Category Archives: telugu

అమలనాదిపిరాన్ – సరళ వ్యాఖ్యానము

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ముదలాయిరము

శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తిన మాల 10వ పాశురములో అమలనాదిపిరాన్ యొక్క వైభవమును అద్భుతంగా వెల్లడించారు.

కార్తిగైయిల్ రోహిణి నాళ్ కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్!                                                               వాయ్ త్త పుగళ్ పాణర్ వన్దుదిప్పాల్! ఆత్తియర్ గళ్                                                   అన్బుడనేదాన్ అమలనాదిపిరాన్ కత్త దఱ్పిన్!                                                                 నన్గుడనే కొణ్డాడుమ్ నాళ్!!

ఓ! ప్రపంచ జనులారా! వీక్షించండి, ఈ రోజు కార్తీక మాసమున రోహిణీ నక్షత్రము, తిరుప్పాణాళ్వార్ అవతరించిన శుభదినము. వేదములను నమ్మి గౌరవించిన వారు ఈ ఆళ్వార్ పాడిన అమలనాదిపిరాన్ ప్రబంధాన్ని అభ్యసించిరి. అభ్యసించిన పిదప ఈ ప్రబందము పది పాసురములలో వేదార్థములు అందముగా వివరించి ఉన్నాయని, సదా పశ్యంతి (ఎల్లప్పుడు ఎమ్పెరుమాన్ ను చూస్తూ) అని వారు ఈ దినమును వారు కీర్తించిరి.

తిరుప్పాణాళ్వార్ తాము కృప చేసిన పది పాశురముల ద్వారా, పెరియ పెరుమాళ్ (శ్రీ రంగములో శయనించి ఉన్న శ్రీ రంగనాథుడు) యొక్క దివ్య తిరుమేనియే తాము అనుభవించ గలిగే విషయమని పేర్కొన్నారు . శ్రీ రంగ ఆలయ పురోహితులైన లోకసారంగముని,  తిరుప్పాణాళ్వార్ల విషయం లో ఒక అపచారము చేసారు. ఆ కారణముగా అళ్వార్ ని తీసుకురమ్మని పెరియ పెరుమాళ్ ఆ అర్చకుడిని ఆదేశిస్తారు. లోకసారంగముని వెంటనే తిరుప్పాన్ ఆళ్వార్ వద్దకు వెళ్లి తనతో పాటు ఆలయానికి రమ్మని ప్రార్థిస్తారు. కానీ, ఆళ్వార్ తాను శ్రీ రంగములో అడుగు పెట్టడానికి అర్హులు కారని, తాను రాలేరని నిరాకరిస్తారు.  అప్పుడు లోకసారంగమునివరులు ఆళ్వారి ని తన భుజాలపై ఎత్తుకొని తీసుకు వెళతారు. ఈ విధముగా ‘మునివాహనులు’ అనే విశిష్టమైన తిరునామాన్ని ఆళ్వార్ సంపాదించుకున్నారు. వారు ఆలయములో ప్రవేశించిన క్షణం నుండి  ప్రారంభించి పెరియ పెరుమాళ్ సమక్షమములోకి వేంచేసే  వరకు పాశురములు పాడారని, పదవ పాశురము పాడిన తరువాత వారు పరమపదాన్ని అధీష్ఠించారని మనుకు చరిత్ర చెబుతుంది.

మన పూర్వాచార్యులు ఈ ప్రబంధము యొక్క పాశురముల మధ్య సంబంధమును రెండు భిన్నమైన రితులలో వ్యక్తపరచారు. పెరియ పెరుమాళ్ తమ అవయవాలను వ్యక్తపరచిన క్రమములో ఆళ్వార్ అనుభవించారన్నది మొదటిది. రేండవది పెరియ పెరుమాళ్ కురిపించిన ఉపకారములు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాశురానుభవము చేయుట తగును.

ఈ పాశురముల సరళ వ్యాఖ్యానము మన పూర్వాచార్యుల వ్యాఖ్యానముల సహాయముతో వ్రాయబడింది.

తనియన్లు

ఆపాదచూడ మనుభూయ హరిం శయానం
మధ్యే కవేర దుహితుర్ ముదితాంతరాత్మా|
అద్రష్టతాం నయనయోర్ విషయాంతరాణాం
యో నిశ్చికాయ మనవై మునివాహనం తం||

పెరియ పెరుమాళ్ తప్పా ఇంకే విషయముతో అనుబంధము ఉంచుకోని తిరుప్పాణాళ్వార్, లోకసారంగముని సహాయముచే లోనికి వెళ్లి పెరియ పెరుమాళ్ యొక్క దివ్య చరణాల నుండి మకుటము వరకు అనుభవించి పరమానందాన్ని పొందిన తిరుప్పాణాళ్వార్ని నేను ఆరాధిస్తాను.

కాట్టవే కణ్డ పాద కమలమ్ నల్లాడైయుంది
తేట్టరుమ్ ఉదరబందమ్ తిరుమార్వు కండమ్ చ్చెవాయ్
వాట్టమిల్ కణ్గళ్ మేని ముని యేరి తని పుగుందు
పాట్టినాల్ కండు వాళుం పాణర్ తాళ్ పరవినోమే

లోకసారంగముని సహాయముచే  పెరియ పెరుమాళ్ సన్నిధి లోనికి ఒంటరిగా వెళ్ళి,  పెరుమాళ్ యొక్క కమలముల వంటి శ్రీపాదములు, అందమైన పీతాంబరము, దివ్య నాభి, అతి మృదువైన దివ్య ఉధరభాగము, దివ్య వక్షస్థలము, దివ్య కంఠము, ఎర్రని నోరు, అప్పుడే వికసించిన కమలముల వంటి కన్నులు, వీటన్నింటితో కూడిన దివ్య తిరుమేనిని సేవించుకొని వాటిని వర్ణించడమే తమ జీవిత ధ్యేయముగా చేసుకొని ఆనందించిన తిరుప్పాణాళ్వార్ శ్రీపాదములను ఆశ్రయించెదము.

**********

మొదటి పాశురము: పెరియ పెరుమాళ్ వ్యక్త పరచిన తమ దివ్య చరణములను వీక్షించిన ఆళ్వార్ వాటిని కీర్తిస్తున్నారు.

ఏ అపేక్షను ఆశించకుండ  తనను దాసునిగా స్వీకరించి, ఆపై తన దాసులకు దాసునిగా చేసి నందుకు పెరియ పెరుమాళ్ యొక్క శుద్ధమైన మంగళ గుణాలను ఆళ్వార్ కీర్తిస్తున్నారు.

అమల నాదిపిరాన్ అడియార్కెన్నై ఆట్పడుత్త
విమలన్ విణ్ణవర్ కోన్ విరై యార్ పొళిల్ వేంగడవన్
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళ్ అరగత్తమ్మాన్                                                      తిరుక్కమలపాదం వన్దు ఎన్ కణ్ణిన్ ఉళ్లన వొక్కిన్ఱతే  (1)

ఎత్తైన గోడలతో నిర్మింపబడి ఉన్న తిరువరంగంలో శయనించి ఉన్న ఓ స్వామీ! నా నుంచి ఏ ఫలమును ఆశించని అత్యంత పవిత్రమైన వాడివి నీవు; నీకు దాసునిగా చేసుకోవడమేగాక నీ  అనుచరులకు కూడా దాసుగా చేసే స్వచ్చత గలిగిన వాడివి; నిత్యసూరులకు యజమానుడివి నీవు; సువాసనలు వెదజల్లే పూల తోటలతో నిండి ఉన్న తిరువేంగడంలో నిత్య నివాసము ఉన్నవాడివి నీవు; నీ అనుచరులు సులభముగా సమీపించే  స్వచ్చత గలిగిన వాడా; నీ అనుచరుల లోపాలను చూడని గుణము గలిగిన వాడా; నీవు స్వామిత్వము – శేశత్వము అవిచ్చిన్నముగా ఉండే పరమపదమును ఏలు వాడవు. నీ దివ్య చరణములు తమకు తాముగా వచ్చి తన కన్నులలోకి ప్రవేశించాయని ఆళ్వార్ సాగించారు .

రెండవ పాశురము: తిరు పీతాంబరమును ఆళ్వారులు ఆస్వాదిస్తున్నారు. ఎలాగైతే సముద్ర అలలు పడవను మెల్లిగా తోస్తాయో, పెరుమాళ్ యొక్క దివ్య తిరుమేనిలో ఆళ్వార్ ఒక అంగము నుండి ఇంకొక అంగము వైపు తోయబడుతున్నారు.

పెరుమాళ్ యొక్క నిర్హేతుక కృప ఇంకేక్కడైనా ప్రదర్శించారా అని ప్రశ్నించి నప్పుడు, ఆళ్వార్ త్రివిక్రముని వృత్తాంతము చూపిస్తూ ఆనందిస్తున్నారు.

ఉవంద ఉళ్ళత్తనాయ్ ఉలగం అళందండం ఉఱ
నివంద నీళ్ముడియన్ అన్ఱు నేరంద నిశాశరరై
కవరంద వెంగణై క్కాగుత్తన్ కడియార్ పొళిల్ అరంగత్తమ్మాన్                                                      అరైచ్చివంద ఆడైయిన్ మేల్ శెన్ఱదాం ఎన శిందనైయే (2)

ముల్లోకాలను కొలిచేటప్పుడు పెరుమాళ్ యొక్క ఆ దివ్య కిరీటము ఈ బ్రహ్మాండమునంతా వ్యాపించినది. క్రూరంగా బాధించునట్టి తన బాణములతో అసురులను  వధించిన శ్రీ రాముడే సువాసనలు వెదజల్లే పూలతోటలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ రూపములో శయనించి ఉన్నాడు. వారి దివ్య నడుమును చుట్టి ఉన్న ఆ దివ్య పీతాంబరముపై నా మనస్సు నిలిచి ఉంది.

మూడవ పాశురము: ఇందులో, భగవాన్ యొక్క దివ్య నాభికమలమును అనుభవిస్తున్నారు. బ్రహ్మ అధీష్టించిన తరువాత ఆ దివ్య నాభి యొక్క సౌందర్యము మరింత పెరిగినదని వారు తెలియజేస్తున్నారు.

మునుపటి పాశురములో త్రివిక్రమ అనుభవాన్ని పొందిన ఆళ్వార్, ఈ పాశురములో తిరువేంకటనాధునిగా ప్రత్యక్షమైన భగవానుడిని పరమానందిస్తున్నారు. పెరియ పెరుమాళ్ మరియు తిరువేంకటనాధుడు ఇరువురు ఒకే ఎంబెరుమాన్ యొక్క రెండు దివ్య స్వరూపాలు అని తెలియజేస్తున్నారు.

మంది పాయ్ వడవేంగడ మామలై వానవర్గళ్
శందిశెయ్య నిన్ఱాన్ అరంగత్తర వినణైయాన్
అంది పోల్ నిఱై త్తాడైయుం అదన్ మేల్ అయనై ప్పడైత్తదోర్ ఎళిల్
ఉంది మేలదన్ఱో అడియేన్ ఉళ్ళత్తిన్ ఉయిరే (3)

తమిళ దేశానికి ఉత్తరాన ఉన్న తిరుమల కొండపై పెరుమాళ్ నిలుచొని ఉన్నారు, కోతులు గేంతుకుంటూ ఆడుకొనే ఈ కొండకు నిత్యసూరులు వేంచేసి పెరుమాళ్ని శ్రీనివాసుని రూపంగా ఆరాధిస్తారు. వారే శ్రీరంగంలో మెత్తని శేష శెయ్యపై (ఆదిశేషునిపై) పవళించిఉన్నారు. నా మనస్సులో ఉన్న నా ఆత్మ, ఎర్రటి ఆకాశము వలె కనిపించే పెరుమాళ్ యొక్క దివ్య పీతాంబరము, ఆ దివ్య పీతాంబరముపైన ఉన్న బ్రహ్మాసీనులైన దివ్య నాభీకమలముపై నిలవదా?

నాల్గవ పాశురము: ఎంబెరుమాన్ యొక్క దివ్య నాభితో కూడిన ఉదర భాగాన్ని దర్శించి ఆళ్వార్ ఆనందిస్తున్నారు. ఆ దివ్య నాభిని వ్యాపించి ఉన్నది బ్రహ్మ అయితే, “సమస్థ లోకాలను నాలో ఉంచుకున్నాను, కాదా!” అని ఆ దివ్య ఉదరము చెబుతుంది.

ఎంబెరుమాన్ మనల్ని స్వీకరించే ముందు మన అహంకార మమకారములు తొలగించరా? లంకను చుట్టి ఉన్న ఎత్తైన ప్రహరీ గోడలను పడగొట్టినట్టుగా, వారి శత్రువులను కూడా తొలగిస్తారు అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

శదుర మామదిళ్ శూళ్ ఇలంగైక్కిరైవన్ తలైపత్తు                                                                    ఉదిర ఓట్టి ఓర్ వెంగణనై ఉయత్తవన్ ఓద వణ్ణన్
మదుర మావండు పాడ మా మయిలాడరంగత్తమ్మాన్ తిరు వయిత్తు                                        ఉదర బందం ఎన్ ఉళ్ళత్తుళ్ నిన్ఱులాగిన్ఱదే (4)

కూనిరాగములు పాడుతున్న తుమ్మెదలు మరియు నాట్యము చేస్తున్న నెమలులు ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ శయనించి ఉన్నారు. అటువంటి పెరియ పెరుమాళ్ నాలుగు విధములైన రక్షణములు ఉన్న లంకా నాయకుడైన రావణుడిని యుద్దములో వణుకుపుట్టించాడు. సాగర వర్ణము గల ఎంబెరుమాన్ ఆ తరువాత దశ ముఖ రావణుడిని వధించాడు. పెరియ పెరుమాళ్ యొక్క ఉదర భాగాన్ని అలంకరించిన దివ్యాభరణము నా యొక్క హృదయములో దృఢముగా నిలిచిపోయింది.

ఐదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ పెరియ పెరుమాళ్ యొక్క దివ్య వక్షస్థలమును ఆనందిస్తున్నారు. ఎంబెరుమాన్ యొక్క ఆ దివ్య వక్షస్థలములో చిత్ మరియు అచిత్తులకు గుర్తింపుగా శ్రీవత్సము మరియు కౌస్తుభములు ఉంటాయి. ప్రళయ కాలములో ముల్లోకాలను తన కడుపులో ఉంచు కున్న వారి దివ్య ఉధర భాగము కంటే అవి చాలా విలువైనవి. పెరుమాళ్ యొక్క గుర్తింపైన పెరియ పిరాట్టి నివాస స్థలము కూడా ఈ వక్షస్థలమే. వారి వక్షస్థల సౌందర్యాన్ని వీక్షించమని ఆహ్వానింపబడిన ఆళ్వార్, దానిని చూసి పరమానందిస్తున్నారు.

అహంకార మమకారములు నశించిన తరువాత ఆత్మను పాప పుణ్యములు వెంటాడవా? ఎంబెరుమాన్ వాటిని కూడా నశింపజేస్తాడని ఆళ్వార్ వివరిస్తున్నారు.

పారమాయ పళవినై పత్తఱుత్తు ఎన్నై త్తన్
వారమాక్కి వైత్తాన్ వైత్తదన్ఱి ఎన్నుళ్ పుగుందాన్
కోర మాదవం శెయ్ దనన్ కొల్ అఱియేన్ అరంగత్తమ్మాన్                                                         తిరు ఆరమార్వదన్ఱో అడియేనై ఆట్కొడదే (5)

ఎన్నో జన్మలలో చేసిన కర్మలు కూడి కూడి పెద్ద మూట అయ్యి, నన్ను వెంటాదుతూ ఉన్నాయి, అయినా స్వామి తన పైన ఆప్యాయత పెరిగేలా తాను చేశారు. అంతటితో ఆగక, అయన నా హృదయములో ప్రవేశించారు. నా పూర్వ జన్మలలో నేను ఏ ఘోర తపస్సు చేశానో ఏమో, ఈ రోజు నాకు ఇంతటి అదృష్టము దక్కినది. ఆ శ్రీరంగానికి నాథుడైన పెరియ పెరుమాళ్ యొక్క దివ్య వక్షస్థలము, ఆ దివ్య వక్షస్థలములో శ్రీ మహాలక్ష్మి, దివ్య ఆభరణాలు ఈ దాసుడిని సేవకుడిగా చేసినవి.

ఆరవ పాశురము:  ఈ పాసురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్య కంఠభాగమును అనుభవిస్తున్నారు. ప్రళయ కాలమున పిరాట్టితో పాటు చిదచిత్తులు ఎంబెరుమాన్ యొక్క వక్షస్థలములో ఉంటాయి, అన్ని లోకాలను నేను మ్రింగి రక్షిస్తాను అని దివ్య  కంఠభాగము పలికిన పలుకులు విని ఆళ్వార్ ఆనందానుభవము పొందుతున్నారు.

ఎంబెరుమాన్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరి పాపాలైనా ఇలా తొలగించారా? బ్రహ్మ శాపముతో బాధ పడుతున్న శివుడిని ఎంబెరుమాన్ శాప విమోచనము చేశారు, చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోతుండగా  శాప విమోచనము చేశారు అని ఆళ్వార్ గుర్తుచేసుకుంటున్నారు.

తుండ వెణ్పిఱై యాన్ తుయర్ తీర్తవన్ అంజిరై
వండువాళ్ పొళిల్ శూళ్ అరంగనగర్ మేయ అప్పన్
అండర్ రండ బగిరండత్తు ఒరు మానిలం ఎళుమాల్ వరై ముత్తుమ్                                                 ఉణ్డ కండ కండీర్ అడియేనై ఉయ్యక్కొండదే (6)

అర్థ చంద్రాకారుడిని తలపై ధరించిన శివుడి బాధను ఎంబెరుమాన్ తొలగించి వెశారు. ఇంకా అర్థ చంద్రాకారుని బాధను కూడా ఎంబెరుమాన్ మాయము చేశారు. అందమైన రెక్కలతో ఉన్న తూనీగలు విహరిస్తున్న తోటలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీరంగములో పెరియ పెరుమాళ్ చక్కగా ఒప్పి ఉన్నారు. అన్ని అండములలో ఉన్న జీవరాసులను, లొకాలను, ఆ విశ్వాలపై ఉన్న పొరలన్నీ మరియు అన్ని తత్వాలను మ్రింగిన పెరియ పెరుమాళ్ యొక్క ఆ దివ్య కంఠము తనని ఉద్దరింప జేసింది అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.

ఏడవ పాశురము: ఇందులో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్యమైన నోటిని మరియు వారి అధరములను సేవించి ఆనందిస్తున్నారు. ఆ దివ్యమైన నోరు ఆళ్వార్ తో “దివ్య కంఠము లోకాలన్నీటిని మింగినప్పటికీ, మొదట లోకాలన్నిటినీ తాను తీసుకొని వాటితో మా శుచః (చింతించవద్దు) అని వూరటనిచ్చే మాటలు పలుకుతాను” అని ఆ దివ్య నోరు పలికిన మాటలను విన్న ఆళ్వార్ ఆనందిస్తున్నారు.

రుద్రుడు మొదలైన వారి రక్షణ ఎంబెరుమాన్ వహిస్తాడు. కానీ నిన్ను రక్షిస్తాడా? ఇతర లాభాలను ఆశించే దేవలోక వాసులకన్నా ఎక్కువగా నేను ఎంబెరుమాన్ ని ఆశిస్తాను, నన్ను తప్పక రక్షిస్తారని ఆళ్వార్ తమ మనస్సుకు బదులిస్తున్నారు.

కైయినార్ శురి శంగన లాళియర్ నీళ్వరై పోల్
మెయ్యనార్ తుళబవిరైయార్ కమళ నీళ్ ముడియమ్
ఐయ్యనార్ అణి అరంగనార్ అరవిన్ అణైమిశై మేయ మాయనార్
శెయ్య వాయ్ అయ్యో ఎన్ చ్చిందై కవరందదువే (7)

పెరియ పెరుమాళ్ వద్ద ముడుచుకొని ఉన్న దివ్య శంఖము, కోటి కాంతులను వెదజల్లే దివ్య చక్రము, విశాలమైన పర్వతము వంటి దివ్య తిరుమేని, సువాసనలు వెదజల్లే దివ్య తుళసితో అలంకరింపబడిన పొడుగాటి దివ్య కిరీటము ఉన్నాయి. అందమైన శ్రీ రంగములో ఆదిశేషునిపై శయనించి ఉన్నారు. ఆ దివ్య క్రియాకలాపాలతో ఉన్నవారు నా స్వామి. ఆ స్వామి యొక్క ఎర్రని దివ్య నోరు నన్ను ఆకర్షించింది.

ఎనిమిదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క దివ్య నేత్రాలను ఆనందిస్తున్నారు. వారి దివ్య నోరు ఏం చెప్పినా కానీ, వారి ఆధిపత్యాన్ని సూచించే వాత్సల్యాన్ని కురిపించేది వారి నేత్రాలు మాత్రమే. కావున ఆళ్వార్ భగవాన్ దివ్య నేత్రాలను ఆనందిస్తున్నారు.

నాలుగు మరియు ఐదవ పాశురములలో మన పూర్వ కర్మలు, అహంకార మమకారములు నిర్మూలించబడతాయని చూపబడింది. అవి తొలగించబడినా కానీ, ఆ మనిషిలో “అవిధ్య” (అజ్ఞానము) ఇంకా ఉంటే అతని అహంకార మమకారములు మొదలైనవు తిరిగి రావచ్చు కదా? అవిధ్యకు చిహ్నమైన తమో గుణానికి ప్రతిరూపమైన హిరణ్య కశిపుడిని ఎంబెరుమాన్ వధించినట్టుగా, మన తమో గుణాన్ని కూడా ఎంబెరుమాన్ తొలగిస్తాడు అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.

పరియన్ ఆగి వంద అవుణన్ ఉడల్ కీండ అమరర్ క్కు
అరియ ఆది పిరాన్ అరంగత్తమలన్ ముగత్తు
కరియవాగిప్పుడై పరందు మిళిరిందు శెవ్వరి ఓడి నీంద అ
ప్పెరియ వాయ కణ్గళ్ ఎన్నై ప్పేదైమై శెయ్దనవే (8)

విశాల స్వరూపముతో దిగివచ్చి హిరణ్య కశిపుని చీల్చి వేసినాడు; బ్రహ్మాది దేవతలకు కూడా చిక్కని ఆ సర్వకారకుడు, సకల జనులకు శుభాలను ఒసగేవాడు శ్రీ రంగములో శయనించి ఉన్నాడు. వారి దివ్య శ్రీ ముఖములోని పొడగాటి నల్లని దివ్య నేత్రములు, విశాలముగా, ఎర్రని రేఖలతో అద్భుతముగా ఉన్న వారి నేత్రములు నన్ను కొల్లగొట్టినవి అని ఆళ్వార్ తెలియజేస్తున్నారు.

తొమ్మిదవ పాశురము: ఈ పాశురములో ఆళ్వార్ ఎంబెరుమాన్ యొక్క సంపూర్ణ దివ్య తిరుమేనిని ఆస్వాదిస్తున్నారు. ఎంబెరుమాన్ యొక్క అగడితఘటనా గుణాన్ని (బంధించలేని తత్వాలను బంధించగల లక్షణము) ఆనందిస్తున్నారు. వేదాంత పరిజ్ఞానము (వేదముల యొక్క చివరి భాగము, దీనినే ఉపనిషత్తులు అని కూడా అంటారు) ఉన్నట్లైతేనే తమో గుణము తొలగుతుంది. కానీ ఆళ్వార్ వేదాధ్యయానికి అర్హతలేని వంశములో జన్మించారు. ఈ ప్రశ్న తలెత్తినప్పుడు, ” ఎంబెరుమాన్ ఎవ్వరూ ఊహించలేని రీతిలో అన్ని లోకాలను మ్రింగి వటపత్ర శాయి రూపములో ఒక రాగి ఆకు పైన ఎలాగైతే శయనించారో, తన తమో గుణాన్ని కూడా అలానే నిర్మూలిస్తారు” అని ఆళ్వార్ బదులిచ్చిరు.

ఆలమా మరత్తిన్ ఇలై మేల్ ఒరు పాలకనాయ్
జ్ఞాలం ఏళుం ఉండాన్ అరంగత్తరవిన్ అణైయాన్
కోలమా మణి ఆరముం ముత్తు త్తామముం ముడి విల్లదోర్ ఎళిల్
నీల మేని ఐయో నిఱై కొండదు ఎన్ నెంజినైయే (9)

అన్ని లోకాలను మ్రింగి లేత రాగి ఆకుపై శయనించి ఉన్నవాడే శ్రీ రంగములో ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. ముత్యాలు మరియు వజ్ర వైడూర్యాలతో  తయారు చేయబడిన దివ్య తిరు ఆభరణాలతో అలంకరింపబడిన ఆ అద్వితీయమైన వారి నల్లని తిరుమేని నన్ను ఆకర్షించినది . అయ్యొ! నేను ఏమి చెయగలను!

పదవ పాశురము: చివర్లో ఆళ్వార్ పెరియ పెరుమాళ్ స్వరూపములో శ్రీ కృష్ణుడిని చూసి, ఇంక దేనిని చూసే ఆశ లేదని, ఎంబెరుమాన్ దివ్య చరణములను పొంది శ్రీవైకుంఠాని చేరుకున్నారు.

కొండల్ వణ్ణనై క్కోవలనాయ్ వెణ్ణెయ్
ఉణ్డ వాయన్ ఎన్ ఉళ్ళం కవర్దానై
అణ్డర్ కోన్ అణి అరంగన్ ఎన్ అముదినై
కండ కణ్గళ్ మత్తోన్ఱినై క్కాణావే (10)

మేఘ వర్ణములో మరియు మేఘము యొక్క గుణాలతో ఉన్నవాడు, యదు వంశములో పుట్టి వెన్న దొంగిలించినవాడు, నా మనస్సు దోచినవాడు, నిత్యసూరులకు నాయకుడైనవాడు శ్రీరంగములో శయనించి ఉన్నాడు. సంతుష్టమైన ఎంబెరుమాన్ ని చూసిన నా కళ్ళు ఇకపై దేనిని చూడవు.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము:  http://divyaprabandham.koyil.org/index.php/2020/05/amalanadhipiran-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 29 – 30

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 29

ఈ పాశురములో మామునులు చైత్రమాస ఆరుద్రా నక్షత్రముతో కూడిన శుభదిన వైభవమును ఎల్లవేళలా స్మరిస్తూ ఉండమని తన మనస్సునకు ఉద్దేశించి కృప చేయుచున్నారు.

ఎందై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా                                                              వన్దుదిత్త నాళెన్నుమ్ వాశియినాల్ ఇన్ద                                                              త్తిరువాదిరై దన్నిన్ శీర్మదనై నెఞ్జే!                                                                ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఓర్!!

క్రిందటి పాశురములలో లోకమునకు ఉపదేశించిరి. ఈ పాశురములో తానే ఈ శుభదినము యొక్క వైభవ ప్రభావమునకు ఆకర్షతులై దానిని అనుభవించుచున్నారు. ఎంబెరుమానార్ తామే “అఖిల జగత్ స్వామిన్! అస్మత్ స్వామిన్” (సకలలోకములకు నాధనే! నాకూ నాధనే) అని ఎంబెరుమాన్ విషయముగా శ్రీగద్యత్రయములో అనుభవించిన విధముగా, వీరునూ రాబోవు పాశురములలో ఎంబెరుమానార్ ఈ ప్రపంచమునకు చేసిన ఉపకారమును అనుభవిస్తూ, ఈ పాశురములో తమకు చేసిన ఉపకారమును అనుభవిస్తున్నారు.

పాశురము 30

ఇంతకు పూర్వము ఆళ్వార్ల అవతారదినములను కీర్తించినారు. ఇక నాలుగు పాశురములలో వరుసగా వారి అవతార స్థలమును కీర్తస్తున్నారు. ఈ పాశురములో మొదలాళ్వార్ల, తిరుమంగై ఆళ్వారు మఱియు తిరుప్పాణ్ ఆళ్వార్ల అవతార స్థలములను గురించి కృప చేయుచున్నారు. శ్రీ అయోధ్యా, శ్రీ మధురా మొదలగునవి ఎంబెరుమాన్ అవతరించిన దివ్య క్షేత్రములు. వీటికి ఎటువంటి కీర్తి గలదో అదేవిధంగా కీర్తి కలిగినవి ఆళ్వార్లవతరించిన ప్రదేశములు ఏలననగా ఆళ్వార్లవతరించుట వలననే మనము ఎంబెరుమాన్ ను తెలుసుకొనగలుగుచున్నాము.

ఎణ్ణరుమ్ శీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోన్ఱియ ఊర్!                                       వణ్మై మిగు కచ్చి మల్లై మామయిలై మణ్ణియిల్ నీర్                                            తేజ్ఞ్గుమ్ కుఱైయలూర్ శీర్ కలియన్ తోన్ఱియ ఊర్!                                                ఓజ్ఞ్గుమ్ ఉఱైయూర్ పాణనూర్ !!

లెక్కింపనలవిగాని కల్యాణ గుణములు కలిగిన వారు ముదలాళ్వార్లు. అదే విధముగా పొయిగై, పూదత్త మరియు పేయాళ్వార్లు అవతరించిన ప్రదేశములు తరతరాలుగా చాలా విశిష్టతను కలిగిన కాంచీపురం (తిరువెక్కా), తిరుకడల్ మల్లై (ప్రస్తుతం మహాబలిపురం) మఱియు తిరుమయిలై మొదలగునవి. స్వచ్ఛమైన నీటి సమృద్ధి కలిగిన తిరుక్కురయలూర్ గొప్ప కీర్తి గల తిరుమంగై ఆళ్వార్ల అవతార స్థలము. అదే విధముగా గొప్ప స్థితిని కలిగిన తిరుక్కొళి అని పిలువబడే తిరువురైయూర్ తిరుప్పాణాళ్వార్ల అవతార స్థలము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-29-30-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 27 – 28

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<<గతశీర్షిక

పాశురము 27

ఇక మీదటి మూడు పాశురములలో మామునులు ఆళ్వార్ల తిరునక్షత్రమైన దివ్య ఆరుద్రా నక్షత్రం ఏదైతే ఉందో అదే ఎంబెరుమానార్ (భగవద్రామానుజుల) తిరునక్షత్రము కూడా. వారు లోకోద్దారకులు. ఈ పాశురములో లోకులకు చైత్రమాస అరుద్రా నక్షత్రము యొక్క గొప్పతనమును తెలుపుచున్నారు.

ఇన్ఱులగీర్ శిత్తిరైయిల్ ఏయ్ న్ద తిరువాదిరై నాళ్!                                                      ఎన్ఱై యినుం ఇన్ఱిదనుక్కేత్తమెన్ఱాన్ ఎన్ఱవర్కు                                             చ్చాత్తుగిన్ఱేన్ కేణ్మిన్ ఎతిరాశర్ దమ్ పిఱప్పాల్!                                                     నాల్ దిశై యుమ్ కొణ్డాడుమ్ నాళ్!!

ఓ భూమండల వాసులారా! ఈ రోజు చైత్ర మాసములోని గొప్పరోజైన ఆరుద్రా నక్షత్రయుక్తమైన రోజు. ఈ రోజుకెందుకంత ప్రాముఖ్యమనుకొను వారికి నేను చెప్పుచున్నాను, వినండీ. యతులకు రారాజుగా భావించే ఎంబెరుమానార్ (భగవద్రామానుజులు)  అవతరించుటచే నాలుగు దిశలందుగల ప్రజలచే కీర్తింపబడే రోజే ఈ రోజు.

మణవాళ మామునులు తమ ఆర్తి ప్రబంధము నందు తామే “అనైత్తులగుం వాళ్ ప్పిరంద ఎతిరాశా మామునివా” అని ఎంబెరుమానారును కీర్తించినారు. ఎంబెరుమానార్ అవతారముతో ప్రపంచములోని వారందరు ఎంబెరుమానార్ మూలముగా ఉజ్జీవింపగలరని నిర్ణయింపబడినది. ఇటువంటి కీర్తిని వీరు కలిగియుండుటచే వీరు అవతరించిన ఈ రోజును ప్రపంచములోని అందరూ కూడా ఇంత గొప్పగా కీర్తిస్తున్నారు.

పాశురము 28

ఈ పాశురములో చైత్ర మాసములో తిరు ఆరుద్రా నక్షత్రము ఆళ్వార్లవతరించిన వారి తిరునక్షత్ర రోజులకంటే కూడా చాలా విశేషమైనదో అందరూ అర్థము చేసుకొను విధముగా కృపచేసినారు.

ఆళ్వార్ గళ్ తాజ్ఞ్గళ్ అవదరిత్త నాళ్ గళిలుమ్                                                       వాళ్ వాన నాళ్ నమక్కు మణ్ణులగీర్ ఏళ్ పారుమ్                                              ఉయ్య ఎతిరాశరుదిత్తరుళుమ్ శిత్తిరైయిల్                                                             శెయ్య తిరువాదిరై!!

ఓ జనులారా! చైత్రమాస ఆరుద్రా నక్షత్రమునకు ఆళ్వార్ల తిరునక్షత్రముల కంటే చాలా ప్రశస్తమైనది. ఎందుకనగా ఈ రోజుననే సమస్త జీవరాశులను ఉద్ధరించి ఉజ్జీవింప చేయాలనే తలచిన భగవద్రామానుజులు ఈ రోజుననే అవతరించినారు.
ఆళ్వార్లు ఎంపెరుమాన్/పరమాత్మ కృపచేత జ్ఞాన కొఱతలేని సంపత్తిని కలిగినవారు. వారు కరుణతో ప్రబంధములను ప్రజలందరూ తరించుటకై పాశురములుగా కృపచేసినారు. ఎంబెరుమానార్ ఆళ్వార్ల ఆ ప్రబంధముల ఆధారముగా యావత్ ప్రజలు ఉజ్జీవించే విధముగా విశిష్టాద్వైత సిధ్ధాంతమును స్థాపించినారు. అముదనార్, ఎంబెరుమానార్ శిష్యులలో ప్రముఖులు, తమ ఇరామానుశ నూత్తంతాది గ్రంథములో “ఉలగోర్ గళ్ ఎల్లాం అణ్ణల్ ఇరామానుశన్ వన్దుతోన్ఱియ అప్పొழுదే నణ్ణరు జ్ఞానమ్ తలైకొణ్డు నారణర్కాయినరే” అని కృప చేసినారు. దానికి వ్యాఖ్యానము కృప చేసిన మామునులు భగవద్రామానుజుల అవతరానంతరము అందరూ జ్ఞాన వృద్ధి కలవారై శ్రీమన్నారాయణుని ఆశ్రయించదలచారని అక్కడ మరియు ఇక్కడ కూడా అదే అభిప్రాయమును తెలిపినారు. ఇంకా ఆదిశేషావతారమైన ఎంబెరుమానార్ అవతరించి శ్రీభాష్యము మొదలగు అనేకానేక గ్రంథముల రచన మరియు ఉపదేశముల ద్వారా ఆ కాలములో అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ధన్యులైనారు అని చెప్పినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-27-28-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 25 – 26

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<<గతశీర్షిక

పాశురం 25

ఇరవదైదవ పాశురములో మధురకవి అళ్వారుల వైభవమును కృపచేయుచున్నారు. తన మనస్సునకు మధురకవి ఆళ్వార్లు ఈ భూమండలము మీద అవతరించిన చైత్ర మాసము చిత్తా నక్షత్రము రోజు మిగిలిన ఆళ్వార్లు అవతరించిన రోజులకన్నా ఎంత గొప్పనైనదో పరిశీలించి చూడమని చెప్పుచున్నారు.

ఏరార్ మధురకవి ఇవ్వులగిల్ వన్దుదిత్త! శీరారుమ్ శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్* పారులగిల్ మత్తుళ్ళ ఆళ్వార్ గళ్ వన్దుదిత్త నాళ్ గళిలుమ్! ఉత్త దమక్కెన్ఱు నెఞ్జే ఓర్!!

ఓ మనసా! గొప్ప కీర్తిగల మధురకవి ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించిన చైత్ర మాస చిత్తా నక్షత్ర ప్రాశస్త్యమును గుర్తింపుము. ఈ భూమి మీద అవతరించిన మిగతా ఆళ్వార్ల తిరువవతార దినముల కంటే మన స్వరూపమునకు తగినట్లుగానున్నది ఈ ఆళ్వార్ల అవతారమని యోచించి చూడు. మధురకవి ఆళ్వార్ల విశిష్టతను పిళ్ళలోకాచార్యులనే మన పూర్వాచార్యులు శ్రీ వచన భూషణమనే దివ్య శాస్త్రములో అందముగా వివరించినారు. మిగిలిన ఆళ్వార్లు పరమాత్మతో కొంత కాలము విశ్లేష పునః సంశ్లేషం పొంది పాశురములను కృపచేయగా మన మధురకవి ఆళ్వార్లో సర్వకాల సర్వావస్థలయందు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్లే సర్వస్వమని తలచి సర్వ విధ కైఞ్జ్కర్యము/కైంకర్యములను సమర్పించి సర్వకాలములయందు ఆనందమునే పొంది ఇతరలను కూడా దీనినే ఆచరించమని ఉపదేశించినారు. ఇట్టి గొప్పతనము ఇతరులకెక్కడిది? “శీరారుం శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్” అను వాక్యము చైత్ర మాసమునకును చిత్తా నక్షత్రమునకునూ అన్వయింపబడును. మన స్వరూపమేమనగా ఆచార్య కృపకై ఎదురు చూడడం. ఈ ఆళ్వార్ల స్థితే అందుకు నిదర్శనము.

పాశురం 26

ఇరవై ఆరవ పాశురములో మామునులు పూర్వాచార్యులు, ఏ ఆళ్వార్లు కృప చేసిన పాశురార్థములను ఉదాహరణ పూర్వకముగా వివరిస్తూ మధురకవి ఆళ్వార్ల ప్రబంధమును కూడా జతచేసినారు.

వాయ్ త్త తిరుమన్దిరత్తిన్ మత్తిమమామ్ పదమ్ పోల్! శీర్త మధురకవి శెయ్ కలైయై* ఆర్తపుగళ్ ఆరియర్ గళ్ తాజ్ఞ్గళ్ అరుళిచ్చెయల్ నడువే!! శేర్విత్తార్ తాఱ్పరియం తేర్ న్దు!!

ఎనిమిది అక్షరములతో కూడిన తిరుమంత్రం అక్షర పూర్తి మరియు అర్థ పూర్తిని కలిగినదై ఉన్నదని శాస్త్ర వచనము. ఆ మంత్రము మధ్యలో గల “నమః” అనే పదము ఎంత గొప్పదో అదే విధముగా మధురకవి ఆళ్వార్ల “కణ్ణినుణ్ శిరుత్తామ్బు” ప్రబంధము అంత ప్రాధాన్యమైనదిగా పూర్వాచార్యులు భావించినారు. అందుచేతనే ఈ ఆళ్వార్ల ప్రబంధమును మిగిలిన ఆళ్వార్లు కృపచేసిన ప్రబంధములతో పాటు చేర్చుటయేకాక అనుసంధించే విధముగా నిర్ణయించినారు.
నమః శబ్దము భాగవత శేషత్వమును – ఎంబెరుమాన్ భక్తుల దాస్యమును – సూచిస్తుంది. మధురకవి ఆళ్వార్లు దేవమత్తరియేన్ (నాకు ఏ ఇతర దేవతలు తెలియదు) నమ్మాళ్వార్లనే తన దైవముగా భావించినారని వారి ప్రబంధములో అనుట ద్వారా, పూర్వాచార్యులు దీనిని అంతరార్థముగా భావించుట ద్వారా ఈ ప్రబంధమును మిగిలిన ఆళ్వార్ల ప్రబంధములతో చేర్చి ఆదరించి గౌరవించినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-25-26-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 21 – 30

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై << పాశురములు 16 – 20 “భగవాన్ ని అనుభవించడములో నేనూ మీతో ఉన్నాను”  అని నప్పిన్నై పిరాట్టి కూడా ఆండాళ్ సమూహములో చేరుతుంది. ఇరవై ఒకటవ పాశురము:  ఇందులో, ఆమె నందగోపుని  వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. ఏఱ్ఱ కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాఱ్ఱాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్ ఆఱ్ఱ ప్పడైత్తాన్ మగనే అఱివుఱాయ్ ఊఱ్ఱముడైయాయ్  పెరియాయ్  ఉలగినిల్ తోఱ్ఱమాయ్ నిన్ఱ శుడరే  తుయిలెళాయ్ మాఱ్ఱార్ ఉనక్కు వలి తొలైన్దు ఉన్ వాశల్ కణ్ ఆఱ్ఱాదు వన్దు ఉన్నడి పణియుమా ప్పోలే పోఱ్ఱియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్ పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని  కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్డ్యముగల పరబ్రహ్మ స్వరూపా! ఆశ్రిత రక్షణ ప్రతిఙ్ఞాదార్డ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూపా! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడ నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖ ద్వారము వద్దకు వచ్చితిమి. ఇరవై రెండవ పాశురము: ఇందులో తనకూ తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని,  శ్రీ రామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారూ అతని వద్దకు వచ్చారని ఆండాళ్ ఎంబెరుమాన్ కి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని, కేవలము వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది. అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్ళి క్కట్టిల్ కీళే శంగ ఇరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్ కింగిణి వాయ్ చ్చెయద తామరై ప్పూప్పోలే శెంగణ్ శిఱుచ్చిరిదే ఎమ్మేల్ విళియావో తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్ అంగణిరఱణ్డుం కొణ్డు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ ఎంగళ్ మేల్ శాబం ఇళిన్దేలోర్ ఎమ్బావాయ్. సుందరము విశాలము నగు మాహా పృధివీ మండలము నంతను ఏలిన రాజులు తమ కంటె గొప్పవారు లేరనే అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామర పువ్వువలె వాత్సల్యముచే ఎఱ్ఱగా ఉన్న నీ కన్నులను మెల్ల మెల్లాగా విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించునట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలెనని శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. ఇరవై మూడవ పాశురము:  ఇందులో,  చాలా కాలము ఆండాళ్ని వేచి ఉంచిన తరువాత,  శ్రీ కృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు. దానికి బదులుగా ఆమె శ్రీ క్రిష్ణుడిని ఒక రారాజు లాగా తన సింహాసనము వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షములో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది. మారి మలై ముళఞ్జిల్ మన్ని క్కిడన్దుఱంగుమ్ శీరియ శింగం అఱివిఱ్ఱుత్తీ విళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడుమ్ పేర్ న్దుదరి మూరి నిమిర్ న్దు ముళంగి ప్పురప్పట్టు పోదరుమా పోలే, నీ పూవైప్పూవణ్ణా ఉన్ కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ శీరియ శింగాసనత్తిరున్దు యామ్ వన్ద కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్ పర్వతగుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యముగల సింహము మేల్కొని, తీక్ష్ణమగు చూపులతో ఇటు అటుచూచి, ఒక విధమగు వాసనగల తన ఒంటి వెండ్రుకలు నిగుడునట్లు చేసి, అన్ని వైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటికి వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. ఇరవై నాలుగవ పాశురము: తాను ఆసీనుడైన తరువాత, ఆమె అతనికి మంగళాశాసనము చేయటం ప్రారంభిస్తుంది.  పరమాత్మకు మంగళాసాసనము చేయడమే పెరియాళ్వార్ యొక్క ముద్దు బిడ్డ అయిన ఆండాళ్ యొక్క లక్ష్యము. అతని నడకను చూసి ఆండాళ్ మరియు ఆమె స్నేహిస్తులు సీతా పిరాట్టి లాగా, దండకారణ్యములోని మునులులాగా, పెరియాళ్వార్ మాదిరిగా మంగళాశాసనము గావిస్తారు. లేత పాదాలు గలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామే నని వారు బాధ చెందుతారు. అన్ఱు వ్వులగ మళన్దాయ్ ఆడిపోఱ్ఱి శెన్ఱంగు త్తెన్నిలగై శెఱ్ఱాయ్ తిఱల్ పోఱ్ఱి పొన్ఱ చ్చగడ ముదైత్తాయ్  పుగళ్ పోఱ్ఱి కన్ఱు కుణిలా వెఱిన్దాయ్ కళల్ పోఱ్ఱి కున్ఱుకుడైయా వెడుత్తాయ్ గుణమ్ పోఱ్ఱి వెన్ఱు పగై క్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోఱ్ఱి ఎన్ఱెన్ఱున్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్ ఇన్ఱియామ్ వన్దోమ్ ఇరంగేలో రెమ్బావాయ్. “పోత్తి” అన్న పదము “చిరకాలము వర్ధిల్లు” అని మంగళాశాసనమును సూచిస్తుంది. ఆనాడు దేవతల కోసము ముల్లోకాలను కొలిచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. సుందరమైన  లంకకి వెళ్లి రావణుడిని చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. శ్రీ కృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ ప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపై నావేశించిన అసురుని చంపుటకై రాయిని విసినట్లుగా వెలగ చెట్టుపైకి  దూడను విసురునపుడు ముందు వెనకకు పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళము. గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయము నార్జించి ఇచ్చెడి మీ హస్తము నందలి వేలాయుధమునకు  మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పఱ అనే వ్రతసాధనము నందున మేమీనాడు వచ్చినారము అనుగ్రహింపుము. ఇరవై ఐదవ పాశురము: వారి నోమును కొనసాగించికోవడానికి తమకు ఏదైనా అవసరమా అని ఎంబెరుమాన్ వారిని అడిగినప్పుడు,  వారు తనకు మంగళాశాసనము చేసిన తరువాత వారి బాధలన్నీ మటు మాయమయ్యాయని,  వారు ఇక కోరుకునేది ఒక్క కైంకర్యమేనని వారు విన్నపిస్తారు. ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, తరక్కిలా నాగిత్తాన్ తీంగునినైన్ద కరుత్తై ప్పిళ్ళైపిత్తు క్కఞ్జన్ వయిఱ్ఱిల్ నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే యున్నై అరుత్తిత్తు వన్దోమ్  పఱై తరుతియాగిల్ తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్. సాటిలేని దేవకీ దేవికి కుమారునిగా జన్మించి, శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించిన అద్వితీయ వైభవము గల యశోదకు కుమారుడివై దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినవారము.పఱయను వాద్యమునిచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. ఇరవై ఆరవ పాశురము: దీనిలో, ఆమె అతనికి నోముకి అవసరమైన ఉపకరణాలు గురించి వివరిస్తుంది. ఇంతకు ముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ, ఆమె ఇప్పుడు మంగళాశాసనము చేయడానికి పాంచజన్యమును, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము, దివ్య పతాకము,  పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది. తన కృష్ణానుభవానికి సంపూర్ణతకై ఆండాళ్ వీటిని కోరుతున్నట్లు మన పుర్వచార్యులు వివరిస్తున్నారు. మాలే  మణివణ్ణా మార్గళి నీరాడువాన్ మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్ ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్చశన్నియమే పోల్వన శంగంగళ్, పోయ్ ప్పాడుడై యనవే శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే కోల విళక్కే కొడియే విదామే ఆలిన్ అలైయాయ్ అరుళేలో రెమ్బావాయ్. ఆశ్రిత వ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరము లర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్యులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదము. ఈ భూమండల మంతను వణకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన, నీ పాంచజన్యమనెడి శంఖమును బోలిన శంఖములు కావలెను. పెద్ద ‘పఱ’ యను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ  దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్థించిరి. ఇరవై ఏడవ పాశురము: తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల ఎంబెరుమాన్  యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాళ్ వివరిస్తుంది. అంతే కాకుండా, అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుజ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియజేస్తుంది. ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది పాశురములలో ఎంబెరుమాన్ మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది. కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ఉన్దన్నై ప్పాడిప్పఱై కొణ్డు యామ్ పెఱు శెమ్మానమ్ నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే పాడగమే ఎన్ఱనైయ పల్ కలనుమ్ యామణివోమ్ ఆడై  ఉడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు మూడ నెయ్ పెయ్ దు ముళంగై వళివార కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణ గుణ సంపద గల గోవిందా! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పఱ యను వాద్యమును పొంది పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింద భాగమున దాల్చెడి దుద్దు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణపూవులు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దాని తరువాత పాలు అన్నము మునునట్లు నేయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను – అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నపించిరి. ఇరవై ఎనిమిదవ పాశురము: దీనిలో, అన్ని ఆత్మలకూ పరమాత్మకు మధ్య కారణ రహిత సంబంధమును, ఏ ఇతర మార్గాలనూ ఆమె అనిసరించలేదని, ఎంబెరుమాన్ యొక్క గొప్పతనాన్ని, ప్రతిఫలంగా ఏమీ ఆశించక ప్రతి ఒక్కరినీ ఉద్ధరించే అతని గుణాన్ని ఆమె వివరిస్తుంది. కఱవైగళ్ పిన్ శెన్ఱు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్ అఱి వొన్ఱు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యామ్ ఉడైయోమ్ కుఱైవొన్ఱుమ్ ఇల్లాద గోవిందా ఉన్దన్నోడు ఉఱవేల్ నమక్కింగు ఒళిక్క వొళియాదు అఱియాద పిళ్ళైగళోమ్ అన్బినాల్ ఉన్దన్నై చిఱు పేర్ అళైత్తనవుమ్ శీఱి అరుళాదే ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్. పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడి వారము. ఏమియు జ్ఞానము లేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోక మర్యాద ఎరుగని పిల్లలము. ఇందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము. ఇరవై తొమ్మిదవ పాశురము: కైంకర్యము చేయడం మన ఆనందం కోసం కాదని, అది అతని ఆనందం కోసం మాత్రమే అని ఇక్కడ ఆమె ఒక ముఖ్యమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది. ఇంకా, ఆమె కృష్ణానుభవముపై తనకున్న అగాఢ కోరిక కారణంగా, ఈ నోమును కేవలం తానొక సాకుగా ఆచరిస్తుందని ఆమె తెలిజేస్తుంచి. శిఱ్ఱమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్ ప్పొఱ్ఱామరై అడియే ప్పోఱ్ఱుమ్ పోరుళ్ కేళాయ్ పెఱ్ఱమ్మేయ్ త్తుణ్ణం కులత్తిల్ పిఱందు నీ కుఱ్ఱేవల్ ఎంగళై క్కొళ్ళామల్ పోగాదు ఇఱ్ఱై పఱై కొళ్వాన్ అన్ఱుకాణ్ గోవిందా ఎఱ్ఱైక్కుమ్ ఏళేల్ పిఱవిక్కుమ్ ఉన్దన్నోడు ఉఱ్ఱోమే యావోం ఉనక్కే నామ్ ఆట్చెయ్ వోమ్ మఱ్ఱైనమ్ కామంగళ్ మాఱ్ఱేలో రెమ్బావాయ్ బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపూవుల వలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలేవియూ లేకుండునట్లు చేయుము. ముప్పైయవ  పాశురము:  పరమాత్మ తన కోరికలను నెరవేరుస్తానని ఆశ్వాసమునిచ్చినందున, ఆమె పరమానందముతో  ఈ పాశురమును పాడింది. ఈ పాశురములను ఎవరు పాడినా, తాననుసరించినంత స్వచ్చమైన మనస్సుతో చేయక పోయినా ఆమె సాధించిన కైంకర్యము వారూ పొందుదురని ఆమె ధృవీకరించినది. మరో మాటలో చెప్పాలంటే, వ్రేవల్లెలో శ్రీ కృష్ణునితో సహ జీవనము చేసిన గొల్ల భామలకు అతనిపై ప్రగాఢ ప్రేముండేది. శ్రీవిల్లిపుత్తుర్లో అదే గోపికల మనోస్థితితో ఉన్న ఆండాళ్, ఈ పాశురములను నేర్చుకొని పాడిన వారెవరైన సరే అదే ప్రయోజనాన్ని పొందుతారు. దూడ చచ్చినా గడ్డితో నింపిన ఆ దూడ ప్రతిమను జూచి ఆవు పాలెలా ఇచ్చునో అలాగే పరమాత్మకు ప్రియమైన ఈ పాశురములు పాడిన వారికి పరమాత్మకు ప్రియమైన వారు పొందే ప్రయోజనము వారూ పొందుతారు అని భట్టర్ తెలియజేస్తున్నారు. క్షీర మహాసముద్రమును చిలికిన సంఘటనను వివరిస్తూ అండాళ్ ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఎందుకంటే, గోప బాలికలు పరమాత్మను పొందాలనుకున్నారు. పరమాత్మను పొందాలంటే పిరాట్టి యొక్క పురుషాకారము అవసరము. సముద్రము నుండి పిరాట్టిని పొంది వివాహమాడాలనే  ఉద్దేశ్యముతో పరమాత్మ సముద్ర మథనము చేసిరి.  కావున అండాళ్ కూడా ఈ సంఘటనను ప్రస్తావించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఆచార్యాభిమాన స్థితిలో ఉన్న  అండాళ్ భట్టర్పిరాన్ కోదై (పెరియాళ్వార్ కుమార్తె) అని చూపించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. వంగ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్నిరైంజి అంగ ప్పరై కొణ్డ వాఱ్ఱై అణి పుదువై పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న శంగ త్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే ఇంగు ప్పరిశురై ప్పార్ ఈరిరణ్డు మాల్వరై త్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెఱ్ఱిన్బురువ రెమ్బావాయ్ ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మథింపజేసి లక్ష్మీ దేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణాభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, cఱయను వాద్యమును  లోకుల కొరకును, భగద్దాస్యమును తమకొరకును పొందిరి. ఆ ప్రకారమునంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్ప కుండా చదువుదురో, వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడును, పర్వత శిఖరముల వంటి బాహు శిరస్సులు గలవాడును శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును. అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-21-30-simple/ పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 16 – 20

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై << పాశురములు 6 – 15 పదహారు మరియు పదియేడవ పాశురములలో, అండాళ్ ఈ సంసారమును, నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైనవారిని మేల్కొలుపుతుంది. పదహారవ పాశురము: ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతుంది. నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే  కొడిత్తోన్ఱుమ్ తోరణ వాశల్ కాప్పానే మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్ ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ తోయోమాయ్ వన్దోమ్ తుయిల్ ఎళప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్ మాఱ్ఱాదే అమ్మా నీ నేశ నిలైక్కదవమ్ నీక్కు ఏలో రెమ్బావాయ్. అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలైన మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు ‘పఱ’ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాటయిచ్చెను.మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు. పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుడిని మేల్కొలుపుటకు వచ్చితిమి. స్వామీ! నీవు ముందుగానే కాదనకుము.  తలుపులు తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి. పదియేడవ పాశురము:  ఇందులో ఆమె నందగోపుని, యశోదా పిరాట్టిని, బలరాముడిని మేల్కొలుపుచున్నది. అమ్బరమే తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్ ఎమ్బెరుమాన్  నన్దగోపాలా ఎళున్దిరాయ్ కొమ్బనార్కెల్లామ్ కొళున్దే  కులవిళక్కే ఎమ్బెరుమాట్టి యశోదాయ్ అఱివురాయ్ అమ్బరమ్ ఊడఱుతోంగి ఉలగు అళన్ద ఉమ్బర్ కోమానే ఉఱంగా దెళున్దిరాయ్ శెమ్నొన్ కళల్ అలడిచ్చెల్వా బలదేవా ఉమ్బియుమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్. వస్త్రములు, అన్నము, నీళ్ళను ధర్మము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ఓ సుకుమారమైన శరీరములు గల గోపికలకు నాయకురాలా! మా వంశమునకు మంగళదీపము వంటిదానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చికొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నీవు నిద్రనుండి మెల్కోవాలి. స్వఛ్చమైన ఎఱ్ఱని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా! నీవునూ, నీ తమ్ముడును ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మెల్కోవలెను. పద్దెనిమిదవ, పంతొమ్మిదవ మరియు ఇరవైయవ పాశురములలో: శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొలిపే విధానములో ఎదో లోపం ఉందని ఆండాళ్ భావించి, నప్పిన్నై పిరాట్టి యొక్క సిఫార్సుతో చేయలేదని గ్రహిస్తుంది. ఈ మూడు పాశురములలో నప్పిన్నై పిరాట్టిని, శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని, పరమాత్మ యొక్క ప్రియురాలిగా ఆమె పురుషాకారాన్ని కీర్తించింది. కేవలము పరమాత్మను కోరుకొని పిరాట్టిని మరచిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ తో పోల్చారు. అలాగే పరమాత్మను మరచి కేవలము పిరాట్టిని ఆశించడాన్ని రావణునితో పోల్చారు. పద్దెనిమిదవ పాశురము: ఎంత ప్రయత్నించినా శ్రీ కృష్ణుడు మేలుకోక పోయేటప్పటికి, ఆండాళ్ నప్పిన్నై పిరాట్టి (నీళాదేవి) యొక్క సిఫార్సుతో  వారిని మేల్కొలిపే ప్రయత్నము చేస్తుంది. శ్రీ రామానుజులకు అతి ప్రియమైన పాశురమిది. ఉన్దు మదకళిఱ్ఱ నోడాద తోళ్వలియన్ నన్ద గోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కన్దమ్ కమళుమ్ కుళలీ కడై తిఱవాయ్ వన్దెంగుమ్ కోళి అళైత్తన కాణ్ మాదవి ప్పన్దల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగై కూవిన కాణ్ పన్దార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్పాడ చెన్దామరై క్కైయాల్ శీరార్ వళై ఒళిప్ప వన్దు తిఱవాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్. ఏనుగులతో పోరాడగలిగిన వాడును,మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజ బలము గలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశ పాశముగల ఓ నప్పిన్నై పిరాట్టి! తలుపు గడియ తెరవుము. కోళ్ళు అంతట చేరి అరచు చున్నవి. మాధవీ లత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. పూబంతిని చేతిలో పట్టుకొనినదానా! నీవు సంతోషముగా లేచి వచ్చి, ఎఱ్ఱతామర పూవును బోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తెలుపు తెరవుము. పందొమ్మిదవ పాశురము: ఆండాళ్ ఇందులో శ్రీకృష్ణుడిని, నప్పిన్నై పిరాట్టిని మేల్కొలుపుతుంది. కుత్తు విళక్కెరియ క్కోత్తుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ఱ పఞ్చశయనత్తిన్ మేలేఱి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్ వైత్తుక్కిడన్ద మలర్ మార్పా వాయ్ తిరవాయ్ మెత్తడం కణ్ణినాయ్ నీ యున్ మణాలనై ఎత్తనై పోదుమ్ తుయిల్ ఎళ ఒట్టాయ్ కాణ్ యెత్తనైయేలుమ్ పిరివాఱ్ఱ గిల్లాయాల్ తత్తువమ్ అన్ఱుత్తగవేలో రెమ్బావాయ్. గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళుగల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క స్తనములపై గల తన శరీరమును ఆనుకుని పరుండి విశాలమైన వక్షఃస్థలము గల శ్రీ కృష్ణా నోరు  తెరచి మాటాడుము. కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి! నీవు నీ ప్రియుని ఎంత సేపు లేవ నీయవు? ఇంత మాత్రము ఎడబాటు కూడ ఓర్వలేకుండుట నీ స్వరూపానికి, నీ స్వభావమునకు తగదు. ఇరవైయ్యవ పాశురము: ఈ పాశురములో ఆండాళ్ తమను శ్రీ కృష్ణునితో కలిపించి వారిని అనుభవించడములో సహాయపడమని చెబుతూ  నప్పిన్నై పిరాట్టిని ,శ్రీ కృష్ణుడిని మేల్కొలుపుతుంది. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్ శెప్పమ్ ఉడైయాయ్ తిఱలుడైయాయ్ శెఱ్ఱార్కు వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిల్ ఎళాయ్ శెప్పన్న మెన్ ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెలాయ్ ఉక్కముమ్ తట్టు ఒళియుమ్ తన్దున్ మణాళనై ఇప్పోదే యెమ్మై నీరాట్ట ఏలోర్ ఎమ్బావాయ్. ముప్పది మూడు కోట్ల అమరులను వారికింకను ఆపదరాక ముందే పోయి, యుద్దభూమి లో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. రక్షణము చేయు స్వభావము గలవాడా! బలము కలవాడా ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము. బంగారు కలశములను పోలిన స్తనములును, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నప్పిన్నై పిరాట్టి (నీలాదేవి)! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును (విసనకఱ్ఱను), కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము. అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-16-20-simple/ పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 6 – 15

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై

<< తనియన్లు

ఇప్పుడు, ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు, తిరువాయ్ ప్పాడి (శ్రీ గోకులం) లోని ఐదు లక్షల గొల్ల భామలను మేల్కొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పుతుంది. ఆమె వేదలో  నైపుణ్యము ఉన్న పది మంది భక్తులను మేల్కొలిపే విధానము బట్టి ఈ పాశురములు అమర్చబడ్డాయి.

ఆరవ పాశురము: ఇందులో, ఆమె కృష్ణానుభవానికి క్రొత్తదగుటచే ఈ వ్రత వైభవము తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికి రాకుండా ఉన్న ఒక ముగ్ధను లేపుచున్నారు. భాగవంతుడిని అనుభవించడంలో ఇది ప్రథమ పర్వ నిష్ఠ (మొదటి దశలో ప్రవేశించడం). ఇతర భక్తులతో కలిసి ఉండాలని అర్థం చేసుకుంటే, అది చరమ పర్వ నిష్ఠ  (అంతిమ దశలో ప్రవేశించడం) అవుతుంది.

పుళ్ళుమ్ శిలుంబిన కాణ్ పుళ్ళ రైయన్ కోయిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

ఆహారమును ఆర్జించు కొనుటకై లేచి పక్షులు కలకల లాడుతూ పోవుచున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సేవలకు సమయమైనది రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుట లేదా ! ఓ పిల్లా! లెమ్ము!. మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము కలుగ వచ్చు. పూతన  యొక్క స్తనములందుండు విషమునారగించినవాడును ,  అసూరావేషము కలిగి చంపుటకు వచ్చిన శకటమును కీలూడునట్లు, పాలకై ఏడ్చి కాలుచాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీర సముద్రములో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో ఉన్న జగత్ కారాభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములో పదిలపరచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి-హరి-హరి యనుచుండు నపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్ల పరచి మమ్ములను మెలకొల్పినది – నీవు కూడా లేచిరామ్ము.

ఏడవ పాశురము: ఇందులో, కృష్ణానుభవములో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాళ్  మేల్కొలుపుతుంది. అయితే, ఈ గోపిక అండాళ్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది.

కీశు కీశెన్ఱెంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో  పేయ్ ప్పెణ్ణే
కాశుమ్ పిరప్పుమ్ కలకలప్పక్కై పేర్తు
వాశ నఱుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర్ అరవమ్ కేట్టిలైయో
నాయక ప్పెణ్పిళ్ళాయ్  నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱ వేలో రెమ్బావాయ్.

భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలిసికొని అన్ని వైపుల ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ద్వనినైననూ నీవు వినలేదా !

ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధము వేదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు, కవ్వముతో పెరుగును చిలుకుతుండగా, వారి చేతుల కంకణ ధ్వనులు, వారి మెడలో ఆభరణాల ధ్వనులతో ఆ శబ్దము విజృంభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనిని వినలేదా? ఓ నాయకులారా ! సర్వ పదార్దములలో వాత్సల్యముతో వ్యాపించియుండి ,మనకు కన్పడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లు తలుపు తెరవవలయును.

ఎనిమిదవ పాశురము: ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది.

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు
మేయ్వాన్ పరన్దన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వన్దు నిన్ఱోమ్ కోదుకలమ్ ఉడైయ
పావాయ్  ఎళున్దిరాయ్ పాడి ప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱునామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపికా! తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. మిగిలిన గోపికలందరు కూడా వ్రత స్థలానికి బయలుదేరారు, అలా పోవుటయే తమకు ప్రయుజనమనునట్లు వెళుచున్నారు. ఆ పోయేవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము. కుతూహలము కలదానా – ఓ పడతీ ! లేచిరమ్ము!, కేశి అనే రాక్షసుడి చీల్చి వధించిన వానిని, కంసుని మల్లయోధులను చంపిన  వానిని,   నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుడిని మనం వెళ్ళి ఆరాధిస్తే, అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షించును .

తొమ్మిదవ పాశురము: ఇక్కడ, ఆమె ఎంబెరుమాన్  మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకము ఉండి, ఎంబెరుమాన్ తో వివిధ మనోహరమైన రీతులలో వారిని  ఆస్వాదిస్తున్న గోపికను మేల్కోలుపుతుంది. ఈగోపిక “ శ్రీ రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు” అని హనుమంతుడి తో చెప్పిన సీత పిరాట్టి లాంటిది.

తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్ అవళై యెళుప్పీరో? ఉన్ మగళ్ దాన్
ఊమైయో అన్ఱిచ్చెవిడో అనన్దలో
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్ఱు ఎన్ఱు
నామమ్ పలవుమ్ నవిన్ఱేలో రెమ్బావాయ్

పరిశుద్దమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరు ధూపము గుమగుమలాడు చుండగా నిద్రపోవుచున్న అత్త కూతురా! మణి కావాటపు గడియ తీయుము. ఓ  అత్తా! నీవైనా ఆమెను లేపుము – నీ కుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా? లేక ఎవరైనా కావలి ఉన్నారా ? లేక గాఢ నిద్ర పట్టు నట్లు మంత్రించినారా ? “మహా మాయావీ ! మాధవా ! వైకుంఠ వాసా!” అని అనేక నామాలను కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు.

పదవ పాశురము: ఈ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఒక గోపికను మేల్కోలుపుతుంది. పరమాత్మని పొందటానికి అతనే మార్గమని ప్రగాఢమైన విశ్వాసముతో ఉంది, ఈ కారణంగా ఆమె ఎంబెరుమాన్ కి అతి ప్రియమైనది కూడా.

నోఱ్ఱు చ్చువర్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్
మాఱ్ఱముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాఱ్ఱత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోఱ్ఱప్పరై త్తరుమ్ పుణ్ణియనాల్ పణ్ణొరునాళ్,
కూఱ్ఱత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోఱ్ఱు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆఱ్ఱ అనన్దల్ ఉడైయాయ్ అరుంగలమే
తేఱ్ఱమాయ్ వన్దు తిత్తవేలో రెమ్బావాయ్

మేము రాకముందే నోము నోచి, దాని ఫలితముగా సుఖానుభవము పొందిన ఓ తల్లీ ! తలుపు తెరవక పోయినా, కనీసము మాటలైనా పలుకవా! పరిమళముతో నిండిన తులసి మాలలు ధరించి కిరీటముగల నారాయణుని  కారణముగా ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు ,నిద్రలో నీచే  ఓడింపబడి తనసొత్తగు ఈ నిద్రను నీకు ఒసంగినాడా ! ఇంత ఆధికమగు నిద్రమత్తు  వదలని ఓ తల్లీ ! మాకందరికి  శిరో భూషణమైన దానా ! మైకము వదిలి వచ్చి తలుపు తెరువుము.

పదకొండవ పాశురము: ఇందులో, బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్ర లేపుతుంది. ఈ పాశురములో, వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది.

కఱ్ఱు క్కఱవై క్కణంగళ్ పలకఱన్దు
శఱ్ఱార్ తిఱల్ అళియచ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుఱ్ఱ మొన్ఱిల్లాద కోవలర్ తమ్ పొఱ్కొడియే
పుఱ్ఱరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుఱ్ఱత్తుతోళిమార్ ఎల్లారుమ్ వన్దు నిన్
ముఱ్ఱమ్ పుగున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిఱ్ఱాదే పేశాదే శెల్వప్పెండాట్టి  నీ
ఎఱ్ఱుక్కు ఱంగుమ్ పొరుళ్ ఏలోర్ రెమ్బావాయ్.

లేగ దూడలు గలవియు, దూడలవలే ఉన్నవియునగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుక గలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును, ఏ దోషము లేనివారును యగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగా ! పుట్టలోని పాము పడగవలే సన్నని నడుము గలదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలును మొదలగు అందరూ వచ్చిరి. నీ ముంగిట చేరిరి. నీలమేఘ వర్ణము గల శ్రీ కృష్ణుని నామములను కీర్తించు చుండిరి. అయినా కానీ నీవు ఉలుకక పలుకక ఉన్నావేమీ ? ఓ సంపన్నురాలా! నీ  నిద్ర అర్థమేమో తెలుపుము.

పన్నెండవ పాశురము: ఇందులో, ఆమె శ్రీకృష్ణుడి ఒక సఖుని యొక్క సోదారి అయిన ఒక గోపికను మేల్కోలుపుతుంది, శ్రీకృష్ణుడి యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు, కానీ ఎంబెరుమాన్ యొక్క కైంకర్యంలో మునిగి ఉంటాడు.  ఏదేమైనా, అతను కైంకార్యం చేయడం పూర్తి చేసి, తన దినచర్యలను నిర్వహించడం ప్రారంభిస్తాడు.

కనైత్తిళం కఱ్ఱెరుమై కన్ఱుక్కిరఙ్గి
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిలమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పఱ్ఱి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చెఱ్ఱ
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

లేగ దూడలు గల  గేదెలు పాలుపితుకు వారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోవుట చే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలిచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతా బురద ఆగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచి ఉంటిమి.  నీ ఇంటి ద్వారము పై కమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణుని చంపిన మనోభీరాముడగు శ్రీ రాముని గానము చేయుచుంటిమి. అది విని కూడా నీవు నోరు విప్పవా ! ఏమి గాఢ నిద్ర ! ఊరి వారికందరికును నీ విషయము తెలిసినది.

పదమూడవ పాశురము: ఇందులో ఆమె ఏకాంతంలో, తన కళ్ళ అందాన్ని మెచ్చుకుంటున్న ఒక గోపికను మేల్కోలుపుతుంది. కళ్ళు సాధారణంగా జ్ఞానాన్ని సూచిస్తాయి కాబట్టి, ఈ అమ్మాయికి ఎంబెరుమాన్ కి  సంబంధించిన విషయాలలో పూర్తి జ్ఞానం ఉందని చెప్పవచ్చు. శ్రీ కృష్ణుడు తనంతట తాను ఆమెను వెతుక్కుంటూ వస్తాడని ఆమె అభిప్రాయం. అరవిందలోచనుడైన శ్రీ కృష్ణుని  కళ్ళు ఆమె కళ్ళకి సరిపోతాయి.

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లా అరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱంగిఱ్ఱు
ప్పుళ్ళుమ్ శిలుంబిన కాణ్, పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళ క్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో? పావాయ్ నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీ రాముని గానము చేయుచుపోయి  మన తోడి పిల్లలందరూ వ్రత క్షేత్రానికి చెరినారు. తామరపూలను పోలిన కన్నులు గలదానా ! లేడి వంటి చూపులుగలదానా! గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా స్నానమొనర్పక పాన్పుపై  పండుకొనియుండెదవేల? ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలసి ఆనందము అనుభవింపుము.

పద్నాలుగో పాశురము: ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడాలేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొలుపబడుచున్నది.

ఉఙ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెఙ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబిన కాణ్
శెంగల్ పొడిక్కూఱై వెణ్ పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై  మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శంగొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

ఓ పరిపూర్ణురాల! నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎఱ్ఱ తమరాలు వికసించినవి. నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. ఎఱ్ఱని కాషాయములు ధరించి తెల్లని పలువరుస కలుగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మొనర్చుటకు వెళుచున్నారు. లెమ్ము. మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతానని మాట ఇచ్చితివి. మరచితివా! శంఖ చక్రమును ధరించిన వాడును, ఆజానుభాహువును, పుండరీకాక్షుని గానము చేయుటకు లేచిరామ్ము.

పదిహేనవ పాశురము:పాశురములో, తన  భవనము వద్దకు వస్తున్న ఆండాళ్ ని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న  ఒక గోపికని మేల్కొలుపుతున్నారు.

ఎల్లే ఇలంగిళియే  యిన్నమ్ ఉరంగుదియో
శిల్లెన్ఱు అళైయేన్మిన్ నంగైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కత్తురైగళ్ పణ్డే ఉన్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానేదాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాఱ్ఱారై మాఱ్ఱు అళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

ఈ పాశురమునలో లొన ఉన్న గోపికకు బయటి గోపికకు సంవాదము నిబంధింపబడినది .

బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కాలదానా ! ఇంకనూ నిద్రించుచున్నావా ! అయ్యో ఇది ఏమి ?

లోని గోపిక: పూర్ణులగు గోపికలరా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకూడదు. నేనిదే వచ్చు చున్నాను.

బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగల దానవు నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము.

లోని గోపిక: మీరే నేర్పుగలవారు, పోనీలే, నేనే కఠినురాలను.

బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి ? అలా ఏకాంతముగా నుండెదవేల? వేగముగా వెలికి రమ్ము.

లోని గోపిక: అందరు గోపికలును వచ్చిరా ?

బయటి గోపికలు: అందరూ వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము.

లోని గోపిక: సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?

బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును, శత్రువుల దర్పమును అణచిన వాడను, మాయావి అయిన శ్రీ కృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-6-15-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 1 – 5

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై

<<తనియన్లు

మొదటి పాశురము: ఆండాళ్  గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవాన్ మాత్రమే   మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్గళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది.

మార్గళి త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱు మీర్గాళ్
కూర్వేల్ కొడుం తొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏర్ ఆర్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

ఓహో ! ఇది మార్గశీర్ష మాసము.వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా! ఇశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు.ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును, అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాల సింహమును, నీలమేఘశ్యముడును, ఎఱ్ఱ తామరలపోలిన కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే. ఆతనినే తప్ప వేరొకరిని అర్దించని మనకే , మనమపేక్షించు వ్రత సాదనమగు ‘పర’ అను వాద్యమును ఈయనున్నాడు.మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు మీరు అందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.

.రెండవ పాశురము: కృష్ణానుభవంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు  మరియు చేయకూడని పనుల జాబితాను ఆమె వివరిస్తుంది. భగవాన్ కి శరణాగతి చేసిన మనకు, పూర్వాచార్యులే మార్గదర్శకులు అని ఆమె వివరించింది.

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్ పావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు యిన్ఱ పరమన్ అడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మై యిట్టు ఎళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మాఱైణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

కృష్ణుడవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్న వారలారా ! మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు. పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడెదము. ఈ వ్రత సమయములో నేతిని గాని , పాలనుగాని మే మారగింపము.తెల్లవారు జాముననే లేచి స్నానము చేసెదము.కంటికి కాటుక పెట్టుకొనము, కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనుల నాచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను , అసత్య వాక్యములను ఎచ్చోటను పలుకము. జ్ఞానాధికులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్ష నొసంగుచుందుము.మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసుకొందుము. దీని నంతను విని మీరానందింపగోరుచున్నాము.

మూడవ పాశురము:. కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకు అనుమతి ఇచ్చిన   బృందావనములోని వారందరికీ ఆ యొక్క ప్రయోజనములు కలగాలని ఆండాళ్ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి అని అర్ధము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్ పావైక్కు చ్చాఱ్ఱి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పఱ్ఱి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

బలి చక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తనపాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతిబాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశమువరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుచుండగా , కలువ పూవులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా , సస్యములు సమృద్దములై యుండవలెను.పాలు పితుకుటకు కొట్టములో దూరి స్తిరముగా కూర్చుండి పొదుగునంటగనే పాలు కుండలు నిండునట్లు చేపు గోవులు సమృద్దముగా నుండవలెను. నశ్వరము కాని సంపద దేశమంతా నిండవలెను.

నాల్గవ పాశురము: ఆండాళ్ ఒక నెలలో మూడు సార్లు (బ్రహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు) వర్షించాలని పర్జన్య దేవుడిని ఆదేశిస్తుంది, తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ, కృష్ణానుభవమును పొందవచ్చు.

ఆళి మళైక్కణ్ణా  ఒన్ఱు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి
ఊళి ముదల్వన్ ఉరువమ్ పోల్ మెయి కఱుత్తు
పాళియం తోళుడై పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్ఱు అదిర్ న్దు
తాళాదే శార్ ఙ్గ ముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

గంభీర స్వభావుడా ! వర్ష నిర్వాహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాత్రుత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి , ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మ నాభుని విశాల సుందరబాహు యుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమ చేతిలోని శంఖమువలె ఉరిమి శార్ఙమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.: ఎంబెరుమాన్ యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు (పాప పుణ్యాలు రెండూ) మటుమాయమవుతాయని ఆండాళ్ చూపిస్తుంది. మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి, భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరువలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశము ఏమిటంటే, మనము గతంలో చేసిన పాప కర్మలన్నీ ఎంబెరుమాన్ తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ, భవిష్యత్తులో తెలిసి చేసే పాప కర్మల ఫలితమును మాత్రము అనుభవించేలా చేస్తాడు.

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయ పిళ్ళైయుమ్ ప్పుగు దరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధముగల ఉత్తరదేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును , పవిత్రము అగాధమునగు జలముగల యమునానది రేవే తనకు గురుతుగా కలవాడును , గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును,తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడునునగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్దములగు పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు , ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును.కావున భగవానుని నామములను పాడుడు.

ఈ విధంగా, మొదటి ఐదు పాశురముల ద్వారా, ఎంబెరుమాన్ యొక్క పర (శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణ), వ్యూహ (క్షీర సముద్రములోని శ్రీ మహావిష్ణువు), విభవ (త్రివిక్రముడు), అంతర్యామి (వరుణుని అంతర్యామియైన), అర్చ (వడమధుర యొక్క భగవాన్) స్వరూపాల గురించి వివరింబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-1-5-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 23 – 24

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతశీర్షిక

పాశురం 23

ఇరవైమూడవ పాశురం. ఆండాళ్ అవతరించిన తిరువాడిపూరమునకు గల సాటిలేని గొప్పదనమును తన మనస్సునకు చెప్పుచున్నారు.

పెరియాళ్వార్ పెణ్బిళ్ళైయాయ్* ఆణ్డాళ్ పిఱన్ద తిరువాడి ప్పూరత్తిన్ శీర్మై* ఒరునాళైక్కు ఉణ్డో మనమే ఉణర్ న్దు పార్* ఆణ్డాళుక్కు ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుమ్ ఉణ్డు!!

ఓ మనసా! పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా అవతరించిన శుభ దినమునకు సమాన దినము కలదా బాగా ఆలోచించి చూడు. ఆండాళ్ నాచ్చియార్ కు సాటియగు వారు లేక పొవడమే ఈ రోజునకు ఒక విశేశము.

ఆండాళ్ నాచ్చియార్ భూమి పిరాట్టి అవతారము. జీవాత్మల మీద గొప్ప కరుణతో పరమాత్మ అనుభవమును వీడి, ఈ భూలోకమున అవతరించినది. ఆళ్వార్లు ఈ లోకములో ఉండి, పరమాత్మ యొక్క నిర్హేతుక కృపచే దోషరహిత జ్ఞానము భక్తితో పరమాత్మను సంపూర్ణముగా అనుభవించినారు. తన ఉన్నతమైన స్థానమును మరియొకరి కొఱకు త్యాగం చేయటం ఆండాళ్ నాచ్చియార్కు తప్ప వేరొకరికి కుదరదు. ఆళ్వార్లు పోల్చదగినప్పటికినీ ఆండాళ్ నాచ్చియార్కు సాటి అయిన వారు కానప్పుడు ఇతరులేపాటి వారు. అందుచేతనే ఆండాళ్ తిరునక్షత్రమునకు సాటియైనది ఏదియు లేదు.

పాశురం 24

ఇరువది నాల్గవ పాశురములో మామునులు మిగిలిన ఆళ్వార్లకంటే విశిష్టమైన ఆండాళ్ గురించి దయతో తన మనస్సునకు చేప్పచున్నారు.

అఞ్జుకుడిక్కు ఒరు శన్దదియాయ్* ఆళ్వార్ గళ్ తమ్ శెయలై విఞ్జి నిఱ్కుమ్ తన్మైయళాయ్* పిఞ్జాయ్ ప్పళుత్తాళై యాణ్డాళై ప్పత్తి యుడన్ నాళుమ్! వళుత్తాయ్ మనమే మగిళ్ న్దు!!

ఆళ్వార్లందరికీ వారసురాలిగా ఆండాళ్ అవతరించినది. “అంజు” అను పదమునకు ఐదు అను సంఖ్యను, భయపడుట అనే గుణాన్ని తెలుపును. పంచ పాండవులకు మిగిలిన ఒకే ఒక్క వారసుడైన పరిక్షత్తు వలె పదిమంది ఆళ్వార్లకు ఒకే ఒక్క వారసురాలు అని మొదటి అర్థం. పరమాత్మకు ఏమి ఆపద కలుగునోనని భయపడే ఆళ్వార్లకు వారసురాలిగా అని రెండవ అర్థం. పెరియాళ్వార్లు సంపూర్ణముగా మంగళాశాసనమునే చేసినారు. మిగిలిన ఆళ్వార్లు పరమభక్తి దశ (పరమాత్మ సంశ్లేషమున మాత్రమే జీవించగలుగుట) లో ఉండినారు. ఆండాళ్ పెరియాళ్వార్ల వలే మంగళాశాసనము చేసినది మరియు మిగిలిన ఆళ్వార్ల వలె భక్తిలో మునిగి పోయినది. “పిఞ్జాయ్ ప్పళుత్తల్” అనగా మొక్క పుష్పించి కాయగామారి తర్వాత పండుగా మారటం వలె కాక, తులసి మొలకెత్తినప్పటి నుంచి పరిమళించుట వలె సిద్ధ ఫలము వలె ప్రకాశించినది. చిరు ప్రాయము నుంచే భక్తిలో మునిగియుండినది. ఆండాళ్ నాచ్చియార్ ఐదు సంవత్సరముల వయస్సునుంచే తిరుప్పావైని పాడినది. నాచ్చియార్ తిరుమొళి యందు పరమాత్మను పొందుటకు ఆరాటపడినది. ఓ మనసా! ఇటువంటి ఆండాళ్ విశిష్టతను కీర్తించము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-23-24-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 21 -22

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 21

ఆళ్వార్లు పదిమంది అని కొందరు కాదు పన్నెండుమంది అని కొందరు భావిస్తారు. ఎంపెరుమాన్ పరంగా చూచినచో పదిమంది. వీరవతరించిన మాసము మరియు నక్షత్రములను విపులముగా చెప్పుచున్నారు. ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వారు అనే వీరిరువురు ఆచార్య నిష్ఠ కలవారు. ఆండాళ్ “విష్ణుచిత్తలే నా దైవం” అని తన తండ్రిగారైన విష్ణుచిత్తులనే తన దైవంగా భావించింది. మధురకవి ఆళ్వార్లు “దేవమత్తరియేన్” అని నమ్మాళ్వార్ల యందే భక్తి కలిగి ఉండినారు. వారిద్దరిని కలుపుకొనినచో ఆళ్వార్లు పన్నెండుమంది. వీరితో పాటు మన ఆచార్య పరంపరలోని ముఖ్యమైన ఆచార్యులైన “మాఱన్ అడి పణిన్ద ఉయన్దవరాన/నమ్మాళ్వర్ల శ్రీపాదములయందే ఈడుపడిన” ఎంబెరుమానార్/శ్రీరామానుజులను కలుపుకొని ఇక్కడ అనుభవిస్తున్నారు. ఎంబెరుమానార్ (శ్రీరామానుజులను)  నమ్మాళ్వార్ల తిరువడి (శ్రీ పాదములు) గానే భావించి కీర్తింపబడుచున్నారు. ఈ ముగ్గురికీ గల ఇంకొక విశేషమేమనగా – ఆండాళ్ భూదేవి అవతారముగాను, మధురకవి ఆళ్వార్ పెరియతిరువడి (గరడాళ్వార్) అవతారముగాను ఇక ఎంబెరుమానార్ (శ్రీరామానుజులు) ఆదిశేష అవతారముగాను కీర్తింపబడుచున్నారు.

ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్* మధురకవియాళ్వార్ ఎతిరాశరామివర్ గళ్* వళ్వాగ వన్దుదిత్త మాదజ్ఞ్గళ్ నాళ్ గళ్ దమ్మిన్ వాశియైయుమ్* ఇన్దవులగోర్కు ఉరైప్పోమ్ యామ్!!

పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్, మధురకవి ఆళ్వార్ మరియు యతులకే రాజులైన శ్రీరామానుజులు అనే వీరు అవతరించిన మాసములను నక్షత్రముల ప్రాముఖ్యతను ఈ లోకానికి మామునులు తెలుపుచున్నారు.

పాశురం 22

ఇరవైరెండవ పాశురము. ఆండాళ్ నాచ్చియార్ తిరుఅవతారముగావించినది తనకొరకేనని మిక్కిలిగా అనుభవిస్తూ ఈ విధముగా తెలుపుచున్నారు.

ఇన్ఱో తిరువాడిప్పూరమ్ ఎమ్మకాగ వన్ఱొ ఇజ్ఞ్గు ఆణ్డాళ్ అవదరిత్తాళ్* కున్ఱాద వాళ్వావాన వైగున్దవాన్ పోగన్దన్నై ఇగళ్ న్దు! ఆళ్వార్ తిరుమగళారాయ్!!

ఈ రోజు ఆడిమాస పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం కదా? ఈ రోజుననే భూదేవి, శ్రీవైకుంఠములోని అన్ని భోగ భాగ్యములను వదలి పెరియాళ్వార్లకు తిరుకుమార్తె అయిన ఆండాళ్ నాచ్చియార్ గా, ఒక తల్లి బావిలో జారిపడిన తన బిడ్డ కొఱకు బావిలోకి దూకి రక్షస్తుందో అదేవిధంగా మనలను రక్షించుటకై ఈ లోకంలో అవతరించినది. శ్రీవరాహ పెరుమాళ్ భూమిపిరాట్టికి “నోరారా నన్ను కీర్తించి, మనసారా ధ్యానించి మరియు పవిత్ర పుష్పములతో అర్చించినచో జీవాత్మలు నన్ను చేరుకోగలరని” చెప్పగా దానిని మనకు ఆచరించి చూపుటకు ఈ భూలోకమున అవతరించినది. ఏమి ఆశ్చర్యము! ఏమి కరుణ!

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-21-22-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org