన్యులకు అవగాహన కాని గొప్ప  విషయాలు. ఈ విషయాలు తెలిసిన వారికి పరమాత్మ సులభుడు. తెలియని వారికి సులభుడు కాగలడా? అర్థాత్ శాస్త్ర ప్రకారము నడచుకునే వారికి పరమాత్మ సులభుడు. నడచుకోని వారికి సులభుడు కాజాలడు.

   పెరియాళ్వార్లు ప్రేమతో  “కాప్పిడ వారాయ్”,( గాజులు తొడిగించుకోవటానికి రావా) “పూచ్చూడ వారాయ్”              ( పూలు ముడుచుకోవటానికి రావా ), “అమ్మం ఉణ్ణ వారాయ్” ( అన్నం తినడానికి రావా ) అని పిలవగానే వచ్చాడు.   అండాళ్ ” విట్టుచిత్తర్ తంగళ్ దేవర్ ” అన్నది. అందువలన మణవాళ మామునులు “జ్ఞానియర్కు ఒప్పోరిల్లై ఇవ్వులగు తన్నిల్”(జ్ఞానులకు సమానమైన వారు ఈ లోకంలో లేరు) అన్నారు.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-7/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment