కోయిల్ తిరువాయ్మొళి – 9.10 – మాలైనణ్ణి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 8.10 – నెడుమాఱ్కు

భగవానుడి నుండి విరహముతో ఎంతో వేదనను అనుభవిస్తున్న ఆళ్వారుకి తిరుక్కణ్ణపురంలో దివ్య అర్చా మూర్తి రూపములో భగవానుడు దర్శనమిస్తారు. అక్కడ తన దర్శనము అందరూ సులభంగా పొంది అనుభవించుటకు నిలచి ఉన్నాడని, ఈ జీవిత అనంతరములోనే ఆళ్వారు తనకు చేరుకుంటాడని హామీ ఇస్తాడు. ఈ పదిగములో ఆళ్వారు దీని గురించి ధ్యానిస్తూ పరమానందపడుతున్నారు.

మొదటి పాశురము: ఈ పదిగములో వివరించిన శరణాగతి తత్వాన్ని ఈ పాశురములో ఆళ్వారు క్లుప్తంగా వివరిస్తున్నారు. “మీ దుఃఖాలన్నింటినీ తొలగించుకోవడానికి దయతో తిరుక్కణ్ణపురంలో నిలుచొని ఉన్న భగవానుడికి శరణాగతి చేయండి”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

మాలై నణ్ణి తొళుదెళుమినో వినై కెడ
కాలై మాలై కమల మలరిట్టు నీర్
వేలై మోదుం మదిళ్‌ శూళ్ తిరుక్కణ్ణపురత్తు
ఆలిన్మేలాల్‌ అమర్ న్ద‌ అడి ఇణైగళే

సమస్థ విశ్వాలను సంరక్షిస్తూ, వటతళశాయిగా తన అగడితఘటనా సామర్త్యమును ప్రదర్శిస్తూ, సముద్రపు ఎత్తైన అలలు తాకుతున్న కోటలతో చుట్టూ వ్యాపించి ఉన్న తిరుక్కణ్ణపురంలో నివాసుడై ఉన్నాడు.  అటువంటి భగవానుని దివ్య పాదాల యందు ప్రేమ ప్రపత్తులు సంపాదించుకొని, రాత్రింబగళ్ళు తేడా లేకుండా అరుదైన తామర పుష్పాలను అర్పించి, మీ ఆనందాన్ని అడ్డుకుంటున్న దుఃఖములను నుండి విముక్తి పొంది మీ దాస్య స్వరూపానికి సరితూగే చర్యలలో నిమగ్నలై  “బద్ధాంజలిపుటః” అని చెప్పినట్టుగా ఉన్నత గతిని పొందండి. ‘మేలాల్’ అంటే ఆకు పైన అని అర్థం. ఇక్కడ ‘ఆల్’ అంటే ధ్వని కోసం అని అర్థము.

రెండవ పాశురము: “ఎంతో కోరికతో శరణాగతి చేస్తున్నవారు ఉండగా ఆ దివ్య చరణాలకి ఏ ఆపద సంభవిస్తుంది? భయపడాల్సిన అవసరమే లేదు” అని బాగా సంరక్షితముగా ఉన్న తిరుక్కణ్ణపురం గురించి తలచి సంతృప్తి పడాలి, అని ఆళ్వారు తెలుపుతున్నారు.

కళ విళుం మలరిట్టు  నీర్‌ ఇఱైంజుమిన్
నళ్ళి శేరుం వయల్‌ శూళ్ కిడంగిన్పుడై
వెళ్ళియేయ్‌ంద మదిళ్‌ శూళ్ తిరుక్కణ్ణపురం
ఉళ్ళి నాళుం తొళుదెళుమినో తొండరే!

విముక్తి పొంది ఆనందించాలనే కోరిక ఉన్న మీరు! తేనె కారుతున్న పుష్పాలతో ఆ భగవానుడిని ఆరాధించండి; చుట్టూ వేండితో కట్టబడిన కోటలు, ఆ కోటలు కందకంతో చుట్టుముట్టబడి ఉండగా, తిరిగి ఆ కందకము ఆడ పీతలు ఉండే పంట పొలాలతో  చుట్టుముట్టబడి ఉన్న తిరుక్కణ్ణపురం గురించి నిత్యము ధ్యానించండి. అతడి అనుభవాన్ని పొందడం ద్వారా కలిగిన ప్రేమతో అతన్ని ఆరాధించండి, ఎడతెగకుండా ప్రార్థించండి.  ‘ఇఱైంజుమిన్’ ని  మునుపటి పాశురములో “అడి ఇణై”గా పఠించిన ఈ పదానికి ‘నివాసము’ అని అర్థము చెప్పుకోవచ్చు. ‘వెళ్ళి ఏయ్ న్ద’ అనగా సుక్రుడిని (గ్రహము) చేరుకోవడం అని చెప్పుకోవచ్చు. వెండి రంగులో ఉన్న కోట అని అర్ధము చెప్పుకోవచ్చు.

మూడవ పాశురము:  “ఓ కోరిక ఉన్న వాళ్ళారా!  మీ దుఃఖాలను తొలగించడానికి  తిరుక్కణ్ణపురంలో నిలబడి ఉన్న ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు అధిపతి అయిన ఆ భగవానుడికి అనన్యప్రయోజనులై (కైంకార్యం తప్ప వేరే అపేక్ష లేకుండా) శరణాగతి చేయండి”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.

తొండర్‌ నుందం తుయర్‌ పోగ నీరేకమాయ్
విండు వాడా మలరిట్టు నీర్‌ ఇఱైంజుమిన్
వండు పాడుం పొళిల్‌ శూళ్ తిరుక్కణ్ణపురత్తు
అండ వాణన్ అమరర్‌ పెరుమానైయే

నిత్య సూరులచే ఆనందించి అనుభవింపబడే పరమపద నివాసి అయిన భగవానుడు, ఇప్పుడ చుట్టూ తోటలతో తుమ్మెదలు ఆహ్లాదముగా విహరించే తిరుక్కణ్ణపురంలో నివాసుడై ఉన్నాడు. కైంకర్యాలను కోరే వాళ్ళారా! అతడిని అనుభవించలేకపోతున్నామే అన్న బాధని తొలగించుకోడానికి, ఏక దృష్టితో మీరందరూ మీ స్వభావానికి సరితూగే శేషత్వముతో అప్పుడే విచ్చుకున్న లేతనైన పుష్పాలతో అతడిని ఆరాధించండి.

నాలుగవ పాశురము: “నప్పిన్నై పిరాట్టి యొక్క పురుషాకారము (సిఫార్సు) తో తిరుక్కణ్ణపురంలో ఉన్న భగవానుడిని ఆశ్రయించండి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

మానై నోక్కి మడప్పిన్నై తన్‌ కేళ్వనై
తేనై వాడా మలరిట్టు నీర్‌ ఇఱైంజుమిన్
వానై ఉందుం మదిళ్‌ శూళ్‌ తిరుక్కణ్ణపురం
తాన్‌ నయంద పెరుమాన్ శరణాగుమే

సమస్థ గుణ సంపూర్ణుడు, జింకలకి ఈర్ష్య కలిగించే అందమైన మృగ నేత్రాలు ఉన్నవాడు, నప్పిన్నై పిరాట్టి యొక్క ప్రియుడు అయిన భగవానుడిని మీరందరూ తాజా పూలతో ఆరాధించండి. ఆశ్రిత వత్సలుని రూపములో సర్వేశ్వరుడు, ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తైన కోటలున్న  తిరుక్కణ్ణపురంలో తన ప్రీతితో కొలువై ఉండి మన సేవలను స్వీకరిస్తున్నారు. “తేనై వాడా మలర్” అనగా నిత్యము తేనెలు కారుస్తున్న పుష్పాలు అని అర్థము.

ఐదవ పాశురము: భక్తి యోగాన్ని పాఠించలేకున్నా, తన దివ్య పాదాలనే సాధనంగా దృఢంగా పట్టుకొని ఉన్నవారిని దయతో భగవానుడు ఎలా కటాక్షిస్తారో ఆళ్వారు కృపతో వివరించారు.

శరణమాగుం తన తాళ్‌ అడైందార్కెల్లాం
మరణమానాల్ వైగుందం కొడుక్కుం పిరాన్‌
అరణమైంద మదిళ్‌ శూళ్‌  తిరుక్కణ్ణపుర
త్తరణియాళన్‌  తనదన్బర్ క్కు అన్బాగుమే

తన దివ్య పాదాలకు ప్రపత్తి (శరణాగతి) చేసిన వారందరికీ, వారి చివరి క్షణాలలో, అతడు మహా ఉపకారిగా మనకి మళ్లీ తిరిగి రాని స్థానాన్ని అనుగ్రహిస్తారు. అటువంటి భగవానుడు ఈ భూమి సంరక్షణ కొరకైన, పటిష్టపరచబడిన అతి సురక్షిత తిరుక్కణ్ణపురంలో నివాసుడై ఉన్నాడు. తన దివ్య పాదాల పట్ల ప్రేమ ఉన్నవారికి, అతడు ప్రేమ స్వరూపుడు. “శరణమ్ ఆగుమ్ తాళ్” అనగా మోక్ష సాధనములైన వారి దివ్య పాదాలు అని కూడా చెప్పుకోవచ్చు. “తరణియాళన్” అనగా  శ్రీ భూమి పిరాట్టి యొక్క ప్రియుడు అని కూడా అర్ధము చెప్పుకోవచ్చు.

ఆరవ పాశురము: “తిరుక్కణ్ణపురంలోని భగవానుడు తనకు శరణాగతులైన వారి అడ్డంకులను తొలగిస్తారు మరియు వారి పట్ల ఆప్యాయతతో ఉంటారు”,  అని ఆళ్వారు తెలుపుతున్నారు.

అన్బనాగుం తన తాళ్‌ అడైందార్కెల్లాం
శెంపొనాగత్తు అవుణనుడల్‌ కీండవన్
నన్‌ పొనేయ్‌ంద మదిళ్‌ శూళ్ తిరుక్కణ్ణపుర
త్తన్బన్ నాళుం తన మెయ్యర్కు మెయ్యనే

ఎర్రటి బంగారపు వర్ణముతో ఉన్న ‘హిరణ్య’ రాక్షసుడి దేహాన్ని సునాయాసముగా చీల్చిన భగవానుడు, తన దివ్య పాదాలకు శరణాగతి చేసినవారి పట్ల గొప్ప వాత్సల్యముతో, మేలిమి బంగారముతో కట్టబడ్డ కోటలతో చుట్టుముట్టబడిన ఉన్న తిరుక్కణ్ణపురంలో ఎంతో ప్రీతితో నివాసుడై ఉన్నాడు. భగవానుడే మన అంతిమ లక్ష్యంగా భావించేవారికి, నిత్యమూ అతడు వారిని తన అంతిమ లక్ష్యంగా భావిస్తారు.

ఏడవ పాశురము: “అనన్యప్రయోజనులకు (కైంకార్యం తప్ప వేరే అపేక్ష లేనివారు) అతడి  ప్రాప్తి సులభ తరము చేస్తాడు, అదే విధముగా ప్రయోజనాన్తరపరులకు (ఇతర లాభాలు కోరుకునేవారు) అతడు వారి కోరికలను నెరవేరుస్తాడు కానీ వారికి దూరంగా ఉంటాడు”, అని ఆళ్వారు వివరిసున్నారు.

మెయ్యనాగుం విరుంబి త్తొళువార్కెల్లాం
పొయ్యనాగుం పుఱమే తొళువార్కెల్లాం
శెయ్యిల్‌ వాళై యుగళుం  తిరుక్కణ్ణపురత్తు
ఐయన్ ఆగత్తణైప్పార్గట్కు అణియనే

అతడినే లక్ష్యంగా చేసుకొని ఇష్టపూర్వకంగా శరణాగతులైన వారికి, అతడు తన అత్యున్నత స్వరూపాన్ని లక్ష్యంగా చూపిస్తాడు. ఇతర ప్రయోజనాలను కోరుతూ తనను ఆశ్రయించిన వారికి, వారి ఆ కోరికలను అనుగ్రహించిన తరువాత వారి యెడల తనను తాను దాచుకుంటాడు; ఈ రెండు వర్గాల వారికి తాను, వారి సహజ బంధువుగా, చేపలు ఎగిరి గెంతి ఆటలాడు చేనులు ఉన్న తిరుక్కణ్ణపురంలో తేలికగా చేరుకునేటట్టు నివాసుడై ఉన్నాడు.

ఎనిమిదవ పాశురము: “సర్వేశ్వరునికి శరణాగతులు కాండి; అతడు మీ దుఃఖాలను తొలగిస్తాడు, పైగా మీ దుఃఖాలకు మూల కారణమైన ఈ సంసార బంధాలను తెంచి వేస్తాడు”, అని ఆళ్వారు వివరిసున్నారు.

అణియనాగుం తన తాళ్‌ అడైందార్కెల్లాం
పిణియుం శారా పిఱవి కెడుత్తాళుం
మణి పొనేయ్ న్ద మదిళ్‌ శూళ్ తిరుక్కణ్ణపురం
పణిమిన్ నాళుం పరమేట్టి తన్‌ పాదమే

భగవానుడి దివ్య తిరువడికి శరణాగతులైన వారికి వారి దగ్గర అతడు ఉండి  ఆనందించి వారిని అనుభవిస్తాడు; ఇతర కోరికల రూపంలో ఉన్న మన వ్యాధిని మటుమాయము చేస్తాడు. చావుపుట్టుకలతో మన సంబంధాన్ని అతడు తొలగిస్తాడు, ఆపై మళ్ళీ ఇంకొక జన్మనెత్తే అవసరం లేకుండా అతడి శాశ్వత సేవతో మనల్ని స్వీకరిస్తారు. విలువైన రత్నాలు మరియు బంగారముతో కట్టబడిన కోటలతో చుట్టు ముట్టి ఉన్న తిరుక్కణ్ణపురంలో, అచ్చం పరమపదములో ఉన్నట్లే ఉన్న భగవానుడి దివ్య పాదాలను మీరు నిత్యమూ ఆరాధించేలా చూడండి. ఆరాధించి తరించండి.

తొమ్మిదవ పాశురము: “ఎవరు నిర్దేషించకుండానే, నేను ఆ భగవానుడికి శరణాగతుడైనాను, ఆనందంగా ఉన్నాను” అని ఆళ్వారు సంతోషపడుతున్నారు.

పాదం నాళుం పణియ త్తణియుం పిణి
ఏదం శారా ఎనక్కేలినియెన్‌ కుఱై?
వేద నావర్‌ విరుంబుం  తిరుక్కణ్ణపురత్తు
ఆదియానై అడైన్దార్కు అల్లల్‌ ఇల్లైయే

అతడి దివ్య పాదాలు ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదిస్తాయి, మునుపటి మన దుఃఖాలను తొలగిస్తాయి; ఆపై మళ్ళీ  దుఃఖాలు కలుగకుండా చేస్తాయి; అందువల్ల, నాకు ఏ చింతా లేదు? కేవలము వేదము ద్వారా మాత్రమే తెలియగల ఆది మూలమైన భగవానుడు తిరుక్కణ్ణపురంలో నివాసుడై ఉన్నాడు. అటువంటి భగవానుడిని నిత్యము వేద ఉపాసనము చేయువారు కోరుకుంటారు, వారికి ఎటువంటి దుఃఖము కలుగదు. ‘పిణి’, ‘ఏదమ్’ పూర్వాగం (శరాణాగతికి ముందు చేసిన పాపాలు) మరియు ఉత్తరాగం (శరాణాగతికి తరువాత చేసిన పాపాలు) అన్న అర్థములను సూచిస్తాయి.

పదవ పాశురము:  “భక్తి ప్రపత్తులు చేయలేకపోయినా, మన బాధలు తొలగించుకోవడానికి తిరుక్కణ్ణపురం అని చెప్పితే చాలు”, అని ఆళ్వారు తాను పొందిన ప్రయోజనాన్ని మరలా గొప్ప ఆనందంతో వివరిస్తున్నారు.

ఇల్లై అల్లల్ ఎనక్కేలినియెన్‌ కుఱై?
అల్లి మాదర్‌ అమరుం తిరుమార్బినన్‌
కల్లిల్ ఏయ్‌ంద మదిళ్‌ శూళ్ తిరుక్కణ్ణపురం
శొల్ల నాళుం తుయర్‌ పాడు శారావే

స్త్రీలలో ఉత్తమురాలు, పద్మ నివాసి అయిన లక్ష్మి, రాతి బండలతో నిర్మిచబడిన కోటలతో చుట్టు ముట్టి ఉన్న తిరుక్కణ్ణపురంలో కొలువై ఉన్న భగవానుడి దివ్య వక్ష స్థలములో నిత్యనివాసి అయ్యి ఉంది; “తిరుక్కణ్ణపురం” అని ఒక్క సారి పలికితే చాలు దుఃఖాలు ఎప్పటికీ దగ్గరకు రావు. ‘ఆనందం లేదు’ అనే దుఃఖం నాకు కలుగదు; ఇక చింత దేనికి?

పదకొండవ పాశురము: “మీ అవరోధాలన్నింటినీ తొలగించుకోవాలని ఆసక్తి ఉన్న వారు, ఈ పదిగాన్ని ప్రేమతో పఠించి అతడికి శరణాగతి చేయండి” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పాడు శారా వినై పఱ్ఱఱ వేండువీర్‌!
మాడనీడు  కురుగూర్ చ్చడగోబన్‌  శొల్‌
పాడలాన తమిళ్ ఆయిరత్తుళ్‌ ఇప్పత్తుం
పాడియాడి పణిమిన్‌ అవన్‌ తాళ్గళే

ఎత్తైన భవనాలతో నున్న ఆళ్వార్తిరునగరికి ప్రభువైన నమ్మాళ్వార్లు ఎంతో కృపతో వెయ్యి పాశురములను పాడారు; మీరు ఈ సంసార దుఃఖాలను వదిలించుకొని, అవి తమ దగ్గరకు కూడా రాకుండా ఆనందంగా ఉండాలని ఆశిస్తే, ద్రవిడ భాషలో సంగీత రూపములో ఉన్న ఆ వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని కూడా సేవించండి. పరమానందముతో నాట్యము చేయండి, అతి సులభుడు సులువుగా చేరుకోగల సర్వేశ్వరుని దివ్య పాదాలను పూజించడానికి ప్రయత్నించండి, వాటిని అనుభవించండి. ఈ పదిగము ద్వారా భగవానుడిని అనుభవించిన వారికి దుఃఖాలు జాడ లేకుండా తొలగించబడతాయి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-9-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment