ప్రమేయసారము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురం 1

అవతారిక:

కిందటి పాశురంలో 1.బధ్ధులు 2.ముక్తులు 3.నిత్యులు అని మూడు విధాల ఆత్మలను గురించి చెప్పారు. ఇందులో  నిత్యులు జనన మరణ చక్రములో పడక నిరంతరము పరమాత్మ కైంకర్యంలోనే ఉండేవాళ్ళు. ముక్తులు ఒకప్పుడు జనన మరణ చక్రములో పడ్డ వాళ్ళైనా దాని నుండి విముక్తిని పొందిన వాళ్ళు. బధ్ధులు మాత్రం ఇంకా జనన మరణ చక్రములో పడి క్లేశభాజమైన జీవనాన్ని గడిపేవాళ్ళు. దీనికి కారణమేమిటి?, దీని నుండి బయట పడే మార్గమేమిటి అని ఈ  పాశురంలో చెపుతున్నారు.

 

కులం ఒన్ఱు ఉయిర్ పల తన్ కుఱ్ఱత్తాల్ ఇట్ట

కలం ఒన్ఱు కారియముం వేఱాం

పలం ఒన్ఱు కాణామై కాణుం కరుత్తార్ తిరుత్తాళ్గళ్

పేణామై కాణుం పిళై

 

ప్రతి పదార్ధం :

కులం = కైంకర్య పరుల కులము

ఒన్ఱు = ఒక్కటే ఉన్నది

ఉయిర్ = కైంకర్యము చేసె ప్రాణులు

పల = అనేకములు, లెక్కకు మిక్కిలి అయినవి

తన్ కుఱ్ఱత్తాల్ = అవి చేసే మంచి చెడు కార్యాల వలన

ఇట్ట = భగవంతుడిచే ఇవ్వబడినవి అనేకములైన

కలం = దేహమనే ఘటము

ఒన్ఱు = ఒకే మూల పదార్ధంచే చేయబడినవి

కారియముం = చేతనుల కర్మలు

వేఱాం= విభిన్నములు

పలం ఒన్ఱు = ఒక ఫలితాన్ని

కాణామై = ఆశించకుండా

కాణుం = చేతనులను కటాక్షించు

కరుత్తార్ = ఆచార్యుని

తిరుత్తాళ్గళ్ = శ్రీపాదములు

పేణామై కాణుం = శరణాగతి చేయని వాడు

పిళై = పుట్టటమే దోషము

 

వ్యాఖ్యానము:

కులం ఒన్ఱు……..సమస్త జీవులకు కులము ఒక్కటే. అది భగవంతునికి  దాసులుగా వుండే కులము. అనగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించక పరమాత్మ ఆజ్ఞానుసారంగా ప్రవర్తించటం. ఇది జీవుల సహజ గుణము. ఇది ఎన్నటీకీ మారనిది, స్థిరమైనది. జ్ఞానులు దీనిని దాసకులము అంటారు.

‘ తొండర్ కులత్తులుళ్ళీర్ ‘ (దాసకులములో ఉన్న వారు )అని  తిరుపల్లాండులో పెరియాళ్వార్లు చెప్పారు.

ఉయిర్ పల……..ఆత్మలు లెక్కకు మిక్కిలి అవి పరమాత్మకు లోబడి అనేకములుగా ఉన్నాయి.

తన్ కుఱ్ఱత్తాల్ ఇట్ట కలం ఒన్ఱు……..ఈ జీవాత్మలు తాము చేసిన పాప పుణ్యముల వలన భగవంతుడు నిర్ణ యించిన  ఘటములను  (దేహాలను) ధరించాల్సి వుంటుంది .ఈ దేహాలన్ని ప్రకృతి అనే ఒకే రకమైన పదార్థముతో తయారైనవి. అందు వలన అవి అన్ని ఒక్కటిగానే ఉంటాయి. ఉదాహరణకు మట్టితో చేసిన వస్తువులు ఏవైనా (కుండ, ప్రమిద,ముంత) అవి మట్టివే. బంగారంతో చేసిన వస్తువులు ఏవైనా ( గాజులు, గొలుసు, విగ్రహం ) అవి బంగారమే అవుతుంది . అలాగే ప్రకృతితో చేయబడిన శరీరాలు ఏవైనా ప్రకృతే అవుతుంది. ‘ తం కుఱ్ఱత్తల్ ఇట్ట కలం ఒండ్రు ‘ ( తాము చేసిన దోషాల ఫలితంగా ఇచ్చిన ఘటము (దేహము) ఒక్కటే). దేహములలో జీవులను ప్రవేశపెట్టడం ఆయా జీవులు చేసుకున్న కర్మల ఫలితమే కాని వేరు కాదు అని గ్రహించాలి.

 

‘ ఊర్వ పదినొన్ఱాం ఒంబదు మానుడం

నీర్ పఱవై నాఱ్కాల్ ఓర్ పప్పతు

సీరియ బందమాందేవర్ పదినాలు అయన్ పడైత

అందమిల్ సీర్తావరం నాలైందు ‘

 

(పదకొండు రకాల శరీసృపాలు, తొమ్మిది రకాల మనుషులు,  జలచరాలు, తిర్యక్కులు, చతుష్పాదులు ,పర్వతాలు,  పద్నాలుగు రకాల దేవతలు, స్థావరాలు తొమ్మిది రకాలు అన్నీ బ్రహ్మచే సృష్టించబడ్డాయి.  )

పై పాశురములో జీవులకు దేహములు ఎన్నిరకాలుగా ఉంటాయో చెపబడింది. మళ్ళి వీటిలో అంతరంగ బేధాలు వేలకు వేలు ఉంటాయి. అన్ని బేధాలున్నప్పటీకి అన్నీ  ప్రకృతి వలన ఏర్పడిన దేహాలేనని గ్రహంచాలి. దీనినే ‘ కలం ఒండ్రు ‘ (ఘటం ఒక్కటే) అన్న ప్రయోగంలో చెప్పారు.

“పిణక్కి యావయుం యావరుం

పిళయామల్ బేదిత్తుం బేదియాదదు ఓర్

కణక్కిల్ కీర్తి వెళ్ళ కదిర్

జ్ఞాన మూర్తియినాయ్”

 

అన్న తిరువాయిమొళి పాశురములో  ఆయా జీవాత్మలు చేసిన కర్మ ఫలంగా ఎన్నెన్ని  సార్లు సృష్టి, లయ జరిగినా లెక్క తప్పి పోకుండా ఆయా జీవాత్మలే వాళ్ళ వాళ్ళ కర్మఫలం అనుభవించేట్లుగా చేస్తారని చెప్పబడుతోంది.

కారియముం వేఱాం….. …జీవాత్మలు కర్మ వశమున పొందే శరీరములతో చేసే కర్మలు కూడా వేరు వేరుగానే ఉంటాయి. ఆ కర్మలు మంచివైతే వాటి వలన పుణ్యమును పొంది స్వర్గంలో సుఖాలను, ఆ కర్మలు చెడ్డవి ఐతే వాటి వలన పాపాన్ని పొంది నరకంలో ఉండి కష్టాలను అనుభవించాల్సి వుంటుంది. ఆ రెండు మార్చి మార్చి అనుభవిస్తూ ఈ దేహ యాత్ర చేయవలసి వుంది.

“వగుత్తాన్ వగుత్త వగైయల్లాల్ కోడి తొగుత్తార్కుం తుయ్తలరిదు” అని తిరుక్కురళ్ లో అన్నారు.

కారియముం…….‘ కారియముం ‘ అన్న ప్రయోగం వలన జీవాత్మలు అనేకం, కులము మాత్రము ఒక్కటే అని చెప్పినట్టుగా కర్మవశమున పొందిన దేహము ఒక్కటే అయినా దానితో  చేసే కర్మలు , వాటి ఫలితాలు అనేకములు అని గ్రహించాలి. పరమాత్మకు దాసులవటం జీవులకు సహజ  ధర్మం . ఈ జీవాత్మలకు పాప, పుణ్యాలనే కర్మల కొనసాగింపు,  ,  దాని ఫలితంగా మరల, మరల పుట్టటం ,గిట్టటం అన్నది నదీ ప్రవాహం లాగా జరుగుతూ వుంటాయి. దీనికి కారణము ఏవిటి అని అలోచిస్తే

పలం ఒన్ఱు కాణామై కాణుం

కరుత్తార్ తిరుత్తార్గళ్పేణామై

కాణుం ‘పిళై

అన్న తరువాతి పద ప్రయోగములో తెలుస్తుంది.

‘పిళై …….’ కరుత్తార్ తిరుత్తార్గళ్పేణామై కాణుం  పిళై ‘ ….అంటే దోషాలను సరిదిద్ది మంచి మార్గంలో నడిపించే ఆచార్యుని శ్రీ పాదాలను ఆశ్రయించకపోవటమేకారణం . ఆచార్యుల ఔన్నత్యం ఎంతటిదో ఇక్కడ స్పష్టంగా  తెలుస్తున్నది .’ పలం ఒన్ఱు కాణామై కాణుం కరుత్తార్ ‘ ( ఫలితమేదీ ఆశించకుండా కృప చేసే అచార్యులు ),  అచార్యులు  తన పేరు కోసమో, ఇతర ప్రయోజనాలను ఆశించో కాక ఈ జీవాత్మను  ఉధ్ధరింప బడటమే ప్రధాన ప్రయోజనంగా శిష్యులను స్వీకరిస్తారు . ’ వీడు పేరు అడైదల్ ‘(ఇంటి పేరు పొందటం  ) జీవాత్మలు నిత్యనివాసమైన వైకుంఠం చేరడం కోసం వారిని అనుగ్రహిస్తారు . జీవాత్మలు అలాంటి ఉన్నతమైన ఆచార్యుల శ్రీపాదాలను శరణాగతి చేయక పోవటమే దోషము అని అంటున్నారు.

       ఆచార్య కటాక్షం పొందటమే జీవాత్మకు క్షేమము, శుభకరము అని దీని వలన తెలుస్తున్నది. ఆచార్య కటాక్షం పొందిన జీవాత్మ పాపాలను తొలగించుకొని శుభాలను పొంది అంతిమంగా పరమపదం చేరగలదు. ఈ పాశురంలో ఆచార్యుల గొప్పదనము తెలియజేశారు. శ్రీపాదాలను చేరటం అంటే పరమపదం పొందాలన్న కొరిక… చేరక పోవటం అంటే ఆ కొరిక లేక పోవటం, అదే దోషం.

“భగవల్లాభం ఆచర్యనాలే; ఆచార్య లాభం భగవానాలే. ఆచార్య సంబంధం కులైయాదే కిడందాల్ జ్ఞాన భక్తి వైరాగ్యంగళ్ ఉణ్దాక్కి కొళ్ళలాం. ఆచార్య సంబంధం కులైందాల్ అవై (జ్ఞాన, భక్తి) ఉణ్దానాలుం ప్రయోజణం ఇల్లై. తాలి  కిడందాల్ భూషణంగళ్ పణ్ణి పూణలాం. తాలి పోనాల్ భూషణంగళ్ ఎల్లాం అవధ్యత్తై విళైక్కుం.  స్వాభిమానత్తాలె ఈశ్వర అభిమానత్తై కులైత్తు కొండ ఇవనుక్కు ఆచార్య అభిమానం  ఒళియ గతి ఇల్లై ఎన్ఱు పిళ్ళై పల కాలుం అరుళి చెయ్ కెత్తు ఇరుకైయాయిరుక్కుం. స్వస్వాతంత్రియ భయత్తాలె భక్తి నళువిఱ్ఱు, భగవద్ స్వాతంత్రియ భయత్తాలె ప్రపత్తి నళువిఱ్ఱు. ఆచార్యనైయుం తాన్ పఱ్ఱుం పఱ్ఱు అహంకార గర్భమాగైయాలె కాలంగొణ్డు మోదిరం ఇడుమో పాది. ఆచార్య అభిమానమే ఉత్తారకం” (శ్రీవచన భూషణం 434).

( భగవల్లాభం ఆచార్యుల వలన; ఆచార్య లాభం భగవంతుని వలన. ఆచార్య సంబంధం తొలగక పోతే జ్ఞాన భక్తి వైరాగ్యములను పొందవచ్చు. ఆచార్య సంబంధం తొలగి పోతే జ్ఞాన భక్తి వైరాగ్యములను పొందగలిగినా ప్రయోజనము లేదు . తాళి ఉంటే భూషణములను ధరించ వచ్చు . తాళి  లేక పోతే భూషణములు అవధ్యాన్ని సూచిస్తుంది. స్వాభిమానము వలన ఈశ్వర అభిమానమును పోగొట్టుకున్న వీడికి  ఆచార్య అభిమానం  తప్ప గతి లేదని నంపిళ్ళై చాలా సార్లు చెప్పారు .  స్వస్వాతంత్ర్య భయము వలన భక్తి జారి పోయింది, భగవద్ స్వాతంత్ర్య భయము వలన ప్రపత్తి  జారి పోయింది. ఆచార్యుని  తాను ఆశ్ర్యించిన విధము  అహంకార భూయ్ష్టమైనది. కాలంతీరాక ఉంగరం తొడిగినట్లు! ఆచార్య అభిమానమే ఉత్తారకం” (శ్రీవచన భూషణం 434).  )

పైన చెప్పిన శ్రీవచన భూషణ చూర్ణిక వలన  ఒకడు ఇంటి  పేరు అనే వైకుంఠం పొందడానికి శాస్త్రాలలో చెప్పబడిన భక్తి వలననో, కారుణ్యమూర్తి అయిన భగవంతుడి శ్రీపాదాల ముండు చేసే శరణాగతి వలననో జరగదు అని పెద్దలు సహేతుకంగా నిరూపించారు. మరి చేతనుడు జనన మరణ చక్రం నుండి విడివడి మొక్షాన్ని పొందాలంటే ఎం చేయాలంటే సదాచార్యుని ఆశ్రయించటమే మార్గము అని సారంశం . ఆ ఆచార్యులు ‘ వీడు మనవాడు ‘ అని కృపతో కటాక్షిస్తే చాలు సకల లాభాలు చేకూరుతాయి . ఆచార్య కటాక్షం లేకపోతే ఆ జీవుడు ఉన్నత గతిని పొందలేడు అని ఈ పాశురంలో చెపుతున్నారు.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-2/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment