జ్ఞానసారము 32

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 31

అవతారిక

                     ‘ మాడుం మనయుం ‘ అనే 30 వ పాశురములో ,   తిరుమంత్రమును ఉపదేశించిన  ఆచార్యుల శ్రీపాదములే సలక ప్రయోజనములను చేకూరుస్తుందని గ్రహించని బుధ్ధిహీనులతో సంబంధమును పూర్తిగా విడిచివేయాలని  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చెప్పారు. ‘ వేదం ఒరు నాంగిన్ ‘ అనే 31 వ పాశురములో , శరణాగతి శాస్త్రమును ఇముడ్చుకున్న  ద్వయ మహా మంత్రము ఉపదేశించిన  ఆచార్యుల శ్రీపాదములే శరణమని పరిపూర్ణ విశ్వాసమును కలిగి వుండాలని చెప్పారు . అంతటి ఉపకారము చేసిన ఆచార్యులు సాక్షాత్ రామ, కృష్ణావతరము లాగ భగవదవతారముగా గ్రహించాలి . అలా భావించని వారికి కలిగే కష్ట నష్టాలను , అలాగే దేవాలయాలలో విగ్రహ రూపములోనున్న అర్చామూర్తిని  ఏ పదార్థముతో చేశారని పరిశోదించే మూర్ఖుల కష్ట నష్టాలను ఈ పాశురములో చెపుతున్నారు.

పాశురము

“మానిడవన్ ఎన్నుం గురువై మలర్ మగళ్ కోన్

తానుగంద కోలం ఉలోగం ఎన్నుం ఈనమదా

ఎణ్ణుగిన్ఱ నీసర్ ఇరువరుమే ఎక్కాలుం

నణ్ణిడువర్ కీళాం నరగు”

ప్రతిపదార్థము

గురువై  =తనకు మంత్రమును ఉపదేశించిన గురువుని

“మానిడవన్ ఎన్నుం = సామాన్యమైన మానవునిగా భావించే వారు

మలర్ మగళ్ కోన్ = తామారలో నివసించే శ్రీమహాలక్ష్మికి నాయకుడైన నారాయణుడు

తానుగంద కోలం = తానుగా కోరి స్వీకరించిన రూపములను

ఉలోగం ఎన్నుం = పంచలోహములు మొదలగు పదార్థములుగా

ఈనమదా = హీనముగా

ఎణ్ణుగిన్ఱ = భావించే

నీసర్ = నీచులు

ఇరువరుం = ఇద్దరూ

ఎక్కాలుం = కాలతత్వమున్నంత వరకు

నరగు = నరకములో

నణ్ణిడువర్ = ఉంటారు

వ్యాఖ్యానము

మానిడవన్ ఎన్నుం గురువై…….జనన మరణ చక్రములో తిరుగుతున్న ఆత్మలను ఆ చక్రము నుండి బయట పడవేయుటానికి దేవుడే ఆచార్య రూపములో అవతరించారని విశ్వసించాలి . నారాయణుడే ఆచార్య రూపములో మానవ అవతారములో ఉన్నాడని శాస్త్రములు ఘోషిస్తున్నవి. దానికి విరుధ్ధముగా భావించేవాడు మూర్ఖుడు , వాడి విద్య విలువ లేనిది అని శాస్త్రములు చెపుతున్నవి .

మలర్ మగళ్ కోన్ తానుగంద కోలం ఉలోగం ఎన్నుం.……తామరలో నివసించే శ్రీమహాలక్ష్మికి నాయకుడైన నారాయణుడు  తానుగా కోరి స్వీకరించిన రూపములను  పంచలోహమా! , దారు శిల్పమా!,రాతి శిల్పమా! అని శోధించటము మహా పాపమవుతుంది . ఈ రూపాలను  “ఉమర్ ఉగంధ ఉరువం నిన్ ఉరువం” తిరువాయిమొళి (8-1-4) లో నమ్మళ్వార్లు పాడారు . అర్థాత్ తన భక్తులు తనను ఎలా చూడాలని కోరుకుంటారో అలాగే దర్శనమిస్తారు . అది ఏరూపమైనా దైవస్వరూపమే . అర్చా రూపమును భక్తులు నిర్మిచినప్పటికీ అందులోను తనదైన దైవీక శక్తి తోనే భగవంతుడు వేంచేసి వుంటాడు . ఆ విగ్రహానికి అలంకరించే ఆభరణాలు , వస్త్రాలు కూడా లౌకికమైనప్పట్టికి  దైవీక శక్తిని పొందుతాయి . దీనినే శాస్త్రములో అప్రాకృతము అంటారు . అలాంటి మూర్తిని ఏ పదార్థముతో చేసారని పరిశోధన చేయడము మహా పాపము . తనను కన్న తల్లిని తను పుట్టిన చోటును చూపమని అడిగినంత పాపమని శాస్త్రము చెపుతున్నది .

ఈనమదా..…..నీచముగా….గురువును సామాన్య మానవుడిగా , అర్చామూర్తిని పంచలోహాది పదార్థములుగా భావించే నీచులు . వీరు కర్మ చండాలురు అనే పాపులు .   “ఉళ్ళువదెల్లాం ఉయర్ వళ్ళల్” ( ఉన్నతముగా తలచ వలసిన హృదయములో నీచముగా తలచుత)అని తమిళమిలో ఒక సామెత ఉన్నది . వీరు అటువంటి వారు .

ఇరువరుమే…..… గురువును సామాన్య మానవుడిగా తలచే వారు, అర్చామూర్తిని పంచలోహాది పదార్థములుగా భావించే వారు, ఇరువురు నీచులే . ఈ ఇరువురికి పైన చెప్పిన పాపము తగులుతుంది .

ఎక్కాలుం నణ్ణిడువర్ కీళాం నరగు.…….ఎంత కాలమైనా నరకములో ఉంటారు. అంగా కాలతత్వమున్నంత వరకు వీరికి నరకమే గతి అని చెపుతున్నారు . కీళాం నరగు అంటే నరకములోను నీచముగా అని అర్థము . నరకమంటేనే సుఖము లేక కేవలము ధుఃఖము మాత్రమే ఉంటుంది . ఎక్కాలుం నణ్ణిడువర్ .. అలాంటి నరకమును ఎప్పటికి ఉంటాడు అని అంటున్నారు . గట్టు ఎక్కాడానికి , కనీసము దరి కూడా కనపడనంతగా జనన  మరణ కడలిలో పడి కొట్టుకుంటారు . అర్థార్ గురువును దైవముగా విశ్వచించని వాడు, అర్చా మూర్తిని దైవముగా భావించక మూర్తి యొక్క పదార్థ పరిశోధన చేసే వాడు నీచాతి నీచులు , ఇద్దరు నీచమైన  నరకములో కాలతత్వమున్నంత వరకు ఉంటారు . ఈ రెండూ సమానమైన పాపములే అని ఈ పాశురములో చెపుతున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-32-manidavan-ennum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

Leave a Comment