ఉపోద్ఘాతము

 శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

paramapadhanathan

పరమపదమున శ్రీదేవి (శ్రీమహాలక్ష్మి)భూదేవి , నీళాదేవి  సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

శ్రీమన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణగుణములతో  కూడుకొని ఉన్న సర్వోన్నత  పరతత్త్వం.  తన విశేష నిర్హేతుక కృపాకటాక్షములచే  కొంత మంది జీవాత్మలపై కృపచూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు(శ్రీమన్నారాయణుని గురించి ప్రభోధించిన  వైభవం కలిగిన యోగులు ) అయ్యారు. తాను నిత్యసూరుల(నిత్యాత్మలు)కు , ముక్తుల(ముక్తి చెందిన జీవాత్మలు)కు  కూడా  సర్వతంత్రస్వతంత్రనియామకుడు అయినా, ఎల్లవేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింపడిన జీవాత్మలకొరకై, ఎందువలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరామరణచక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న  ఉత్పన్నమవుతుంది- సర్వశక్తిమంతుడైన  భగవానునకు వేదన / బాధ ఉంటుందా?  అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు(అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్యసంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొను వాడు)  కదా – దీనికి మన ఆచార్యులు ఇలా తెలిపారు- ఈ జీవాత్మల ఉజ్జీవనముకొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న  సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్టపడుతున్న సంతానం పైనే  ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగినప్పటికి  తన బాధ అంతా  ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం  మరియు అవిద్య చే ఆవరించబడిన   జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ బాధలు అనుభవిస్తున్న  జీవాత్మలను ఉజ్జీవింప చేయుటకై ఒక ఉపాయముగా  వీటికి  సృష్ఠి సమయాన శరీరమును మరియు ఙ్ఞానేంద్రియాలను కల్పించాడు. శాస్త్రములను ఏర్పరిచాడు మరియు ఈ జగత్తులోకి తాను విభవ అవతారాలైన శ్రీరామ, కృష్ణావతారములుగా అవతరించాడు.ఇవన్నీ చేసినప్పటికి జీవాత్మలు అవిద్యచే  మరియు అఙ్ఞానముచే సరైన  తన పరతత్త్వమును గుర్తించ లేకపోతున్నారు. సరే ఒక వేటగాడు మృగమును పట్టుకొనుటకు ఇంకొక శిక్షితమృగమును ఎర వేసినట్టు ,  ఈ సంసారిక జగత్తులో ఉన్న జీవాత్మల ద్వారా ఈ  జీవాత్మలను   ఉజ్జీవింపచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా  తాను కొన్ని జీవాత్మలను  ఎంపికచేసుకొని  తన కృపాకటాక్షములచే  వారిని ఆళ్వార్లు గా ఏర్పరిచాడు. ఆళ్వార్లు అనగా భగవద్విషయము నందు పూర్తిగా మునిగి ఉన్నవారు. వీరు దక్షిణ భారతావనిలో వివిధ పవిత్ర స్థలముల  యందు అవతరిస్తారని శ్రీమద్భాగవతములో వేదవ్యాసులు  ముందే చెప్పారు. ఈ ఆళ్వార్లు మొత్తం పదిమంది. వారు క్రమంగా పొయ్ ఘై ఆళ్వార్ (సరోయోగి), పూదత్తాళ్వార్ (భూతయోగి), పేయాళ్వార్ (మహదాహ్వయులు), తిరుమళిశై ఆళ్వార్ (భక్తిసారులు), నమ్మాళ్వార్ (శఠకోపులు/పరాంకుశులు), కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్ (విష్ణుచిత్తులు), తొండరడిప్పొడి ఆళ్వార్ (భక్తాంఘ్రిరేణు/విప్రనారాయణ) , తిరుప్పాణాళ్వార్ (మునివాహనులు), తిరుమంగై ఆళ్వార్ (పరకాలులు). వీరుకాక మరి ఇద్దరిని కూడ కలుపుకొని మొత్తం పన్నెండు మంది. మధురకవి ఆళ్వార్ మరియు ఆండాళ్(గోదా- భగవానుని దేవేరులలో ఒకరైన భూదేవి అవతారం). ఈ పదిమంది ఆళ్వార్లు కేవలం భగవద్భక్తికి అంకితమైన వారు, కాని మధురకవిఆళ్వార్ మరియు ఆండాళ్  తమ తమ ఆచార్యులైన నమ్మాళ్వార్   మరియు పెరియాళ్వార్ లకు  అంకితమైనారు.

Azhwars

పన్నిద్దరాళ్వార్లు

ఆళ్వార్లు తమ పాశురముల ద్వార శ్రీమన్నారాయణున్ని కీర్తించారు.ఈ పాశురాలన్నీ కలిపి దాదాపుగా నాలుగు వేలు కావున ఈ పాశురాలకు నాలాయిరదివ్యప్రబంధమని  వ్యవహారము. ‘దివ్య’ అనగా  పవిత్రమైనదని/వైభవం కలవి, ప్రబంధ మనగా సాహిత్యం(భగవత్  విషయిక).ఇది  తమిళ భాషలో ఉన్న వేదము/వేదాంతము యొక్క  సారమును  తెలిపే గ్రంథము. ఈ గ్రంథము యొక్క ప్రయోజనం జీవాత్మలను భగవద్ఙ్ఞానముచేత ఉజ్జీవింపచేయడం.

ఆళ్వార్లుల  కాలాంతరమున కొన్ని వందల సంవత్సరాల అనంతరం,  నాథమునులతో ఆరంభమయి  శ్రీరామానుజులు ముఖ్యులుగా ఉండి ,  మామునుల వరకు  పలు ఆచార్యులు ఆళ్వార్ల శ్రీసూక్తులను ప్రభోధించారు.  అఙ్ఞానముతో ప్రజలు ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ గేయములుగా భావించారు, కాని అత్యుత్తమ ఙ్ఞానము కలిగిన ఆచార్యులు ఈ పాశురార్థములు శ్రీమన్నారాయణుని తత్త్వమును(సంసారులను ఉజ్జీవింప చేయునవి) తెలిపి అంతిమ లక్ష్యాన్ని(ఆధ్యాత్మిక లోకమగు  పరమపదమున శ్రీమన్నారాయణుని శాశ్వత కైంకర్యం) చేర్చునవి అని,    సిద్ధాంతీకరించారు. మన పూర్వాచార్యులు అందరు ఈ పాశురముల అభ్యసించుటలో,  ఉపన్యసించుటలో, అనుభవించుటలో  తమ జీవితాన్ని   కేంద్రీకరించారు/ధారపోసారు.

azhwar-madhurakavi-nathamuniమధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్  మరియు నాథమునులు, కాంచీపురం

 ఆళ్వార్ల  కాలం తర్వాత ప్రబంధములు కాలగర్భంలో కలిసి పోయాయి. ఎట్టకేలకు నమ్మాళ్వార్ దివ్య అనుగ్రహం వలన నాథమునులు,  ఆళ్వార్ అవతారస్థలమైన ఆళ్వార్ తిరునగరిలో చాలా శ్రమించి నాలాయిర దివ్యప్రబంధాన్ని అర్థముతో కూడి అభ్యసించారు. ప్రస్తుతం మనం చూస్తున్న నాలాయిర ప్రబంధపు  నాలుగు విభాగాలను నాథమునులే చేశారు. వాటిని తమ శిష్యులకు అనుగ్రహించి వారిచే  అధికరణం చేయించి వాటికి విశేషతను చేకూర్చారు. నమ్మాళ్వార్ పై విశేష భక్తిని ప్రదర్శించి మధురకవిఆళ్వార్ అనుగ్రహించిన కణ్ణినున్ శిరుత్తాంబు ను  వారి గౌరవార్థం నాలాయిర ప్రబంధ లో చేర్చారు.

Ramanuja_Sriperumbudur

భగవద్రామానుజులు

ఆదిశేషుల అవతారమైన   రామానుజులు (ఎంపెరుమానార్), యామునాచార్యుల అభీష్ఠం మేరకు గురుపరంపర ఆచార్యుల ద్వారా  దానిని అధ్యయనం చేశారు. వీరు సమాజంలోని అన్ని వర్గాలకు ఆళ్వార్లు మరియు వారి రచనలను వ్యాపింపచేసి   శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి పొందుటలో  దోహద పడ్డారు.వీరు చేసిన కృషికి/ఉపకారమునకు ఈ సాంప్రదాయమును  శ్రీరామానుజదర్శనము అని స్వయంగా శ్రీరంగనాథుడే ప్రకటించారు. అలాగే వీరి వైభవమును  గ్రహించిన పూర్వాచార్యులు,   రామానుజ వైభవమును ప్రకటించు తిరువరంగత్తు అముదనార్ చే కృపచేయబడ్డ శ్రీరామానుజనూట్ఱ్రందాదిని నాలాయిర ప్రబంధములో చేర్చారు.  ఈ శ్రీరామానుజనూట్ఱ్రందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతిరోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచసంస్కారము పొందినవారు ) ప్రతిరోజు తప్పని సరిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి

ఈ పరంపరలో నంపిళ్ళై అను ఆచార్యులు(శ్రీరామానుజుల,ఎంబార్,భట్టర్ మరియు నంజీయర్ తరువాతి వారు) చాలా విశేషంగా చెప్పుకోదగ్గవారు. వీరు శ్రీరంగములో నివాసముంటూ ఆనాటి శ్రీవైష్ణవ సాంప్రదాయానికి నాయకత్వము వహించెడివారు. వీరు శ్రీరంగములో వేంచేసి ఉన్న సమయాన నాలాయిర దివ్య ప్రబంధ వ్యాఖ్యానికి విశేష ప్రాధాన్యతను కల్పించారు.

ఈ పరంపరలో నంపిళ్ళై అను ఆచార్యులు(శ్రీరామానుజుల,ఎంబార్,భట్టర్ మరియు నంజీయర్ తరువాతి వారు ) చాలా విశేషంగా చెప్పుకోదగ్గవారు. వీరు శ్రీరంగములో నివాసముంటూ ఆనాటి శ్రీవైష్ణవ సాంప్రదాయానికి నాయకత్వము వహించెడివారు. వీరు శ్రీరంగములో వేంచేసి ఉన్న సమయాన నాలాయిర దివ్య ప్రబంధ వ్యాఖ్యానికి విశేష ప్రాధాన్యతను కల్పించారు. వీరు  పెరియపెరుమాళ్- శ్రీరంగనాథుని గర్భగుడి సన్నిధిన  ప్రతినిత్యం ఉపన్యసించే వారు. స్వయంగా పెరియ పెరుమాళ్ నిలబడి గవాక్షం గుండా  వీరి ఉపన్యాసాన్ని శ్రవణం చేయుటకు ప్రయత్నించేవారని ఐతిహ్యము. నంపిళ్ళై శిష్యులు కూడ ఈ నాలాయిర దివ్యప్రబంధ వ్యాఖ్యానములకు  మరియు ప్రచారానికి  చాలా కృషిచేశారు. ఆచార్యులులో ప్రథానంగా  నంపిళ్ళై శిష్యులైన పెరియవాచ్చాన్ పిళ్ళై అను ఆచార్యులు ఈ నాలాయిర ప్రబంధములకు విశేష వ్యాఖ్యానాలు రచించి  ‘వ్యాఖ్యాన చక్రవర్తి'(వ్యాఖ్యాతలలో  శ్రేష్ఠులు) అను బిరుదముతో  వవ్యవహరింపబడేవారు. తర్వాత నంపిళ్ళై శిష్యులైన వడక్కుతిరువీధి పిళ్ళై అను ఆచార్యులు నంపిళ్ళై తిరువాయ్ మొళిపై అనుగ్రహించిన ఉపన్యాసములను  గ్రంథస్థపరిచారు. ఇదే ‘ఈడు ముపత్తు ఆరాయిరప్పడి’ (తిరువాయ్మొళికి మిగుల రస్యమైన వ్యాఖ్యానం)వ్యాఖ్యానముగా ప్రసిద్ధి చెందినది.

pillailokacharya-goshtiపిళ్ళైలోకాచార్యుల  కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై తర్వాత  పిళ్ళైలోకాచార్యులు ఈ సత్ సాంప్రదాయానికి సారథిగా ఉంటు దివ్యప్రబంధపు అత్యంత రహస్యవిషయములను  రహస్య గ్రంథములలో నిక్షిప్తం చేశారు. ఈ రహస్య విషయాలు పలు ఆచార్యులచే వివిధ కాలాల్లో వివిధ గ్రంథములలో   చర్చించబడ్డాయి.పిళ్ళైలోకాచార్యులు  ఈ రహస్యములను సంగ్రహముగా తమ అష్టాదశ ప్రథాన రచనల్లో గ్రంథస్థపరిచారు. కాని విషాదమేమనగా వీరి చరమ దశలో శ్రీరంగ క్షేత్రమున మొఘల్ దురాక్రమణ దారులు వల్ల  ఇవన్నీ ధ్వంసం చేయ బడ్డాయి. కాని పిళ్ళైలోకాచార్యులు ఈ ఆక్రమణదారులనుండి నంపెరుమాళ్ (శ్రీరంగనాథుని  ఉత్సవమూర్తి)ను  జాగ్రత్త పరుస్తు  సురక్షితప్రాంతానికి  నంపెరుమాళ్  తో సహా పయనమయ్యారు. వయోవృద్ధులైన వీరు దుర్గమమైన ఆ అడవి  ప్రయాణాన్ని భరించలేక పరమపదాన్ని అధిరోహించారు.  పిమ్మట శ్రీవైష్ణవ సముదాయానికి కోలుకొనుటకు సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని దశాబ్దాల అనంతరం ఆ ఆక్రమణ  దారులు బయటకు తరిమివేయబడి ప్రశాంతత కొనసాగుచుండగా  ఎట్టకేలకు నంపెరుమాళ్   శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారు.

srisailesa-thanian-smallమామునుల కాలక్షేప గోష్ఠి- “శ్రీశైలేశ దయాపాత్రం ”  తనియ సమర్పణ

 శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మామునులు  ఆళ్వార్ తిరునగరి లో అవతరించారు. మామునులు ,తిరువాయ్ మొళి పిళ్ళై గారి శిష్యులయి వారి  వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్యప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్మొళిపిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు.

మామునులు తాము స్వయముగా  లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి  దానిని పఠనం చేసి  ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింపచేసి భద్రపరిచారు.  సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు  దానిని విస్తరింపజేయుటకు వీరు చేసిన అవిరళకృషి మరియు అకుంఠితదీక్షను గుర్తింపగోరి,  స్వయంగా శ్రీరంగనాథుడు వీరి వద్ద తిరువాయ్ మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి,  కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి,  మామునులను ఆచార్యులుగా భావించి అత్యంత  వైభవము గల ‘శ్రీశైలేశ దయాపాత్రం’ అను తనియను శిష్యభావనతో  వారికి  సమర్పించారు. కాలక్రమేణ వివిధ ఆచార్యపురుషవంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు  దివ్యప్రబంధమును తరువాతి వారికి భోధించసాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు   జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతారప్రయోజనముగా కల ఆళ్వారుల దివ్యప్రబంధములను మన పూర్వాచార్యులు భద్రపరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిరదివ్య ప్రబంధమును అర్థ యుక్తంగా నేర్చుకొని దీనితోనే  మన జీవిత కాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం. దీనిని దృష్టిలో ఉంచుకొని,  పూర్వాచార్యుల అభిమతం ప్రధాన ఉద్దేశ్యంగా నాలాయిర దివ్య ప్రబంధాన్ని అనువాదం చేయుటకు వినమ్రతతో  ప్రయత్నిస్తున్నాము.

శ్రీరామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవస్మృతి సందర్భముగా,  మే మాసం 2017కు ఈ నాలాయిర దివ్యప్రబంధ అనువాద కైంకర్యము పూర్తి కావాలని  విశేషప్రయత్నము  చేయుచున్నాము. ప్రథమంగా ఆంగ్లభాషతో ప్రారంభించి పిమ్మట తెలుగు భాషతో ఆ తర్వాత   అవకాశాన్ని అనుసరించి మిగితా భాషల్లోకి కూడ నాలాయిర దివ్యప్రబంధాన్ని అనువదించడం జరుగుతుంది.

ఈ కార్యం ఆళ్వారుల మరియు వారి దివ్య ప్రబంధముల ప్రామాణికత  మరియు వారి  వైభవమును ప్రకటిస్తుంది. దయచేసి ఈ క్రింది వ్యాసాలను అధిక వివరణ కోసం చదవండి.

శ్రీమన్నారాయణుని, ఆళ్వారుల మరియు ఆచార్యుల కృప పై భారం వేసి నాలాయిర దివ్యప్రబంధాన్ని సులువుగా తెలుగున అనువదించుటకు ప్రణాళిక సిద్ధంచేయబడింది. పాశురంలోని ప్రతి పదమును అర్థముతో, విశేషముగా వ్యాఖ్యానములోని నిర్దిష్ఠమైన ప్రథానాంశాలతో  సహా పొందుపరచడం జరుగుతుంది.  ఈ   వెబ్ సైట్ సులభముగా వెదకుటకు వీలుగానుండి, చక్కగా నిర్వహింపబడుతుంది. ఎక్కడైతే చిత్రాలు అవసరమో అక్కడ చేర్చడం  జరుగుతుంది.  భగవానుని , ఆచార్యుల మరియు భాగవతుల కృప వలన, మా ఈ నాలాయిర దివ్యప్రబంధ  అనువాద ప్రణాళిక అత్యంతము విశ్వాసపూర్ణమైన కైంకర్యముగా,   ముందు తరాలవారికి   ఉపయోగకరంగాను ఉంటుందని భావిస్తున్నాము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

నాలాయిర దివ్యప్రబంధ అనువాద బృందం

ఆధారం: http://divyaprabandham.koyil.org/?page_id=29

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

14 thoughts on “ఉపోద్ఘాతము

  1. indumathi

   Swami, We have some trusts who do the veda kainkaryam for free. You may contact Sriman trust of SriRangam. They have a free Gurukul for teaching Vedam and Divya prabandham for kids born in Brahmin sect.

 1. NARSIMHACHARYULU

  Adiyen
  The efforts made by you for translating in Telugu is great and appreciable and help lot of vaishnavites / bhaktas not familier Telugu to read and understand the Dravidavedams. May The Lord Srimannarayana will give all energy and guidance to provide “Divyaprabandhams” in telugu script with meanings.
  Adiyen
  Narasimha Dasan

 2. S.SRINIVASA DSO

  Commendable efforts. A yeoman service is rendered by you in translating into Telugu, the glory of Alwars,Srivaishnavidm,in general and TIRUVAIMOZHI in particular.
  May Alwars,Emperumanars and Jeers grace be showered on you and ur team.

 3. chudamani

  adiyen,
  thanks a lot for your kind comment. all appreciations goes to our acarya and sarathy swamy. sarathy swamy started this work. he gave a chance to translate in telugu. because of acharya krupa dasi is doing.your blessings may help us a lot.

  thank you
  adiyen chudamani ramanuja dasi

 4. N.C.MADHAVI DEVI

  many many thanks to anuvada brundam. satakoty dasohamulu. Iam eagerly waiting for this NALAIRA DIVYA PRABHANDHA VYAKHYANAM in telugu. SRI RANGA NATHUNI KRUPA KATAKSHAMULATO veelu ainta twaralo ee yajnamu sampuranmu avvalani akankshistu ,

  madhavi ramanuja dasi.

 5. Tirunagari Narasaiah

  My heart is delighted to the translation in telugu of divyaprabhandam. While reading Tiruppaan alwar’s ‘Tiruvaimoli’ iam immersed. Thanks to Chuddamani adyien . Shall I make a request, would like to read thiruppallyochchi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *