ప్రమేయసారము – అవతారిక

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< తనియన్

 

Ramanuja_Sriperumbudur                                                                  ఎంబెరుమానార్

arulalaperumalemperumanar-thirupadagam                                                     అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్

స్వామి అరుళాళ పెరుమల్ ఎంబెరుమానార్లు అనేక శాస్త్రాలలోని, వేదాలలోని  నిగూఢ ప్రమాణాలను అర్ధం చేసుకున్న వారు . వాటిలోని  పేర్కొన్న నిగూఢ ఉద్దేశాన్ని చేరుకోవటానికి ఉపాయము , పురుషార్థము శ్రీమన్నా నారాయణుడే అని నిర్ద్వందంగా తెలిసిన వారు. ఈ విషయములను ఇంత నిర్ద్వందంగా తెలిసిన వారిలో ప్రధానమైన వారు .ఈ బ్రహ్మాండంలో జనన మరణ  చక్రంలో పడి  బాధపడుతున్న ఆత్మలన్నింటికీ  విముక్తి మార్గాన్ని చూపాలని కోరుకునే కారుణ్యమూర్తులు వారు . వారు సుదీర్ఘకాలం (దాదాపు 80 సంవత్సరాలు) స్వామి రామానుజుల  శిష్యులుగా సేవలు అందించిన వారు.  తత్వము,  హితము, పురుషార్థాలను గురించి స్వామి రామానుజులనుగ్రహించగా విని మనసుకు పట్టించుకున్న వారు.  వారు తాము రామానుజుల బోధనలకను గుణంగా జీవించటమే కాక  విస్తృతంగా ప్రచారం చేసారు .  తత్వము   ( భగవంతుడు) ,హితము (ఉపాయము), పురుషార్థము( ప్రయోజనము) లను పూర్తిగా అవగాహన చేసుకున్న వారు. దీనినే తల స్పర్స జ్ఞానము అంటారు.  తల స్పర్స జ్ఞానము అంటే  నీటిలోకి దిగి తుదముట్ట ఈది అట్టడుగులోఉన్న మట్టిని పైకి తీసుకు రావటము అని అర్ధం. అలాగే, స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు   జ్ఞానపుటంచులు చూసిన వారు .

భగవంతుడి గురించి తెలుసుకోవటము  మొదటి మెట్టు . భాగవతుల గురించి తెలుసుకోవటము  చివరి షట్పదమెట్టు .  భగవంతుడి భక్తులకు  భక్తుడవటమే చివరి మెట్టుగా చెప్పబడింది . స్వామి అరుళాళ పెరుమాళ్  ఎంబెరుమానార్లు, అపార కారుణ్యంతో సామాన్యుడు కూదా ఆత్మోజ్జీవనము పొందే విధంగా ముందుగా  “జ్ఞాన సారము” అనే ప్రబంధాన్ని రాశారు. తరువాత, ” ప్రమేయ సారము”  రాశారు . వేదాలు అనాది , అపౌరుషేయాలు, మనకు పరమ ప్రమాణాలు .  ఈ  వేదాల సారాంశమే “ఓమ్ నామో నారాయణాయ” అనే “తిరుమంత్రము” లో సంక్షిప్తంగా చెప్పబడింది , ఇది  ఎనిమిది అక్షరాలతో ఉమ్దదము వలన దీనిని అష్టాక్షరి అని అంటారు . ఈ తిరుమంత సారమేగా ” ప్రమేయ సారము”  రాశారు.

ఆడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-introduction/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *