Daily Archives: February 25, 2022

ఆర్తి ప్రబంధం – 36

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 35

పరిచయము

మునుపటి పాశురములో, మాముణులు  “మరుళాలే పులన్ పోగ వాంజై సెయ్యుం ఎందన్” అని అంటూ, తాము (మాముణులు) చేసిన ఘోర పాపాల వలన బలపడి ఉన్న తమ ఇంద్రియాలు, వాటి నియంత్రణలో ఉన్న తమ మనస్సుని తిరిగి సన్మార్గములోకి తీసుకురమ్మని శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు. కానీ ఆ తరువాత కూడా, తమ పాప ప్రభావం కొనసాగుతూనే ఉంది. మాముణులు  తన మనస్సు ఈ లౌకిక భూసంబంధమైన, అల్పమైన, అసహ్యకరమైన మరియు “భోగ్యకరమైన” విషయాలపైనే ఆసక్తి చూపుతుంది అని వివరిస్తున్నారు. ఈ విషయాలు తన మనస్సు బుద్దిని గతి తప్పి నడిపిస్తున్నాయని, వాటికి మూల కారణమేమిటోనని ఆశ్చర్యపోయి, ఆ పాపాలు, వాటి ప్రభావాల మూలమేమిటో అంతు చిక్కక మాముణులు చివరకు ఈ ప్రశ్నకు సమాధానం తన వద్ద లేదని తెలుపుతున్నారు.

పాశురము 36

వాశనైయిల్ ఊఱ్ఱమో మాళాద వల్వినైయో
యేదెన్ఱఱియేన్ ఎదిరాశా!!! తీదాగుం
ఐమ్బులనిలాశై అడియేన్ మనమ్ తన్నై
వన్బుడనే తాన్ అడరుం వందు

ప్రతి పద్ధార్ధములు

ఎదిరాశా – ఓ ఎంబెరుమానారే!!!
తీదాగుం –  ఆత్మకు “హానికరం” గా భావించబడేవి
ఐమ్బులనిల్ – మనల్ని నిరంతరము ప్రభావితము చేసే ఇంద్రియములు
అడియేన్ – నేను
మనమ్ తన్నై– మనస్సు యొక్క
ఆశై – ఆశిస్తుంది (లౌకిన సుఖము).
వన్బుడనే – (ఈ ఇంద్రియములు) బలవంతముగా
తాన్ వందు– స్వేచ్ఛతో తన ఇష్టానుసారంగా, ఎటువంటి బలవంతం లేకుండా
అడరుం – శాశ్వతముగా నాలో ఉండిపోవాలని నిర్ణయించుకొని

(ఈ రుచికి / కోరికకు కారణం ఏమిటో మాముణులు అడుగుతున్నారు)
ఊఱ్ఱమో – అది పాతుకొని ఉన్న అనుబంధమా
వాశనైయిల్ – అనాది నుండి ఉన్న అసంఖ్యాక పాపకర్మలా?
అల్వినైయో – నా ప్రసిద్ధ పాప కర్మలా?
మాళాద – అవి సమాధానానికి మించినవి (ఎన్నొ తపస్సులతో కూడా తొలగించబడని)
యేదెన్ఱు – ఏమిటది?
అఱియేన్ – దాని గురించి నాకు తెలియదు. (శ్రీ రామానుజులను దీనికి కారణాన్ని కనిపెట్టి, వాటి జాడ లేకుండా తొలగించాలని మాముణులు కోరుకుంటున్నారని అర్థము).

సరళ అనువాదము:

ప్రాపంచిన సుఖాసక్తి తన ఆత్మకి “హానికారకము” అని శాస్త్రము తెలుపుతున్నా తన మనస్సు మరియు బుద్ది పాపాల నియంత్రణలో ఉన్న ఆ లౌకిక సుఖాసక్తి పట్ల ఆకర్షణకి కారణమేమిటి అని రామనుజులను మాముణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇంద్రియాలు మరియు పాపాలు అతన్ని నిరంతరము హింసించే కారణాన్ని తెలుసుకోలేక, వారు శ్రీ రామానుజులను అభ్యర్థిస్తూ కారణము అడుగుతున్నారు. అనంతరం, వాటిని నిర్మూలించి తమ శరణులోకి తీసుకోమని మాముణులు కోరుతున్నారు.

వివరణ:  

ఆత్మకి హితముకానివి కొన్ని విషయాలు ఉంటాయి. వారు “ఐంకరువి కణ్డవిన్బం (తిరువాయ్మొళి 4.9.10)” అని చెప్పినట్లుగా, ఇంద్రియాలచే ప్రేరేపితమైన ఆత్మ ఈ భౌతిక సుఖాలను వెదుకుతూ వెళుతుంది. అంతటితో ఆగకుండా, ఆత్మ ఆ సుఖానుభవము ఇంకా ఇంకా కవాలని కోరుకుంటుంది. ఈ సుఖాలు  ఆత్మకు “హానికరం” అని మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. “హరందిప్రసపం మనః” అన్న వాఖ్యములో చెప్పినట్లుగా, “ఈ ఇంద్రియాలు నన్ను అణగద్రొక్కి వాటి ఇష్టానుసారంగా అన్ని వైపుల నుండి నన్ను లాగేస్తున్నాయి. మీ పాద పద్మాల యందు నేను శరణాగతి చేసి మిమ్ములనే శరణుగా స్వీకరిస్తున్నాను”.  మాముణులు దీనికి కారణం ఏమిటో ఊహించి శ్రీ రామానుజులను అడుగుతున్నారు. కూరతాళ్వాన్లు చెప్పినట్లుగా, “దుర్వాసనాత్రది మత స్సుఖమిందిర్యోత్తం హతుం నమే మదిరలం వరదాదిరాజః”, అనాదిగా అనేక జన్మలలో ఆర్జించిన పాపాల వలలో నేను చిక్కుకున్నానా? లేదా,  “మదియిలేన్ వల్వినైయే మాళాదో (తిరువాయ్మొళి 1.4.3)” నమ్మాళ్వార్లు పలికినట్లుగా, తపస్సుతో కానీ లేదా దుఃఖాలు అనుభవించినా కానీ కరగని నా కర్మ ప్రభావాలు అంత బలమైనవా? కారణం ఏమిటో నాకు తెలియదు. దీనికి కారణం ఏమిటో తెలుకుకొని వాటిని తొలగించమని శ్రీ రామానుజులను నేను కోరుతున్నాను”. ఈ పాశురము మరియు మునుపటి పాశురములో, “ఐంపులన్ల” అనగా ఇంద్రియాల ద్వారా పొందిన ప్రాపంచిక సుఖము అని మనము అర్థము చెప్పుకోవచ్చు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-36/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 37

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 36

పరిచయము

శ్రీ రామానుజులు తమతో ఏదో చెబుతున్నారని మాముణులు ఊహిస్తున్నారు. శ్రీ రామానుజులు తమ మనస్సులో ఏమి ఆలోచించి ఉండవచ్చో దానికి సమాధానమే ఈ పాశురము. శ్రీ రమానుజులు ఇలా వివరిస్తున్నారు – “హే! మామునీ! ఇంద్రియాల చెడు ప్రభావాల గురించి తలచుకొని భయపడుతున్నావు. చింతించకుము. ఇంద్రియాలు, పాపాల ఆగ్రహానికి నిన్ను నేను బలి కాకుండా చూస్తాను. అయినప్పటికీ, భయపడుతున్న నిన్ను నేను ఇంకా ఈ భౌతిక ప్రపంచములో  ఉంచడానికి కారణం ఉంది. “ఆర్థి అధికారా పూర్తిక్కెనుమదు ముఖ్యం” అనే ఒక సూక్తి ఉంది, ఈ వాఖ్యము ప్రకారం మనము ఆర్తి (ఆసక్తి) మరియు అధికారము (విముక్తి పొంది పరమపదానికి వెళ్ళే అర్హత) సంపాదించాలి. ఆ రెండూ పొందే వరకు, ఇక్కడే ఈ భూమిపైనే ఉండాలి. కావున, ఒకసారి నీవు పరమపదానికి వెళ్ళడానికి అవసమైన ఉన్నత ఆసక్తి నీలో ఉండి, నీవు యోగ్యత పరంగా నిజంగా అర్హుడివైతే, నీవు పరమమపదానికి చేరుకునేలా నేను చూస్తాను. ఆ సమయం వరకు, నీవు ఇక్కడే ఉండాలి”.  “హే! శ్రీ రామానుజ! ఈ జీవితంలో నాకు ఇంతవరకు ఎటువంటి అర్హత లేదు. నేను భవిష్యత్తులో ఇక ఎలాంటి అర్హతను పొందుతాను? నాకు కావలసిన అర్హతలను నాలో కలుగజేయక పోవడానికి కారణం ఏమిటి? పరమపదానికి వెళ్ళడానికి అర్హత పొందే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను మీరు ఎందుకు తొలగించడం లేదు? మీరు ఆ అవరోధాలను ఎందుకు తొలగించడం లేదు? నన్ను పరమపదానికి ఇంకా ఎందుకు  తీసుకెళ్లడం లేదు? అని మాముణులు ప్రశ్నిస్తున్నారు.

పాశురము 37

ఇన్ఱళవుం ఇల్లాద అదిగారుం మేలుం ఎనక్కు
ఎన్ఱు ఉళదాం శొల్లాయ్ ఎదిరాశా! కున్ఱా
వినై త్తొడరై వెట్టి విట్టు మేలై వైగుందత్తు
ఎనై క్కడుగ ఏఱ్ఱాదదెన్?

ప్రతి పద్ధార్ధములు

శొల్లాయ్ – (ఎంబెరుమానారే!) దయచేసి నాకు చెప్పండి.
ఇన్ఱళవుం– ఇంత వరకు
ఇల్లాద అదిగారుం – (నాకు) అర్హత లేదు (పరమపదాన్ని చేరుకునే)
మేలుం – (ఈ కారణంగా) ఇప్పటి నుండి
ఎనక్కు– నాకు
ఎన్ఱుళదాం – ఎప్పుడు అవుతుంది? లేదా అసలు అవుతుందా? పరమపదాన్ని చేరుకునే అర్హత నేను ఎప్పుడు పొందుతాను? (ఇప్పుడు అవుతుందా?)
ఎదిరాశా– ఓ ఎంబెరుమానారే!!!
యేన్? – నీవు ఎందుకు?
క్కడుగ ఎన్నై ఏఱ్ఱాదదు – నన్ను త్వరగా తోసుకెళ్ళకుండా
మేలై – అతి గొప్పదైన
వైగుందత్తు – పరమపదము
వెట్టి విట్టు –  తొలగించడంతో
కున్ఱా –  క్షీణించని
వినై త్తొడరై – పాప కర్మ సంబంధము

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తన పాపాల మూటని తొలగించకపోవటానికి కారణమేమిటని శ్రీ రామానుజులను అడుగుతున్నారు. మాముణులను పరమపదానికి తీసుకెళ్లడానికి శ్రీ రామానుజులు ఆలస్యముగా వ్యవహరించడంలో కారణం ఏమిటి. అర్హత కారణం అయితే, తాను పరమపదానికి వెళ్ళడానికి ఎప్పటికీ అర్హత పొందలేనని మాముణులు అభిప్రాయపడుతున్నారు. వారిలో అణువు మాత్రము కూడా ఆ యోగ్యత లేనిదని, తాను పరమపదానికి వెళ్ళడానికి అర్హుడు కారని మాముణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఈ అర్హతలను ఎలా పొందగలరని శ్రీ రామానుజులను ప్రశ్నిస్తున్నారు.

వివరణ:  

మాముణులు ఇలా వివరిస్తున్నారు – “ఇన్ఱు తిరునాడుమెనక్కరుళ ఎణ్ణుగిన్ఱాయ్” అన్న సూక్తిలో చెప్పినట్లుగా, గతంలో కొంచము కూడా ఆ ఆసక్తి లేని నాకు, ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఆ అర్హతను (పరమపదము వెళ్ళడానికి) ఎలా పొందుతాను? ఇంతవరకు ఎన్నడూ లేని యోగ్యత ఇప్పుడు ఎలా పుట్టుకు వస్తుంది. శ్రీ రామానుజా!!!! దీని గురించి మీరు నాకు వివరించాలి. “తొన్మావల్వినై తొడర్” అని చెప్పినట్లుగా, ఎప్పటికీ తరగని నా పాప సంబంధము నా పరమపద యాత్రలో ఖచ్చితంగా అడ్డంకి అవుతుంది. మీరు నా ఈ పాపాలను ఎందుకు తొలగించి, “మేలై వైకుంటతితుత్తుమ్” (తిరువాయ్మొళి 8.6.11)” లో వర్ణించిన గొప్ప పరమపదానికి నన్ను ఎందుకు తీసుకెళ్లడం లేదు. నాకు పరమపదాన్ని ఎందుకు ప్రసాదించడం లేదు? పరమపదానికి వెళ్ళాలనే కోరిక నాలో ఉన్న తరువాత కూడా అజ్ఞానంతో పీడింపబడుతున్న ఈ భూమిపై ఇంకా ఎందుకు ఉంచావు? ఎందుకు నన్ను వెంటనే తీసుకెళ్లడం లేదు? నేను శక్తి లేని వాడిని, ఈ విషయంలో ఏదైనా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. నేను పరమపదము చేరుకోడానికి అవసరమైన చర్యలు మీరు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? దయచేసి చెప్పండి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-37/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org