శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పూర్తి క్రమము
<< శ్లోకములు 1-10
శ్లోకము 11 – ఈ పాశురములో పరత్వ లక్షణము (ఆధిపత్య గుణము) గురించి వివరించబడింది.
స్వాభావికానవధికాతిశయేశితృత్వం
నారాయణ త్వయి న మృష్యతి వైదికః కః।
బ్రహ్మా శివశ్శతమఖః పరమః స్వరాడితి
ఏతేऽపి యస్య మహిమార్ణవవిప్రుషస్తే॥
ఓ నారాయణా! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కర్మ బంధములకు అతీతమై దేవతలకు కంటే ఉన్నతులైన ముక్తాత్మలు – వీరందరూ నీ ఔన్నత్యము అనే సముద్రములో ఒక చిన్న బిందువు వంటి వారు; నీ అంతులేని గొప్పతనము,సహజ ఐశ్వర్యమును వైదికులెవరు సహించరు?
శ్లోకము 12 – ఈ పాశురములో ఆళవందారులు గుర్తింపుపై సందేహము కలిగించే సాధారణ నామాలకు బదులుగా, భగవాన్ యొక్క ఆధిపత్య గుణాన్ని స్పష్ఠముగా తెలిపే పూర్ణ నామాలను వారు కృపతో మనకు తెలియజేస్తున్నారు.
కశ్శ్రీః శ్రియః పరమసత్వసమాశ్రయః కః
కః పుణ్డరీకనయనః పురుషోత్తమః కః।
కస్యాయుతాయుతశతైకకలాంశకాంశే విశ్వం
విచిత్రచిదచిత్ప్రవిభాగవృత్తం॥
(శ్రీ మహాలక్ష్మి) శ్రీః కి సంపద ఎవరు? శుద్ద సత్వముగా ఉన్నవారెవరు? కమల నేత్రుడు ఎవరు? పురుషోత్తముడని ఎవరిని పిలుస్తారు? ఎవరి ఒక చిన్న అంశము మాత్ర సంకల్పము చేత చేతనాచేతనులతో కూడిన ఈ బ్రహ్మాండములోని సమస్థ లోకములు భరింపబడతాయి/సంరక్షింపబడతాయి?
శ్లోకము13 – బ్రహ్మ మరియు రుద్రులు మొదలైనవారి క్షేత్రజ్ఞ్యత్వమును (జీవాత్మగా ఉండటం), భగవాన్ యొక్క పరత్వమును (సర్వాధికారము/ఆధిపత్యము) పురాణ ఇతిహాసములలోని ఘటనల ద్వారా ఇక్కడ మనకు ఆళవందారులు వివరిస్తున్నారు.
వేదాపహార గురుపాతక దైత్యపీడది
ఆపద్విమోచనమహిష్ఠ ఫలప్రదానైః।
కోऽన్యః ప్రజాపశుపతీ పరిపాతి కస్య
పాదోదకేన స శివః స్వశిరోధృతేన॥
ప్రజాపతి అని పిలువబడే బ్రహ్మను, పశుపతి అని ప్రసిద్దులైన శివుడిని, వేదాపహరణము (బ్రహ్మ వేదములను కోల్పోయినపుడు) మరియు తన తండ్రి శిరస్సును ఛేదించిన పాతకము (బ్రహ్మ శిరస్సుని శివుడు ఛేదించినపుడు) కలిగినపుడు, అసురుల బాధలు (ఇంద్రుడికి మరియు ఇతర దేవతలకి) వంటి ప్రమాదాలను తొలగించి రక్షించినది నీవుకాక ఎవరు? ఎవరి శ్రీపాద తీర్థమును తన శిరస్సున ధరించి శివుడు పునీతుడైనాడు?
శ్లోకము 14 – భగవాన్ యొక్క ఆధిపత్య లక్షణాన్ని ప్రమాణముల (శాస్త్రము, ప్రామాణికమైన గ్రంథాలు) ఆధారముతో తర్కము మరియు తార్కికముగా ఆళవందారులు వివరించి ముగిస్తున్నారు (ఐదు పాసురముల శృంఖల).
కస్యోదరే హరవిరించముఖః ప్రపంచః
కో రక్షతీమమజనిష్ఠ చ కస్య నాభేః
క్రాంత్వా నిగీర్య పునరుద్గిరతి త్వదన్యః
కః కేన వైష పరవానితి శక్యశంకః ॥
సమస్థ లోకములు, బ్రహ్మ, శివుడు మొదలైనవాళ్లు ఎవరి ఉదరములో ఇమిడి ఉన్నారు? ఎవరు ఈ లోకాలకు రక్షణనిస్తున్నారు? ఎవరి నాభి నుండి ఈ లోకములు సృష్ఠించబడ్డాయి? నీవు కాక ఇంకెవరు ఈ సృష్ఠిని కొలిచి, మ్రింగి మరలా ఉమ్మగలరు? ఈ సమస్థ లోకములపై నీ ఆధిపత్యముపై ఒక అణువు మాత్రము కూడా సందేహము ఉండవచ్చా?
శ్లోకము 15 – ఈ శ్లోకములో, ప్రామాణిక గ్రంథాల ద్వారా ఇది స్పష్ఠంగా స్థాపించబడింది, శ్రీ భగవద్గీత 16.20 లో చెప్పినట్టుగా “ఆసురీం యోనిమాపన్నాః” (అసురునిగా జన్మించి), అయ్యో! ఈ అసుర ప్రవృత్తి జనులు నిన్ను తెలుసుకోలేక దిగజారుతున్నారే అని ఆళవందారులు చింతిస్తున్నారు. మరో వివరణ – విశిష్టత గల భగవాన్నుని, ఈ అసుర ప్రవృత్తి జనులు చూడకూడదు అని తిరువాయ్మొళి 1.3.4 “యారుమోర్ నిలైమైయన్ ఎన అఱివరియ ఎంబెరుమాన్” ( అసూయకల జనులు భగవానుడు “ఇంతటి విశిష్ట గుణములు కలవారు” అని తెలుసుకోలేరు) అని చెప్పబడింది.
త్వాం శీలరూపచరితైః పరమప్రకృష్ట
సత్త్వేన సాత్త్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైః।
ప్రఖ్యాతదైవ పరమార్థవిదాం మతైశ్చ
నైవాసురప్రకృతయః ప్రభవంతి బోద్ధుం॥
[అయ్యో!]క్రింద విషయముల ద్వారా నిన్ను తెలుసుకునే వీలు ఉన్నను, అసుర ప్రవృత్తి మనుషులు అత్యున్నతుడవైన నిన్ను గ్రహించలేరు.
- నీ శీల గుణము (సరళ స్వభావము), స్వరూపము (వేదము చేత స్తుతింపబడిన) మరియు దివ్య లీలలు,
- శుద్ద సత్త్వముతో నిండి ఉన్న నీ నిలయము/ఐశ్వర్యము,
- శాస్త్రములు వాటి సత్త్వ గుణము కారణముగా బలంగా / దృఢంగా ఉన్నాయి.
- నీ గురించి సత్యము నెరిగిన వారి అభిప్రాయములు/ఆలోచనలతో.
శ్లోకము 16 – భగవాన్ యొక్క శీల గుణము కారణంగా పరమపదానికి చేరుకున్న మహోన్నత ఆత్మల గురించి తలుచుచూ ఆళవందారులు తనకది(ఆ జీవాత్మలు పరమపదము చేరుట) లాభము అని భావించుచున్నారు.
ఉల్లంగిత త్రివిధ సీమసమాతిశాయి
సంభావనం తవ పరిబ్రఢిమస్వభావం ।
మాయాబలేన భవతాऽపి నిగూహ్యమానం
పశ్యంతి కేచి దనిశం త్వదనన్యభావాః॥
నీవు తప్పా వేరెవరిని తలచని ఆ గొప్ప ఆత్మలు కాల, దేశ, వస్తువుల పరిమితులకు అతీతమైన నీ స్వామిత్వమును గురించే తలచుచూ, “నీకు సమానమైన వారు, లేదా నీ కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా?” అన్నటువంటి సందేహాలకు మించి, నీ అద్భుతమైన సామర్ధ్యంతో నీ స్వామిత్వము దాచినప్పుడు కూడా నీ స్వామిత్వముపై మాత్రమే దృష్థి ఉంచుతారు.
శ్లోకము 17 – భగవాన్ చేత నియంత్రిపబడే వివిధ రకాల తత్వాల గురించి ఆళవందారులు ఇక్కడ వివరిస్తున్నారు. ముందు వివరించిన విధముగా అతని సర్వేశ్వరత్వమునకు (సమస్థ జీవులకు ప్రభువు) అవసరమైనవి కూడా.
యదండమండాతర గోచరంచ యత్
దశోత్తరాణ్యావరణాని యాని చ ।
గుణాః ప్రధానం పురుషః పరం పదం
పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః॥
(1)బ్రహ్మాండము [బ్రహ్మ నియంత్రణలో అండాకారములో ఉన్న 14 లోకములు], (2) అండము లోపల ఉన్నవన్నీ, (3) సప్త ఆవరణములు (అండమును కమ్మే ఒక పొర లాంటిది) ఒకటి కంటే ఒకటి 10 రెట్లు పెద్దదైనది, (4) సత్త్వ , రజస్సు, తమస్సు వంటి గుణములు (5) మూల ప్రకృతి (మూల తత్త్వము) (6) అన్ని జీవాత్మల సమూహము (చేతన తత్త్వములు) (7) శ్రీ వైకుంఠము (నిత్య విభూతి) (8) ముక్తాత్మల కంటే గొప్పవారైన నిత్యసూరుల సమూహము (బ్రహ్మ నుండి మొదలు అందరు దేవతల కంటే ఉన్నతమైన వారు) (9) దివ్య మంగళ స్వరూపము (స్వరూపములు) సమస్థమూ నీ శరీరములు/రూపములు.
శ్లోకము 18 – మునుపటి పాశురములో శరణ్యము యొక్క గొప్పతనము గురించి వివరించారు, ఇప్పుడు ఈ పాశురములో, “ఆ ఉభయ విభూతి నాథున్ని (రెండు లోకముల నాథుడు) ఎలా చేరుకొనగలను”? అన్న సంకోచములు మనలో నుండి తొలగించడానికి, భగవాన్‌తో తాను ముడిపడి ఉండే 12 గుణముల వివరణ ఇవ్వబడింది. అదీ కాకుండా – మునుపు భగవాన్ యొక్క సర్వేశ్వరత్వము (ఆధిపత్యము) వివరించబడింది, ఇప్పుడు కీర్తించ దగ్గ వారి మహోన్నత గుణములను తెలుపుతున్నారు.
వశీ వదాన్యో గుణవాన్ ఋజుః శుచిః
మృదుర్దయాలుర్ మధురస్థిరః సమః।
కృతీ కృతజ్ఞస్త్వమసి స్వభావతః
సమస్తకల్యాణగుణా మృతోదధిః॥
నీవు సహజముగానే దివ్య మంగళ గుణముల మకరంద సాగరము వంటి వాడవు. అవి ఏమనగా – 1. నియంత్రింప బడేవాడు (తన భక్తులచేత), 2. ఉదారత (భక్తులపట్ల) కలిగి ఉండుట 3. సౌశీల్యత, 4. వివక్షత లేకుండా ప్రతి ఒక్కరి పట్ల సమానత ప్రదర్శించుట, 5. నిజాయితీ (బుద్ది, కర్మణా, వాచా) ఉండుట, 6. పరిశుద్దత 7. నీ భక్తుల నుండి విరహమును భరించకుండుట, 8. కరుణతో ఉండుట (భక్తుల బాధను సహించకుండుట), 9. మాధుర్యం, దృఢమైన సంరక్షణ ఇచ్చువాడు, 10. సమానత్వము (శరణాగతుల పట్ల), 11. కార్యములలో పాల్గొనుట (భక్తుల, వారు తన సొంతమని భావించి) 12. నీ భక్తుల చేసిన చిన్న పనికి కూడా కృతజ్ఞత చూపుట.
శ్లోకము 19 – భగవాన్ యొక్క కళ్యాణ గుణములు అసంఖ్యాకమైనట్లే వారి పత్రి గుణము దానికదే అనంతమైనది అని ఆళవందారులు వివరిస్తున్నారు.
ఉపర్యుపర్యబ్జభువోऽపి పూరుషాన్
ప్రకల్ప్య తే యే శతమిత్యనుక్రమాత్।
గిరస్త్వదేకైక గుణావదీప్సయా
సదా స్థితా నోద్యమతోऽతిశేరతే॥
“తే యే శతం” (ఇటువంటి నూరు) అని ఎన్నో ఎన్నో బ్రహ్మల కోసము జపించడం, కొత్త బ్రహ్మలను ఊహించుకోవడంపై వేద వాఖ్యములు దృష్థి పెట్టి ఉండగా, నీ ప్రతి గుణము యొక్క సరిహద్దుని పరిశీలించాలనే ఆశతో, ప్రారంభ దశను కూడా ఇంకా దాటి ముందుకు వెళ్ళలేదు.
శ్లోకము 20 – మునుపు వివరించిన భగవత్గుణములను ఆనందించే నీ భక్తుల గొప్పతనమును ఇప్పుడు ఆళవందారులు వివరిస్తున్నారు. మరొక వివరణ – బ్రహ్మ సూత్రము 1.1.20 “అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి”(ఆనందకరమైన బ్రహ్మతో జీవాత్మ యొక్క పరమానందకరమైన కలయిక అని శృతి యొక్క వివరణ) లో వివరించినట్టుగా భగవత్ గొప్పతనాన్ని ఆనందించే భక్తులు అంత గొప్పవారైతే, భగవాన్ గొప్పతనాన్ని కొలవలేమని స్పష్ఠంగా తెలుస్తుంది.
త్వదాశ్రితానాం జగదుద్భవస్థితి
ప్రణాశ సంసార విమోచనాదయః।
భవంతి లీలా విధయశ్చ వైదికాః
త్వదీయ గంభీర మనోऽనుసారిణః
శృష్ఠి చేయుట, సంరక్షించుట, నాశనము చేయుట, సంసార సాగరమును దాటుటలో సహకరించుట మొదలైనవి నీ యొక్క భక్తులకు ఒక క్రీడవంటిది; వేద వాక్కులు కూడా లోతైన నీ భక్తుల దివ్య హృదయాలనే అనుసరిస్తాయి.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-11-to-20-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org