Category Archives: thiruvAimozhi

కోయిల్ తిరువాయ్మొళి – 8.10 – నెడుమాఱ్కు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 7.4 – ఆళియెళ

emperumAnAr_ThirumEniyil_pUrvacharyargaL (Large)

భగవత్ భక్తులకు సేవ చేయడమే ఆత్మ అసలు స్వరూపానికి తగిన ధర్మము అని  ఆళ్వారు సూచిస్తూ, ఈ పదిగము ద్వారా అందరికీ సలహా కూడా ఇస్తున్నారు. భగవత్ సేవ మొదటి మెట్టుగా, భాగవత సేవ తుది మెట్టుగా ఈ పదిగములో ఆళ్వారు  స్పష్టంగా వివరించారు.

మొదటి పాశురము:  “ముల్లోకాలను ఏలే కంటే, భాగవతులను సేవించడము నాకు అత్యంత ప్రీతిదాయకము” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

నెడుమాఱ్కడిమై శెయ్వేన్ పోల్ అవనై క్కరుద వంజిత్తు
తడుమాఱ్ఱఱ్ఱ తీక్కదిగళ్‌ ముఱ్ఱుం తవిర్ న్ద శదిర్‌ నినైందాల్‌
కొడు మా వినైయేన్‌ అవన్‌ అడియార్‌ అదియే కూడుం ఇదువల్లాల్
విడుమాఱెన్బదెన్‌ అందో! వియన్‌ మూవులగు పెఱినుమే

నేను అనంతమైన ఆ సర్వేశ్వరుడికి సేవ చేయాలని అనుకున్నప్పుడు, అతడు నాలో ఉండి నా చంచలత్వాన్ని తొలగించి, దుష్ఠ శక్తులు నన్ను విడిచిపెట్టేలా చూసుకున్నాడు; భాగవతుల దివ్య పాదాలను పొందడం మినహా, మనకి శ్రేయస్కరమైనది ఏది అని చూస్తే, మహా పాపాత్ముడనైన నాకు ముల్లోకాల ఐశ్వర్యము పొందడం ఎందుకు గొప్ప, భాగవతుల దివ్య పాదాలను విడవాలని నాకు ఎందుకు సూచించబడింది? (ఐశ్వర్యము మరియు తదీయ శేషత్వము మధ్య ఉన్న తేడాని నొక్కి చూపించడానికి).

రెండవ పాశురము:  “ఐశ్వర్యము మరియు కైవల్యము (ఆత్మానుభవము) రెండింటినీ కలిపి పొందినా కానీ, అది నేను పొందిన భాగవత శేషత్వముతో పోల్చలేము”,  అని ఆళ్వారు తెలుపుతున్నారు.

వియన్‌ మూవులగు పెఱినుం పోయ్‌ తానే తానే ఆనాలుం
పుయల్‌ మేగం పోల్‌ తిరుమేని అమ్మాన్‌ పునై పూంగళల్‌ అడిక్కీళ్
శయమే అడిమై తలై నిన్ఱార్ తిరుత్తాళ్‌ వణంగి ఇమ్మైయే
పయనే ఇన్నం యాన్‌ పెఱ్ఱదు ఉఱుమో పావియేనుక్కే?

సర్వేశ్వరుడు మేఘ వర్ణముతో దివ్య స్వరూపాన్ని కలిగి ఉంటాడు. అతడి దివ్య పాదాలు పుష్పాలతో,  విలువైన కాలి అందెలతో, కడియాలతో అలంకరించబడి ఉంటాయి. కొందరు భాగవతులు ఆ దివ్య పాదాలకు దాసులై నిష్కామమైన సేవ చేసుకుంటూ అత్యున్నత స్థితిలో ఉన్నారు. నేను ముల్లోకాల సంపదను పొంది  అటువంటి ఐశ్వర్యము మరియు కైవల్యాలను అనుభవించినా,  అలాంటి భాగవతులకు ప్రణమాములు అర్పించినప్పుడు నేను చేసిన అపరాధములకు ఇవి సరిపోవునా? భాగవత కైంకార్యానికి అవి (ఐశ్వర్యము, కైవల్యము) సరితూగవు అని సూచిస్తుంది.

మూడవ పాశురము: “నేను ఒకవేళ భగవత్ ప్రాప్తిని (భగవానుడిని చేరుకొని అతడిని  సేవించడం) పొందినా, అది ఐశ్వర్యము మరియు కైవల్యము (ఆత్మానుభవము) కంటే గొప్పదైనప్పటికీ, ఈ ప్రపంచంలో భాగవతుల సేవకి  అది సరితూగదు”,  అని ఆళ్వారు తెలుపుతున్నారు.

ఉఱుమో పావియేనుక్కు ఇవ్వులగం మూన్ఱుం ఉడన్‌ నిఱైయ
శిఱుమా మేని నిమిర్త ఎన్‌ శెందామరై క్కణ్‌ తిరుక్కుఱళన్
నఱుమా విరై నాణ్మలరడి క్కీళ్ పుగుదల్‌ అన్ఱి అవనడియార్‌
శిఱుమా మనిశరాయ్‌ ఎన్నై ఆండార్‌ ఇంగే తిరియవే

ఆకర్షణీయమైన చిట్టి మరుగుజ్జు స్వరూపములో వచ్చిన శ్రీ వామనుడు ఒకేసారి ముల్లోకాలను నింపగలిగే విశ్వరూపాకారములో తనను తాను పెంచుకున్నాడు;  ఎర్రటి కమలముల వంటి అతడి నయనములు నాకు ఎంతో ఆనందాయకముగా ఉన్నాయి; మానవ రూపము కారణంగా ఆ శ్రీ వామన దాసులు చిన్నగా కనిపించినా గొప్ప వ్యక్తిత్వము ఉన్నవారు,  వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఇక్కడే ఉండగా, పాపములతో కూడి ఉన్న నేను, తేనెలు కారుతూ అప్పుడే వికసించిన కుసుమములను  పోలిన వామనుడి ఉత్తమమైన శ్రీ దివ్య పాదాలను పొందుట సబబేనా?

నాలుగవ పాశురము:  “ శ్రీవైష్ణవులను మెప్పించటానికి భగవానుడిని కీర్తించి సేవించినా, శ్రీవైష్ణవులు నడైయాడిన ఈ భూమిపైనే ఇక్కడే ఉండటం నాకు అత్యంత యొగ్యమైనది, అత్యున్నతమైన లక్ష్యము కూడా”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.

ఇంగే తిరిందేఱ్కిళుక్కుఱ్ఱెన్?‌ ఇరు మా నిలం మున్‌ ఉండుమిళ్ న్ద
శెంగోలత్త పవళ వాయ్ శెందామరై కణ్‌ ఎన్నమ్మాన్
పొంగేళ్‌ పుగళ్గళ్ వాయవాయ్ ప్పులన్‌ కొళ్‌ వడివెన్‌ మనత్తదాయ్
అంగేయ్‌ మలర్గళ్‌ కైయవాయ్‌  వళి పట్టోడ అరుళిలే

నా స్వామి అయిన భగవానుడు తన అందమైన పగడము లాంటి ఎర్రటి దివ్య అదరములతో ప్రళయ సమయములో ఈ విశాల విశ్వాన్ని మ్రింగి ఆపద తొలగిన తరువాత మరళ తనలో నుండి బయటకు తీసి ఈ విశ్వాన్ని స్థాపిస్తాడు. అటువంటి భగవానుడికి ఎర్రటి కమలము వంటి అందమైన దివ్య నేత్రాలు ఉంటాయి; ఈ ప్రపంచంలో సంచరిస్తున్న నాకు, అతడి గుణ గణాలను వాక్కుతో కీర్తించమని అనుగ్రహించి,  దివ్య ఆకర్షణ కలిగి ఉన్న అతడి స్వరూపముతో నా ఇంద్రియాలను కట్టివేసి, నా హృదయంలో స్థిరపరచి, అతడి గొప్పతనానికి సరిపోలే దివ్య పుష్పాలను నా చేతుల్లో ఉంచితే తప్పేముంది?

ఐదవ పాశురము: “ఒకవేళ నేను తిరునాడు (పరమపదము) కి వెళ్లి అక్కడ భగవానుడిని సేవించే అత్యున్నత లక్ష్యాన్ని సాధించినా, ఇంతకుముందు చెప్పినట్లు ఐశ్వర్యము మొదలైనవన్నీ నాకు అక్కడ లభించినా, ఈ సంసారంలో పుట్టి శ్రీవైష్ణవుల ఆనందము కొరకు తిరువాయ్మొళిని సేవించుటకు అవన్నీ సరితూగుతాయా?” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

వళి పట్టోడ అరుళ్‌ పెఱ్ఱు మాయన్‌ కోల మలర్‌ అడిక్కీళ్
శుళి పట్టోడుం శుడర్ చ్చోది వెళ్ళత్తు  ఇన్బుఱ్ఱిరుందాలుం
ఇళి పట్టోడుం ఉడలినిల్‌ పిఱందు తన్‌ శీర్‌ యాన్‌ కఱ్ఱు
మొళి పట్టోడుం కవియముదం నుగర్చి ఉఱుమో? ముళుదుమే

సర్వేశ్వరుడు అద్భుతమైన స్వభావం, స్వరూపం, గుణాలు మరియు ఐశ్వర్యము కలిగి ఉంటాడు; సర్వేశ్వరుడి కృపతో సరైన నడవడిని అలవర్చుకొని నిత్యమూ ప్రకాశము వెదజల్లే ఆతడి దివ్య తిరువడిని యందు ఆనందముగా  ఉండిపోయినప్పటికీ, ఇంతకు ముందు వివరించిన ఐశ్వర్యము  కైవల్యము మొదలైనవి సాధించినప్పటికీ, ఈ క్షుద్ర అణగారిన శరీరంలో జన్మించి అతడి గుణాలను నేర్చుకొని అతడిని కీర్తిస్తూ తేనెల కవితలను పాడుతూ ఆనందించడానికి సరితూగుతుందా?

ఆరవ పాశురము:  “కేవలం ఐశ్వర్యము, కైవల్యము, భగవత్ అనుభవ ప్రీతి (భగవాన్ అనుభవము), భగవత్ ఆనందం (భగవాన్ యొక్క ఆనందం) మాత్రమే సాధించినట్లయితే, అవన్నీ తిరువాయ్మొళిని శ్రీవైష్ణవుల ఆనందము కొరకు పఠించుటకు సరితూగుతాయా?” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

నుగచ్చి ఉఱుమో మూవులగిన్‌  వీడు పేఱు తన్‌ కేళిల్
పుగర్‌ చ్చెమ్ముగత్త కళిఱాట్ట  పొన్నాళిక్కై ఎన్నమ్మాన్‌
నిగర్‌ చ్చెం పంగి ఎరివిళిగళ్‌ నీండ అశురర్‌ ఉయిర్‌ ఎల్లాం
తగర్ త్తుండు ఉలిలుం పుట్పాగన్‌ పెరియ తనిమా పుగళే

నా ప్రభువైన భగవానుడి దివ్య హస్తమును, అసమానమైన శౌర్యముతో ఎర్రటి ముఖం ఉన్న గజముని నాశనం చేయడానికి ఉపయోగించారు; ఎర్రటి శిరోజాలు మండుతున్న కళ్ళుతో కండలు పెంచిన రాక్షసులను చంపే పెరియ తిరువడి (గరుడాళ్వార్) యొక్క నియామకుడు ఇతడు; ముల్లోకాలను సృష్టించగల సామర్ధ్యం ఉన్న వారి స్వామిత్వము, భాగవతులను ఆహ్లాదపరచే తిరువాయ్మొళి ద్వారా  అతడి అపరిమిత విశేష గుణాల అనుభవానికి సరితూగుతుందా?

ఏడవ పాశురము: “స్వతంత్ర లక్ష్యంగా పరిగణించబడే భగవత్ అనుభవము నాకు అవసరం లేదు; కానీ భాగవతులతో కలిసి వారి సంతృప్తి కొరకై భగవత్ అనుభవంలో మునిగాలనుకుంటున్నాను”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

తనిమా ప్పుగళే ఎజ్ఞాన్ఱుం నిఱ్కుంపడియాయ్ త్తాన్‌ తోన్ఱి
ముని మా ప్పిరమ ముదల్విత్తాయ్ ఉలగం మూన్ఱుం ముళైప్పిత్త
తని మా త్తెయ్వ త్తళిర్‌ అడిక్కీళ్‌ పుగుదలన్ఱి అవన్‌ అడియార్‌
ననిమా క్కలవి ఇన్బమే నాళుం వాయ్ క్క నంగట్కే

“పర బ్రహ్మ” అనే శబ్దములో వివరించినట్లుగా, భగవానుడు సృష్టి గురించి ధ్యానిస్తూ తన సర్వ కారణత్వ గుణాన్ని చూపిస్తూ సృష్టించాలనే  ఉద్దేశ్యంతో అవతరిస్తారు, అతడు ప్రాధమిక సృష్టిలో భాగముగా ముల్లోకాలను సృష్టించాడు; అటువంటి అత్యున్నత భగవానుడి అతి లేత దివ్య పాదాల క్రింద స్థానాన్ని పొందేకంటే, అతడి గూణాలని కీర్తిస్తూ అతడి దాసులుగా ఉన్న అత్యుత్తమ భాగవతుల సంబంధము నిత్యము కలగాలి.

ఎనిమిదవ పాశురము: “నేను భాగవతలతో కలిసి వారితో సంభాషించాల్సిన అవసరం ఉందా? కేవలము వాళ్ళ మధ్య ఉన్నా చాలు నాకు. లేదా వారి  సమూహాలను దర్శించినా చాలు నాకు”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

నాళుం వాయ్ క్క నంగట్కు నళిర్ నీర్ క్కడలై ప్పడైత్తు తన్
తాళుం తోళుం ముడిగళుం శమనిలాద పల పరప్పి
నీళుం పడర్‌ పూంగఱ్పగ క్కావుం నిఱై పన్నాయిఱ్ఱిన్‌
కోళుం ఉడైయ మణిమలైపోల్ కిడందాన్‌ తమర్గళ్‌ కూట్టమే

వేదము వెల్లడించినట్లుగా, భగవానుడు చల్లని నీటి సముద్రాన్ని సృష్టించి,  ప్రత్యేకమైన అసమానమైన రీతిలో అనేక దివ్య ముఖాలతో, అనేక దివ్య కిరీటాలతో, అనేక దివ్య భుజాలతో, అనేక దివ్య చరణములతో అందమైన కల్ప వృక్షములు పెరుగే మాణిక్య పర్వతములా అనేక దివ్య కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుని వలే ఆ సాగరములో విశ్రమిస్తున్నారు; అటువంటి భగవవానుడి సేవకులతో నిత్య సంబంధము మనకు ఎప్పటికీ ఉండాలి. కూట్టం – సేర్తి – కలయిక. మరోవివరణ – కుట్టం అంటే సంఘము (సమూహము), ఇక్కడ ఆళ్వారు అటువంటి సమూహము తన ఎదుట ఉండాలని ప్రార్థిస్తున్నారు.

తొమ్మిదవ పాశురము: “మనం వాళ్ళతో కలిసి జీవించాల్సిన అవసరం ఉందా? వారికి దాస్యులుగా ఉంటే సరిపోతుంది”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

తమర్గళ్‌ కూట్ట వల్వినైయై నాశం శెయ్యుం శదిర్‌ మూర్తి
అమర్‌ కొళ్‌ ఆళి శంగు వాళ్ విల్‌ తండాది పల్‌ పడైయన్
కుమరన్‌ కోల ఐంగణై వేళ్‌ తాదై కోదిల్‌ అడియార్‌ తం
తమర్గళ్‌ తమర్గళ్‌ తమర్గళాం శదిరే వాయ్ క్క తమియేఱ్కే

మనందరికీ స్వామి అయిన భగవానుడికి, తన భక్తులకు సంభవించే అనేక దోషాలను నాశనం చేసే సామర్థ్యము ఉంది;  శ్రీ పంచ ఆయుధములతో ప్రారంభించి అనేక రకాల అసంఖ్యాక ఆయుధాల అతడి వద్ద ఉన్నాయి; గొప్ప అతిలోక సుందరుడు పంచ బాణాలు తన ఆయుధాలుగా ఉన్న నిత్య యవ్వనుడైన కామదేవునికి తండ్రి హోదాగా ఉన్నవాడు భగవానుడు; ఈ సంసారంలో నిస్సహాయంగా ఉన్న మనకు, అటువంటి భగవానుడి యొక్క శుద్ద భక్తుల దాసులకి దాసులను సేవించే సంపద మన వద్ద ఉన్నందున, ఆతడి కృప మనపై సంభవించాలి. ‘కూట్ట వల్ వినై’ అనే పదము ప్రాపంచిక ఆసక్తి ద్వారా పొందిన పాపాలు అని సూచిస్తుంది. “చదు మూర్తి” (శదిర్ మూర్తికి బదులుగా) అని పఠించినప్పుడు, ఇది భగవానుడి యొక్క వివిధ స్వరూపాలను సూచిస్తుంది.

పదవ పాశురము: “నాతో పాటు నా సహచరులు అందరూ ఈ ఫలితాన్ని పొందాలి (భాగవత శేషత్వం)”, అని ఆళ్వారు భావిస్తున్నారు.

వాయ్ క్క తమియేఱ్కు ఊళి దోఱూళి ఊళి మాకాయాం
పూక్కొళ్ మేని నాంగు తోళ్ పొన్ ఆళి  క్కైఎన్నమ్మాన్
నీక్కం ఇల్లా అడియార్‌ తం అడియార్‌ అడియార్‌ అడియార్‌ ఎం
కోక్కళ్‌ అవర్కే కుడిగళాయ్‌ చ్చెల్లుం  నల్ల కోట్పాడే

కాయము (ముదురు నీలము రంగు) వర్ణముతో, చతుర్భుజాలతో, అతడి దివ్య హస్థములో ఆకర్షణీయమైన దివ్య చక్రముతో, ఆకర్షణీయమైన  గొప్ప స్వరూప సౌందర్యాన్ని నాకు చూపించి నన్ను ఆకట్టుకొని నన్ను కట్టి వేశాడు; అటువంటి భగవానుడిని క్షణము కూడా విడువకుండా సేవిస్తూ ఆనందిస్తున్న ఆ దాసులు నాకు మరియు నా సహచరులకు ప్రభువులాంటివారు;  ప్రతి మహా కల్పాము నడుమ సంభవించే మధ్యమ కల్పాలలో కూడా వారినే కీర్తిస్తూ అతడినే అనుసరించే వారితో నా సహవాసము సంభవించాలి.

పదకొండవ పాశురము: “ఈ పదిగములో నిపుణులైనవారు, ఇక్కడ వివరించబడిన భాగవత శేశత్వాన్ని పొందుతారు, వారి కుటుంబాలతో సంతోషంగా జీవిస్తారు”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.

నల్ల కోట్పాట్టులగంగళ్ మూన్ఱినుళ్ళుం తాన్‌ నిఱైంద
అల్లి కమల క్కణ్ణనై  అందణ్‌ కురుగూర్‌ చ్చడగోబన్
శొల్ల ప్పట్ట ఆయిరత్తుళ్ ఇవైయుం పత్తుం వల్లార్గళ్
నల్ల పదత్తాల్‌ మనై వాళ్వర్ కొండ పెండీర్‌ మక్కళే

ముల్లోకాలలో ఆణువణువునా వ్యాపించి ఉన్న భగవానుడు, సుందమైన కమల నయనములు కలవాడు;  అందమైన ఆహ్లాదకరమైన ఆళ్వార్తిరునగరిని నియంత్రించు నమ్మాళ్వార్ల దివ్య పలుకులతో సృష్టించబడిన వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని అభ్యసించి పఠించగలిగే వారు, గృహస్థాశ్రమంలో తమ భార్య పిల్లలు మొదలైనవారితో విశిష్ఠ తదీయ శేషత్వ స్థితిలో జీవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-8-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – 7.4 – ఆళియెళ

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 7.2 – కంగులుమ్

భగవానుడి నుండి విరహవేదనతో ఎంతో బాధను అనుభవించిన ఆళ్వారు నాయికా భావములో రెండు పదిగాలు పాడాడు. ఇది చూసిన భగవానుడు ఆళ్వారుని శాంతింపజేయాలని భావించి, తన విజయాలన్నింటినీ ఆళ్వారుకి వ్యక్తము చేస్తారు. ఆ అనుభవాన్ని లోతుగా అనుభవించిన ఆళ్వారు, అదే అనుభవాన్ని అందరికీ అనుభవింపజేయాలనే గొప్ప సంకల్పముతో ‘ఆళియెళ’ అని ప్రారంభించి ఈ పదిగాన్ని ఎంతో కృపతో ఆళ్వారు పాడారు.

మొదటి పాశురము: భగవానుడు అన్ని లోకాలను కొలిచు ఆ దివ్య లీలని, ఆళ్వారు ధ్యానిస్తూ అనుభవిస్తున్నారు.

ఆళియెళ శంగుం విల్లుం ఎళ త్తిశై
వాళియెళ తండుం వాళుం ఎళ అండం
మోళై ఎళ, ముడి పాదం ఎళ అప్పన్‌
ఊళియెళ ఉలగం కొండవాఱే

దివ్య  శంఖ చక్రము, విల్లు, గద, ఖడ్గము అన్ని ఆయుధాలు పెరిగి పెద్దవిగా గోచరిస్తున్నాయి; అన్ని దిక్కులలోని వాళ్ళు, వాళ్ళ మంగళాశాసనాల ద్వనులు మారుమ్రోగిస్తున్నారు. వారి దివ్య చరణములతో పాటు, దివ్య కిరీటము కూడా పెరిగి పెద్దదై విశాల రుపాన్నిదాల్చి అండాకారపు విశ్వములోకి  చీల్చుకుపోయి ఆ నీటి నుండి బుడగలు రాసాగాయి; ఇంత అద్భుతమైన విధముగా సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు విశ్వాన్ని కొలిచి స్వీకరించి నవీన కాలాన్ని ప్రారంభించారు.

రెండవ పాశురము:  భగవానుడు సముద్ర మథనము చేయు ఆ దివ్య లీలని ఆళ్వారు ధ్యానిస్తూ అనుభవిస్తున్నారు.

ఆఱు మలైక్కు ఎదిర్ ర్దోడుం ఒలి అర
వూఱు శులాయ్ మలై తేయ్ క్కుం ఒలి కడల్‌
మాఱు శుళన్ఱు అళైక్కిన్ఱ ఒలి  అప్పన్‌
శాఱు పడ అముదం కొండ నాన్ఱే

ఆ రోజున, గొప్ప మహోపకారి అయిన సర్వేశ్వరుడు అమృతాన్ని చిక్కించుకొని, దేవతలకు గొప్ప సంబరాన్ని కలిగించారు. ఆ శుభ దినమున అనేక ధ్వనులు ఘోషించాయి – 1. నదులు విపరీత దిశలో పర్వతాల వైపు ప్రవహించే శబ్దం, 2. మందర పర్వతానికి చుట్టుకొని ఉన్న వాసుకి సర్పము యొక్క శరీర రాపిడి ధ్వని, 3. మథన సమయములో గిరగిరా చిలకబడుతున్న సముద్ర ధ్వని.

మూడవ పాశురము: మహావరాహ అవతారాన్ని ఆళ్వారు గుర్తుచేసుకుంటున్నారు.

నాన్ఱిల ఏళ్ మణ్ణుం తానత్తవే పిన్నుం
నాన్ఱిల ఏళ్ మలై తానత్తవే, పిన్నుం
నాన్ఱిల ఏళ్ కడల్‌ తానత్తవే అప్పన్‌
ఊన్ఱి యిడందు ఎయిఱ్ఱిల్‌ కొండ నాళే

భూమి జల మయము అయిన సమయంలో, మహోపకారి అయిన భగవానుడు వరాహ అవతారాన్ని ధరించి తన కొరలతో భూమిని వెలికి తీసి తన దంతములపైన ఎత్తి ఉంచుకున్నారు; ఏడు ద్వీపాల రూపంలో భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలు జారకుండా, వాటి వాటి అసలు స్థానములలో స్థాపించబడ్డాయి; ఇంకా, ఏడు ప్రధాన పర్వతాలు, వాటి అసలు స్థానములలో కదలకుండా పాతి ఉంచారు; ఇంకా, సప్త మహాసముద్రాలు, వాటి తీరాలను అతిక్రమించకుండా, వాటి అసలు స్థానములలో స్థాపించబడ్డాయి.

నాలుగవ పాశురము:  మహాప్రాళయ కాలములో భగవానుడి సంరక్షణను ఆళ్వారు వర్ణిస్తున్నారు. కొంతమంది ఆచార్యుల వ్యాఖ్యానాముల ప్రకారం, ఆళ్వారు మధ్యమ జలప్రళయం గురించి వివరించారని, భగవానుడి దివ్య ఉదరము లోపల మరియు బయట కనిపించే ప్రతిదానినీ మార్కణ్డేయుడు వీక్షించారని ఆచార్యుల వ్యాఖ్యానాముల ద్వారా మనికి విదితమౌతుంది.

నాళుమెళ నిల నీరుమెళ విణ్ణుం
కోళుమెళ ఎరి కాలుమెళ మలై
తాళుమెళ శుడర్‌ తానుమెళ అప్పన్‌
ఊళియెళ ఉలగముండ ఊణే

పగలు రాత్రి, భూమి నీరు, ఆకాశము గ్రహాలు, పర్వత స్థావరాలు మెరిసే నక్షత్రాల మధ్య తేడాలని లొంగదీసుకోవాలని, “మహా ఆకలితో ఆరగించాడు” అని చెప్పినట్లుగా మహోపకారి అయిన భగవానుడు విశ్వాన్ని ఎంతో అద్భుతంగా  భుజించాడు!

ఐదవ పాశురము: భూమి భారాన్ని తగ్గించడానికి నిర్వహించబడిన మహాభారత యుద్ధాన్ని ఆళ్వారు ఆస్వాదిస్తున్నారు.

ఊణుడై మల్లర్‌ తదర్ న్ద ఒలి మన్నర్‌
ఆణుడై చ్చేనై నడుంగుం ఒలి విణ్ణుళ్
ఏణుడై తేవర్ వెళి ప్పట్ట ఒలి అప్పన్‌
కాణుడై ప్పారతం కైయఱై పోళ్దే

పాండవ పక్షపాతి అయిన కృష్ణుడు వారితో చేతులు కలిపి మహాభారత యుద్ధాన్ని జరపడానికి చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు అనేక ద్వనులు వినిపించాయి. 1. బలము శక్తికి నిదర్శనమైన కండలు పెరిగిన మహా మల్లయోధులు ఒకరినొకరు ఢీకొని కింద పడినపుడు వచ్చిన ధ్వనులు, 2. వీర సైనిక సైన్యములు ఉన్న రాజుల భయము ఝంకముతో వచ్చిన ధ్వనులు, 3.  ఆకాశంలో దేవతలు వారి వారి స్థానాలలో సంబరాలు చేసుకుంటున్న ధ్వనులు వినిపించాయి.

ఆరవ పాశురము: భక్తుల అభ్యున్నతికి కారణమైన హిరణ్య వధ ఘట్టాన్ని ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

పోళ్దు  మెలింద పున్‌ శెక్కరిల్ వాన్‌ తిశై
శూళుం ఎళుందు ఉదిరప్పునలా మలై
కీళ్దు పిళంద శింగం ఒత్తదాల్ అప్పన్‌
ఆళ్‌ తుయర్‌ శెయ్దు అశురరై క్కొల్లుమాఱే

సాయం సంధ్యావేళలో భగవానుడు తన భక్తుడిని రక్షించుటకు నరసింహ రూపాన్ని ధరించాడు. నలు దిశలలో విస్తరించిన ఎర్రటి ఆకాశము క్రింద సంధ్యా సమయంలో   హిరణ్యకషిపుని చీల్చి రక్తపు మడుగులో ఆ రాక్షసుడిని వధించాడు; ఆతడు ఆ రాక్షసుడిని చంపిన విధి ఎలా ఉండిందంటే, ఒక సింహము పర్వతాన్ని చీల్చి నట్లుగా అనిపించింది.

ఏడవ పాశురము: రావణ వధ ఘట్టాన్నిఆళ్వారు ఆస్వాదిస్తున్నారు.

మాఱు నిరైత్తు ఇరైక్కుం శరంగళ్‌ ఇన
నూఱు పిణం మలై పోల్‌ పురళ కడల్
ఆఱు మడుత్తు ఉదిర ప్పునలా అప్పన్‌
నీఱు పడ ఇలంగై శెఱ్ఱనేరే

గుంపులు గుంపులుగా గురిపెట్టిన బాణాలు తగిలి, ఆ యేటుతో ఘోరమైన శబ్దాలు వస్తున్నాయి; పర్వతాలు రాలి పడుతున్నట్లుగా, అవి వందల కొలది రాక్షసుల మృతదేహాలను నేలమట్టం చేశాయి, ; రక్తము నదులగా ప్రవాహించి సముద్రాలను నింపివేస్తున్నాయి; ఈ విధంగా భక్త రక్షకుడైన చక్రవర్తి తిరుమగనుడు (శ్రీ రాముడు) లంకా నగరాన్ని బూడిద చేయడానికి న్యాయ యుద్ధము చేశాడు.

ఎనిమిదవ పాశురము: బాణాసురునిపై కృష్ణుని విజయాన్ని ఆళ్వారు గుర్తుచేసుకుంటున్నారు.

నేర్‌ శరిందాన్‌ కొడి క్కోళి కొండాన్ పిన్నుం
నేర్‌ శరిందాన్‌  ఎరియుమనలోన్ పిన్నుం
నేర్‌ శరిందాన్‌ ముక్కణ్‌ మూర్తి కండీర్‌  అప్పన్‌
నేర్శరి వాణన్‌  తింతోళ్‌ కొండ అన్ఱే

రుద్రుడు మొదలగు అన్యదేవతల సహకారముతో బలమైన భుజాలతో ఉన్న బాణాసురుని తో జరిగిన యుద్దములో శ్రీ కృష్ణుడి సహకారముతో అనిరుద్దుడు విజయాన్ని పొందాడు; ఆ రోజున, నెమలి ధ్వజముతో ఉన్న సుబ్రమణ్యుడు ప్రతిద్వందిని అడ్దుకోలేక కింద పడిపోయాడు; ఎత్తైన జ్వాలలతో కూడా అగ్నిదేవుడు ప్రతిఘటించలేక కింద పడిపోయాడు; దేవతలలో అతి ప్రముఖుడు త్రినేత్రుడైన రుద్రుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు; ఇవన్నీ మనకి బాగా తెలిసినవే కదా?

తొమ్మిదవ పాశురము: విశ్వము యొక్క సృష్టి విధానాన్ని కృపతో ఆళ్వారు వివరిస్తున్నారు.

అన్ఱు  మణ్‌ నీర్‌ ఎరి కాల్‌ విణ్‌ మలై ముదల్‌
అన్ఱు శుడర్ ఇరండు పిఱివుం పిన్నుం
అన్ఱు మళై ఉయిర్‌ తేవుం మఱ్ఱుం  అప్పన్‌
అన్ఱు ముదల్ ఉలగం శెయ్దదుమే

సృష్టి ఆదిలో, సంరక్షకుడు మరియు సృష్టికర్త అయిన భగవానుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు; అతడు భూమితో మొదలుపెట్టి  ఐదు తత్వాలను సృష్టించాడు – అవి పర్వతాలు మొదలైన ప్రాపంచిక సృష్టికి కారణముగా మారాయి; అతడు సూర్య  చంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను సృష్టించాడు; ఆపైన వర్షాన్ని సృష్టించాడు, వర్షం మీద ఆధారపడే జీవులను, వర్షాన్ని అనుగ్రహించే దేవతలను సృష్టించాడు. మహాప్రళయము తరువాత ప్రారంభ సృష్టి గురించి ఆళ్వారు వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు.

పదవ పాశురము: గోవర్ధన గిరిని ఎత్తి గోవులు మరియు గోకులవాసులను రక్షించిన భగవానుడి ఆ లీలను ఆళ్వారు ఆనందిస్తున్నారు.

మేయ్‌ నిరై కీళ్‌ పుగ మా పురళ శునై
వాయ్‌ నిఱై నీర్ పిళిఱి చ్చొఱియ ఇన
ఆనిరై పాడి అంగే ఒడుంగ అప్పన్‌
తీ మళై కాత్తు కున్ఱం ఎడుత్తానే

ఆపదలని తొలగించే కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి ఎత్తి రేపల్లె (తిరువాయ్ ప్పాడి) వాసులకి మరియు గోవులకి విపత్తు కలిగించే వర్షాన్ని ఆపాడు. వాళ్ళు ఆ పర్వతము క్రింద ఆశ్రయం పొందటానికి, కొండపైన ఉన్న పశువులు దొరిలి క్రిందకు వచ్చి ఆ పర్వతము క్రింద తలదాచుకోవడానికి, నీరు నిండిన కొలనులు పొంగి ఘోరమైన శబ్దాలు చేసుకుంటూ ప్రవహించడానికి  కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి ఎత్తి వ్రేపల్లెను రక్షించాడు.

పదకొండవ పాశురము:  “భగవానుడి విజయాలను గొప్పగా కీర్తించి చెప్పే ఈ  పదిగాన్ని హృదయపూర్వకంగా నేర్చుకునే వారికి ఈ పదిగము ద్వారానే విజయాలు లభిస్తాయి”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

కున్ఱ ఎడుత్త పిరాన్‌ అడియారొడుం
ఒన్ఱి నిన్ఱ శడగోపన్‌ ఉరై శెయల్‌
నన్ఱి పునైంద ఓర్‌ ఆయిరత్తుళ్‌ ఇవై
వెన్ఱి తరుం పత్తుం మేవి క్కఱ్పార్కే

అత్యున్నత సంరక్షకుడు గోవర్ధన గిరిని ఎత్తిన కృష్ణడి విశేష భక్తులగా ఉన్న భాగవతులలో ఆళ్వారు ఉన్నారు; ఆళ్వారు పాడిన వేయి పాశురములలో సర్వేశ్వరుని విజయాలను వెల్లడిచేసే ఈ పదిగాన్ని అర్ధాలతో అనుసంధానము చేసేవారికి అన్ని అంశాలలో విజయము సంభవిస్తుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-7-4-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – 7.2 – కంగులుమ్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 6.10 – ఉలగముణ్డ

పరాంకుశ నాయకి, శ్రీ రంగనాథుడు

    పరాంకుశ నాయకి, శ్రీ రంగనాథుడు

భగవానుడితో  నమ్మాళ్వార్ల విరహ వేదన శిఖరానికి చేరి వారు స్త్రీ యొక్క మానసిక భావనను పొందుతారు. పరాంకుశ నాయకిగా  శ్రీరంగనాధుని పట్ల అంతులేని ప్రేమ కారణంగా, ఇక మాట్లాడలేని స్థితికి చేరి విరహ వేదనలో ఒక అడుగు ముందుకు వేసి పరాంకుశ నాయకి యొక్క దివ్య మాత (తల్లి) పాత్రను వహిస్తారు. ఆ తల్లి తన కుమార్తెను తీసుకొని పెరియ పెరుమాళ్ళ ముందు ఉన్న దివ్య స్థంభాల మధ్య ఉంచి, ఆమె దయనీయ స్థితిని అతడికి తెలియజేస్తూ, “నీవు సర్వ విధాలుగా ఆమెకు రక్షణనివ్వాలి” అని ప్రార్థిస్తుంది.

మొదటి పాశురము: పరాంకుశ నాయకి యొక్క తల్లి తన కుమార్తె యొక్క స్పృహలేని స్థితిని పెరియ పెరుమాళ్ళకి తెలియజేసి, “ఆమెను ఏమి చేయాలనుకుంటున్నావు?” అని అడుగుతుంది.

కంగులుం పగలుం కణ్‌ తుయిల్‌ అఱియాళ్ కణ్ణి నీర్‌ కైగళాల్‌ ఇఱైక్కుం
శంగు శక్కరంగళ్‌ ఎన్ఱు కై కూప్పుం తామరై కణ్‌ ఎన్ఱే తళరుం
ఎఙ్గనే తరిక్కేన్‌ ఉన్నై విట్టిన్నుం ఇరు నిలం కై తుళావిరుక్కుం
శెంగయల్‌ పాయ్‌ నీర్‌ త్తిరువరంగత్తాయ్‌ ఇవళ్‌ తిఱత్తెన్‌ శెయ్గిన్ఱాయే?

‌నా కూతురి కళ్ళు రాత్రుల్లో  నిద్రపోవాలని కూడా గ్రహించుటలేదు; కళ్ళ నుండి కారుతున్న బాష్పాలను తన చేతులతో ఆమె తుడుచుకుంటుంది; అతడు వచ్చాడని ఊహించుకొని శంఖం చక్రం అని అంటూ అంజలి పెడుతుంది; “కమల నేత్రాలు” అని అంటూ అలసిపోతుంది; ఆమె “నీవు లేకుండా నేను ఎలా ఉండగలను” అని రోధిస్తుంది; తన చేతులతో నేలని శోధిస్తూ చలము లేకుండా మారిపోతుంది; ఎర్రటి చేపలు ఎగిరి గెంతులు వేసే నీటి సరస్సులు చుట్టూ వ్యాపించి ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో నివాసుడై ఉన్న ఓ భగవానుడా! ఇంతటి అద్భుత భావములున్న ఈ అమ్మాయిని నీవు ఏమి చేయాలనుకుంటున్నావు? అంటే “నీవు ఆమె బాధను తొలగించాలనుకుంటున్నావా లేక పెంచాలనుకుంటున్నావా?” అని అర్థము.

రెండవ పాశురము: “నీవు అన్ని విధాలుగా ఆమె రక్షకుడవు, కానీ ఆమె యొక్క ఈ స్థితి ఎటువెళుతుంది దేనికి దారితీస్తుంది?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి ప్రశ్నిస్తుంది.

ఎన్‌ శెయ్గిన్ఱాయ్ ఎన్‌ తామరై క్కణ్ణా  ఎన్నుం కణ్ణీర్‌ మల్గ ఇరుక్కుం
ఎన్‌ శెయ్గేన్ ‌ ఎఱినీర్‌ త్తిరువరంగత్తాయ్ ‌ఎన్నుం వెవ్వుయిర్ త్తుయిర్తురుగుం
మున్‌ శెయ్ద వినైయే ముగప్పడాయ్‌ ఎన్నుం ముగిల్వణ్ఞా తగువదో ఎన్నుం
మున్‌ శెయ్దివ్వులగం ఉండుమిళ్ న్దళందాయ్‌ ఎంగొలో ముడిగిన్ఱాదివట్కే

“అనంతమైన ఆకర్శణ ఉన్న దివ్య నేత్రములు ఉన్న ఓ భగవానుడా! నేను కేవలము నీ కోసమే ఉన్నాను, నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావు?” అని కంటినిండా కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతుంది. “ఎత్తైన అలలు వచ్చే నీటి సంపద ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో నివసించే ఓ భగవానుడా! నేను ఏమి చేయాలి?” ఆమె మళ్ళీమళ్లీ పదేపదే ఊపిరి పీల్చుకొని లోపల ఆ వేడిలో ఆమె కరిగిపోతుంది; తాను చేసుకున్న గత కర్మలు తన ముందుకి ఇలా వాచ్చి బాధిస్తున్నాయి అని అంటుంది; భూమికి నీటికి మధ్య తేడా చూపకుండా వర్షాన్ని కురిపించే మేఘమువంటి ఔన్నత్యముగల ఓ భగవానుడా! నా ముందు ప్రత్యక్షము కాకుండా ఉండటం నీ ఔన్నత్యానికి సరిపోతుందా?” అని ప్రశ్నిస్తుంది. మొదట ప్రపంచాలని సృష్టించి, ఆపై మ్రింగి, తరువాత ఉమ్మి, కొలిచి స్వీకరించిన ఓ భగవానుడా! ఆమె కథను ఎలా ముగుస్తావు? అంటే – “ఆమె ఈ బాధను దూరం చేయడానికి, నీ సంరక్షణలోకి తీసుకుంటావా లేక బయటకి నెట్టివేస్తావా?” అని అర్థము.

మూడవ పాశురము:  “నీ భక్తుల శత్రువులను నాశనము చేయుటకు ఎన్నో అవతారాలు ఎత్తిన  భక్త వత్సలుడువని కీర్తిస్తారు నిన్ను, ఆమె ఈ స్థితికి రావడానికి నీవు ఆమెను ఏమి చేశావు?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి అడుగుతుంది.

వట్కిలళ్‌ ఇఱైయుం మణివణ్ణా ఎన్నుం వానమే నోక్కుం మైయాక్కుం
ఉట్కుడై అశురర్‌ ఉయిర్‌ ఎల్లాం ఉండ ఒరువనే ! ఎన్నుం ఉళ్ళురుగుం
కట్కిలీ  ఉన్నై క్కాణుమాఱరుళాయ్‌ కాగుత్తా కణ్ణనే! ఎన్నుం
తిట్కొడి మదిళ్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్‌ ఇవళ్ తిఱత్తెన్‌ శెయ్దిట్టాయే?

నా కూతురు తన ఈ స్థితికి కొంచెం కూడా సిగ్గు పడట్లేదు; ఆమె “ఆకాశం వైపు చూస్తూ  అకస్మాత్తుగా మూర్చపోతుంది”, “అహంకారంతో నిండిన రాక్షసుల ప్రాణాలను మింగిన ఓ భగవానుడా! ” అంటూ ఆమె తనలో తాను క్రుంగిపోయింది; “ఈ కళ్ళకి కనబడుట కష్టమైన ఓ భగవానుడా! దయతో నీవు నాకు కనిపించేలా చేయి”;  “పుంసాం దృష్ఠి చిత్తాపహారిణం”, “దద్రుశుః విస్మితాకారాః” అని చెప్పినట్లుగా, దశరథ పుత్రునిగా అవతరించి నగర అరణ్య వాసులకు దర్శనమీయలేదా?”, “తాసాం అవిరభూత్“? అని చెప్పినట్లుగా కృష్ణుడిగా నీ సౌందర్యాన్ని గోపికలకి ప్రదర్శించలేదా?”.  బలమైన ధ్వజాలతో ఉన్న కోటలు చుట్టూ వ్యాపించి ఉన్న కోయిల్ (శ్రీరంగం) లో వాసమున్న ఓ భగవానుడా! నీవు ఆమెను ఏమిచేశావు, ఆమె ఇంత బాధను అనుభవిస్తుంది?” అని ఆమె తల్లి ప్రశ్నిస్తుంది.

నాలుగవ పాశురము:  “మీ దయతో ఈమెను ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి పెరియ పెరుమాళ్ళని అభ్యర్థిస్తుంది.

ఇట్టకాల్‌ ఇట్ట కైగళాయ్‌ ఇరుక్కుం ఎళున్దులాయ్ మయంగుం కై కూప్పుం
కట్టమే కాదల్‌ ఎన్ఱు మూర్చ్చిక్కుం కడల్వణ్ణా | కడియై కాణ్‌ ఎన్నుం
వట్ట వాయ్‌ నేమి వలంగైయా ఎన్నుం వందిడాయ్‌ ఎన్ఱెన్ఱే మయంగుం
శిట్టనే! శెణు నీర్‌ త్తిరువరంగత్తాయ్‌ ! ఇవళ్ తిఱత్తెన్‌ శిందిత్తాయే?

నా కూతురికి కాళ్ళు చేతులు ఆడట్లేదు; స్పృహ తిరిగి వచ్చిన తరువాత, ఆమె లేచి నిలుచొని కొంత నడిచి తరువాత మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది; నమస్కారము పెడుతుంది; కలవరంగా “ఈ ప్రేమను భరించడం కష్టం” అని చెప్పి కలత చెందుతూ మళ్ళీ ఆమె స్పృహ కోల్పోతుంది; “ అన్నింటినీ జాగ్రత్తగా  తనలో భద్రపర్చుకునే,  కొలతకు అందని మహా సాగరము లాంటివాడా! నీవు నా పట్ల అతి క్రూరంగా వ్యవహరిస్తున్నావు!”, “ కుడి హస్థంలో దివ్య చక్రాన్ని ధరించిన ఓ భగవానుడా!” అని అంటూ పదే పదే “నీ దివ్య చక్రముతో ఇక్కడికి రా” అని ఆమె అతడిని పదేపదే అభ్యర్థిస్తోంది, “అతడిని పదేపదే పిలవడం వల్ల నేను నా స్వభావాన్ని కోల్పోయాను, అతడు రాకపోయేసరికి నా కోరిక కూడా నశించిపోయింది” అని ఆలోచిస్తూ ఆమె మతి బ్రమించిపోయింది”; ” ఆహ్లాదకరమైన నది ఒడ్డున శయనించి మహోన్నతుడివిగా నటిస్తున్న ఓ భగవానుడా! ఆమె విషయంలో నీవు ఏమి ఆలోచించావు?” అని ఆ తల్లి మొరపెట్టుకుంటుంది. అంటే –  “నీవు ఆమెను భ్రమలోనే ఉంచాలనుకుంటున్నావా లేక ఆమెను ఉద్దరించాలనుకుంటున్నావా?” అని అర్థము.

ఐదవ పాశురము: పరాంకుశ నాయకి యొక్క తల్లి తన కూతురు ప్రతి క్షణం మారుతున్న ఆమె పరివర్తనలను గురించి తెలుపుతూ “ఈ విధంగా ఆమెను బాధపెట్టుట ‘ఆశ్రిత వత్సలుడు’ అన్న నీ బిరుదుకి సరిపోతుందా?” అని ప్రార్థిస్తుంది.

శిందిక్కుం తిశైక్కుం తేఱుం కై కూప్పుం తిరువరంగత్తుళ్ళాయ్‌ ఎన్నుం
వందిక్కుం ఆంగే మళైక్కణ్ణీర్‌ మల్గ వందిడాయ్‌ ఎన్ఱెన్ఱే మయంగుం
అందిప్పోదవుణన్‌ ఉడల్‌ ఇడందానే! అలై కడల్‌ కడైంద ఆరముదే!
శందిత్తున్‌ శరణం శార్వదే వలిత్త తైయలై మైయల్‌ శెయ్ధనే

సంధ్యాసమయములో హిరణ్యుని శరీరాన్ని చీల్చి వేశావు, అలాగే పెద్ద పెద్ద అలలు వచ్చేలా సముద్రాన్ని చిలికిన ఓ భగవానుడా! కేవలము నీ చరణాలనే పొంది ఆనందించాలని తపించి పోతున్న చక్కటి స్వరూపమున్న ఈ అమ్మాయిని భ్రమ పెట్టావు. ఇంతకు ముందు నీవు ఆమెతో ఎలా ఐక్యమయ్యావో తలచుకొని, కలవరపడి తిరిగి ఆత్మ నిగ్రహం పొంది నమస్కారము చేస్తుంది; “ఓ శ్రీరంగవాసుడా!” అని ఆర్తితో పిలుస్తూ ఆమె తన తల వంచుకుంటుంది; అక్కడే ఉండి, చల్లటి కన్నీళ్లతో నిండిన కళ్ళతో, “వచ్చి నన్ను స్వీకరించు” అని పదేపదే అంటూ స్పృహతప్పి పడిపోతుంది. అంటే భగవానుడికి సంబంధించి ఆమె పడుతున్న విరహ వేదన యొక్క రకరకాల పరివర్తనలను సూచిస్తుంది.

ఆరవ పాశురము:  “మీ భక్తులను రక్షించడానికి అవసరమైన ఆయుధాలు నీ వద్ద ఉన్నప్పటికీ  నా కుతురిని బాధపెట్టావు, నేను ఆమె కోసం ఏమి చేయాలో నీవే చెప్పుము”. అని పరాంకుశ నాయకి యొక్క తల్లి ప్రార్థిస్తుంది.

మైయల్‌ శెయ్దున్నై మనం కవర్ న్దానే ! ఎన్నుం మామాయనే ! ఎన్నుం
శెయ్య వాయ్‌ మణియే! ఎన్నుం తణ్‌ పునల్‌ శూళ్ ‌తిరువరంగత్తుళ్ళాయ్‌ ఎన్నుం
వెయ్య వాళ్‌ తండు శంగు చక్కరం విల్ ‌ఏందుం విణ్ణోర్‌ ముదల్‌! ఎన్నుం
పై కొళ్‌ పాంబణైయాయ్‌ ! ఇవళ్‌ తిఱత్తరుళాయ్‌  పావియేన్‌ శెయఱ్పాలదువే

“నా హృదయాన్ని దోచి నన్ను పిచ్చిదానిని చేసిన ఓ భగవానుడా!”, “ఎర్రటి పండు వంటి అధరములు కలిగినవాడా! విలువైన రత్నము వలే సులువుగా చేతిలోకి తీసుకోగలిగేవాడా!”,”అందమైన నీటి వనరులతో చుట్టుముట్టబడిన శ్రీరంగంలో నివాసమున్న ఈ భగవానుడా!”; ఆమె “శరణాగతుల రక్షణ కొరకు క్షణం కూడా ఆలస్యము కాకూడదని సర్వదా నీ పంచ దివ్యాయుధాలను ధరించి ఉండువాడా!”;  “నిత్యసూరుల ఉనికికి కారణమైన వాడా!”, “తిరు అనంతుడు తన శయ్యగా ఉన్నవాడా!” అని నిన్ను కీర్తిస్తుంది. “నేను చేసుకున్న పాపాల కారణంగా నా బిడ్డ యొక్క ఈ దారుణమైన స్థితిని నేను చూడాల్సివస్తుంది”. “దయచేసి  ఆమె గురించి నీవు ఏమనుకుంటున్నావో తెలుపుము” అని ఆ తల్లి ప్రార్థిస్తుంది.

ఏడవ పాశురము:  “తన భక్తుల రక్షణ కొరకై క్షీర సాగరములో శయనించి ఉన్నాడు, అని భగవానుడి అనేక గుణాలను వేదనతో నా బిడ్డ కీర్తిస్తుంది” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి తెలియజేస్తుంది.

పాల తున్బంగళ్‌ ఇన్బంగళ్‌ పడైత్తాయ్‌ పఱ్ఱిలార్ పఱ్ఱ‌ నిన్ఱానే!
కాల శక్కరత్తాయ్‌ ! కడల్‌ ఇడం కొండకడల్వణ్ణా ! కణ్ణనే ! ఎన్నుం
శేల్‌ కొళ్‌ తణ్‌ పునల్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్‌! ఎన్నుం ఎన్‌ తీర్తనే! ఎన్నుం
కోల మా మళైక్కణ్‌ పని మల్గ ఇరుక్కుం ఎన్నుడై క్కోమళ క్కొళుందే

సన్నని తీగలాంటి సున్నిత స్వభావం ఉన్న నా కూతురు ఇలా అంటుంది: “నీవు ప్రతి చోట శరణాగతి చేసినవారికి సుఖాలు శరణాగతి చేయనివారికి దుఃఖాలను కలిగించావు; ఆశ్రయించిన వారికి ఆశ్రితుడివిగా, నీ పట్ల ప్రపత్తులు లేని జయంత వంటి  వారికి కూడా ఆశ్రయం కలిపించిన వాడవు. కాల చక్రాన్ని నియంత్రించువాడా! దివ్య క్షీర సముద్రంలో శయనించి ఉన్న నీ విశాల దివ్య స్వరూపము, ఒక మహాసాగరము మరొక మహాసాగరముపైన శయనించి ఉన్నట్లున్నది;  భక్త రక్షణకై కృష్ణుడిగా అవతరించినవాడా! చేపలతో నిండి ఉన్న  చల్లని కావేరి నీటితో చుట్టుముట్టబడిన కోయిల్ (శ్రీరంగం) లో కొలువై ఉన్నవాడా! నీవు నాకు సులువుగా మునక వేయడానికి వీలైన  పవిత్ర నదీ తీరము వంటి వాడవు!” అని కీర్తిస్తుంది. ఆమె తన అందమైన కళ్ళలో కన్నీళ్లను నింపుకొని అలా నిచ్చేష్ఠురాలై నిలిచి ఉంటుంది.

ఎనిమిదవ పాశురము:  “నా కూతురిపైకి వచ్చిన ఈ ఆపదకి పరిష్కారము నేనెలా తీసేది?” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి అంటుంది.

కొళుందు వానవర్గట్కు!  ఎన్నుం కున్ఱేంది క్కోనిరై కాత్తవన్‌ | ఎన్నుం
అళుం తొళుం ఆవి అనల వెవ్వుయిర్కుం అంజన వణ్ణనే! ఎన్నుం
ఎళుందు మేల్‌ నోక్కి ఇమైప్పీలళ్‌ ఇరుక్కుం ఎంగనే నోక్కుగేన్?‌ ఎన్నుం
శెళుం‌ తడం పునల్‌ శూళ్‌ తిరువరంగత్తాయ్ ! ఎన్‌ శెయ్గేన్‌ ఎన్‌ తిరుమగట్కే

“అతడు నిత్యసూరులకు అధిపతి” అని నా బిడ్డ వర్ణిస్తుంది; ” గోవులను రక్షించడానికి పర్వతాన్ని ఎత్తి అతిమానుషమైన పనులు చేసినవాడా!” అని భక్తిలో మునిగిపోయిన వారిలా ఆమె కన్నీటి కళ్ళతో అలా ఉండిపోతుంది; ఆమె శరణాగతులవలే చేతులు జోడించి నమస్కరిస్తుంది; వేడి ఊపిరిని పీల్చుకొని ఆమె దహించలేని ఆత్మను దహించివేయాలనే ప్రయత్నము చేస్తుంది. “ఓ నన్ను వేదిస్తున్న నల్లనివాడా!” అని అంటూ లేచి నిలబడుతుంది, ఏమీ తోచక అలా కళ్ళ రెప్ప వార్చకుండా చూస్తూ నిలుచుంటుంది!”; “నేను ఎలా చూస్తాను?” అని అంటుంది.  ఓహ్, విశాల మనోహరమైన నీటి సరస్సులతో చుట్టుముట్టబడి ఉన్న కోయిల్ (శ్రీరంగం) వాసా! లక్ష్మితో పోల్చదగిన నా కుమార్తెని నేను ఏమి చేయాలి? తనకి బాధ కలిగించే ఆమె ప్రేమను నేను నియంత్రించగలనా? లేదా రాని నిన్ను వచ్చేలా చేయగలనా? రెండూ అసాధ్యమని సూచిస్తుంది.

తొమ్మిదవ పాశురము:  “లక్ష్మీ దేవి, భుదేవి, నీళా దేవి యొక్క దివ్య పతి అయిన నీకు ఆకర్షితురాలై అమితమైన ప్రేమను పెంచుకున్న ఆమె కోరికను, నేనెలా తీర్చగలను” అని పరాంకుశ నాయకి యొక్క తల్లి తన వేదనను తెలుపుకుంటుంది.

ఎన్‌ తిరుమగళ్‌ శేర్‌ మార్బనే! ఎన్నుం ఎన్నుడై అవియే! ఎన్నుం
నిన్‌ తిరువెయిఱ్ఱాల్ ఇడందు నీ కొండ నిలమగళ్‌ కేళ్వనే ! ఎన్నుం
అన్ఱురువేళుం తళువి నీ కొండ ఆయ్మగళ్‌ అన్బనే ! ఎన్నుం
తెన్‌ తిరువరంగం కోయిల్‌ కొండానే! తెళిగిలేన్‌ ముడివివళ్‌ తనక్కే

“మహా లక్ష్మి నీలో ఐక్యమై ఉండాలని తన నివాస స్థలముగా ఏంచుకున్న ఆ దివ్య వక్షస్థలము కలిగి ఉన్న ఓ భగవానుడా!”, “నీ దివ్య కోరలతో తవ్వి శ్రీ భూమి పిరాట్టిని వేలికి తీసి నీ ప్రియమైన పత్నిగా స్వీకరించిన ఓ భగవానుడా!”, అని ఆర్తితో నిన్ను పొగుడుతుంది. “నీకోసము నీతో సరిపోలిన వంశంలో అవతరించిన నప్పిన్నై పిరాట్టిని స్వీకరించి ఒక నిధిలా ఆమెను నీ వద్ద దాచుకున్న ఓ భగవానుడా!”, అని నా బిడ్డ నిన్ను వర్ణిస్తుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన శ్రీరంగ క్షేత్రాన్ని నీ నివాసంగా స్వీకరించిన ఓ భగవానుడా!”. ఆమె బాధకి మందు ఏదో నాకు అంతుచిక్కట్లేదు.

పదవ పాశురము: తమకు తాము ప్రభువుగా భావించే దేవతలకు అంతరాత్మగా ఉండే సర్వేశ్వరుడు, ఆమే పడుతున్న బాధను గమనించి, అతిలోక సుందరుడు మరియు అతి సౌశీల్యుడు అయిన భగవానుడు విరహముతో బాధపడుతున్న ఆమెకు బాహ్య అనుభవాన్ని ప్రసాదిస్తారు. దీనితో పరాంకుశ నాయకి విశ్వాసాన్ని పొందుతుంది; ఇది చూసిన ఆమె తల్లి సంతృప్తి చెందుతుంది.

ముడివు ఇవళ్‌ తనక్కొన్ఱఱిగిలేన్‌ ఎన్నుం మూవులగాళియే!  ఎన్నుం
కడికమళ్‌ కొన్ఱై చ్చడైయనే ! ఎన్నుం నాన్ముగ క్కడవుళే! ఎన్నుం
వడివుడై వానోర్‌ తలైవనే ! ఎన్నుం వణ్‌ తిరువరంగనే ! ఎన్నుం
అడి యడైయాదాళ్‌ పోలివళ్‌ అణుగి అడైందనళ్ ముగిల్వణ్ణన్‌ అడియే

“దీనికి పరిష్కారమేమిటో నాకు తెలియదు” అని ఆమె అంటూ, ఇంద్రుని అంతరాత్మగా ముల్లోకాలకి (భూః, భూవః, సువః) అధిపతి అయిన ఓ భగవానుడా!”, అని నీ గురించే తలచుచూ “రేల పూలతో అలంకరించబడిన జటాజూటాన్ని ధరించిన రుద్రని అంతరాత్మగా ఉన్నవాడా!”, “చతుర్ముఖ బ్రహ్మలో అంతరాత్మగా ఉన్న ఓ భగవానుడా!”, “నీకు పోలిన స్వరూపము కలిగి ఉన్న నిత్యసూరులకు ప్రభువుగా ఉన్న ఈ భగవానుడా!”, “కోయిల్ (శ్రీరంగం) వంటి మహాక్షేత్రాన్ని ఏలే వాడా!” అని నిన్ను కీర్తిస్తుంది. నేల నీళ్ళకి తేడా చూపకుండా వర్షాన్ని కురిపించే నీల మేఘ స్వరూపుడైన భగవానుడి దివ్య పాదాలను చేరుకోలేదని అనిపించిన నా కూతురు, అతడి కృపతో అతడి దివ్య పాదాలను చేరుకుంది.

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని పఠించే వారు నా లాంటి హింసకు గురికాకుండా, పరమపదము చేరుకుంటారు, అక్కడ నిత్యసూరుల సమూహములో   అనంతమైన పరమానందంతో చిరకాలము ఉంటారు”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

ముగిల్వణ్ణన్‌ అడియై అడైందరుళ్‌ శూడి ఉయ్‌ందవన్ మొయ్‌ పునల్‌ పొరునల్
తుగిల్‌ వణ్ణ త్తూనీర్‌ చ్చేర్ ప్పన్‌ వణ్‌ పొళిల్‌ శూళ్‌ వణ్ కురుగూర్ చ్చడగోపన్
ముగిల్వణ్ణన్‌ అడిమేల్‌ శొన్న శొల్‌ మాలై ఆయిరత్తిప్పత్తుం వల్లార్
ముగిల్‌ వణ్ణ వానత్తిమైయవర్‌ శూల ఇరుప్పర్‌ పేరిన్బ వెళ్ళత్తే

స్వచ్ఛమైన నీటితో సమృద్ధిగా నిండి ఉన్న దివ్య తామ్రపరిణి నది  దివ్య పీతాంబర వస్త్రములా మెరుస్తుంది; చుట్టూ పూలు తేనెలు మొదలైన అనేక తోటలతో అనంత సుసంపన్నమైన ఆళ్వార్తిరునగరి, ఈ నది ఒడ్డున ఉంది; అటువంటి ఆళ్వార్తిరునగరికి నాయకుడు నమ్మాళ్వార్లు, నీలమేఘము వలే ఉదార స్వరూపుడైన పెరియ పెరుమాళ్ళ దివ్య తిరువడిని పొంది విముక్తులైనారు. వారు పాడిన వేయి పాశురముల పదమాలలో  ఈ పదిగాన్ని మేఘ సౌందర్యము కలిగి ఉన్న పెరియ పెరుమాళ్ళ దివ్య చరణాలపై పాడారు; నిష్ఠతో ఈ దశకాన్ని అనుసంధానము చేసినవారు నీల వర్ణములో ఉన్న అనంతమైన ఆనంద సాగరము పరమపదములో నిత్యసూరుల మధ్య  ఉంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-7-2-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – 6.10 – ఉలగముణ్డ

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 5.8 – ఆరావముదే

srinivasan -ahzwar

శరణాగతి చేయునపుడు, భగవానుడికి ప్రాధాన్యత ఇస్తూ వారి దివ్య మంగళ గుణాలను కీర్తిస్తూ నొక్కిచెప్పాలి, ఉపాయాంతరములను ఎంచుకోక మరే ఇతర ఆశ్రయం లేక తమ నిస్సహాయతని నొక్కి చూపిస్తూ  పిరాట్టి యొక్క పురుషాకారము (శిఫార్సు) తో భగవానుడి దివ్య చరణాల యందు శరణాగతి చేయాలి. అటువంటి పరిపూర్ణమైన శరణాగతి  తిరువేంగడముడైయానుడి యందు ఆళ్వారు ఈ పదిగములో చేశారు.

మొదటి పాశురము: “అన్ని లోకాలను రక్షించగలిగే లక్షణము ఉన్న నీవు తిరుమలలో వెలసి ఉన్నావు. నీవు కృపతో, నీ దాసుడినైన నాకు నిన్ను పొందే మార్గాన్ని చూపించుము”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

ఉలగం ఉండ పెరువాయా ఉలప్పిల్‌ కీర్తి అమ్మానే
నిలవుం శుడర్‌ శూళ్‌ ఒళి మూర్తి నెడియాయ్‌ అడియేన్‌ ఆరుయిరే!
తిలదం ఉలగుక్కాయ్‌ నిన్ఱ తిరువేంగడత్తు ఎమ్పెరుమానే!
కుల తొల్‌ అడియేన్‌ ఉన పాదం కూడుమాఱు కూఱాయే

ప్రళయకాలములో గొప్ప ఆత్రుతతో సమస్థ లోకాలను తనలో దాచుకునేందు సాధనముగా వాడిన దివ్య అదరములు / నోరు కలిగి ఉన్న ఓ భగవానుడా!  అంతులేని కీర్తిప్రతిష్ఠ, సహజ స్వామిత్వము ఉన్న ఓ భగవానుడా!  దివ్య శోభతో నిండిన దివ్య స్వరూపము ఉన్నవాడా!  సౌందర్యము మొదలైన వాటితో నిత్యము ప్రకాశిస్తూ అపరిమితమైన కీర్తి ఉన్నవాడా! నాకు సంపూర్ణ ప్రాణాధారమైన ప్రాణ వాయువా!  నుదిటిపైన  తిలక రూపములో మొత్తము ప్రపంచానికే ఉర్ద్వాపుండ్రముల రూపంగా నీ స్వామిత్వాన్ని నాకు వెల్లడిచేస్తూ తిరుమలలో నిలుచొని ఉన్న ఓ నా భగవానుడా! అతి ప్రాచీన పరంపర నుండి వస్తున్న ఈ దాసుడికి నీ దివ్య పాదాలను చేరుకునే మార్గాన్ని అనుగ్రహించుము.

రెండవ పాశురము: “ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని నీవు తొలగించి, ని దివ్య పాదాల యందు నన్ను స్వీకరించాలి”, అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

కూఱాయ్‌ నీఱాయ్‌ నిలనాగి, కొడువల్‌ అశుర ర్కులం ఎల్లాం
శీఱా ఎరియుం తిరునేమి వలవా తెయ్వ క్కోమానే
శేఱార్‌ శునై త్తామరై శెందీ మలరుం తిరువేంగడత్తానే!
ఆఱా అన్బిల్ అడియేన్‌ ఉన్‌ అడిశేర్‌ వణ్ణం అరుళాయే

అతి బలమైన క్రూర రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరికి మట్టిలో కలిపి, ఇంత చేసిన తరువాత కూడా తన కోపము చల్లారని శౌర్య సంపద ఉన్న దివ్య తేజోమయమైన చక్రాయుధాన్ని నియంత్రించు చున్న సర్వశక్తి సంపన్నుడవైన ఓ భగవానుడా! ఓ నిత్యసూరులకు ప్రభువా! ఎర్రటి జ్వాల వర్ణముతో వికసించిన తామర పువ్వుల మడుగులు  ఉన్న తిరుమలలో కొలువై ఉన్న ఓ భగవానుడా! నీ దివ్య పాదాలను చేరుకోవాలని తపించిపోతూ నీపై అంతులేని ప్రేమను పెంచుకున్న ఈ దాసుడిని దయగా అనుగ్రహించుము.

మూడవ పాశురము: “నీవు ఎటువంటి ప్రయత్నం చేయనప్పుడు, నీవు అడిగినదల్లా నేను ఎలా ఇవ్వగలను?” అని ఎంబెరుమాన్లు పలుకగా, ఆళ్వారు సమాధానమిస్తూ ఇలా అన్నారు, “ఎంతో మంది విశిష్ట వ్యక్తులు నిన్ను ఆరాధిస్తూ ఆనందిస్తుండగా,   నీవు నన్ను ఎంచుకున్నావు; అదేవిధంగా, దయతో నీవు నా కోరికను తీర్చాలి”, అని వేడుకుంటున్నారు.

వణ్ణ మరుళ్‌ కొళణి మేగ వణ్జా! మాయ వమ్మానే!
ఎణ్జం పుగుందు తిత్తిక్కుం అముదే! ఇమైయోర్‌ అదిపదియే!
తెణ్ణల్‌ అరువి మణి పొన్‌ ముత్తలైక్కుం  తిరువేంగడత్తానే !
అణ్ఞలే! ఉన్‌ అడిశేర అడియేఱ్కు ఆవావెన్నాయే!

సర్వోన్నతుడైన భగవానుడు అత్యద్భుత గుణాలకు నిలయుడు, మేఘ వర్ణముతో చూసేవారిని మైమరిపించే స్వరూపము కలిగి ఉంటాడు; ఆతడు హృదయాలలోకి ప్రవేశించే తీపి తేనె లాంటివాడు; నిత్యసూరులను తన స్వరూపంతో ఆనందింపజేయువాడు; స్పష్టమైన మణి మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు, బంగారము పొంగి పొరలుతున్న ఆకర్షణీయమైన జలపాతాలు ఉన్న తిరుమాలలో  సర్వోన్నత భగవానిడిగా వెలసి ఉన్నాడు; నీ స్వామిత్వాన్ని అతి సునాయాసముగా తిరుమలలో వ్యక్తపరుస్తున్న ఓ భగవానుడా! మాపై జాలిపడి, మాకు తగిన గమ్యమైన నీ దివ్య పాదాలను చేరుకునేలా దయతో మమ్మల్ని అనుగ్రహించుము!

నాలుగవ పాశురము:  “నిన్ను చేరుకునే సాధనములు నాలో లేవు; కావున నీవొక సాధనాన్ని ఇచ్చి నన్ను దయతో అనుగ్రహించాలి”. “ఎటువంటి భేదము చూపకుండా ప్రతి ఒక్కరి అడ్డంకులను తొలగించే నీవు కృపతో,

నేను నీ దివ్య పాదాలను చేరుకునేలా చూడాలి” అని కూడా ఆళ్వారు ప్రార్థించినట్లు వివరించబడింది.

ఆవా! ఎన్నాదులగత్తె అలైక్కుం అశురర్‌ వాణాళ్మేల్‌
తీవాయ్‌ వాళి మళై పొళింద శిలైయా! తిరుమా మగళ్‌ కేళ్వా
తేవా! శురర్గళ్‌ ముని క్కణంగళ్‌ విరుంబుం తిరువేంగడత్తానే !
పూవార్‌ కళల్గళ్  అరువినైయేన్‌  పొరుందుమాఱు పుణరాయే

ప్రపంచాన్ని దగదగలాడించిన కౄర రాక్షసులపై అగ్ని ధరించిన బాణాల వర్షం కురిపించే శ్రీ సారఙ్గము ధరించిన ఓ భగవానుడా! పరాక్రమవంతుడు, అతిలోక సుందరుడు తనకు తగిన భర్తగా పొందినది శ్రీమహాలక్ష్మి, అలాంటి శత్రువులను వధించిన తరువాత సంతృప్తిపడుతూ దివ్య ముఖ కాంతిని వెదజల్లువాడా! సకల దేవతలు, ఋషులు కోరుకునేవాడు తిరుమాలలో కొలువై ఉన్నాడు. జయించలేని నా పాపాలెన్నో,  పుష్పాలతో దివ్యంగా అలంరించి ఉన్న నీ దివ్య పాదాలను చేరకుండా నన్ను ఆపుతున్నాయి; దయతో నీ దివ్య పాదాలను చేరుకునే మార్గాలను నాకు నేర్పుము.

ఐదవ పాశురము: “భక్తుల రక్షణ సునాయాసముగా నిర్వర్తించే నీ దివ్య పాదాలను నేను ఎప్పుడు చేరుకుంటాను?”, అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

పుణరా నిన్ఱ మరమేళ్ అన్ఱెయ్ద ఒరువిల్‌ వలవావో!
పుణరేయ్‌ నిన్ఱ మరమిరండిన్ నడువే పోన ముదల్వావో!
తిణరార్‌ మేగమెన క్కళిఱు శేరుం తిరువేంగడత్తానే!
తిణరార్‌ శార్ఙ్గత్తున పాదం శేర్వదడియేన్‌ ఎన్నాళే?

సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి అయిన భగవానుడు ఆ రోజు ఏడు మారామరములను వధించాడు; విశ్వ కారకుడైన అతడు చిన్న పసివాడిగా రెండు మహావృక్షముల మధ్యనుండి ప్రాకి వెళ్ళాడు;  దట్టమైన మేఘాల మాదిరిగా ఏనుగుల సమూహాలున్న తిరుమలలో విరాజిల్లి ఉన్న ఓ భగవానుడా! దివ్య శ్రీ సారఙ్గము ధనుస్సుని ధరించి ఉన్న నిన్ను నీ దివ్య పాదాలను ఈ సేవకుడు ఎప్పుడు చేరుకుంటాడో?

ఆరవ పాశురము:  “శ్రీవైకుంఠములో నాకు కైంకర్యము చేయాలనుకోవడం అందరికీ లక్ష్యమే, కాదా?” అని భగవానుడు అడుగుతున్నారు. దానికి ఆళ్వారు స్పందిస్తూ “ఎంతో కోరికతో కొందరు శ్రీవైకుంఠము నుండి తిరుమలకు దిగి వచ్చి నీకు సేవలందిస్తున్నారు కదా? తిరుమలలో నిన్ను సేవించే భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది?” అని అభ్యర్థిస్తున్నారు. “నీపై భక్తిలేని దేవతలు కూడా సేవించాలనుకునే ఆకర్షణీయమైన నీ దివ్య చరణాలను నేను ఎప్పుడు పొందుతాను?”, అని కూడా ఆళ్వారు ప్రార్థించినట్లు వివరించబడింది.

ఎన్నాళే నాం మణ్ణళంద  ఇణై త్తామరైగళ్‌ కాణ్బదఱ్కెన్ఱు
ఎన్నాళుం నిన్టిమైయోర్గళ్‌ ఏత్తి ఇఱైంజి ఇనమినమాయ్
మెయ్న్నా మనత్తాల్‌ వళిపాడు శెయ్యుం తిరువేంగడత్తానే!
మెయ్ న్నా ఎయ్ది ఎన్నాళ్ ఉన్‌ అడిక్కణ్‌ అడియేన్‌ మేవువదే?

“అతి సులభుడివి, సమస్థ లోకాలను కొలిచిన నీ దివ్య పాదయుగళిని మేము ఎప్పుడు చూస్తామో? అని నిత్యాసూరుల సమూహాలు నిత్యమూ భక్తితో నిలబడి భగవానుడిని స్తుతిస్తూ ఉంటారు. తిరుమలలో ఉండి  వారిచే ఈ విధిగా ఆరాధించబడుతూ  సేవించబడుతున్న ఓ భగవానుడా! నీ విశేష సేవకుడినైన నేను నీ దివ్య పాదాలను ఎప్పుడు చేరుకుంటానో?

ఏడవ పాశురము: “నిన్ను చేరడానికి ఏ విధమైన ఇతర మార్గాలను అనుసరించలేదు, నీ పరమానందాన్ని అనుభవించకుండా నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను” అని ఆళ్వారు అంటున్నారు.

అడియేన్‌ మేవి అమర్గిన్ఱ అముదే! ఇమైయోర్‌ అదిబదియే!
కొడియా అడు పుళ్‌ ఉడైయానే !కోల క్కనివాయ్‌ ప్పెరుమానే!
శెడియార్‌ వినైగళ్‌ తీర్‌ మరుందే ! తిరువేంగడత్తు ఎమ్పెరుమానే!
నొడియార్‌ పొళుదుం ఉన పాదం కాణ నోలాదాఱ్ఱేనే

భగవానుడిని చేరి అనుభవించడం నాకు నిత్యము పరమానందకరమైనది; అతను నిత్యసూరులను నియంత్రించే ఆధిపత్యాన్ని కలవాడు; గరుడాళ్వాన్ నిత్యము భగవానుడి వద్ద ఉండి, ధ్వజ రూపముగా భక్తుల శత్రువులను పారద్రోలుతాడు; ఎర్రగా పండిన పండువలే అందమైన అధరములతో నిత్యానందాన్ని కలిగించే గొప్పతనము కలిగి ఉన్నవాడు అతడు;  దట్టమైన పొదలలా పెరిగిన నా పాపాలను తొలగించగల ఉత్తమ ఔషధములా తిరుమలలో కొలువై ఉన్న ఓ భగవానుడా! నన్ను దాసునిగా స్వీకరించగల వాడవు నీవొక్కడివే. నీ దివ్య చరణాలను దర్శించుకోవాలని నేను ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా, వాటిని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను.

ఎనిమిదవ పాశురము: “నీవు ఎటువంటి ప్రయత్నం చేయనప్పుడు, ‘నేను ఇక భరించలేను’” అని చెబితే ఫలితం దొరుకునా?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు.  ఆళ్వారు స్పందిస్తూ “మిత సామర్థ్యములు ఉన్న బ్రహ్మ మరియు ఇతరులు వారి అకించన్యం (వారిలో ఏమీ లేకపోవడం) ను ఉదహరించి వారి వారి కోరికలు నెరవేర్చుకోవట్లేదా? దయచేసి వచ్చి నా బాధలను తొలగింపుము”.

నోలాదాఱ్ఱేన్‌ ఉన పాదం కాణవెన్ఱు నుణ్ణుణర్విన్
నీలార్‌ కండత్తమ్మానుం నిఱై నాన్ముగనుం ఇందిరనుం
శేలేయ్‌ కణ్ఞార్‌ పలర్‌ శూళ విరుంబుం తిరువేంగడత్తానే!
మాలాయ్ మయక్కి అడియేన్‌ పాల్, వందాయ్‌ పోలే వారాయే

సర్వజ్ఞుడు, సూక్ష్మమైన విషయాలను కూడా గమనించగలిగేవాడు కాబట్టి ఈ విశ్వంలో ప్రాముఖ్యత పొంది నీలకంఠుడు అయ్యాడు, సృష్టించగల పరిజ్ఞానము ఉన్న చతుర్ముఖ బ్రహ్మ వీరికి తండ్రి, ముల్లోకాల ఐశ్వర్యము తన యందు ఉన్న ఇంద్రుడు, వీరందరూ ఆ భగవానుడిని “నీ దివ్య చరణాలను దర్శించుకోవాలని మేము ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా, వాటిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము” అని ప్రార్థిస్తున్నారు. ఇటువంటి దేవతలు మీనము వంటి నేత్రము ఉన్న వారి పత్నులు (పార్వతి, సరస్వతి, సచి మొదలైన) లతో పాటు వారు అర్పిస్తున్న శరణాగతిని, ప్రార్థనలను అందుకుంటున్న ఓ తిరుమలవాసా! నల్లని కృష్ణుడిగా వచ్చి నీ లీలలతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసినట్లే, నీకే అంకితమై నీవు లేకుండా ఉండలేని నా వైపు నీవు ఒక చూపు చూడాలి!

తొమ్మిదవ పాశురము: “అతి సుందరమైన ఆకర్షణ కలిగి ఉన్న నీ దివ్య పాదాలను నేనెప్పటికీ వదిలిపెట్టను” అని ఆళ్వారు చెబుతున్నారు.

వందాయ్‌ పోలే వారాదాయ్‌ వారాదాయ్‌ పోల్‌ వరువానే
శెన్‌ తామరై క్కణ్‌ శెంగని వాయ్‌ నాఱ్ఱోళముదే ఎనదుయిరే
శిందామణిగళ్‌ పగరల్లెప్పగల్‌ శెయ్‌  తిరువేంగడత్తానే
అందో అడియేన్‌ ఉన పాదం అగలగిల్లేన్‌ ఇఱైయుమే

నీవు దగ్గరకు వచ్చినట్టే వచ్చి మాయమౌతావు, నా అకించన్యం (ఏ సామర్థ్యం లేకుండుట) తో “నీవు ఇక రావు, సాధ్యం కాదు” అని భావించిన వెంటనే వచ్చి వినయంగా ముందు నిలుచుంటావు. నీ దివ్య ఆకర్షణతో ఎర్రటి దివ్య కమల నేత్రాలతో, నిండుగా పండిన ఎర్రటి పండులా ఆనందపరచే నీ పెదవులతో “మామేకం శరణం వ్రజ” అని పలుకుతున్న నీ దివ్య అదరములు, “సుగాడం పరిషస్వజే” అని నీ భక్తులను ఆలింగనం చేసుకునే నీ దివ్య చతుర్భుజములతో నాకిప్పుడు స్పష్టముగా వ్యక్తమగుతున్నావు, నిరంతరము నాకు శక్తినిచ్చి నన్ను నిలబెట్టావు. కోరికలను ఫలింపజేసి తమ మెరుపుతో రాత్రిని పగలుగా మార్చే మణి మాణిక్య రాసులతో సుసంప్పన్నముగా వెలుగుతున్న తిరుమలలో నివాసుడై ఉన్న ఓ నా భగవానుడా!  అయ్యో! వేరే ఏ ఆశ్రయాన్ని అశించని నేను, నీకు సంపూర్ణ శరణాగతి చేసి, నీ దివ్య పాదాలను ఒక్క క్షణం కూడా వదలలేకపోతున్నాను. ‘అంధో’ అనగా ఆళ్వారు ఆశ్చర్యపోతున్నట్లు సూచన “విరహ వేదనలో ఇంత తపిస్తున్నా కానీ, నా కోరికను నీకు ఇంత విడమరచి చెప్పాల్సి వస్తుంది!”

పదవ పాశురము: “వేరే ఎక్కడ శరణు వేడకుండా, పురుషాకరము (పిరాట్టి) మరియు తగిన గుణాలున్న నీ దివ్య పాదాలకు నేను శరణాగతి చేస్తున్నాను”, అని ఆళ్వారు తిరువేంగడముడైయానుడికి సంపూర్ణముగా శరణాగతులైనారు.

అగలగిల్లేన్‌ ఇఱైయుం ఎన్ఱు అలర్మేల్‌ మంగై ఉఱై మార్బా!
నిగరిల్‌ పుగళాయ్‌ ! ఉలగం మూన్ఱుడైయాయ్‌ ! ఎన్నై ఆళ్వానే!
నిగరిల్‌ అమరర్‌ ముని క్కణంగళ్‌ విరుంబుం తిరువేంగడత్తానే!
పుగల్‌ ఒన్ఱిల్లా అడియేన్ ఉన్‌ అడిక్కీళ్‌ అమర్ న్దు పుగుందేనే

పద్మము నుండి జన్మించుటచే అతి కోమలమైన నీ దివ్య పట్ట మనిషి శ్రీమహాలక్ష్మి నీ దివ్య వక్ష స్థలములో నివాసమై ఉన్న ఓ భగవానుడా! లక్ష్మి  ఒక్క క్షణం కూడా నీ వక్ష స్థలముని విడిచి ఉండని ఓ భగవానుడా!  సాటిలేని వత్సల్యం కలవాడా! మూడు రకాల చేతనములు, అచేతనములకు స్వామిత్వం కలవాడా! ఎన్నో లోపాలున్న నన్ను కూడా స్వీకరించగల సౌశీల్యము ఉన్నవాడా! సాటిలేని ఋషులు మరియు అమరులు గొప్ప కోరికతో ఆరాధించే  తిరుమలలో పరిపూర్ణ సౌలాభ్యముతో కొలువై ఉన్నవాడా! ఉపాయాంతరములు, ఏ ఇతర రక్షణ లేకుండా అనన్యశరణుడిగా ఉన్న నేను, నీ దివ్య పాదాల యందు శరణాగతి చేసి, కేవలము కైంకార్య సంకల్పముతో వాటి క్రింద కూర్చున్నాను.

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించిన వారందరూ పరమపదానికి చేరుకొని, కైంకర్యముతో పట్టాభిషేకితులై నిత్య సేవలో పాల్గొంటారు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

అడిక్కీళ్‌ అమర్ న్దు పుగుందు అడియీర్‌ ! వాళ్మిన్‌ ఎన్ఱెన్ఱరుళ్‌ కొడుక్కుం
పడిక్కేళ్‌ ఇల్లా ప్పెరుమానై  ప్పళన క్కురుగూర్‌ చ్చడగోపన్‌
ముడిప్పాన్‌ శొన్న ఆయిరత్తు తిరువేంగడత్తుక్కివై పత్తుం
పిడిత్తార్‌ పిడిత్తార్‌ వీఱ్ఱిరుందు పెరియ వానుళ్‌ నిలావువరే

సర్వోన్నతుడైన భగవానుడు  సాటిలేని రీతిలో, “భక్తులారా! నా దివ్య చరణాల క్రింద చేరండి, అనన్యసాదనులు మరియు అనన్య ప్రయోజనులై నిత్యానందాన్ని పొందండి” అని ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు; సుసంపన్నమైన నీటి వనరులతో అలరాడే ఆళ్వార్తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వర్లు, తాను పాడిన వెయ్యి పాశురములలో,  తన కోరికలన్నిటినీ నెరవేర్చమని కోరుతూ ఆ తిరుమలవాసుడి గురించి ఈ పది పాసురములలో పాడారు; ఈ పాశురములను వాటి అర్ధాలతో సహా అనుసంధానము చేసినవారు, “పరమవ్యోమ” అనే పదాన్ని సూచిస్తూ అనంతమైన పరమపదమును పొంది పరమానందాన్ని అనుభవిస్తారు అని చెప్పబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-6-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ತಿರುವಾಯ್ಮೊೞಿ – ಸರಳ ವಿವರಣೆ – 10.7-ಶೆಞ್ಜೊಲ್

Published by:


ಶ್ರೀಃ ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯ ನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ಶ್ರೀಮತ್ ವರವರಮುನಯೇ ನಮಃ

ಕೋಯಿಲ್ ತಿರುವಾಯ್ಮೊೞಿ – ಸರಳ ವಿವರಣೆ

<< 10.1 – ತಾಳತಾಮರೈ


ಆಳ್ವಾರರು ಪರಮಪದವನ್ನು ಶೀಘ್ರವಾಗಿ ತಲುಪಲು ಬಯಸುತ್ತಾರೆ. ಎಂಪೆರುಮಾನರೂ ಅದಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಆದರೆ ಎಂಪೆರುಮಾನರು ಆಳ್ವಾರರನ್ನು ಅವರ ದಿವ್ಯ ಲೌಕಿಕ ರೂಪದಲ್ಲಿಯೇ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿಯೂ ಆ ದಿವ್ಯ ರೂಪವನ್ನು ಆನಂದಿಸಲು ಬಯಸುತ್ತಾರೆ. ಅದನ್ನು ತಿಳಿದ ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಹಾಗೆ ಮಾಡದಿರಲು ಸಲಹೆ ಕೊಡುತ್ತಾರೆ ಮತ್ತು ಎಂಪೆರುಮಾನರು ಕಡೆಗೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅದನ್ನು ನೋಡಿದ ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರ ಶೀಲಗುಣವನ್ನು(ಸರಳತೆಯನ್ನು) ನೋಡಿ ಅತೀವ ಸಂತೋಷಗೊಳ್ಳುತ್ತಾರೆ ಮತ್ತು ಅದನ್ನು ಈ ಪದಿಗೆಯಲ್ಲಿ ಕರುಣೆಯಿಂದ ಎಲ್ಲರಿಗಾಗಿ ವಿವರಿಸುತ್ತಾರೆ.

ಮೊದಲನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ಎಂಪೆರುಮಾನರು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿ ನಿನ್ನ ಮೂಲಕ ತಿರುವಾಯ್ಮೊೞಿಯನ್ನು ಹಾಡಿಸುತ್ತೇನೆ’ ಎಂದು ಹೇಳುತ್ತಾರೆ. ಆದರೆ ನನ್ನ ಮೇಲಿನ ಪ್ರೀತಿಯನ್ನು ನೋಡಿ. ಓಹ್! ಅವನನ್ನು ಸೇವಿಸುವವರೇ! ಅವನ ಅಗಾಧವಾದ ಸಮುದ್ರದಂತಹ ಗುಣದಲ್ಲಿ ಮುಳುಗಿಹೋಗಬೇಡಿ” ಎಂದು.

ಶೆಞ್ಜೊಲ್ ಕವಿಗಾಳ್ ಉಯಿರ್ ಕಾತ್ತು ಆಟ್ಚೆಯ್‍ಮ್ಮಿನ್ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ,
ವಞ್ಜಕ್ಕಳ್ವನ್ ಮಾಮಾಯನ್ ಮಾಯಕ್ಕವಿಯಾಯ್ ವನ್ದು, ಎನ್
ನೆಞ್ಜುಮುಯಿರುಮುಳ್ ಕಲನ್ದು ನಿನ್‍ಱಾರ್ ಅಱಿಯಾವಣ್ಣಮ್ , ಎನ್
ನೆಞ್ಜುಮುಯಿರುಮ್ ಅವೈ ಉಣ್ಡು ತಾನೇಯಾಗಿ ನಿಱೈನ್ದಾನೇ ॥

ತಿರುಮಾಲಿರುಂಜೋಲೈನಲ್ಲಿರುವ ಎಂಪೆರುಮಾನರು , ಯಾರೊಬ್ಬರಿಂದ ಅವರಿಗೇ ಗೊತ್ತಾಗದಂತೆ ಕಳ್ಳತನವನ್ನು ಮಾಡಿ, ಅದ್ಭುತವಾದ ರೂಪವನ್ನು ಹೊಂದಿ, ಅನೇಕ ಕಲ್ಯಾಣ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿ, ಆದರೂ ತುಂಟತನದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ, ನನ್ನನ್ನು ಪದ್ಯಗಳನ್ನು ಹಾಡುವಂತೆ ಪ್ರೇರೇಪಿಸಿ, ಅವರು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಬಂದು ನೆಲೆಸಿ, ನನ್ನಲ್ಲೇ ಒಂದಾಗಿ , ಅವನೊಂದಿಗೇ ಇರುವ ಲಕ್ಶ್ಮಿಗೇ ಗೊತ್ತಾಗದ ಹಾಗೆ ಬಂದು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿರುವನು. ಅವನು ನನ್ನ ಹೃದಯವನ್ನೂ ಸರ್ವಸ್ವವನ್ನೂ ಸ್ವೀಕರಿಸಿ, ಆನಂದಭರಿತನಾಗಿ , ಅವಾಪ್ತ ಸಮಸ್ತ ಕಾಮನಾಗಿರುವನು. ಓಹ್! ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಾಸುರಗಳನ್ನು ಹಾಡುವವರೇ! ನಿಮ್ಮನ್ನೂ ಮತ್ತು ನಿಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನೂ ಜೋಪಾನವಾಗಿರಿಸಿಕೊಳ್ಳಿ. ಅವನು ಎಲ್ಲವನ್ನೂ ಕದ್ದುಬಿಡುವನು. ಮತ್ತು ನಿಮ್ಮ ಮಾತುಗಳಿಂದ ಅವನನ್ನು ಸೇವಿಸಿ.
ಇದರ ಅರ್ಥವೇನೆಂದರೆ : ಭಗವಂತನಲ್ಲಿ ಅನನ್ಯಪ್ರಯೋಜನಕ್ಕಾಗಿ (ಕೈಂಕರ್‍ಯವನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನೂ ಅಪೇಕ್ಷೆಯಿಲ್ಲದವರಿಗೆ) ತೊಡಗಿಕೊಂಡವರಿಗೆ , ತಮ್ಮನ್ನು ಮತ್ತು ತಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ಅವನು ಕದ್ದುಕೊಂಡು ಹೋಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲವೆಂದು.

ಎರಡನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು, ತಮ್ಮ ಮತ್ತು ಎಂಪೆರುಮಾನರ ಸಮಾಗಮವಾದ ಮೇಲೆ ಎಂಪೆರುಮಾನರಿಗೆ ದೊರಕಿದ ಸಂತೋಷ ಮತ್ತು ಐಶ್ವರ್‍ಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಆನಂದಿಸುತ್ತಾರೆ.

ತಾನೇಯಾಗಿ ನಿಱೈನ್ದು ಎಲ್ಲಾವುಲಗುಮ್ ಉಯಿರುಮ್ ತಾನೇಯಾಯ್,
ತಾನೇ ಯಾನೆನ್ಬಾನಾಗಿ ತ್ತನ್ನೈ ತ್ತಾನೇ ತುದಿತ್ತು, ಎನಕ್ಕು
ತ್ತೇನೇ ಪಾಲೇ ಕನ್ನಲೇ ಅಮುದೇ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ,
ಕೋನೇಯಾಗಿ ನಿನ್‍ಱೊೞಿನ್ದಾನ್ ಎನ್ನೈ ಮುಱ್ಱುಮ್ ಉಯಿರ್ ಉಣ್ಡೇ ॥


ಎಂಪೆರುಮಾನರು ನನ್ನನ್ನು ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲೂ ಆನಂದಿಸುತ್ತಾರೆ. ಅವನೇ ಮೂಲಭೂತ ಮತ್ತು ಪರಿಪೂರ್ಣ. ಅವನೇ ಎಲ್ಲಾ ಸಮಸ್ತ ಲೋಕಗಳೂ ಮತ್ತು ಎಲ್ಲಾ ಸಮಸ್ತ ಜೀವಿಗಳು ಅವನೇ [ಅವನ ದೇಹವೇ ಎಲ್ಲವೂ]. ಅವನೇ ನಾನೂ, ಜ್ಞಾನದ ಪ್ರತೀಕವಾದ ವಸ್ತುವೆಂದು ಕರೆಯಲ್ಪಡುತ್ತೇನೆ. ಅವನೇ ಹೊಗಳಿಕೆಗೆ ಪಾತ್ರವಾಗುವವನು ಮತ್ತು ಹೊಗಳುವವನು ಅವನೇ. ಇದನ್ನೆಲ್ಲಾ ನನಗೆ ತಿಳಿಯಲ್ಪಡುವಂತೆ ಮಾಡಿದ್ದರಿಂದ, ಜೇನು, ಹಾಲು, ಸಕ್ಕರೆ, ಅಮೃತ – ಇವೆಲ್ಲವುಗಳ ಮಾಧುರ್‍ಯವೂ ಅವನೇ. ಅವನೇ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈನಲ್ಲಿ ಕರುಣೆಯಿಂದ ನೆಲೆಸಿರುವ ಸ್ವಾಮಿಯೂ ಮತ್ತು ಅಲ್ಲಿಂದ ಹೋಗದೇ ನೆಲೆಸಿರುವವನು .
ಇದರ ಅರ್ಥ : ಅವನೇ ಆನಂದಪಡುವವನು ಮತ್ತು ಆನಂದಿಸಲ್ಪಡುವವನು.

ಮೂರನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಕರಣೆಯಿಂದ ಎಂಪೆರುಮಾನರ ಕೊನೆಯಿಲ್ಲದ ಪ್ರೀತಿಯನ್ನು ಮತ್ತು ಅದು ತಮ್ಮ ಮೇಲೆ ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಬಗ್ಗೆ ವಿವರಿಸಿದ್ದಾರೆ.

ಎನ್ನೈ ಮುಱ್ಱುಮ್ ಉಯಿರ್ ಉಣ್ಡು ಎನ್ ಮಾಯವಾಕ್ಕೈ ಇದನುಳ್ ಪುಕ್ಕು,
ಎನ್ನೈ ಮುಱ್ಱುಮ್ ತಾನೇಯಾಯ್ ನಿನ್‍ಱ ಮಾಯ ಅಮ್ಮಾನ್ ಶೇರ್,
ತೆನ್ನನ್ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ತ್ತಿಶೈ ಕೈಕೂಪ್ಪಿ ಚ್ಚೇರ್ನ್ದಯಾನ್,
ಇನ್ನುಮ್ ಪೋವೇನೇ ಕೊಲೋ ಎನ್ಗೊಲ್ ಅಮ್ಮಾನ್ ತಿರುವರುಳೇ ॥

ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲೂ ಆನಂದಿಸಿದ ಮೇಲೆ , ಎಂಪೆರುಮಾನರು ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲೂ ಅಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಿರುವ ನನ್ನ ದೇಹದೊಳಗೆ ಹೊಕ್ಕು , ನನ್ನನ್ನು ಮತ್ತು ಅದಕ್ಕೆ ಜೋಡಣೆಯಾಗಿರುವ ನನ್ನ ದೇಹವನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ತಮ್ಮ ವಶಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡರು. ಅವರಿಗೆ ಅನೇಕ ಕಲ್ಯಾಣ ಗುಣಗಳು ಮತ್ತು ಅದ್ಭುತವಾದ ಕ್ರಿಯೆಗಳೂ ಇವೆ. ಅವರು ಬೇರೆ ಸಾಟಿಯಿಲ್ಲದ ಪ್ರಭುವಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಸ್ಥಿರವಾಗಿ ಹೊಗಳಲು ಯೋಗ್ಯವಾದ ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿನಲ್ಲಿರುವ ತಿರುಮಲೈನಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲು ನಾನು ಆ ದಿವ್ಯ ದೇಶವನ್ನು ತಲುಪಿದ್ದೇನೆ. ಈ ಸ್ಥಿತಿಯನ್ನು ತಲುಪಿದ ನಂತರ ಬೇರೆ ಎಲ್ಲಾದರೂ ನನಗೆ ಹೋಗಲು ಸ್ಥಳವಿದೆಯೇ? ಎಲ್ಲಾದರೂ ಹೋಗಲು ಸಾಧ್ಯವೇ? ಇಂತಹ ಬೇಷರತ್ತಾದ ಪ್ರಿತಿಯನ್ನು ಹೊಂದಿರುವ ಸ್ವಾಮಿಯು ಎಂತಹ ಅದ್ಭುತವಾದವರು. ಇದರ ಅರ್ಥ : ಎಂಪೆರುಮಾನರು ಬೇರೆ ಅನೇಕ ಪ್ರಯೋಜನಗಳನ್ನು , ವರಗಳನ್ನು ಕೊಡಲು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. ತೆನ್ನನ್ ಎಂಬುದು ಆ ಕ್ಷೇತ್ರದ ರಾಜನೂ ಆಗಿರಬಹುದು.

ನಾಲ್ಕನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರ ಪ್ರೀತಿಯನ್ನು ಆಳ್ವಾರರ ದೇಹದ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವುದನ್ನು ಮತ್ತು ತಿರುಮಲೈಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಆಳ್ವಾರರನ್ನು ಎಂಪೆರುಮಾನರು ಆನಂದಿಸುವುದನ್ನು ವಿವರಿಸುತ್ತಾರೆ.

ಎನ್ಗೊಲ್ ಅಮ್ಮಾನ್ ತಿರುವರುಳ್‍ಗಳ್ ಉಲಗುಮ್ ಉಯಿರುಮ್ ತಾನೇಯಾಯ್,
ನನ್ಗೆನ್ನುಡಲುಮ್ ಕೈವಿಡಾನ್ ಞಾಲತ್ತೂಡೇ ನಡನ್ದುೞಕ್ಕಿ,
ತೆನ್ ಕೊಳ್ ತಿಶೈಕ್ಕು ತ್ತಿಲದಮಾಯ್‍ ನಿನ್‍ಱ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ,
ನಙ್ಗಳ್ ಕುನ್‍ಱಮ್ ಕೈವಿಡಾನ್ ನಣ್ಣಾ ಅಶುರರ್ ನಲಿಯವೇ ॥

ಎಂಪೆರುಮಾನರು ಎಲ್ಲಾ ಲೋಕಗಳೂ ಮತ್ತು ಜೀವಿಗಳಾಗಿದ್ದುಕೊಂಡು , ಅವರಲ್ಲಿ ಆಸಕ್ತಿಯಿಲ್ಲದ ಅಸುರರನ್ನು ವಧಿಸಿ, ಭೂಮಿಯ ಮೇಲೆ ಇಳಿದು, ಇಲ್ಲಿ ವಿಹರಿಸುತ್ತಾರೆ. ಅಲ್ಲಿಂದ ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ಬಹಳ ಎತ್ತರದಲ್ಲಿರುವ ಮತ್ತು ಎಲ್ಲ ಪರ್ವತಗಳಿಗೂ ಮುಖ್ಯವಾಗಿರುವ , ನಮ್ಮಂತಹವರಿಂದ ಆನಂದಿಸಲ್ಪಡುವ ತಾಣವಾದ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈಗೆ ಬಂದು, ಅಲ್ಲಿಂದ ನಿರ್ಗಮಿಸದೇ ಅಲ್ಲಿಯೇ ಇರುತ್ತಾರೆ. ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ನೆಲೆಸಿ ಅಲ್ಲಿಂದಲೂ ನಿರ್ಗಮಿಸದೇ ಇದ್ದಾರೆ. ಅವರ ಶೀಲಮ್ (ಸರಳತೆ) ಎಂತಹ ಅದ್ಭುತವಾದುದು ಮತ್ತು ನಮಗೆ ಒಳಿತನ್ನು ಉಂಟುಮಾಡುವುದು ಎಂದು ಆಳ್ವಾರರು ವರ್ಣಿಸಿದ್ದಾರೆ.

ಐದನೆಯ ಪಾಸುರಮ್:
ಎಂಪೆರುಮಾನರು ನನ್ನಲ್ಲಿ ಒಂದಾಗಿ , ತಿರುವಾಯ್ಮೊೞಿಯನ್ನು ನನ್ನ ಬಾಯಿಯಿಂದ ಕೇಳಿ ಮತ್ತು ಹತೋಟಿಯಿಲ್ಲದ, ತುಂಬಿ ಹರಿಯುವ ಆನಂದಮಯವಾದ ತಿರುವಾಯ್ಮೊೞಿಯನ್ನು ಕೇಳಿ, ನಿತ್ಯಸೂರಿಗಳು ಮತ್ತು ಮುಕ್ತಾತ್ಮಗಳು ಹಾಡಿದಾಗ ತಲೆದೂಗುವಂತೆ , ಎಂಪೆರುಮಾನರು ತಮ್ಮ ತಲೆಯನ್ನು ಆಡಿಸುತ್ತಿದ್ದಾರೆ.

ನಣ್ಣಾ ಅಶುರರ್ ನಲಿವೆಯ್‍ದ ನಲ್ಲ ಅಮರರ್ ಪೊಲಿವೆಯ್‍ದ,
ಎಣ್ಣಾದನಗಳ್ ಎಣ್ಣುಮ್ ನನ್ ಮುನಿವರ್ ಇನ್ಬಮ್ ತಲೈಚ್ಚಿಱಪ್ಪ,
ಪಣ್ಡಾರ್ ಪಾಡಲಿನ್ ಕವಿಗಳ್ ಯಾನಯ್ ತ್ತನ್ನೈ ತ್ತಾನ್ ಪಾಡಿ,
ತೆನ್ನಾವೆನ್ನುಮ್ ಎನ್ನಮ್ಮಾನ್ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈಯಾನೇ॥

ಅಡಚಣೆಯಾಗಿರುವ ಮತ್ತು ಅವನನ್ನು ಹೊಂದಲು ನಿರಾಸಕ್ತರಾಗಿರುವ ಅಸುರರನ್ನು ಸಂಹರಿಸಿ, ತಮ್ಮನ್ನು ಹೊಂದಲು ಆಸಕ್ತರಾಗಿರುವ , ಭಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿರುವ ಅನುಕೂಲಕರವಾದ ದೈವೀಕರಿಗೆ ಐಶ್ವರ್‍ಯವನ್ನು ಕರುಣಿಸಿ, ಅತ್ಯಂತ ಆಳವಾದ ತಪಸ್ಸನ್ನು ಮಾಡುವ ಧ್ಯಾನಿಗಳಿಗೆ ಅತ್ಯಂತ ಆಳವಾದ ಆನಂದವನ್ನು ನೀಡಿ, ನಮ್ಮಿಂದ ಊಹಿಸಲೂ ಸಾಧ್ಯವಾಗದ ಮಟ್ಟಿಗೆ ಕಲ್ಯಾಣ ಗುಣಗಳನ್ನೂ ಮತ್ತು ಸಕಲ ಐಶ್ವರ್‍ಯಗಳನ್ನೂ ಹೊಂದಿರುವ , ಅವಾಪ್ತ ಸಮಸ್ತ ಕಾಮನ್, ನನ್ನ ಸ್ವಾಮಿಯು ತಿರುಮಲೆಗೂ (ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈಗೂ) ಸ್ವಾಮಿಯಾಗಿ ನಿಂತಿದ್ದಾರೆ. ನನ್ನಿಂದ ಮಧುರವಾದ ಪಾಸುರಗಳನ್ನು, ಸಂಗೀತದೊಂದಿಗೆ ಮತ್ತು ರಾಗ, ತಾಳಗಳೊಂದಿಗೆ ಸ್ವೀಕರಿಸಿ, ಅವರು ತಮ್ಮ ತಲೆಯನ್ನು ಮೃದುವಾಗಿ ಆಡಿಸಿ, ಈ ಪಾಸುರಗಳನ್ನು ಹಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.

ಆರನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ಶ್ರೀಯಃ ಪತಿ (ಮಹಾಲಕ್ಶ್ಮಿಯ ಸಂಗಾತಿ) ಯಾದ ಎಂಪೆರುಮಾನರು ತಿರುಮಲೈನಲ್ಲಿ ಕರುಣೆಯಿಂದ ನಿಂತಿದ್ದಾರೆ, ಮತ್ತು ನನ್ನನ್ನು ಆಳಲು ಉತ್ಸುಕರಾಗಿದ್ದಾರೆ. “

ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ಯಾನೇಯಾಗಿ ಚ್ಚೆೞು ಮೂವುಲಗುಮ್, ತನ್
ಒರು ಮಾವಯಱ್ಱಿನುಳ್ಳೇ ವೈತ್ತು ಊೞಿಯೂೞಿ ತಲೈ ಅಳಿಕ್ಕುಮ್,
ತಿರುಮಾಲೆನ್ನೈ ಆಳುಮಾಲ್ ಶಿವನುಮ್ ಪಿರಮನುಮ್ ಕಾಣಾದು,
ಅರುಮಾಲೆಯ್‍ದಿ ಅಡಿ ಪರವ ಅರುಳೈಯೀನ್ದ ಅಮ್ಮಾನೇ ॥


ರುದ್ರರು, ಬ್ರಹ್ಮರು ಎಂಪೆರುಮಾನರನ್ನು ನೋಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲವಾದ್ದರಿಂದ, ಅವರು ಸೇರಲು ಅತಿಕಷ್ಟವಾದ , ಅವನ ದಿವ್ಯ ಪಾದಗಳನ್ನು ಬಹಳ ಭಕ್ತಿಯಿಂದ ಆರಾಧಿಸುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಅವನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗುತ್ತಾರೆ. ಪ್ರತಿಯೊಂದು ಕಲ್ಪದಲ್ಲೂ ಅಂತಹ ಎಲ್ಲರಿಗಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠನಾದ ಎಂಪೆರುಮಾನರು ಮೂರು ಲೋಕಗಳನ್ನೂ ಮೂಲಭೂತವಾಗಿ ರಕ್ಷಿಸಲು ಅವುಗಳನ್ನು ಒಂದು ನಿಶ್ಚಯವಾದ ರೀತಿಯಲ್ಲಿ ತನ್ನ ದಿವ್ಯ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ತದ್ವಿರುದ್ಧವಾದ ವಸ್ತುಗಳನ್ನು ಒಂದಾಗಿರಿಸಿಕೊಳ್ಳಲು ಶಕ್ತಿಯಿದೆ. ಅವರಿಗೆ ಶ್ರೀಯಃ ಪತಿತ್ವಮ್ ಇರುವುದರಿಂದ ಮೋಹದಿಂದ ನನ್ನ ಸೇವೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸಲು ತಾವು ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈನಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ‘ಒರುಮಾ ‘ ಎಂದರೆ ಸಣ್ಣದಾದ ಮುಖ್ಯವಲ್ಲದ ಒಂದು ಭಾಗ (ಅವರ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ) ಎಂದು ಅರ್ಥ.

ಏಳನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ತಮ್ಮ ಏಳ್ಗೆಗೆ ಕಾರಣವಾದ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈನನ್ನು ಹೊಗಳುತ್ತಾರೆ,

ಅರುಳೈ ಈ ಎನ್ನಮ್ಮಾನೇ ಎನ್ನುಮ್ ಮುಕ್ಕಣ್ ಅಮ್ಮಾನುಮ್,
ತೆರುಳ್ ಕೊಳ್ ಪಿರಮನಮ್ಮಾನುಮ್ ದೇವರ್ ಕೋನುಮ್ ತೇವರುಮ್,
ಇರುಳ್‍ಗಳ್ ಕಡಿಯುಮ್ ಮುನಿವರುಮ್ ಏತ್ತುಮ್ ಅಮ್ಮಾನ್ ತಿರುಮಲೈ,
ಮರುಳ್‍ಗಳ್ ಕಡಿಯುಮ್ ಮಣಿಮಲೈ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ಮಲೈಯೇ ॥


ಎಂಪೆರುಮಾನರು ಈ ರೀತಿಯಾಗಿ ಹೊಗಳಲ್ಪಡುತ್ತಾರೆ. “ ಓಹ್! ನನ್ನ ಸ್ವಾಮಿಯೇ! ಕರುಣೆಯಿಂದ ದಯೆತೋರು “ ಎಂದು ಜ್ಞಾನ ಮುಂತಾದುವುಗಳನ್ನು ಹೊಂದಿರುವ ಮೂರುಕಣ್ಣುಗಳಿರುವ ರುದ್ರನು ಮತ್ತು ಸೃಷ್ಟಿಗೇ ಕರ್ತೃ ಮತ್ತು ಮೂಲಭೂತನಾಗಿರುವ ಬ್ರಹ್ಮನು , ದೇವ ದೇವತೆಗಳಿಗೆಲ್ಲಾ ಮತ್ತು ಪುರಾಣಗಳಿಂದ ಅಂಧಕಾರವನ್ನು ದೂರ ಮಾಡುವ ಋಷಿಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸುವ ಇಂದ್ರನಿಂದ ಪೂಜಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ದಿವ್ಯ ಪರ್ವತವು ಅಂತಹ ಎಂಪೆರುಮಾನರ ಒಂದು ವಾಸಸ್ಥಾನವಾಗಿದೆ. ಅಂತಹ ದಿವ್ಯ ಬೆಟ್ಟವು ಅವಿದ್ಯಾ (ಅಜ್ಞಾನ) ಮುಂತಾದುವುಗಳು ನಮ್ಮ ಗುರಿಯನ್ನು ತಲುಪಲು ತೊಂದರೆಗಳನ್ನುಂಟುಮಾಡುವ ಅನೇಕ ಅಡಚಣೆಗಳನ್ನು ದೂರಮಾಡುತ್ತದೆ. ಮತ್ತು ವಿಶಿಷ್ಟವಾಗಿ ಪರಮ ಆನಂದವನ್ನು ನೀಡುತ್ತದೆ. ಅದೇ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈ.

ಎಂಟನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ಗುಡಿಗಳ ಮೇಲೆ ಅವನಿಗಿರುವ ಆಸೆಯನ್ನು ನನ್ನ ಅಂಗಗಳ ಮೂಲಕ ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತಾನೆ. ತಿರುಮಲೈನನ್ನು ಮೊದಲುಗೊಂಡು. ಅವನು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಒಂದು ನಿಮಿಷವೂ ಅಗಲಲಾರ. ಎಂತಹ ಅದ್ಭುತವಾದ ಸ್ಥಿತಿ ಇದು.”

ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ಮಲೈಯೇ ತಿರುಪ್ಪಾಱ್ಕಡಲೇ ಎನ್‍ತಲೈಯೇ,
ತಿರುಮಾಲ್ ವೈಕುನ್ದಮೇ ತಣ್ ತಿರುವೇಂಙ್ಗಡಮೇ ಎನದುಡಲೇ,
ಅರು ಮಾಮಯತ್ತೆನದುಯಿರೇ ಮನಮೇ ವಾಕ್ಕೇ ಕರುಮಮೇ,
ಒರುಮಾನೊಡಿಯುಮ್ ಪಿರಿಯಾನ್ ಎನ್ನೂೞಿಮುದಲ್ವನೊರುವನೇ ॥


ಎಂಪೆರುಮಾನರು ಎಲ್ಲದಕ್ಕೂ ಕಾರಣಕರ್ತರಾಗಿರುವರು. ಅವುಗಳು ಕಾಲದ ಅಧೀನದಲ್ಲಿರುವುದು. ನನ್ನನ್ನು ಹೊಂದಲು ಅವರು ಒಂದು ಘಳಿಗೆಯೂ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈ ಬೆಟ್ಟವು , ತಿರುಪ್ಪಾರ್ಕಡಲ್ ,ನನ್ನ ತಲೆಯು , ಅದರಿಂದ ಅಗಲಲಾರರು. ಅದು ಪರಮಪದಮ್ ಅಲ್ಲಿ ಅವರು ಶ್ರೀಯಃಪತಿಯಾಗಿ , ಶ್ರಿಯಾಸಾರ್ದಮ್ ನಲ್ಲಿ ಹೇಳಿರುವ ಹಾಗೆ ಶಾಶ್ವತವಾಗಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಉತ್ತೇಜಕವಾದ , ಪೆರಿಯ ತಿರುಮಲೈ , ನನ್ನ ದೇಹವು, ಅಲ್ಲಿ ನನ್ನ ಆತ್ಮವು ಕೈಗೆಟುಕದ ಶ್ರೇಷ್ಠವಾದ ಅದ್ಭುತವಾದ ಪ್ರಕೃತಿಯೊಂದಿಗೆ, ನನ್ನ ಮನಸ್ಸು , ನನ್ನ ಮಾತುಗಳು ಮತ್ತು ನನ್ನ ಕ್ರಿಯೆಯು ಮಿಲನವಾಗಿದೆ. ಎಂತಹ ವಿಶಿಷ್ಠವಾದವನು ಅವನು. ಪ್ರತಿಯೊಂದು ವಾಕ್ಯದ ಅಂತ್ಯದಲ್ಲಿರುವ ‘ಏ’ ಕಾರಮ್ ಅವನಿಗೆ ನನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಸಂಗತಿಯೂ ಎಂತಹ ಪ್ರಿಯವಾಗಿದೆ ಎಂದು ಸೂಚಿಸುತ್ತದೆ.

ಒಂಬತ್ತನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ತಮ್ಮ ದಿವ್ಯ ಹೃದಯಕ್ಕೆ ಹೇಳುತ್ತಾರೆ, “ನಮಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಂಪತ್ತೂ ತಿರುಮಲೈನಿಂದ ದೊರಕಿದೆ. ಆದ್ದರಿಂದ ಇಲ್ಲಿಂದ ಹೋಗುವುದು ಬೇಡ.” ಎಂದು ಮತ್ತು ಎಂಪೆರುಮಾನರ ತಮ್ಮನ್ನು ದೇಹ ಸಮೇತವಾಗಿ ತಿರುನಾಡಿಗೆ(ಪರಮಪದಕ್ಕೆ) ಕರೆದೊಯ್ಯಲು ಇರುವ ಆಸೆಯನ್ನು ತಿಳಿದು ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ, “ನೀನು ಈ ದೇಹವನ್ನು ಇಲ್ಲಿಯೇ ವಿಸರ್ಜಿಸಿ ಅದನ್ನು ತೊರೆದು ನನ್ನನ್ನು ಪರಮಪದಕ್ಕೆ ಕರೆದೊಯ್ಯಬೇಕು” ಎಂದು ಹೇಳುತ್ತಾರೆ.

ಊೞಿ ಮುದಲ್ವನೊರುವನೇ ಎನ್ನುಮ್ ಒರುವನ್ ಉಲಗೆಲ್ಲಾಮ್,
ಊೞಿದೋಱುಮ್ ತನ್ನುಳ್ಳೇ ಪಡೈತ್ತು ಕ್ಕಾತ್ತು ಕ್ಕೆಡುತ್ತುೞಲುಮ್,
ಆೞಿವಣ್ಣನ್ ಎನ್ನಮ್ಮಾನ್ ಅನ್ದಣ್ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ,
ವಾೞಿ ಮನಮೇ ಕೈವಿಡೇಲ್ ಉಡಲುಮ್ ಉಯಿರುಮ್ ಮಙ್ಗ ಒಟ್ಟೇ ॥


ಓಹ್! ಹೃದಯವೇ ! ನಮ್ಮ ದೇಹ, ಪ್ರಾಣ ವಾಯು ಮುಂತಾದುವುಗಳು ನಶ್ವರವಾದ ವಸ್ತುಗಳು. ಅವುಗಳನ್ನು ಬಿಟ್ಟು, ಉತ್ಸಾಹ ಭರಿತವಾದ ಸುಂದರ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈಗೆ ಬಂದು ಸೇರಬೇಕು. ಅದು ನನ್ನ ಸ್ವಾಮಿಯ ಸರಿಯಾದ ಸಂಬಂಧ ಹೊಂದಿರುವ ನೆಲೆಯಾಗಿದೆ. ಅವನು ವಿಶಿಷ್ಟವಾದ ಏಕಮೇವ ಕಾರಣನು ಈ ಕಾಲದ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರುವ ಸಮಸ್ತ ಸೃಷ್ಟಿಗೆ. ಅದನ್ನು ‘ಕಾರಣ ವಾಕ್ಯಮ್’ ನಲ್ಲಿ ಹೇಳಿರುವ ಹಾಗೆ ಅವನು ‘ಏಕಮೇವ’ ನಾಗಿರುವನು. ಅವನು ಅಪರಿಮಿತನಾಗಿ, ಎಲ್ಲಾ ಲೋಕಗಳನ್ನು ದೈನಂದಿನ ಸೃಷ್ಟಿಕರ್ತನು, ರಕ್ಷಕನು, ಪೋಷಕನು ಮತ್ತು ನಾಶಮಾಡುವವನು. ಅವನು ತನ್ನ ದಿವ್ಯ ಇಚ್ಛೆಯ ಒಂದು ಸಣ್ಣ ಭಾಗದಿಂದ ಇದನ್ನು ಪೂರೈಸುವನು. ನಿನ್ನ ಆಸೆಯು ತೀರುವವರೆಗೆ ಬಿಡಬೇಡ. ಇಂತಹ ದಿವ್ಯವಾದ ಬೆಟ್ಟಕ್ಕೆ ಶರಣುಹೊಂದಿ ಅನೇಕ ವರ್ಷಗಳ ಕಾಲ ಬದುಕು. ‘ಆೞಿ ವಣ್ಣನ್ ‘ ಎಂದರೆ ‘ಅವನ ದಿವ್ಯ ರೂಪ ಅಪರಿಮಿತವಾಗಿ ಆನಂದಭರಿತವಾದುದು’ ಎಂದು ಅರ್ಥ.

ಹತ್ತನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸಿದರೂ, ಎಂಪೆರುಮಾನರು ಆಳ್ವಾರರ ದೇಹದ ಮೇಲಿನ ಆಸೆಯಿಂದ ಅವರ ಕೋರಿಕೆಯನ್ನು ಒಪ್ಪಲಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಮೂಲವಸ್ತುಗಳಿಂದ ಮಾಡಿದ ಪ್ರಕೃತಿಯನ್ನು ತಿಳಿಸಿ, ಅದು ತ್ಯಜಿಸಲ್ಪಡುವುದು ಎಂದು ಅದನ್ನು ದಯವಿಟ್ಟು ನಿರ್ಮೂಲನೆ ಮಾಡುವಂತೆ ಏಕೆಂದರೆ ಅದರ ಮೇಲೆ ತನಗೆ ಸ್ವಲ್ಪವೂ ಆಸೆಯಿಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ.

ಮಙ್ಗವೊಟ್ಟುನ್ ಮಾಮಾಯೈ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ಮೇಯ,
ನಙ್ಗಳ್‍ಕೋನೇ ಯಾನೇ ನೀಯಾಗಿ ಎನ್ನೈ ಅಳಿತ್ತಾನೇ,
ಪೊಙ್ಗೆಮ್ ಪುಲನುಮ್ ಪೊಱಿಯೈನ್ದುಮ್ ಕರುಮೇನ್ದಿರಿಯಮ್ ಐಮ್ಬೂದಮ್,
ಇಙ್ಗು ಇವ್ವುಯಿರೇಯ್ ಪಿರ ಕಿರುತಿ ಮಾನಾಙ್ಗಾರ ಮನಙ್ಗಳೇ ॥


ಓಹ್! ಶಾಶ್ವತವಾಗಿ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವವನೇ! ನನ್ನಂತಹವರಿಗೆ ಸ್ವಾಮಿಯಾಗಿರುವವನೇ! ನಿನಗೂ ನನಗೂ ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲದೇ, ನಾನು ನನ್ನ ರಕ್ಷಕನಿಗೇ ಸಲಹೆ ಕೊಡುವಂತೆ, ದಯವಿಟ್ಟು ಈ ಅದ್ಭುತವಾದ ಪ್ರಕೃತಿಯನ್ನು ಮತ್ತು ಈ ಪ್ರಕೃತಿಯ ಮಾಯೆಯನ್ನು ನನ್ನಿಂದ ದೂರಗೊಳಿಸು. ಅದು ಐದು ರೀತಿಯ ಹೆಚ್ಚುವರಿಯಾಗುವ ಆನಂದವನ್ನು ಕೊಡುವ ಅಂಶಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ. ಅವುಗಳು ,ಶಬ್ದ, ಸ್ಪರ್ಶ, ರೂಪ, ರುಚಿ ಮತ್ತು ವಾಸನೆ. ಐದು ರೀತಿಯ ಪಾಶಗಳಾದ , ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳು ಅವು ಕಣ್ಣುಗಳು, ಕಿವಿಗಳು, ಮೂಗು, ನಾಲಿಗೆ ಮತ್ತು ಚರ್ಮ, ಐದು ಕರ್ಮೇಂದ್ರಿಯಗಳು ಅಂತಹ ಕೆಲಸಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡುವುದು. ಪಂಚಭೂತಗಳು ಅವು ಭೂಮಿ, ನೀರು, ಅಗ್ನಿ, ವಾಯು ಮತ್ತು ಆಕಾಶ ಅವುಗಳು ನಮ್ಮ ದೇಹದ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣವಾದುವುಗಳು , ಅವುಗಳು ನಮ್ಮ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿವೆ. ಮೂಲಭೂತ ಅಂಶಗಳು ನಮ್ಮ ಆತ್ಮವನ್ನು ಈ ಸಂಸಾರದಲ್ಲಿ ಬಿಗಿಯಾಗಿ ಬಂಧಿಸಿವೆ. ‘ಮಹಾನ್’ ಎಂಬುದು ಸೃಷ್ಟಿಗೆ ಪೂರಕವಾಗಿದೆ, ‘ಅಹಂಕಾರ’ ಎಂಬುದು ತರ್ಕಬುದ್ಧಿ ಮತ್ತು ನಾನು ಎಂಬುದರ ಪೂರಕವಾಗಿ ಸಂಕಲ್ಪದ ಕಾರಣವಾಗಿದೆ.

ಹನ್ನೊಂದನೆಯ ಪಾಸುರಮ್:
ಈ ಪದಿಗೆಯಲ್ಲಿ ಮಹತ್ ಮತ್ತು ಅಹಂಕಾರಮ್‍ನನ್ನು ತಿರುಮಲೈನಲ್ಲಿ ನಿಂತು ವಿವರಿಸಲಾಗಿದೆ.

ಮಾನಾಙ್ಗಾರ ಮನಮ್ ಕೆಡ ಐವರ್ ವನ್‍ಕೈಯರ್ ಮಙ್ಗ ,
ತಾನಾಙ್ಗಾರಮಾಯ್ ಪ್ಪುಕ್ಕು ತ್ತಾನೇ ತ್ತಾನೇ ಯಾನಾನೈ,
ತೇನಾಙ್ಗಾರ ಪ್ಪೊೞಿಲ್ ಕುರುಗೂರ್ ಚ್ಚಡಗೋಪನ್ ಶೊಲ್ಲಾಯಿರತ್ತುಳ್,
ಮಾನಾಙ್ಗಾರತ್ತಿವೈಪತ್ತುಮ್ ತಿರುಮಾಲಿರುಞ್ಜೋಲೈ ಮಲೈಕ್ಕೇ ॥


ಶ್ರೇಷ್ಠವಾದ ಅಭಿಮಾನವನ್ನು ಹೊಂದಿರುವ ಎಂಪೆರುಮಾನರು, ಐದು ಇಂದ್ರಿಯಗಳನ್ನು ನಾಶ ಪಡಿಸಿ, ದೇಹದೊಂದಿಗೆ ಮಹಾನ್, ಅಹಂಕಾರಮ್ ಮತ್ತು ಮನಸ್ಸಿನ ಮೂಲಕ ಸಂಪರ್ಕ ಹೊಂದಿ, ನನ್ನೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿ, ನಾನೇ ಮತ್ತು ನನಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಸ್ತುಗಳೇ ಆಗಿದ್ದಾರೆ. ಹೆಮ್ಮೆಯಿಂದ ನಿಂತಿರುವ ತೋಟಗಳಿಂದ ಕೂಡಿದ , ದುಂಬಿಗಳಿಂದ ಆವೃತ್ತವಾದ ಆಳ್ವಾರ್ ತಿರುನಗರಿಗೇ ನಾಯಕರಾದ ನಮ್ಮಾಳ್ವಾರರು ಈ ಹತ್ತು ಪಾಸುರಗಳನ್ನು ಸಾವಿರ ಪಾಸುರಗಳೊಂದಿಗೆ ತಿರುಮಾಲಿರುಂಚೋಲೈಗಾಗಿಯೇ ಕರುಣೆಯಿಂದ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಪದಿಗೆಯು ಮಹತ್ ಮತ್ತು ಅಹಂಕಾರಮ್‍ನ ಎಲ್ಲಾ ತೊಂದರೆಗಳನ್ನೂ ಕೇಂದ್ರೀಕರಿಸಿ ಹೇಳುತ್ತದೆ. ಇದರ ಅರ್ಥ ಈ ಪಾಸುರಗಳನ್ನು ಕಲಿತವರಿಗೆ , ಮಹತ್ ಮತ್ತು ಅಹಂಕಾರಗಳು ಮುಂತಾದ ತೊಂದರೆಗಳು ಸಹಜವಾಗಿ ತೊರೆದು ಹೋಗುತ್ತವೆ.

ನಮ್ಮಾಳ್ವಾರ್ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಮ್

ಅಡಿಯೇನ್ ಕುಮುದವಲ್ಲಿ ರಾಮಾನುಜ ದಾಸಿ

ಮೂಲ : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-7-simple/

ಆರ್ಕೈವ್ ಮಾಡಲಾಗಿದೆ : http://divyaprabandham.koyil.org

ಪ್ರಮೇಯಂ (ಲಕ್ಷ್ಯ) – http://koyil.org
ಪ್ರಮಾಣಂ (ಧರ್ಮಗ್ರಂಥಗಳು) – http://granthams.koyil.org
ಪ್ರಮಾತಾ (ಬೋಧಕರು) – http://acharyas.koyil.org
ಶ್ರೀವೈಷ್ಣವ ಶಿಕ್ಷಣ/ಮಕ್ಕಳ ಪೋರ್ಟಲ್ – http://pillai.koyil.orgకోయిల్ తిరువాయ్మొళి – 5.8 – ఆరావముదే

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 5.7 – నోఱ్ఱ

సిరీవరమంగళనగర్లోని వానమామలై భగవానుడి వద్ద సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కూడా, తన ఎదుట భగవానుడు ప్రత్యక్షము కాలేదని నమ్మాళ్వార్లు గమనించి, “బహుశా తిరుక్కుడందైలోని భగవానుడు తన శరణాగతిని స్వీకరిస్తాడు” అని భావించి, తన అనన్యగతిత్వ (ఏ ఇతర ఆశ్రయం లేకపోవడం) స్థితి గురించి నొక్కి చెబుతూ తిరుక్కుడందై ఆరావముదన్ భగవానుడికి శరణాగతి చేస్తారు.

మొదటి పాశురము: “నీతో నాకున్న నిరపేక్ష సంబంధాన్ని మరియు నన్ను కరిగింపజేసి నాకు అతి సంతోషాన్ని కలిగించే  నీ అనన్య సౌందర్యాన్ని, నీవు తిరుకుడందైలో శయనించి ఉండగా నేను దర్శించాను” అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

ఆరావముదే అడియేన్‌ ఉడలం  నిన్‌ పాల్‌ అన్బాయే
నీరాయ్‌ అలైందు కరైయ ఉరుక్కుగిన్ఱ నెడుమాలే
శీరార్‌ శెన్నెల్‌ కవరి వీశుం శెళు నీర్‌ త్తిరుక్కుడందై
ఏరార్‌ కోలం తిగళ క్కిడందాయ్‌ కండేన్‌ ఎమ్మానే

నిరపేక్షుడైన ఆ దేవుడు నా భగవానుడు, నిత్యమూ అతడిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు; ఓ!  అపరిత పరమానందము ఉన్న భగవానుడా! నీ పట్ల ప్రేమంతా ఒక స్వరూపముగా రూపుదిద్దుకున్నా ఈ నా శరీరాన్ని కరిగించి నీరుగా మారాలని నీవు నన్ను కలవరపరచి ప్రేరేపిస్తున్నావు; పుష్కలమైన నీటి వనరులతో సమృద్ధమైన పంటలతో సుఖవంతముగా ఉన్న తిరుక్కుడందైలో నీవు విశ్రామిస్తున్నావు; దివ్య అలంకరణతో నీ సౌందర్యము దివ్యంగా ప్రకాశిస్తుంది; నేను నా స్వంత కళ్ళతో వీక్షించి ఆనందించాను. అంటే – ఆళ్వారు భగవానుడిని దర్శించారు కానీ, వారితో ఇంకా సంభాషించలేదు అని సూచిస్తుంది.

రెండవ పాశురము:  “నీవు భక్తవత్సలుడిగా నీ భక్తుల కోసమే ఎన్నో అవతారాలు ఎత్తావు, కానీ ఆ కరుణతో నా వైపు చూడటం లేదు; నేను ఏమి చేయాలి?” అని ఆళ్వారు అడుగుతున్నారు.

ఎమ్మానే ఎన్‌ వెళ్ళై మూర్తి  ఎన్నై ఆళ్వానే
ఎమ్మా ఉరువుం వేండుం ఆట్రాల్‌, ఆవాయ్‌ ఎళిల్‌ ఏఱే
శెమ్మా కమలం శెళు నీర్‌ మిసై క్కణ్‌ మలరుం  తిరుక్కుడందై
అమ్మా మలర్కణ్‌ వళర్గిన్ఱానే ఎన్నాన్‌ శెయ్గేనే?

ఎంబెరుమానుడైన నా భగవానుడు, నాకు సత్వ గుణాన్ని ప్రసాదించగల శుద్ద స్వరూపుడు; అతడిని అనుభవిస్తూ ఆనందాన్ని పొంది, నా స్వభవాన్ని నేను కోల్పోకుండా ఉండేందుకు అతడు తన రూపాన్ని నాకు చూపిస్తున్నాడు; అతడు తన కోరిక మేరకు అన్ని జాతులలో అనేక రకాల అవతారములను ధరించాడు; “పుంసాం దృష్ఠి చిత్తాపహారిణమ్” లో చెప్పినట్లు, ఆ రూపాల్లోని సౌందర్యముతో చూసేవాళ్ళ  హృదయాలను బంధిస్తూ గంభీరంగా గోచరిస్తాడు; విశేషమైన దివ్య కమల నేత్రములతో,

ఎర్రటి పెద్ద పెద్ద తామర పువ్వులు పుష్కలంగా ఉన్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్నవాడా! నేను ఏమి చేయాలి? అనేక కమల పుష్పాలు  వికసిస్తున్నప్పటికీ, నీ రెండు కమల పువ్వులు (నేత్రాలు) నన్ను చూసి వికసించట్లేదు అని అర్థము.

మూడవ పాశురము:  “అకించనుడిని (ఖాళీ చేతులున్న) అయిన నేను, నీ ద్వారా తప్పా మరెవరి నుండి నా కోరికలు నెరవేరకూడదనుకుంటున్నాను; నన్ను ఇలా మలచిన నీవు, నేను ఎప్పటికీ నీ దివ్య పాదాలకు సేవ చేసేలా చేయాలి ” అని ఆళ్వారు అంటున్నారు.

ఎన్‌ నాన్ శెయ్గేన్‌ యారే కళై కణ్‌, ఎన్నైఎన్‌ శెయ్గిన్ఱాయ్
ఉన్నాల్‌ అల్లాల్‌ యావరాలుం ఒన్ఱుం కుఱై వేండేన్
కన్నార్‌ మదిళ్‌ శూళ్‌ కుడందై క్కిడందాయ్‌ అడియేన్‌ అరువాణాళ్
శెన్నాళ్‌ ఎన్నాళ్‌ అన్నాళ్‌ ఉన తాల్ పిడిత్తే శెలక్కాణే

నన్ను నేను రక్షించుకోవడానికి నేనేమి చేయాలి! ఇంకెవరు నాకు రక్షకుడు? నీవు నన్ను ఏమి చేయాలనుకుంటున్నావు? నా కోరికలు నెరవేర్చమని నిన్ను తప్పా మరెవరినీ ప్రార్థించను. దృఢమైన కోటతో చుట్టుముట్టి ఉన్న తిరుక్కుడందైలో దయతో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! ఎన్ని రోజులైనా సరే, నేను విముక్తుడిని అయ్యే సమయం వరకు, మీ దాసుడనైన నేను నీ దివ్య పాదాలను పట్టుకొని ఉండేలా చూడుము. ‘అరు’ అనగా అణు స్వరూపములో ఉన్న ఆత్మని సూచిస్తుంది.

నాల్గవ పాశురము: “సర్వేశ్వరుడవైన నీవు ఇక్కడ తిరుకుడందైలోకి దిగివచ్చి శయనించి ఉన్నా నిన్ను చూడలేకపోతున్నానని బాధపడుతున్నాను. నిన్ను చూడాలని కోరుకుంటున్నాను” అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

శెల క్యాణ్గిబ్బార్‌ కాణుం అళవుం శెల్లుం కీర్తియాయ్‌
ఉలప్పిలానే  ఎల్లా ఉలగుం ఉడైయ ఒరు మూర్తి
నలత్తాల్‌ మిక్కార్‌ కుడందై క్కిడందాయ్‌  ఉన్నై క్మాణ్బాన్నాన్‌
అలప్పాయ్‌ ఆగాశత్తె నోక్కి అళువన్‌ తొళువనే ॥

ఎంబెరుమాన్ అంతులేని గుణాలు, ఐశ్వర్యము ఉన్నవాడు. అతడు, ముందు చూపు సామర్థ్యము ఉన్నవారికి మించిన సామర్థ్యము కలవాడు;  సమస్థ లోకాలు తన సేవలో ఉన్నవాడు; మనకి అత్యున్నత లక్ష్యమైన ఒక విశేష స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు; మీ పట్ల గొప్ప ప్రేమ ప్రపత్తులు ఉన్నవారితో తయారైన తిరుక్కుడందైలో విశ్రామిస్తున్న ఓ భగవానుడా!  గొప్ప భక్తి ప్రపత్తులతో నిన్ను ఆరాధించే వారిలా, నిన్ను చూసి ఆనందించాలనే కాంక్షతో ఆకాశం వైపు చూస్తూ దుఃఖిస్తున్నాను. చిన్నపిల్లవాడిలా ఏడ్చుట, పరిపక్వమైన వ్యక్తిలా ఆరాధించుట అని వివరించబడింది.

ఐదవ పాశురము:  “నిన్ను చూడాలనే కోరికతో, నీ దయను పొందాలని నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఇంకా నిన్ను చూసే భాగ్యము నాకు కలుగలేదు; నీ దివ్య పాదాలను నేను పొందేలా నీవే చూడాలి” అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

అళువన్‌ తొళువన్‌ ఆడి క్కాణ్బన్‌ పాడి అలత్తువన్‌
తళువల్‌ వినైయాల్‌ పక్కం నోక్కి నాణి క్కవిళ్ న్దిరుప్పన్‌
శెళు వొణ్‌ పళన క్కుడందై క్కిడందాయ్‌  శెన్‌ తామరై క్కణ్ణా
తొళువనేనై ఉన తాల్ శేరుం వగైయే శూళ్‌ కండాయ్

నన్ను ఆవహించిన ఈ ప్రేమ కారణంగా దిక్కులు చూస్తూ నేను ఏడుస్తున్నాను, పూజిస్తున్నాను, నృత్యం చేస్తున్నాను, పాడుతున్నాను, అనవసరంగా వాగుతున్నాను, తరువాత సిగ్గుతో తలవంచుకుంటున్నాను. ఎర్రటి దివ్య కమల నేత్రాలతో, పుష్కలమైన నీటితో నిండిన ఆకర్షణీయమైన పొలాలు ఉన్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! అతి అవసరమైన నీ దివ్య పాదాలను నేను చేరుకోవడానికి తగిన మార్గాన్ని దయచేసి వెదుకుము.

ఆరవ పాశురము: “నేను నీకు ఆకర్షితుడనై నీ అనుభవములో మునిగి ఉన్నందున, ఇతర ప్రాపంచిక వ్యవహారములలో నేనిక ఉండలేను,  కాబట్టి నిన్ను పొందడంలో నాతోవలో ఉన్న అడ్డంకులను తొలగించాలి, నిన్ను చేరగల సాధనాలను నాకు తెలియకుండానే నాకు అనుగ్రహించి దయతో ఆ మార్గాలు నాకు పని చేసేలా చూడు” అని ఆళ్వారు అంటున్నారు.

శూళ్ కండాయ్‌ ఎన్‌ తొల్లై వినైయై అఱుత్తు ఉన్‌ అడి శేరుం
ఊట్‌ కండిరుందే తూరాక్కుళి తూర్తు ఎనై నాళ్‌ అగన్ఱిరుప్పన్‌
వాళ్‌ తొల్‌ పుగళార్‌ కుడందై క్కిడందాయ్ వానోర్‌ కోమానే
యాళిన్‌ ఇశైైయే  అముదే అఱివిన్‌ పయనే అరియేఱే

కృపతో తిరుక్కుడందైలో శయనిస్తున్న ఓ భగవానుడా! నిత్యసూరుల నియామకుడివి నీవు; సంగీత వాయిద్యం ‘యాళ్’ యొక్క అతి సుందర రమనీయమైన రాగము నీవు; నిత్యమూ రుచికరమైన తేనెలాంటివడవు నీవు, స్తుతులచే (ప్రశంసలు) నాలుకకు ఆనందకరమైనవాడవు నీవు;  జ్ఞానం యొక్క ఫలితము కనుక నీవు  మనసుకి ఆహ్లాదకరమైనవాడవు నీవు; అయినప్పటికీ, నీవు సింహాలలో ఉత్తముడవు, అవగాహనకి అందలేని గొప్పవాడవు; నీ దివ్య చరణాలను చేరుకోవటానికి ప్రాచీన మార్గాలని చూసిన తరువాత, కేవలము నీ కొరకే వేచి ఉన్న నేను, నాకు తగని ఈ కోరికల గొయ్యిలో నిన్ను విడిచి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? నా పై కృపతో నా గత పాపాలను నాశనము చేసి, నా స్వరూపానికి తగినదైన నీ దివ్య పాదాలను చేరుకోవడానికి నాకు సహాయపడుము.

ఏడవ పాశురము:  “కేవలము నీ కృప కారణంగానే, నీ సౌందర్యాన్ని నాకు వ్యక్తపరచి, నీకు సేవలు చేసుకుంటూ ఉండేలా నన్ను ఉంచారు; ఇప్పుడు, నీ దివ్య పాదాలు లేకుండా నేను ఉండలేను, కాబట్టి దయచేసి ఈ సంసారముతో నా సంబంధాన్ని తొలగించి నీ దివ్య పాదాలను నాకు ప్రసాదించుము”, అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

అరియేఱే ఎన్నం పొఱ్చుడరే  శెంగణ్‌ కరు ముగిలే
ఎరియే పవళ క్కున్దే నాల్‌ తోళ్‌ ఎందాయ్‌ ఉనదరుళే
పిరియా అడిమై ఎన్నై క్కొండాయ్‌ కుడందై త్తిరుమాలే
తరియేన్‌ ఇని ఉన్‌ శరణం తందు ఎన్‌ శన్మం కళైయాయే

అంతులేని తన స్వాతంత్ర్యము కారణంగా భగవానుడు గంభీరంగా కనిపిస్తున్నాడు, ఎర్రటి దివ్య నేత్రలతో, ముదురు మేఘ వర్ణముతో,  అగ్నిని పోలిన ఎర్రటి పొడవైన ముత్యపు దృఢ పర్వతములా ఉన్న నా ప్రభువు చతుర్భుజాలతో దర్శనమిస్తూ నన్ను తన సేవకుడిగా స్వీకరించాడు; తన కృపకు నన్ను ఎన్నడూ వేరు కాకుండా నా వాక్కు సేవలను స్వీకరించాడు;  లక్ష్మీ సమేతుడిగా తిరుక్కుడందైలో దర్శనమిస్తూ, నా సేవలను అందుకుంటున్న ఓ నా స్వామీ! నీవు పిరాట్టి సమేతుడిగా నా స్వరసేవలను అందుకుంటుండగా చూసిన పిదప నేనిక విశ్రాంతి తీసుకోను. ఈ శరీరంతో నా సంబంధాన్ని తొలగించి నీ దివ్య తిరువడిని నాకు ప్రసాదించుము.

ఎనిమిదవ పాశురము: “తరియేన్” (నేను ఉండలేను) అని పలికిన తరువాత కూడా ఎంబెరుమార్లు కనిపించ నందున అతను ఎంబెరుమార్ల గురించి ఆలోచించలేకపోయాడని ఆశ్చర్యపోతున్నాడు; “నీవు నాకు రక్షణ ఇవ్వక పోయినా ఫరవాలేదు కానీ! నీవు దయతో నేను ఎప్పటికీ నీ దివ్య పాదాలను ధ్యానించేటట్లు చేయాలి; నాకు ఇప్పుడు ఇది కావాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

కళైవాయ్‌ తున్బం కళైయాదొళివాయ్  కలైకణ్‌ మఱ్ఱిలేన్
వళై వాయ్‌ నేమి ప్పడైయాయ్‌ కుడందై క్కిడంద మా మాయా
తళరా ఉడలం ఎనదావి శరిందు పోం పోదు
ఇళైయాదున తాళ్‌ ఒరుంగ ప్పిడిత్తు  పోద ఇశై నీయే

‌ నీవు నా దుఃఖాలను తొలగించినా తొలగించక పోయినా నీవు తప్పా నాకు వేరే రక్షణ లేదు; దివ్య చక్రాయుధాన్ని ధరించి అద్భుత సౌందర్యము కలిగి తిరుక్కుడందైలో దయతో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! నా శరీరము బలహీనపడినప్పుడు, ప్రాణము వణుకుతూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే అంతిమ దశ వచ్చినప్పుడు, ఎట్టి పరిస్థితిలో మానసిక స్థితిని నేను కోల్పోకుండా నీ దివ్య పాదాలను  పట్టుకొని ఉండేలా అనుమతించుము.

తొమ్మిదవ పాశురము: “నిన్ను నేను స్వీకరించేలా కల్పించి, నీ దివ్య చరణములే నా లక్ష్యంగా నేను భావించేలా నీవు చేసి చూసి అనందించిన నీవు, నీ అందమైన శయనావస్థను నాకు చూపించినట్లే నీ అందమైన నడకను కూడా చూపించాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

ఇశైచిత్తెన్నై ఉన్‌ తాళ్‌ ఇణైక్కీళ్ ఇరుత్తుం అమ్మానే
అశైవిల్‌ అమరర్‌ తలైవర్‌ తలైవా ఆది ప్పెరుమూర్తి
తిశై విల్‌ వీశుం శెళు మా మణిగళ్‌ శేరుం తిరుక్కుడందై
అశైవిల్‌ ఉలగం పరవ క్కిడందాయ్‌ కాణ వారాయే

నీవు నా భగవానుడిగా, నీ దివ్య పాదాల యందు నన్ను ఉంచి ఆ దివ్య పాద యుగళియే నా లక్ష్యము మరియు సాధనమని అంగీకరించేలా చేశావు. నిత్య ముక్తులైన అనంత, గరుడ, విశ్వక్సేనులు, మరియు ఇతర నిత్యసూరుల నాయకులకు నాయకుడివి నీవు. నీవు సర్వకారకుడవు; నీవు అన్నింటి కన్నా గొప్ప రూపాన్ని కలిగి ఉన్నావాడవు;  అతి ఖరీదైన, అరుదైన, ఆకర్షణీయమైన రత్నాలు చేరి ఉండి, అన్ని దిశలలో తమ ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ, నిన్ను సాధించుట కష్టకరమన్న సందేహాన్ని తొలగించి, ఈ ప్రపంచము మొత్తము ప్రశంసించేలా చేస్తున్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! నిన్ను నేను దర్శించడానికి నీవు రావాలి. ‘అసైవు ఇల్ ఉలగం’ – అసైవు – దుఃఖ సాగరములో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచము అతడి సౌందర్యానికి ఆకర్షితమై అతడిని ప్రశంసిస్తుంది. ఇది పరమపదముని కూడా సూచిస్తుంది. లేదా తాను శయనించి ఉండగా తన దివ్య తిరుమేనిని (శరీరాన్ని) ఎడమ నుండి కుడికి పక్కకి మర్చుతుండగా ఆ భగవానుడిని ప్రశంసిస్తున్నట్లు చెప్పవచ్చు.

పదవ పాశురము:  “నీవు నాలో ఉన్నావు, అతి రుచిగా ఉన్నావు, కానీ నేను నిన్ను శారీరకంగా చూడలేకపోతున్నాను; నీవు అతిసులభునిగా ఉన్న అర్చావతారమునకు నేను శరణాగతి చేస్తున్నాను, నేను ఇంకా ఎంత కాలం ఈ దుఃఖముతో బాధపడాల్సి ఉంది?”, అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

వారావరువాయ్‌ వరుమెన్‌ మాయా  మాయా మూర్తియాయ్
ఆరావముదాయ్‌ అడియేన్‌ ఆవి అగమే తిత్తిప్పాయ్
తీరా వినైగళ్‌ తీర ఎన్నై ఆండాయ్‌ తిరుక్కుడందై
ఊరా ఉనక్కాట్‌ పట్టుం అడియేన్‌ ఇన్నం ఉళల్వేనో

నీ అతి సుందరమైన రూపం తో మా వైపు వస్తే  కళ్ళు చూసి ఆనందించడానికి  బదులుగా, నీ ఈ స్వరూపాన్ని దాటి  నీ అద్భుత గూణాలతో నా లోపల దర్శనమిస్తున్నావు; నా ఆత్మ యొక్క నివాసమైన నా హృదయంలో క్షీణించని నశించని నీ నిత్య మంగళ స్వరూపంతో  ఈ దాసుని మనస్సులో ఎంతో రుచిని కలిగిస్తున్నావు! తరగని నా పాపాలను నాశనం చేయడానికి నా స్వరసేవను స్వీకరించావు; విశిష్ట దివ్య దేశమైన తిరుక్కుడందైలో కొలువున్న ఓ నా భగవానుడా! వేరే ఏ ఆశ్రయము లేకుండా కేవలము నీ కోసమే ఉన్న నేను, నీ దాసుడను అయిప్పటికీ, మన మధ్య పరస్పరము ఎటువంటి దూరాలు ఉండకుండా, ఇంకా నేనిలా బాధపడుట అవసరమా?

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నేర్చుకున్నవారు, కాముక (ప్రియుడు) ని కామినులు (ప్రేయసి) కోరుకున్నట్లు, శ్రీవైష్ణవులకు ఆనందాన్ని కలుగచేస్తారు”, అని ఆళ్వారు అంటున్నారు.

 ఉళలై ఎన్బిన్‌ పేయ్బి ములైయూడు అవళై ఉయిర్‌ ఉండాన్‌
కళల్గళ్ అవైయే శరణాగ క్కొండ  కురుగూర్‌ చ్చడగోబన్‌
కుళలిన్‌ మలియ చ్చోన్న ఓర్‌ ఆయిరత్తుళ్‌ ఇప్పత్తుం
మళలై తీర వల్లార్ కామర్‌ మానేయ్‌ నోక్కియర్కే

పెద్ద చెక్క కమ్మీలను పోలిన ఎముకలున్న రాక్షసి స్థనము నుండి పాలు త్రాగినట్లు ప్రాణాన్నే త్రాగేసి సంకటముని తొలగించాడు కృష్ణ పరమాత్మ; ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్లు అటువంటి కృష్ణుడి దివ్య చరణాలను తన కోరిక తీరడానికి ఏకైక సాధనముగా భావించారు; అటువంటి ఆళ్వారు ఎంతో కృపతో పాడిన వేయి పాశురములలో రాగ శబ్దాలకు మూలమైన వేణువు కంటే తీయనైన ఈ విశిష్ట పదిగాన్ని పాడారు. ఈ పదిగాన్ని పఠించే వారికి అజ్ఞానము తొలగుతుంది. బ్రహ్మాలంకారాము [ముక్తి పొందిన ఆత్మలను అలంకరించడం] చేయు మృగ నయనీ అప్సరసలచే సేవించబడతారు.  అప్సరసలు తమ ప్రియమైనవారిని కోరుకునేట్లే, ఈ దశాబ్దాన్ని పఠించే భక్తులను శ్రీవైష్ణవులు కోరుకుంటారు – అని కూడా వివరించబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము:http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-8-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – 5.7 – నోఱ్ఱ

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 5.5 – ఎంగనేయో

అహమేవ పరంతత్వం

ఎంబెరుమాన్ తన పట్ల అణువు మాత్రము ప్రేమ ఉన్నాకూడా వచ్చి రక్షిస్తాడు, వచ్చి తననెందుకు రక్షించలేదని ఆళ్వారు ఆలోచిస్తున్నారు. తాను సొంత మార్గాలను అనుసరిస్తున్నాడని ఎంబెరుమాన్ ఆలోచిస్తున్నాడేమో నని భావించి, ఆళ్వారు తాను నిస్సహాయుడనని అల్పుడనని ప్రకటిస్తూ ఈ పదిగములో వానమామలై భగవానుడికి శరణాగతి చేస్తున్నారు.

మొదటి పాశురము:  “నిన్ను పొందడానికి  శాస్త్రంలో పేర్కొన్న ఉపాయముల విహీనుడిని నేను, నీవు లేకుండా జీవించలేను; నీ భక్తులతో కలిసి ఉండటానికి ఇష్టపడే నీవు, ఎల్లప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే నీ పరిధిలో నేను లేనా? ” అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

నోఱ్ఱ నోన్బిలేన్ నుణ్ణఱివిలేన్ ఆగీలుం ఇని ఉన్నై విట్టు ఒన్ఱుం
ఆఱ్ఱగిఱ్కిన్ఱిలేన్ అరవిన్ అణై అమ్మానే!
శేఱ్ఱు త్తామరై శెన్నెల్‌ ఊడు మలర్ శిరీవర మంగల నగర్
వీఱ్ఱిరుంద ఎందాయ్‌ ఉనక్కు మిగై అల్లేన్ అంగే (1)

కర్మయోగ ఫలితాన్ని పొందడానికి నేను కర్మ యోగం చేయలేదు; నా స్వరూప జ్ఞానము గురించి మరియు భగవత్ జ్ఞానము గురించి తెలిపే జ్ఞాన యోగమునూ నేను ఎరుగను; ఈ రెండు యోగముల ద్వారా సాధ్యమయ్యే భక్తి యోగం లేనప్పటికీ,  నీ గుణాలను ధ్యానించి ఆస్వాదించిన తర్వాత నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేకపోతున్నాను.  పచ్చని వరి చేనులతో, ఆకర్షణీయమైన లేత కమలములు నిత్యము వికసించే శ్రీవరమంగళ నగర్లో [వానమామలై / తోతాద్రి, నాంగునేరి అని కూడా పిలుస్తారు] నీ భక్తులను తక్షణమే కటాక్షించే  విలక్షణమైన రీతిలో ఆసీనుడై ఉన్న ఓ మహోపకారి! సర్వరక్షకుడైన మీ ద్వారా రక్షించబడే, రక్షించదగిన ఆత్మల సమక్షంలో నేను లేనా?

రెండవ పాశురము:  “నీ దివ్య చరణాలను పొందడంలో అడ్డంకులు ఏమైనా ఉంటే, నీవే వాటిని తొలగించి, కృపతో నీవు నన్ను రక్షించాలి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

అంగుఱ్ఱేన్ అల్లేన్ ఇంగుఱ్ఱేన్ అల్లేన్ ఉన్నై క్కాణుం అవావిల్‌ వీళ్ళ్‌ందు నాన్
ఎంగుఱ్ఱేనుం అల్లేన్ ఇలంరై శెఱ్ఱ అమ్మానే
తింగళ్‌ శేర్మణి మాడ నీడు శిరీవర మంగలనగర్‌ ఉఱై
శంగు శక్కరత్తాయ్‌ ! తమియేనుక్కరుళాయే (2)

నిన్నే సాధనముగా ఉంచి శ్రేష్ఠమైన నీ నీలయములోకి నేనింకా ప్రవేశించలేదు.  సహనముతో ఓపికగా ఇప్పుడు ఉన్న చోట నేను ఉండనూ లేను. నిన్ను ఆస్వాదించిన తరువాత నేను నీ ప్రేమలో ఆకర్షితుడైయ్యి, ఈ ప్రాపంచిక జనులు ఉన్న స్థితిలో కూడా నేను ఉండనూ లేను. సీతా పిరాట్టికి అడ్డంకి అయిన లంకను నాశనం చేసి, ఆమెను తిరిగి పొందిన ఓ నా స్వామీ! నీ భక్తుల శత్రువులను నాశనము చేయడానికి, నీ భక్తులు కూడా ఆనందించే విశిష్ఠమైన ఆయుధాలున్న ఓ నా స్వామి, కెంపులతో ఆకాశములో చంద్రుని తాకేటంత ఎత్తైన భవనాలున్న శ్రీవరమంగళ నగర్లో నిత్య నివాసుడై ఉన్నవాడా! నీ తోడు తప్పా మరే దిక్కు లేని ఒంటరి నైన నన్ను దయతో ఆశీర్వదించు.

మూడవ పాశురము: “నీ ఆధిపత్యాన్ని వ్యక్తపరిచే విశిష్ఠమైన చిహ్నాలున్న నీవు నన్ను స్వీకరించి నీ సేవలో  నిమగ్నుడను చేసిన నీకు ప్రతిఫలముగా నేను ఎటువంటి సహాయం చేయలేను” అని ఆళ్వారు చెబుతున్నారు.

కరుళ పుట్కొడి శక్కర ప్పడై వాన నాడ! ఎన్ కార్ముగిల్‌ వణ్ణా
పారుళ్‌ అల్లాద ఎన్నై ప్పొరుళాక్కి  అడిమై కొండాయ్
తెరుళ్‌ కొళ్‌ నాన్మఱై వల్లవర్‌ పలర్‌ వాళ్ శిరీవర మంగలనగర్‌క్కు
అరుళ్‌ శెయ్దంగిరుందాయ్‌ ! అఱియేన్ ఒరు కైమ్మాఱే (3)

‌గరుడ పక్షిని తన ధ్వజంగా, దివ్య సుదర్శన చక్రము తన ఆయుధంగా, పరమపదము తన సామ్రాజ్యంగా కలిగి ఉన్నవాడు ఎంబెరుమాన్; నన్ను అనుగ్రహించిన నల్లని మేఘ వర్ణము కలిగి ఉన్నవాడు అతడు; ఆ రూపంతో,  “అసన్నేవ” (అచిత్) లో చెప్పినట్లుగా ఒక అచిత్ గా కూడా పరిగణించబడని నన్ను మార్చి నా స్వరూపాన్ని నేను గ్రహించేలా చేసి, నా వాచిక కైంకర్యమును స్వీకరించాడు. నాలుగు వేదాలలో ప్రావీణ్యం ఉన్న గొప్ప జ్ఞానులు నివసించే శ్రీవరమంగళ నగర్లో నిత్య నివాసుడవై ఉన్న నీకు ప్రతిఫలంగా కృతజ్ఞతతో నేను ఏమీ చేయలేను.

నాలుగవ పాశురము: “నా స్వఇచ్ఛతో భక్త వత్సలుడవైన నిన్ను నేను ఎలా పొందగలను?” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

మాఱు శేర్‌ పడై నూఱ్ఱువర్‌ మంగ ఓర్‌ ఐవర్‌ క్కాయన్ఱు మాయ ప్పోర్‌ పణ్ణి
నీఱు శెయ్ద ఎందాయ్‌   నిలంగీండ అమ్మానే!
తేఱు జ్ఞానత్తర్‌ వేద వేళ్వి యఱా చ్చిరీవర మంగలనగర్
ఏఱి వీఱ్ఱిరుందాయ్ ఉన్నై ఎంగెయ్ద కూవువనే (4)

దుర్యోధనుడు మొదలైనవాళ్ళు పాండవ శత్రువులుగా ఉన్నప్పుడు, పాండవ శ్రేయోభిలాషిగా, పాండవులకు సహాయం చేయాలనే దృఢ నిశ్చయంతో యుద్ధము నిర్వహించి దుర్యోధనుడు మొదలైన వాళ్ళను నేలమట్టం చేశావు; ప్రళయ కాలంలో వరాహమూర్తిగా నీవు భుమిని పైకి ఎత్తావు. శ్రీవరమంగళ నగర్లోకి ప్రవేశించి, స్పష్టమైన జ్ఞానం ఉన్నవారిచే నిరంతరం భగవత్ ఆరాధనలు అందుకుంటూ విలక్షణంగా విరాజిల్లుతున్న ఓ భగవానుడా! నేను నిన్ను ఎలా ప్రార్థించి పొందగలను?

ఐదవ పాశురము:  “భక్త వత్సలుడిగా  శత్రు నాశనం చేసేందుకు ఈ భూమిపైకి దిగి వచ్చే స్వభావము గల నిన్ను నేను ఎరుగుదును; అటువంటి స్వభావం గల నిన్ను పొందడానికి నేను నా సొంత ప్రయత్నము చేయుట నాకు సముచితమా?” అని ఆళ్వారు భగవానుడితో అంటున్నారు.

ఎయ్ద క్కూవుదల్‌ ఆవదే ఎనక్కు? ఎవ్వ దెవ్వవ్వత్తుళ్‌ ఆయుమాయ్‌ నిన్ఱు
నై తవంగళ్‌ శెయ్యుం కరుమేని అమ్మానే!
శెయ్ద వేళ్వియర్‌ వైయ త్తేవరఱా చ్చిరీవర మంగలనగర్
కై తొళ్ళ ఇరుందాయ్ అదు నానుం కణ్డేనే (5)

నిన్ను పొందడానికి నా కోరికను సాధనముగా భావించుట నాకు భావ్యమేనా? ఓ స్వామి! ప్రతికూలమైన రాక్షస సమూహాల వాళ్ళ మధ్య కలిసి, వాళ్ళ మధ్య నిలబడి బౌద్ద రూపాన్ని ధరించి మాయచేసిన ఓ నా స్వామి! నీవు కృతకృత్యులకి [వేదములలో చెప్పబడిన వాటిని అనుసరించేవారు] నిత్యము స్వామిగా మరియు భూమిపై నిత్యసూరులతో పోల్చదగిన  శ్రీవరమంగళ నగర్ దివ్యదేశపు నిత్యనివాసుడవు, వారందరిచే సేవలందుకుంటున్న వాడవు;  “అందువల్ల, నా అడ్డంకులను తొలగించి, నిన్ను నేను అనుభవించేలా చేయడం నీ కర్తవ్యం” అని ఆళ్వారు సూచిస్తున్నారు.

ఆరవ పాశురము:  “భక్త రక్షకుడవని విరాజిల్లుతున్న నీవు కనికరించి నిన్ను నేను సేవించి అనుభవించుటకు నావద్దకు రావాలి” అని ఆళ్వారు విన్నపిస్తున్నారు.

ఏనమాయ్‌ నిలం కీండ ఎన్నప్పనే  కణ్ణా ! ఎన్ఱుం ఎన్నై ఆళుడై
వాన నాయగనే  మణి మాణిక్క చ్చుడరే!
తేనమాం పాళిల్‌ తణ్‌ శిరీవర మంగలత్తవర్‌ కై తొళవుఱై
వానమామలైయే అడియేన్ తొళ వందరుళే (6)

వరాహ రూపాన్ని ధరించి భూమిని వెలికి తీసిన నీవు, కృష్ణునిగా, పరమపదములోని ఆనందం వలె ఆనందించే నా వాక్కు సేవలను అందుకుంటూ నన్ను సంరక్షిస్తూ;  అరుదైన మాణిక్యము వలె ప్రకాశిస్తూ నిత్యమూ తేనెలను కార్చే మామిడి తోటలతో నిండి ఉన్న  శ్రీవరమంగళ నగర్ దివ్య దేశములో నివసిస్తున్నావు, ఈ దివ్య దేశవాసులతో సేవలందుకుంటున్నావు. పరమవ్యోమ [శ్రీవైకుంఠము] నివాసితులు  ఆస్వాదించే విశాలమైన పర్వతాన్ని పోలిన దృఢ రూపాన్ని కలిగి ఉన్న ఓ నా స్వామీ!  నీ ఆసనాన్ని వదిలి నాపై కృపతో, నీ దాసిడనైన నా వద్దకు రా. వచ్చి నా సెవలనందుకో.

ఏడవ పాశురము: “నా ఉనికికి సంపూర్ణ కారకుడవైన నీవు నా నుండి వేరైయ్యి నా అస్థిత్వాన్ని నాశనం చేయవద్దు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

వందరుళి ఎన్ నెంజిడం గొండ వానవర్ కొళుందే  ఉలగుక్కోర్
ముందై తాయ్‌ తందైయే !  ముళు ఏళ్ ఉలగుం ఉండాయ్‌
శెందొళిలవర్‌ వేద వేళ్వి అఱా చ్చిరీవర మంగలనగర్
అందమిల్‌ పుగళాయ్‌ ! అడియేనై అగఱ్ఱేలే (7)

ఎంబెరుమాన్  దయతో నా వద్దకు వచ్చి నా హృదయాన్ని అతని నివాసంగా మార్చుకుని నన్ను సంరక్షించి పోషిస్తున్నాడు మరియు పరమపద నివాసితుల సంరక్షణను వృద్ది చేస్తున్నాడు; ఈ ప్రపంచానికే అతడు ప్రథమ తల్లి మరియు తండ్రి వంటివాడు; సమస్థ లోకాలను తన కడుపులో దాచుకొని రక్షకత్వము వహిస్తున్నాడు. అటువంటి అనంత కోటి గుణాలున్న ఎంబెరుమాన్,  కైంకర్య రూపముగా వేదానుసారంగా నీజాయతీ పరులచే  నిరంతరము  భగవత్ ఆరాధనలు అందుకుంటూ శ్రీవరమంగళ నగర్లో నివాసుడై ఉన్నాడు. దయచేసి నన్ను నీనుండి దూరం చేయవద్దు.

ఎనిమిదవ పాశురము:  “నేను నిన్ను బహిష్కరించానా?” అని ఎంబెరుమాన్ అడుగుతున్నారు. దానికి ఆళ్వారు “శబ్దము మొదలైన ప్రాపంచిక సుఖాలు అతి చురుకుగా పనిచేసే ఈ సంసారంలో నీవు నన్ను ఉంచారు; ఇది బహిష్కరించుట కాదా?” అని సమాధానమిస్తున్నారు.

అగఱ్ఱ నీ వైత్త మాయ వల్ ఐమ్బులంగళ్ ఆం అవై నన్గఱిందనన్
అగఱ్ఱి ఎన్నైయుం నీ అరుంజేఱ్ఱిల్‌ వీళ్తి కండాయ్‌
పగర్ క్కదిర్‌ మణి మాడ నీడి శిరీవరమంగై వాణనే ఎన్ఱుం
పుగఱ్కరియ ఎందాయ్‌  పుళ్ళిన్ వాయ్‌ పిళందానే ! (8)

నీ నుండి దూరమయ్యే వారిని బహిష్కరించడానికి, నీవు సృష్టించిన జయించలేని ఇంద్రియాలను నేను బాగా అర్థం చేసుకున్నాను. నీవు నన్ను కష్టకరమైన బురదలోకి నెట్టివేస్తున్నావేమోనని నేను భయపడుతున్నాను. ఓ! దగదగ మెరిసే మాణిక్యములతో నిర్మించబడిన ఎత్తైన భవనములున్న సిరీవరమంగై దివ్య దేశ నియామకుడా! బకాసురుని ముక్కును చీల్చిన ఓ నా స్వామీ!  “ఈ విధంగా ఎంబెరుమాన్  సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ, అతడు నాకు సహాయ పడకుండా నన్ను దూరంగా నెట్టివేస్తున్నాడు” అని ఆళ్వారు భావిస్తున్నారు. 

తొమ్మిదవ పాశురము:  “శత్రువులను నాశనం చేయుట వలన అనంత సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న నీవు, దయతో నన్ను ఉద్ధరించాలి” అని ఆళ్వారు భగవానుడికి విన్నపించుకుంటున్నారు.

పుళ్ళిన్ వాయ్‌ పిళందాయ్‌ !  మరుదిడై పోయినాయ్‌ ! ఎరుదేళ్‌ అడర్‌త్త ఎన్‌
కళ్ళ మాయవనే !  కరు మాణిక్క చ్చుడరే
తెళ్ళియార్‌ తిరు నాన్మఱైగళ్‌ వల్లార్ మలి తణ్‌ శిరీవరమంగై
ఉళ్‌ ఇరుంద ఎందాయ్‌ !  అరుళాయ్‌ ఉయ్యుమాఱెనక్కే (9)

అద్భుతమైన వ్యక్తిత్వమున్న ఓ ఎంబెరుమాన్! బకాసురుడిని, యమళ, అర్జున మరియు సప్త వృషభాలను (ఎద్దులను) వధించి రహస్యాంశాలను వెల్లడి చేసినవాడా; అందమైన నల్లని మాణిక్యమువలే మెరిసే స్వరూపము ఉన్నవాడా! నాలుగు వేదాలలో స్పష్టత మరియు నైపుణ్యం ఉన్నవారు నివసించే సిరీవరమంగై దివ్య దేశములో కొలువై ఉన్నవాడా! వేరే ఏ ఆశ్రయం లేని నాకు, నీ దివ్య పాదాలను పొందే ఉపాయాన్ని అనుగ్రహించి నన్ను నీవు ఉద్ధరించుము.

పదవ పాశురము:  “నా దివ్య చరణములే నన్ను పొందేందుకు మార్గాలు” అని ఎంబెరుమాన్  ఆళ్వారుకి తన పాదాలను చూపిస్తున్నారు. “దీనికి ప్రతిఫలంగా నేను నీకు ఏమీ చేయలేను” అని ఆళ్వారు బదులిస్తున్నారు.

ఆఱెనక్కు నిన్ పాదమే శరణాగ త్తందొళిందాయ్ ఉనక్కోర్‌
‌కైమాఱు  నాన్‌ ఒన్ఱిలీన్ ఎనదావియుం ఉనదే
శేఱు కొళ్‌ కరుమ్చుం పెరుం శెన్నెలుం మలి తణ్‌ శిరీవరమంగరై
నాఱు పూన్ తణ్‌ తుళాయ్‌ ముడియాయ్‌ ! దెయ్వనాయగనే  (10)

ఎత్తైన వరి చేనులు, పొడవైన చెరకు పంటలున్న సిరీవరమంగై దివ్య దేశములో నవోత్తేజమైన తుళసితో అలంకరించబడిన దివ్య కిరీటాన్ని ధరించి నిత్య నివాసుడై ఉన్న నిత్యసూరుల నాయకుడా! ఓ ఎంబెరుమాన్! ఆశ్రయించ తగినవి మరియు సాధించ యోగ్యమైన నీ దివ్య పాదాలను నాకు అనుగ్రహించావు; ప్రతిఫలంగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నా ఆత్మ నీదే.

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని భావపూరితముగా ఆనందంతో పఠించేవారు, నిత్యసూరులచేత ఎల్లప్పుడూ ఆనందించబడతారు” అని ఆళ్వారు తెలుపుతున్నారు. 

దెయ్వనాయగన్ నారణన్ తిరివిక్కిరమన్ అడి ఇణై మివై
కొయ్‌ కొళ్‌ పూం పొళిల్‌ శూళ్ కురుగూర్‌ చ్చడగోబన్
శెయ్ద ఆయిరత్తుళ్‌ ఇవై తణ్‌ శిరీవరమంగై మేయ పత్తుడన్
వైగల్‌ పాడ వల్లార్‌ వానోర్‌క్కారావముదే (11)

నిత్యసూరుల నాయకుడైన సర్వేశ్వరుడు, మాతృ భావముతో నిరపేక్ష సంబంధంతో అతడి అధీనులను స్వీకరిస్తారు; విరిసిన పుష్పాలతో విస్తరించిన ఉన్న ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్ పాడిన వెయ్యి పాసురములలో,  శక్తిని కలుగజేయు సిరీవరమంగై దివ్య దేశాన్ని ఉద్దేశించి ఆ ఎంబెరుమాన్ యొక్క దివ్య పాదాలపై కృపతో ఈ పది పాసురములను పాడారు. ఈ పదిగాన్ని అర్థానుసానములతో  పాడగలిగేవారు, నిత్యానందాన్ని అనుభవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము:http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-7-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 5.5 – ఎంగనేయో

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 4.10 – ఒన్ఱుం

ఆళ్వారు పరాంగుశ నాయకి యొక్క మానసిక స్థితిని ధరించి ‘మడల్’ (ఎంబెరుమాన్ తనను విడిచిపెట్టినట్లు బహిరంగంగా ప్రకటించుట) చేయటానికి బయలుదేరారు, రాత్రిలో చాలా బాధపడ్డారని, వేకువజామున కొంత స్పష్టతను పొందారని చెబుతున్నారు. తరువాత ఆమె తల్లులు మరియు స్నేహితులు ఆమెకు సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆమె వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. పైగా భగవానుడిని గురించి తలంచుకొని ఆనందిస్తూ,  అతడిని శారీరికంగా చూడలేకపోతున్నందుకు బాధ పడుతూ ఉంది. ఈ పదిగము ఆళ్వారు యొక్క సుఖ / దుఃఖము యొక్క ఫలితమని చెప్పవచ్చు. ఆళ్వారు ప్రత్యక్షము రూపంలో భగవానుడిని ఉరువెళిప్పాడు (ఊహించు కొని) ఈ పదిగాన్ని పాడారు. ఆళ్వారు ఇక్కడ నంబి ఎంబెరుమాన్ యొక్క అతి సుందర స్వరూపాన్ని పూర్తిగా ఇక్కడ ఆస్వాదించి పరమానందిస్తున్నారు.

మొదటి పాశురము: “నంబి విశేష అలంకరణ చిహ్నాలైన శంఖ చక్ర స్వరూపాలుగా ఉన్న ఆళ్వార్ల కొరకై, నా హృదయం ఆరాటపడుతుంది”. అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

ఎంగనేయో అన్నై మీర్గాల్ !  ఎన్నై మునివదు నీర్
నంగళ్‌ కోల త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్‌ కణ్డ పిన్
శంగినోడుం నేమియోడుం తామరై క్కణ్గళోడుం
శెంగని వాయ్‌ ఒన్ఱినోడుం శెల్గిన్ఱదెన్ నెంజమే

ఓ తల్లులారా! మీరు సంతోషముగా ఉండి, నాపై ప్రేమ వొలకబోయకుండా కోపం చూపుతున్నారు ఎందుకు? గుణ సంపూర్ణుడు, శంఖ చక్రములను ధరించి లేత కమలము వంటి ఆకర్షణీయమైన నేత్రాలతో, దొండపండు వంటి అధర సౌందర్యముతో తిరుక్కురుంగుడిలో ఉన్న అతి మనోహరుడైన నంబిని ఆస్వాదించిన తరువాత, నా హృదయం అతడికి ఆకర్షితమైపోయినది. ‘కోలం’ (ఆకర్షణీయమైన) కూడా తిరుక్కురుంగుడికి ఒక విశేషణంగా ఇక్కడ వివరించబడింది.

రెండవ పాశురము:  “దివ్య వక్షస్థలము, దివ్య భుజాలు, దివ్యాభరణాలలో అతడి (నంబి) సౌందర్యము నన్ను కమ్మివేసి వేదించేస్తుంది” అని పరాంగుశ నాయకి చెబుతుంది.

ఎన్నెంజినాల్‌ నోక్కి క్కాణీర్ ఎన్నై మునియాదే
తెన్నన్ శోలై త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
మిన్నుం నూలుం కుండలముం మార్బిల్‌ తిరుమఱువుం
మన్ను పూణుం నాంగు తోళుం వందెంగుం నిన్ఱిడుమే (2)

నన్ను ఆజ్ఞాపించేందుకు బదులు, నీవు నా మనస్సుతో నంబిని దర్శించి అనుభవించాలి; దక్షిణ దిక్కులో చుట్టూ చక్కని ఉద్యానవనములతో  ఉన్న తిరుక్కురుంగుడిలో వాసమున్న నంబిని  చూసిన తరువాత, అతడి వైభవానికి ప్రతీక అయిన యజ్ఞోపవీతము, అతడి దివ్య కర్ణాభరణములు, అతడి దివ్య వక్ష స్థలములో స్థిరమై ఎన్నడూ విడదీయరాని ఆభరణమైన శ్రీవత్సము, అతడిని విడువని అనేక దివ్య ఆభరణాలు మరియు అతడి దివ్య చతుర్భుజములు నన్ను అనుసరిస్తున్నాయి, నేను వెళ్ళే చోటికి నాతో వచ్చి నాతోనే ఉంటున్నాయి..

మూడవ పాశురము:  “శ్రీ శార్ంగముతో (విల్లు) మొదలు పెట్టి ఆ నంబి యొక్క దివ్యాయుధాలు నాలోపల బయట  అన్ని చోట్లా నిత్యము నాకు గోచరిస్తున్నాయి”  అని పరాంగుశ నాయకి వివరిస్తుంది.

నిన్ఱిడుం తిశైక్కుం నైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
కున్ఱ మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
వెన్ఱి విల్లుం తండుం వాళుం శక్కరముం శంగముం
నిన్ఱు తోన్ఱి క్కణ్ణుళ్‌ నీంగా నెంజుళ్ళుం నీంగావే (3)

ఓ తల్లులారా! మీరు మొదట నన్ను పురిగొలిపి, ప్రేరేపించి ఈ ప్రేమలోకి నెట్టి, నేను నిశ్చేష్టునైనానని, బలహీనమైననాని ఇప్పుడు లాంఛనాలు వేస్తున్నారు; విశాల భవనాలతో సుసంపన్నమైన తిరుక్కురుంగుడిలో నివాసుడై ఉన్న నంబిని, అతడి గధా, విల్లు, ఖడ్గము, శంఖచక్రములను ఆస్వాదించిన తరువాత, అవన్నీ నా కళ్ళల్లో  నిలిచిపొయాయి. అదేవిధంగా, అవి నా మనస్సులో నుండి వెళ్ళట్లేదు కూడా.

నాలుగవ పాశురము:  “నంబి యొక్క ఆధిపత్యాన్ని చూపించే వారి విశేష దివ్య వస్త్రాలంకరణ ఎప్పటికీ నా మనస్సులో నిలిచి ఉంటుంది” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

నీంగ నిల్లా క్కణ్ణ నీర్గళ్‌ ఎన్ఱు అన్నైయరుం మునిదిర్
తేన్ కొళ్‌ శోలై త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
పూన్దణ్‌ మాలై త్తణ్దుళాయుం పొన్ ముడియుం వడివుం
పాంగు తోన్ఱుం పట్టుం నాణుం పావియేన్ పక్కత్తవే (4)

ముందు నుండి నంబివైపు నన్ను తోసింది నువ్వు, ఇప్పుడు నన్ను “ఆమె కన్నీళ్లు ఆగడం లేదు” అని  మాటలంటున్నావు; తేనెలు కారే తోటలు కలిగి ఉన్న తిరుక్కురుంగుడిలో  తాజా తుళసి మాలలను ధరించి ఆకట్టుకునే స్వరూపముతో ఉన్న నంబిని అనుభవించిన తరువాత, అతని ఆధిపత్యాన్ని ఎత్తిచూపే ఆకర్షణీయమైన అతడి కిరీటము, అతడి స్వరుపానికి చక్కగా హత్తుకొని ఉన్న పట్టు పీతాంబరము, అతడి తీగ లాంటి సన్నిని నడుము మొదలైనవి నన్ను ఆకర్షించి నాకు దగ్గరైనాయి. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది?

ఐదవ పాశురము:  “నంబి యొక్క శ్రీముఖ సౌందర్యము మొదలైనవి నా ఆత్మను చేరుతున్నట్లు అనిపిస్తుంది” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

పక్కం నోక్కి నిఱ్కుం వైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
తక్క కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
తొక్కశోది త్తొండై వాయుం నీండ పురువంగళుం
తక్క తామరై క్కణ్ణుం పావియేన్‌ ఆవియిన్‌ మేలనవే (5)

నేను, అతడు ఎక్కడి నుండి వస్తాడా అని నిలుచొని ఎదురుచూస్తున్నానని, అతడు రాకపోయేసరికి బాధతో బలహీనపడుతున్నానని మీరు నన్ను మాటలంటున్నారు; కీర్తి ప్రసిద్దులు కలిగి ఉన్న తిరుక్కురుంగుడి నంబిని ఆస్వాదించిన తరువాత, ఎర్రని దొండ పండుల వలే  మెరిసే అతడి దివ్య అదరములు, పొడవైన దివ్య కనుబొమ్మలు, కనుబొమ్మలంత పొడవైన ఆకర్షణీయమైన అతడి దివ్య కమల నేత్రములు, అతడిని అనుభవించకుండా ఉండే పాపమున్న వారున్నారా?

ఆరవ పాశురము: “అతడి విశేష శారీరక సౌందర్యము గుణాలు, దివ్య భుజాలు, అతడి ముఖ సౌందర్యము అన్నీ నా హృదయంలోకి ప్రవేశించి నన్ను నింపివేశాయి” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది..

మేలుం వన్ పళి నంగుడిక్కివళ్‌ ఎన్ఱు అన్నై కాణ కొడాళ్
శోలై శూళ్‌ తణ్‌ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
కోల నీళ్‌ కొడి మూక్కుం తామరై క్కణ్ణుం కని వాయుం
నీల మేనియుం నాంగు తోళుం ఎన్ నెంజం నిఱైందనవే (6)

ఎత్తైన ఉద్యానవనాలు చుట్టూ వ్యాపించి ఉన్న తిరుక్కురుంగుడి నంబిని చూసిన తరువాత, కల్పక లతని పోలి ఉండే అతడి పొడవైన దివ్య నాసికము (ముక్కు) , తామరను పోలి ఉండే అతని దివ్య నేత్రాలు, ఎర్రటి పండు వంటి అతటి దివ్య అదరములు, నీల వర్ణముతో చతుర్భుజాలను ధరించిన ఉన్న అతడి దివ్య స్వరూపము నా హృదయాన్ని నింపి వేసిన తరువాత ఇక ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతారని పరాంగుశ నాయకి  తల్లి, ఆమెను నంబిని చూడటానికి అనుమతించట్లేదు.

ఏడవ పాశురము:  “నంబి తన దివ్య హస్థములో చక్రాన్ని ధరించి అనంత తేజోమయముతో అద్భుత ఆకర్షణ కలిగిన అతడి దివ్య స్వరూపంతో నా హృదయంలో నిలిచి ఉన్నాడు” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది..

నిఱైంద వన్‌ పళి నంగుడిక్కివళ్‌ ‌ ఎన్జు అన్నై కాణ కొడాళ్‌
శిఱంద కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
నిఱైంద శోది వెళ్ళం శూళ్ంద నీణ్డ పొన్ మేనియొడుం
నిఱైందెనుళ్ళే నిన్ఱొళిందాన్  నేమి అంగై ఉళదే (7)

అద్భుతమైన కీర్తిని కలిగిన తిరుక్కురుంగుడిలో అందమైన  దివ్య సుదర్శన చక్రము తన దివ్య హస్థములలో ధరించిన నంబిని దర్శించి అనుభవించిన పిదప, అతడి ఆకర్షణీయమైన దివ్య స్వరూపము తన హృదయంలో నిలిచిపోయి దివ్య ప్రకాశాన్ని నింపి వేసిన తరువాత, పరాంగుశ నాయకి యొక్క తల్లి, ఆమె “మొత్తం వంశానికి కలంకము” అని చెప్పి నంబిని చూడటానికి అనుమతించ లేదు .

ఎనిమిదవ పాశురము:  “విశాలమైన భుజాలవరకు తాకుతున్న అతడి అందమైన శిరోజాలు, అతడి ముఖ సౌందర్యము నా కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపించి నన్ను దహించివేస్తున్నాయి” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

కైయుళ్‌ నన్ముగం వైక్కుం నైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
మై కొళ్‌ మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
శెయ్య తామరై క్కణ్ణుం అల్గులుం శిఱ్ఱిడైయుం వడివుం
మొయ్య నీళ్‌ కుళల్‌ తాళ్ంద తోళ్గళుం పావియేన్ మున్నిఱ్కుమే (8)

ఎత్తైన భవనాలు ఉన్న తిరుక్కురుంగుడి నంబి యొక్క ఎర్రటి దివ్య కమల నయనాలు, సన్నని నడుము, అతడి స్వరూపము, అతని భుజాలపై జాలువారే దట్టమైన శిరోజాలు చూసిన తరువాత, అతడి స్వరూపము నా ముందు నిలబడి ఉండి నన్ను బలహీనము చేస్తుండగా,  ఈ బలహీనతకు దారితీసే యత్నాలలో నన్ను తోసిన తల్లులు, ఇప్పుడు కోపగిస్తున్నారు.

తొమ్మిదవ పాశురము:  “నంబి తన సౌందర్యమంతటితో సహా నా హృదయంలోకి ప్రవేశించాడు. అతడిని నేను మరువకూడదని నా హృదయాన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళనంటున్నాడు.” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

మున్ నిన్ఱాయ్‌ ఎన్ఱు తోళి మార్గళుం అన్నైయరుం మునిదిర్
మన్ను మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
శెన్ని నీళ్‌ ముడి ఆదియాయ ఉలప్పిలణి కలత్తన్
కన్నల్‌ పాల్‌ అముదాగి వందు ఎన్ నెంజం కళియానే (9)

ఎత్తైన దివ్య కిరీటాన్ని శిరస్సున ధరించి ఎత్తైన సుస్థిర  భవనాలున్న తిరుక్కురుంగుడి నంబిని దర్శించిన తరువాత, తీయని తేనెలా, పాలలా అనంత రుచి కలిగి ఉన్నావాడు లెక్కలేనన్ని ఆభరణాలతో నా హృదయంలోకి ప్రవేశించగా, నేను ముందు నిలబడి ఉన్నానని నా స్నేహితులు మరియు తల్లులు నాపై కోపంగా ఉన్నారు.

పదవ పాశురము:  “పరమపద నిత్య వాసులైన నిత్యసూరులచే ఆస్వాదింపబడే అతడి దివ్య స్వరూపం అనంత కోటి సూర్యుల తేజము వంటి ప్రకాశముగలదు, మనందరికి  సముచిత లక్ష్యము కూడా. అటువంటి దివ్య స్వరూపము ఎవ్వరూ గ్రహించగలగలేని  నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు”, అని పరాంగుశ నాయకి వివరిస్తుంది.

కళియ మిక్కదోర్‌ కాదలళ్‌ ఇవళ్‌ ఎన్ఱు  అన్నై కాణ కొడాళ్‌
వళువిల్‌ కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
కుళుమి తేవర్‌ కుళాంగళ్ కై తొళ చ్చోది వెళ్ళత్తినుళ్ళే
ఎళువదోర్‌ ఉరువెన్నెంజుళ్‌ ఎళుం ఆర్‌క్కుం అఱివరిదే (10)

మనందరికీ సముచితమైన గమ్యము మరియు నిత్య తేజోమయముతో దివ్యంగా ప్రకాశిస్తూ నిత్య సూరుల సమూహముచే సేవించబడే అద్వితీయమైన కీర్తి ప్రతిష్ఠలు ఉన్న తిరుక్కురుంగుడి నంబి యొక్క దివ్య స్వరూపాన్ని చూసిన తరువాత, ఉన్నతమైన జ్ఞానులకు కూడా దుర్లబుడైన అతడు నా హృదయంలో విరాజితుడైనాడు. ఇంత జరిగిన తరువాత, ఆమె గొప్ప ప్రేమను కలిగి ఉందని నంబిని చూడటానికి నా తల్లి నన్ను అనుమతించట్లేదు.

పదకొండవ పాశురము:  ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించిన వారికి మన వాస్థవ స్వభావ సాక్షాత్కారము ప్రాప్తిస్తుందని ఆళ్వారు వివరిస్తున్నారు, అనగా భగవత్ కైంకర్యము లభిస్తుందని అర్థమౌతుంది.

అఱివరియ పిరానై ఆళియంగైయనైయే అలఱ్ఱి
నఱియ నన్మలర్‌ నాడి నన్ కురుగూర్‌ చ్చడగోబన్ శొన్న
కుఱి కొళ్‌ ఆయిరత్తుళ్‌ ఇవై పత్తుం త్తిరుక్కుఱుంగుడి అదన్ మేల్‌
అఱియ కఱ్ఱు వల్లార్‌ వైట్టణవర్‌ ఆళ్‌ కడల్‌ జ్ఞాలత్తుళ్ళే (11)

తిరుక్కురుంగుడి నంబి సర్వోపరి, అతని దివ్య మనోహర హస్తములో దివ్య సుదర్శన చక్రాన్ని ధరించిన అతనిని, తెలుసుకోవడం అసాధ్యం; ఆళ్వార్తిరునుగారికి నాయకుడు విశిష్టమైన జ్ఞానము కలిగిన నమ్మాళ్వార్ నిత్యము భగవానుడినితో సంభాషించి ఆనందించగల అర్హత కలవారు. అటువంటి నమ్మాళ్వార్ అనుగ్రహించిన వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించి అర్థానుసందానము చేసేవారికి ఈ భూమిపైన ప్రత్యేకమైన భగవత్ సంబంధం మరియు భగవత్  అనుభవము చేకూరుతుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-5-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ತಿರುವಾಯ್ಮೊೞಿ – ಸರಳ ವಿವರಣೆ – 10.1 – ತಾಳತಾಮರೈ

Published by:

ಶ್ರೀಃ ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯ ನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ಶ್ರೀಮತ್ ವರವರಮುನಯೇ ನಮಃ

ಕೋಯಿಲ್ ತಿರುವಾಯ್ಮೊೞಿ – ಸರಳ ವಿವರಣೆ

<< 9.10 – ಮಾಲೈನಣ್ಣಿ


ಆಳ್ವಾರರು ಎಂಪೆರುಮಾನರಿಗಾಗಿ ಶಾಶ್ವತವಾಗಿ ಕೈಂಕರ್‍ಯವನ್ನು ಮಾಡಲು ಬಯಸುತ್ತಾರೆ. ಆದರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಅದು ಸಾಧ್ಯವಿಲ್ಲವೆಂದೂ, ಅದಕ್ಕಾಗಿ ಪರಮಪದವನ್ನು ಏರಿ ,ಆ ಕೈಂಕರ್‍ಯವನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಮನಗಾಣುತ್ತಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ತಿರುಮೋಹೂರ್‌ನಲ್ಲಿರುವ ಕಾಳಮೇಗಮ್ ಪೆರುಮಾಳ್ ಒಬ್ಬರೇ ಪರಮಪದಕ್ಕೆ ಸೇರಲು ಇರುವ ತೊಂದರೆಯನ್ನು ನಿವಾರಿಸಲು ಮತ್ತು ಪರಮಪದಕ್ಕೆ ಕರೆದೊಯ್ಯಲು ಸಾಧ್ಯವೆಂದು ಆ ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಶರಣಾಗತರಾಗುತ್ತಾರೆ. ಪರಮಪದದ ಪ್ರಯಾಣಕ್ಕೆ ತನ್ನನ್ನು ಜೊತೆಗಾರನಾಗಿ ಪರಿಗಣಿಸಬೇಕೆಂದು ಕೋರುತ್ತಾರೆ.

ಮೊದಲನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ನಮಗೆ ತೊಂದರೆಗಳನ್ನು ನಿವಾರಿಸುವ ಗುಣವಿರುವ ಕಾಳಮೇಗ ಎಂಪೆರುಮಾನರನ್ನು ಬಿಟ್ಟರೆ ಯಾವ ಆಶ್ರಯವೂ ಇಲ್ಲ “

ತಾಳ ತಾಮರೈ ತ್ತಡಮಣಿ ವಯಲ್ ತಿರುಮೋಗೂರ್,
ನಾಳುಮ್ ಮೇವಿ ನನ್ಗಮರ್ನ್ದು ನಿನ್‍ಱು ಅಶುರರೈ ತ್ತಗರ್ಕ್ಕುಮ್,
ತೋಳು ನಾನ್ಗುಡೈ ಚ್ಚುರಿ ಕುೞಲ್ ಕಮಲಕ್ಕಣ್ ಕನಿ ವಾಯ್,
ಕಾಳಮೇಗತ್ತೈ ಯೆನ್‍ಱಿ ಮಱ್ಱೊನ್‍ಱಿಲಮ್ ಗದಿಯೇ ॥

ವೈರಿಗಳಾದ ರಾಕ್ಷಸರನ್ನು ಹತ್ಯೆಗೊಳಿಸಲು ಕಾಳಮೇಗಮ್ ಎಂಪೆರುಮಾನರು ತಿರುಮೋಗೂರ್‌ನಲ್ಲಿ , ಅತೀವ ಆತ್ಮತೃಪ್ತಿಯ ಆನಂದದೊಂದಿಗೆ ,ಬಲವಾಗಿ ನಿಂತು, ಶಾಶ್ವತವಾಗಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ರೈತರ ಗದ್ದೆಗಳು, ಬಲವಾದ ಕಾಂಡಗಳನ್ನು ಹೊಂದಿದ, ತಾವರೆ ಹೂಗಳುಳ್ಳ ಕೆರೆಗಳೊಂದಿಗೆ ಅಲಂಕೃತವಾಗಿದೆ. ಎಂಪೆರುಮಾನರಿಗೆ ನಾಲ್ಕು ದಿವ್ಯ ಕೈಗಳು, ಸುರುಳಿಕೊಂಡಿರುವ ಮುಂಗುರುಳು, ದಟ್ಟವಾದ ಕೂದಲು, ತಾವರೆಯಂತಹ ದಿವ್ಯ ಕಣ್ಣುಗಳು , ಹವಳದಂತಹ ಸ್ನೇಹಭರಿತವಾದ ದಿವ್ಯ ತುಟಿಗಳಿವೆ. ಅಂತಹ ಭವ್ಯವಾದ, ಕಪ್ಪು ಮೇಘದಂತಿರುವ, ನಮಗೆ ನಿರ್ದಿಷ್ಟ ಗುರಿಯಾಗಿರುವ ಎಂಪೆರುಮಾನರನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾವ ಆಶ್ರಯವೂ ನಮಗಿಲ್ಲ.

ಎರಡನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ಉಲ್ಲಾಸಭರಿತವಾದ ಎಂಪೆರುಮಾನರ ದಿವ್ಯ ಪಾದಗಳನ್ನು ಬಿಟ್ಟು ನಮಗೆ ಬೇರೆ ಯಾವ ಆಶ್ರಯವೂ ಇಲ್ಲ. ಅವರಿಗೆ ದಿವ್ಯ ನಾಮಗಳಿವೆ. ಅವುಗಳ ಆನಂದವು ಭಕ್ತರ ಆಯಾಸವನ್ನು ನಿರ್ಮೂಲನೆ ಮಾಡಿ, ಅವರನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತದೆ.”

ಇಲಮ್ ಗದಿ ಮಱ್ಱೊನ್‍ಱು ಎಮ್ಮೈಕ್ಕುಮ್ ಈನ್ ತಣ್ ತುೞಾಯಿನ್,
ಅಲಙ್ಗಲಮ್ ಕಣ್ಣಿ ಆಯಿರಮ್ ಪೇರ್ ಉಡೈ ಅಮ್ಮಾನ್,
ನಲಮ್ ಕೊಳ್ ನಾನ್ಮಱೈ ವಾಣರ್‌ಗಳ್ ವಾೞ್ ತಿರುಮೋಗೂರ್,
ನಲಮ್‍ಕೞಲವನಡಿನಿೞಲ್ ತಡಮನ್‍ಱಿ ಯಾಮೇ ॥


ಕಾಳಮೇಗಮ್ ಎಂಪೆರುಮಾನರು ಸುಂದರವಾದ, ಜೀಕುತ್ತಿರುವ ತಿರುತ್ತುೞಾಯ್ ಹಾರದಿಂದ ಅಲಂಕೃತರಾಗಿದ್ದಾರೆ. ಅದು ಅದರಲ್ಲಿ ಪೋಣಿಸಿದ ಹೂವುಗಳಿಗೆ ತಂಪಾದ ಅನುಭವನ್ನು ಕೊಟ್ಟು ಆನಂದಮಯವನ್ನಾಗಿಸಿದೆ. ಅವರು ಯಾವ ಷರತ್ತುಗಳೂ ಇಲ್ಲದ ಸ್ವಾಮಿಯು , ಆನಂದಭರಿತವಾದ ಅನೇಕ ನಾಮಗಳನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ಅವರು ತಿರುಮೋಗೂರ್‌ನಲ್ಲಿ ವಾಸವಾಗಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ವೇದಗಳಲ್ಲಿ ಪಾರಂಗತ್ಯ ಹೊಂದಿರುವ, ಇತರರಿಗಾಗಿ ಅನುಕಂಪ ತೋರಿಸುವ, ಅವನ ವಿಶಿಷ್ಟವಾದ ರಕ್ಷಿಸುವ ಇತ್ಯಾದಿ ಗುಣಗಳನ್ನು ಆಸ್ವಾದಿಸುವುದರಿಂದ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಉತ್ಕೃಷ್ಟಗೊಳಿಸಿಕೊಂಡಿರುವ ಜನರು ವಾಸವಾಗಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಜನ್ಮಗಳಲ್ಲೂ, ನಮಗೆ ಅಲ್ಲಿಯ ಕೆರೆಯ ನೆರಳನ್ನು ಬಿಟ್ಟರೆ ಯಾವ ಗುರಿಯೂ ಇಲ್ಲ. ಬೇರೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುವುದಾದರೆ, ಎಂಪೆರುಮಾನರ ವಿಜಯದ ಕಾಲ್ಗೆಜ್ಜೆಗಳನ್ನು ಹೊಂದಿರುವ ದಿವ್ಯ ಪಾದಗಳು, ಭಕ್ತರಲ್ಲಿ ಭೇದ ಭಾವ ಎಣಿಸದೇ ಅವರಲ್ಲಿಗೆ ಕರೆದೊಯ್ಯುತ್ತದೆ.

ಮೂರನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ನಾವೆಲ್ಲರೂ ತಿರುಮೋಗೂರ್‌ಗೆ ಹೋಗಿ ಸೇರೋಣ. ಅಲ್ಲಿ ಸರ್ವೇಶ್ವರನು ಎಲ್ಲಾ ಕಲ್ಯಾಣ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿ, ನಿರಂತರವಾಗಿ ವಾಸವಾಗಿದ್ದಾನೆ. ಅವನು ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸಂಕಟಗಳನ್ನು ದೂರ ಮಾಡುತ್ತಾನೆ. ಇದನ್ನು ಒಳ್ಳೆಯ ಸಲಹೆಯಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಿ.”

ಅನ್‍ಱಿ ಯಾಮ್ ಒರುಪುಗಲಿಡಮ್ ಇಲಮ್ ಎನ್‍ಱೆನ್‍ಱಲಟ್ಱಿ,
ನಿನ್‍ಱು ನಾನ್ಮುಗನ್ ಅರನೊಡು ದೇವರ್ಗಳ್ ನಾಡ
ವೆನ್‍ಱು ಇಮ್ಮೂವುಲಗಳಿತ್ತು ಉೞಲ್ವಾನ್ ತಿರುಮೋಗೂರ್,
ನನ್‍ಱು ನಾಮ್ ಇನಿ ನಣುಗುದುಮ್ ನಮದಿಡರ್ ಕೆಡವೇ ॥

ಎಂಪೆರುಮಾನರನ್ನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೂಗಿ ಕರೆದು “ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಯಾವ ಗತಿಯೂ ಇಲ್ಲ “ ಎಂದಾಗ , ಪ್ರತಿಯೊಂದು ಸಲವೂ ದುರ್ಬಲನಾಗುತ್ತಾ, ಅನೇಕ ದೇವತೆಗಳು ಬ್ರಹ್ಮ, ರುದ್ರ ಮುಂತಾದವರು ಆಕಾಶದಲ್ಲಿ ನಿಂತಾಗ, ನಾವು ಎಂಪೆರುಮಾನರನ್ನು ಹೊಂದಲು ಸಮೀಪಿಸಲು ನಾವೆಲ್ಲರೂ ತಿರುಮೋಗೂರಿಗೆ ಹೋಗೋಣ. ಅಲ್ಲಿ ಮೂರು ಪದರದ ವಿಶ್ವದಲ್ಲಿ ವೈರಿಗಳನ್ನು ಜಯಿಸುವ ಒಬ್ಬನ ವಾಸಸ್ಥಾನವಾಗಿದೆ. ಮತ್ತು ಎಲ್ಲರ ರಕ್ಷಣೆಯು ಅವನ ದಿನಚರ್‍ಯವಾಗಿದೆ. ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಸಂಘರ್ಷಗಳನ್ನು ತೆಗೆದು ಹಾಕಲು, ಮತ್ತು ಅನನ್ಯಪ್ರಯೋಜನರಾಗಿ ನಾವು ಅವನನ್ನು ತಲುಪೋಣ.

ನಾಲ್ಕನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ಶ್ರೀವೈಷ್ಣವರನ್ನು ಆಮಂತ್ರಿಸುತ್ತಾ ಹೇಳುತ್ತಾರೆ, “ ಬನ್ನಿ, ನಾವು ನಮ್ಮ ಕಳವಳಗಳನ್ನು ತೊಡೆದು ಹಾಕಲು ತಿರುಮೋಗೂರಿನ ಎಂಪೆರುಮಾನರಿಗೆ ಶರಣಾಗತರಾಗೋಣ”.

ಇಡರ್‌ಕೆಡ ಎಮ್ಮೈ ಪ್ಪೋನ್ದಳಿಯಾಯ್ ಎನ್‍ಱೆನ್‍ಱೇತ್ತಿ,
ಶುಡರ್‌ಕೊಳ್ ಶೋದಿಯೈ ತ್ತೇವರುಮ್ ಮುನಿವರುಮ್ ತೊಡರ,
ಪಡರ್‌ಕೊಳ್ ಪಾಮ್ಬಣೈ ಪ್ಪಳ್ಳಿಕೊಳ್ವಾನ್ ತಿರುಮೋಗೂರ್,
ಇಡರ್‌ಕೆಡ ಅಡಿ ಪರವುದುಮ್ ತೊಣ್ಡೀರ್ ವಮ್ಮಿನೇ ॥


ಶ್ರೇಷ್ಠವಾದ ಹೊಳೆಯುವ ಪ್ರಕಾಶದ ರೂಪವನ್ನು ಹೊಂದಿರುವ ಎಂಪೆರುಮಾನರು ಕರುಣೆಯಿಂದ ದಿವ್ಯ ಸರ್ಪದ ಮೇಲೆ ಶಯನಿಸಿದ್ದಾರೆ. ಆ ಸರ್ಪವು ಮೃದುವಾಗಿ, ತಂಪಾಗಿ, ಸುಗಂಧಿತವಾಗಿ ಹಾವುಗಳ ಜಾತಿಯ ಸ್ವಭಾವಕ್ಕೆ ತಕ್ಕವನಾಗಿದೆ. ಅದು ಎಂಪೆರುಮಾನರ ಸ್ಪರ್ಶಕ್ಕೆ ತಾಗಿ ಅವರ ಗುಣವಾದ ವಿಸ್ತಾರತೆಯನ್ನು ಹೊಂದಿದೆ. ತಮ್ಮನ್ನೇ ಸ್ವಾಮಿಯೆಂದೂ, ಮುನಿಗಳೆಂದು ತಿಳಿದಿರುವ ದೇವತೆಗಳು ಎಂಪೆರುಮಾನರನ್ನು ನಿರಂತರವಾಗಿ ಹಿಂಬಾಲಿಸಿ, ಶರಣಾಗತರಾಗಿ, ಪದೇಪದೇ ಹೊಗಳಿ ಹೇಳುತ್ತಾರೆ, “ವೈರಿಗಳಿಂದ ಪರಿಣಮಿಸಿದ ದುಃಖಗಳನ್ನು ತೊಡೆದು ಹಾಕಿ ಈ ದಿವ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸು. “ ಎಂದು. ಅಂತಹ ಎಂಪೆರುಮಾನರು ಈಗ ತಿರುಮೋಗೂರ್ ನಲ್ಲಿದ್ದಾರೆ. ಓಹ್! ಶರಣಾಗತರಾಗಲು ಇಚ್ಛೆಯುಳ್ಳವರೇ ! ಬನ್ನಿ, ಅವನ ದಿವ್ಯ ಪಾದಗಳನ್ನು ಹೊಗಳಿ ಕೊಂಡಾಡೋಣ.

ಐದನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ಎಂಪೆರುಮಾನರು ಕರುಣೆಯಿಂದ ಆಗಮಿಸಿ, ನೆಲೆಸಿರುವ ತಿರುಮೋಗೂರಿಗೆ ಬಂದು ಶರಣಾಗತರಾಗಿ.”

ತೊಣ್ಡೀರ್ ವಮ್ಮಿನ್ ನಮ್ ಶುಡರೊಳಿ ಒರುತನಿಮುದಲ್ವನ್,
ಅಣ್ಡಮೂವುಲಗಳನ್ದವನ್ ಅಣಿ ತಿರುಮೋಗೂರ್,
ಎಣ್ಡಿಶೈಯುಮ್ ಈನ್ ಕರುಮ್ಬೊಡು ಪೆರುಮ್ ಶೆನ್ನೆಲ್ ವಿಳೈಯ,
ಕೊಣ್ಡ ಕೋಯಿಲೈ ವಲಮ್ ಶೆಯ್‍ದು ಇಙ್ಗಾಡುದುಮ್ ಕೂತ್ತೇ ॥

ಓಹ್! ಶರಣಾಗತರಾಗಲು ಇಚ್ಛಿಸುವವರೇ! ಬನ್ನಿ ! ಆನಂದಮಯವಾದ , ಅಪರಿಮಿತವಾಗಿ ಹೊಳೆಯುವ ದಿವ್ಯ ಪ್ರಕಾಶತೆಯುಳ್ಳ ರೂಪವನ್ನು ಹೊಂದಿರುವ ಎಂಪೆರುಮಾನರು, ಮೂರು ರೀತಿಯ ಕಾರಣಕರ್ತೃವಾಗಿದ್ದಾರೆ. ಅವು : ಸಮರ್ಥತೆಯ ಕಾರಣಕರ್ತೃ, ಲೌಕಿಕ ಕಾರಣಕರ್ತೃ, ಮತ್ತು ಪೂರಕ ಕಾರಣಕರ್ತೃ. ಅವರು ಅಂಡಾಕಾರದ ವಿಶ್ವಮಂಡಲದಲ್ಲಿರುವ ಮೂರು ಪದರದ ಲೋಕಗಳನ್ನೆಲ್ಲಾ ಅಳೆದು, ಸ್ವೀಕರಿಸಿದ್ದಾರೆ. ಸಿಹಿಯಾದ ಕಬ್ಬುಗಳಿರುವ , ಎತ್ತರದ ಕೆಂಪಾದ ಭತ್ತದ ಗದ್ದೆಗಳು ಎಲ್ಲಾ ದಿಕ್ಕಿನಲ್ಲಿರುವ ತಿರುಮೋಗೂರಿನ ಗುಡಿಯಲ್ಲಿ ವಾಸಿಸಲು ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ಲೋಕದಲ್ಲಿಯೇ ಇರುವ ಅಂತಹ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಪ್ರದಕ್ಷಿಣೆಯನ್ನು ಹಾಕಿ, ಅತಿಯಾದ ಪ್ರೇಮದಿಂದ ಹಾಡಿ, ಆಡೋಣ.

ಆರನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ತಿರುಮೋಗೂರಿನಲ್ಲಿ ಕರುಣೆಯಿಂದ ನಿಂತಿರುವ ಎಂಪೆರುಮಾನರಿಗಿಂತಲೂ ನಂಬಿಕೆಗೆ ಅರ್ಹವಾದ, ರಕ್ಷಿಸುವ ದೇವರು ಎಲ್ಲೂ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಅಂತಹ ದಿವ್ಯ ಪಾದಗಳಿಗೆ ಶರಣಾಗತರಾಗೋಣ.”

ಕೂತ್ತನ್ ಕೋವಲನ್ ಕುದಱ್ಱು ವಲ್ ಅಶುರರ್ಗಳ್ ಕೂಟ್ಱಮ್,
ಏತ್ತುಮ್ ನಙ್ಗಟ್ಕುಮ್ ಅಮರರ್ಕ್ಕುಮ್ ಮುನಿವರ್ಕ್ಕುಮ್ ಇನ್ಬನ್,
ವಾಯ್‍ತ್ತ ತಣ್ ಪಣೈ ವಳವಯಲ್ ಶೂೞ್ ತಿರುಮೋಗೂರ್,
ಆತ್ತನ್, ತಾಮರೈ ಅಡಿಯೆನ್‍ಱಿ ಮಱ್ಱಿಲಮ್ ಅರಣೇ ॥


ಎಂಪೆರುಮಾನರಿಗೆ ನೃತ್ಯದಲ್ಲಿ ಪರಿಣಿತರಾಗಿರುವವರಂತೆ ಸುಂದರವಾದ ನಡಿಗೆಯಿದೆ. ತಮ್ಮ ರಕ್ಷಣೆಯ ಅವಶ್ಯಕತೆ ಇರುವವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ, ರಕ್ಷಿಸುತ್ತಾರೆ. ಅವರು ಕೇಶಿ, ಧೇನುಕ ಮುಂತಾದ ಬಲಶಾಲಿಯಾದ ಅಸುರರಿಗೆ ಮೃತ್ಯು ರೂಪವಾಗಿದ್ದಾರೆ. ಆ ಅಸುರರು ಕಡಿದು ಎಲ್ಲರಿಗೂ ತೊಂದರೆಯನ್ನುಂಟು ಮಾಡಿದ್ದರು. ಎಂಪೆರುಮಾನರನ್ನು ಹೊಗಳಿ, ಕೈಂಕರ್‍ಯವನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನೂ ಅಪೇಕ್ಷೆಯಿಲ್ಲದ ನಮಗೆ, ನಿತ್ಯಸೂರಿಗಳಿಗೆ ಮತ್ತು ಮುನಿಗಳಿಗೆ ಅವರು ಆನಂದವನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. ನಮಗೆ ಕೊನೆಯವರೆಗೂ ಆನಂದ ಕೊಡಬಲ್ಲ ಅತ್ಯಂತ ನಂಬಿಕೆಗೆ ಅರ್ಹವಾದ ಎಂಪೆರುಮಾನರ ದಿವ್ಯ ಪಾದಗಳನ್ನು ಬಿಟ್ಟರೆ ಯಾವ ರಕ್ಷಣೆಯೂ ಇಲ್ಲ. ಅವರು ತಣ್ಣಗಿನ ನೀರಿನ ತಾಣಗಳಿಂದ ಮತ್ತು ಸುಂದರವಾದ ತೋಟಗಳಿಂದ ಆವರಿಸಲ್ಪಟ್ಟ ತಿರುಮೋಗೂರಿನಲ್ಲಿ ಭಕ್ತರು ಶರಣಾಗುವುದಕ್ಕಾಗಿಯೇ ನೆಲೆಸಿದ್ದಾರೆ.

ಏಳನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ ನಾವು ಎಂಪೆರುಮಾನರ ವಾಸಸ್ಥಳವಾದ ತಿರುಮೋಗೂರನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತಿದ್ದಂತೆ , ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸಂಕಷ್ಟಗಳೂ ತಕ್ಷಣ ನಷ್ಟವಾಗುತ್ತದೆ. ಏಕೆಂದರೆ ಎಂಪೆರುಮಾನರು ಎಲ್ಲದಕ್ಕೂ ಕಾರಣವಾದವರು, ಅವರು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವುದನ್ನು ನಿರಾಕರಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ.”

ಮಱ್ಱಿಲಮ್ ಅರಣ್ ವಾನ್ ಪೆರುಮ್ ಪಾೞ್ ತನಿಮುದಲಾ,
ಶುಱ್ಱುಮ್ ನೀರ್‌ಪಡೈತ್ತು ಅದನ್‍ವೞಿ ತ್ತೊಲ್ ಮುನಿ ಮುದಲಾ,
ಮುಱ್ಱುಮ್ ದೇವರೋಡು ಉಲಗು ಶೆಯ್ವಾನ್ ತಿರುಮೋಗೂರ್,
ಶುಱ್ಱಿ ನಾಮ್ ವಲಮ್ ಶೆಯ್ಯ ನಮ್ ತುಯರ್ ಕೆಡುಮ್ ಕಡಿದೇ ॥

ಎಂಪೆರುಮಾನರಿಗೆ ತಮ್ಮದೇ ಆದ ವಿಶಿಷ್ಟತೆ ಇದೆ. ಅವರು ಪರಮ ಶ್ರೇಷ್ಠತೆ ಹೊಂದಿರುವವರು ಮತ್ತು ಲೌಕಿಕ ಮಾಯೆಯ ಎಲ್ಲಾ ಪರಿಣಾಮಗಳನ್ನು , ಮೂಲಾಧಾರ ವಸ್ತುಗಳನ್ನೂ ಸರದಿಯಂತೆ, ಎಲ್ಲಾ ಕಡೆಗೂ ವ್ಯಾಪಿಸಿರುವ ಸಾಧಾರಣ ನೀರನ್ನೂ ಸೃಷ್ಟಿಸಿರುತ್ತಾರೆ. ಎಲ್ಲಾ ಜೀವರಾಶಿಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸುವ ಬ್ರಹ್ಮನನ್ನೂ, ಇತರೆ ದೇವತೆಗಳನ್ನೂ ಸೃಷ್ಟಿಸುವ ಕಾರ್ಯವನ್ನೂ ಮಾಡುತ್ತಾನೆ. ಅಂತಹ ಎಂಪೆರುಮಾನರು ವಾಸಿಸುವ ತಿರುಮೋಗೂರಿನ ಗುಡಿಯನ್ನು ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿದರೆ, ನಮ್ಮ ಒಂಟಿತನವು ದೂರವಾಗಿ ನಮ್ಮ ಕಷ್ಟಗಳು ನಾಶವಾಗುತ್ತವೆ. ಆದ್ದರಿಂದ ನಮಗೆ ತಿರುಮೋಗೂರಿನ ಎಂಪೆರುಮಾನರನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಯಾವ ರಕ್ಷಣೆಯೂ ಇಲ್ಲ.

ಎಂಟನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ ,” ತಿರುಮೋಗೂರಿನಲ್ಲಿ ಕರುಣೆಯಿಂದ ನಿಂತಿರುವ ಬಲಶಾಲಿಯಾದ ಪರಮಪುರುಷನಾದ ದಶರಥನ ಮಗನಿಗೆ ಶರಣಾದರೆ, ನಮ್ಮ ಶೋಕ , ವ್ಯಸನಗಳೆಲ್ಲವೂ ಪರಿಹಾರವಾಗುತ್ತದೆ.”

ತುಯರ್ ಕೆಡುಮ್ ಕಡಿದಡೈನ್ದುವನ್ದು ಅಡಿಯವರ್ ತೊೞುಮಿನ್,
ಉಯರ್ ಕೊಳ್ ಶೋಲೈ, ಒಣ್ ತಡಮಣಿ ಒಳಿ ತಿರುಮೋಗೂರ್,
ಪೆಯ‍‌ರ್ಗಳಾಯಿರಮುಡೈಯ ವಲ್ ಅರಕ್ಕರ್ ಪುಕ್ಕೞುನ್ದ,
ದಯರದನ್ ಪೆಱ್ಱ ಮರತಕಮಣಿ ತ್ತಡತ್ತಿನೈಯೇ॥


ಎತ್ತರದ ಮರಗಳನ್ನು ಹೊಂದಿರುವ ಮತ್ತು ವಿಶಿಷ್ಟವಾದ ನೀರಿನ ಕೆರೆಗಳಿಂದ ಅಲಂಕೃತವಾದ , ಅದರಿಂದ ಹೊಳೆಯುತ್ತಿರುವ ತಿರುಮೋಗೂರಿನಲ್ಲಿ ನಿಂತಿರುವ ದಶರಥ ಪುತ್ರನಾದ ಎಂಪೆರುಮಾನರು ಎಲ್ಲವನ್ನೂ ಮುಳುಗಿಸಬಲ್ಲ ಕೆರೆಯ ಹಾಗೆ, ಅಮೂಲ್ಯವಾದ ಪಚ್ಚೆಯ ಹರಳಿನ ಬಣ್ಣದಿಂದ ಹೊಳೆಯುತ್ತಿದ್ದಾರೆ. ಅನೇಕ ಬಿರುದುಗಳನ್ನು ಪಡೆದ ಬಲಶಾಲಿಯಾದ ರಾಕ್ಷಸರನ್ನು ಅದರಲ್ಲಿ ಮುಳುಗಿಸಲು ಸಮರ್ಥರಾಗಿದ್ದಾರೆ. ಶ್ರೀ ರಾಮಾಯಣಮ್‍ನ ಕಿಶ್ಕಿಂಧಾ ಕಾಂಡಮ್ 4.12 ನಲ್ಲಿ ಹೇಳಿರುವ ಹಾಗೆ, ‘ಗುಣೈರ್ದಾಸ್ಯಮ್ ಉಪಾಗತಃ’ ನೀವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಅವನನ್ನು ಪೂಜಿಸಿ. ನಿಮ್ಮ ವ್ಯಸನಗಳೆಲ್ಲವೂ ನಿಮ್ಮ ಪ್ರಯತ್ನವಿಲ್ಲದೇ ನಾಶವಾಗುವುದು. ಮರತಗ ಮಣಿಯ ಉದಾಹರಣೆಗೆ ಅರ್ಥವೇನೆಂದರೆ, ಮರತಗ ಮಣಿಯು ವಿಷವನ್ನು ನಿರ್ಮೂಲನೆ ಮಾಡುವುದರ ಜೊತಗೆ ಒಂದು ಒಡವೆಯ (ನಗದ) ರೂಪದಲ್ಲೂ ಧರಿಸುತ್ತಾರೆ. ಹಾಗೆಯೇ ಎಂಪೆರುಮಾನರು ವೈರಿಗಳನ್ನು ನಿರ್ಮೂಲನೆ ಮಾಡುವುದರ ಜೊತೆಗೆ , ಭಕ್ತರಿಗೆ ಆಶ್ರಯವಾಗಿಯೂ ಇರುತ್ತಾರೆ.

ಒಂಬತ್ತನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ತಮ್ಮ ರಕ್ಷಣೆಗಾಗಿ ತಿರುಮೋಗೂರಿಗೆ ಬಂದಿದ್ದರಿಂದ ಆದ ಪ್ರಯೋಜನವನ್ನು ಇಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ.

ಮಣಿ ತ್ತಡತ್ತಡಿ ಮಲರ್ ಕಣ್‍ಗಳ್ ಪವಳ ಚ್ಚೆವ್ವಾಯ್,
ಅಣಿಕ್ಕೊಳ್ ನಾಲ್ ತಡನ್ದೋಳ್ ದೆಯ್‍ವಮ್ ಅಶುರರೈ ಎನ್‍ಱುಮ್,
ತುಣಿಕ್ಕುಮ್ ವಲ್ಲರಟ್ಟನ್ ಉಱೈ ಪೊೞಿಲ್ ತಿರುಮೋಗೂರ್,
ನಣಿತ್ತು ನಮ್ಮುಡೈ ನಲ್ಲರಣ್ ನಾಮ್ ಅಡೈನ್ದನಮೇ ॥

ಕಾಳಮೇಗ ಎಂಪೆರುಮಾನರ ದಿವ್ಯ ರೂಪವು ಸ್ವಚ್ಛವಾದ ನೀರಿನ ಕೊಳದಂತಿರುವ. ದಿವ್ಯ ಪಾದಗಳನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ಈಗ ತಾನೇ ಅರಳಿರುವ ಹೊಸ ತಾವರೆಯ ಹೂವಿನಂತಹ ದಿವ್ಯ ಕಣ್ಣುಗಳಿವೆ. ಕೆಂಪಾದ ಹವಳದಂತಿರುವ ದಿವ್ಯ ತುಟಿಗಳು , ನಾಲ್ಕು ದೊಡ್ಡ ದಿವ್ಯ ತೋಳುಗಳು, ಅವುಗಳನ್ನು ಎಲ್ಲಾ ರೀತಿಯ ಆಭರಣಗಳನ್ನು ಹಾಕಿ ಅಲಂಕರಿಸಲು ಯೋಗ್ಯವಾಗಿದೆ. ಅವರು ಬಹಳ ಹೆಮ್ಮೆಯಿಂದ, ಬಲಶಾಲಿಯಾಗಿದ್ದು, ರಾಕ್ಷಸರನ್ನು ಕತ್ತರಿಸುವರು. ಅಂತಹ ಎಂಪೆರುಮಾನರು ಆನಂದಮಯವಾದ ತೋಟಗಳನ್ನು ಹೊಂದಿರುವ ತಿರುಮೋಗೂರಿನಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಅಂತಹ ತಿರುಮೋಗೂರ್ ವಿಶಿಷ್ಟವಾದ ರಕ್ಷಣೆಯನ್ನು ನೀಡುವ ನೆಲೆಯಾಗಿದ್ದು, ಈಗ ಬಹಳ ಹತ್ತಿರದಲ್ಲಿದೆ. ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ತಲುಪಿದ್ದೇವೆ.

ಹತ್ತನೆಯ ಪಾಸುರಮ್:
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ (ಅಗಾಧ ಜನಸಮೂಹಕ್ಕೆ) “ಓಹ್! ನನಗೆ ಸಂಬಂಧಿಸಿರುವ ಜನಗಳೇ! ಸರ್ವರಕ್ಷಕನು ಕರುಣೆಯಿಂದ ನೆಲೆಸಿರುವ ತಿರುಮೋಗೂರಿನ ಮೇಲೆ ಪ್ರೀತಿಯನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳಿ. ಅದನ್ನು ಹೊಗಳಿ, ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳಿ.”

ನಾಮ್ ಅಡೈನ್ದ ನಲ್ಲರಣ್ ನಮಕ್ಕೆನ್‍ಱು ನಲ್‍ ಅಮರರ್,
ತೀಮೈ ಶೆಯ್ಯುಮ್ ವಲ್ ಅಶುರರೈ ಅಞ್ಜಿ ಚ್ಚೆನ್‍ಱಡೈನ್ದಾಲ್,
ಕಾಮರೂಪಮ್‍ಕೊಣ್ಡು ಎೞುನ್ದಳಿಪ್ಪಾನ್ ತಿರುಮೋಗೂರ್,
ನಾಮಮೇ ನವಿನ್‍ಱೆಣ್ಣುಮಿನ್ ಏತ್ತುಮಿನ್ ನಮರ್ಗಾಳ್ ॥


ತಿರುಮೋಗೂರಿನ ಮಹತ್ವದ ಬಗ್ಗೆ ತಿಳಿದ ದೇವತೆಗಳು, ಅಸುರರಿಂದ ಭಯಭೀತರಾದರು. ಅಸುರರು ಕೆಟ್ಟ ಕೃತ್ಯದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು , ನಂತರ ಎಂಪೆರುಮಾನರಲ್ಲಿ ಆಶ್ರಯ ಪಡೆದರೆ, ‘ಎಂಪೆರುಮಾನರು ನಮಗಾಗಿ ಪ್ರತ್ಯೇಕ ಮತ್ತು ವಿಶಿಷ್ಟ ರಕ್ಷಕ , ಅವನಿಗೆ ನಾವು ಶರಣು ಹೊಂದುತ್ತೇವೆ’ ಎಂದು ಹೇಳಿದರೆ, ಅವನು ಸಡಗರದಿಂದ , ಅವರಿಗೆ ಸರಿಯಾದ , ಅವರು ಆಸೆಪಟ್ಟ ರೀತಿಯಲ್ಲಿ ಅವರನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ಓಹ್ ಜನಗಳೇ! ಪ್ರಸಿದ್ಧವಾದ ತಿರುಮೋಗೂರಿನ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿ ಮತ್ತು ಯೋಚಿಸಿ.. ಅದು ಅಂತಹ ವಿಶಿಷ್ಟವಾದ ಎಂಪೆರುಮಾನರ ವಾಸಸ್ಥಳವಾಗಿದೆ. ಅದನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಹೊಗಳಿ.
ಕಾಮ ರೂಪಮ್ ಎಂಬುದು ದೇವತೆಗಳಿಗೆ ಅಮೃತವನ್ನು ಕೊಡಲು ಎಂಪೆರುಮಾನರು ಧರಿಸಿದ ಸ್ತ್ರೀ ರೂಪವಾದ ಮೋಹಿನಿ ಅವತಾರವೆಂದೂ ಆಗುತ್ತದೆ.

ಹನ್ನೊಂದನೆಯ ಪಾಸುರಮ್ :
ಆಳ್ವಾರರು ಹೇಳುತ್ತಾರೆ, “ಯಾರು ತಿರುಮೋಗೂರಿಗೆ ಸಮರ್ಪಿತವಾದ ಈ ಪದಿಗೆಯನ್ನು ಮೆಚ್ಚಿ ಹಾಡುತ್ತಾರೋ, ಅವರ ಎಲ್ಲಾ ದುಃಖಗಳೂ ದೂರವಾಗುತ್ತದೆ.”

ಏತ್ತುಮಿನ್ ನಮರ್ಗಾಳ್ ಎನ್‍ಱು ತಾನ್ ಕುಡಮಾಡು,
ಕೂತ್ತನೈ , ಕುರುಗೂರ್ ಚ್ಚಡಗೋಪನ್ ಕುಱ್ಱೇವಲ್‍ಗಳ್,
ವಾಯ್‍ತ್ತ ಆಯಿರತ್ತುಳ್ ಇವೈ ವಣ್ ತಿರುಮೋಗೂರ್‌ಕ್ಕು,
ಈತ್ತ ಪತ್ತಿವೈ ಏತ್ತವಲ್ಲಾರ್ಕ್ಕು ಇಡರ್ ಕೆಡುಮೇ ॥

ನಮ್ಮಾಳ್ವಾರರು ಆಳ್ವಾರ್ ತಿರುನಗರಿಗೆ ನಾಯಕರಾದವರು. ಅವರು ಸಾವಿರ ಪಾಸುರಗಳನ್ನು ನೃತ್ಯಗಾರನಿಗೆ ಗುಪ್ತ ಸೇವೆಯ ಮೂಲಕ ಸಮರ್ಪಿಸಿದರು. ಆ ನೃತ್ಯಗಾರನು “ಯಾರು ನನಗೆ ಸಂಬಂಧಿಸಿದವರೋ ಅವರು ನನ್ನನ್ನು ಹೊಗಳಿ” ಎಂದು ಮಡಿಕೆಗಳ ಜೊತೆಗೆ ನರ್ತಿಸಿದರು. ಆ ಸಾವಿರ ಪಾಸುರಗಳಲ್ಲಿ ಈ ಹತ್ತು ಪಾಸುರಗಳನ್ನು ವಿಶಿಷ್ಟವಾದ ತಿರುಮೋಗೂರಿಗೆ ಅರ್ಪಿಸಲಾಗಿದೆ. ಯಾರು ಈ ಹತ್ತು ಪಾಸುರಗಳನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಹಾಡುತ್ತಾರೋ, ಅವರ ಕಷ್ಟಗಳು ನಿರ್ಮೂಲನೆಯಾಗುತ್ತದೆ.
ನಮ್ಮಾಳ್ವಾರ್ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಮ್

ಅಡಿಯೇನ್ ಕುಮುದವಲ್ಲಿ ರಾಮಾನುಜ ದಾಸಿ

ಮೂಲ : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-1-simple/

ಆರ್ಕೈವ್ ಮಾಡಲಾಗಿದೆ : http://divyaprabandham.koyil.org

ಪ್ರಮೇಯಂ (ಲಕ್ಷ್ಯ) – http://koyil.org
ಪ್ರಮಾಣಂ (ಧರ್ಮಗ್ರಂಥಗಳು) – http://granthams.koyil.org
ಪ್ರಮಾತಾ (ಬೋಧಕರು) – http://acharyas.koyil.org
ಶ್ರೀವೈಷ್ಣವ ಶಿಕ್ಷಣ/ಮಕ್ಕಳ ಪೋರ್ಟಲ್ – http://pillai.koyil.org

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.10 – ఒన్ఱుం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 4.1 – ఒరునాయగమాయ్

శ్రియః పతి అయిన సర్వశ్వరుడు ఆత్మల పట్ల గొప్ప దయతో, అర్చావతార రూపాల్లో ఈ భూమిపైకి దిగి వచ్చి వారి కోసం ఎదురుచూస్తున్నారు, కాని ఈ ఆత్మలు ఆయనచే నియమించబడిన దేవతల దగ్గరకు వెళుతున్నారు. అది చూసిన ఆళ్వారు భగవానుడి ఆధిపత్యాన్ని వారికి వివరించి, వాళ్ళని సంస్కరించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ పదిగములో అర్చావతారము రూపము‌లో ఉన్న భగవానుడి యొక్క ఆధిపత్యాన్ని ఆళ్వారు వెల్లడించారు. ఈ దివ్య దేశము ఆళ్వారు జన్మస్థలం కాబట్టి, ఇక్కడ ఉన్న ఎంబెరుమానుడిపై ఆయనకున్న ప్రత్యేక అనుబంధం కూడా తెలుపుతున్నారు.

మొదటి పాశురము:  “ఎంబెరుమాన్ యొక్క సరళ స్వభావాన్ని స్థాపించే వచనాలను పలుకుతూ, అతి సరళుడైన సర్వేశ్వరుడు ఇక్కడ ఉండగా, మీరు ఇతర దేవతలను వెతుకుతున్నారు? అని  భౌతిక వాసులను ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

ఒన్ఱుం తేవుం ఉలగుం ఉయిరుం మఱ్ఱుం యాదుం ఇల్లా
అన్ఱు నాన్ముగన్‌ తన్నొడు దేవర్‌ ఉలగోడుయిర్‌ పడైత్తాన్
కున్ఱం పోల్‌ మణి మాడ నీడు తిరుక్కురుగూర్‌ అదనుళ్
నిన్ఱ ఆదిప్పిరాన్ నిఱ్క మఱ్ఱై త్తెయ్వం నాడుదిరే

దేవ గంధర్వులను, వాళ్ళ లోకాలను, ఇతర జాతులను, సమస్థ అస్థిత్వాలను ప్రళయ కాలములో నాశనం చేసి, భగవానుడిలో ఇమిడ్చ బడి ఉన్నప్పుడు, సమష్ఠి పురుష అని పిలువబడే బ్రహ్మను భగవాన్ సృష్టించాడు, దేవతలను వాళ్ళ లోకాలను సృష్థించాడు, ఇతర భిన్న విభిన్న జాతులను సృష్థించాడు; సర్వకారకుడు, మహోపకారి అయిన అటువంటి ఎంబెరుమాన్, పర్వతాలంత ఎత్తైన గోపురాలున్న ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉండగా, మీరు సృష్టి లయలలో కొట్టుమిట్టాడుతున్న ఈ దేవతల దగ్గరకు వెళుతున్నారు.

రెండవ పాశురము:  భగవానుడి చేత సృష్టింపబడిన వారితో ఆళ్వారు ఇలా అంటాడు, “భగవత్ సృష్టి విషయానికి వస్తే మీరు, మీరు పూజించే దేవతలు ఒకటే; అందువల్ల, మీరు తిరునగరిని ఆశ్రయించండి, అక్కడ నిత్య సంపదగా సర్వేశ్వరుడు కృపతో మీకోసము వెలసి ఉన్నాడు”.

నాడి నీర్‌ వణంగుం దెయ్వముం ఉమ్మైయుం మున్ పడైత్తాన్
వీడిల్‌ శీర్‌ ప్పుగళ్‌ ఆదిప్పిరాన్ అవన్ మేవి ఉఱై కోయిల్
మాడ మాళిగై శూళ్‌ందళగాయ తిరుక్కురుగూర్‌ అదనై
ప్పాడియాడి ప్పరవి చ్చెన్మింగళ్ పల్లులగీర్‌  పరందే

సృష్టి ఆదిలో నిన్ను, నీవు ఆశ్రయిస్తున్న దేవతలను సృష్టించి, మొట్ట మొదటి పోషకత్వం వహించినవాడు సర్వేశ్వరుడు. ఔన్నత్యము, జ్ఞానము, శక్తి వంటి నిత్య మంగళ గుణాలతో కూడినవాడు అతడు. అటువంటి భగవానుడు గొప్ప రాజభవనాలు, గోపురాలు చుట్టూ వ్యాపించి అందంగా ఉన్న దివ్య తిరునగరిలో స్థిరంగా కొలువై ఉన్నాడు; ఓ! వివిధ లోకాలలో నివసిస్తున్న వారా! మీరు అతడిని అన్ని వేళలా అన్ని చోట్లా స్తుతించండి, పాడండి, ఆడండి.

మూడవ పాశురము:  “ఈ విశ్వం యొక్క రక్షణ మొదలైనవి ఒకే కారణం యొక్క ఫలితము, ఇది అత్యోన్నత ప్రభువు యొక్క ఆధిపత్యాన్ని తెలుపుతుంది” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పరంద దెయ్వముం పల్లులగుం పడైత్తు అన్ఱుడనే విళుంగి
క్కరందుమిళ్ందు కడందిడందదు కండుం తెళియగిల్లీర్‌
శిరంగళాల్‌ అమరర్‌ వణంగుం తిరుక్కురుగూర్‌ అదనుళ్
పరన్ తిఱం అన్ఱి ప్పల్లులగీర్‌ ! దెయ్వమ్‌ మఱ్ఱిల్లై పేశుమినే

అనేక దేవతలను, వాళ్ళకి విస్తారమైన అనేక లోకాలు సృష్టించి, ప్రళయ కాలములో ఆ లోకాలన్నింటినీ తాను మ్రింగి తనలో దాచిపెట్టుకొని, ప్రళయము తరువాత వాటిని తనలో నుంచి బయటికి ఉమ్మి వాటికి స్థానమిచ్చి, వాటిని సంరక్షించాడు సర్వేశ్వరుడు అని తెలుసుకున్న తరువాత కూడా మీకు స్పష్టత రాలేదు. తిరునగరి భగవానుడి ప్రాకారం (స్వరూపము) లో భాగము కాని స్వతంత్ర దేవతలు ఎవరూ లేరు;  సమస్థ దేవతలు నమస్కరించి పూజించబడుతున్న వాడతడు; ఓ! అనేక దివ్య లోక వాసులారా! అలాంటి దైవము ఇంకెవరైనా ఉంటే చెప్పండి.

నాలుగవ పాశురము:  “దేవతాంతరములకి ప్రభువు, నిష్కల్మషమైన వేదములను వెల్లడి చేసినవాడు, సర్వేశ్వరుడు అయిన భగవానుడి అత్యోన్నత ఆధిపత్య గుణాన్ని తిరస్కరించే నైయైయికులకి ఏమి ఫలితము దొరుకును?  అని ఆళ్వారు అడుగుతున్నారు.

పేశ నిన్ఱ శివనుక్కుం పిరమన్‌ తనక్కుం పిఱర్‌క్కుం
నాయగన్ అవనే కబాలనన్ మోక్కత్తు క్కండు కొణ్మిన్
తేశ మా మదిళ్‌ శూళ్‌ందళగాయ తిరుక్కురుగూర్‌ అదనుళ్
ఈశన్ పాల్‌ ఓర్‌ అవం పఱైదల్ ఎన్నావదు ఇలింగియర్‌క్కే

రుద్రుడికి, బ్రహ్మకి, ఇతర దేవతలకి ఏకైక  ప్రభువు సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణుడు);  రుద్రుని చేతిలో నుండి కపాలము ఎలా మాయము చేయబడిందో మీరు మహాభారతంలో చూడవచ్చు; సర్వేశ్వరుడు దేవుడు కాడని అల్పంగా భోదించే  లింగ పురణము మొదలైనవాటిని ప్రమాణముగా భావించే అనుమానికులకు వచ్చే ప్రయోజనం ఏమిటి? గొప్ప కోటలు చుట్టూ వ్యపించి ఉన్న తిరునగరిలో అందమైన దివ్య తేజస్సుతో విరాజిల్లి ఉన్న భగవానుడు  సహజంగానే అందరికీ దేవుడు.

ఐదవ పాశురము:  బాహ్యా కుదృష్టులను తిరస్కరించిన ఆళ్వారు, “తిరునగరిలో కొలువై ఉన్న ఎంబెరుమాన్ అందరి కంటే ఉన్నతమైనవాడు” అని చెబుతున్నారు.

ఇలింగత్తిట్ట పురాణత్తీరుం శమణరుం శాక్కియరుం
వలిందు వాదు శెయ్వీర్గళుం మఱ్ఱు నుం దెయ్వముం ఆగి నిన్ఱాన్
మలిందు శెన్నెల్‌ కవరి వీశుం తిరుక్కురుగూర్‌ అదనుళ్‌
పాలిందు నిన్ఱ పిరాన్ కండీర్‌ ఒన్ఱుం‌ పాయ్యిల్లై పోఱ్ఱుమినే

ఓ తామస పురాణాలను అనుసరించి నమ్మే కుదృష్ఠులారా ! ఓ జైనులారా! ఓ బౌద్దులారా! ఓ వైశేషికులారా! వితండ వాదనలు చేసేవారా! మీరు పొందాలను కొని లక్ష్యముగా పెట్టుకొన్న ఆ భిన్న భిన దేవతలు ఎంబెరుమానుడికి పరతంత్రులు. సమృద్ధిగా ఉన్నలేతా వరి పంటలు ఇటు అటు ఊగులాడుతూ వింజామర వీస్తున్నట్టున్న ఆ తిరునగరిలో కొలువై ఉన్న సర్వేశ్వరుడిని మీరందరూ స్తుతించండి. ఇలా అనుకోవడంలో ఎటువంటి అబద్ధము లేదు.

ఆరవ పాశురము:  “మనకు తెలియకుండా కర్మాధారంగా ఈ భౌతిక జగత్తును ఎలా ఏలుతున్నాడు అన్నది ఎంబెరుమాన్ యొక్క నైపుణ్యతను తెలుపుతుంది”. అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పోఱ్ఱి మఱ్ఱోర్ దెయ్వం పేణప్పుఱత్తిట్టు ఉమ్మైయిన్నే
తేఱ్ఱి వైత్తదు ఎల్లీరుం వీడు పెఱ్ఱాల్‌ ఉలగిల్లై ఎన్ఱే
శేఱ్ఱిల్‌ శెన్నెల్‌ కమలం ఓంగు తిరుక్కురుగూర్‌ అదనుళ్‌
ఆఱ్ఱ వల్లవన్ మాయం కండీర్ అదఱిందఱిందోడుమినే

ఈ విధంగా మిమ్మల్ని తన నుండి దూరంగా ఉంచి, దేవతాంతరములను స్తుతించి సేవించేలా చేయడంలో పరమార్థము ఏమిటంటే ప్రతి ఒక్కరూ ముక్తిని పొంది మోక్షాన్ని చేరుకున్నట్లయితే, ఈ ప్రపంచంలోని నిషేధాలు / ఆజ్ఞలు మటుమాయమౌతాయి. ఈ కారణంగా – లేత తామర పుష్పముల మడుగులతో, పుష్కలమైన వరి సంపదతో వర్ధిల్లుతున్న ఆళ్వార్తిరునగరిలో నివాసుడై ఉన్న ఎంబెరుమాన్, వారి కర్మ ఫలితాలను అనుభవింపజేయుటలో మహా సామర్థ్యం కలిగి ఉన్నవాడు – అటువంటి ఎంబెరుమానుడికి ఈ ప్రకృతితో (ఈ భౌతిక ప్రపంచము) ఉన్న సంబంధాన్ని ‘మాయ’ అని పిలుస్తారు; ఆ మాయ గురించి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ భౌతిక ప్రపంచాన్ని దాటడానికి ప్రయత్నించండి.

ఏడవ పాశురము:  “అన్య దేవతల నుండి నీవు ఇప్పటి వరకు ఏది పొందావో అది మాత్రమే పొందగలవు; కాబట్టి, గరుడ ధ్వజము కలిగి ఉన్న సర్వకారకుడికి దాసుడిగా మారు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఓడియోడి ప్పల పిఱప్పుం పిఱందు మఱ్ఱోర్ దెయ్వం
పాడియాడి పణిందు పల్పడిగాల్‌ వళి ఏఱి క్కండీర్‌
కూడి వానవర్‌ ఏత్త నిన్ఱ తిరుక్కురుగూర్‌ అదనుళ్
ఆడు పుట్కొడి ఆది మూర్‌త్తిక్కు అడిమై పుగువదువే

ఇతర దేవతలను స్తుతించి పాడుట ఆడుట, వాళ్ళని అనేక రకాలుగా ఆరాధించుట, శాస్త్ర విధంగా వాళ్ళని మరింతగా ఆశ్రయించడం, అనేక జన్మలనెత్తి పరుగులాడటం, ఇవన్నీ మీరు గమనించి సర్వకారకుడైన సర్వేశ్వరుడికి దాసులుకండి, సమస్థ దేవతలచే స్తుతింపబడుతూ గరుడ ధ్వజముతో ఆ ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉన్న సర్వేశ్వరుడికి శరణు వేడుకొండి.

ఎనిమిదవ పాశురము:  “ఎంబెరుమాన్ అన్య దేవతలకు ఇచ్చిన శక్తి కారణంగా, వాళ్ళని ప్రార్థించిన వారి కోరికలు వాళ్ళు తీర్చగలుతారు. ఉదాహరణకి, నారాయణుడు ఇచ్చిన శక్తి సామర్థ్యముతో మార్కణ్డేయుని కోరికలను రుద్రుడు తీర్చగలిగాడు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

పుక్కడిమైయినాల్‌ తన్నై క్కండ మార్కణ్డేయన్ అవనై
నక్క పిరానుం అన్ఱుయ్య క్కొండదు  నారాయణన్ అరుళే
కొక్కలర్‌ తడంతాళై వెలి త్తిరుక్కురుగూర్‌ అదనుళ్
మిక్క ఆదిప్పిరాన్ నిఱ్క మఱ్ఱై త్తెయ్వం విళంబుదిరే

రుద్రుడు దిగంబరంగా ఉండుట వలన అతడిని ‘నగ్న’ అని పిలుస్తారు. తన పురాణము ద్వారా ప్రసిద్ది చెందిన మార్కణ్డేయుడిని ప్రళయం సమయంలో రక్షించగా, అతడి సేవకు మెచ్చి రుద్రుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, నారాయణుని కృపతో మార్కణ్డేయుని ఉద్దరణకై భగవత్భక్తుడిగా చేసాడు. అందువల్ల, సర్వోన్నతుడు, సర్వకారకుడు అయిన నారాయణుడు పచ్చని ఆకులతో,  తెల్లని పూలతోటలలో కప్పి ఉన్న  ఆళ్వార్తిరునగరిలో కొలువై ఉన్నాడు.

తొమ్మిదవ పాశురము:  “మీరు రక్షింపబడాలంటే, బాహ్య కుదృష్థులు తమ వితండ వాదనలతో నాశనము చేయలేని, ఎంబెరుమాన్ కొలువై ఉన్న ఆళ్వార్తిరునగరిని ఆశ్రయించండి”. అని ఆళ్వారు వివరిస్తున్నారు.

విళంబుం ఆఱు శమయముం అవై యాగియుం మఱ్ఱుం తన్ పాల్
అళందు కాండఱ్కరియన్ ఆగియ ఆదిప్పిరాన్ అమరుం
వళం గొళ్‌ తణ్‌ పణై శూళ్ందళగాయ తిరుక్కురుగూర్‌ అదవై
ఉళం గొళ్ జ్ఞానత్తు వైమ్మిన్ ఉమ్మె ఉయ్యక్కొండు పోగుఱిలే

సర్వకారకుడు సర్వోపకారి అయిన ఎంబెరుమాన్, వేదాల్ని ధిక్కరించి తిరస్కరించే ఆ ఆరు తత్వశాస్త్రాల యొక్క సమిష్టి సమూహాల కుదృష్థులకు, తన విషయాలను చూసి గ్రహించడం కష్టకరంగా చేసే స్వభావము ఉంది. మీరు ఉద్ధరింపబడాలనుకుంటే, ఆకర్షణీయమైన నీటి వనరులతో వ్యాపించి ఉన్న  ఆళ్వార్తిరునగరిలో స్థిర నివాసమున్న భగవానుడిని మీ ఆంతరిక జ్ఞానంలో ఉంచుకోండి, మీ బాటను సులభకరం చేసుకోండి.

పదవ పాశురము: “శరీరి, అతిసులభుడు, తన లీలలతో అందరి హృదయాలను ఆకర్షంచే ఎంబెరుమానుడికి సేవ చేయడం సముచితము మరియు మన అదృష్థము కూడా” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఉఱువదావదు ఎత్తేవుం ఎవ్వులగంగళుం మఱ్ఱుం తన్పాల్
మఱువిల్‌ మూర్‌త్తియోడొత్తు ఇత్తనైయుమ్‌ నిన్ఱ వణ్ణం నిఱ్కవే
శెఱువిల్‌ శెన్నెల్‌ కరుంబొడోంగు తిరుక్కురుగూర్‌ అదనుళ్
కుఱియ మాణ్‌ ఉరువాగియ నీళ్‌ కుడక్కూత్తనుక్కాట్చెయ్వదే

అన్ని వర్గాల దేవతలు, సమస్థ లోకాలు, చిదచిత్తులు, అన్నితత్వాలు అతడి స్వరూపంలోని భాగముగా ఎంబెరుమాన్ తన గుణాలను మరియు గుర్తింపుని కోల్పోకుండా వాళ్ళ స్వరూపాలకు ఒక ప్రత్యేక గుర్తింపు నిచ్చి నిలుచొని ఉన్నాడు; అతడు సారవంతమైన భూములతో ఎత్తైన చెరుకు పంటలు, వరి పంటలతో ఉన్న తిరుక్కురుగూర్లో కూడా కొలువై ఉన్నాడు.  బ్రహ్మచారిగా వామన రూపములో,  కుదక్కూత్తుని ప్రదర్శించిన కృష్ణుడిగా నిత్య ఆనందాన్నిచ్చే అటువంటి ఎంబెరుమానుడిని సేవించడం మన అదృష్థము. మనకి సముచితమైన పురుషార్థము కూడా.

పదకొండవ పాశురము: “ఈ పదిగం నేర్చుకున్న వారికి పరమపదము పొందుట అతి సులభమగును” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఆట్చెయ్దు ఆళి ప్పిరానై చ్చేర్‌ందవన్ వణ్‌ కురుగూర్‌ నగరాన్
నాట్కమళ్‌ మగిళ్‌ మాలై మార్బినన్ మాఱన్ శడగోపన్
వేట్కైయాల్‌ శొన్న పాడల్ ఆయిరత్తుళ్‌ ఇప్పత్తుం వల్లార్
మీట్చి ఇన్ఱి వైగుంద మానగర్‌ మఱ్ఱదు కై యదువే

మహా విశిష్టత కలిగిన ఆళ్వార్తిరునగరికి నాయకుడైన ఆళ్వారుకి “శఠకోపుడు” అనే దివ్య నామము, “మారాన్” అనే ఇంటి పేరున్న ఆళ్వారు, చక్రధారి అయిన భగవానుడికి తన వాక్కు ద్వారా సేవలందించారు. వెయ్యి పాసురములలో ఈ పది పాసురములను పాట రూపంలో పాడారు. ఈ పది పాసురములను పఠించగలిగిన వారు, మరళా తిరిగి రాలేని దివ్య శ్రీవైకుంఠాన్ని చేరుకుంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము:http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-4-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org