ప్రమేయసారము 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురము 5

bharatha-vasishta

పాశురం- 6

ఉళ్ళ పడి ఉణరిల్ ఒన్ఱు నమక్కు ఉణ్డెన్ఱు

విళ్ళ విరగిలదాయ్ విట్టదే – కొళ్ళ

కుఱై యేదుం ఇల్లార్కు కూఱువదు యెన్ సొల్లీర్

ఇఱై యేదుం ఇల్లాద యాం

ప్రతిపదార్థము:

ఉళ్ళ పడి = జీవులు ప్రకృతిని ఉన్నదున్నట్టుగా

ఉణరిల్ = తెలుసుకుంటే

ఒన్ఱు = ఇతరజ్ఞానములేవీ

నమక్కు = లేని మనకు

ఉణ్డెన్ఱు =జ్ఞానము ఉందని

విళ్ళ = నోటితో చెప్పడానికి కూడా

విరగిలదాయ్ = ఉపాయమేదీ లేదు

విట్టదే = శక్తి చాలదు కదా

కొళ్ళ = మన దగ్గర పొంద వల్సిన

కుఱై = దోషములు

యేదుం ఇల్లార్కు = యేదీ లేని భగవంతుడికి

ఇఱై యేదుం ఇల్లాద = కొంచెము కూడా స్వార్థము లేని భగవంతుడి ముందు

యాం = దాసులమైన మనము

కూఱువదు యెన్ = మనలను రక్షించుకోవటానికి ఉన్నయని చెప్పగలిగిన ఉపాయాలు   ఏమి వుంటాయి

సొల్లీర్ = చెప్పండి

వ్యాఖ్యానము:

ఉళ్ళ పడి ఉణరిల్……..చేతనుల నిజ రూపాన్ని తెలుసుకోవటం…

“ఎప్పొరుళ్ ఎత్తన్మై తాయినుం అప్పొరుళ్  మైపొరుళ్ కాణ్బదు అఱివు” ( ఏ వస్తువు ఏలా వుందో అలా తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము) అన్నారు తిరువళ్ళువర్ . అర్థాత్ ఆత్మ యొక్క నిజస్వరూపము తెలుసు కోవటమే జ్ఞానము అని చెపుతున్నారు. మనం  లోకంలోని వస్తువులను చూసేటప్పుడు  ఇవి చేతనాలు, ఇవి అచేతనాలు అని గ్రహిస్తాము. మళ్ళీ వాటిలోను అనేక వైవిధ్యాలు గోచరమవుతాయి…జంగమాలు, స్తావరాలు , తిర్యక్కులు (మనుష్యులు, పక్షులు, చెట్లు) అని చూస్తామే తప్ప వాటిలోని ఆత్మను చూడము. నిజమైన జ్ఞాని పైన ఉన్న రూపాన్ని చూడక వాటిలో ఉండే ఆత్మను మాత్రమే చూస్తాడు. కాని సామాన్యులకు అలా చూడగలగడం సులభం కాదు. శాస్త్రము తెలిసిన వారికి సులభం కావచ్చు. ఆత్మ, జ్ఞానముతోనే  సృష్టించ బడుతుంది . దానినే ఆత్మ జ్ఞానం అంటారు. ఆత్మ జ్ఞానంచేత వ్యక్తీకరింప బడుతుంది. అంతే కాక ఆత్మ జ్ఞానాన్ని కలిగి వుంటుంది. అందువలననే శాస్త్రములు (అ) సంపూర్ణ జ్ఞానమే ఆత్మ (ఆ) అది జ్ఞానమును కలిగి వుంటుంది. అని తెలియజేస్తున్నది. అందు వలన ఆత్మలకు  ‘నేను ఇది చేయువాడను ‘ అనే అహంకారం సహజంగానే  వస్తుంది. దీనిని అతి సూక్ష్మంగా పరిశీలిస్తే ఆత్మకు సంబంధించిన ఒక సత్యం బోధపడుతుంది. అనాదిగా  జీవాత్మలన్నీ తన ఇచ్చానుసారంగా నడచుకోలేవు. సమస్త జీవులను సృష్టించే పరమాత్మ భగవంతుడు. ఆయన ఇచ్చానుసారంగా  నడవవలసిందే. ఆయనకు దాసులన్న విషయమే సత్యం. అందు వలన నేను, నాది అని చేప్పడానికి కూడా అర్హత లేనివి జీవులు. ఈ జ్ఞానాన్ని పొందిన జీవులు తమను తాము రక్షించుకోవటానికి చేయ దగిన ప్రయత్నమేదీ ఉండదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదియే స్వరూప జ్ఞానం అవుతుంది.

  “ఇయల్బాగుం నోంబిర్కు  ఒన్ఱు ఇన్మై ఉడైమై మయలాగుం మఱ్ఱుం పెయర్తు ” అన్నారు  తిరువళ్ళువర్ . అనగా పరమాత్మ తప్ప తనకు ఆశ్రయిందగినది మరేదీ లేదు అని అర్థము. ఇతర ఉపాయాలున్నాయని భావిస్తే మళ్ళి జనన మరణ చక్రంలో పడవలసిందే అని చెపుతున్నారు.

ఒన్ఱు నమక్కు ఉణ్డెన్ఱు విళ్ళ విరగిలదాయ్ విట్టదే…….పరమపదం పొందడానికి మనదగ్గర ఇతర ఉపాయాలున్నయని నోరు విప్పడానికే అవకాశము లేదు అంటున్నారు.  ‘ విళ్ళ ‘  అంటే ‘ చెప్పటానికి ‘ అని అర్థం. పరమాత్మను వీడి మరొక ఉపాయాన్ని వెదక బోతే అది ధుఖః హేతువు అవుతుంది. అందు వలన ఇతర మార్గమేమీ లేదు అని గ్రహించి ఆయననే  ఆశ్రయించి వుంటుంది. జీవాత్మలన్ని పరమాత్మ శరీరముగాను, పరమాత్మ వాటికి ప్రాణముగాను చెప్పబడింది. శరీరము లేకుండా ప్రాణము ఉండదు కదా! ప్రాణానికి  స్పంద ఉండటం వలన అచేతనంగా దేహంలో ఎలా ఉండగలుగుతుంది. ప్రాణ స్పందనకు తగినట్టుగా పరమాత్మను రక్షించమని ఒకసారైనా అడగాలి కదా!

అది కూడా అడగకుండా ఎలా సాధ్యం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.’ కొళ్ళకుఱై యేదుం ఇల్లార్కు ‘ ( కోరి పొందవలసినంత కొరత లేని వారికి) అన్న ప్రయోగం ఈ ప్రశ్నకు జవాబుగా నిలిచింది. పరమాత్మ జీవాత్మలను రక్షించేందుకు వాళ్ళను అడిగి వాళ్ళ దగ్గర పుచ్చుకోవలసింది ఏదీ లేదు. ఆయన ఏ కొరత లేని వాడు . తను రక్షించి నందుకు  ప్రతిఫలంగా  ఏదో అడిగి  పొందడం ఆయన ఔన్నత్యానికి హాని కలిగిస్తుంది. అందు వలన ఆయన ఏదీ ప్రతిఫలంగా స్వీకరించడు. పైగా మనమో ఆకించిన్యులము, ఏమీ లేని వారము.

కుఱై యేదుం ఇల్లాద యాం:  మనము కలిగి ఉన్న శరీరం మరియు దాని లోపల ఆత్మ అన్నీ  శ్రీమన్నారాయణుని యొక్క ఆస్తులు. శరీరం మరియు ఆత్మ స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం లేనివి. దాని స్వాధీనంలో ఏవీ లేవు. కాబట్టి, అతను శరీరం లేదా ఆత్మ నుండి ఏదైనా ఆశించటం లేదు. ఈ విషయం ఈ క్రింది కథలో వివరించబడింది.

    ఒకసారి ఒకరు శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి, “ఓ స్వామీ ! నేను మీకు ఏమి ఇవ్వగలను? నేను నీ దాసుడనైనందువల్ల నాకంటూ ఏమీ లేవు.  నాదని  భావించి దగినవి  ఏవి లేవు, అన్నీ మీదే. అందువల్ల నేను మీకు ఏమీ ఇవ్వలేను. అయితే, నేను ఇవ్వగలిగినవి ఎన్నో జన్మలుగా  సంపాదించిన కర్మలు మాత్రమే. అది తప్ప నేను ఇవ్వగలిగినవి ఏవీ లేవు, అని నమస్కరించారు. శ్రీ రామాయణంలో భరతుడికి  వశిష్టులకు జరిగిన ఒక సంభాషణ ఈ విషయాన్ని వివరిస్తుంది.

        వశిష్ట ముని భరతుడితో ఇలా  చెప్పారు, “హే భరత ! శ్రీ రాముడు అడవికి వెళ్ళాడు. మీ తండ్రి దశరథుడు స్వర్గం చేరుకున్నారు. కనుక ఇక రాజ్యమును పాలించవలసింది నీవే. ” ఇది విని, భరతుడు తన చేతులతో తన చెవులను మూసుకొని, “శ్రీరాముడు  అడవికి వెళ్ళాడని ,ఇక రాజ్యము నాదే అని  చెప్పారు. అలాగైతే, నేను రాజ్యాన్నిస్వాధీనం చేసుకొని తీసుకోవచ్చా? ఒకవేళ అలా ఇతరుల ఆస్తులను తీసుకుంటే అది దొంగతనం కాదా!“ఉళ్ళత్తాల్ ఉళ్ళలుం తీదే పిఱన్ పొరుళై కళ్ళత్తాల్ కళ్వం ఎనల్”అని చెప్పాడు భరతుడు. అయినా వదలక వశిష్ట ముని ఇలా కొనసాగించి , “ఇప్పుడు శ్రీరాముడు ఇక్కడ లేనందున, మీరు అతని స్వాధీనంలో ఉన్న రాజ్యాన్ని తీసుకోవచ్చు, అతడు తిరిగి వచ్చేవరకు పాలించ వచ్చు ” అన్నాడు .

            దానికి భరతుడు  “తన యజమానికి వస్తువు లోబడి ఉంటుంది. ఒక వస్తువు మరొక  వస్తువును తీసుకోకూడదు. నేను  మరియు రాజ్యం రెండు శ్రీరాముడి  యొక్క వస్తువులు. అందువల్ల, నేను రాజ్యం తీసుకోకూడదు ” అన్నాడు. అతని మాటలు  విన్న తర్వాత కూడా, వశిష్టుడు అతనిని విడిచిపెట్ట లేదు. “రాజ్యం మనస్సాక్షి లేనిది. అయితే, మీరు ఆ వంటివారు కాదు. మీరు మనస్సాక్షి మరియు జ్ఞానం కలిగి ఉన్నారు. జ్ఞానముగల మీరు రాజ్యమును స్వాధీనపరచు కోవచ్చు.  నేను ఇందుకు ఒక ఉదాహరణను ఇస్తాను. ఒక వ్యక్తికి చాలా ఆభరణాలు ఉన్నాయి. అతను వారిని ఒక పెట్టెలో ఉంచి, భద్రత కోసం తాళం వేస్తాడు. ఆ పెట్టె  ఆభరణాలను సురక్షితంగా ఉంచుతుంది. అయితే, ఆభరణాలు మరియు ఆభరణాల పెట్టే రెండు ఒక వ్యక్తి యొక్క ఆస్తులు. కానీ ఆ పెట్టె ఆభరణాలను రక్షించడం మీరు చూడవచ్చు. అదేవిధంగా, శ్రీరాముడి యొక్క ఆస్తి అయిన మీరు, ఆయన రాజ్యాన్ని కాపాడుతున్నారా! ఇది కూడా శ్రీరాముడి ఆస్తియే కదా! అన్నారు. దానికి  భరతుడు స్పందించి , “స్వామి. మీరు ఇచ్చిన సారూప్యంలో, రెండు కూడా మనస్సాక్షి లేనివి . ఆ పెట్టెకు కాని  యజమాని ధరించే ఆభరణాలకు గాని ఎటువంటి పరిజ్ఞానం లేదు కాబట్టి ఆ పెట్టె ఆభరణాలను రక్షిస్తున్నది . అయితే, నేను మనస్సాక్షి ఉన్నవాడిని , అందుచేత నా యజమాని అయిన శ్రీరాముడి  యొక్క ఆస్తులను నియంత్రించలేక పోతున్నాను. నేను , రాజ్యము కూడా  శ్రీరాముడి  యొక్క ఆస్తులను. అందునా రాజ్యానికి  లేని జ్ఞానాన్ని కలిగి ఉండటం ద్వారా రాజ్యం నుండి నేను భిన్నంగా ఉన్నాను. నేను నేర్చిన జ్ఞానం రాజ్యంలో లేని నా యజమాని శ్రీరాముడికి నేను దాసుడినన్న తెలియజేస్తుంది, రాజ్యానికి ఆ జ్ఞానం లేదు . అందువల్ల, నేను ఆ జ్ఞానంతో నిలబడాలి , దాసుడు ఎలా ప్రవర్తించాలో అలా నిజాయితీగా ఉండాలి ‘ అన్నాడు .ఆ వాదన విన్న తరువాత వశిష్టుడు ఇక పొడిగించలేదు భరతుడి వాదనను అంగీకరించారు. దీని  వలన జీవాత్మలు  పరమాత్మకు దాసులే నన్న జీవాత్మ నిజమైన స్వభావాన్ని, సత్యాన్ని  గ్రహించడానికే జ్ఞానం ఉపకరిస్తుందని తెలుస్తున్నది . శ్రీమన్నారాయణునికి సేవకులుగా ఉండటమే జీవాత్మ ప్రకృతి అని తెలుసుకున్న తర్వాత, “నేను” లేదా “నాది ” అని చెప్పగలగటం ఎప్పుడు ఉండదు.

         ఈ విషయం మనసులో ఉంచుకొని అరుళాళ   పెరుమాళ్  ఎమ్బెరుమానార్లు శ్రీమన్నారాయణడు  ఒక్కడే పరి  పూర్ణుడని అంటారు . ఆయనను పూర్తి చేయడానికి మరేదీ అవసరం లేదు. ఇంకా జీవాత్మలకు “తమది” అని చెప్పగలవి ఎవీ లేవు కాబట్టి, వారు ఆయనకు ఇవ్వగలిగేది ఏమీ లేదు. ఈ రెండింటినీ బట్టి తెలిసేది ఏమంటే పరమాత్మ మనదగ్గర ఎవీ తీసుకోడు , ఆయనకు ఇచ్చెందుకు మన దగ్గర  ఏమీ లేదు . అరుళాళ పెరుమాళ్  ఎంబెరుమానార్ తన శిష్యులను ” ఈ  విషయంలో మీరు ఏమి చెబుతారు” అని అడిగారు . “ఇరై ఏదుం ఇల్లా దాంయాం” (ఇవ్వటానికి ఏది లేనివాళ్ళం మనం) ఇందులో “నామ్” అనే ప్రయోగంలో అరుళాళ పెరుమాళ్  ఎంబెరుమానార్ ఆయన ముందు ఉన్నశిష్యులు , సమస్త జీవాత్మలు ఉన్నారు.  ఇందులో పరమాత్మ మాత్రమే మినహాయింపు . “అగలగిల్లేన్ ఇరైయుం ఎనృ” అన్నట్టుగా  ఉంటుంది,అనగా “క్షణమైనా పిరాట్టి స్వామిని వదిలి ఉండదు “. జీవాత్మ యొక్క నిజమైన స్వభావాన్ని పరిశీలిస్తే (అ) జీవాత్మ పరమాత్మ యొక్క ఆస్తి (ఆ) పరమాత్మతో  జీవాత్మకు  ఉన్న సంబంధం- యజమానికి సొత్తుకు ఉన్న సంబంధం కావున , ఆత్మ ద్వారా చేయవలసినది  ఏదీ లేదు. ఆయన అన్ని విషయాలలో పరిపూర్ణుడు, అందుచేత ఆయనను పూరించడానికి  ఏదీ అవసరం లేదు. ఒక బిచ్చగాడు సమస్త సంపదలు  కలిగి ఉన్న వాడికి ఇవ్వవలసింది ఏమీ లేదు. ధనవంతుడు ఒక బిచ్చగాడి  దగ్గరకు వెళ్లి అతని ధనాన్ని తీసుకొని సంపన్నుడు కావలసిన అవసరం లేదు . కాబట్టి జీవాత్మ ఏమి ఇస్తుంది? పరమాత్మ ఏమి తీసుకుంటాడు? రెండు ప్రశ్నలకు జవాబు లేదు .

           కాబట్టి, ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి , దాని ప్రకారం జీవించడానికి జీవాత్మా ప్రయత్నించాలి. జీవత్మా పరమాత్మ యొక్క ఆస్తి అని తెలుసుకుని, తను పరమాత్మకు చేయవలసినది ఏమీ ఉండదు అని గ్రహించాలి . యజమాని తన సంపదను రక్షించుకొవటానికి జాగ్రత్త పడతాడు. ఆయన ఇచ్చిన జీవితం గడపడమే జీవాత్మ యొక్క బాధ్యత. ఇది తిరుమంత్రములోని  మధ్యమ  పదంమైన “నమః” పద  సారాంశము .

       ఇక్కడ శ్రీవచనభూషణం నుండి కింది చూర్ణిక గురించి ఆలోచించాలి. “పలతుక్కు ఆత్మా జ్ఞానముమ్ అప్రతిషేదముమ్ వేండువదు. అల్లదు పోదు బంధతుక్కుమ్ పూర్తిక్కుమ్ కోత్తయామ్ “.

మరి రెండు చూర్ణికలలో  “అంతిమ కాల్లతుక్కు తమ్జమ్, ఇప్పోదు తమ్జమే ఎన్ర నినైవు  కులైగై ఎన్రు జీయర్ అరుళిచెయ్వార్”.

“ప్రాప్తావుం ప్రాపగనుం  ప్రాప్తిక్కి ఉగప్పనుం అవనే “.

       ఈ చూర్ణికలకు సంబంధించిన కథ ఒకటి ఉంది. నంజీయర్ తన శిష్యులలో ఒకరు అంతిమ కాలంలో ఉన్నప్పుడు  వారి దగ్గరకు వెళ్ళారు. తన ఆచార్యులైన నంజీయర్ను చూసి ఆయన ఆనందించాడు . అంతిమ క్షణాలలో ఏదైనా చెప్పమని అడిగాడు. దానికి నంజీయర్, “మనము శ్రీమన్నారాయణుని సొత్తు ,యజమాని మాత్రమే సొత్తును రక్షించుకునె ఉపాయాన్ని వెదకాలి. మనము కాదు ‘ అని  జవాబిచ్చారు.  జీవన కాలంలో అయినా అంతిమ కాలంలో అయినా సరే మనల్ని రక్షించుకునె ఉపాయాన్ని మనము వెతకవలసిన అవసరము లేదు. అప్పుడే శ్రీమన్నారాయణుడు మన రక్షణ భారం వహిస్తాడు.

       శ్రీరామాయణంలో, అడవిలో ఋషులు శ్రీరాముడిని కలుసుకున్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్న పిల్లలుగా వారు తమని తాము భావించారు. గర్భం లోపల శిశువు యొక్క చర్యలన్నీ  శిశువును రక్షించే తల్లి నియంత్రణలో ఉండటం దీనికి కారణం. అదేవిధంగా, వారు శ్రీమన్నారాయణుని రక్షణలో ఉన్నామని  చెప్పారు. కాబట్టి జీవాత్మ యొక్క కార్యకలాపాలు పరమాత్మ అధీనంలోనే ఉంటాయి . దీనినే పారతంత్ర్యం అంటారు. కొన్నిసార్లు, దీనిని “అఛిత్ వత్ పారతంత్ర్యం ‘” గా పేర్కొనడం జరిగింది. ఇది జీవాత్మ యొక్క లక్షణము. అంతే  కాదు, జీవాత్మను  ఎక్కడ ఉంచుతామో అక్కడే ఉండి తనను తాను  రక్షించుకోవడానికి స్వప్రయత్నం ఎదీ లేనట్లు ఉంటుంది . ఇది పూర్తిగా పరమాత్మ పై ఆధారపడి ఉంటుంది , అందువల్ల పరమాత్మ ఆ సమయంలో దానిని ఎక్కడ ఉంచితే అక్కడ అదే స్థితిలో ఉన్న ఒక అచేతన జీవి వంటిది. తిరుక్కోళూర్ పెణ్ పిళ్ళై వార్తలలో “వైత్త ఇడత్తిల్ ఇరుం దేనో బరతళ్వానై పోలే” అన్నారు. కులశేఖర ఆళ్వార్లు “పడియాయ్  కిండందున్ పవళవాయ్ కాణ్ న్బేనే ” అన్నారు . ఈ స్థితిలో ఆత్మ ఉంటే, అప్పుడు పరమాత్మ రక్షిస్తాడు .

        శ్రీరామాయణం యుద్దకాండలో సుగ్రీవుడి సేన రాత్రి పూట శ్రీరాముడిని, లక్ష్మణుడిని తాము రాక్షసుల నుండి రక్షించాలని చర్చించుకొని నిర్ణయించుకున్నాయి. రాత్రి అయింది , నిద్రను ఆపుకోలేక జోగుతూ ఆఖరికి నిద్ర పోయాయి . అప్పుడు శ్రీరామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి రాత్రంతా కాపలా కాశారు . అర్థాత్ శ్రీమన్నారాయణునికి రక్షకత్వం సహజ గుణము . ఆయన రక్షణను అడ్డుకోకుండా ఉండటం జీవాత్మ యొక్క విధి అని చెపుతున్నారు.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-6/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment