ఆర్తి ప్రబంధం – 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 25

ramanuja_vaibhavam_8_per

ప్రస్తావన

ఈ పాశురములో మణవాళ మామునులు, శ్రీ రామానుజుల హృదయమును తెలిసిన వారై, వారి తరపున మాట్లాడుచుండెను. మణవాళ మామునులకు శ్రీ రామానుజులు ఏ విధముగా అలోచిస్తునారని ఎరిగి, ఈ పాశురము వాటి తో నింపెను. తమను త్వరగా పరమపద ఆరోహణమును ప్రసాదించమని కొరెను. ” మణవాళ మామునులు అను ఇతను మా చెంత చేరిన రోజు నుండి ఎన్నో పాపములను చెసెను. నేను కాకపోతె, ఇంకెవరైన తనయొక్క, ఇంతటి పాపపు మూటనుండి రక్షించెదరు? ఎవ్వరు లేరు కావున మనమే ఏదైనను చేయ వలెను.” అని శ్రీ రామానుజులు తలెచెను. శ్రీ రామనుజుల ఈ విచారమునే మణవాళ మామునులు తన హృదయమునుంది వచ్చినట్లుగా ఈ పాశురమున పునర్ఘటించెను. మణవాళ మామునులు దీనిని కొనసాగిస్తు, శ్రీ రామానుజులు తప్ప ఇంకెవ్వరి వలన తన వంటి ఏవిధమైన ఆశ్రయము లేని వారికి ఒకే శరణ్యము శ్రీ రామానుజులే అని చెప్పెను. కరుణే స్వరూపమైన పెరియ పెరుమాళు మొదలగు వారికైనను మమ్ము రక్షించుట సాద్యమా? శ్రీ రామానుజులే తమకు అత్యంత గమ్యమైన పరమపదమును చేరవలెనని వాంఛను కలుగ జేసినవారని మణవాళ మామునులు పేర్కొనెను. కావున తనకు పరమపదము యందు స్తానమును శ్రీ రామానుజులే నిశ్చయ పరచ వలెనని మణవాళ మామునులు ప్రార్ధించెను. మరియు తను ప్రతిదినము చేసె ఎన్నడగలేని ఆపరాధములను యేమైనను క్షమించెదనని శ్రీ రామానుజులు తలచునని మణవాళ మామునులు చెప్పెను. తనను పెరియ పెరుమాళ్ మొదలగు వారేవ్వరు రక్షించుటలేదు, శ్రీ రామానుజులే అన్ని పాప కర్మములనుండి తన రక్షణ కొరకు కృంశించుచుండెనని మణవాళ దృఢముగా నమ్ముచున్నారు.

పాశురం 26

తెన్నరంగర్క్కామో? దేవియర్గట్కామో?
సేనైయర్కోన్ ముదలాన సూరియర్గట్కామో?
మన్నియసీర్ మాఱన్ అరుళ్మారి తమక్కామో?
మఱ్ఱూం ఉళ్ళ దేశిగర్గళ్ తన్గళుక్కుమామో?
ఎన్నుడైయ పిళై పొఱుక్క యావరుక్కు ముడియుం?
ఎతిరాసా ఉనక్కు అన్ఱి యాన్ ఒరువరుక్కు ఆగేన్
ఉన్ అరుళాల్ ఎనక్కు రుచి తన్నైయుం ఉణ్డాక్కి
ఒళివిసుమ్బిల్ అడియేనై ఒరుప్పడుత్తు విరైన్దే!!!

ప్రతి పద్ధార్ధం

ఎతిరాసా – ఓ ఎమ్పెరుమానారే!!!
తెన్నరన్గర్క్కామో?- (మా దోషములను క్షమించుటకు ) పెరియ పెరుమాళ్ సమర్ధులా? లేదా
దేవియర్గట్కామో? – వారి దివ్య దేవేరులగు పెరియ పిరాట్టి మొదలుగొను వారికి సాద్యమగునా? లేదా
సేనైయర్కోన్ ముదలాన సూరియర్గట్కామో? – సేనాపతియాళ్వాన్ మొదలగు నిత్యసూరులు సమర్దులా? లేదా
మన్నియ సీర్ – భాగవతుల యందు ఎల్లప్పుడు వాత్సల్యమను కలిగి ఉండు
మాఱన్ – నమ్మాళ్వార్లకు అది చేయుట సాద్యమా? లేదా

అరుళ్మారి తమక్కామో? – చేతనులందరి యందు కరుణను కురిపించు తిరుమన్గై ఆళ్వార్లకు అది సాద్యమా?
మఱ్ఱూమ్ ఉళ్ళ – ఇంకెవరికైనను
దేసిగర్గళ్ – నాధమునిమొదలగు ఆచార్యులు
తన్గళుక్కుమామో? – ఇది చేయగలరా?
యావరుక్కు ముడియుమ్? – ఎవరికి సాద్యమగును?
పిళై పొఱుక్క – అపరాధములను క్షమించుటకు
ఎన్నుడైయ – నా యొక్క
యాన్ – నేను
ఒరువరుక్కు ఆగేన్ – ఇంకెవ్వరికి దాసుడనుకాను
ఉనక్కు అన్ఱి – మీకు తప్ప
ఉన్ అరుళాల్ – మీ కృపా కటాక్షముతో
రుచి తన్నైయుమ్ ఉణ్డాక్కి – ప్రాప్యమందు (పరమపదం) రుచిని పెంపొందించి
ఎనక్కు – నాలో
ఒరుప్పడుత్తు అడియేనై – (మీరు) చేర్చ వలెను
ఒళివిసుమ్బిల్ – అత్యంత దేదీప్యమైన పరమపదం.
విరైందే– మిక్కిలి వేగముగా

సామాన్య అర్ధం

మణవాళ మామునులు శ్రేష్ఠులలో శ్రేష్ఠులైన పెరియ పెరుమాళ్, వారి దివ్య దేవేరులు, నిత్యసూరులు, ఆళ్వారులు మరియు శ్రీ రామానుజులను తప్ప ఇతర ఆచార్యులు మొదలగు వారి గూర్చి ఈ పాశురమున మాట్లాడుచుండెను. వారెవ్వరికి తన అపరాధములను క్షమించి తనను రాక్షించు సాధనము లేదు. శ్రీ రామానుజులకు మాత్రమే ఆ దక్షత మరియు కారుణ్యము ఉన్నది. శ్రీ రామానుజుల ఈ ఆలోచనను మణవాళ మామునులు వివరించుచు తనను పరమపదమునకు చేర్చి అక్కడ వారిలో ఒకరిని చెయ్యవలెనని ప్రార్ధిస్తూ పాశురమును ముగించెను.

వివరణ

మణవాళ మామునులు ” ఓ యతిరాజా! సర్వ శక్తుడైన, ఎవ్వరి లేద దేని యొక్క సాయము లేకుండ అన్నియూ తెలుసుకో గలిగిన ఎమ్పెరుమాన్లు కూడ మా యొక్క పాపముల కొలత వెయ్యలేరు. మా ఈ పాపములను మన్నించు వారు ఎవ్వరు ఉన్నరు? “దోషాయద్యభితస్యస్యాత్” మరియు “ఎన్ అడియార్ అదు సెయ్యార్ సెయ్దారేల్ నన్ఱు సెయ్దార్ (పెరియాళ్వార్ తిరుమొళి 4.9.2)” అను వాక్యములచే వర్ణించబడు పెరియ పెరుమాళ్ మా ఈ పాపములను మన్నించెదరా? మా యొక్క ఈ పాపములచే వారు వారి శాంతమును కోల్పోయెదరు. “నకస్చిన్ నపరాద్యతి (శ్రీరామాయణం)” మరియు “కిమేతన్ నిర్దోశః ఇహజగతి (శ్రీ గుణ రత్న కోసం)” అను పదములతొ వివరించ బడిన గుణములు గల పెరియ పిరాట్టితొ మొదలుకొని పిరాట్టి యులందరైనను మా పాపములను సహనముతొ క్షమించగలరా? మిక్కిలి కాంక్షతో పెరియ పెరుమాళ్, పిరాట్టియుల కైంకర్యములను పొందిన విశ్వక్శేనులు మొదలగు నిత్యసూరులైనను మా ఈ పాపములను మన్నించు సమర్ధత గలరా? “అస్మాభిస్ తుల్యోభవతు” చే చెప్పబడిన యట్లు పేరుమాళ్ పిరాట్టులకు కైంకర్యము చేయు విషయములో నిత్యసూరులందరు సమానులే. “విశ్వక్సేన సంహిత” మరియు “విహకేంద్ర సంహిత” లో ప్రపత్తి గూర్చి తెలియ పరచినది ఈ నిత్యసూరులే. ఏ ఒక్క నిత్యసూరులైన నన్ను క్షమించరా? ఎల్లప్పుడు వాత్సల్యమును కళ్యణ గుణముతో సంపూర్ణమై, “పయనన్ఱాగిలుం పాంగల్లరాగిలుం సెయల్ నన్ఱాగత్తిరుతి పణికొళ్వాన్ (కణ్ణినున్ చిరుత్ తామ్బు 10)” అను వాక్యమునకు రూపముగా ఉన్న నమ్మాళ్వార్లైనను మా పాపములనుండి మమ్ము విముక్తులను చేయగలరా? చేతనులందరి మీద తన కృపను కురుపించు తిరుమంగై ఆళ్వార్లైనను మా పాపములను మన్నించగల సమర్ధుల? ఆళ్వార్ల అనుగ్రహమునకు పాత్రులైన, క్రుపా మాత్ర ప్రసన్నాచార్యులగు నాథముని, యామునముని మొదలగు వారికైనను సాధ్యమా మా ఈ పాపములను క్షమించుటకు? ఏవిధమైన పాపములైనను భరించి, సహనముతొ క్షమించు గుణముగల శ్రీ రామానుజులైన మిమ్ము తప్ప పై చెప్పబడిన శ్రేష్ఠులలో ఎవ్వరైనను మా పాపములను మన్నించుట సాధ్యమా? వారెవ్వరికిని మా పాపములను క్షమించుట సాధ్యము కాదు. “నిగరిన్ఱి నిన్ఱవెన్నీసదైక్కు నిన్ అరుళిన్గణన్ఱిప్ పుగలొన్ఱుమిల్లై (రామానుస నూఱ్ఱందాది 48)” పాశురమున మిమ్ము వర్ణించినట్లు మీరు కరుణా సముద్రులు మరియు ఎంతటి పాపముల మూట్ట ఉన్నవారినైనను క్షమించి రక్షించెదరు. కావున మేము మీకు చెందిన వాడను, ఇంకెవ్వరివాడనుకాను” అని చెప్పను.
” మీ యొక్క అనుగ్రహముచే మేము మీ పాదపద్మములను ఆశ్రయించుట సాధ్యమైఎను. అదే విధముగా మేము శరణాగతి చెసిన తరువాత, మాలో ప్రాప్యమును చేరు చింతన మీ కృప చేతనే అంకురించెను. “సుడరొళియాయ్ నిన్ఱ తన్నుడైచోది (తిరువాయ్ మొళి 3.10.5)” మరియు “తెళివిసుమ్బు (తిరువాయ్ మొళి 9.7.5)” అను ప్రబంద వాక్యములలో చెప్పినట్లు మమ్ము మీరు పరమపదమున చేర్చి అక్కడి వారిలో ఒక్కరిగా చేయవలెనని మిమ్ము ప్రార్ధిస్తున్నాను. “అన్గుఱ్ఱేన్ అల్లేన్ (తిరువాయ్ మొళి 5.7.2)” లో పేర్కొన్న విధముగా, పరమపదములో ని వారినుండి బహిష్కృతుడగునులోపు, మమ్ము త్వరగా అక్కడకి చేర్చుము. “ఉనక్కన్ఱి” (మిమ్ము తప్ప) అను పదము, “తెన్నరన్గర్…..ఎతిరాస” మరియు “యాన్ ఒరువరుక్కు ఆగేన్” అను రెండిన్టికీ సంబంధము చూపును. (అనగా ఇది ” శ్రీ రామానుజులు తప్ప ఇంకెవ్వరు మణవాళమామునుల పాపములను క్షమించలేరు” మరియు ” మణవాళమామునులు శ్రీ రామనుజుల వారు తప్ప ఇంకెవ్వరి వారు కారు” అను రెండింటి అర్థమును చెప్పును) ” అని మామునులు కొనసాగించెను.
పై చెప్పబడి శ్రేష్ఠులందరూ ఎందులకు మణవాళ మామునుల పాపములను ఓర్చి, మన్నించి మరియు రక్షించలేరని క్రింద వివరిస్తున్నారు. శ్రీమన్ నారాయణులు నిరంకుస స్వాతంత్రియం ( ఏ కారణమునకు కట్టు బడక, సర్వస్వాతంత్రియము) అను గుణముతో ఉన్నవారు. కావున వారు ఎవరినైనను ఎప్పుడైనను, “క్షిపామి” మరియు “నక్షమామి” అని తెలియపరిచినట్లు వారు చెసిన పాపములకు దండించ వచ్చును. ఇంక పిరాట్టులు “క్షామా లక్ష్మీ భృంగీసకల కరణోన్మాతనమదు” మరియు “తిమిర్ కొణ్డాళ్ ఒత్తు నిఱ్క్కుమ్ (తిరువాయ్ మొళి 6.5.2)” లో చెప్పినట్లు వారి నాధునకు పూర్తిగా కట్టుబడి ఒక శిలను పోల్చి ఉండును. అనగా వారు మన పాపములను మన్నించు స్థితిలో లేకుండెను. తరువాత ఎల్లప్పుడు ఎమ్పెరుమాన్లు మరియు పిరాట్టి యులకు కైంకర్యము చేయు నిత్యసూరులు, కాల నిమ్మిత్తము లేని పరమపదమున కూడ దివ్య దంపతులకు ఏ హాని కలుగునో అన్న చింతనలోనే ఉండును. వారు “ఆంగరవారం అదు కేట్టు అళలుమిళుం (నాన్ముగన్ తిరువందాది 10)” లొ తెలిపినట్లు నిత్యసూరులు శ్రీమన్ నారాయణునకు మరియు దివ్య దెవేరులకు ఏ విధమైన ఆపద పొంచి ఉన్నదెమో అని నిరంతరము వ్యాకులత చెందెదరు. కావున వారు మాణవాళ మామునుల పాపములను క్షమించి రక్షించలేరు. తరువాత వారు నిత్యము ఎమెరుమాన్ మరియు పిరాట్టుల చరణ కమలము యందు కైంకర్యమున కోసం కాంక్షించు ఆళ్వార్లు. వారు “సిన్దై కలన్గి తిరుమాళ్ ఎన్ఱళైప్పన్ (తిరువాయ్ మొళి 9.8.10)”, “ఉన్నైకాణుమ్ అవావిల్ వీళ్న్దు (తిరువాయ్ మొళి 5.7.2)”, “ఉన్నైక్కాణుమ్ ఆసై ఎన్నుమ్ కడలిల్ వీళ్న్దు (పెరియ తిరుమొళి 4.9.3)” అన్డ్ “భక్తి పారవశ్యత్తాలె ప్రపన్నర్గళ్ ఆళ్వార్గళ్ (శ్రీ వచన భూషణం 43)” అను వాక్యములలో వర్ణించినట్లు భక్తికి మారు రూపు. కావున వారికి మమ్ము మా పాపములను క్షమించలేరు. తుదిగా ఈ దేహమునందుడువరకు ఆచారనియమములను తప్పక పాటించు ముమ్ముక్షులు ( పరమ పదమును / మొక్షమును పొందుటకు ఆకంక్షించు వారు). వారు ఈ దేహాంతమువరకు మొక్షము కొఱకు అపేక్షిస్తూ, వారి కర్మములను చెస్తూ ఉండును. అందున ఇతరులకు సదుపదేశములు చేయుట, వారి పాపములను తొలగించుట వంటి కర్మములు వారికి సంబందించినవి కావు. కాని శ్రీ రామానుజులు , ఎవ్వరినైను పాప కర్మములను క్షమించి రక్షించు విషయమున ఎట్టి నియంత్రణ లేని వారు. వారు తమకొచ్చు దొషము గూర్చి తలవక, సంసారుల యొక్క దౌర్భాగ్యామును చూచి, వారిని రక్షించెదరు. వారు సంసారుల ఙ్ఞానాఙ్ఞానముల గూర్చి చింతించరు. ఏ ఒక్కరినైనను రక్షించి వారి యొక్క అన్ని పాపములను క్షమించును. వీటితొపాటు ఆ సంసారికి “ఆళుమాళర్ ఎంగిఱవనుడైయ తనిమై తీరుంపడి (తిరువాయ్ మొళి 8.3.3)” లొ పెర్కొనట్లు ఎమ్పెరుమాన్లను మంగలాశాసనము పాడు గుణము వచ్చునట్లు వారు కరుణించును. కావున వారొక్కరే “అదు తిరుతలావదే (పెరియ తిరువన్దాది 25)” లో చెప్పినట్లు ” సంస్కరించలేము” అను వారిని కూడ సంస్కరించ గలవారు. మరియు వారు “తిరుమగళ్ కేల్వన్” అని కీర్తించబడు శ్రీమన్ నారయణులకు కైంకర్యము చేయునట్లు ఆ సంసారిని మర్చును. తిరువరంగత్తు అముదనార్ కూడ “మరుళ్ కొణ్డిళైక్కుమ్ నమక్కు నెన్జే ఇరామానుసన్ సెయ్యుమ్ సేమన్గళ్ మఱ్ఱుళార్ తరమో (ఇరామానుస నూఱ్ఱందాది 39)” అని ఇదే విషయము గూర్చి చెప్పెను.

అడియేన్ వైష్ణవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/arththi-prabandham-26/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org