ఆర్తి ప్రబంధం – 18

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<<ఆర్తి ప్రబంధం – 17

bhagavad_ramanuja_2011_may

ప్రస్తావన

శ్రీ రామానుజులు మణవాళమామునులకు పరమపదము చేరు వారి అభిలాషను పూర్తిచేసెదనని హామి ఇచ్చెను. కాని మణవాళమామునులు  “అవన్ అరుళ్ పెరుం అళవావినిల్లాదు (తిరువాయ్ మొళి 9.9.6)” అను ప్రబంధవాక్యములో చెప్పినట్లు, అనుగుణమైన సమయము కొఱకు వేచియుండుటకు ఇష్టపడలేదు. “ఊరెల్లాం తున్జి” (తిరువాయ్ మొళి (5.3)) లో నమ్మాళ్వార్లు పడిన వ్యధను మణవాళ మామునులు ఇప్పుడు అనుభవించుచుండెను. ఇంకను మణవాళ మామునులు ఈ సాంసారికలోకమున ఉండి అజ్ఞానము అను అగాధమైన అంధకారములో చిక్కుకొని శిక్షను అనుభవించుచుండెనని చెప్పెను. ఈ అంధకారమును పోగొట్టుటకు, మణవాళమామునులు శ్రీ రామానుజులు అను సూర్యుని తానున్న దిక్కున ఎప్పుడు ఉదయించెదరని ప్రార్ధించెను ?

పాశురం 18

ఎన్ఱు విడివదు ఎనక్కు ఎన్దాఇ ఎతిరాసా!
ఒన్ఱుమ్ అఱిగిన్ఱిలేన్ ఉరైయాయ్
కున్ఱామల్ ఇప్పడియే ఇన్ద ఉయిర్క్కు ఎన్ఱుమ్ ఇరులే విళైక్కుమ్
ఇప్పవమామ్ నీన్డ ఇరవు

ప్రతి పద్ధార్ధం

ఎన్దాఇ – ఓ! నా తండ్రి !!
ఎతిరాసా! – యతిరాజ
ఇన్ద ఉయిర్క్కు – ఈ జీవాత్మ ఇందున
ఇప్పవమామ్ – ఈ సాంసారిక ప్రపంచము
ఇరులే విళైక్కుమ్ – అజ్ఞానము అను అగాధమైన అంహకారమునకు కారణమగు
ఇప్పడియే – (ఈ జీవాత్మ) ఇటులనే
ఎన్ఱుమ్ – ఎల్లప్పుడు
కున్ఱామల్ – వెలుగు యొక్క ఏ విధమైన ఆనవాలు లేకుండ
నీన్డ ఇరవు – ఉదయము కొఱకు వేచియుండు సుదీర్ఘపు రేయి వలే
ఉరైయాఇ – ఓ!!! ఎమ్పెరుమానారే!!! దయ చేసి చెప్పుము
ఎన్ఱు – ఎప్పుడు
విడివదు ఎనక్కు – నా వంక ఉదయమగునా?
ఒన్ఱుమ్ అఱిగిన్ఱిలేన్ – ఇందు గూర్చి ఏమియూ నేను ఎరుగను

సామాన్య అర్ధం

ఈ పాశురమున మామునులు శ్రీ రామానుజులతో , ఈ అగాధ గుహ యొక్క మరో  చివరలోనైన వెలుగు కనిపించు సంకేతము తనకు ఏమాత్రము  కనిపించుట లేదని చెప్పెను. ఈ ఆత్మను ఎల్లప్పుడు చీకటి చుట్టుముట్టి ఉండెను. ఈ ఆత్మను చుట్టి ఉన్న  ఈ భౌతిక ప్రపంచము యొక్క అజ్ఞానమను చీకటిని తొలగించు తటస్థమైన ప్రకాశము లేదు. మణవాళ మామునులు తన తండ్రి అగు రామానుజులను తాను ఎప్పుడు ఈ అంధకారమునుండి ప్రకాశమును చూచెదనని నిరాశతో ప్రార్ధించెను.

వివరణ

మణవాళమామునులు ” ఓ యతిరాజా!! మా ప్రియమైన తండ్రి!!  ఈ జీవాత్మలో అభివృద్ధి చెందుట యొక్క ఆనవాలు కనబడుటలేదు. అది అంతులేని చీకటిలో చిక్కుకొని ఉన్నది. ఈ భౌతిక ప్రపంచ విషయములచే కలిగిన అఙ్ఞానము వలన కొద్ది పాటి ప్రకాశము కూడా లేకుండ ఈ చీకటి ఉండెను. ఈ అగాధమైన చీకటిలో ఉన్నందువలన ఈ జీవాత్మ అనాదికాలముగా ఆర్తిని అనుభవించుచున్నది. ఈ సంసారమను సుదీర్గ రాత్రి “అవివేఖ ఘనానన్త దిన్ముఖే (స్తోత్రరత్నం 49) అని వర్ణించబడియున్నది. ఈ సంసారమను అంతులేని అగాధ రేయిలో మేము దారితప్పిపోయెను మరియు ఇప్పట్లొ ఎక్కడా ప్రకాశము కనబడుటలేదు. సరియగు దారి తెలిసుకొనుటకు ఏ జాడలేనండున “పదస్స్ఖలితం (స్తోత్రరత్నం 49)” అను వాక్యమున చెప్పినట్లు  మేము అల్లాడుచుండెను. మీ కరుణాకటాక్షము పొందు అదృష్టము మాకు ఎప్పుడు కలుగును. అజ్ఞానముచే నిండియున్న మా మీద, ఎప్పుడు మరియు ఎలా అరుణోదయము కలుగును? ఓ రామానుజా! “నిఖిల కుమతి మాయా సర్వరీ బాలసూర్య~: (యతిరాజ సప్తతి 28)” అను పదవాక్యమున చెప్పినయట్లు మీరు అన్నియూ తెలిసినవారు. మీరే సూర్యుడగుటచే, “సుప్రభాతత్య రజనీ (శ్రీవిష్ణు పురాణమ్)” అను వాక్యములో వర్ణించియునట్లు మేము చిక్కియున్న ఈ చీకటినుండి మమ్ము రక్షించుము” అని ప్రార్ధించెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/08/arththi-prabandham-18/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

0 thoughts on “ఆర్తి ప్రబంధం – 18”

Leave a Comment