ప్రమేయసారము 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురము 3

reclinevishnu

 

అవతారిక:

                    పరమాత్మ సమత జీవులకు నాయకుడు, సర్వ స్వతంత్రుడు. ఆయనను ఎవరూ సాసించలేరు , వంచలేరు, ఆపలేరు . అందు వలననే శాస్త్రము ఆయన అనుగ్రం పొందడానికి కర్మ యోగము, జ్ఞాన యోగము , భక్తి యోగము మొదలైన మార్గాలను గురించి చెప్పింది. అయితే శాస్త్రములోని అంతరాత్మను గ్రహించని వాళ్ళు  కర్మ యోగము, జ్ఞాన యోగము ,భక్తి యోగముల వలన ఆయనను పొంద గలమని భావిచి అనేక ప్రయత్నాలను చేస్తారు. వారికి ఒక ముఖ్యమైన వాస్తవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. పరమాత్మ తన శ్రీ పాదాలను తానే ఇస్తే తప్ప ఇతర మార్గాల వలన ఆయనాను పొందలేము. అందు వలన ఆయన అనుగ్రహము కోసము ఎదురు చూడాలనే సూక్ష్మమును  ఈ పాశురంలో చెపుతున్నారు.

పాశురం

కరుమత్తాల్ జ్ఞానత్తాల్ కాణుం వగై ఉణ్దో?

తరుం అత్తాల్ అన్ఱి ఇఱై తాళ్గళ్

ఒరుమత్తాల్ మున్నీర్ కడైందాన్ అడైత్తాన్ ముదల్ పడైత్తాన్

అన్నీర్ అమరందాన్ అడి

 

ప్రతిపదార్థము;

ఒరుమత్తాల్ =  మందర పర్వతమనే కవ్వముతో

మున్నీర్  = మున్నీరు, సముద్రము ( నేలలో ఊరే నీరు ,నదీప్రవాహముల నుండి వచ్చి చేరే నీరు, పై నుండి వర్షముగా కురిసే నీరు. మూడు రకాల నీరు చేరడం వలన సముద్రాన్ని మున్నీరు అంటారు)

కడైందాన్ = దేవతల కోసము చిలికినవాడు

అడైత్తాన్ = సీతమ్మను పొందడం కోసం సముద్రానికి ఆనకట్ట కట్టినవాడు

ముదల్ పడైత్తాన్ = కాలమాసన్నమవగానే సృష్టి  కార్యము చేసిన వాడు

అన్నీర్ = ఆ నీటిలోనే

అమరందాన్ = శయనించాడు

అడి = అంతటి  శ్రీపాదాలు

ఇఱై తాళ్గళ్ = పరమాత్మ  తానుగా ఇచ్చే శ్రీపాదాలు

తరుం అత్తాల్ అన్ఱి =పరమాత్మ  ఇవ్వాలన్న సంకల్పము చేస్తే తప్ప

కరుమత్తాల్ = మనం కష్తపడి చేసే కర్మల వలననో

జ్ఞానత్తాల్ = జ్ఞాన భక్తి యోగాల వలననో

కాణుం వగై ఉణ్దో? = పొందే విధానం ఉందా?

వ్యాఖ్యానం:

కరుమత్తాల్ జ్ఞానత్తాల్ కాణుం వగై ఉణ్దో?……కర్మ యోగము, జ్ఞాన యోగము వలన పొందే విధానం ఉందా? లేదు అని అర్థము. జ్ఞాన యోగములోనే భక్తి కూడా చేరి ఉన్నది. జ్ఞానము ముదిరితే భక్తి అవుతుంది .  వేదాంత శాస్త్రంలో పై మూడింటిని భగవంతుని పొందే మార్గాలుగా చెపుతారు. భగవద్గీతలో జ్ఞాన యోగం ఔన్నత్యం చెప్ప బడింది. ” నన్ను పొందగోరే వాడు మనసును నా మీద నిలపాలి .నానే అవ్యవధానంగా స్మరించాలి నమస్కరించాలి.” అని అర్జునుడికి శ్రీకృష్ణుడే ఉపదేశించాడు . అంత స్పషటంగా జ్ఞాన యోగము గురించి  శ్రీకృష్ణుడే ఉపదేశించాక ‘ పొందే విధానం ఉందా?’ అనటం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇలా ప్రశ్నించిన ఈ ప్రబంధ కర్త అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు  పైన చెప్పిన యోగముల గురించి, పరమాత్మ స్వరూపమున్ గురించి తమ అపారమైన జ్ఞానంతో తేట తెల్లంగా తెలుసుకున్నవారు. పై యోగాలను ఆచరించే వాళ్ళు కూడ ఆ పరమాత్మ శ్రిచరణాల దగ్గర శరణాగతి చేసిన తరువాత చేయవలసి ఉంది. ఆ శరణాగతి పై యోగాలను ఆచరించడానికి ఉపకారంగా ఉన్నాయి. కాబట్టి స్వప్రయత్నంతో చేసే కర్మజ్ఞాన భక్తి యోగాలకు శరణాగతి తోడు ఉండాలి అన్న శాస్త్రంలో చెప్పిన  సూష్మ విషయాలను గ్రహించి ఈ పాశురంలో ఇలా చెపుతున్నారు. భగవంతుడిని శరణాగతి చేసి ఆయన అనుగ్రహం పొంద కుండా చేసే ఇతర యోగాలేవి ఫలించవు  అని చెపుతున్నారు .

     పరమాత్మకు జీవాత్మకు నవ విధ సంబంధాలు ఉండడము వలన ,  ఆయనను పొందడానికి సులభ మార్గాలు ఉండగా కష్ట పడి చేసే కర్మ జ్ఞాన భక్తి యోగాలను అనుసరించవలసిన అవసరం లేదు  అని అర్థము .    ఆళవందార్లు అనుగ్రాహించిన గీతార్త సంగ్రహం 31 లో ,

నిజ కర్మాధి భక్త్యంతం కుర్యాత్ ప్రీత్యైవ కారిత: |

ఉపాయతాం పరిత్యజ్య న్యచేద్దేవే తు తామభీ: ||

తిరుమళిసై ఆళ్వార్లు  నాన్ముగన్ తిరువంతాది -7 లో

ఇన్ఱాగ నాలైయేయాగ ఇనిచ్చిరిదుం

నిన్ఱాగ నిన్నరుళ్ ఎంపాలదే – నన్ఱాగ

నాన్ ఉన్నై అన్ఱి ఇలేన్ కణ్డాయ్

నారణనే నీ ఎన్నై అన్ఱి ఇలై

పైఅ సూక్తుల వలన పరమాత్మ తప్ప వేరే ఉపాయం లేదని స్పష్టమవుతున్నది.

తరుం అత్తాల్ అన్ఱి ఇఱై తాళ్గళ్ …… …పరమాత్మ శ్రీపాదాలు తప్ప వేరే గతి లేదు లేదు. అర్థాత్ ఆయన కృప వలన లభించే ఆయన శ్రీపాదాలు అని చెపుతున్నారు.  ముముక్షుప్పడి చూర్నికలో ఈ విషయంగా “పిరాత్తియుం అవనుం విడిలుం తిరువడిగళ్ విడాదు, తిణ్కళలాఇ ఇరుక్కుం”అన్నారు. ఇక్కడ ‘ ఇఱై ‘ అన్న ప్రయోగం అష్టాక్షరి మంత్రంలోని ‘ ఓం ‘ అనే ప్రణవంలోని  మొదటి అక్షరమైన ‘ఆ కారాన్ని సూచిస్తుంది . అర్థాత్ నారాయణ పదమును తెలుపుతుంది .

తాళ్గళ్ తరుం అత్తాల్ అన్ఱి  ……ఆ పాదాలు తప్ప ఇతరమైనవి ఏవీ కావు అంటే భగవంతుడి శ్రీపాదాలు తప్ప మరేవీ మనకు శరణాగతి చేయదానికి అర్హమైనవి కావు అని శాస్త్రములలో చెప్పిన విషయాన్ని నొక్కి చెపుతున్నారు. ద్వయ మహా మంత్రంలోని మొదటి భాగంలో , “తిరువడిగళే శరణమాగ పఱ్ఱుగిరేన్.అని చెప్పబడింది.  నమ్మాళ్వార్లు  తిరువాయిమొళిలో “ఆఱెనెక్కు నిన్ పాదమే శరణాగత్ తందొళిందాయ్”, “కళల్గళ్ అవైయే శరణాగ కొణ్డ”, “అదిమేల్ సేమంకొళ్ తెన్ కురుగూర్ శటకోపన్”  “చరణే చరణ్ నమక్కు” అని భగవంతుడి శ్రీపాదములే శరణమని పలు సందర్భాలలో చెప్పారు. అందు వలన భగవంతుడి శ్రీపాదములు తప్ప మరేది మనకు ఆశ్రయించ తగినది కాదు అని స్పషటంగా తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణలు చెప్పుతున్నారు.

ఒరుమత్తాల్ మున్నీర్ కడైందాన్…….దేవలోకములో ఇంద్రుడు ఐరావతమనే తన ఏనుగునెక్కి వస్తున్నప్పుడు దూర్వాసుడు శ్రీమహాలక్ష్మి పూజలో తనకు ప్రసాదంగా లభించిన పూల మాలను ఇంద్రుడికి ఇచ్చాడు.  ఇంద్రుడు ఆ పూల మాలను తన  ఏనుగు తొండం మీద వేశాడు ,అది ఆ మాలను చిదిమి ముక్కలు చేసింది. ఇది చూసిన ఆ ముని కోపంతో ఇంద్రుడు ధన గర్వంతోనే కదా ఇలా ప్రవర్తించాడు ! ఆ ధనము ఇంద్రుడిని విడిచి తొలగి పోవుగాక! అని శపించాడు. క్షణంలో  ఇంద్రుడి ధనమతా తొలగి పోయింది. అప్పుడు  ఇంద్రుడు చేసిన తప్పుకు విచారించి దిక్కు తోచక శ్రీరిమన్నారాయణుని శ్రీపాదాల మీద పడ్డాడు. తనను శరణు జొచ్చిన ఇంద్రుడిని కరుణించి పాల సంద్రాన్నిమధించి మళ్ళీ శ్రీమహాలక్ష్మిని పొందమని చెప్పాడు.  మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని , వాసుకిని తాడుగా చుట్టి , ఆ మంధర పర్వతం నీళ్ళల్లో మునిగిపోకుండా తానే కూర్మంగా (తాబేలు)  పర్వతం అడుగున చేరి అసాధ్యమైన సముద్ర మధనాన్ని సాధ్యం చేసాడు శ్రీరిమన్నారాయణుడు . పాశురంలో “ఆయిరం తోళాల్ అలై కడల్ కడైందాన్(వేయి చేతులతో సముద్రాన్ని చిలికాడు)అని చెప్పినట్టుగా చిలికి, ఇంద్రుడు కోల్పోయిన లక్ష్మితో పాటు అమృతాన్ని ఇచ్చాడు అన్న చరిత్రను ఇక్కడ చెప్పారు .

అడైత్తాన్…….రామావతారంలో సీత రాముడిని వీడి వియోగ ధుఃఖాన్ని అనుభవించింది. ఆమెను సంతోషపెట్టడం కోసం రాముడు నీళ్ళంటేనే బయపడే వానరాల సహాయంతో సముద్రానికి ఆనకట్ట కట్టాడు . నీళ్ళల్లో తెలే కొండరాళ్ళను ఉపకరణాలుగా తీసుకున్నాడు . ఎవ్వరి ఊహకూ అందనంత అందంగా సేతువును కట్టాడు .

ముదల్ పడైత్తాన్…….మహా ప్రళయ కాలంలో లోకాలన్ని లేకుండా పోయి, నామరూపాలు లేకుండా పడి వున్న సమస్త జీవరాసులకు నామ రూపాలివ్వటంకోసం ముందుగా సముద్రాన్ని సృజించి, ఆ తరువాత చతుర్ముఖ బ్రహ్మను , సమస్త లోకాలను సృష్టించాడు. ఈ క్రమంలో ముందుగా సముద్రాన్ని  సృష్టించాడు. ఇక్కడ ‘ ముదల్ పడైత్తాన్ ‘ అంటే ముందుగా నీటి తత్వాన్ని సృష్టించాడు అని అర్తము .

అన్నీర్ అమరందాన్……. తాను సృష్టించిన సమస్త జీవరాసులకు రక్షకుడుగా తాను ఆ నీటి మీదే పడుకున్నాడు .

పాశురంలో “వెళ్ళ తడంకడలుళ్ విడనాగణై మేల్ మరువి”,( తెల్లని సముద్రంలో తెల్లని నాగు మీద పడుకున్నాడు), ‘పార్కడల్ యోగ నిత్తిరై సెయ్ధాయ్”,(పాల కడలిలో యోగ నిద్ర చేశాడు). “పార్కడలుళ్ పయ్య తుయిన్ఱ పరమన్” (పాల కడలిలో హాయిగా పడుకున్న పరమ పురుషుడు ), “వెళ్ళ వెళ్ళతిన్ మేల్ ఒరు పాంబై మెత్తైయాగ విరిత్తు అదన్ మేలే కళ్ళ నిద్దిరై కొళ్గిఱ మార్గం”(తెల్లని సముద్రంలో ఒక పామును పరుపుగా పరుచుకొని దాని మీద కల్లనిద్ర పోతున్న మార్గదాయీ ) అని పరమాత్మ జీవాత్మల సమ్రక్షణ కోసం నీళ్ళలో నిద్రించాడని చెపుతున్నారు.

అడి…… పైన చెప్పినట్లు  సముద్రాన్ని మధించిన వాడు , సేతువు కట్టిన  వాడు , నీటిని సృజించిన  వాడు , ఆ నీటిపై పడుకున్న వాడు అయిన పరమాత్మా శ్రీచరణాలను మన ప్రయత్నంతో పొందగలమా? పై కథల వలన అందరికీ వాడే ఆధారం, రక్షకుడు అని తెలుస్తుంది. ఇంద్రుడు ఐహిక సంపద కోసం ఆయననే శరణాగతి చేశాడు. ఆయనే కోరుకున్న సీతకూ ఆ శ్రీమన్నారాయణుడే రక్షకుడు . మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ వుండే సామాన్యులకు శ్రీమన్నారాయణుడే రక్షకుడు . “అడి” అంటే శ్రీమన్నారాయణుని శ్రీ చరణాలు . అందరికి ఆ   శ్రీచరణాలే రక్ష. ఈ పాశురంలో ” ఒరుమత్తాల్ మున్నీర్ కడైందాన్ (మున్నీర్ అడైత్తాన్) ముదల్ (నీర్)పడైత్తాన్  అన్నీర్ అమరందాన్ అడి “తరుం అత్తాల్ అన్ఱి ఇఱై తాళ్గళ్ “(పరమాత్మ శ్రీ చరణాలిచ్చే రక్షణ కాక) ” కరుమత్తాల్ జ్ఞానత్తాల్ కాణుం వగై ఉణ్దో?” (కర్మ వలన జ్ఞానం వలన పోందే విధానం వుందా?)అని అంటున్నారు.

      జీవాత్మలను ఆ పరమాత్మ రక్షించాలే తప్ప తాముగా ఇతర ప్రయత్నాల వలన రక్షణ పొంద లేరు అని ఈ పాశుర సారము.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-4/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment