శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
కంబర్, తిరుమంగై ఆళ్వార్ల గురించి పాడిన పాశురము ఈ ప్రబంధానికి ఆఖరి భాగముగా అమరింది.
ఇడం కొణ్డ నెంజత్తు ఇణంగిక్కిడప్పన
ఎన్ఱుం తడం తామరై సూళుం మలర్ద తణ్ పూన్
విడం కొణ్డ వెణ్ పల్ కరుం తుత్తి చెంకణ్ తళల్ ఉమిళ్ వాయి
పడం కొణ్డ పాంబణైప్పళ్ళి కొణ్డాన్ తిరుప్పాదంగళే
ప్రతి పదార్థము:
కుడంతై – తిరుక్కుడందై లో
సూళుం– ఆవరించిన
పొన్ని- కావేరి
తామరై కొణ్డ తడం ––తామర పూలతో నిండిన కొలనులు
తణ్ పూ – చల్లని, అందమైన,సుకుమారమైన, పూలు
మలర్ద – వికసించిన
ప్పళ్ళి కొణ్డాన్ – పవళించిన ఆరావముదన్
పడం కొణ్డ పాంబణై- పడగ తో కూడిన ఆది శేష శయ్యపై
విడం కొణ్డ- పడగ విప్పిన
వెణ్ పల్ – తెల్లని దంతములు
కరుం తుత్తి – పడగపై నల్లని చుక్కలు
సెం కణ్ – ఎర్రని కన్నులు
తళల్ ఉమిళ్ వాయి – నిప్పులు చెరిగే నోరు
తిరుప్పాదంగళే- శ్రీపాదములే
ఎన్ఱుం తడం ఇణంగిక్కిడప్పన- శ్రీమన్నారాయణుని శ్రీపాదములు రెండు
నెంజత్తు – మనసులో
ఇడం కొణ్డ – స్థానము పొందిన
భావము:
తిరుకుడందై ఆరావముద పెరుమాళ్ళను తిరువెళుకూఱ్ఱిరుక్కైలో తిరుమంగైఆళ్వార్ల పాడిన విధముగానే కంబర్ కూడా పాడారు. తిరుమంగై ఆళ్వార్ల గొప్పదనాన్ని కీర్తిస్తూ కంబర్ పాడిన పాశురాన్ని ఈ ప్రబంధము చివర చేర్చారు.
వ్యాఖ్యానము:
పొన్ని – తామరై కొణ్డ థడం సూళుం :చల్లని కావేరి, చల్లని, అందమైన,సుకుమారమైన, వికసించిన తామర పూలతో నిండిన కొలనులు ఆవరించి వున్న తిరుకుడందై ఉన్న ఆరావముద పెరుమాళ్ళు
విడం కొణ్డ … పాంబణై శేషశయనము పడగ విప్పిన —
విడం కొణ్డ వెణ్పల్ – అసురులను, రాక్షసులను కొరకగల విషపూరితమైన తెల్లని పళ్ళు
కరుం తుత్తి – నల్లని చుక్కలు
సెం కణ్ – పరమాత్మను రక్షించటములో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటము వలన ఎర్రబడ్డ కళ్ళు
తళల్ ఉమిళ్ వాయి – “ఆంగు ఆరవారం అదు కేట్టు అళల్ ఉమిళుం పూంకార్ అరవణై” [నాన్ముగన్ తిరువందాది]10 ) ఆది శేషుడు అక్కడ ఏదైనా అలికిడి వినపడగానే ,పరమాత్మకే కీడు తలపెట్ట ఎవరొచ్చారో అని నోటితో నిప్పులు చెరుగుతాడు.
పడం కొణ్డ పాంబణైప్పళ్ళి కొణ్డాన్ – ఆదు అరవు అమళియిల్ అఱి తుయిల్ అమరంద పరమ”, అని తిరుమంగై ఆళ్వార్లు ఇదే ప్రబందములో పాడినట్టు కంబర్ కూడా పాడారు. తెల్లని పళ్ళు, ఎర్రని కల్ళు, తెల్లని పడగపై నల్లని చుక్కలు, నీలి శరీరము, నోటి నుండి ఎర్రని మంటలు గల శేషపాన్పుపు చూసి కంబర్ మైమరచి పోయారు.
తిరుప్పాదంగళే – అందమైన్,దివ్యమైన శ్రీపాదములు రెండూ
ఇడం కొణ్డ నెంజత్తు ఇణంగిక్కిడప్పన – పెరియ తిరుమొళి లో (11-1-10) :ఆళ్వార్లు తిరుమంగై “వెళ్ళత్తాన్ వేంకడత్తానేలుం కలికన్ఱి ఉళ్ళత్తినుళ్ళే ఉళన్ కణ్డాయి”, పాడినట్లు,నారాయణుడి శ్రీపాదములు రెండూ ఆయన హృదయములో సదా నిలిచి వుంటాయి.
“విష్వస్య ఆయతనం మహత్” అని నారాయణ సూక్తములో ఉన్నట్లు సర్వేశ్వరుడికి భక్తుల హృదయమే పెద్ద కోవెల
ఈ అర్థములో నమ్మాళ్వార్లు “నెంజమే నీళ్ నగరాగ ఇరుంద ఎన్ తంజనే!” [తిరువాయిమొళి 3-8-2] ,) ‘ శ్రీవైష్ణవుల హృదయమే పెద్ద కోవెలగా భావించిన స్వామీ’ అన్నారు.
శ్రీవచన భూషణములో, పిళ్ళైలోకాచార్యులు, “అంకుత్ వాసం సాధనం, ఇంకుత్తై వాసం సాధ్యం“(అక్కడ ,కోవెలలో వాసము సాధనము – ఇక్కడ, శ్రీవైష్ణవుల హృదయములో వాసము సాధ్యము)అన్నారు.
… ఇదు సిద్దిత్తాల్ అవఱ్ఱిల్ ఆదరం మట్టమాయి ఇరుక్కుం” – శ్రీవైష్ణవుల హృదయములో వాసము దొరికితే కోవెలలో వాసమును లక్ష్య పెట్టడు.
“ఇళం కోయిల్ కై విడేల్ ఎన్ఱు ఇవన్ ప్రార్తిక్క వేణ్డుంపడియాయ్ ఇరుక్కుం” –కోవెలలో భక్తులు, తమని నిర్లక్ష్యము చేయవద్దని స్వామిని ప్రార్థించాల్సి వుంటుంది.
“ప్రాప్య ప్రీతి విషయత్వత్తాలుం, కృతఙ్ఞతైయాలుం, పిన్బు అవై అభిమతంగళాయ్ ఇరుక్కుం” శ్రీవైష్ణవుల మీద వున్న ప్రేమ చేత, వారు తన దగ్గరికి రావటానికి కారణమైన కోవెలలో కూడా వాసము చేస్తారు.
తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం 2013, తిరువాళి తిరునగరి
ఆచార్యన్ తిరువడిగళే శరణం
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ తిరువడిగళే శరణం
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
పుత్తూర్ ‘సుదర్శనం’ కృష్ణమాచార్య స్వామి వ్యాఖ్యానం దీనికి ఎంతో ఉపకరించినది.
అడియేన్ చక్రవర్తుల చుడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-13/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org
Jai Srimannarayana!
Adiyen, Maddilety (Madhu) Kanuku Ramanuja Dasan
Adiyen read Bhagavad Ramanuja Swami life history written by. Excellent one.
Great Kainkaryam.
Dasohams!