ఆర్తి ప్రబంధం – 10

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 9

azhwar-emperumanar

నమ్మాళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ – ఆళ్వార్ తిరునగరి

ప్రస్తావన

మణవాళ మామునులు తాను ఎందులకు మరల మరల జనించి మరణించుచుండెనో అని పరిశీలిస్తున్నారు. తనకు ఈ జనన మరణములు కొనసాగుటకు శ్రీ రామానుజుల చరణపద్మములను ఆశ్రయించి అక్కడే ఎల్లప్పుడు నివసించక పోవడం ఒక్కటే కారణమని నిశ్చయించెను. ఆ దివ్య పాదములకు దూరమగుటయే అన్నింటికి కారణము. కావున, ఈ తప్పును సరిద్దుకొనుటకు, శ్రీ రామానుజుల పాదపద్మములనే ఆశ్రయించి ఆక్కడే ఎల్లప్పుడు ఉండుటకు మణవాళ మామునులు నిశ్చయించెను.

పాశురం 10

పూ మగళ్ కోన్ తెన్నరన్గర్ పూన్కళఱ్కుప్ పాదుగమాయ్
తాం మగిళుమ్ శెల్వచ్ చటకోపర్ తేమలర్ తాట్కే
ఏయందు ఇనియ పాదుగమాం ఎన్దై ఇరామానుశనై
వాయందు ఎనదు నెంజమే వాళ్

ప్రతి పద్ధార్ధం

ఎనదు – ఓ! నా
నెంజమే – హృదయమా (ఎప్పుడు నను అనువర్తించు)!!!
వాళ్ – ఇప్పటినుండి దయచేసి వారి వద్ద నివసించు
వాయందు – పాదపద్మములందు ఆశ్రయించి
ఇరామానుశనై – శ్రీ రామానుజ
ఎన్దై – నా తండ్రియగు మరియు నా ఆత్మకు నిజమైన జీవనాధారమగు
ఏయందు – శ్రీ రామానుజులకు నప్పబడునవి అయిన
ఇనియ పాదుగమామ్ – పాదుకల రూపమును
తాట్కే – దివ్య పాదముల
శెల్వచ్ – అన్ని సాత్త్విక గుణములతో నిండిన ఒకరు
చటకోపర్ – మరియు శఠకోప అని ప్రసిద్ధమైనవారు
తేమలర్ – ఎవరి పాదపద్మములపై అప్పుడే వికసించిన పువ్వుల నుండి తేనె కారునో
పాదుగమాయ్ – (అట్టి శఠకోపనులను) పాదుకా అని కొనియాడబడును.
తామ్ మగిళుమ్ – మరియు పాదుకలుగా ఉండుటచే ఆనందించు
పూన్కళఱ్కు – ఎప్పుడు సంతోషముగా అనుభవించగల పాదములైన
తెన్నరన్గర్ – శ్రీరంగనాథుడు, ఎవరైతే
కోన్ – నాథుడైన
పూ మగళ్ – పుష్పములో ఉండు సుగంధమువలే ఉండు పెరియ పిరాట్టియార్ (శ్రీ మహాలక్ష్మి)

సామన్య అర్థం

ఈ పాశురమున, మణవాళ మామునులు. తన హృదయమును శ్రీ రామానుజుల చెంత చేరి వారి చరణకమలములనే ఆశ్రయించమని చెప్పెను. అదియేగాక, తన హృదయమును అక్కడే ఉండమని మరియు అక్కడనుండి దూరముకాకూడదనియూ ఆదేశించెను. మణవాళ మామునులు శ్రీ రామానుజులను, పెరియ పిరాటియార్ల నాథులైన శ్రీ రంగనాథుల పాదుకగా ఉండుటను ఆనందముగా అనుభవించు శఠకోపుల (నమ్మాళ్వార్) పాదుకగా వర్ణించెను.

వివరణ

పెరియ పిరాటియార్లను పువ్వుల సువాసనగా వర్ణింపబడుతుంది. శ్రీ రంగనాథులు ఇట్టి పెరియ పిరాట్టిని తన హృదయమున నిలుపుకుని ఉన్నారని “పూ మన్ను మాదు పొరున్దియ మార్బన్ (ఇరామానుశ నూఱ్ఱన్దాది 1) ”  అను వాఖ్యామునందు చెప్పబడి ఉన్నది.  “పూవార్ కళల్గళుక్కు (తిరువాయ్ మొళి 6.10.4)” అను వాఖ్యామునకు అనుగుణముగా శ్రీ రంగనాథుల పాదుకా అను ప్రసిధ్దియైన వారు మరియు ఎప్పుడు అలా ఉండుటను అనందముగా అనుభవించు వారు శఠగోపులు. శఠగోపులే “అడిక్కీళ్ అమర్నదు పుగున్దు (తిరువాయ్ మొళి 6.10.11)” అని చెప్పెను, కాపున వారే శ్రీ రంగనాథుల పాదుకకు సూచకమగును.  పాదుకగా ఉండుటుటయేగాకా, అట్లు కైంకర్యము చేయుటను శఠగోపులు “ముగిల్ వణ్ణన్ అడియై అడైన్దు “తిరువాయ్ మొళి 7.2.11) “ఉఱ్ఱెన్ ఉగన్దు పణి శెయ్దు (తిరువాయ్ మొళి 10.8.10)” అను వాక్యములో పేర్కొనబడినట్లు మిక్కిలి ఆనందముగా అనుభవించెను. ఇప్పుడు అట్టి శఠగోపులకు, శ్రీ రామానుజులకు ఉన్న సంబంధమును వర్ణించబడెను. శఠగోపుల పాదపద్మములు తేనె స్రవించు తాజా పుష్పములతో సువాసనతో ఉండెను. “మేవినేన్ అవన్ పొన్నడి మెయ్మైయే (కణ్ణినుణ్ శిఱుత్ తామ్బు 2)” అని శ్రీ మధురకవి ఆళ్వార్లు వర్ణించినట్లు, తాను శఠగోపుల పాదపద్మములందే ఉండుట  తగునని శ్రీ రామానుజుల అభిప్రాయము. అందువలనే శ్రీ రామానుజులను, శఠగోపుల పాదుకలని కీర్తించారు. చివరగా మణవాళ మామునులు శ్రీ రామానుజులకూ తనకూ ఉన్న సంబంధమును స్థాపించెను. మణవాళ మామునులు, శ్రీ రామానుజులు మొదట వారి ఆత్మ యొక్క జీవనాధారమునకు బాధ్యులని చెప్పుచున్నారు. వారు వారి హృదయమునకు ఎమ్పెరుమానార్ అని ప్రసిధ్దిచెందిన  శ్రీ రామానుజుల వద్దకు వెళ్ళి, వారి చరణ కమలమును ఆశ్రయించి మరియు అక్కడే నివసించవలెనని ఉపదేశించెను.  తిరువరన్గత్తు అముదనార్లు  ,“ఇరాముశన్ చరణారవిందమ్ నామ్ మన్ని వాళ నెంజే (ఇరామానుశన్ నూఱ్ఱందాది 1)” అని తన హృదయమునకు ఉపదేశించినట్లు, మణవాళ మామునులు వారి హృదయమునకు ఉపదేశించుచుండెను.  మణవాళ మామునులు ” ఓ! హృదయమా, ఈ అడియేన్ చెప్పినట్లు విని, నడుచుకొను హృదయమా, వెళ్ళి శ్రీ రామానుజుల చెంత మిక్కిలి దగ్గర సంబంధముతో ఉండుము, మరియు దీనికి బదులుగా ఏదియు  కోఱ (ఎదురుచూడ)  రాదు.  శ్రీ రామానుజుల దివ్య పాదపద్మములయందు ఉండుటయే నీ స్వరూపము” అని చెప్పుచున్నారు. మణవాళ మామునులు శ్రీ రామానుజుల చరణకమలములందున్న ప్రేమకు ప్రతిరూపమగుటచే (సారమగుటచే), వారిని తరచూ “యతీంద్ర ప్రవనర్” అని పేర్కొనెదరు. ఇంతక ముందు “శెల్వచ్ శఠకోపర్” అను వాక్య భాగము శఠగోపుల ధనమును సూచించును. “దనమ్మదీయమ్ తవ పాద పన్కజమ్ (స్తోత్ర రత్నమ్)” అను వాక్యమున చెప్పినట్లు, మనం పొందగలిగిన అత్యంత గొప్ప సంపద వైకుంఠనాథుని పాదపద్మములే. అట్టి ఉన్నతమైన సంపదను శఠగోపులు పొందియుండుటచే, వారిని “శెల్వచ్ శఠకోపర్” అని వర్ణించిరి.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-10/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment