యతిరాజ వింశతి – 4

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 3

నిత్యం యతీంద్ర తవ దివ్యవపుస్సమ్రుతౌ మె సక్తం మనో భవతు   వాగ్గుణకీర్తనేస్సౌ!  
కృత్యంచ దాస్యకరణం తు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ!!

ప్రతి పదార్థము:

హే యతీంద్ర = ఓ యతిరాజా

మె = దాసుని

మనః = మనస్సు

తవ = దేవరవారి

దివ్యవపుస్సమ్రుతౌ  = దివ్య తిరుమేనిని స్మరిస్తూ

నిత్యం = ఎల్లప్పుడు

సక్తం = ఆసక్తి కలిగి

భవతు = ఉండుగాక

అస్సౌ మె వాక్ = తమ కీర్తించకుండా చాలా దూరములో ఉన్న దాసుని వాక్కు

తవ = తమరి

గుణకీర్తనె = కల్యాణ గుణములను ఇష్టముగా కీర్తించుటలో

సక్తా భవతు = ఆసక్తి కలిగి ఉండుగాక

కరద్వయస్య = కరద్వయములు

తవ = తమరికి

దాస్యకరణం తు = దాస్యము చేయుటయే

కృత్యం = కృత్యముగా

కరణత్రయం = త్రికరణములు (మనస్సు, వాక్కు,కర్మలు)

వృత్యంతరే = ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో

విముఖం చ అస్తు = విముఖలై వుండుగాక

భావము:

కింది శ్లోకములో యతిరాజుల శిష్యులైన కూరత్తళ్వాన్ మొదలైన వారి దాసులై వుండుటకై ప్రార్థన చేసారు. యతిరాజులకు దాసులవ్వాలని ఈ శ్లోకములో కోరుకుంటున్నారు.” కృత్యం చ ” అన్న చోట ” చ ” కారములో కళ్ళు, చెవులు ,మనస్సు రామానుజుల మీదే కేంద్రీకరించాలని కోరుకుంటున్నారు. శ్లోకములోని  మొదటి మూడు భాగాలలఓ త్రికరణ శుద్దిగా రామానుజులకే దాసులవ్వాలని, వారి కైంకర్యములలోనే నిమగ్నమై వుండాలని కోరుకొని నాలుగవ భాగములో ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో విముఖలై వుండాలని కోరుతున్నారు. భవతు ,అస్తు అనే క్రియలు ప్రార్థనను తెలియజేస్తున్నాయి. కృత్యం అంగా తప్పని విధిని చెపుతున్నది. తవ, మె అనేవి నాలుగు భాగాలకు వర్తిస్తున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-4/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment