ఆర్తి ప్రబంధం – 20

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 19

going-to-paramapadham

ప్రస్తావన

పూర్వపు పాశురములో మణవాళ మామునులు శ్రీ రామానుజులతో ఒక వేళ ఙ్ఞానులు వారి తనయుడు దారితప్పి పోయినచో సహించెదరా?  “నల్లార్ పరవుమ్ ఇరామానుసన్” (ఇరామానుస నూత్తంన్దాది 44) అను వాక్యానుసారం మంచివారిచే అనుగమించబడువారని వర్ణించబడు వారగు శ్రీ రామానుజులు , మణవాళమామునుల ప్రలాపమును వినెను. మణవాళమామునుల దీనస్థితిని శ్రీరామానుజులు చూచెను, మరియు వారి విరక్తిభావముల ఉద్ద్రేకమును వినెను. అవి విని సహించక వారు, మామునులు ఙ్ఞానులు వెళ్ళు పరమపదమునకు వెళ్ళి, నిత్యసూరులతో వారిలో ఒకరుగా ఉండవలెనని తలెచెను. అంతయేగాక, వారికి కైంకర్యము చేయు నిత్యానందమును వారికి ప్రసాదించవలెనని అలోచించెను. శ్రీ రామానుజుల కోరికను గ్రహించి మణవాళమామునులు, వారు తమ తండ్రియగు శ్రీరామానుజులు తన పట్ల చూపు అభిలాషవలన తాను నిజముగా పరమపదము చేరి ఆనందభరితుడయెనని తలచెను. “పేఱు తప్పాదు ఎన్ఱు తుణిన్దు ఇరుకైయుమ్ (ముముక్షుప్పడి, ద్వయ ప్రకరణం #1)” లో పేర్కొన్న ప్రకారం ఇప్పుడు మణవాళమామునులు వారి లక్ష్యమగు మొక్షమును చేరుటలో మిక్కిలి నమ్మకముతో ఉండెను మరియు ఈ జీవాత్మ ఈ జగత్తును విడచి పరమపదము పోవు పయనమును వర్ణించ ప్రారంభించెను.

పాశురం 20

పోం వళియైత్ తరుం ఎన్నుం ఇన్బం ఎల్లాం
పుసిత్తు వళిపోయ్ అముద విరసైయాఱ్ఱిల్
నామ్ మూళ్గి మలమఱ్ఱుత్ తెళివిసుమ్బై
నణ్ణి నలం తిగళ్మేని తన్నైప్ పెఱ్ఱు
తామ్ అమరర్ వన్దు ఎదిర్ కొణ్డు అలన్కరితు
సఱ్కరిప్ప మామణి మణ్డపత్తుచ్ చెన్ఱు
మామలరాళ్ కోన్ మడియిల్ వైత్తు ఉగక్కుమ్
వాళ్వు నమక్కు ఎతిరాసన్ అరుళుం వాళ్వే !!!

ప్రతి పద్ధార్ధం

వాళ్వు – భాగ్యము
అరుళుమ్ వాళ్వే – అనుగ్రహించిన
ఎతిరాసన్ – ఎమ్పెరుమానార్
నమక్కు – మనకు (క్రింది చెప్పునట్లు)
పోం వళియై – (జీవాత్మ ఈ దేహమును వదలినపుడు), అను నిర్విఘ్నముగ పరమపదమున అంతులేని ఆనందమును అనుభవించుటకు మార్గమగు, “అర్చిరాది మార్గము” న పయనించసాగును
తరుమ్ – జీవాత్మ ఈ దారిని చేరును
ఎన్నుమ్ – మరియు తదనుగుణముగా
పుసిత్తు – అనుభవించు
ఇన్బమ్ ఎల్లామ్ – అన్ని సుఖములను
వళిపోయ్ – “అర్చిరాది మార్గం” మను దారిలో పయనించుచుడగా.
నామ్ మూళ్గి – (తదుపరి), జీవాత్మా పవిత్రమగుటకు మునుగును
అముద విరసైయాఱ్ఱిల్ – “విరజా” అను పుణ్య నదిలో
మలమఱ్ఱుత్ – ఈ ప్రకృతిచే కలిగిన అన్ని కల్మషములనుంది విముక్తి పొందును
నణ్ణి – (తరువాత) అది చేరును
తెళివిసుమ్బై – నిష్కళంకము మరియు పరిశుద్ధమైన పరమపదం
నలం తిగళ్మేని తన్నైప్ పెఱ్ఱు – పవిత్రమైన మరియు ముఖ్యముగా ఆత్మ యొక్క నిజ స్వరూపముతో ప్రకాశించు , భౌతికగుణములు లేని శరీరమును పొంది
తామ్ అమరర్ – నిత్యసూరులు
వన్దు – వచ్చి,
ఎదిర్ కొణ్డు – ఎదురొచ్చి అభివాదించి,
అలన్కరిత్తు – అలంకరించి
సఱ్కరిప్ప – మరియు ఇప్పుడు కొత్తగా అభౌతిక శరీరములో ఉన్న ఆత్మకు మర్యాదలు చేసి
మామణి మణ్టపతు చెన్ఱు – “తిరుమామణి మన్డపం” అను మన్డపమునకు వెళ్ళి, చూచును
మామలరాళ్ కోన్ – “శ్రియపతి”, “వైకుంఠనాధన్” అని కొనియాడువారు, మరియు పెరియపిరాట్టి యొక్క సహవర్తి యగి శ్రీమాన్నారాయణుని
మడియిల్ వైత్తు ఉగక్కుమ్ – శ్రీమన్నారాయణులు తన ఒడిలో మనను అమర్చెదరు , మనను సంతోషముగా స్పర్శించి మరియు ఘ్రాణించి ఆనందించును (ఈ భాగ్యము శ్రీ రామానుజుల అనుగ్రహమువలన మాత్రమే సాధ్యమగును మరి ఎందువలనను కుదరదు).

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళమామునులు జీవాత్మల భాంధవ్యమునుండి విముక్తులు చేసి అవి చేరవలసిన స్థానమునకు అనగా పరమపదమునకు చేర్చు  శ్రీరామానుజుల కృపాకటాక్షములను కొనియాడుచుండెను. మణవాళమామునులు జీవాత్మ ఈ భువిని విడిచి తన ఉత్తమమైన లక్ష్యమగు పరమపదము చేరుటకు చేయు అద్భుత మరియు ఆనందమైన ప్రయాణమును వర్ణించెను. అక్కడ ఈ ముక్త ఆత్మను నిత్యసూరులు ఎట్లు స్వాగతించి గౌరవించెదరు మరియు  శ్రీమాన్నారాయణులు స్వాగతించి, చూచి వెంటనే ఆనందించెదరు అని మణవాళ మామునులు వివరించెను.

వివరణ

“పోమ్ వళియైత్ తరుమ్ నన్గళ్ (తిరువాయ్ మొళి 3.9.3)” అను ప్రబంధవాక్యములో నమ్మాళ్వార్లు చెప్పినట్లు, విముక్తి పొందిన జీవాత్మ ” అర్చిరాదిమార్గం ” అను పరమపదమునకు చేర్చు మార్గమున ప్రయాణించును. తన ప్రయాణమున అది అన్ని సుఖములను అనుభవించును. చేరు గమ్యము ఆనందభరితము మరియు భ్రమింపజేయునది అగుటచే, దానిని చేరు మార్గము కూడ దానికి సమవర్తముగా ఉండవలెను. కావున ఈ మార్గమున పయణించు ఆత్మను అత్యుత్తమ స్థానముగా కొనియాడబడుచున్నది. ఆ ఆత్మను “కళ్వన్ కొల్ పిరాట్టి” (పరకాల నాయకి (తిరుమంగై ఆళ్వార్ల నాయికా భవము) యొక్క పేరు , పెరియ తిరుమొళి 3.7 లో) అనుగమించు భగవంతుడే తీసుకెళ్ళును. “విరజామాం అమ్రుతకారాం మామ్ ప్రాప్యమహానదీం” అను వాఖ్యలో చెప్పినట్లు జీవాత్మా “విరజా” అను నదిలో పవిత్రమగుటగు మునుగు. ఈ విరజా అను నదిన మునుగు జీవాత్మలో ఉన్న కల్మషములను మరియు అనాదిజన్మములచే పొందిన పాపము తొలగి పరిశుద్ధి అగును. తదుపరి ఆ ఆత్మ ఏ భౌతికగుణములు లేని సూక్ష్మశరీరమును పొందును. ఈ సూక్ష్మశరీరమే ఆత్మయొక్క నిజస్వరూపమును ప్రకాశించి, అనంతమునకు యజమానులగు శ్రీమన్నారాయణునికి కైంకర్యము చేయునది. ఈతనిని ఇప్పుడు నిత్యసూరులు స్వాగతించి, అభినందించి, అలంకరించి కొనియాడెదరు. తరువాత వారు అతనిని “తిరుమామని మండపం” అను మండపమునకు తీసుకొని వెళ్ళెదరు. అక్కడ తను శ్రీవైకుంఠనాధుడని కీర్తించబడు శ్రియఃపతిని కలిసెదరు. వారు ఈ విముక్తుడైన వీరిని స్వీకరించి సంతోషముగా ఆలింగనము చేసి, ఒడిలో చేర్చుకొని, శిరస్సును ఆఘ్రాణించి (ఒక తండ్రి తన తనయుని శిరస్సును ఆఘ్రాణించునట్లు) ఆనందించును. పరమపదము చేరవలనని ఆసక్తి ఉన్న మనకు ఇట్టి అపూర్వ భాగ్యము దొరుకుటయే శ్రీ రామానుజుల దయాళుత్వమునకు ఒక గొప్ప ఉదాహరణ. అందువలనే వారు మనకి ఇంతటి ఉత్తమమైన సంపదను ప్రసాదించెను.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/08/arththi-prabandham-20/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment