Daily Archives: June 29, 2015

తిరుప్పళ్ళి యెళిచ్చి తనియన్లు

Published by:

vyuhavasudevan                                                                       వ్యూహవాసుదేవుడు

తిరుమలై ఆండాన్ చే కృపచేయబడ్డ తనియన్

తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్ |
ప్రాబోధికీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంతమీడే ||

ప్రతిపదార్థం 

యః -ఎవరైతే (ఆళ్వార్)

రాజవత్ – రాజువలె

అర్హణీయమ్- ఆరాధింప తగిన 

రంగేశయం – శ్రీరంగమున ఆదిశేషుని పై పవళించిన పెరియపెరుమాళ్ 

తం పరవాసుదేవం ఏవ- తమరే పరవాసుదేవులు (శ్రీవైకుంఠములోని) 

మత్వా – భావించి

ప్రాబోధికీం – ప్రాభోధమున(ప్రాతః  కాలమున) మేల్గాంచునది  

సూక్తిమాలాం- సూక్తుల మాల(దండ)

ఆకృత- పరమ కృపతో అనుగ్రహించిన

తం -అలాంటి
భగవంతం – ఙ్ఞానాది ఆరు కల్యాణ గుణములను కలిగి ఉన్న

భక్తాంఘ్రిరేణుం- తొండరడిపొడి ఆళ్వార్  ను

మీడే- కీర్తిస్తున్నాను

సంక్షిప్త అనువాదం

ఙ్ఞానాది ఆరు కల్యాణగుణములను కలిగి, పరమకృపతో అనుగ్రహించిన  సూక్తుల పూమాలతో శ్రీవైకుంఠములోని పరవాసుదేవుని వలె శ్రీరంగమున ఆదిశేషుని పై పవళించిన పెరియపెరుమాళ్  ను తమ ప్రాభోధకీయముతో మేల్కొలిపిన  తొండరడిపొడి ఆళ్వార్  ను కీర్తిస్తున్నాను.

పిళ్ళైలోకాచార్యుల వ్యాఖ్యానములోని విశేషములు:

  • రాజవదర్హణీయమ్- సమస్త భరతఖండమునకు చక్రవర్తియై ,ఏ ఆక్షేపణాదోషం లేని దశరథ తనయుడైన శ్రీరాముని వరకు ఆరాధింపబడ్డ శ్రీరంగనాథుడు(ఇక్ష్వాకు వంశస్థుల కులదైవం అయిన) పెరియపెరుమాళ్  గా సమస్తులందరికి రాజాధిరాజుగా వ్యవహరింపబడుచున్నారు.   
  • రంగేశయం – అర్చావతార ఎంపెరుమాన్ వైభవం పూర్తిగా విదితమే-  దివ్యరూపాలను, సకల గుణములను కలిగి  పరమపదము నుండి అవతరించిన  రూపం.  ఈ అర్చావతారమున  సౌలభ్యం ప్రకటింప బడుతుంది. పరవాసుదేవుని  వలె కాక  అర్చావతారం అందరిచేత సులభంగా పొందదగినది.  
  • పరవాసుదేవం-  శ్రీరంగనాథుడు ద్వాదశాక్షరిచేత (వాసుదేవ మంత్రం) తమ తిరువారాధనలో ఆరాధింపబడుచున్నాడు. ఇక్కడ వాసుదేవ నామం  తెలుపబడింది. ఎంపెరుమాన్ యొక్క నాలుగు వ్యూహరూపములలో వాసుదేవ నామం మొదటిది.  క్షీరాబ్ధి నాథుడు-  పాలకడలిలో శయనించి   సదా జీవాత్మ ఉజ్జీవనమునకై చింతించు  సౌహార్ధ గుణముచే ప్రకాశించురూపం. శ్రీరంగనాథుడు కూడ ఇదే కార్యమును చేస్తున్నాడు-తాను శ్రీరంగమున పవళించి ఈ సంసారమున కొట్టుమిట్టాడుతున్న జీవాత్మ ఉజ్జీవనమునకై చింతిస్తున్నాడు.
  • చివరగా తొండరడిపొడి ఆళ్వార్  ఙ్ఞాన వైరాగ్య భూషణులుగా మరియు తిరుపళ్ళి యెళిచ్చి అను అద్భుతమైన  పాశుర మాలికను అనుగ్రహించిన ఉపకారకునిగా  కీర్తింపబడుచున్నారు. 

తిరువరంగపెరుమాళ్ అరైయర్ కృపచేసిన తనియన్

మణ్డంగుడియెంబర్ మామఱైయోర్

మన్నియశీర్ త్తొండరడిపొడి త్తొన్నగరం

వండు తిణర్ త్త వయల్  తెన్న రంగత్తమ్మానై

పళ్ళి ఉణర్తుం పిరాన్  ఉదిత్తఊర్

ప్రతిపదార్థం

వండు- తుమ్మెదలు

తిణర్ త్త -(అన్యోన్యతతో) సమీపమున నివసిస్తున్న

వయల్ –  సారవంతమైన నేలలో పచ్చికబయళ్ళ తో చుట్టబడి ఉన్న

తెన్న – అందమైన
రంగత్తు- శ్రీరంగమున(పవళించిన)

అమ్మానై- పెరియపెరుమాళ్
పళ్ళి ఉణర్తుం – అతనిని మేల్కొలుపుట
పిరాన్- ఉపకారకుడు
తొండరడిపొడి- తొండరడిపొడి అను  నామధేయంగల ఆళ్వార్
ఉదిత్తఊర్- అవతార స్థలం
శీర్ మన్నియ -వైభవం గల
మణ్డంగుడి – తిరుమణ్డంగుడి
త్తొళ్ నగరం- ప్రాచీన నగరం
యెంబర్  మామఱైయోర్- వేదములో నిష్ణతులగు పండితులు గల

సంక్షిప్త అనువాదం 
వేదములో ప్రావీణ్యం గల మహానుభావులు నివసిస్తున్న, పరస్పరం అతి అన్యోన్యత తో నివసిస్తున్న తుమ్మెదలుతో, సారవంతమైన నేలలో పచ్చికబయళ్ళ తో చుట్టబడి ఉన్న, శ్రీరంగమున పవళించిన పెరియపెరుమాళ్ కు మేల్కొలుపును కృపచేసిన  , మహిమాన్విత వైభవం కల ఆళ్వార్ అగు తొండరడిపొడిఆళ్వార్ అవతారస్థలం తిరుమణ్డంగుడి.

పిళ్ళైలోకం జీయర్ వ్యాఖ్యనంలోని విశేషములు

  •  ఎంపెరుమాన్ కు ప్రియమైనటువంటి తిరుకణ్ణంగుడి, కురుంగుడి, పుళ్ళంభూతంగుడి వంటి  దివ్యదేశముల వలె మణ్డంగుడి కూడ అతి వైభవం కలదిగా వర్ణించబడుతుంది ఇక్కడ. నమ్మాళ్వార్ అవతార స్థలమగు ఆళ్వార్ తిరునగరి తో సరిపోల్చతగినది ఈ మణ్డంగుడి.
  • విరివిగా అనేక తుమ్మెదలు సంచరించుట ప్రకృతి సౌందర్యమునకు ప్రతీక. శ్రీరంగం కూడ  అత్యంత సుందరప్రదేశముగా దాదాపు అన్నీ ప్రబంధములలో వర్ణించబడినది.
  • విశేష వివరణ- తొండరడిపొడిఆళ్వార్ స్వయంగా శ్రీరంగం కూడా విరివిగా తుమ్మెదలు సంచరించు ప్రకృతి సౌందర్యం గల వనములను కలిగి ఉన్నదని తమ తిరుమాలై ప్రబంధమున ప్రశంసించారు.
  • కేవలం ఎంపెరుమాన్ ను మేల్కొలపడమే కాక, మనం కూడ పాడి తరించుటకు మనలను ఈ  తిరుపళ్ళి యెళిచ్చి ప్రబంధము ద్వారా అనుగ్రహించుట అను గొప్ప ఉపకారం చేసినారు.
  • తూర్పున సూర్యోదయముతో అంధకారము తొలగినటుల, తిరుమణ్ణంగుడిలో ఆళ్వార్ అవతారం వలన అఙ్ఞుల అఙ్ఞానం తొలగిపోవును.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezuchchi-thaniyans/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి

Published by:

తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) కృపచేసిన తిరుప్పళ్ళి యెళిచ్చి దివ్యప్రబంధమునకు ఉద్దేశ్యం/లక్ష్యం  శ్రీరంగనాథుడు

periyaperumal  పెరియపెరుమాళ్ (శ్రీరంగనాథుడు)శ్రీరంగం

thondaradipodi-azhwar-mandangudiతొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) – తిరుమణ్ణంగుడి

ఆచార్యహృదయమునందు విశేషంగా  85వ చూర్ణికలో అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  సుప్రభాతం(తమ దివ్యగానంతో మేల్కొలుపుట) తో ఎంపెరుమాన్ ను మేల్కొలుపు  మహాత్ములని వర్ణించారు.ఎంపెరుమాన్ కు కీర్తనా కైంకర్యము చేయడంలో  నంపాడువాన్(తిరుక్కురుంగుడి మలైమేల్ నంబికి పరమభక్తుడు ) యొక్క వైభవమును కీర్తిస్తు వీరిని విశ్వామిత్రునితో , పెరియాళ్వార్ తో మరియు తొండరడిపొడి ఆళ్వార్ తో పోల్చారు (ఎంపెరుమాన్ కు తులసి కైంకర్యము చేయడానికి తులసి వనాలను ఏర్పాటు చేయువాడు).నాయనార్ యొక్క  విలువైన పదాలను మామునులు వెలికి తీశారు.

విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ‘కౌసల్యా సుప్రజారామా’ (శ్రీరామాయణం, బాలకాండ 23.2)అనే ప్రఖ్యాతిగాంచిన శ్లోకముతో మేల్కొలిపారు.ఇది అందరికి విదితమే.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్||

కౌసల్యకు ప్రియపుత్రుడవైన ఓ శ్రీరామ! తెల్లవారినది . ఓ నరశార్దూల! మేల్కొనుము, పవిత్రమైన ఉదయ సంధ్యా కార్యక్రమములో నిమగ్నుడవు కమ్ము.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి2.2.1లో కణ్ణన్ ఎంపెరుమాన్ ను ఇలా మేల్కొలుపుచున్నారు.

ఆదిశేషునిపై పవళించిఉండే ఈ గోపాల బాలుడా! లెమ్ము, ఆరగించుటకు సిద్ధముకమ్ము

అరవణైయాయ్ ఆయర్ ఏరే ! అమ్మం ఉణ్ణత్తుయిల్ ఎళాయే…

తొండరడిపొడి ఆళ్వార్  చే కృపచేయబడి శ్రీరంగనాథుణ్ణి మేల్కొలుపు ఈ ప్రబంధమునకు తిరుపళ్ళి యెళ్ళిచ్చి అని పేరు.

తొండరడిపొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపైనే తమ దృష్ఠిని కేంద్రీకరించి వనమును ఏర్పరచి పూమాలలను సమర్పించేవారు.తిరుపళ్ళి యెళ్ళిచ్చి పై రెండు వ్యాఖ్యానాలు ఉపలబ్దమగుచున్నవి.

మొదటిది నంజీయర్ చే కృపచేయబడింది, తరువాతది పిళ్ళైలోకాచార్యులచే కృపచేయబడింది.

 

nanjeeyar నంజీయర్

periyavachan-pillai పిళ్ళైలోకాచార్యులు – తిరుశఙ్గనల్లూరు

తనియన్ల కు పిళ్ళైలోకం జీయర్ వ్యాఖ్యానాన్ని అందించారు.

pillailokam-jeeyarపిళ్ళైలోకం జీయర్

పుత్తూర్ కృష్ణస్వామి అయ్యంగార్  ఉపలబ్దమగుచున్న వ్యాఖ్యానాలకు విస్తృతమైన వివరణను తమ దివ్యప్రబంధ  వ్యాఖ్యానమున ప్రకటించారు.  ఎంపెరుమాన్, ఆళ్వార్లుల, ఆచార్యుల మరియు అస్మదాచార్యుల కృపా కటాక్షముచే ఈ ఈ వ్యాఖ్యానాలను మనం అనుభవిద్దాం.

 

Puttur-Swami

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయం (లక్ష్యం) – http://koyil.org
ప్రమాణం(scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాతpramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org