ఆర్తి ప్రబంధం – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< ఆర్తి ప్రభందం – 2

emperumanar-1

ప్రస్తావన

మొదటి రెండు పాశురాలలో మణవాళ మామునులు శ్రీ రామానుజుల గొప్పతనము గూర్చి చెప్పెను. ఈ పాశురము నుండి తన మనస్సులో ఉన్న అపేక్షను తెలియ పరిచెదరు. అదియూ ఈ పాశురమున తనకు అన్ని సంబంధ బంధవ్యములు శ్రీ రామానుజులే అని వర్ణించెను. కాని దానిని పూర్తిగా సఫలము చేయుటకు ఈ భౌతీక శరీరము అడ్డుగా ఉన్నది. అందువలెన దాని విడువ వలెను. మణవాళ మామునులు ఎందుకు ఈ ఆటంకము తొలగుట లేదని విచారించుచుండెను.

పాశురం 3

తందై నఱ్ఱాయ్ తారం తనయర్ పెరున్జెల్వం
ఎన్ఱనక్కు నీయే యతిరాసా ఇంద నిలైక్కు
ఏరాద ఇవ్వుడలై ఇన్ఱేే అఱుత్తరుళప్
పారాదదు ఎన్నో పగర్

ప్రతి పద్ధార్ధం

ఎతిరాసా – ఓ యతిరాజ !!!
ఎన్ తనక్కు – నాకు
నీయే – మీరే, మీరు మాత్రమే
తన్దై – తండ్రి
నల్ తాయ్ – వాత్సల్యము చూపు తల్లి
తారమ్ – నా భార్యా
తనయర్ – నా సంతతి
పెరుమ్ శెల్వమ్ – గొప్ప ధనము
ఇన్ద – (కాని) ఈ
నిలైక్కు – పరిస్థితి (ఇంకను దీనిని భరించలేని)
ఏరాద – అనువుకాని
ఇవ్వుడలై – ఈ భౌతిక శరీరమును
పగర్ – దయ చేసి చెప్పుము
ఎన్నో – ఎందుకు
పారాదదు – (మీరు) అనుగ్రహించరు
అరుళ – ప్రసాదించరు
ఇన్ఱే – ఇప్పుడే
అఱుత్తు – ఈ భౌతిక శరీరమును విడుచుటకు

సామన్య అర్ధం

మణవాళ మామునులు,ఎందులకు ఈ భౌతిక శరీరమును తొలగించి తన వద్ద  చేర్చుకోని అనుగ్రహించుటలేదని శ్రీ రామానుజులను ప్రశ్నించుచుండెను. అది జరిగితేనే, ఈ జగమున తనకు ఉండు చింతన నిరంతరాయముగా కొనసాగు అవకాశము ఉండును. మణవాళ మామునులు శ్రీ రామానుజులను తన తండ్రిగా, తల్లిగా, భర్యగా, సంతానముగా, శాశ్వత ధనముగా మరియు ఇంకా ఎన్నో విధములుగా తలచుచుండెను. కాని ఈ భువిలోని జీవితము అనిత్యమగుటచే ఈ చింతన శాశ్వతము కాదు. అందువలన మామునులు శ్రీ రామానుజులను తన చెంత చేరి నిత్యం తన చింతనలో ఉండుటకు అడ్డుగా ఉన్నదే విషయము అని అడుగుచుండెను.

వివరణ

మణవాళ మామునులు శ్రీ రామానుజులను యతులలో అగ్రగామి అని సంభోదించెను.  “సేలేయ్ కణ్ణియరుం పెరుంజెల్వముం నన్ మక్కలుం మేలాత్తాయ్ తందైయుం  అవరే ఇనియావారే (తిరువాయ్ మొళి 5.1.8)” మరియు “త్వమేవ మాతా చ (శరణాగతి గద్యం)” అను రెండు వాక్యములను ఇక్కడ పేర్కొనెను. శ్రీ రామానుజులు శ్రీ రంగం పెరియ పెరుమాళ్ ను తన సంతానమునకు ఎప్పుడు మంచి చేయు తండ్రిగా, ఎల్లప్పుడు స్వచ్ఛమైన ప్రేమను చూపే తల్లిగాను, సుఖమును ఇచ్చే భార్యగాను, గొప్ప గుణములతో కూడిన తనయుడిగాను మరియు అన్ని సంపదలుగాను తలెచెను. ఆళవందార్ యొక్క “మాతా పితా యువతయ~: (స్తోత్ర రత్నం 5)” న నమ్మాళ్వార్లే తనకు అన్నియూ అని తలచెను. అదే విధముగా మణవాళ మామునులు రామానుజులతో వారే తనకు అన్నియుగా ఉన్నరని చెప్పెను. ఇది మామునుల ఇప్పటి పరిస్థితి. కాని ఈ చింతన నిత్యముగా ఉండుటకు తన దేహము పెద్ద ఆటంకమని తెలుసుకొనెను. మణవాళ మామునులు శ్రీ రామానుజులను తాను ఈ భౌతిక శరీరమే అవరోధమని తెలిసిన రోజే, అదే క్షణమే తన దేహమును ఎందుకు విడిచి వారి వద్ద తనను ఎందుకు చేర్చుకొనలేదని అడుగుచుండెను. అతను రామానుజులను ఈ ప్రశ్నకు సమాధానము చెప్పవలెనని ప్రార్ధించెను. ఏ విషయము వలన తనను అనుగ్రహించుటకు సంకోచిచుచునారని ప్రశ్నించెను.

ఈ పాశురమున “నఱ్ఱై” అను విశేషణమును “నల్ల + తాయ్” అని విడదీయ వచ్చును. అనగా వాత్సల్యము తో నిండిన మంచి తల్లి. “నల్ల” (మంచి) అను విశేషణము తల్లికి మాత్రమే కాక అన్నింటికీ అనగా తండ్రి, భర్య, సంతానము మరియు ధనమునకు వర్తించును. కవిత్వమున నియమములు దీనిని అనుకరించును.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-3/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment