ఆర్తి ప్రబంధం – 15

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 14

EmperumAnar_thirukoshtiyur

ఎమ్పెరుమానార్ – తిరుకోష్టియూర్

ప్రస్తావన

తన ఈ దయనీయ స్థితికి శ్రీ రామానుజుల వంక వ్రేలు చూపానని మణవాళమాముమనులు అభిప్రాయపడెను. మరియు తనను ఈ అధిక కష్టాల నుండి కాపాడవలెనని శ్రీ రామానుజులను ప్రార్ధించెను. అప్పుడు మణవాళమామునులు కొంచెం నిదానించి  “ఇరామానుసన్ మిక్క పుణ్ణియనే (రామానుస నూఱ్ఱన్దాది 91)”  అను వాక్యమునందు పేర్కొన్న విధముగా శ్రీ రామానుజులు అన్ని కల్యాణ గుణములతో ఉన్నవారు. వారిని మా ఈ దయనీయ స్థితికి కారణమని చెప్పకుండ, మిక్కిలి ప్రేమ మరియు భక్తితో వారి పాద పద్మములను ఆశ్రయించినచో, వారు మనకు చేయవలసిన విషయమును ఎందులకు చెయ్యరు? ఆలోచించెను. తరువాత మణవాళమామునులు తనలో శ్రీ రామానుజుల పట్ల తనకు ఏమాత్రమైనను భక్తి మరియు అనురాగము ఉన్నదా అని అన్వేషించెను. తీవ్ర పరిశోధన తరువాత  మణవాళ మామునులు తనలో శ్రీ రామానుజులపై ఏవిధమైన ప్రేమ, భక్తి లేదని నిశ్చయించెను.

పాశురం 15

ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్
ఎన్బదువే నావురైక్కుమ్ ఇత్తాల్ ఎన్?
అన్బవర్ పాల్ ఇప్పోదళవుమ్ యాన్ ఒన్ఱుమ్ కాణ్గిన్ఱిలేన్
ఎప్పోదు ఉన్డావదు ఇని?

ప్రతి పద్ధార్ధం

నావురైక్కుమ్ – ఏ విధమైన అనురాగము లేని, నా నాలుక
ఎన్బదువే – అతి ప్రఖ్యాతమైన వచనమును ఉచ్చరించుటకు
ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్ – మా యజమానులైన శ్రీ రామానుజుల చరణ కమలములనే శరణు కోరుచున్నాను అని – శ్రీ రామానుజుల చరణములే శరణం
ఇత్తాల్ ఎన్? – అని (ఏ భక్తి శ్రధ్దా లేకుండ) చెప్పుట వలన ఏ ప్రయోజనము ఉన్నది ?
యాన్ ఒన్ఱుమ్ కాణ్గిన్ఱిలేన్ – నేను అట్టి విషయమును గుర్తించలేకుండెను
అన్బు – భక్తి, అనురాగము
అవర్ పాల్ – వారి పట్ల
ఇప్పోదళవుమ్ – ఇప్పటి వరకు
ఎప్పోదు ఉన్డావదు ఇని? – ఇప్పుడు కాకుండెను, ఇంకెప్పుడు వికసించును

సామాన్య అర్ధం

మణవాళమాముమనులు తాను నిరంతరం దివ్య మంత్రమైన ” ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్” (శ్రీ రామానుజుల చరణములే శరణం) ను ఏ విధమైన ఫలితము లేకుండ జపించుచున్నానని చెప్పెను. వాటి అర్థమును పూర్తిగా గ్రహించక ఇంత వరకు ఆ దివ్య మంత్రమును చెప్పుచున్నను. ఏదొ చెప్పమని ఆఙ్ఞాపించిన నిమిత్తం మేము చెప్పాము, కాని అట్లు చేయుటచే ఏ ప్రయోజనము లేదని మామునులు అభిప్రాయపడెను.అనంతరం తన హృదయాంతరమున ఎక్కడైనను శ్రీ రామానుజులపై భక్తి, ప్రేమ దాగి ఉండెనా అని మణవాళమామునులు అన్వేషించెను . కాని వారి సంత్రాసమునకు అట్టి భక్తి, ప్రేమల యొక్క జాడ కూడ కానలేకపోయెను.

వివరణ

“ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్ (శ్రీ రామానుజుల చరణములే శరణము)” అను వాక్యమే పిళ్ళై కొల్లికావల్ దాసర్లకు జీవనాధారం. ఇదే వాక్యము సోమాసియాణ్డాన్ కు అనంతమైన ఆనందమును అనుభవించుటకు ప్రతికూలముగా ఉండెను. మణవాళ మామునులు  ఈ పై చెప్పినవారికి ప్రాణాధికముగా ఉన్న ఆ వాక్యమును తానును జపించి అలసిపోయెనని భావించెను. కాని ఆ వాక్యము యొక్క తాత్పర్యమును పూర్తిగా అర్థం చేసుకోకుండ, జపించవలెనను నిమిత్తమున మాత్రమే జపించెనని మణవాళమామునులు చెప్పెను. వారు శ్రీ రామానుజుల యెడల ఏ విధమైన భక్తి, ప్రేమానురాగములు లేకుండ, ఆ వాక్యమును మరల మరల జపించెను. మణవాళ మామునులు “సార్న్దదెన్ సిన్దైయున్ తాళిణైక్కీళ్ అన్బుతాన్ మిగవుమ్ కూర్న్దదు (ఇరామానుస నూఱ్ఱన్దాది 71)” అను ప్రబంధ వాక్యమునకు అనుగుణముగా తన హృదయాంతరమున ఎక్కడైనను శ్రీ రామానుజుల పై భక్తి, ప్రేమ భావము ఉండెనెమో అని అన్వేషించెను. కాని అట్టి స్వచ్ఛమైన భక్తి యొక్క జాడ వారి హృదయమున ఎక్కడ వారి జీవిత అంతిమదినములలో కూడ లేనందు వలన వారికి  పెద్ద అసంతృప్తి మాత్రమే మిగిలెను. మణవాళ మామునులు, ” ఇంకనూ ఆ అనురాగము వికసించనిచో, ఎప్పుడు వికసించును? ఎప్పుడైనను ఆ భక్తి భావము వచ్చు సాధ్యము ఉన్నదా?” అని తన మదిలో తలచుచుండెను. ఆ వాక్యమును భక్తి భావము లేకుండ తలచుటచే ఏ ప్రయోజనము లేదని నిశ్చయించెను. ఈ సందర్భమున  మణవాళమామునులు రెండవ పాశురమున “రామానుసాయ నమ” అను వాక్యమును ఉపయోగించెను అని మనం  గుర్తుంచుకోవలెను. ఈ పాశురమున “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్” అని పలికెను. ఇది ద్వయమహామంత్రము వలే , శ్రీ రామానుజనామమును ఉపయోగించెను. “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్” అను వాక్యము ద్వయమున ఉన్న మొదటి భాగమును, మరో వాక్యము “రామానుసాయ నమ” ను రెండవ భాగమునకు సమానముగా చెప్పవచ్చును.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-15/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment