Category Archives: telugu

తిరువెళుకూట్ఱిరుక్కై 3వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 2వ భాగము

(1-2-)3-4-3-2-1-(1-2-3)

మూవడి నానిలం వేణ్డి
ముప్పురి నూలొడు మానురి ఇలంగు మార్వినిల్
ఇరు పిఱప్పు ఒరు మాణ్ ఆగి
ఒరు ముఱై ఈరడి మూవులగు అళందనై

ప్రతిపదార్థము:

 ఒరు ముఱై – ఒకానొకప్పుడు

 ముప్పురి నూలొడు – యఙ్ఞోపవీతముతో

 మానురి – జింక చర్మము

ఇలంగు మార్వినిల్ – హృదయము మీద అలంకరించిన

 ఇరు పిఱప్పు ఒరు మాణ్ ఆగి – అసమానమైన బ్రహ్మచారి

వేణ్డి – ప్రార్థించి

మూవడి – మూడడుగులు

నానిలం – నాలుగు రకములైన భూమిని

 అళందనై – కొలిచావు

మూవులగు – మూడు లోకములు

ఈరడి – రెండడుగులు

vamana-mAnuri

భావము:

    ఈ పాశురములో తిరుమంగైఆళ్వార్లు పరమాత్మ కేవలము ధనుర్బాణాలతోనే కాదు, అందముతో కూడా శతృవులను గెలవగలరని చెపుతున్నారు.     నాలుగు విధములైన భూమిని (మైదానము, పర్వతము, అడవి, సముద్రము)ఒక్క అడుగులో కొలిచి ఊర్ధ్వ లోకములను రెండవ అడుగులో కొలిచి , మహాబలి శిరస్సు మీద మూడవ అడుగుంచావు. దీని కోసము నువ్వు వామన మూర్తిగా,  యఙ్ఞోపవీతమును ధరించి, జింక చర్మమును  హృదయము మీద అలంకరించుకొని వచ్చి మూడడుగులు  ప్రార్థించావు.  నిన్నే కోరుకునే నన్ను కాపాడ లేవా!

 వ్యాఖ్యానము:

మూవడి … –ఇంద్రుడికి కోరుకున్నలాభములన్నీ ఇచ్చిన నీకు నాలాంటివాడిని రక్షించటము కష్టమా!

నానిలం మూవడి వేణ్డి –   ముల్లై (అడవులు), కురింజి (పర్వతాలు), మరుదం (జనావాసాలు), నైదల్ (సముద్రము) అనే నాలుగు రకాలతో కూడిన నేలను ఒక్క అడుగులో కొలిచావు.  పైలోకాలను మరొక అడుగులో కొలిచి మూడవ  అడుగులో మహా బలిని ఓడించాలని,  మహా బలిని మూడడుగులు దానమడిగావని ఆళ్వార్లు పాడుతున్నారు.

ఇదే విషయాన్ని  నమ్మాళ్వార్లు  తిరువిరుత్తం 26 – “నానిలం వాయిక్ కొణ్డు…..”అన్నారు.

ముప్పురి నూలొడు మాన్ ఉరి ఇలంగు మార్వినిల్ –  బ్రహ్మచారి వ్రతములో ఉన్న నీ హృదయ సీమ మీద జింక చర్మము, దాని మీద  ఝంద్యము,  మేఘములచే ఆవరింపబడిన ఆకశములో మెరుపు తీవెలా ఉన్నది.

ఇరు పిఱప్పు – అప్పుడే పొందిన ద్విజత్వము(కొత్తగా వడుగు చేసుకున్న వటువు)

ఒరు మాణ్ ఆగి – బ్రహ్మచారిగా అసమాన దీప్తితో వామన రూపములో , అడగటమే తెలియని  నీవు, ఇంద్రుని కోసము నేలను దానమడిగావు.

బలి దానమిచ్చినా ఇవ్వకున్నా ఒకటే అన్నట్లు ప్రసన్నముగా ఉండిన  ఆ వామన రూపములో ఎంత అందముగా ఉన్నావు.

ఒరు ముఱై ఈరడి మూవులగు అళందనై – ఒకే సారి రెండడుగులతో మూడు లోకములను కొలిచావు.

“ఇంధ్రుని కోసము మూడు లోకములను అడిగి ఇచ్చిన వాడివి,   నాకు నీ సేవకుడుగా వుండే భాగ్యాన్ని ఇవ్వలేవా? “అని ఆళ్వార్లు అడుగుతున్నారు.

“మూడు  లోకములను కొలిచేటప్పుడు నీమీద ఇష్టము లేని వారికి కూడ నీ  శ్రీపాద స్పర్శ ఇచ్చావు. నిన్నే కోరుతున్న నాకు నీ శ్రీపాద స్పర్శ ఇవ్వలేవా?”

“ఇంధ్రుడు  స్వార్థము కోసము అల్పమైన నేలను కోరుకున్నాడు. మహాబలి దర్పము కోసము దానమిచ్చాడు.  నేను మాత్రము నిన్నే  కోరుతున్నాను. నిన్ను కాక అల్పమైన విషయములను కోరుకునే వారి కోరికలను తీర్చగలవు కాని, నిన్నే కోరుకునే వారి కోరికలను తీర్చలేవా?

ఆళ్వార్లు, ఆచార్యులందరు భగవంతుని శ్రీపాదములనే కోరుకున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhukurrirukkai-3/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై – 2వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 1వ భాగము

ఈ రెండవ భాగములో రైతు తన చేనులోని కలుపును తీసినట్లు భగవంతుడు తాను సృజించిన లోకములను పాడు చేస్తున్న రాక్షసులను తొలగించాడని ఆళ్వార్లు పాడుతున్నారు.

 1-2-3-2-1 (1-2)

ఒరు ముఱై ఇరు శుడర్ మీదినిల్ ఇయఙ్గా

ముమ్మతిళ్ ఇలంగై ఇరుకాల్ వళైయ

ఒరు శిలై ఒన్ఱియ ఈర్ ఎయుత్తు అళల్వాయ్

వాలియిన్ అట్టనై

ప్రతిపదార్థము:

ఇరు శుడర్ – సూర్యచంద్రులు

మీదినిల్ ఇయఙ్గా – ఉన్నతమైన పరిధిలోకి

ఇలంగై – లంకాపురి

ఒరు ముఱై – భయముతో

ముమ్మదిళ్ –  మూడు ప్రాకారములు గల (జల,పర్వత,అటవి)

అట్టనై – (నీవు) నాశనము చేశావు

ఒరు శిలై – సారంగము

ఇరుకాల్ వళైయ – రెండంచులు వొంపు తిరిగి

వాలియిన్ – బాణములు సంధించగా

ఒన్ఱియ ఈర్ ఎయుత్తు – విల్లులోని రెండు పళ్ళ మధ్య సర్దుకొని

అళల్వాయ్ – నిప్పులు చెరిగిన

భావము: రెండు వైపుల మెలి తిరిగిన అసమానమైన ధనుస్సును చేపట్టి, నిప్పులు గ్రక్కే రెండంచులు గల బాణమును సంధించి, సూర్య చంద్రులు కూడా తొంగిచూడటానికి భయపడే లంకను తుత్తునియలు(నాశనం) చేశావు.

సంకల్ప మాత్రముననే   బ్రహ్మను సృష్టించిన నువ్వు శతృసంహారమునకు  మాత్రము  యుద్ధరంగమున ఎదురుగా నిలబడి అస్త్ర ప్రయోగము చేశావు.

పిరాట్టి (సీత)ని  నీ నుండి తనను దూరము చేసిన రాక్షసుడిని సంహరించలేదు. ఆమె కొరకు నువ్వు రాక్షస సంహారము చేశావు.  అలాగే,  నీ నుండి నన్ను దూరము చేసిన ఈ సంసారం, అవిద్య, కర్మ, వాసనా, రుచి అనే శతృవుల నుండి నువ్వు నన్ను  రక్షించాలి.

pt388-rama-ravana-courtesy-crafts-of-india-2

వ్యాఖ్యానము:

‘భీషో దేతి సూర్య:’ (పరమాత్మ  మీది భక్తి, వినయము, వలన సూర్యుడు ఉదయిస్తున్నాడు). లంకలో రావణుడి మీది భయము వలన తనప్రతాపమును చూపడు. (నైనం సూర్య: ప్రతాపతి – శ్రీ రామాయణము). ఆళ్వార్లు చంద్రుడికి కూడా ఇదే సూత్రమును ఆపాదిస్తున్నారు.

ఇలంగై –  (అమ్మణ కూత్తడిక్కుం )

ఇరుకాల్ వళైయ ఒరు శిలై ఒన్ఱియ ఈర్ ఎయుత్తు అళల్వాయ్ వాలియిన్ అట్టనై:    రెండువైపుల మెలి తిరిగిన అసమానమైన ధనుస్సును చేపట్టి, నిప్పులు గ్రక్కే రెండంచులు గల బాణమును సంధించి, సూర్య చంద్రులు కూడ తొంగిచూడటానికి భయపడే లంకను తుత్తునియలు చేసిన ఘనుడవు.

అళల్వాయ్ వాలి:  ధనుస్సులో  సంధించినపుడు అది బాణము. శతృవు పై  పడినపుడు అది నిప్పు.

 వాలియిల్  అట్టనై: అయనై ఈన్ఱనై’:   బ్రహ్మను సంకల్పమాత్రమున సృష్టించావు. రావాణుడిని సంహరించడానికి  మాత్రము  ఎదురుగా వచ్చినిలబడ్డావు.

 ఒరు ముఱై … అట్టనై – సీతా పిరాట్టి కొరకు రావణుని సంహరించినట్లు,   నా కొరకు ఈ సంసారము మరియు కర్మ అనే శతృ వులను తొలగించు.

అడైంద అరువినైయోడు అల్లల్ నోయి పావం
మిడైందవై మీణ్డ్దొళియ వేణ్డిల్ – నుడంగిడైయై
మున్ ఇలంగై వైత్తాన్ మురణ్ అళియ మున్ ఒరు నాళ్
తన్ విల్ అం కై వైత్తాన్ శరణ్”    (ముదల్ తిరువంతాది-59)

 పొయ్ ఘై ఆళ్వార్లు తమ   ‘ముదల్  తిరువందాది’ 59 వ పాశురములో కూడా ఇదే విషయమును స్పష్టముగా చెప్పారు.

ఇనుము స్వతహాగా వేడిగా, ఎర్రగా వుండదు. నిప్పుతో చేరడం చేత దానికి    ఆ లక్షణములు వస్తాయి. అలాగే ఆత్మ అచిత్తుతో(దేహము) చేరటము చేత  కర్మ (గత జన్మలలో చేసిన పాపపుణ్యములు),  వాసన గత జన్మలలో చేసిన పాపములు),  రుచి(పాప కర్మములమీది ఆసక్తి) ఇవన్నీ ‘అరు వినై’ తొలగించు కోవటానికి సాధ్యము కానివి అని ఆళ్వార్లు అంటున్నారు.

 మీణ్డు ఒళియ వేణ్డిల్ –    వీటిని  సమూలముగా తొలగించు కోవాలనుకుంటే   అంతటి బలవంతుడి కాళ్ళ  మీద పడటము  తప్ప  వేరే  దారి లేదు.

 నుడంగిడైయై:    పరమాత్మను చాలాకాలము వీడి ఉండడం వలన అలసిపోయి  నడుము సన్నబడింది (వైరాగ్యము).

 మున్ ఇలంగై వైత్తాన్ మురణ్ అళియ :  పూర్వము రావణుడు సీతను చెరపట్టాడు. రాముడు వాడిని చంపాడు.

 మున్ ఒరు నాళ్ తన్ విల్ అం కై వైత్తాన్ శరణ్ :   తన అందమైన చేతులను ధనుస్సు మీద ఉంచిన వాడే (రాముడు) మనకు శరణు.

మురణ్ అళియ విల్ అంకై వైత్తాన్ శరణ్:  ‘అందమైన చేతులు’- బాణము వలన రావణుడు చనిపోలేదట-  ఆ బాణమునకు  రాముడి అందమైన చేతులు తగలటము వలన రావణుడు చనిపోయాడట.

నుడంగిడైయై  మున్ ఇలంగై వైత్తాన్ :    భగవంతుడిది అయిన. మనది కాని,  ఆత్మను మనదని అనుకుంటాము.  అలాగే రావణుడు తనదికాని పిరాట్టిని  తనదనుకున్నాడు.

భారము భగవంతుడి మీద ఉంచిన వారిని ఆయనే రక్షిస్తాడు.  పిరాట్టిని రక్షించాడు కదా.

పరమాత్మతో పిరాట్టికి ఎటువంటి సంబంధమున్నదో,  జీవాత్మలకు కూడా అదే సంబంధము ఉన్నదని మనము తెలుసుకోవాలి.

అదే సమయములో మనము పరమాత్మను ఆశ్రయించేటప్పుడు పిరాట్టి యొక్క పురుషకారము అవసరము.

 “నుడంగిడైయయి”  తో మొదలయిన   ముదల్ తిరువందాది పాశురము ఈ విషయాన్నే స్పష్టీకరిస్తుంది.

తిరుమంగై ఆళ్వార్  తిరువెళుకూట్ఱిరుక్కై   ప్రబంధమును  “ఒరు పేర్ ఉంది” తో ప్రారంభించారు.  ఏమీ లేని స్థితి నుంచి అన్నీ సృష్టించిన  నీకు ఈ సంసారములో ఉన్న నన్ను రక్షించడం కష్టము కాదు.

రెండవ భాగములో  “ఒరు ముఱై ” లో నీకు పిరాట్టికి మధ్య నిలిచిన రావణుని సంహరించావు. కావున నన్ను రక్షించడం నీకు కష్టముకాదని ఆళ్వార్లు అంటున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhukurrirukkai-2/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుక్కూట్ఱిరుక్కై 1వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< అవతారిక

అవతారికలో తెలిపినట్లుగా ఈ ప్రబంధములో ఆళ్వార్లు తమ ఆకించన్యమును,  అశక్తతను తెలియజేసుకుంటున్నారు.  అదే సమయములో పరమాత్మ సర్వ శక్తతను తెలియజేస్తున్నారు.తమను   సంసారము  నుండి బయట  పడవేయమని   తిరుక్కుడందై ఆరావముదుడిని శరణాగతి చేస్తున్నారు.

kshirabdhinathan

1-2-1( అంకెలు రథము ఆకారములో అమరుటకు పాశురములో ప్రయోగించబడినవి)

ఒరు పేరుంది ఇరు మలర్ తవిసిల్   ఒరు ముఱై అయనై ఈన్ఱనై

ప్రతిపదార్థము:

  • ఇరుపెద్ద
  • తవిసిల్ఆసనము
  • ఉంది –  (నీ పవిత్రమైన)నాభి
  • మలర్ – (తామర)పూవు
  • పేర్గొప్ప
  • ఒరుసమానమైన
  • ఒరు ముఱైఒక సారి(సృష్టి కాలములో)
  • ఈన్ఱనైనువ్వు సృజించావు
  • అయనై –  బ్రహ్మను

భావము:

            నిర్హేతుక కృపతో  ప్రళయానంతరము, లోకాలను   సృజించావు. బ్రహ్మను తామర వంటీ నీ నాభి నుండి సృజించి ఆయనలో అంతర్యామిగా నువ్వుండి సమస్త పదార్థములను, సృజించావు. (ఇవన్నీ సునాయాసముగా చేసిననీకు, నాకు  మోక్షమివ్వటము  మాత్రము కష్టమా!)

వ్యాఖ్యానము:

ఒరు పేరుంది—:   ఒక గొప్ప నాభికమలము.  అది శ్రీమన్నారాయణుని నాభికమలము. “పేర్అనాది .. కాల ప్రమాణములకు  అందని నాభి కమలము.  బ్రహ్మకు జన్మ స్థానము. బ్రహ్మ అజుడు. తమిళములో అయన్ అంటారు.

ఒరు ముఱై:    శ్రీమన్నారాయణుడు, ఒకానొకప్పుడుఒకొక్క  ప్రళయము తరవాత బ్రహ్మను సృజిస్తాడు.

 ‘అవిభక్త తమస్సుగా నామరూపములు లేకుండా వున్న కాలములో ,వాటిని `విభజించి, నామరూపములనిచ్చాడు.  తరువాతఅక్షరము,  ‘అవ్యక్తము`, ఆతరువాత `మహాన్, అహంకారము`,   మళ్ళీ అహంకారము నుండి  సబ్ద,స్పర్శ, రూప, రస, గంధములను సృజిస్తాడుఆకాశము, వాయువు, అగ్ని, ఆప/జలము , పృధ్వి అనే  పంచ భూతములను సంకల్ప మాత్రమున సృజిస్తాడు. దీనిని సమిష్టి సృష్టి అంటారు. బ్రహ్మను  సృష్టి చేసి ఆయనలో అంతర్యామిగా వుండి వ్యష్టి సృష్టిని చేసాడు. అవి నాలుగు విధములు. క్రమముగా   1.దేవతలు 2. మనుష్యులు, 3. తిర్యక్కులు  (జంతువులు) 4. స్థావరములు (చెట్లు).

విషయములను  పిళ్ళై లోకాచర్యులు తత్వ త్రయములో ప్రస్తావించారు.

 చిత్ (బ్రహ్మ తో సహా), అచిత్తుల మధ్య బేధము లేదు. ఇవి అన్నీ పరమాత్మకు లోబడినవే. ఆయన తత్వమును తెలుసుకొని ఆనందించినప్పుడు  మాత్రమే  బేధము తెలుస్తుంది.

 ఒక రైతు పంటను వేసి,  రక్షించి,  కలుపును తొలగించి కాపా డు కున్నట్టు,  నువ్వు చేస్తున్నావని తేటతెల్లముగా  కనపడుతున్నది. మరి, మాకు మోక్షమివ్వటము నీకు అసాధ్యమెందుకవుతుంది  అని తిరుమంగైఆళ్వార్లు,  పరమాత్మను అడుగుతున్నారు.

 అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhikurrirukkai-1/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై- అవతారిక

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< తనియన్లు

              తిరుమంగై ఆళ్వార్లు ఈ సంసారములోని సుఖ: దుఖ:ములను చూసి విరక్తి చెందారు. పెరియ తిరుమొళిలో, అనేక దివ్య దేశములను వర్ణించారు. అది చూసి ఈయన శ్రీవైకుంఠమునే మరచిపోయారని భగవంతుడే ఆశ్చర్య పోయి ఈ సంసారము యొక్క స్వరూపమును చూపారు.

పెరియ తిరుమొళిలో ఆఖరి దశకము  “మాఱ్ఱముళ”లో  ఆళ్వార్లు ఈ సంసారములో ఉండటము నిప్పులలో ఉన్నట్లు అని పాడారు.  ఆ దుఖ:మును తొలగించుకోవటానికి  తిరుక్కుఱుంతాణ్డగమును  పాడారు.          

 అందులోని “వాక్కినాల్ కరుమం తన్నాల్(4)” లో ఈ సంసారము మీద వైరాగ్యముతో,  త్రికరణ శుద్దిగా భగవంతుడిని శరణాగతి చేశారు.

 భగవంతుడు   ఆళ్వార్లను ఈ సంసారములోని దుఖ:మును తొలగడానికి తన నుండి ఏమి ఆశిస్తున్నారని అడిగారు.  ఈ సంసారము యొక్క రుచి వాసనలున్నా అవి తనను భగవదనుభవమునకు దూరము చేస్తున్నాయి. అందువలన రుచి వాసనలతో  సహా తొలగించి దీని నుండి తనను బయట పడేయాలని అడిగారు ఆళ్వార్లు.  సమస్త పదార్థములు నీచే సృష్టించబడి, రక్షింప బడుతున్నాయి.  అందువలన నీవు తప్ప మాకు రక్షకులు ఇంకెవరూ లేరు.   నన్ను నేను రక్షించుకోగలిగితే నేను శ్రీవైకుంఠమునకు ఎప్పుడో చేరుకునేవాడిని కదా! నీవు మాస్వామివి అన్నారు.  ఆళ్వార్లందరూ ఈ విషయాన్నే చెప్పారు,  తమను ఆయన సొత్తుగా అంగీకరించారు.  తిరువాయిమొళి 5-8-3 లో  “ఉన్నాలల్లాల్ యావరాలుం ఒన్ఱుం కుఱై వేణ్డేన్ ” (నీ వలన కాక పోతే ఇంకెవరి వల్ల అవుతుంది) అన్నారు నమ్మాళ్వార్లు. అలాగే ఇక్కడ తిరుమంగై ఆళ్వార్లు తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు. ఈ  ప్రబంధములో ఈ విషయమునే పాడారు. నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమొళి 5వ దశకములో తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు.

aarAvamuthanకోమళవల్లి సమేత ఆరావముదన్ , తిరుక్కుడందై.

kaliyan-and-his-nachiyar-2        కుమదవల్లి నాచ్చియార్ సమేత తిరుమంగై ఆళ్వార్, ఆళ్వార్ తిరువారాధన పెరుమాళ్- శిన్దనైక్కినియ పెరుమాళ్(నీల వర్ణ వస్త్రం ఉన్న వారు)

రెండవ అవతారిక  వ్యాఖ్యానము:

           పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధమునకు  కాలక్షేపము పూర్తి చేసిన తరువాత  శ్రీవైష్ణవులు కొందరు అక్కడికి వచ్చారు. వారి ప్రార్థన మేరకు  కృపతో ఆచార్యులు మళ్ళీ కాలక్షేపము చేసారు. పెరియవాచ్చాన్ పిళ్ళై ఆచార్యులైన నంపిళ్ళై గారికి కూడా తిరువాయిమొళికి,  ఈడు36000 పడికి కాలక్షేపము  చేసిన సమయములో,  ఇలాగే మూడు సార్లు జరిగింది.  అందువలననే ఈడు 36000లో  శ్రీయ:పతి పడిమూడు సార్లు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.

తమస్సుచే ఆవరింపబడి, నామ రూపములు లేకుండా, ఙ్ఞాన శూన్యులుగా, అచిత్తులా పడి వున్న జీవులకు నువ్వు కృపతో  నామ రూపములనిచ్చి, ఙ్ఞానము నిచ్చి,  మాకు , నీకు వున్న సంబంధమును నిరూపించావు అని తిరువెళుకూఱ్ఱిరుక్కై రెండవ అవతారికలో పెరియవాచ్చాన్ పిళ్ళై చెపుతున్నారు.

 ఆళవందార్ తమ స్తోత్ర రత్నము(10)లో, ‘అమూని భువనాని భవిధుం నాలం’ (ఈ సమస్త భువనములు నీవు లేనిదే సృజింపబడేవి కావు. సమస్తము నీ ఆధీనములోనిదే కాని వేరు కాదు) అన్నారు.

 అదే అర్థములో నమ్మాళ్వార్లు  (తిరువాయిమొళి 1.1.6) లో, “నిన్ఱనర్ ఇరుందనర్ నిన్ఱిలర్ ఇరుందిలర్” అన్నారు.

 పొయిగై  ఆళ్వార్లు   ముదల్ తిరువందాది (60)లో,  “చరణామఱై పయంద” (చతుర్ముఖ బ్రహ్మతో సహా చిత్, అచిత్ పదార్థములన్నీ తమ రక్షణ కోసము చక్రధారివైన నిన్నే ఆశ్రయిస్తారు. ఈ   సంసారము నుండి తమను తాము  రక్షించుకోలేరు) అన్నారు.

  అలాగే నమ్మాళ్వార్లు  https://guruparamparaitelugu.wordpress.com/2013/09/11/nammazhwar/(తిరువాయిమొళి 10.10.6)లో, “ఉణ్దిత్తాయి ఇని ఉణ్డొళియాయ్ “(నీలో నుంచి సృజించావు. మరి మళ్ళి నిలో చేర్చుకో) అన్నారు.

వశిష్ట,  విశ్వామిత్రుల వంటి ఙ్ఞాన సంపన్నులుండగా రక్షించేవారు లేరని ఎలా చెపుతునారని  భగవంతుడు అడిగాడు.

 దానికిఆళ్వార్లు “నైవ కించిత్ పరోక్షం తే ప్రత్యక్షోసి న కస్యచిత్ | నైవ కించిద సిధ్ధం తే న చ సిధ్ధోసి కస్యచిత్” (జితంతే 1-6),  నీకు తెలియనిదేది లేదు. నిన్ను తెలిసిన వారు లేరు.  నువ్వు నీ కృపచే తప్ప ఎవరి స్వయం కృషితోను పొందగలిగిన వాడవు కాదు.) అన్నారు. గుడ్డి వాడు చూపు వున్న వడి సహాయము లేనిదే నడవలేడు.  అలాగే ఎంతటి ఙ్ఞాన, బల, శక్తి వంతులైనా నీ కృప లేనిదే నిన్ను పొందలేరు.  

తమరిచ్చిన  ఙ్ఞాన, బల, శక్తులున్నా,నీ కృప లేనిదే నేను   శ్రీవైకుంఠము చేరగలనా?  అనడిగారు ఆళ్వార్లు.  (భగవంతుడు ఆలస్యము చేస్తున్నాడని కాదు ,  పసి బిడ్డ తల్లి కనపడక పోతే ఏడ్చి సాధించినట్లు  ఆళ్వార్లు కూడా ఈ సంసారము నుండి బయట పడవేయమని విన్నవించుకుంటున్నారు). 

                                                           అవతారిక సంపూర్ణము

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/thiruvezhukurrirukkai-introduction/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై – తనియన్లు

Published by:

మొదటి తనియన్ 

పిళ్ళైలోకం జీయర్   మణిప్రవాళ భాష(సంస్కృత తమిళ భాషల  మిశ్రమం)లో అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానము ఇక్కడ వర్ణింపబడింది.

దేవాలయాన్ని ఎలాగైతే  ప్రాకారములు రక్షించునో  ఆ మాదిరిగా ఆ భగవానుని ప్రాకారములను (వైభవమును)  రక్షించు  షట్ప్రబంధములను అనుగ్రహించిన తిరుమంగైఆళ్వార్ కు పల్లాండు (మంగళాశాసనం) ను చేయు తనియన్.

ఆచార్యులు నేరుగా వీరిని స్తుతిస్తున్నారు. అన్నీ దివ్యదేశముల యందు ఆళ్వార్ ప్రస్తుతం అర్చారూపిగా వేంచేసి ఉన్నారు. ఈ తనియన్ ఆళ్వార్ కు మంగళాశాసనం చేయుచున్నది.

                                        thUyOn sudar mAna vEl

తూయోన్ శుడర్ మానవేల్

ramanuj

ఎంపెరుమానార్( శ్రీపెరుంబుదూర్)

ఎంపెరుమానార్ అనుగ్రహించిన తనియన్ 

వాళి పరకాలన్ వాళి కలికన్ఱి/
వాళి కురైయలూర్ వాళి వేన్దన్/
వాళి యరో మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్                                                                           తూయోన్ శుడర్ మానవేల్//

ప్రతిపదార్థం 

వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
పరకాలన్- ఇతర మతస్తులకు(తత్త్వాలకు) యముడి వంటి వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
కలికన్ఱి – కలి నశింపచేయు వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి – శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
వేన్దన్ – తిరుమంగై కు రాజు
కురైయలూర్ – తిరుక్కురయలూర్ నివాసి(రాజు)
వాళ్-  సుఖముగా నివసించు ఆ స్థానం (వీరి వైభవం వలన)
వాళి- శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
శుడర్ – ప్రకాశించు/కాంతిగల
మానమ్- గొప్పవైభవం గల
వేల్ – ఈటె/బల్లెము
మఙ్గైయర్ కోన్    – మంగై(ప్రదేశం) కు రాజైన
తూయోన్ – బాహ్యాంతరములుగా పవిత్రులగు/శుద్ధులగు
వాళ్ వలియాల్ – తమ ఆయుధమగు వేళ్(కత్తి) బలముతో
మాయోనై  – ఎంపెరుమాన్  నుండి                                                                                                                   మన్దిరఙ్గొళ్ – భగవానుని నుండి తిరుమంత్రమును  పొందిన
వాళి-శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక                                                                                  యరో – ‘అసై’ అను తమిళ వ్యాకరణ పదం(పూరకం)

వ్యాఖ్యానం

వాళి పరకాలన్ – పరకాలులు అను నామాంతరం గల ఆళ్వార్ కు మంగళం . ‘పరులు’ (ఇతర మతస్తులు)- ఎంపెరుమాన్ ను తిరస్కరించువారు. అలాంటి వార్లకు ఆళ్వార్ కాలుల (యముడు) వంటి వారు. కావున వీరు పరకాలులు అయ్యిరి.

వాళి కలికన్ఱి – ఆళ్వార్ కు కలికన్ఱి అని మంగళాశాసనం(కలి యొక్క దోషములను తొలగించువారు‌)

కురైయలూర్ వాళి వేన్దన్ వాళి తిరుక్కురయలూర్ లో అవతరించి దానికి రాజై , రక్షించే వారికి మంగళం

పిమ్మట ఎంపెరుమానార్ తాము ఆళ్వార్  కు మరియు వారు ధరించిన బల్లెము/ఈటె కు మంగళాశాసనం చేస్తున్నారు.

 మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్  తూయోన్ శుడర్ మానవేల్//

మాయోనై – ఆళ్వార్,  తిరువరంగమున  ఆదిశేషుని పై పవళించిన ‘మాయోన్ ‘ ను తమ కత్తితో బెదిరించి అతని నుండి ‘తిరుమంత్రమును’  పొందిరి.

మాయోనై – వివరణ – “కడి అరంగత్తు అరవణైయిల్ పల్లి కొళ్ళుమ్ మాయోనై ” (పెరుమాళ్ తిరుమొళి 1-2) మరియు ” వాళి శుళి పొరితత్త నిర్ పొన్నిత్తెన్ అరంగన్ తన్నై వాళి పరితత్త వాళన్ వలి“, దీనర్థం- ఆళ్వార్  తమ కత్తి యొక్క బలముతో రంగనాథుని నుండి తిరుమంత్రాన్ని పొందిరి.

తనను ప్రేమించే వారి సమస్తములను అపహరించు మాయోన్  దగ్గర నుండి ఆళ్వార్ ‘తిరుమంత్రాన్ని’ దొంగలించారు. ( కై పొరుళ్ గళ్ మున్నమే కైక్కొణ్డార్ కావిరి నిర్ పురళా ఓడుమ్  తిరువరంగ చ్చెల్వనార్– నాచ్చియార్ తిరుమొళి-11-6)

మంత్ర ప్రతిపాద్యుడగు  ఎంపెరుమాన్ నుండి ఆళ్వార్ తిరుమంత్రమును పొందిరి. దీనినే  తిరునెడుదాణ్డగమ్ లో ఇలా అన్నారు – ‘ అన్దణార్ మత్తు అంది వైతత్త మందిరమ్

మఙ్గైయర్ కోన్   తిరుమంగై కు రాజైన ఆళ్వార్

తూయోన్ – ఆళ్వార్ బాహ్యాంతర పవిత్రతను/శుద్ధత్వం   కలిగి ఉన్నారు.

అనన్యార్హ   శేషత్వం (మరెవరికిని చెందకుండా ఉండుట) అనన్య శరణత్వం (ఎంపెరుమాన్ ను పొందుటకు   అతనిని తప్ప మరెవరిని ఆశ్రయించ కుండుట)  అనన్య భోగ్యత్వమ్ (ఎంపెరుమాన్ తప్ప మరేతరము కూడ అనుభవ (ఆశ్రయించుటకు) యోగ్యము కాకుండుట)- అంతరశుద్ధిగా ఈ విశేష గుణములను  ఆళ్వార్ కలిగి ఉన్నారు

పంచసంస్కారాదులను పొందుట మొదలైనవి బాహ్యశుద్ధిగా చెప్పబడింది.

ఆళ్వార్ తమ నామధేయములను ఒక పాశురమున తెలిపారు. ఈ నామధేయములు తన  బాహ్యాంతర శుద్ధత్వమును తెలుపుచున్నవి. అవి – అంగమలత్తడ వయల్ శూళ్ ఆళినాడన్, అరుళ్ మారి, అరట్టముఖి, అడైయార్ శీయమ్ కొఙ్గు మలర్  క్కురయలూర్ వేళ్ మంగైవేన్దన్, కూర్ వేళ్ పరకాలన్, కళియన్ (పెరియ తిరుమొళి 3-4-10)

శుడర్ మానవేల్ –  ప్రకాశవంతమైన పెద్దనైన బల్లెము కలిగిన వారు,  మంచి నిర్వాహణాధికారి,  విశేష ప్రతిభాపాటవం కలవారు  తిరుమంగై మన్నన్ .

తూయోన్  వేళ్  వాళి యరో- ఈ తనియన్  లో ఆళ్వార్ తో పాటు ప్రభావం కల వారి  కత్తి కూడ మంగళాశాసనం కావింపబడినది. ఆండాళ్ కూడ తమ తిరుప్పావై-24 పాశురమున- ” నిన్ కైయిళ్  వేళ్ పోత్తి? ” అని కృష్ణునకు మంగళం పాడేటప్పుడు అతని ఆయుధమైన బల్లెమునకు కూడా మంగళం  గావించెను కదా.  ఆళ్వార్  తమ ఆయుధమైన బల్లెము గురించి ఇలా   అంటున్నారు ‘ కొత్తవేళ్’ (పెరియ తిరుమొళి 3-2-10) అని- ఏ లోపాలు లేని ఎల్లప్పుడు విజయ సారథ్యం వహించునది ఆళ్వార్ బల్లెము. ఈ తనియన్ అనుగ్రహించిన వారికి( ఎంపెరుమానార్) ఆళ్వార్ తో పాటు వారి ఆయుధం పైన కూడ అధిక వ్యామోహం ఉన్నదని తెలుస్తున్నది,  కావుననే ఆయుధానికి కూడ మంగళం గావించారు.

రెండవ పాశురం కూడ ఎంపెరుమానార్ చే అనుగ్రహింప బడినది.

(ఈ పాశురానికి పిళ్ళైలోకం జీయర్ వారి వ్యాఖ్యానము  లేదు  కావున కేవలం ప్రతి పదార్థం మాత్రమే ఇవ్వబడింది.)

శీరార్ తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్ శెంతమిళాళ్                                                                                                   ఆరావముదన్ కుడన్దై పిరాన్ తన్ అడియిణైక్కుళళ్|                                                                                             ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు ఇవ్వులగుయ్యవే                                                                                   శోరామల్ శొన్న అరుళ్ మారి పాదమ్ తుణై నమక్కే||

ప్రతిపదార్థం 

ఆర్- పూరింప బడినది                                                                                                                                           శీర్ – గొప్ప శబ్దార్థములతో
తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్- తిరువెజుక్కూట్ఱిరుక్కై అను ప్రబంధము
శెంతమిళాళ్-  అందమైన తమిళ భాషలో ఉన్న ప్రబంధం
అడియిణైక్కుళళ్- ఎంపెరుమాన్ పాదపద్మముల పై  ఆలాపించబడిన
ఆరావముదన్ – ఆరావముదన్ అను నామము కల
కుడన్దై పిరాన్ తన్ – తిరుకుడన్దై  పెరుమాళ్
ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు – అపౌరేషయముగా పేరుగాంచిన వేదం యొక్క  సారమును స్పష్ఠముగా తెలుపునది.
ఇవ్వులగుయ్యవే- ఈ సంసారమును ఎరిగి జీవించుటకు
శోరామల్ శొన్న- వేదార్థములను వేటిని విడువక అన్నింటిని తెలిపిన
అరుళ్ మారి – కృపావర్షమును వర్షించు తిరుమంగై ఆళ్వార్
పాదమ్ – శ్రీ పాద పద్మములు
తుణై నమక్కే- మాకు రక్షకం

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai-thaniyans-invocation/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

e-book of the whole series: http://1drv.ms/1J8z9Go

Audio

పన్నిద్దరాళ్వార్లలో ఒకరైన తిరుమంగైఆళ్వార్ల కు మాత్రం అనేక ప్రత్యేకతలున్నాయి. లోకములో అందరూ ఆచార్యులను ప్రార్ధించి పంచసంస్కారము పొందుతారు. కాని వీరు మాత్రము మానవమాత్రులను ఆశ్రయించక తిరునరయూర్ నంబిని  ఆశ్రయించి  పంచసంస్కారములను పొందారు. తిరుక్కణ్ణపురం పెరుమాళ్ళ దగ్గర తిరుమంత్రార్థమును పొందారు. వీరిది శార్ఘ అంశమని పెద్దలు చెపుతారు. అందుచేతనేమో వీరి పనులు, పాటలు బాణములా వాడిగా వుంటాయి.  వీరి  అసలు పేరు నీలుడు, ధర్మపత్ని కుముదవల్లి చేత సంస్కరింపబడటం  వలన వీరికి  తిరుమంగై ఆళ్వార్ల న్న పేరు స్థిరపడిపొయింది.  అర్చా రూపంలో కూడా  కుముదవల్లి సమేతంగానే దర్శనమిస్తారు.  వీరు అతి వేగంగా పరిగెత్తే ఆడల్మా అనే గుర్రాన్ని ఎక్కి దివ్యక్షేత్రాలన్నీ తిరిగి సేవించి మంగళాశాసనము చేసారు.

” మారన్ పణిత్త తమిళ్ మరైక్కు ఆరంగం కూఱ”   అని మణవాళమామునులు అన్నట్లు నమ్మాళ్వార్ల ద్రావిడవేదమునకు  ఉపనిషత్ సారమైన ఆరు ప్రబంధాలు పాడారు . అవి1.పెరియతిరుమొళి 2.తిరుక్కుఱుందాండగమ్ 3 . తిరు నెడుందాండగమ్ 4. తిరువెళుకూఱ్ఱిరుక్కై 5.శిరియ తిరుమడల్ 6.పెరియ  తిరుమడల్.

   జీవాత్మ ముక్తపురుషుడై పరమపదమునకు బయలుదేరినపుడు నిత్యసూరులు ఎదురేగి బ్రహ్మరథము లో తీసుకొని వెళతారని శాస్త్రము చెపుతున్నది.  తిరుమంగై ఆళార్లు తిరుమంత్రమే కత్తితో బెదిరించి పొందినవారు. ఆ శ్రీమన్నారాయణుడు పరమపదమునకు చేర్చుకోవటానికి ఆలస్యము చేసాడేమో నని బ్రహ్మరథమును తానే అక్షర రూపములో చేసుకున్నారు. అదే తిరువెళుక్కూఱ్ఱిరుక్కై  ప్రబంధము.  ఇందులో ఏడు భాగాలున్నాయి, కాని చూడటానికి ఒకటే పాశురములా కనపడుతుంది. ఆ ఏడు భాగాలలో వచ్చే అంకెలను వరుసగా అమరిస్తే రధం రూపు కడుతుంది. చివర కంబర్ రాసిన శ్రీ రామాయణములో ఇదే అర్ధం వచ్చే పాశురాన్ని కలిపి సేవించడం ఆచారముగా పెద్దలు ఏర్పాటు చేసారు.

తిరుమంగై ఆళ్వార్  పెరియ తిరుమొళిని మొదట  పాడారు. అందులో భగవంతుడిని దేహాత్మ సంబంధమునుతొలగించమని ప్రార్థిస్తూ ముగించారు.

తిరువెళుకూట్ఱిరుక్కై (తిరువెళుకూత్తిరుక్కై అని కూడ వ్యవహరింపబడుతుంది) తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ఆరు ప్రబంధములలో మొదటిది.

తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ప్రబంధములలో  మొదటిదైన  పెరియతిరుమొళి లో ఈ దేహసంబంధమును తొలగించమని(ఆత్మకు దేహముతో ఉన్న సంబంధం) ప్రార్థించిరి. తమ రెండవ ప్రబంధమైన తిరుక్కురుదాణ్డగం లో, ఎంపెరుమాన్ తాను ఆళ్వార్ కి తమపై ఆర్తిలో  పరాకాష్ఠ వచ్చేంతవరకు  దర్శనమివ్వలేదు, ఈ ఆలస్యపు విరహాన్ని ఆళ్వార్  భరించలేకపోయిరి.  ఎలాగైతే బాగా దప్పికగొన్న వాడు నీటిలో దిగి ఆ నీటిని త్రాగి దానిలో  మునిగి తనపై కుమ్మరించుకుంటాడో ఆళ్వార్ కూడా ఆ మాదిరి తమ గానములో  ఎంపెరుమాన్ తో సంభాషించడం, సాష్టాంగ పడటం/విచారపడుతూ తమకై ఆలోచిస్తూ తామ ఉనికికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రబంధములో. ఎప్పుడైతే బాగా దప్పికఉన్న   వాడు కొంత నీరు త్రాగిన తర్వాత ఆ తృప్తి తీరక మళ్ళీ మళ్ళీ నీటిని త్రాగాలని అనుకుంటాడో,  ఆ రీతిగా ఆళ్వార్ కూడ ఎంపెరుమాన్ అనిభవించాలని ఆర్తితో ఉన్నారు. అలా తమ మూడవ ప్రబంధమైన తిరువెజుక్కూట్ఱిరుక్కై లో తాము తిరుకుడందై(కుంభకోణం) ఆరావముదన్ కు పరతంత్రులై వారిని అనుభవించాలని వాంఛతో ఉన్నారు. అందుకే ఇది శరణాగతి ప్రబంధమైనది. (నమ్మాళ్వార్ కూడ   తిరుకుడందై ఆరావముదన్ కు తమ తిరువాయ్ మొళి 5-8 లో  శరణాగతి చేశారు)

ప్రబంధ నామ నిర్ణయము:  తిరువెజుక్కూట్ఱిరుక్కై- ఎజు- ఏడు, కుఱు- విభాగములు, ఇరుక్కై – కలిగి ఉన్న. లేదా  ఇది ఏడుగా ఉన్నది –  కవిత్వం పై  దేశ, కాల, గణనలపై  ఆధారపడి  ” చిత్రకవిత్వం ” గా ప్రస్తావింపబడుచున్నది. తిరువెజుక్కూట్ఱిరుక్కై ని రథబంధ నిర్మాణంలో లిఖించవచ్చు. రథం ప్రారంభములో కొద్ది వెడల్పుతో ఆరంభమై క్రమంగా వెడల్పు అధికమయిన్నట్లుగా,  తిరువెజుక్కూట్ఱిరుక్కై కూడ పాశురం ప్రథమపంక్తిలో 123 సంఖ్యలను , తరువాతి పంక్తిలో12321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 123454321 సంఖ్యలను , ఆ పై  పంక్తిలో 12345654321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 1234567654321  సంఖ్యలను ప్రయోగించడం జరిగినది.

thiruvezhukURRirukkai

పద్యపు ఈ నిర్మాణాన్ని రథబంధం గా వ్యవహరిస్తారు. ని నిర్మాణ ప్రబంధ రూపం నయనాందకరం చేస్తుంది ఔత్సాహికులకు – thiruvezhukURRirukkai_telugu_drawing

తిరువెజుక్కూట్ఱిరుక్కై తెలుగు చిత్ర పటం

చాలా దివ్యదేశములలో తిరువెజుక్కూట్ఱిరుక్కై ప్రబంధ పారాయణ  రథోత్సవమునాడు చేయబడుతుంది.

ఈ అనువాదం ప్రతిపదార్థ నిర్మాణమునకై ఉద్దేశించినది కాదు. వ్యాఖ్యానములలోని విశేషాంశాలను అందించడానికై ప్రయత్నం చేయబడింది. ఏదైని మార్పులు చేర్పులు అవసరమైతే మమ్మల్ని సంప్రదిందగలరు. మీ విలువైన  అభిప్రాయాలను మేము సదా ఆహ్వానిస్తాము.

వ్యాఖ్యాన చక్రవర్తి అగు పెరియవాచ్చాన్ పిళ్ళై గారి వ్యాఖ్యానముతో అందించదడింది.

వ్యాఖ్యానపు వివరణాత్మక వర్ణనలకు  పుత్తూర్ స్వామి యొక్క భాష్యం చాలా వరకు ఉపయోగపడింది.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

కణ్ణినుణ్ శిరుతాంబు – 9 – మిక్క వేదియర్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 8

Nammazhwar-kanchi-3

పాశుర అవతారిక:

వేదములో చెప్పబడిన   భాగవతశేషత్వము యొక్క సారమును తిరువాయిమొళి 3.7 “పయిలుం శుడరొళి” లోను,  తిరువాయిమొళి  8.10 “నెడుమాఱ్కడిమై” దశకములలోను స్పష్టముగా చెప్పారు.  ఆ విషయమును   ఈ   పాశురములో  మధురకవి  ఆళ్వార్లు  పాడుతున్నారని  నంజీయర్ల అభిప్రాయము.

నమ్మాళ్వార్ల  కరుణ ఎలాంటిదని    మధురకవి   ఆళ్వార్లను అడిగితే,   ఎంపెరుమాన్ తిరువాయిమొళి 3.3.4లో చెప్పినట్లుగా  “నీశనేన్ నిఱై ఒన్ఱుం ఇలేన్, నం కణ్ పాశం వైత్త పరం శుడర్చోతిక్కే” (నీచుడిని,  సుగుణములేమీ  లేని వాడిని.  అయినా   భగవంతుడు నాపై కృపను చూపడము  వలన ,  కీర్తి మంతుడయ్యాడు.)    అని    చెప్పారు.  అని  నంపిళ్ళై   అభిప్రాయము.

పెరియవాచ్చాన్ పిళ్ళై :  లోకములో నమ్మాళ్వార్ల కరుణ కృప అన్నింటికన్నా గొప్పది ఎలా అయిందని మధురకవి ఆళ్వార్లను అడగగా దానికి వారు నమ్మాళ్వార్లు దాసుడి దోషములను గణించక వేద సారమును అనుగ్రహించటము చేత అని  చెప్పారు. నమ్మాళ్వార్లు  తిరువాయిమొళి  3.3.4 “నీశనేన్ నిఱై ఒన్ఱుం ఇలేన్, నం కణ్ పాశం వైత్త పరం శుడర్చోతిక్కే”( నీచుడను ఏగుణములు లేని వాడిని  పరమాత్మ దాసుడిపై దయ చూపడము చేత మరింతగా ప్రకాశిస్తున్నాడు.) అని భగవంతుడి  పరముగా  చెప్పిన  విషయమును  మధురకవి ఆళ్వార్లు,  నమ్మాళ్వార్ల  విషయములో   చెప్పారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్:   వెనకటి  పాశురములో   నమ్మాళ్వార్లు తనపై కృప  చేయటము చేత వారిని 6వ పాశురములో కీర్తించానని చెప్పుకున్నారు. 7వ పాశురములో తన దోషాలను,   పాపాలను పూర్తిగా తొలగించారని అందుచేత   నమ్మాళ్వార్ల  కీర్తిని నలుదిశల చెపుతూ తిరుగుతానని అన్నారు.  8వ పాశురములో నమ్మాళ్వార్ల దయ,  భగవంతుడి    కన్నా గొప్పదని   చెప్పారు. నమ్మాళ్వా ర్లు తనకు ఙ్ఞాన ప్రధానము   చేసిన విషయము   గురించి   ఈ  పాశురములో  చెపుతున్నారు. 4వ పాశురములో ఆచార్యులపై తనకున్న విశ్వాసమును, 5వ, 6వ  పాశురములలో  ఆచార్య  వైభవమును ,  ఉప కార వైభవమును వివరించారు.  వేదసారమును   అనుగ్రహించటము  చేత  నమ్మాళ్వార్ల      శ్రీపాదములే  ఉత్తారకముగా  భావించి  సేవిస్తాను  అని  ఈ పాశురములో ఆచార్యుల పట్ల కృతఙ్ఞతను తెలియ జేస్తున్నారు.

పాశురము-9

మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్

నిఱ్కప్పాడి ఎన్ నెంజుళ్ నిఱుత్తినాన్

తక్క సీర్ శటకోపన్ ఎన్నంబిక్కు

ఆళ్ పుక్క కాతల్ అడిమైప్పయన్ అన్ఱే

ప్రతి పర్థదాము:

మిక్క వేదియర్ వేదత్తిన్ = వేదమును అధ్యయనము  చేసిన వైదికులు

ఉళ్పొరుళ్ = అంతరార్థము

నిఱ్క = దృఢముగా

ప్పాడి = తిరువాయిమొళిని పాడి

ఎన్ నెంజుళ్ = నా హృదయములో

నిఱుత్తినాన్ = నిలిపాడు

తక్క సీర్ = తగిన విధముగా

శటకోపన్ ఎన్నంబిక్కు =ఉన్నతులైన  శఠకోపులకు

ఆళ్ పుక్క = సేవ చేయు

కాతల్ = కోరిక

అడిమైప్పయన్ అన్ఱే = నెరవేరినది

భావము:

వేదములోని రహస్యార్థములను ఇమిడ్చిన తిరువాయిమొళిని  వైదికులతో కలసి పాడటము వలన, శఠకోపులకు సేవ  చేయాలను  కోరిక నెరవేరినదని  అంటున్నారు.

నంజీయర్ వ్యాఖ్యానము:

* మిక్క వేదియర్:   భగవంతుడికి  సంబంధించిన అపారమైన   ఙ్ఞానము, భక్తి కలవారు.

*వేదత్తిన్   ఉట్పొరుళ్:  వేదములోని రహస్యార్థముల సారమైన  తిరువాయిమొళి.  తిరువాయిమొళి  3.7  “పయిలుం శుడరొళి” మరియు   8.10 “నెడుమాఱ్కడిమై” (భాగవత శేషత్వమును గురించి పాడిన దశకములు) లలో కూడ  ఇదే విషయమును ప్రస్తావించారు.

*నిఱ్కప్పాడి ఎన్ నెంజుళ్ నిఱుత్తినాన్:  తిరువాయిమొళిని  నా హృదయములో స్థిరముగా నిలిపారు.

*ఆళ్ పుక్క  కాతల్  అడిమైప్పయన్  అన్ఱే: ప్రేమతో వారి దాసుడనయ్యాను.

 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*మిక్క వేదియర్  –  వేద ప్రమాణములు తెలిసిన వాడు,   శాఖలను అధ్యయనము చేసిన వాడు .

*నిఱ్కప్పాడి – వేదార్థములను స్థాపించిన వాడు,

*తక్కశీర్ శఠకోపన్ –  తిరువాయిమొళి  1.1.1  “అయర్వఱుం అమరర్గళ్ అధిపతి ”(నిత్యసూరి  నాయకుడు)అని చెప్పింట్లుగా భగవంతుడి గురించి పాడగల అర్హత గలవాడు. తిరువాయిమొళి 3.9.11 “ఏఱ్కుం పెరుంపుగళ్ వానవర్ ఈశన్ కణ్ణన్ తనక్కు ఏఱ్కుం పెరుంపుగళ్ వణ్కురుకూర్ చటకోపన్” ( నిత్యసూరి నాయకుడు అయిన కృష్ణ భగవానుడు,  నమ్మాళ్వార్ల స్తుతికి తగిన వాడు.)లో    అంత  గొప్పగాను స్తుతించారు.

*ఎన్నంబిక్కు – దాసుడిని అంగేకరించి, సరిదిద్దిన వాడు.

*అన్ఱే  – వెంటనే భగవానుడి విషయములో కోరికను వెంటనే నెరవేర్చు కోవాలి.  అర్చిరాది గతిలో వెళ్ళే వాడు   విరజా స్నానము చేసి, పరమపదము చేరి, పరమాత్మకు కైంకర్యము చేస్తాడు. కాని   నమ్మాళ్వార్ల  విషయములో మధురకవులు వెంటనే ఫలితమును పొందాడు.అదే  నమ్మాళ్వార్లకు  తిరువాయిమొళి మొదటి పాశురములో కోరిక కలిగితే  10.10 “మునియే నాన్ముగనే” లో కోరిక తీరింది.

అన్ఱే  –  భగవద్విషయములో కోరిక వేంటనే నేరవేరాలని కోరుతున్నారు. ఒక జీవాత్మ ఉన్నతగతిని పొందాలంటే  అర్చిరాది  గతిలో ప్రయాణము చేసి విరజా స్నానము తరువాత పరమపదమును చేరవలసి వుంది.  కాని   నమ్మాళ్వార్ల విషయములో,  తిరువాయిమొళి 10.10 “మునియే నాన్ముగనే” దశకములో చివరి పాశురము పాడగానే పరమపదము లభించింది. మధురకవుల ,  నమ్మాళ్వార్లు  వేంటనే అనుగ్రహించారు.

  పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

*వీరి వ్యాఖ్యానము నంపిళ్ళై వ్యాఖ్యానమును పోలి వుంటుంది.

*మిక్క వేదియర్ – ప్రమాణ  శ్రేష్టలు – నమ్మాళ్వార్ల  తిరువాయిమొళి  1.1.7  “ఉళన్ శుడర్మిగు శురుతియుళ్”(గొప్ప  వేదమును చెప్పిన వాడు)  అని చెప్పినట్లుగా.

*వేదత్తిన్ ఉళ్ పొరుళ్ – వైదిక శాస్త్రము – భగవత్ శేషత్వము నుండి తదీయ శేషత్వము వరకు అనే  వేదాంత రహస్యమును (ప్రణవం) ధృఢపరుస్తుంది.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

*మిక్క వేదియర్  – వేదియర్  అంటే ఇతర  శాస్త్రములను ( వేదమునకు సంబంధించని శాస్త్రములు)గ్రహించక నిత్యము, నిర్ధోషము అయిన వేదమును విశ్వసించువారు.  నారదీయ పురాణం 18.33 “వేదాశాస్త్రం పరం నాస్థి” అన్న సూక్తాన్ని అర్థము చేసుకున్న వారు.  తిరుచ్చంద విరుత్తము 72 “వేద నూల్ ఓతుగిన్ఱతు ఉణ్మై అల్లతు ఇల్లై” (వేదశాస్త్రము ఉపదేశించునది సత్యము కానిది అందులో లేదు.)

మిక్క వేదియర్- భగవత్ కైంకర్యము కన్నా ఇతరమైన లక్ష్యము లేదని, దానిని పొందుటకు భక్తి, శరణాగతి మాత్రమే మార్గములని తెలిసిన వారు.

*వేదత్తిన్  ఉళ్ పొరుళ్  –  వేదప్పొరుళ్-వేదము యొక్క అర్థము.  భగవంతుడే గీత 15.15 లో “వేదై సర్వైశ్చరహమేవ వేద్య:”  (వేదము పూర్తిగా నా గురించే చెపుతుంది) అని చెప్పారు.  పెరియాళ్వార్ తిరుమొళి  2.9.6లో  “వేదప్పొరుళే వేంకడవా” (ఓ శ్రీనివాసా!  వేదము యొక్క అర్థమే నీవు) అనీ,  అలాగే పెరియాళ్వార్ తిరుమొళి  4.3.11 “వేదాంత విళుప్పొరుళ్” (వేదాంతములోని అర్థమూ నీవే)అన్నారు. తిరువాయిమొళి   3.7 “పయిలుం శుడరొళి”,8.10 “నెడుమాఱ్కడిమై“  దశకములలో నమ్మాళ్వార్లు భాగవత శేషత్వము గురించి చెప్పారు.

*నిఱుత్తినాన్ – (నమ్మాళ్వార్లు)  స్థిరముగా  నిలిపారు. ఆయనే   నన్ను మార్చడానికి ప్రయత్నించినా  మారను.

* ఎన్నెంజుళ్ నిఱుత్తినాన్  –  భగవత్శేషత్వము గురించి తెలియని నాకు భాగవత శేషత్వము గురించి చెప్పారు.

*మిక్క … నిఱుత్తినాన్  –  వేదసారమును తిరువాయిమొళిలో అనుగ్రహించి గొప్ప మేలు చేశాడు.  ఆచార్యుల గొప్పతనము తెలిసిన వారికే  వేద సారమును  అవగాహన  అవుతుంది.  నమ్మాళ్వార్లు ప్రమాణం (వేదము),  ప్రమేయము  (వేదప్పొరుళ్ – భగవంతుడు),  ప్రమాత్రు (మిక్క వేదియర్) మరియు అభిమత విషయము( మధురకవులకు  నమ్మాళ్వార్లు) ఏర్పాటు చేసారు.

*తక్క శీర్ శ్చఠపన్ ఎన్ నంబి _  నమ్మాళ్వార్లు  నాలోని  అఙ్ఞానమును నిశ్శేషముగా తొలగించి పరిపూర్ణుడిగా చేశారు. ఆయన తిరుక్కుఱుంగుడి నంబి ( తిరుక్కుఱుంగుడి దివ్య దేశము లోని పెరుమాళ్ళు) కాదు. తిరుక్కురుకూర్ నంబి. తిరువాయిమొళి  5.5.5 లో  “తక్క కీర్త్తిత్ తిరుక్కుఱుంగుడి నంబి” నమ్మాళ్వార్లు వారి నంబి గురించి చెప్పారు. మధురకవులకు మాత్రము నంబి అంటే తిరుక్కురుకూర్ నంబియే.

*అడిమైప్ పయనన్ఱే  –  మొదట  ఆచార్యులకు దాసులు కావాలి.  తరవాత  అభిమానమును  పొంది,  కైంకర్యము చేయాలి. ఈ మూడు శిష్యుల కుండ వలసిన లక్షణములు. నమ్మాళ్వార్లు వీరికి ఈ మూడు నేర్పారు. భగవశ్చేషత్వము , భగవ త్ప్రే మ, శేషత్వవృత్తి  (కైంకర్యము).  నమ్మాళ్వార్లు లౌకిక విషయములలో వైరాగ్యము  కలిగి,   భగవంతుడి విషయములో  పై  మూడు గుణములు  కలిగి వుండే,  మధురకవులకు,  భగవంతుడి విషయములో  వైరాగ్యము కలిగి, నమ్మాళ్వార్ల  విషయములో  పై మూడూ గుణములు    కలిగి వున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiruth-thambu-9-mikka-vedhiyar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

కణ్ణినుణ్ శిరుతాంబు – 8 – అరుళ్ కొణ్డాడుం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 7

githacharya-nammazhwarగీతాచార్య – నమ్మాళ్wఆర్

అవతారిక:

నంజీయర్   అభిప్రాయము :

వేదమును అనుగ్రహించి  చేతనులకు  చేసిన  భగవంతుని కృప  కంటే  తిరువాయ్ మొళిని అనుగ్రహించిన నమ్మాళ్వార్లు కృప  గొప్పదని  మధురకవులు  ఈ  పాశురములో  పాడుతున్నారని నంజీయర్ల అభిప్రాయము.

నంపిళ్ళై

మధురకవులు ఈ పాశురములో   “నమ్మాళ్వార్ల కీర్తిని పాడుతాను”   అని అంటున్నారని  నంపిళ్ళై మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ఎత్తి చూపుతున్నారు, ఎందుకనగా నమ్మాళ్వార్ల  కృప  తత్వ త్రయము  కంటే  గొప్పది (చిత్, అచిత్ , ఈశ్వర )

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ల అవతారిక:

మధురకవులు  నమ్మాళ్వార్ల కృపను పాడుతున్నారు. “అందరూ భగవంతుడి కృపను   గొప్పచేసి చెప్పుతుండగా  మీరు మాత్రము  నమ్మాళ్వార్ల  కృపను  గొప్ప చేసి  పాడుతున్నారు ఎందుకు? ” అని అడగగా, దానికి మధురకవులు  భగవంతుడి కృప మోక్షము పొందటానికి ఉపకరిస్తుంది. కాని మోక్షమును   పొందటానికి ముందుగా  కావలసిన  ఙ్ఞానము  పొందాలి.  అది  నమ్మాళ్వార్లు  ఇస్తారు.  అందువలన నమ్మాళ్వార్ల  కృప అన్నింటికంటే గొప్పదని  జవాబిచ్చారు. మోక్షప్రాప్తి  ఙ్ఞానము మీద అధారపడింది.  ఙ్ఞానము మాత్రము లక్ష్యము మీద ఆధార పడదు. .  మోక్షమును  పొందటానికి  ముందే  ఙ్ఞానమును  పొందాలి.

4వ  పాశురములో  మధురకవులు తన  దోషాలను  చెప్పుకున్నారు.  5వ పాశురములో తన దోషాలను రెండు  విధాలుగా ( ఆత్మ స్వాతంత్ర్యము కలిగినదనియు మరియు ప్రాపంచిక భోగములను అనుభవించటుకును ) చెప్పుకున్నారు. 7వ పాశురములో నమ్మాళ్వార్లు తన దోషాలను, అవరోధాలను  తొలగించారని చెప్పారు. ఈ పాశురములో నమ్మాళ్వార్లు తన దోషాలను, అవరోధాలను ఎట్లు తన దోషాలను నిశ్శేషముగా పోగొట్టారని చెప్పుతున్నారు.

*దేహమే ఆత్మ అనియు మరియు ప్రాపంచిక భోగములను అనుభవించట(ఆత్మ స్వరూపం కానివి) అను అడ్డంకులు నిజమైన ఆత్మ ఙ్ఞానము వలన మరియు భగవంతుడికి , ఆత్మ కు ఉన్న సంబంధము ఙ్ఞానము  (అధ్యాత్మ ఙ్ఞానము/విద్య) వలన తొలిగిపోతాయి. ఙ్ఞానము  వలన  కర్మ పెరగకుండా వుంటుంది .అప్పటికే చేకూర్చబడిన కర్మ తొలగిపోతుంది. మరిన్ని కర్మములు చేయు వాంఛను ఆచార్యులు తొలగిస్తారు , ఉన్న కర్మను భగవంతుడు పోగొడ్తారు, ఆచార్యులు నిజమైన  ఆత్మ ఙ్ఞానము  ఇవ్వడము వలన భగవంతుడు కర్మను తొలగిస్తాడు.

పాశురము

అరుళ్ కొణ్డాడుం అడియవర్ ఇంబుఱ

అరుళినాన్ అవ్వరుమఱైయిన్ పొరుళ్

అరుళ్ కొణ్డు ఆయిరం ఇన్ తమిళ్పాడినాన్

అరుళ్ కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే

ప్రతి పదార్థము:

అరుళ్ కొణ్డాడుం = పరమాత్మ కృపను పొగుడుతున్నారు

అడియవర్ =  భక్తులు

ఇంబుఱ = ఆహ్లాదము  కలిగించు

అ అరుమఱైయిన్ పొరుళ్ = ఆ అసాధారణమైన (గ్రహించుటకు కష్టమైన) వేద సారము

అరుళినాన్ = కృపచేస్తాడు

అరుళ్ కొణ్డు = అపారమైన దయతో

ఇన్ తమిళ్  = సుందరమైన తమిళము లో

ఆయిరం = – తిరువాయ్ మొళి వేయి పాశురములు

పాడినాన్ = పాడారు

అరుళ్ కణ్డీర్ = కేవలము వారి దయ మాత్రమే

ఇవ్వులగినిల్ = ఈ లోకములో

మిక్కతే = ఔన్నత్యము

భావము:

ఈ లోకములో  అపారమైన దయతో నమ్మాళ్వార్లు వేయి  పాశురముల  తిరువాయ్ మొళిలో  వేదములోని సారమును కృపచేసారు. ఇది వారి ఔన్నత్యమునకు గొప్ప ఉదాహరణ.

నంజీయరు వ్యాఖ్యానము:

*  మహాభారత శాంతి పర్వము 358.73 లో   “హ్రుష్టా:” ( శ్వేత ద్వీపములో ముక్తాత్మలు ఆనందముగా భగవంతుని గురించి పాడుతూ వుంటారు. ) అని చెప్పినట్లు, భక్తులు ఆనందముగా నిశ్చిత బుద్దితో భగవంతుని గురుంచి చింతన చేస్తూ వుంటారు.

* గీతాచార్యులైన   భగవంతుడు, కొద్దిగా తన వైపు వంగిన వారికి వేదసారమును బోధించాడు.  వేదములో రహస్యముగా   చెప్ప బడిన అర్థములను గీతలో సులభముగా  బోధించాడు. నంజీయర్  మాత్రమే  భగవత్సబంధముగా వ్యాఖ్యానము   చేసారు. తక్కిన వ్యాఖ్యాతలు   నమ్మాళ్వార్ల  పరముగానే  వ్యాఖ్యానము  చేసారు.

*భగవంతుడు అర్హులకు మాత్రమే గీతను బోధించాడు. కానినమ్మాళ్వార్లు  అనర్హులకు  కూడా వేదసారమును బోధించారు.

*భగవంతుడు రణరంగములో ఉన్న వారికి మాత్రమే  గీతను బోధించాడు.  తిరువాయ్ మొళి  1.5.11 లో  “పాలేయ్ తమిళర్  ఇశైకారర్  పత్తర్ పరవుముం  ఆయిరం” అన్నట్లు ( తమిళము మాట్లాడగల వారు, కవులు, గాయకులు, భక్తులు తిరువాయ్ మొళి  వేయి పాశురములను ఆశ్రయించి  పాడి, మాట్లాడి, ఆడి సంతోషిస్తారు )అందరికి అందుబాటులో * తిరువాయ్ మొళి 9.4.9 లో “తొణ్డర్కముదుణ్ణ చ్చొల్ మాలైగళ్” ( భక్తులకు అమృత సమమైన పాశురములు) అన్నది అక్షర సత్యము.

* నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*అరుళ్ కొణ్డాడుం   అడియవర్  –  భగవంతుడి  కృపను నమ్మాళ్వార్లు   కృపతో  పొలుస్తారు.  కాని  నమ్మాళ్వార్లు  తిరువాయ్  మొళి 8.8.3  “అతువుం అవనతు ఇన్నరుళ్”(అది కూడా వాడి కరుణయే)  అని తిరువాయ్ మొళి 10.6.1 “అరుళ్ పెఱువార్ అడియార్”( భగవంతుడి కృపను పొందిన వారు భాగవతులు) అని పాడారు.

*అరుళ్ కొణ్దు –  తిరువాయ్ మొళి 1.1.1 “మయర్వఱ మదినలం అరుళినన్”  అన్నట్లుగా వారుగా ఏదీ పాడలేదు . భగవంతుడు కృప చేసిన మేరకే  వారు తిరువాయ్ మొళి 7.9.4 “ఎన్నాగియే తప్పుతలిన్ఱిత్ తనైక్కవి  తాన్ శొల్లి”( దాసుడిద్వారా భగవంతుడు తన ఔన్నత్యములను పాడారు). నమ్మాళ్వార్లు  ఈ పాశురములను  పాడిన  తరవాత  అపార ఆనందమును అనుభవించారు.

*ఇంతమిళ్ పాడినాన్  – ఎంతో క్లిష్ట విషయములను తమిళములో పాడారు.

*ఇవ్వులగినిల్ మిక్కతే  –  చిత్,  అచిత్, ఈశ్వరుడు అను తత్వత్రయముల కంటే  గొప్పది.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

*అరుళ్ కొణ్డాడుం అడియవర్ – భగవంతుడి  కృపను నమ్మళ్వార్లు తిరువాయ్ మొళి  8.8.3  “అదువుం  అవనతు ఇన్నరుళ్”( అది కూడా ఆయన కృప) అన్నారు. తొణ్డరడిప్పొడి ఆళ్వార్లు  తిరుమాలై-46 లో  “ఆనైక్కన్ఱు అరుళై ఈంద”(ఆ రోజు గజేంద్రుడికి కృపను చూపిన) అని, పూదత్తాళ్వార్లు  ఇరణ్డాం తిరువందాది-56  “అరుళ్ పురింద సిందై” (భగవంతుడి దయాపూరితమైన చింతన) అని,  పెరియాళ్వార్లు  పెరియాళ్వార్ తిరుమొళి  5.4.1 లో “నిన్నరుళే పురింతిరుంతేన్” (నీ దయను మాత్రమే కోరుతున్నాను) అని, పేయాళ్వార్లు మూన్ఱాం తిరువంతాది-16 లో “అరుళా తొళియుమే”(ఎల్లప్పుడు  దయామయుడు) అని, తిరుమంగై ఆళ్వార్లు  “ఆళియానరుళే”(చక్రపాణి కృప) అని, భగవంతుడి ప్రసాద గుణమును కొనియాడారు.

*అరుమఱై –  వేదములోని అర్థములను తెలుసుకోవటము కష్ఠ సాధ్యము. దానిలోని సారము (రహస్య భాగము) ఉపనిషత్తులు.  సత్త్వగుణము గల వారు మాత్రమే ఉపనిషత్సారమును తెలుసు కోగలరు. వారి ధనము ఉపనిషత్ ఙ్ఞానము.  అది భగవంతుడి కృప వలన లభిస్తుంది. అటువంటి ఙ్ఞానము  (ఇంబుఱ)  బ్రహ్మ సూత్రం 1.1.15లో “తత్తేతు వ్యపదేసాచ్చ”( జీవాత్మ  వైయుక్తికము )అని చెప్పినట్ల్లుగా,  ఆ  ఆనందము వ్యక్తి  అనుభవమును  బట్టి  మారుతూ వుంటుంది.

*ఆయిరం  ఇన్  తమిళ్ పాడినాన్  – తిరువాయ్ మొళిలోని  ఒక్క పాశురము చాలు.  కాని నమ్మళ్వార్లు ఆత్మ ఉజ్జీవనము కోసము  వేయి  పాశురములు పాడారు.  దానిలో ఎన్నో క్లిష్ఠమైన అర్థాలు, సూత్రాలు, ఇమిడ్చి సామాన్యులు అర్థము చేసుకునే  రీతిలో  కూర్చారు.

*పాడినాన్ అరుళ్ కణ్డీర్ – నమ్మాళ్వార్ల  కృప,   భగవంతు డి కృప కన్నా గొప్పది.  భగవంతుడు   వదిలి  వేసిన జీవాత్మలను  కూడా  ఈయన  ఉజ్జీవింప చేశారు.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

* అరుళ్ కొణ్డాడుం అడియవర్ ఇంబుఱ  –   నమ్మళ్వార్లు   తిరువాయ్ మొళి  సాత్వికుల  కోసము పాడారు.  భగవంతుడి తృప్తి కోసము కాదు.

*అడియవర్ –  దాసులు- శేషత్వ ఙ్ఞానము కల వారు. శేషత్వ ఙ్ఞానము కైంకర్య ప్రాప్తినిస్తుంది.

*అరుళ్ కొణ్డాడుం అడియవర్ –  -కైంకర్యమునకు భగవంతుడి కృప సాధనమని  కొందరు  అనుకుంటారు.  కృప ఉపాయము,  కైంకర్యము  పురుషార్థము.  ఎవరైతే భగవంతుడి కృప  గొప్పదను కుంటారో వారు  ఆ కృపనే  గొప్పచేసి పాడతారు.  భగవంతుడికి అనేక గొప్ప గుణములున్నా కృప ప్రధానమైనది.  దేవతాంతరములకన్నా భగవంతుడు ఎలా గొప్పవాడో, కృప కూడా ఇతర  గుణముల కన్నా గొప్పది.  ఇది లేనిదే  మిగిలిన  గుణములు  ప్రకాశించవు.

*భగవంతుడి కృప శక్తుడికి (కర్మ,ఙ్ఞాన, భక్తి యోగములు చేయగల వాడు) , అశక్తుడికి (శరణాగతి చేసిన వాదు) కూడా కావాలి.  కర్మ,ఙ్ఞాన, భక్తి  యోగములు చేయగల వాడి కృషిని  భగవంతుడు చూస్తాడు. వారిపై  కృపను చూపి , కోరికలను తీరుస్తాడు.  ప్రపన్నులకు  ఆకించన్యమును  చూసి  కృపను చూపుతాడు.

*భగవంతుడు కృపను చూపడానికి  రెండు   ప్రమాణములను సూచించారు. పెరియ తిరువంతాది  26 లో నమ్మళ్వార్లు “అరుళెన్నుం తణ్దు” (కృప అనే కర్ర) అని,  తిరుమంగై ఆళ్వార్లు,  పెరియ తిరుమొళి  6.2.4లో  “అరుళెన్నుం ఒళ్ వాళ్” ( కృప  అనే  కత్తి )  అని పాడారు.   నమ్మళ్వార్లు  బ్రాహ్మణ్యము  కలవారు  కావటము  చేత  కర్ర  అన్నారు.  కాని  తిరుమంగై  ఆళ్వార్లు   క్షాత్రము  కల వారు  కావటము  చేత కత్తి  అన్నారు.  అరుంపదములో,  నమ్మళ్వార్ల  ప్రశాంత  ప్రకృతి  వలన వారిని  బ్రాహ్మణ అని చెప్పినట్లు వివరించటము జరిగింది.

*ఇంబుఱ – భగవంతుడి  కృపకు  ఆయన  అనుగ్రహము  కావాలని  సాత్త్వికులకు  తెలుసు.  వారు  నమ్మళ్వార్ల అనుగ్రహము కూడా పొందుటకు  ఆనందపడతారు.

*అరుమఱైయిన్  పొరుళ్  –  మఱైయిన్  అరుం  పొరుళ్ (వేదము  యొక్క  రహస్యార్థములు ). -కృప ఉపాయము  కైంకర్యము  పురుషార్థము.

*పొరుళై అరుళినాన్ –నమ్మళ్వార్లు  వేదమును  అనుగ్రహించక  పోతే (వారి వర్ణం వలన) చతుర్థవర్ణము వారు (శూద్రులు ),  వేదమును పాడుకోలేక  పోయేవారు. వారు   అనుగ్రహించటము  వలన అందరూ పాడుకోగలుగు తున్నారు.

*ఆయిరం ఇంతమిళ్  పాడినాన్  –   ప్రణవము  అతి  సంక్షిప్తమైనది.  మహాభారతము   అతి విస్తారమైనది. తిరువాయ్ మొళి  అతి  సంక్షిప్తము  కాక  అతి  విస్తారము  కాక  సులభమైన  తమిళములో  వేయి  పాశురములు కలది.

* పాడినాన్   – వేదము  అపౌరుషేయము.  దానిని  సప్రమాణముగా  నమ్మళ్వార్లు పాడారు.  ఏ ఒక్కరో  నిగ్రహము లేకుండా  పాడితే  సప్రమాణముగా   ఉండేదో  లేదో?  నమ్మళ్వార్లు తిరువాయ్ మొళి  7.9.3 లో  “ఆం ముదల్వన్ ఇవనెన్ఱు తఱ్ఱేఱ్ఱి  ఎన్  నా   ముతల్  వందు పుగుందు  నల్లి  కవి  తూముతల్  పత్తర్కు త్తాన్  తన్నైచ్చొన్న ఎన్ వాయ్ ముతల్ అప్పనై” (ఆ పరమాత్మ  దాసునికి  ఙ్ఞానము నిచ్చి,  నాలుకపై  కూర్చుండి,  ముముక్షువులు   ఆనందించే అమృతోపమానమైన   పాశురములను  పాడారు ) అందు వలన  ఇది సప్రమాణమైనది.

*అరుళ్ కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే  – నమ్మళ్వార్ల  కృప  గొప్పదని,  ఈ  లోకములో  అందరికీ  తెలిసిన విషయము. పాశురము  కాదు, ఎవరు రాశారని  కాదు,  ఎవరు  కృపతో  తిరువాయ్ మొళి  రాయటానికి  నమ్మళ్వార్లను అనుగ్రహించారని  కాదు,  అన్నిటి కంటే నమ్మళ్వార్ల  దయ చాలా గొప్పది.

* ఇంతమిళ్ పాడినాన్… –. గీతను ఇచ్చిన  భగవంతుడిది  దయ  కాదు.  కృపతో   తిరువాయ్ మొళి   ఇచ్చిన  నమ్మళ్వార్లదే  దయ.

*ఇంతమిళ్ పాడినాన్   అరుళ్ కణ్డీర్   ఇవ్వులగినిల్  మిక్కతే  – తిరువాయ్ మొళి  10.6.11  “కేట్టారార్ వానవర్గళ్ శెవిక్కినియ సెంచొల్” ( పరమపద వాసులు కూడా తిరువాయ్ మొళిని మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటారు.) అని నమ్మళ్వార్లే  పాడారు. ఈ సంసారము  నమ్మళ్వార్ల కృపతో  నిండి   వున్నది.

*ఆయిరం… –  గీతను చెప్పిన  కృష్ణుడి పేరు వినగానే  ఎవరూ  అంజలి ఘటించడము లేదు.  కాని తిరుక్కురుకూర్ అని వినగానే   అంజలి ఘటిస్తారు (తిరువాయ్ మొళి సేవాకాలంలో ప్రతి దశకము చివర తిరుక్కురుకూర్ అని అనగానే అందరూ   తప్పక  అంజలి  ఘటిస్తారు).

*కణ్డీర్  – శాస్త్రము సహాయముతో భగవంతుడి కృపను తెలుసుకో గలము.  కాని నమ్మళ్వార్ల  దయను పరమపదమునకు  పోకుండానే ఇక్కడే  ఈ లోకములోనే   ప్రత్యక్షముగా  చూడగలము.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-8-arul-kondadum/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

Nammazhwar-krishna

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 6

అవతారిక:

నంజీయర్  అభిప్రాయము :

మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృప వలన తనకున్న అవరోధాలన్నింటిని  తొలగించి అనుగ్రహించారని  ఈ పాశురములో  పాడుతున్నారని  నంజీయర్  అభిప్రాయ  పడుతున్నారు.

నంపిళ్ళై అభిప్రాయము:

నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృపను  చేతనులందరూ  పాడుతూ  తమ కష్టాలను పోగొట్టుకోవలని  మధురకవి  ఆళ్వార్లు ఈ  పాశురములో పాడుతున్నారు.

పెరియవాచ్చాన్  పిళ్ళై అభిప్రాయము :

మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల నిర్హేతుక కృప వలన  తనకున్న అవరోధాలన్నింటిని  తొలగించి  అనుగ్రహించారు కదా!  చేతనులందరూ తమ కష్ఠాలను పోగొట్టుకోవటానికి, నమ్మాళ్వార్ల నిర్హేతుక కృపను పొందడానికి అర్హులే.  కాని, నమ్మాళ్వార్ల ఔన్నత్యము  అందరికీ  తెలియక పోవటము చేత మధురకవి ఆళ్వార్లు ఈ పాశురములో  నమ్మాళ్వార్ల  ఔన్నత్యమును పాడుతున్నారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ల  అభిప్రాయము:

*4వ పాశురములో  మధురకవి ఆళ్వార్లను  , మహా ఙ్ఞానులు కూడా తనను నిరాకరించగామ్మాళ్వార్లు మాత్రము తల్లిగా తండ్రిగా ఆదరించారు అని చెప్పారు.  5వ పాశురములో  తనలోని  లోపాలను  చెప్పుకున్నారు.  కిందటి  పాశురములో నమ్మాళ్వార్లు తనను ఎప్పటికీ  వదలరని  చెప్పి ఈ పాశురములో  వారి  కీర్తిని  గానము  చేస్తున్నారు.

*ఈ  పాశురములో  నమ్మాళ్వార్ల  నిర్హేతుక  కృప  వలన  అనాదిగా  తనకున్న అవరోధాలన్నింటిని   తొలగదోసి అనుగ్రహించారని,  అందువలన వారి కీర్తిని లోకమంతా తిరిగి గానము చేస్తున్నారు.  “గురుం  ప్రకాశయేన్నిత్యం” అని శాస్త్రములో  చెప్పినట్లుగా  మధురకవి  ఆళ్వార్లు  తమ  ఆచార్యులైన  నమ్మాళ్వార్ల   కీర్తిని  గానము  చేస్తున్నారు.

*నమ్మాళ్వార్లకు  భగవంతుడి స్వాతంత్ర్యము మీద  పూర్తి  విశ్వాసము వుంది.  దేవతాంతరములకు ఈ స్వాతంత్ర్యము లేదు. భాగవత  శేషత్వము వలన లౌకిక  కోరికలు తొలగిపోయాయి.  సంసారుల  మీది  దయతో తిరువాయ్ మొళిలోని-1.2 “వీడు మిన్ ముఱ్ఱవుం” నుండి  -10.5 “కణ్ణన్ కళలిణై” దశకము వరకు పాడారు. భగవంతుని  స్వాతంత్ర్యము గొప్పది. చేతనుడు ఆయనను ఆశ్రయించినప్పుడు  ఆయన  శిక్షించవచ్చు.  కాని  నమ్మాళ్వార్లు  అలా  శిక్షించరు.  ఈ విషయమునే  మధురకవి  ఆళ్వార్లు  ఈ  పాశురములో  చెప్పారు.

పాశురము –

కణ్దు కొణ్దు ఎన్నై కారిమాఱప్పిరాన్

పణ్దై వల్వినై పాఱ్ఱి అరుళినాన్

ఎణ్దిసైయుం అఱియ ఇయంబుగేన్

ఒణ్దమిళ్ శటకోపన్ అరుళైయే

 ప్రతి పదార్థము:

పిరాన్ =  పరమ ఉపకారకులు

కారిమాఱన్ = పొఱ్కారి సుపుత్రులు

ఎన్నై = నన్ను

కణ్దు = అనుగ్రహించిన

కొణ్దు = వారి కైంకర్యములో నియమించి

పణ్దై వల్వినై = అనాది పాపములను

పాఱ్ఱి అరుళినాన్ = కృపతో తొలగదోసారు

ఒణ్దమిళ్  శఠకోపన్ అరుళైయే = మధురమైన తమిళ పాశురములకు మూలమైన శఠకోపుల కృప ( అత్తనాయ్)

ఎణ్దిసైయుం = అష్ట దిక్కులు

అఱియ = తెలుసుకునే విధముగా

ఇయంబుగేన్ = పాడుతాను

భావము:

పొఱ్కారి సుపుత్రులైన నమ్మళ్వార్లు దాసుడికి  పరమ  ఉపకారములు  చేశారు. వారి  కృపతో  అనాది  పాపములను  తొలగదోసి, వారి కైంకర్యములను  చేయటానికి  అనుగ్రహించారు.  మధురమైన  తమిళ  పాశురములకు  మూలమైన శఠకోపుల  కృపను  అష్ట క్కుల  తెలుసుకునేలా  పాడుతాను.

 నంజీయర్ వ్యాఖ్యానము:

* తిరువాయిమొళి 8.7.2 ళోఏ నమ్మళ్వార్లు “ఇరుందాన్ కణ్దు కొణ్దు”(నా హృద యములో  చేరి నన్ను ప్రేమతో చూస్తున్నాడు  ) అని  చెప్పినట్లుగానే  మధురకవులు  ఇక్కడ   అన్నారు.

*పణ్డై వల్వినై – అనాది పాపములు -ఆత్మకు ఈ  సంసారములో  అంతమును (పరమపదమునకు  చేరితే తప్ప) ఊహించను కూడా లేము.  ఈ పాపములు తీరేవి కావు  తొలగేవి కావు  అనుభవించి  తీరవలసినవే. నమ్మళ్వార్లు వీటిని తొలగించారు. వీరు భగవతుణ్ణి కూడా  భాగవత కైంకర్యమునకు  అడ్డుగా  భావించి  వదులుకున్నారు.

*ఎణ్డిసైయుం  అఱియ  ఇయంబుకేన్ –  ఈ విషయాన్ని ఙ్ఞానులకు, అఙ్ఞానులకు చెపుతాను.

*ఒణ్దమిళ్ –  సంస్కృత వేదము  “యతో వాచో నివర్తంతే” అన్నట్లు వాక్కులు/మనసు అర్థము కావు.  ద్రావిడ వేదము అలాకాక  సులభ  గ్రాహ్యము.

* “శఠకోపన్ అరుళైయే” – నమ్మాళ్వార్ల  కృప , భగవంతుని  కృప  అందని  వారికి  కూడా  అందుతుంది.

 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*కారిమాఱప్పిరాన్ – మధురకవి  ఆళ్వార్లు,  నమ్మాళ్వార్లను  “పిరాన్” (కృప చేసిన వారు)  అని  కృతఙ్ఞతా భావముతో పిలిచారు. సంప్రదాయములో  భగవంతుడిని  “పిరాన్” అంటారు. అందు వలన  నమ్మాళ్వార్లను  “కారిమాఱ పిరాన్” అని  సంభోధించడం  జరిగింది.

*పణ్దై వల్వినై –  భగవంతుడి కి కైంకర్యము చెసే సమయములో అనేక రకముల  అనాది పాపములు  అవరోధములుగా నిలుస్తాయి. (రామాయణములో శూర్పణఖ  లాగా). అయినా  భగవత్కైంకర్యమే  లక్ష్యముగా  వుండాలి.

*పాఱ్ఱి అరుళినాన్ –   “ద్విషంత: పాపకృత్యాం”(పాప ఫలమును పరమపదమునకు పోవునప్పుడు శత్రువులకు ఇచ్చి వెళతారు) అని  శాత్యాయన  శాఖలో  స్పష్టముగా  తెలిపినట్లుగా  ఇక్కడ  నమ్మాళ్వార్లు,  మధుర కవుల  అనాది పాపములను  తొలగించారు.

*ఎణ్డిసైయుం  అఱియ ఇయంబుకేన్ –  తిరువాయ్ మొళి  5.2.2  “తొణ్డీర్ ఎల్లారుం వారీర్”అని నమ్మాళ్వార్లు చెప్పినట్ళుగా కోరిక గాలవారందరికి  తెలియజేస్తాను అని మధురకవులు అంటున్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం:

*కణ్దు కొణ్దు – నమ్మాళ్వార్లు  దాసుడిని  చూడగానే గొప్ప సంపదను చూసినట్లు ఆనందపడ్డారు.

*ఎన్నై –నమ్మాళ్వార్లకు  ఇతర  సంసారులకు  బేధము కూడా తెలియని , వారి నిర్హేతుకమైన  కృపను తెలుసుకోలేని దాసుడిని అనుగ్రహించారు.

*కారిమాఱప్పిరాన్ –  “సుహృదం సర్వ భూతానాం” అని  గీతలో  కృష్ణుడు  తనే  చెప్పగా,  నమ్మాళ్వార్లు  అంతకంటే కృపను చూపారు.

*ఒణ్దమిళ్ శఠకోపన్ అరుళైయే –  అందమైన తమిళములో  నమ్మాళ్వార్ల  కృపను గానము  చేస్తాను.  అదియే  దాసుడికి శరణ్యము.

  అళిగియ మణవాళ పెరుమళ్ నాయనార్  వ్యాఖ్యానం:

* నమ్మాళ్వార్ల   చిత్, అచిత్, ఈశ్వరుడు  అనే  తత్వత్రయ  ఙ్ఞానము,  ఈశ్వర భక్తి,  చిత్-అచిత్తుల  పట్ల వైరాగ్యము, చేతనులపై కృప అనే గొప్ప  గుణములు  ఈ  పాశురము  ప్రారంభములోనే  చెప్పబడింది.  నమ్మాళ్వార్ల  కృప భగవంతుడి కృప కంటే ఎక్కువైనది  అని  ఈ  పాశురములో  చెప్పబడింది.

*కణ్దు –  మహాభారతము శాంతి పర్వం  358.73  “జాయమానం  హి  పురుషం  యం  పశ్చేత్ మధుసూదన: …” (మధుసూదనుడి  చూపు  వలన  గర్భములోని  ఆత్మ  రక్షింప  బడినది). అలాగే  నమ్మాళ్వార్లు  దాసుడిని చూశారు.

*కొణ్డు –  దాసుని దోషములను చూసి కూడా అనుగ్రహించారు.

*ఎన్నై క్కణ్డు, ఎన్నైక్కొణ్డు –  దాసుడుపై దృష్టి  సారించారు, అంగీకరించారు. వారి  అంగీకారము వలన భగవంతుడు కూడా అంగీకరించాడు.

*కారిమాఱప్పిరాన్ – వారు భగవంతుడి లా స్వయంభువు (పిరాన్)  కాదు.  కారిమాఱన్    సుపుత్రులు (కారి మాఱప్పిరాన్).

*పాఱ్ఱి –   భగవంతుడు   గీత 18.66 లో   “మామేకం శరణం వ్రజ … మోక్షయిష్యామి” అని చెప్పారు. వీరు   శరణం  అనక  ముందే    అనుగ్రహించారు.

* ఎండిసైయుం… –  స్వతంత్రులుగా  భావించే వారికి,  దేవతాంతరము  పాటించే వారికి  ఉపదేశించి   కాపాడుతాను.

*అఱియ  ఇయంబుకేన్ – పెరియాల్వార్లు తమ తిరుప్పల్లాణ్డు-4లో “నాడు నగరముం నంగఱియ” అని పాడినట్లుగా దాసుడు నమ్మాళ్వార్ల పాటలను పాడుతూ,  కీర్తిస్తాడు.

*శ్రీ జాంబవంతుడు,  త్రివిక్రమ అవతారము తరవాత   “దేవా: స్వస్తానమాయాంధి ధైత్యా: సర్వే హతా గతా: | న భయం విద్యతే కించిత్ జితం భగవతా జగత్ ||” అని కీర్తించినట్లుగా  మధురకవి  ఆళ్వార్లు,  నమ్మాళ్వార్లను  కీర్తిస్తున్నారు. అక్కడ భగవంతుడి శక్తియుక్తులను కీర్తించినట్లుగా,  ఇక్కడ నమ్మాళ్వార్ల  ప్రేమను కీర్తించారు. అక్కడ ప్రయోజనాంతర పరులు  లభ్దిని పొందగా  ,ఇక్కడ  అనన్యప్రయోజన పరులు  (ప్రపన్నులు) లభ్దిని పొందారు. అక్కడ భగవంతుడి లీలలను ప్రస్తావించగా  ఇక్కడ నమ్మాళ్వార్ల  స్వచ్ఛత  ప్రస్తావించబడింది.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-7-kandu-kondu/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 5

Nammazhwar-kanchi-2 అవతారిక:

మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల కృపను  మీరు ఎలా సాధించ గలిగారని అడగగా, నమ్మాళ్వార్ తిరువాయిమొళి 4.5.3 “వీవిల్ కాలం ఇసై మాలైగళ్ ఏత్తి మేవప్ పెఱ్ఱేన్”(ఇప్పటి నుండి ఎల్లప్పుడు భగవంతుని కీర్తించు భాగ్యమును పొందాను)  అని నమ్మాళ్వార్లు  చెప్పినట్లుగా, దాసుడు  పొందగలిగాడని    మధురకవి ఆళ్వార్  అంటున్నారని నంజీయర్ భావన.

మధురకవి ఆళ్వార్లను ‘ అనాది కాలముగా లౌకిక సుఖములకు అలవాటు పడ్డారు కదా!మళ్ళీ వెనకకు వెళతారా?” అని ప్రశ్నిస్తే, “నమ్మాళ్వార్ల కృప నన్ను మళ్ళీ వెనకకు వెళ్ళనిస్తుందా?”అని బదులిస్తున్నారని  నంపిళ్ళై అభిప్రాయము.

పెరియవాచ్చాన్   పిళ్ళై,  నంపిళ్ళై చెప్పినట్లే  చెప్పి,  ఇంకా  “నమ్మాళ్వార్ల కృప భగవంతుడి కృప కన్నా భిన్నమైనది. భ క్తి  నిష్ట  గురించి గీతలో  6.41లో  భగవంతుడే  “సుచీనాం శ్రీమతాం గేహే  యోగబ్రష్టో బిజాయతే” అని చెప్పిట్లునగా,  విష్ణు పురాణములో  2.13.29 “సమాధి బంగస్థస్యాసీత్“,(భరత మహారాజు  రాజ్యము, భోగము, లౌకిక సుఖముల పట్ల విముఖుడై కూడ ఒక జింక మీద పెంపొందించుకున్న బాందవ్యము వలన భగవతుడి మీది నుండి దృష్టి మరలి పోయినట్లు కాక నమ్మాళ్వార్ల కృప ఎప్పటీకీ నిలచి వుంటుంది  అంటున్నారు.

మధురకవి ఆళ్వార్లు తన నీచత్వమును చెప్పి అందువలననే నమ్మాళ్వార్లు అనుగ్రహించారనీ, అందువలన వారి  శ్రీపాదములను వదలక పట్టుకున్నానని   క్రిందటి   పాశురములో   చెప్పారు.  కొందరు వీరిని అనాది కాలముగా లౌకిక సుఖములకు అలవాటు పడ్డారు కదా!  మళ్ళీ   వెనకకు వెళ్ళకుండా వుండగలరా?” అని ప్రశ్నించారు. దానికి వారు, దాసుడు   పాపములను   తొలగించుకోవటానికి   చేసిన   తపము   ఏదీ   లేదు.  కేవము   నమ్మాళ్వార్లు   కృప వలన  ఈ స్థితిని   పొందాను.  అందువలన   వారి కృప నా పాపములను   వంకకు   రానివ్వవు   అన్నారు. కిందటి, ప్రస్తుత పాశురములలో మధురకవి  ఆళ్వార్లు  నమ్మాళ్వార్ల  పట్ల  తన  ఙ్ఞాన, భక్తులను ప్రకటించారు అని  అళగియ  మణవాళ  పెరుమళ్ నాయనార్ల అభిప్రాయము.

పాశురము -6

ఇన్ఱు తొట్టుం ఎళుమైయుం ఎంపిరాన్

నిన్ఱు తన్ పుగళ్ ఏత్త అరుళినాన్

కున్ఱమాడ త్తిరుక్కురుకూర్ నంబి

ఎన్ఱుం ఎన్నై ఇగళ్విలన్ కాణ్మినే

ప్రతి పదార్థము:

ఇన్ఱు తొట్టుం = ఈ రోజు నుండి

ఎళుమైయుం = భవిష్యత్తులో ఎప్పటికీ

నిన్ఱు = పరిపూర్ణ విశ్వాసముతో

తన్ పుగళ్ = నమ్మళ్వార్ల   కీర్తిని

ఏత్త = గొప్పగా పాడుతూ   ఉండేట్లుగా

ఎం పిరాన్   అరుళినాన్ = నా   స్వామి(నమ్మళ్వార్లు ) కృప  చేసారు

కున్ఱమాడం = ఆకాశము నంటే   భవనాలున్న

త్తిరుక్కురుగూర్  నంబి = త్తిరుక్కురుగూర్ నాయకుడు

ఎన్ఱుం = ఎప్పటికీ

ఎన్నై = నన్ను

ఇగళ్విలన్ = వదలి వేయడు

కాణ్మిన్ = నువ్వు చూస్తావు

 భావము:

నా స్వామి  ( నమ్మాళ్వార్లు  )   ఆకాశమునంటే  భవనాలున్న  త్తిరుక్కురుకూర్  నాయకుడు  కృప చేసారు. ఈ రోజు నుండి   భవిష్యత్తులో ఎప్పటికీ పరిపూర్ణ విశ్వాసముతో   నమ్మళ్వార్ల  కీర్తిని  గొప్పగా పాడుతూ ఉండేట్లుగా కృప చేసారు. నా స్వామి  ( నమ్మాళ్వార్లు  )   నన్ను ఎప్పటికీ  వదలి వేయడు. అది    నువ్వు  చూస్తావు.

నంజీయర్ వ్యాఖ్యానము:

*ఇన్ఱు:  ఈ రోజు నుండి అనగా ఎప్పుడైతే నేను భగవంతుని కంటే నమ్మాళ్వర్ల మీద  రుచిని (విశ్వాసము)  పెంచుకున్నానో ఆరోజు నుండి

*నిన్ఱు:  “మానిడం పాడ వంద కవియేనల్లేన్” ( మనుషుల కోసము పాడే సామాన్యమైన కవిని గాను ) (తిరువాయిమొళి 3.9.9. )అని   నమ్మాళ్వర్లు   అన్నారు.  అలాగే మధురకవులు  భగవంతుని   పాడే   కవిని  గాను నేను, నమ్మాళ్వర్లనే  పాడతాను  అంటున్నారు.

*కున్ఱమాడం  త్తిరుక్కురుకూర్  నంబి:    నమ్మాళ్వర్ల  పరిపూర్ణత్వమును  మనము  తెలుసు కోలేము. త్తిరుక్కురుగూర్లోని  ఆకాశము నంటే  భవనాల  పై భాగములను  చూడలేము.

 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*ఇన్ఱు తొట్టుం:    -ఈ రోజు నుండే.  భవిష్యత్తులో ఏమి  జరుగుతుందో  ఎవరికి తెలుసు.  నమ్మాళ్వర్లు  మధురకవులను తమ శిష్యులుగా స్వీకరించిన నాటి నుండే.

*ఎళుమైయుం :   -ఏడు జన్మలు- ( ఉపలక్షణము ) భవిష్యత్తులో ఎప్పటికీ సూచిస్తుంది.

ఎం పిరాన్-:     ఉపకారకులు-  నమ్మాళ్వర్లు  “పిరాన్ పెరునిలం కీణ్దవన్” (భూదేవిని కాపాడి గొప్ప ఉపకారము చేసిన వాడు) (తిరువాయిమొళి 1.7.6.)అని భగవంతుడిని ఉపకారకులని కీర్తించగా,  మధురకవి  ఆళ్వార్లు   తనను సంసారము నుండి కాపాడి గొప్ప ఉపకారము  చేసిన వారుగా నమ్మాళ్వర్లను కీర్తించారు.

*కున్ఱమాడ త్తిరుక్కురుకూర్-:   తిరువాయిమొళి  4.10.1లో  నమ్మాళ్వర్లు  “కున్ఱం పోల్ మణి మాడ నీడు తిరుక్కురుగూర్” అన్న మాట  మధురకవి  ఆళ్వార్ల  హృదయములో  నిలిచి పోయింది.  అవే  మాటలను  వీరు  కూడా ఉపయోగించారు.

*ఎన్ఱుం ఎన్నై ఇగళ్విలన్ కాణ్మినే:  – నమ్మాళ్వర్లు  నా  దోషములతో  నన్ను స్వీకరిస్తారా?  లేక  మళ్ళీ  వెనకటి జీవితములోనికి  వెళ్ళాలా?

పెరియవాచ్చాన్ పిళ్ళై  వ్యాఖ్యానము:

*అరుళినాన్:  – నమ్మాళ్వర్లు తిరువాయిమొళి  1.1.1లో “మయర్వఱ మధినలం అరుళినన్” (భగవంతుడు నా దోషములతో నన్ను స్వీకరించాడు) అన్నారు.  మధురకవి  ఆళ్వార్లు  తనను  నమ్మాళ్వర్లు  దోషములతో  స్వీకరించాడని అంటున్నారు.

*కాణిమినే :– నిన్ను నువ్వు చూడు అనటము  ప్రత్యక్షము  కావున  సులభముగా  గ్రహించ వచ్చు. ఇంకా స్పష్టముగా చెప్పాలా?

 అలగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యనము:

*ఎళుమైయుం- ఎప్పటీకీ, మధురకవి  ఆళ్వార్లు  పరంపదమునకు  వేంచేసినా,  శతృఘ్నులకు  భరతుడిలాగా నమ్మాళ్వర్లే  ఆయనకు స్వామి.  మధురకవి  ఆళ్వార్లు  కూడా నిత్య  శతృఘ్నులే  (శతృవులను జయించు వాడు.) భగవత్ కైంకర్యము,  భాగవత కైంకర్యమునకు అడ్డుగా భావించిన వాడు.

*ఎంపిరాన్ :– నన్ను భగవంతుడికి దాసునిగా చేయ కుండా తన దాసునిగా స్వీకరించి గొప్ప సహాయము చేసిన వాడు. అందుకని   ప్రబంధములోని  ప్రతి  పాశురములోను  ఆయనను  కీర్తిస్తాను  అన్నారు.

*ఏత్త: – నమ్మాళ్వర్లు   పెరియ తిరువంతాదిలో ప్రతి పాశురములో భగవంతుని కీర్తించాలని మొదలు పెట్టి చివరి పాశురములో  కూడా “మొయ్కళలే  ఏత్త ముయల్”ఇంకా ప్రయత్నము చేస్తున్నానని  చెప్పారు.   మధురకవి  ఆళ్వార్లు ప్రతి పాశురములోను  నమ్మాళ్వర్లను  కీర్తిస్తాను  అన్నారు.

*తన్ పుగళ్ ఏత్త అరుళినాన్:  –నమ్మాళ్వర్ల  కృప  ఉపాయము. వారిని  కీర్తిస్తూ పాడటము పురుషార్థము.

*నిన్ఱు తన్ పుగళ్ ఏత్త-:  శ్రీ రామాయణము- బాల కాణ్డము 1.7లో,  నారద ఋషి  “మునే! వక్ష్యామ్యహం బుధ్ధ్వా” (ఓ ఋషి  వాల్మీకీ  శ్రీ రాముడి ఉన్నత గుణాలగురించి నన్ను చెప్పనీ!) అని తమకముతో  అన్నారు. అదే అంతకు మునుపు చెప్పినప్పుడు  ఆ తమకము లేదు.  ఇక్కడ మధురకవి  ఆళ్వార్లు నమ్మాళ్వర్లను గురించి  తమకము  లేకుండానే చెపుతున్నారు.

*కాణ్మినే: –  ప్రత్యక్షము మాత్రమే కాదు, శాస్త్రము కూడా,  నీతి శతకము- 72  “ప్రాప్తం  ఉత్తమ  గుణా  న  పరిత్యజంతి” (చేపట్టిన  పనిని  ఎన్ని అవరోధాలు వచ్చినా వదలని వాడు)  పెరియ తిరుమొళి 8.2.2 “పాణనార్ తిణ్ణం” భగవంతుడి రాయబారి ఆయన కోరికలను ప్రకటిస్తాడు.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-6-inru-thottum/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org