కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 5

Nammazhwar-kanchi-2 అవతారిక:

మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల కృపను  మీరు ఎలా సాధించ గలిగారని అడగగా, నమ్మాళ్వార్ తిరువాయిమొళి 4.5.3 “వీవిల్ కాలం ఇసై మాలైగళ్ ఏత్తి మేవప్ పెఱ్ఱేన్”(ఇప్పటి నుండి ఎల్లప్పుడు భగవంతుని కీర్తించు భాగ్యమును పొందాను)  అని నమ్మాళ్వార్లు  చెప్పినట్లుగా, దాసుడు  పొందగలిగాడని    మధురకవి ఆళ్వార్  అంటున్నారని నంజీయర్ భావన.

మధురకవి ఆళ్వార్లను ‘ అనాది కాలముగా లౌకిక సుఖములకు అలవాటు పడ్డారు కదా!మళ్ళీ వెనకకు వెళతారా?” అని ప్రశ్నిస్తే, “నమ్మాళ్వార్ల కృప నన్ను మళ్ళీ వెనకకు వెళ్ళనిస్తుందా?”అని బదులిస్తున్నారని  నంపిళ్ళై అభిప్రాయము.

పెరియవాచ్చాన్   పిళ్ళై,  నంపిళ్ళై చెప్పినట్లే  చెప్పి,  ఇంకా  “నమ్మాళ్వార్ల కృప భగవంతుడి కృప కన్నా భిన్నమైనది. భ క్తి  నిష్ట  గురించి గీతలో  6.41లో  భగవంతుడే  “సుచీనాం శ్రీమతాం గేహే  యోగబ్రష్టో బిజాయతే” అని చెప్పిట్లునగా,  విష్ణు పురాణములో  2.13.29 “సమాధి బంగస్థస్యాసీత్“,(భరత మహారాజు  రాజ్యము, భోగము, లౌకిక సుఖముల పట్ల విముఖుడై కూడ ఒక జింక మీద పెంపొందించుకున్న బాందవ్యము వలన భగవతుడి మీది నుండి దృష్టి మరలి పోయినట్లు కాక నమ్మాళ్వార్ల కృప ఎప్పటీకీ నిలచి వుంటుంది  అంటున్నారు.

మధురకవి ఆళ్వార్లు తన నీచత్వమును చెప్పి అందువలననే నమ్మాళ్వార్లు అనుగ్రహించారనీ, అందువలన వారి  శ్రీపాదములను వదలక పట్టుకున్నానని   క్రిందటి   పాశురములో   చెప్పారు.  కొందరు వీరిని అనాది కాలముగా లౌకిక సుఖములకు అలవాటు పడ్డారు కదా!  మళ్ళీ   వెనకకు వెళ్ళకుండా వుండగలరా?” అని ప్రశ్నించారు. దానికి వారు, దాసుడు   పాపములను   తొలగించుకోవటానికి   చేసిన   తపము   ఏదీ   లేదు.  కేవము   నమ్మాళ్వార్లు   కృప వలన  ఈ స్థితిని   పొందాను.  అందువలన   వారి కృప నా పాపములను   వంకకు   రానివ్వవు   అన్నారు. కిందటి, ప్రస్తుత పాశురములలో మధురకవి  ఆళ్వార్లు  నమ్మాళ్వార్ల  పట్ల  తన  ఙ్ఞాన, భక్తులను ప్రకటించారు అని  అళగియ  మణవాళ  పెరుమళ్ నాయనార్ల అభిప్రాయము.

పాశురము -6

ఇన్ఱు తొట్టుం ఎళుమైయుం ఎంపిరాన్

నిన్ఱు తన్ పుగళ్ ఏత్త అరుళినాన్

కున్ఱమాడ త్తిరుక్కురుకూర్ నంబి

ఎన్ఱుం ఎన్నై ఇగళ్విలన్ కాణ్మినే

ప్రతి పదార్థము:

ఇన్ఱు తొట్టుం = ఈ రోజు నుండి

ఎళుమైయుం = భవిష్యత్తులో ఎప్పటికీ

నిన్ఱు = పరిపూర్ణ విశ్వాసముతో

తన్ పుగళ్ = నమ్మళ్వార్ల   కీర్తిని

ఏత్త = గొప్పగా పాడుతూ   ఉండేట్లుగా

ఎం పిరాన్   అరుళినాన్ = నా   స్వామి(నమ్మళ్వార్లు ) కృప  చేసారు

కున్ఱమాడం = ఆకాశము నంటే   భవనాలున్న

త్తిరుక్కురుగూర్  నంబి = త్తిరుక్కురుగూర్ నాయకుడు

ఎన్ఱుం = ఎప్పటికీ

ఎన్నై = నన్ను

ఇగళ్విలన్ = వదలి వేయడు

కాణ్మిన్ = నువ్వు చూస్తావు

 భావము:

నా స్వామి  ( నమ్మాళ్వార్లు  )   ఆకాశమునంటే  భవనాలున్న  త్తిరుక్కురుకూర్  నాయకుడు  కృప చేసారు. ఈ రోజు నుండి   భవిష్యత్తులో ఎప్పటికీ పరిపూర్ణ విశ్వాసముతో   నమ్మళ్వార్ల  కీర్తిని  గొప్పగా పాడుతూ ఉండేట్లుగా కృప చేసారు. నా స్వామి  ( నమ్మాళ్వార్లు  )   నన్ను ఎప్పటికీ  వదలి వేయడు. అది    నువ్వు  చూస్తావు.

నంజీయర్ వ్యాఖ్యానము:

*ఇన్ఱు:  ఈ రోజు నుండి అనగా ఎప్పుడైతే నేను భగవంతుని కంటే నమ్మాళ్వర్ల మీద  రుచిని (విశ్వాసము)  పెంచుకున్నానో ఆరోజు నుండి

*నిన్ఱు:  “మానిడం పాడ వంద కవియేనల్లేన్” ( మనుషుల కోసము పాడే సామాన్యమైన కవిని గాను ) (తిరువాయిమొళి 3.9.9. )అని   నమ్మాళ్వర్లు   అన్నారు.  అలాగే మధురకవులు  భగవంతుని   పాడే   కవిని  గాను నేను, నమ్మాళ్వర్లనే  పాడతాను  అంటున్నారు.

*కున్ఱమాడం  త్తిరుక్కురుకూర్  నంబి:    నమ్మాళ్వర్ల  పరిపూర్ణత్వమును  మనము  తెలుసు కోలేము. త్తిరుక్కురుగూర్లోని  ఆకాశము నంటే  భవనాల  పై భాగములను  చూడలేము.

 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*ఇన్ఱు తొట్టుం:    -ఈ రోజు నుండే.  భవిష్యత్తులో ఏమి  జరుగుతుందో  ఎవరికి తెలుసు.  నమ్మాళ్వర్లు  మధురకవులను తమ శిష్యులుగా స్వీకరించిన నాటి నుండే.

*ఎళుమైయుం :   -ఏడు జన్మలు- ( ఉపలక్షణము ) భవిష్యత్తులో ఎప్పటికీ సూచిస్తుంది.

ఎం పిరాన్-:     ఉపకారకులు-  నమ్మాళ్వర్లు  “పిరాన్ పెరునిలం కీణ్దవన్” (భూదేవిని కాపాడి గొప్ప ఉపకారము చేసిన వాడు) (తిరువాయిమొళి 1.7.6.)అని భగవంతుడిని ఉపకారకులని కీర్తించగా,  మధురకవి  ఆళ్వార్లు   తనను సంసారము నుండి కాపాడి గొప్ప ఉపకారము  చేసిన వారుగా నమ్మాళ్వర్లను కీర్తించారు.

*కున్ఱమాడ త్తిరుక్కురుకూర్-:   తిరువాయిమొళి  4.10.1లో  నమ్మాళ్వర్లు  “కున్ఱం పోల్ మణి మాడ నీడు తిరుక్కురుగూర్” అన్న మాట  మధురకవి  ఆళ్వార్ల  హృదయములో  నిలిచి పోయింది.  అవే  మాటలను  వీరు  కూడా ఉపయోగించారు.

*ఎన్ఱుం ఎన్నై ఇగళ్విలన్ కాణ్మినే:  – నమ్మాళ్వర్లు  నా  దోషములతో  నన్ను స్వీకరిస్తారా?  లేక  మళ్ళీ  వెనకటి జీవితములోనికి  వెళ్ళాలా?

పెరియవాచ్చాన్ పిళ్ళై  వ్యాఖ్యానము:

*అరుళినాన్:  – నమ్మాళ్వర్లు తిరువాయిమొళి  1.1.1లో “మయర్వఱ మధినలం అరుళినన్” (భగవంతుడు నా దోషములతో నన్ను స్వీకరించాడు) అన్నారు.  మధురకవి  ఆళ్వార్లు  తనను  నమ్మాళ్వర్లు  దోషములతో  స్వీకరించాడని అంటున్నారు.

*కాణిమినే :– నిన్ను నువ్వు చూడు అనటము  ప్రత్యక్షము  కావున  సులభముగా  గ్రహించ వచ్చు. ఇంకా స్పష్టముగా చెప్పాలా?

 అలగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యనము:

*ఎళుమైయుం- ఎప్పటీకీ, మధురకవి  ఆళ్వార్లు  పరంపదమునకు  వేంచేసినా,  శతృఘ్నులకు  భరతుడిలాగా నమ్మాళ్వర్లే  ఆయనకు స్వామి.  మధురకవి  ఆళ్వార్లు  కూడా నిత్య  శతృఘ్నులే  (శతృవులను జయించు వాడు.) భగవత్ కైంకర్యము,  భాగవత కైంకర్యమునకు అడ్డుగా భావించిన వాడు.

*ఎంపిరాన్ :– నన్ను భగవంతుడికి దాసునిగా చేయ కుండా తన దాసునిగా స్వీకరించి గొప్ప సహాయము చేసిన వాడు. అందుకని   ప్రబంధములోని  ప్రతి  పాశురములోను  ఆయనను  కీర్తిస్తాను  అన్నారు.

*ఏత్త: – నమ్మాళ్వర్లు   పెరియ తిరువంతాదిలో ప్రతి పాశురములో భగవంతుని కీర్తించాలని మొదలు పెట్టి చివరి పాశురములో  కూడా “మొయ్కళలే  ఏత్త ముయల్”ఇంకా ప్రయత్నము చేస్తున్నానని  చెప్పారు.   మధురకవి  ఆళ్వార్లు ప్రతి పాశురములోను  నమ్మాళ్వర్లను  కీర్తిస్తాను  అన్నారు.

*తన్ పుగళ్ ఏత్త అరుళినాన్:  –నమ్మాళ్వర్ల  కృప  ఉపాయము. వారిని  కీర్తిస్తూ పాడటము పురుషార్థము.

*నిన్ఱు తన్ పుగళ్ ఏత్త-:  శ్రీ రామాయణము- బాల కాణ్డము 1.7లో,  నారద ఋషి  “మునే! వక్ష్యామ్యహం బుధ్ధ్వా” (ఓ ఋషి  వాల్మీకీ  శ్రీ రాముడి ఉన్నత గుణాలగురించి నన్ను చెప్పనీ!) అని తమకముతో  అన్నారు. అదే అంతకు మునుపు చెప్పినప్పుడు  ఆ తమకము లేదు.  ఇక్కడ మధురకవి  ఆళ్వార్లు నమ్మాళ్వర్లను గురించి  తమకము  లేకుండానే చెపుతున్నారు.

*కాణ్మినే: –  ప్రత్యక్షము మాత్రమే కాదు, శాస్త్రము కూడా,  నీతి శతకము- 72  “ప్రాప్తం  ఉత్తమ  గుణా  న  పరిత్యజంతి” (చేపట్టిన  పనిని  ఎన్ని అవరోధాలు వచ్చినా వదలని వాడు)  పెరియ తిరుమొళి 8.2.2 “పాణనార్ తిణ్ణం” భగవంతుడి రాయబారి ఆయన కోరికలను ప్రకటిస్తాడు.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-6-inru-thottum/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment