శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
భగవత్ భక్తులకు సేవ చేయడమే ఆత్మ అసలు స్వరూపానికి తగిన ధర్మము అని ఆళ్వారు సూచిస్తూ, ఈ పదిగము ద్వారా అందరికీ సలహా కూడా ఇస్తున్నారు. భగవత్ సేవ మొదటి మెట్టుగా, భాగవత సేవ తుది మెట్టుగా ఈ పదిగములో ఆళ్వారు స్పష్టంగా వివరించారు.
మొదటి పాశురము: “ముల్లోకాలను ఏలే కంటే, భాగవతులను సేవించడము నాకు అత్యంత ప్రీతిదాయకము” అని ఆళ్వారు తెలుపుతున్నారు.
నెడుమాఱ్కడిమై శెయ్వేన్ పోల్ అవనై క్కరుద వంజిత్తు
తడుమాఱ్ఱఱ్ఱ తీక్కదిగళ్ ముఱ్ఱుం తవిర్ న్ద శదిర్ నినైందాల్
కొడు మా వినైయేన్ అవన్ అడియార్ అదియే కూడుం ఇదువల్లాల్
విడుమాఱెన్బదెన్ అందో! వియన్ మూవులగు పెఱినుమే
నేను అనంతమైన ఆ సర్వేశ్వరుడికి సేవ చేయాలని అనుకున్నప్పుడు, అతడు నాలో ఉండి నా చంచలత్వాన్ని తొలగించి, దుష్ఠ శక్తులు నన్ను విడిచిపెట్టేలా చూసుకున్నాడు; భాగవతుల దివ్య పాదాలను పొందడం మినహా, మనకి శ్రేయస్కరమైనది ఏది అని చూస్తే, మహా పాపాత్ముడనైన నాకు ముల్లోకాల ఐశ్వర్యము పొందడం ఎందుకు గొప్ప, భాగవతుల దివ్య పాదాలను విడవాలని నాకు ఎందుకు సూచించబడింది? (ఐశ్వర్యము మరియు తదీయ శేషత్వము మధ్య ఉన్న తేడాని నొక్కి చూపించడానికి).
రెండవ పాశురము: “ఐశ్వర్యము మరియు కైవల్యము (ఆత్మానుభవము) రెండింటినీ కలిపి పొందినా కానీ, అది నేను పొందిన భాగవత శేషత్వముతో పోల్చలేము”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.
వియన్ మూవులగు పెఱినుం పోయ్ తానే తానే ఆనాలుం
పుయల్ మేగం పోల్ తిరుమేని అమ్మాన్ పునై పూంగళల్ అడిక్కీళ్
శయమే అడిమై తలై నిన్ఱార్ తిరుత్తాళ్ వణంగి ఇమ్మైయే
పయనే ఇన్నం యాన్ పెఱ్ఱదు ఉఱుమో పావియేనుక్కే?
సర్వేశ్వరుడు మేఘ వర్ణముతో దివ్య స్వరూపాన్ని కలిగి ఉంటాడు. అతడి దివ్య పాదాలు పుష్పాలతో, విలువైన కాలి అందెలతో, కడియాలతో అలంకరించబడి ఉంటాయి. కొందరు భాగవతులు ఆ దివ్య పాదాలకు దాసులై నిష్కామమైన సేవ చేసుకుంటూ అత్యున్నత స్థితిలో ఉన్నారు. నేను ముల్లోకాల సంపదను పొంది అటువంటి ఐశ్వర్యము మరియు కైవల్యాలను అనుభవించినా, అలాంటి భాగవతులకు ప్రణమాములు అర్పించినప్పుడు నేను చేసిన అపరాధములకు ఇవి సరిపోవునా? భాగవత కైంకార్యానికి అవి (ఐశ్వర్యము, కైవల్యము) సరితూగవు అని సూచిస్తుంది.
మూడవ పాశురము: “నేను ఒకవేళ భగవత్ ప్రాప్తిని (భగవానుడిని చేరుకొని అతడిని సేవించడం) పొందినా, అది ఐశ్వర్యము మరియు కైవల్యము (ఆత్మానుభవము) కంటే గొప్పదైనప్పటికీ, ఈ ప్రపంచంలో భాగవతుల సేవకి అది సరితూగదు”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.
ఉఱుమో పావియేనుక్కు ఇవ్వులగం మూన్ఱుం ఉడన్ నిఱైయ
శిఱుమా మేని నిమిర్త ఎన్ శెందామరై క్కణ్ తిరుక్కుఱళన్
నఱుమా విరై నాణ్మలరడి క్కీళ్ పుగుదల్ అన్ఱి అవనడియార్
శిఱుమా మనిశరాయ్ ఎన్నై ఆండార్ ఇంగే తిరియవే
ఆకర్షణీయమైన చిట్టి మరుగుజ్జు స్వరూపములో వచ్చిన శ్రీ వామనుడు ఒకేసారి ముల్లోకాలను నింపగలిగే విశ్వరూపాకారములో తనను తాను పెంచుకున్నాడు; ఎర్రటి కమలముల వంటి అతడి నయనములు నాకు ఎంతో ఆనందాయకముగా ఉన్నాయి; మానవ రూపము కారణంగా ఆ శ్రీ వామన దాసులు చిన్నగా కనిపించినా గొప్ప వ్యక్తిత్వము ఉన్నవారు, వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఇక్కడే ఉండగా, పాపములతో కూడి ఉన్న నేను, తేనెలు కారుతూ అప్పుడే వికసించిన కుసుమములను పోలిన వామనుడి ఉత్తమమైన శ్రీ దివ్య పాదాలను పొందుట సబబేనా?
నాలుగవ పాశురము: “ శ్రీవైష్ణవులను మెప్పించటానికి భగవానుడిని కీర్తించి సేవించినా, శ్రీవైష్ణవులు నడైయాడిన ఈ భూమిపైనే ఇక్కడే ఉండటం నాకు అత్యంత యొగ్యమైనది, అత్యున్నతమైన లక్ష్యము కూడా”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.
ఇంగే తిరిందేఱ్కిళుక్కుఱ్ఱెన్? ఇరు మా నిలం మున్ ఉండుమిళ్ న్ద
శెంగోలత్త పవళ వాయ్ శెందామరై కణ్ ఎన్నమ్మాన్
పొంగేళ్ పుగళ్గళ్ వాయవాయ్ ప్పులన్ కొళ్ వడివెన్ మనత్తదాయ్
అంగేయ్ మలర్గళ్ కైయవాయ్ వళి పట్టోడ అరుళిలే
నా స్వామి అయిన భగవానుడు తన అందమైన పగడము లాంటి ఎర్రటి దివ్య అదరములతో ప్రళయ సమయములో ఈ విశాల విశ్వాన్ని మ్రింగి ఆపద తొలగిన తరువాత మరళ తనలో నుండి బయటకు తీసి ఈ విశ్వాన్ని స్థాపిస్తాడు. అటువంటి భగవానుడికి ఎర్రటి కమలము వంటి అందమైన దివ్య నేత్రాలు ఉంటాయి; ఈ ప్రపంచంలో సంచరిస్తున్న నాకు, అతడి గుణ గణాలను వాక్కుతో కీర్తించమని అనుగ్రహించి, దివ్య ఆకర్షణ కలిగి ఉన్న అతడి స్వరూపముతో నా ఇంద్రియాలను కట్టివేసి, నా హృదయంలో స్థిరపరచి, అతడి గొప్పతనానికి సరిపోలే దివ్య పుష్పాలను నా చేతుల్లో ఉంచితే తప్పేముంది?
ఐదవ పాశురము: “ఒకవేళ నేను తిరునాడు (పరమపదము) కి వెళ్లి అక్కడ భగవానుడిని సేవించే అత్యున్నత లక్ష్యాన్ని సాధించినా, ఇంతకుముందు చెప్పినట్లు ఐశ్వర్యము మొదలైనవన్నీ నాకు అక్కడ లభించినా, ఈ సంసారంలో పుట్టి శ్రీవైష్ణవుల ఆనందము కొరకు తిరువాయ్మొళిని సేవించుటకు అవన్నీ సరితూగుతాయా?” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.
వళి పట్టోడ అరుళ్ పెఱ్ఱు మాయన్ కోల మలర్ అడిక్కీళ్
శుళి పట్టోడుం శుడర్ చ్చోది వెళ్ళత్తు ఇన్బుఱ్ఱిరుందాలుం
ఇళి పట్టోడుం ఉడలినిల్ పిఱందు తన్ శీర్ యాన్ కఱ్ఱు
మొళి పట్టోడుం కవియముదం నుగర్చి ఉఱుమో? ముళుదుమే
సర్వేశ్వరుడు అద్భుతమైన స్వభావం, స్వరూపం, గుణాలు మరియు ఐశ్వర్యము కలిగి ఉంటాడు; సర్వేశ్వరుడి కృపతో సరైన నడవడిని అలవర్చుకొని నిత్యమూ ప్రకాశము వెదజల్లే ఆతడి దివ్య తిరువడిని యందు ఆనందముగా ఉండిపోయినప్పటికీ, ఇంతకు ముందు వివరించిన ఐశ్వర్యము కైవల్యము మొదలైనవి సాధించినప్పటికీ, ఈ క్షుద్ర అణగారిన శరీరంలో జన్మించి అతడి గుణాలను నేర్చుకొని అతడిని కీర్తిస్తూ తేనెల కవితలను పాడుతూ ఆనందించడానికి సరితూగుతుందా?
ఆరవ పాశురము: “కేవలం ఐశ్వర్యము, కైవల్యము, భగవత్ అనుభవ ప్రీతి (భగవాన్ అనుభవము), భగవత్ ఆనందం (భగవాన్ యొక్క ఆనందం) మాత్రమే సాధించినట్లయితే, అవన్నీ తిరువాయ్మొళిని శ్రీవైష్ణవుల ఆనందము కొరకు పఠించుటకు సరితూగుతాయా?” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.
నుగచ్చి ఉఱుమో మూవులగిన్ వీడు పేఱు తన్ కేళిల్
పుగర్ చ్చెమ్ముగత్త కళిఱాట్ట పొన్నాళిక్కై ఎన్నమ్మాన్
నిగర్ చ్చెం పంగి ఎరివిళిగళ్ నీండ అశురర్ ఉయిర్ ఎల్లాం
తగర్ త్తుండు ఉలిలుం పుట్పాగన్ పెరియ తనిమా పుగళే
నా ప్రభువైన భగవానుడి దివ్య హస్తమును, అసమానమైన శౌర్యముతో ఎర్రటి ముఖం ఉన్న గజముని నాశనం చేయడానికి ఉపయోగించారు; ఎర్రటి శిరోజాలు మండుతున్న కళ్ళుతో కండలు పెంచిన రాక్షసులను చంపే పెరియ తిరువడి (గరుడాళ్వార్) యొక్క నియామకుడు ఇతడు; ముల్లోకాలను సృష్టించగల సామర్ధ్యం ఉన్న వారి స్వామిత్వము, భాగవతులను ఆహ్లాదపరచే తిరువాయ్మొళి ద్వారా అతడి అపరిమిత విశేష గుణాల అనుభవానికి సరితూగుతుందా?
ఏడవ పాశురము: “స్వతంత్ర లక్ష్యంగా పరిగణించబడే భగవత్ అనుభవము నాకు అవసరం లేదు; కానీ భాగవతులతో కలిసి వారి సంతృప్తి కొరకై భగవత్ అనుభవంలో మునిగాలనుకుంటున్నాను”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
తనిమా ప్పుగళే ఎజ్ఞాన్ఱుం నిఱ్కుంపడియాయ్ త్తాన్ తోన్ఱి
ముని మా ప్పిరమ ముదల్విత్తాయ్ ఉలగం మూన్ఱుం ముళైప్పిత్త
తని మా త్తెయ్వ త్తళిర్ అడిక్కీళ్ పుగుదలన్ఱి అవన్ అడియార్
ననిమా క్కలవి ఇన్బమే నాళుం వాయ్ క్క నంగట్కే
“పర బ్రహ్మ” అనే శబ్దములో వివరించినట్లుగా, భగవానుడు సృష్టి గురించి ధ్యానిస్తూ తన సర్వ కారణత్వ గుణాన్ని చూపిస్తూ సృష్టించాలనే ఉద్దేశ్యంతో అవతరిస్తారు, అతడు ప్రాధమిక సృష్టిలో భాగముగా ముల్లోకాలను సృష్టించాడు; అటువంటి అత్యున్నత భగవానుడి అతి లేత దివ్య పాదాల క్రింద స్థానాన్ని పొందేకంటే, అతడి గూణాలని కీర్తిస్తూ అతడి దాసులుగా ఉన్న అత్యుత్తమ భాగవతుల సంబంధము నిత్యము కలగాలి.
ఎనిమిదవ పాశురము: “నేను భాగవతలతో కలిసి వారితో సంభాషించాల్సిన అవసరం ఉందా? కేవలము వాళ్ళ మధ్య ఉన్నా చాలు నాకు. లేదా వారి సమూహాలను దర్శించినా చాలు నాకు”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
నాళుం వాయ్ క్క నంగట్కు నళిర్ నీర్ క్కడలై ప్పడైత్తు తన్
తాళుం తోళుం ముడిగళుం శమనిలాద పల పరప్పి
నీళుం పడర్ పూంగఱ్పగ క్కావుం నిఱై పన్నాయిఱ్ఱిన్
కోళుం ఉడైయ మణిమలైపోల్ కిడందాన్ తమర్గళ్ కూట్టమే
వేదము వెల్లడించినట్లుగా, భగవానుడు చల్లని నీటి సముద్రాన్ని సృష్టించి, ప్రత్యేకమైన అసమానమైన రీతిలో అనేక దివ్య ముఖాలతో, అనేక దివ్య కిరీటాలతో, అనేక దివ్య భుజాలతో, అనేక దివ్య చరణములతో అందమైన కల్ప వృక్షములు పెరుగే మాణిక్య పర్వతములా అనేక దివ్య కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుని వలే ఆ సాగరములో విశ్రమిస్తున్నారు; అటువంటి భగవవానుడి సేవకులతో నిత్య సంబంధము మనకు ఎప్పటికీ ఉండాలి. కూట్టం – సేర్తి – కలయిక. మరోవివరణ – కుట్టం అంటే సంఘము (సమూహము), ఇక్కడ ఆళ్వారు అటువంటి సమూహము తన ఎదుట ఉండాలని ప్రార్థిస్తున్నారు.
తొమ్మిదవ పాశురము: “మనం వాళ్ళతో కలిసి జీవించాల్సిన అవసరం ఉందా? వారికి దాస్యులుగా ఉంటే సరిపోతుంది”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
తమర్గళ్ కూట్ట వల్వినైయై నాశం శెయ్యుం శదిర్ మూర్తి
అమర్ కొళ్ ఆళి శంగు వాళ్ విల్ తండాది పల్ పడైయన్
కుమరన్ కోల ఐంగణై వేళ్ తాదై కోదిల్ అడియార్ తం
తమర్గళ్ తమర్గళ్ తమర్గళాం శదిరే వాయ్ క్క తమియేఱ్కే
మనందరికీ స్వామి అయిన భగవానుడికి, తన భక్తులకు సంభవించే అనేక దోషాలను నాశనం చేసే సామర్థ్యము ఉంది; శ్రీ పంచ ఆయుధములతో ప్రారంభించి అనేక రకాల అసంఖ్యాక ఆయుధాల అతడి వద్ద ఉన్నాయి; గొప్ప అతిలోక సుందరుడు పంచ బాణాలు తన ఆయుధాలుగా ఉన్న నిత్య యవ్వనుడైన కామదేవునికి తండ్రి హోదాగా ఉన్నవాడు భగవానుడు; ఈ సంసారంలో నిస్సహాయంగా ఉన్న మనకు, అటువంటి భగవానుడి యొక్క శుద్ద భక్తుల దాసులకి దాసులను సేవించే సంపద మన వద్ద ఉన్నందున, ఆతడి కృప మనపై సంభవించాలి. ‘కూట్ట వల్ వినై’ అనే పదము ప్రాపంచిక ఆసక్తి ద్వారా పొందిన పాపాలు అని సూచిస్తుంది. “చదు మూర్తి” (శదిర్ మూర్తికి బదులుగా) అని పఠించినప్పుడు, ఇది భగవానుడి యొక్క వివిధ స్వరూపాలను సూచిస్తుంది.
పదవ పాశురము: “నాతో పాటు నా సహచరులు అందరూ ఈ ఫలితాన్ని పొందాలి (భాగవత శేషత్వం)”, అని ఆళ్వారు భావిస్తున్నారు.
వాయ్ క్క తమియేఱ్కు ఊళి దోఱూళి ఊళి మాకాయాం
పూక్కొళ్ మేని నాంగు తోళ్ పొన్ ఆళి క్కైఎన్నమ్మాన్
నీక్కం ఇల్లా అడియార్ తం అడియార్ అడియార్ అడియార్ ఎం
కోక్కళ్ అవర్కే కుడిగళాయ్ చ్చెల్లుం నల్ల కోట్పాడే
కాయము (ముదురు నీలము రంగు) వర్ణముతో, చతుర్భుజాలతో, అతడి దివ్య హస్థములో ఆకర్షణీయమైన దివ్య చక్రముతో, ఆకర్షణీయమైన గొప్ప స్వరూప సౌందర్యాన్ని నాకు చూపించి నన్ను ఆకట్టుకొని నన్ను కట్టి వేశాడు; అటువంటి భగవానుడిని క్షణము కూడా విడువకుండా సేవిస్తూ ఆనందిస్తున్న ఆ దాసులు నాకు మరియు నా సహచరులకు ప్రభువులాంటివారు; ప్రతి మహా కల్పాము నడుమ సంభవించే మధ్యమ కల్పాలలో కూడా వారినే కీర్తిస్తూ అతడినే అనుసరించే వారితో నా సహవాసము సంభవించాలి.
పదకొండవ పాశురము: “ఈ పదిగములో నిపుణులైనవారు, ఇక్కడ వివరించబడిన భాగవత శేశత్వాన్ని పొందుతారు, వారి కుటుంబాలతో సంతోషంగా జీవిస్తారు”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.
నల్ల కోట్పాట్టులగంగళ్ మూన్ఱినుళ్ళుం తాన్ నిఱైంద
అల్లి కమల క్కణ్ణనై అందణ్ కురుగూర్ చ్చడగోబన్
శొల్ల ప్పట్ట ఆయిరత్తుళ్ ఇవైయుం పత్తుం వల్లార్గళ్
నల్ల పదత్తాల్ మనై వాళ్వర్ కొండ పెండీర్ మక్కళే
ముల్లోకాలలో ఆణువణువునా వ్యాపించి ఉన్న భగవానుడు, సుందమైన కమల నయనములు కలవాడు; అందమైన ఆహ్లాదకరమైన ఆళ్వార్తిరునగరిని నియంత్రించు నమ్మాళ్వార్ల దివ్య పలుకులతో సృష్టించబడిన వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని అభ్యసించి పఠించగలిగే వారు, గృహస్థాశ్రమంలో తమ భార్య పిల్లలు మొదలైనవారితో విశిష్ఠ తదీయ శేషత్వ స్థితిలో జీవిస్తారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-8-10-simple/
పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org