Category Archives: yathirAja vimSathi

యతిరాజ వింశతి –11

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 10

పాపే కృతే యది భవ్మంతి భయానుతాపలజ్జాః పునః కరణామస్య కథం ఘటేత |
మోహేన మె న భవతీహ భయాతిలేశః తస్మాత్ పునః పునరంఘ యతిరాజ కృత్వే ||

ప్రతి పదార్థము:

యతిరాజ = ఓ యతిరాజా

పాపే కృతే యది = పాపము చేసినప్పుడు

మమ = దాసుడీకి

భయానుతాపలజ్జాః = దీని పరిణామాలేమిటో అన్న్ భయము, అయ్యో తప్పు చేశామే అన్న పశ్చాతాపము ,పెద్దలకు రేపు ముఖము ఎలా చూపిస్తామన్న లజ్జ

భవ్మంతి యతి = కలిగినట్లైతే

అస్య పునః కరణాం = ఈ పాపమునున్ మళ్ళీ చేయుట

కథం ఘటేత = ఎలా జరుగుతుంది

ఇహ = ఈ పాపమును చేయు విషయములో

భయాతిలేశః అపి = భయం, అనుతాపము, లజ్జ అనేవికొంచమైనా

మోహేన = అనుభవ యోగ్యము కాని విషయముల మీద మనసు పడకుండుట

మె = దాసుడికి

న భవతీహ = కలుగలేదు

తస్మాత్ = అందు వలన

అఘం = పాపమును

పునః పునః = మళ్ళీ మళ్ళీ

కృత్వే = చేస్తున్నాను

 

భావము:

స్వామి, శరణాగతుడనే పేరును మాత్రమే మొస్తున్నా కూడా  పాపిష్టి పనులు చేసిన తరువాత మీకు , భయము,లజ్జ కలిగితే ఆ పనులు మళ్ళీ మళ్ళీ చేయరు కదా!పశ్చాత్తాపము కలిగితే పాపము నశించి పోతుంది.దీనికి ప్రత్యేకముగా మనము చేయవలసినది ఏమున్నది అని ఎమ్పెరుమానార్ర్లు అన్నట్లుగా ఊహించి దానికి బదులు చెపుతున్నారు. –అఘం- పాపము .భయము పూర్తిగా కలిగితే మళ్ళీ పాపము చేయకుండా ఉంటారు. అవి కొంచమైనా ఉంటే ఎప్పుడైనా ఒక సారి చేస్తారు. దాసుడికి మోహము వలన అవి కొంచము కూడా ఏర్పడనందున ఎడతెగకుండా పాపాలను చేస్తూనే ఉన్నాను. దాసుడికి శబ్దాది నీచ విషయములలో ఉండు మోహమును పోగొట్టి అనుగ్రహించ వలసినదిగా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లొకములో చెపుతున్నారు.’ తత్వరాయ ‘ అన్నది ఇక్కడ కూడా అన్వయమవుతుంది.

అడియేన్ చూడామణీ రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-11/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 10

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 9

హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ |
సోహం తవాప్రియకరః ప్రియకృత్వ దేవ కాలం నయామి యతిరాజ!తతోస్మి మూర్ఖః ||

ప్రతి పదార్థము :

యతిరాజ! = ఓ యతిరాజ

య అహం = దాసుడు

మనసా క్రియయా చ వాచా = మనోవాక్కయ కర్మలనే త్రివిధముల

త్రివిధాపచారాన్ =   భగవధపచార, భాగవతాపచార, అసహ్యాపచారమనే మూడు విధములైన అపచారములను చేస్తూ

సతతం చరామి  = నిరంతరము తిరిగే

స అహం = అటువంటి దాసుడు

తవ = నీచుడినైన దాసుడిపై అపారమైన దయను చూపే తమరు

అప్రియకరః సన్ = ఇష్టము లేని వాటినే చేసే వాడిని

ప్రియకృత్వ ఏవ = ఇష్టమున్న వాటినే చేసే వాడివలె

కాలం నయామి = కాలము గడుపుతున్నాను

హా హంత హంత = అయ్యో, అయ్యో,అయ్యో

తత అహం మూర్ఖః అస్మి = అందు వలన దాసుడు  మూర్ఖుడవుతున్నాడు

తత్వరాయా = తమరు ఆ మూర్ఖత్వమును తొలగించి కృప చూపాలి

 

భావము:

మనసులోని చెడు తలపులను, మూర్ఖత్వమును తొలగించి కృప చూపాలని కోరుతున్నారు. నిత్యం యతీంద్ర అనే నాలుగవ శ్లోకములో మానసిక శుచికి సంబంధించిన పట్టికను , వృత్తయా పసః అనే 7వ శ్లోకములో ,దుఃక్ఖావహోsహం అనే 8వ శ్లోకములో ,నిత్యంత్వహం అనే 9వ శ్లోకములో , హా హంత హంత అనే 10వదైన ప్రస్తుత  శ్లోకములో త్రికరణ శుధ్ధ్దిని ప్రస్తావించినా  7వ 8వ  శ్లోకములలో వృత్తయా అని, దుష్ట చేష్టిత అని అనటము వలన కరణ కృత్యములను , 9వ శ్లోకములో గురుం పరిభవామి అంటము వలన వాక్కును ,10వదైన ప్రస్తుత శ్లోకములో మనసా అనుట వలన మనో  కృత్యములను ప్రధానముగా చూడవలసి వుందని వ్యఖ్యాత అయిన అణ్ణవప్పంగార్ స్వామి భావిస్తున్నారు.

భగదపచారమనేది – శ్రీమన్నారాయణుని బ్రహ్మ రుద్రాలుతో సమానముగా భావించుట , రామాది అవతారములను సామాన్య మానవులుగా చూచుట ,  అర్చావతారములను కేవలము రాళ్ళుగాను, లోహములుగాను భావించుట మొదలైనవి.

భాగదపచారమనగా-తన ధనలాభము కొరకు ,చందనము , పుష్పము, స్త్రీల కొరకు  శ్రీవైష్ణవులకు చేయు విరోధము.

అసహ్యాపచారమనగా-నిష్కారణముగా భగవంతుడి విషయములో , భాగవతుల విషయములో దేషమును కలిగి వుండుట, ఆచార్యాపచారము అవుతుంది. దీని వివరణ శ్రీవచన బూషణములో చూడవచ్చు.

పై మూడు రకాల అపచారములు చేయుట తనకు బాధా కరమగుట వలన హా! హంత హంత అని మూడు సార్లు అన్నరు. 6వ శ్లోకములో “తత్వరాయ “అన్న ప్రయోగాన్ని ఈ 10వ శ్లోకము వరకు వర్తిస్తున్నది. తొండరడి పొడి ఆళ్వార్లు తిరుమాలై -32వ పాశురములో  ‘మూర్కనేన్ వందు నిన్రేన్ మూర్కనే మూర్కనావేన్ ‘ అని మూడు సార్లు తమ గురించి చెప్పుకున్నట్లుగా మామునులు ఇక్కడ 8,9,10 శ్లోకములలో చెప్పుకున్నారని వ్యాఖ్యాత అభిప్రాయ పడుతున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-10/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 9

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 8

నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దైవతామపి న కించిదహో బిభేమి |
ఇత్థం శఠోsప్యశఠవదియసయింఘే హ్రుష్టుశ్చరామి యతిరాజ! తతోsస్మి మూర్ఖః ||

ప్రతి పదార్థము  :

యతిరాజ! = ఓ యతిరాజా

అహం = దాసుడు

గురుం = అజ్ఞానాంధకారమును పొగొట్టి జ్ఞాన దీపమున్ వెలిగించిన ఆచార్య దేవా

మంత్రం = తిరుమంత్రమనె అష్టాక్షరి మంత్రమును

తద్దైవతామపి = ఆ  మంత్రమునకు అధి దేవత అయిన శ్రీమన్నారాయణుని

నిత్యం తు = నిరంతరము

పరిభవామి = అవమానిస్తున్నాను

కించిద = కొంచెము కూడా

న బిభేమి = ఈ పని చేయటము వలన రాగల విపత్తుల గురించి చింత లేకుండా

అహో = అయ్యో

ఇత్థం = ఈవిధముగా

శటః అపి = పరులకు తెలియకుండా అపకారము చేయు వాని వలె ,శాస్త్రములో విశ్వాసము లేని వాడి వలె

అశటవత్ =  ఎప్పుడు మంచినే చేసేవాడిలాగా, పైన పేర్కొన్న మూడింటినీ విశ్వసిచాలనే శాస్త్ర ప్రమాణము మీద నమ్మకము లేని వాడిలాగా

భవదీయసంఘే =  తమ దాసులైన పరమ ఆస్థికుల గోష్టిలో

హ్రుష్టఃసన = మన తప్పులు వీరికి తెలియలేదన్న ఆనందముతో

చరామి = సంచరిస్తున్నాను

తత = అందువలన

అహం మూర్ఖః అస్మి = దాసుడు పరమ మూర్ఖుడవుతున్నాడు

త్వరాయ = ఇటువంటి దాసుడి మూర్ఖతను పోగొట్టి తమరు కృపతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.

 

భావము:

నాలుగవ శ్లోకములో ‘దాసుడి వాక్కు తమరి గుణ కీర్తనతో తరించాలని ‘చెప్పి ఇక్కడ దానికి విరుధ్ద్ధముగా గురువును,మంత్రమును, మంత్ర అది దేవతను పరిభవించుట మొదలగు చెడు పనులను చేయుటలో మునిగి పోయినట్లు, అటువంటి చెడు గుణములను పోగొట్టి కృపతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.గురువును అవమానించుట అనగా ఉపదేశములో విడువతగినవని చెప్పిన వాటిని విడువలేక పోవుట. తన పేరు కొరకో, గౌరవము కొరకో, స్వలాభము కొరకో మంత్రొపదేశము చేయుట మొదలైనవి.

మంత్రమును అవమానించుట –  మంత్రములోని వాస్తవములను దాచి అందులో లేని విపరీత విషయములను ప్రచారము చేయుట .మంత్రములో చెప్పిన దేవతలను అవమానించుట – శ్రీమన్నారాయణునిచే సృష్టి చేయబడిన కాలములో ఇవ్వబడిన  శాస్త్రమును వాడి విషయములలో అన్వయించ కుండా ఇతర నీచ విషయములలో అన్వయించటము. దీనికి సంబంధించిన వివరణ శ్రీవచన భూషణములో చూడ వచ్చును.

అహో -ఆశ్చర్యము . లోకముల దాసుడి వంటి పాపి ,పాప భీతి లేని వాడు మరొకరు కనపడక పోవుట దాసుడికే  ఆశ్చర్యమును కలిగిస్తున్నది అని ‘అహో ‘అంటున్నారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-9/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 8

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 7

ధుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిబోగనిరతః శరణాగతాఖ్యః |
త్వత్పాదభక్త ఇవ శిష్టజనైగమధ్యె మిథ్యా చరామి యతిరాజ !తతోsస్మి మూర్ఖః ||

 

ప్రతి పదార్థము:

యతిరాజ != ఓ యతిరాజ

శరణాగతాఖ్యః = శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను

శబ్దాదిబోగనిరతః = శబ్దాదిబోగములలో పూర్తిగా మునిగిపోయిన వాడిని

దుష్టచేష్టః = శాస్త్రము నిషేదించిన పనులను చేయుటలో సిధ్ధహస్తుడనైన

తవ = తమరికి

ధుఃఖావహం = ధుఃఖమును కలిగించువాడనైన

అహం = దాసుడు

శిష్టజన ఓహమనిశం ! = పురుషార్థము తమరికి కైంకర్యము చేయుటయేకై

త్వత్పాదభక్త ఇవ = తమరి శ్రీపాదముల మీద భక్తి కలిగి వున్న ప్రపన్నునిలా

శిష్టజనైగమధ్యె = కూర్తాళ్వాన్ వంటి శిష్టజన కూటమి మధ్యలో

మిథ్యా చరామి = కపట వేషములో తిరుగుతున్నాను

తతః = ఆ కారణము వలన

మూర్ఖః అస్మి = మూర్ఖుడిగా,బుధ్ధి హీనుడుగా అవుతున్నాను

తత్ వరాయ = అటువంటి అజ్ఞానమును పోగొట్టి కృప చూపాలి

 

భావము:

ఎంబార్ మొదలైన వారు స్వామి మనసుకు సంతోషమును కలిగించునట్లుగా నడచుకుంటారు. దాసుడు విడువ వలసిన లౌకిక విషయములలో మునిగి వుండి తమరికి ధుఃహేతువునవుతున్నాను. ఆ గుణమును దాసునిలో నశింప చేయ వలసినదిగా కోరుతున్నాను. శరణాగతాయః– శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను కాని దాని లక్షణములైన సత్కర్మలను ఆచరించుట ,చెడు పనులను పూర్తిగా మనివేయుట, రామానుజులు తప్పక కాపాడుతారన్న విశ్వాసము కలిగి యుండుట, కాపాడే బాధ్యతను ఆయనకే వదిలి వేయటము, వేరు ఉపాయము కాని, మరొక దైవము కాని లేరన్న నిశ్చయము కలిగి వుండుట మొదలైన వేవి లేని వాడను.  దుఃఖావః– శరణాగతుడవుట వలన వీడిని రక్షించాలా! లేక దుష్ట చేష్టితములు గలవాడని వదిలి వేయాలా అనే ధర్మ సందేహానికి తమరిని గురి చేసి తమరి ధఃకానికి కారణ మవుతున్నాను. మూర్ఖుడై మంచి చెడు వివేచన లేని దాసుడిని తమరే కృపతో సరిదిద్దలని ప్రార్థిస్తున్నారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-8/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 7

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 6

వృత్య పశుర్నరవపుస్త్వహమీదృశౌఅపి శృత్యాదిసిద్వనిఖిలాత్మగునాశ్రయో అ యం |
ఇత్యాదరేణ కృతినోపి మిథః ప్రవక్తుం అద్యాపి వంచనపరౌఅత్ర యతీంద్ర!వర్తే ||

ప్రతి పదార్థము:

ఓ యతీంద్ర = ఓ యతిరాజా

వంచనపరః = పరులను వంచనచేయు వాడను

అహం = నేను

నరవపుః = మానవ రూపములో నున్న

పశువః = పశువును

వృత్త్య = దాసుడి వృత్తము ( తినుట,నిద్రించుట,మైధునము,భయము మొదలైన వాటిలో పశువుకు మనిషికి భేదము లేదు )వలన మనిషిగా

జ్ఞాయే = గుత్రింపబడుచున్నాను

ఈదృశః అపి = ఇలాంటి వాడినైనప్పటికి

శృత్యాదిసిద్ద నిఖిలాత్మగుణాశ్రయః = వేదము మొదలైన సకల శాస్ర్తములచే తెలుపబడిన ఆత్మగుణములు మూర్తీభవించిన

అయం = ఈ మణవాళమామునులనే

ఇతి = అయినందున

కృతినోపి = పామరులునే కాదు పండితులను

ఆదరేణ = ఆదరణతో

మిథః = పరస్పరము

ప్రవక్తుం = బోదించుటకు

అత్ర అపి = ఈ శ్రీరంగములో మరెక్కడ కాదు

అద్య = ఇప్పుడు

వర్తే = వేంచేసి వున్నారు

తత్వరాయ = పరులను వంచనచేయు గుణమును పారద్రోలి అనిగ్రహించాలి

 

భావము:

        అహింస, సత్యవచనము ,కౄర కర్మములు చేయకుండుట, సుచిగా వుండుట, దయ, దాన గుణము కలిగివుండుట, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము జ్ఞానము మొదలైనవి వేదములో వివరింపబడిన ఆత్మ గుణములు. వీరు ఈ గుణములన్నీ కలిగి వున్నారని చెపితే మరి కొందరు కూడా ఆకోవలోకి వస్తారని శోధన చేసి ఆత్మ గుణములకు నిలయము ఈ మణవాళమహామునులు  ఒక్కరే అని చెప్పటము వలన సంతోషము కలుగుతుందని అంటున్నారు .  నాలుగవ పాదములో అపి అన్న పదానికి అత్ర అని  జోడించటము చేత దోషములే లేని నాధమునులు,  యామునా చార్యులు , మరెందరో పూర్వాచార్యులు నివసించిన ఈ శ్రీరంగములో దాసుడు కూడా  నివాసముంటున్నాడు. ఇంత కంటే దోషము మరొకటి కలదా !  పరులను వంచనచేయు గుణమును పారద్రోలి అనిగ్రహించాలి అని కోరుతున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-7/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 6

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 5

అల్పాపి మేన భవదీయపదాబ్జభక్తిః శబ్దాదిభోగరుచిరన్వహమేధతే హా |
మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్ర తద్ద్వారయార్య యతిరాజ  దయైక సింధో ||

ప్రతి పదార్థము:

దయైక సింధో = సముద్రమంతటి దయ కలవాడా

ఆర్య = ఆచార్య

యతిరాజ = యతులకు రాజువంటి వాడా

మే = దాసునికి

భవదీయపదాబ్జభక్తిః = తమరి శ్రీపాదముల మీద స్థిరమైన భక్తిని

అల్ప అపి = కొంచము కూడా

న = లేదు

శబ్దాది భోగ రుచి = శబ్దాది విషయములు అనగా జ్ఞానేంద్రియములకు సంబంధించిన విషయములు

అన్వహం = అపారముగా

ఏదతే = పెరుగుచున్నవి

హా = కష్టము

అముష్య = సారమైన విషయములందు ఆసక్తి లేక పోవుట, అసారమైన విషయములందు ఆసక్తి పెరుగుటకు

నిదానం = మూలకారణము

మత్పాపమేవ = దాసుడి అనాది పాపము కారణము

అన్యత్న = మరొకటి కాదు

తత్ =  ఆ పాపమును

వరాయ = పోగొట్టి దాసుని రక్షించాలి

భావమ:

” నిత్యం యతీంద్ర ” అన్న నాలుగవ శ్లోకములో , దాసుని మనసు తమరి దేహము మీద చింతనతో ఉన్నతిని పొందాలి. అది తప్ప ఇతర విషయములలో విముఖమై ఉండాలని కోరుకున్నారు. ఈ శ్లోకములో తమ మనసు దానికి వ్యతిరేకముగా ఉండుటను తెలుపు తున్నారు. అంతే కాక ఆ విముఖతును , దానికి కారణమైన పాపమును పోగొట్టి కృప చూపవలసినదిగా ప్రార్థిస్తున్నారు.  దయ అంగా పర దుఃఖమును చూసి తాను దుఖించుట. ” దయైక సింధో ” అన్న ప్రయోగాము వలన  అల్లాంటి దయ అపారముగా సముద్రమంతగా గల వారని,  సముద్రము ఎండినా ఎండవచ్చు కాని యతిరాజుల దయ మాత్రము ఎన్నటికీ తరగదు అని చెపుతున్నారు. 1. ఆర్య శబ్దము ఆచార్య శబ్దమునకు సమముగా స్వీకరించి తెలియని తత్వ రహస్యములను తెలియజేసి మోక్షార్థమును పొందుటకు అర్హులను చేయు యతిరాజులకు అన్వయము. 2. ఆరాద్యాతి ఇతి ఆర్యః   అనే వ్యుత్పత్యర్థము వలన వేదవిహితమైన సన్మార్గములో నడచుట,  దానికి వ్యతిరేకమైన దారికి దూరముగా వుండుట అన్న అర్థముతో యతిరాజులు పరమ వైధికులని బోద పడుతున్నది. 3. అర్యతే- ప్రాప్యతే -ఆశ్రయింప బడుట  ” అన్న అర్థము వలన మొక్షార్థమై అందరి చేత ఆశ్రయింప బడుతున్నారని బోద పడుతున్నది. ధుఖఃమును ఆమును సూచించు ” హా ” అన్న ఆశ్చర్యార్దకము తగిన విషయములఓ ఆశక్తి లేకుండుట,      తగని విషయములఓ ఆశక్తిని కలిగి వుండుట తమకు ధుఖః హేతువని అంటున్నారు. అంతే కాక అల్ప సంతోషము నిచ్చే శబ్దాది విషయములలో ఆశక్తి వుండుట , అపరిమితానందమును ఇచ్చు యతిరాజుల శ్రీపాదముల మీద ఆశక్తి లేకుండుట తమను ఆశ్చ్రర్యానికి గురి చేస్తున్నదని రెండు అర్థాలను చెపుతున్నారు. దీనికి హేతువు ఏమిటంటే ” మత్పాపమేవ హి నిదానాం ” నా పాపమే కారణము అంటున్నారు. అనగా మునుపు భాగవతద్వేషము కలిగి వుండుట , భాగవతుల గోష్టీలో చేరక ముందు చేసిన పాపములను యతిరాజులు వారి శతృవుల మీద ప్రయోగిస్తారు. దాసుడిది అలా ప్రయోగించబడిన పాపము కాదు. దాసుడే చేసిన పాపము కాని మరొకటి  కాదు, ” అన్యత్ న ” .సర్వేశ్వరుడు తన స్వతంత్రము చేత దాసుడితో ఆటలాడుట వలననో ,దాసుడు తగని వస్తువు లందు ప్రీతిని, తగిన వస్తువు లందు అప్రీతిని, కలిగివుండ లేదు. నా పురాకృత పాపమే కారణము అని అంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-6/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 5

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 4

అష్ఠాక్షరాక్యమనురాజపదత్రాయార్ఠనిష్ఠాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాథ |
శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే హృష్ణాస్తు నిత్యమనుయూయ మమాస్య బుధ్ధిః ||

ప్రతి పదార్థము:

నాథ = దాసులకు స్వామి అయిన

యతీంద్ర = యతీంద్రులు

అత్ర = అజ్ఞానంధకారమైన ఈ సంసారములో

అత్య = కలి పురుషుడు పాలిస్తున్న ఈ కాలములో

మమ = దాసుడికి

అష్ఠాక్షరాక్యమనురాజ = అష్ఠాక్షర మంత్రములోని

పదత్రాయార్ఠనిష్ఠాం = మూడు పదాలలో వున్న అనన్యార్హ శేషత్వము,అనన్య శరణత్వము, అనన్యభోగ్యత్వము యొక్క అర్థమును

వితర = అనుగ్రహించాలి

శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే = పరత్వము, మోక్షోపాయము,పురుషర్థము మొదలగువాని యందు ధృడ అధ్యవసాయము గల శిష్ఠాగ్రగణ్యులైన కూరత్తాళ్వాన్,తిరుకుగైపిరాన్ పిళ్ళాన్ మొదలైన వారు స్తుతించే తమరి తామరల వంటి శ్రీపాదములను

నిత్యమనుయూయ = ఎప్పుడు అనుభవించి

అస్య మమ బుధ్ధిః = దాసుని అల్ప బుధ్ధి

హృష్ణా = ఆ అనుభవము వలన కలిగిన కైంకర్యము ఫలితముగా ఏర్పడిన సంతోషమును పొందు భాగ్యము

అస్తు = కలుగు గాక

భావము:

ఈ శ్లోకము మొదలు ఆఖరి శ్లోకము వరకు ” నిత్యం యతీంద్ర  “అనే మూడవ శ్లోకమునను వివరిస్తున్నట్ళుగానే అమరినవి.” శ్రీమత్ యతీంద్ర ”  అన్న 19వ శ్లొకము ఈ స్తోత్రమునకు సంక్షిప్తముగా , యతీంద్ర కైంకర్య ప్రార్థనకు , యతీంద్ర దాస కైంకర్య ప్రార్థనకు ,ఉపసమ్హారముగా అమరినది. విజ్ఞాపనం యతిదం అనే20వ శ్లోకము మొదటి ,చివరి, మధ్య, చెప్పిన విషయాలకు హేతువులను చూపుతూ దృడపరుస్తున్నట్లుగా అమరినవి. అష్ఠాక్షరి మంత్రములోని మూడు పదములు స్థూలముగా ఆచార్యలకే దాసులవుట , ఆచార్యలనే మోక్షోపాయముగా , ఆచార్యలకే భోగ్యముగా స్వీకరించుటను తెలియ జేస్తున్నాయి. సూక్ష్మముగా  భాగవతులకే దాసులగుటయే పరమార్థమని, భాగవతులనే  మోక్షోపాయముగా , భాగవతులకే భోగ్యముగా తెలియ జేస్తున్నాయి. భగవద్కైంకర్యము చేసే మొదటి స్థితిని ప్రధమ పర్వమనిష్టమని అంటారు. భాగవత  కైంకర్యము చేసే రెండవ స్థితిని మధ్యమ పర్వనిష్టమని అంటారు. ఆచార్యలకే కైంకర్యము చేసే మూడవ స్థితిని అంతిమ పర్వనిష్టమని అంటారు. ఓం నమో నారాయణాయ అనేమూడు పదములు వరుసగా శేషిత్వ, శరణ్యత్వ,  భోగ్యత్వములను భగవంతుడి విషయములో ముందుగా తెలియజేసి, తరువాత భగవంతుడి పాదముల వద్ద వుండే భాగవతుల విషయముగా తెలియజేస్తున్నది.ఆ తరవాత ఆ భాగవతులను అక్కడకు చేర్చే భాగవత్తోత్తములైన ఆచార్యుల పరముగా తెలియజేస్తున్నది. అర్థాత్ మొదటి స్థాయి భగవంతుడు, మద్యమ స్థాయి భాగవతులు, అంతిమ స్థాయి అచార్యులు.

మామునులు ఈ శ్లోకములో తిరుమంత్రములోని మూడు పదములకు అర్థముగా రామానుజులను కీర్తించారు. అనగా రామానుజులనుకే  కైంకర్యము చేయుట. వారినే ఉపాయముగ స్వీకరించుట , వారినే పురుషార్థముగా విశ్వసించుట. అందుకు వారి మంగళాశాసనములను కోరుచున్నారు. 32  అక్షరములను కలిగివుండే నృసింహ మంత్రము కూడా మంత్రరాజముగా పిలువబడుచున్నది. అందు వలన ” అష్ఠాక్షరాక్య  ” అని దీని ప్రత్యేకతను చెప్పారు. తిరుమంత్రము అష్ఠాక్షరిగానే ప్రసిద్దమైనది. దీనిలోని ఉత్తర భాగము ద్వారా అచార్యనిష్టులైన కూరత్తాళ్వాన్, మొదలియాండాన్ల వంటి శిష్ట జనులు తమ పాదాల వద్ద కైంకర్యము చేసి పొందిన సంతోషమును దాసుడికి కూడా  అనుగ్రహించ వలసినదని రామానుజులను ప్రార్థిస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-5/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 4

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 3

నిత్యం యతీంద్ర తవ దివ్యవపుస్సమ్రుతౌ మె సక్తం మనో భవతు   వాగ్గుణకీర్తనేస్సౌ!  
కృత్యంచ దాస్యకరణం తు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ!!

ప్రతి పదార్థము:

హే యతీంద్ర = ఓ యతిరాజా

మె = దాసుని

మనః = మనస్సు

తవ = దేవరవారి

దివ్యవపుస్సమ్రుతౌ  = దివ్య తిరుమేనిని స్మరిస్తూ

నిత్యం = ఎల్లప్పుడు

సక్తం = ఆసక్తి కలిగి

భవతు = ఉండుగాక

అస్సౌ మె వాక్ = తమ కీర్తించకుండా చాలా దూరములో ఉన్న దాసుని వాక్కు

తవ = తమరి

గుణకీర్తనె = కల్యాణ గుణములను ఇష్టముగా కీర్తించుటలో

సక్తా భవతు = ఆసక్తి కలిగి ఉండుగాక

కరద్వయస్య = కరద్వయములు

తవ = తమరికి

దాస్యకరణం తు = దాస్యము చేయుటయే

కృత్యం = కృత్యముగా

కరణత్రయం = త్రికరణములు (మనస్సు, వాక్కు,కర్మలు)

వృత్యంతరే = ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో

విముఖం చ అస్తు = విముఖలై వుండుగాక

భావము:

కింది శ్లోకములో యతిరాజుల శిష్యులైన కూరత్తళ్వాన్ మొదలైన వారి దాసులై వుండుటకై ప్రార్థన చేసారు. యతిరాజులకు దాసులవ్వాలని ఈ శ్లోకములో కోరుకుంటున్నారు.” కృత్యం చ ” అన్న చోట ” చ ” కారములో కళ్ళు, చెవులు ,మనస్సు రామానుజుల మీదే కేంద్రీకరించాలని కోరుకుంటున్నారు. శ్లోకములోని  మొదటి మూడు భాగాలలఓ త్రికరణ శుద్దిగా రామానుజులకే దాసులవ్వాలని, వారి కైంకర్యములలోనే నిమగ్నమై వుండాలని కోరుకొని నాలుగవ భాగములో ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో విముఖలై వుండాలని కోరుతున్నారు. భవతు ,అస్తు అనే క్రియలు ప్రార్థనను తెలియజేస్తున్నాయి. కృత్యం అంగా తప్పని విధిని చెపుతున్నది. తవ, మె అనేవి నాలుగు భాగాలకు వర్తిస్తున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-4/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 3

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 2

azhwan-emperumanar-andan

ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ – వారి యొక్క అవతార స్థలములలో

వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం !
కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం పాదానుచింతనపరస్సతతం భవేయం !! 

ప్రతి పదార్థము:

హే యతీంద్రా = ఓ యతిరాజా

మనసా = మానసిఖముగా

వాచా = వాక్కు చేత

వపుషా చ = కర్మణా

యుష్మత్ = తమరి

పాదారవిందయుగళం = పాదారవిందములను

భజతాం = సేవించుకుంటాను

గురూణాం = అచార్యులైన

కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం = కూరేశాదుల నుండి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొదలగు పూర్వాచార్యులను

సతతం పాదానుచింతనపరః = సతతం వారి శ్రీపాదములను చింతన చేయుటలో తరించేవాడిని

భవేయం = అవుతాను

భావము:
యతిరాజులను, వారి శిష్యులను సేవించుకోవటానికి అనుమతించ వలసినదిగా మామునులు ప్రార్థిస్తున్నారు.” కూరాధినాథ ” అంటే కూరేశులు,”కురుకేశు ” లనగా తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. వీరు రామానుజులకు మానస పుత్రులు.” ముఖ ” అంటే ఎంబార్, ముదలియాండాన్ ఇంకా ఇతర శిష్యబృందం.  “గ్రుణాంతి ఇతి గురవః ”  గురువు అన్న పదానికి ఉపదేశించు వాడు అని వ్యుత్పత్తి అర్థము. ఇంకా “గు ” అంటే అజ్ఞానము ,అంధకారము అని అర్థము. ” రు ” అంటే ఆ అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. అర్థాత్ గురువనగా ఉపదేశము చేత అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. ఇది కూరేశాదులందరికి వర్తిస్తుంది.        ” పుంసాం ” – పునాంతి ఇతి పుమంసుః- అనగా పరిశుధ్ధులు అని సాధారణ అర్థము.ఇక్కడ అది భగవంతుడికి దాసులైన కూరేశాదులకు,వారి శిష్యులకు, ముఖ్యముగా ఎంబార్లకు అన్వయము.” అనుచింతన ” అనగా కూరత్తళ్వాన్ ,వారి శిష్యులు రామానుజులను వారి పతిగా తలచి ధ్యానము చేయటము. వాక్యార్థము కూరత్తళ్వాన్ ,వారి శిష్యులకు మాత్రమే వర్తించినా రామానుజులకు కూడా అనువర్తిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-3/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 2

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

 

యతిరాజ వింశతి

<< శ్లోకము 1

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం!
శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం !!
శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం!
శ్రీవత్సచిన్హశరణం యతిరాజమీడే!!

ప్రతిపదార్థము:

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం = శ్రీరంగరాజ స్వామి పాదములనే పద్మముల నీడలో ఒదిగిన రాజహంస లాంటి వారు

శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం = శ్రీమత్పరాంకుశులైన నమ్మళ్వార్ల పాదములనే పద్మములలోని తేనెలను తాగుటకు ఒదిగిపోయిన తుమ్మెదల వంటి వారు

శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం = శ్రీభట్టనాథులైన పెరియాళ్వార్లు , పరకాలులైన తిరుమంగై ఆళ్వార్లు ముఖకమలములను వికశింపచేయు సూర్యుని వంటి వారు

శ్రీవత్సచిన్హశరణం = శ్రీవత్సచిన్హులైన కూరత్తళ్వాన్లను  చరణములుగ కలిగియున్న వారు

యతిరాజం = యతిరాజులైన ఎంబెరుమానార్లకు

ఈడే =  నమస్కరిస్తున్నాను

భావము:

మానుష జన్మము అతి దుర్లభము అంతే త్వరగా ముగిసిపోతుంది అని శ్రీమద్భాగవతములో చెప్పబడింది. మానవ జన్మము దొరికినా వైకుంఠనాధునికి ప్రియమైన భాగవతులను చూడటము ఇంకా కష్ఠము. (శ్రీ భాగవతము 11-2-29). దీనిని బట్టి భాగవతుల సంఖ్య ఎంత తక్కువో అర్థమువుతున్నది. అలాంటి భాగవతులచే చేయబడిన యతిరాజ వింశతికి ఎంత ఔన్నత్యము ఉందో ఆలోచించాల్సిందే. మామునులు  శ్రీ రంగరాజా అని మొదలయ్యే  మరొక మంగళ శ్లోకముతో యతిరాజులను కీర్తిస్తున్నారు. ” శ్రీ”  అంటే ఇక్కడ శ్రీ వైకుంఠము అని అర్థము , రంగరాజుల తామర వంటి పాదము అని చెప్పుకోవచ్చు.  ఎందుకంటే వాటికి సహజ సిద్దమైన అందము మృధుత్వము, సువాసన ఉంటాయి. పరాంకుశులకున్న సంపద మూడు విధములు .అవి 1. పరమాత్మ అనుభవము 2. ఆయనకు చేయగల కైంకర్యము 3.జీవాత్మ పరభక్తి, ఫరజ్ఞానము, పరమ భక్తి పొందుటకోశము కైంకర్యము చేయుట. పరభక్తి అంటే పరమాత్మను చూడాలన్న కోరిక. ఫరజ్ఞానము అంటే పరమాత్మను చూసాక ఆయనలో ఐక్యమవాలనే కోరిక. పరమ భక్తి అంటే పరమాత్మలో  ఐక్యమయ్యాక విడిపోవాల్సి వస్తుందేమోనన్న శంఖ. ఆహారము తీసుకోవడానికి ఆకలి ఎంత అవసరమో,  పరమాత్మకు కైంకర్యము చేయడానికి ఈ మూడు అర్హతలుగా వుందాల్సిందే. ఆకలి లేకుంటే ఆహారము రుచించదు. ఈ మూడు లేని పూజ వృధా ప్రయాస మాత్రమే అవుతుంది.  కాబట్టి ఇక్కడ శ్రీమత్ అన్న పదము  నమ్మళ్వార్లకు పై మూడు గుణములు అపారముగా గలవని తెలుపున్నది. శ్రీ భట్టనాథ ఫరకాల అనటము వలన ఆళ్వారిద్దరికి ఇది వర్తిస్తున్నది. పరమాత్మకు తిరుప్పల్లాండు పాడటము వలన భట్టనాథులకు ఈ సంపద అబ్బినది. శ్రీ పరకాలులకు ఇతర మతములను గెలుచుట శ్రీరంగములోని కోవెలకు ప్రాకారాము నిర్మించుట వలన ఈసంపద అబ్బినది. శ్రీ పరకాలులు పెరియ తిరుమొళి 4.9.6. లో ఈ విషయమును చెప్పుకున్నారు. అణ్ణావప్పన్గార్అ స్వామి ఇక్కడ  తిరువిందలూరు  పెరుమాళ్ళను కూరేశులతో పోల్చారు.  శ్రీవత్సచిహ్న అంటే వక్షము మీద చిహ్నము కలవారు అని అర్థము. పరమాత్మ వక్షము మీద చిహ్నము కలవారు కదా! అలాగే కూరేశులు కూడా వక్షము మీద చిహ్నము కలిగి వున్నారు.  శ్రీని  శ్రీవత్సచిహ్నులతో పోలిక చేశారు. సీత అశోక వనములో తనను బాధించిన ఒంటి కంటి రాక్షసులను రక్షించినట్లు కూరేశులు కూడా తన కళ్ళు పోవడానికి కారణమైన నాలూరానును ఈ లోకపు క్లేశములనుండి రక్షించి మోక్ష సామ్రాజ్యములో స్థానము కల్పించారు. “ ప్రణమామి మూర్ద్న” అన్న ప్రయోగముతో మొదటి శ్లోకములో శిరసు వంచి నమస్కరించారు. ఈ  శ్లోకములో “ ఈడే “అన్న ప్రయోగము వాచిక కైంకర్యమును సూచించారు. మనసులో చింతన చేయనిదే వాచిక కైంకర్యము సాద్యము కాదు. కావున మొదటి రెండు శ్లొకములలో త్రికరణ సుద్దిగా మంగళము పాదారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-2/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org