ప్రమేయసారము 9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురము 8

emperumAnAr-embAr

ఉడయవర్ – ఎంబార్

అవతారిక:

                     గత ఎనిమిది పాశురాలలో “ ఓం నమో నారాయణాయ ‘ అనే అష్టాక్షరి మంత్రంలోని మూడు పదాల అర్థాన్ని వివరించారు .ఈ పాశురంలో ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుల పట్ల నడచుకోవలసిన విధానం గురించి చెపుతున్నారు. ఆచార్యులను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించి శాస్త్రంలో  చెప్పిన రీతిలో కైంకర్యం చేయాలని చెప్పారు. అలా కాక  ఆచార్యులను మన లాంటి మానవుడిగా భావించేవారికి , ఆచార్యులను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించేవారికి బేధాన్ని తెలియచేస్తున్నారు. దీని వలన ఆచార్యుల ఔన్నత్యం తెలుస్తున్నది.

పాశురము-9

తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై

వైత్త అవరై వణంగియిరాప్ పిత్తరాయి

నిందిప్పార్కు ఉణ్దు ఏఱా నీళ్ నిరయం నీదియాల్

వందిప్పార్కు ఉణ్దు ఇళియా వాన్

ప్రతిపదార్థము:

తాళిణైయై వైత్త = అజ్ఞానము తొలగి పోయేట్లు శిష్యుడి తల మీద తన శ్రీ పాదాలను ఉంచిన

అవరై = ఆచార్యులను

తత్తం ఇఱైయిన్  = తమ దైవంగా

వడివు ఎన్ఱు = దైవ స్వరూపంగా

వణంగియిరా = దాసోహాలు సమర్పించని

ప్పిత్తరాయి = సత్యమును తెలుసుకోలేని పిచ్చివారై

నిందిప్పార్కు = మనుషులుగా భావించే వారికి

ఏఱా నీళ్ నిరయం = వొడ్డు ఎక్కలేని లోతైన నరకమే

ఉణ్దు = ప్రాప్తిస్తుంది.

నీదియాల్ = శాస్త్రములో చెప్పిన  క్రమము తప్పక

వందిప్పార్కు = ఆచార్య కైంకర్యం చేసే వారికి

ఇళియా వాన్  = పునర్జన్మ లేని జన్మ రాహిత్యము కలిగి

వాన్ ఉణ్దు = పరమపదములో ఉంటారు

 

వ్యాఖ్యానము;

తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు …. తత్తం…..తమ తమ దైవము అని అర్థము. శ్రీమన్నారాయణుడు అందరికి దైవము కాగా జ్ఞానానిచ్చే వారి వారి ఆచార్యులు వారి వారి దైవము అని చెపుతున్నారు .  శ్రీమన్నారాయణుడు అందరికి దైవము, నాయకుడు అయినా చేతనులకు జ్ఞానాన్ని అందించడానికి మానవరూపంలో ఆచార్యునిగా అవతరించాడు. అందు వలన శాస్త్రములు ఆచార్య దేవోభవ అని అజ్ఞానాన్ని తొలగదోసి జ్ఞానానిచ్చే ఆచార్యులు ప్రత్యక్ష దైవం అని చెపుతున్నాయని గ్రహించాలి . శిష్యులు తమ తమ ఆచార్యులను దైవముగా భావించాలి  అని అర్థము.

తాళిణైయై వైత్త అవరై ……. జ్ఞాన సారం “విల్లార్ మణి  కొళిక్కుం”అనే 38 వ పాశురం లో  “మరుళాం ఇరుళోడ  మత్తగత్తు  తన్ తాళ్ అరుళాళే వైత్త  అవర్” అని చెప్పరు. అనగా తమ అజ్ఞానాన్ని పోగొట్టడానికి కృపతో   వారి శ్రీపాదాలను తమ వొడిలో పెట్టిన ఆచార్యలు అని చెపుతున్నారు .

వణంగియిరాప్పిత్తరాయి………కొందరు ఆచార్యులకు కైంకర్యము చేయక వారిని తమ వంటి సామాన్య మానవుడిగా చూస్తారు . అలాంటి వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు . ఒకసారి ఏమ్బార్లను కొందరు “చాయైపోల పాడ వల్లార్ తాముం అణుక్కర్గళే ” (పెరియాళ్వార్ తిరుమొళి 5-4-11) అనే పాశుర భాగానికి అర్థం చెప్పమని అడిగారు. దానికి వారు తాము తమ ఆచార్యులైన ఉడయవర్ల దగ్గర ఈ పాశుర అర్థాలను వినలేదని చెప్పి ,అయినా మీరు అడిగారు కాబట్టి చెప్పితీరాలి. ఇప్పుడే మా ఆచార్యులను అడిగి చెపుతాను అని తమ  ఆచార్యుల దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో ఉడయవర్లు వారి ఆచార్యులైన తిరుక్కోట్టియూర్ నంబి దగ్గర కూర్చొని వున్నారు. ఎంబార్ ఉడయవర్ల పాదుకలను తన తల మీద పెటుకొని ఇదిగో మా ఆచార్యులు మాకు చెప్పారు అదే  అర్థాన్ని మీకు చెపుతాను అని మీరు అడిగిన పాశురభాగం అర్థం కూడా ఇదే అన్నారట.

ఇక ఆచార్యులను సాధారణ మనిషిగా భావించేవారి గురించి చెప్పబోతున్నారు .

ఏఱా నీళ్ నిరయం ఉండు …… ఏఱా ….దాటలేని….వొడ్డు ఎక్కలేని , నీళ్ నిరయం ఉండు……నరకం ఉంది. ఆచార్యులను మాటలతో చిన్నబుచ్చకున్నా సాధారణ మనిషిగా భావించటమే దోషము. అలాంటి వారు నరకం నుండి బయట పడలేరు . యముడి దండన కంటే నరకం వేరైనది ఇది . నారాయణ నామం వింటే ” నరకమే స్వర్గమవుతుంది “ అని తిరుమలైలో చెప్పారు. కానీ ఆచర్యోపచారం వలన వచ్చే నరకం అలా కాక అనుభవించి తీర వలసిందే  అంటున్నారు.

          ఆచార్యులను సాధారణ మనిషిగా భావించే వారు ఎప్పటికి ఉజ్జీవించలేరు. ఆ అర్హతను కూడా పొందలేరు . జననమరణ చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు . ఈ సందర్భంగా తిరువళ్ళువర్లు “ ఉరంగువదు పోలుం -సాక్కాడు , ఉరంగి విళివదు పోలుం పిరప్పు “  ( నిద్రించి నట్లుగా చావు, నిద్ర లేచినట్లుగా పుట్టుక .) అన్నారు.

నీదియాల్ వైందిప్పార్కు ఉణ్దు….. జ్ఞాన సారం పాశురం “తేనార్ కమల తిరుమామగల్ కొళునన్ తానే గురువాగి త న్నరుళాల్ మానిడర్క ఇన్నిలతే  తోన్రుతలాల్” ( తేనెలూరు పద్మోద్భవి దవుడు తానే గురువై తన కృప వలన ఈ లోకంలోని వారికి ఉపదేశించాడు ), అన్నట్లు ఆచార్యుని పరమాత్మ స్వరూపంగా భావింఛి శాస్త్రంలో చెప్పినట్లుగా నడచుకునే వారికి పునర్జన్మ ఉండదు.

 ఇందులో నీతి  ఏవిటంటే ఆచార్యుని సేవించటంలో దోషం చేయని వారికి పునర్జన్మ ఉండదు. వైకుంటమే వారికి  నిత్య నివాసము. మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల విషయంలో  “ తేవు మత్తు అరియేన్ ”  అన్నారు.(ఆచార్యుని తప్ప ఇతర దైవాన్ని ఎరగను ) ఆ విధంగా తమ ఆచార్యుల పట్ల నడచుకునే  మంచి శిష్యులు నిత్యులై పరమపదంలో ఉంటారు అని చెపుతున్నారు.

ఆడియెన్ చూడామణి రామనుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-9/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment