Category Archives: varavaramuni dhinacharyA

ఉత్తరదినచర్య – స్లోకం – 3 – సాయంతనం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 2

శ్లోకం 3

సాయంతనం తతః క్రుత్వా సమ్యగారాధనం హరేః |
స్వైః ఆలాభైః శుభైః శ్రోత్రున్నందయంతం నమామి తం ||

ప్రతి పదార్థం

తతః =  సంధ్యావందనము చేసిన తరువాత
సాయంతనం = సాయంకాలము చేయవలసిన
హరేః ఆరాధనం = తమ స్వామి అయిన శ్రీరంగ నాధులకు ఆరాధనము
సమ్యగ్ = చక్కగా, పరమ భక్తితో
క్రుత్వా   = చేసి
శుభైః = శ్రోతలకు మేలు కలిగే విధముగా
స్వైః = అలతి అలతి మాటలతో
శ్రోత్రున్ = శ్రోతలకు
న్నంతయంతం = ఆనందము కలుగు విధముగా
ఆలాపైః = చెప్పే
తం = ఆ మామునులను
నమామి =  నమస్కరిస్తున్నాను

భావము

శ్రీవచన భూషణములోని అంతరార్థములను అధికరించిన వారెవరు?ఎవరు దానిని అనుష్టిస్తారు? అని ఉపదేశరత్న మాలలో 55వ పాశురములోఅ అన్నట్లు శ్రీవచనభూషణమును అర్థము చేసుకోవటానికి ,అర్థము చేసుకున్న దానిని అనుష్టించటానికి అనువుగాని గంభీరమైన విషయమున్న గ్రంధాన్ని, శిష్యులకు సుబొధకముగా చెప్పినప్పటికీ శ్రోతలకు కొంచెము కఠినముగానే వుండవచ్చును. కానీ సాయంత్రము  సంధ్యావందనము, అనుష్టానము ముగిసిన తరువాత చేసే ప్రవచనము అసంకల్పితముగానే సరళముగా సాగుతుంది. దీనినే స్వైరాలాభము అంటారు. సకల శాస్రములను మధించినప్పటికీ అతి సులభముగా మాట్లాడటమును  స్వైరాలాభము అంటారు. ఇక్కడ ‘ హరి ‘ అన్న ప్రయోగము పూర్వదినచర్యలో పదిహేడవ శ్లోకములో ప్రస్తావింపబడిన ‘ రంగనిధి ‘ అన్న తమ తిరువారాధన పెరుమాళ్ళయిన  శ్రీరంగనాధులు.  ‘ హరి ‘ అంటే ఆశ్రితుల విరోధులను నిరసించువాడని, సకల దేవతలను నియమించువాదని అర్థము కధా!   పూర్వదినచర్యలో ‘ అథరంగనిధి ‘ (17)  అని ఉదయపు ఆరాధనను ,  ‘ ఆరాధ్యశ్రీనిధిం ‘ (29)  అని మధ్యహ్న్నపు ఆరాధనను , ఈ శ్లొకములో సాయంత్రపు ఆరాధనను పేర్కొనటము జరిగింది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-3/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

ఉత్తరదినచర్య – స్లోకం – 2 – అధ గోష్టీం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 1

శ్లోకం 2

అధ గోష్టీం గరిష్టానాం అధిష్టాయ సుమేధసాం |
వాక్యాలంకృతివాక్యానం వ్యాఖ్యాతారం నమామి తం || 2

ప్రతి పదార్థం

అధ = యతిరాజ వింశతి రచించిన తరువాత
గరిష్టానాం = ఆచార్య స్థానమును పొందదగిన గొప్పదనము కలవారై
సుమేధసాం! = మంచి మేధస్సు  గలవారి
గోష్టీం = గోష్టిలో
అధిష్టాయ = చేరి
వాక్యాలంకృతివాక్యాని = శ్రీవచనభూషణములోని వాక్యములను
వ్యాక్యాతారం = వ్యాక్యానము చేయు వారై
తం = మణవాళ మామునులను
నమామి = నమస్కరిస్తున్నాను

భావము

ఇప్పటిదాకా గ్రంధనిర్మాణము గురించి చెప్పి ఇప్పుడు గ్రంధ స్వాధ్యాయములో మరొక మెట్టైన పూర్వాచార్య గ్రంధవ్యాఖ్యానము గురించి వివరిస్తున్నారు. గరిష్ట- అత్యంతం గురవః గరిష్టాః – ఉత్తమమైన ఆచార్యులు అన్న అర్థము. వీరు సుమేధసః .ఒక్కసారి వినగానే అర్థమును పూర్తిగా గ్రహించగలుగుట, అర్థము చేసుకున్న విషయమును మరవకుండా వుండుటను సుమేధా అంటారు.ఇలాంటి వారిలొ గరిష్టులెవరనగా కొయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైన అష్టదిగ్గజములనబడువారు.

మామునులు ఇప్పటిదాకా యోగములో పరమాత్మను రహస్యముగా అనుభవించారు.  దానిని విడిచి శిష్య గొష్థిలో చేరి వారికి శ్రీవచనభూషణములొని అర్థాలను వివరిస్తున్నారు . వచనభూషణములో అనేక వెలలేని రత్నములు పొదిగి రచించుట వలన దానికి ఆ పేరు వచ్చినది. పూర్వాచార్యుల వచనములు ఎక్కువగాను తమ వాక్కులు తక్కువగాను ఉంచి, చదువరులలో జ్ఞాన దీప్తిని వెలిగించే   విధముగా పిళ్ళై లోకాచార్యులు ఈ గ్రంధమును కూర్చారు .  అది పరమ గంభీరమైనదున దాని లోతులు అర్థమయ్యే విధముగా మామునులు శిష్యులకు బోధిస్తున్నారు. ఖండాన్వయము, దండాన్వ్యము, పద చ్చేదము, వ్యాకరణాంశములు అంతరార్దములు, అన్వయము మొదలగునవన్నీ బాగుగా చెప్పుటనే వ్యాఖ్యానము అంటారు. ఏదైనా ప్రశ్న ఉదయించినపుడు దానిని సహేతుకముగా జవాబులు చెప్పుట. ” సుమేధసః గరిష్టః ” అని కీర్తింపబడిన కొయిల్ అణ్ణన్ లాంటి వారికే బోధపడని శ్రీవచన భూషణమును మామునులు వివరిస్తున్నారు అనటము వలన ఆ గ్రంధము ఎంత లోతైన అర్థములతో కూడీనదో తెలుస్తున్నది. వారి మేధా విలాసము ఎంతటిదో బోధ పడుతుంది. వేదము, స్మ్రుతి,ఇతిహాసములు, పురాణములు, పాంచరాత్ర ఆగమములు, ద్రావిడవేదము మొదలైన గ్రంధముల సారమంతా శ్రీవచనభూషణములో ఇమిడి వున్నది. ఈ ఒక్క గ్రంధమును వివరిస్తే సకల గ్రంధముల సారామును చెప్పినట్లే అవుతుంది. అందువలన ఈ గ్రంధమును మామునులు శిష్యులకు వివరముగా చెపుతున్నారని అర్థము

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-2/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

ఉత్తరదినచర్య – స్లోకం -1 – ఇతి యతికుల

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

$3B72773B15A9C344

శ్లోకం 1

ఇతి యతికులధుర్యమేధమానైః స్మృతిమధురైరుతితైః ప్రహర్షయంతం |
వరవరముని మేవ చింతయంతీ మతిరియమేతి నిరత్యయం ప్రసాదం ||

ప్రతి పదార్థం:

ఇతి = శ్రీమాధవాంఘ్రి అని ప్రారంభించివిజ్ఞాపనం అన్న దాకా మత్తము
ఏతమానైః = ఇంకా ఇమకా పెరుగుతున్నది
స్మృతిమధురైః  = చెవికింపైన
ఉదితైః = మాటల వలన
యతికులదుర్యం = యతులకు నాయకులైన ఎంబెరుమానార్లను
ప్రహర్షయంతం = మిక్కిలి ఆనందమునునిచ్చునది
వరవరముని మేవ = మణవాళమామునులనే
చింతయంతీ = చింతన చేస్తూ
ఇయమేతి = దాసుడి బుధ్ధి
నిరత్యయం = నిరంతరము
ప్రసాదం = ప్రకాశమును
ఏతి = పొందుతున్నది

భావము:

ఇప్పటి దాకా తగని విషయాలలో సంచరిస్తూ అది దొరకలేదని దుఃఖిస్తూ గడిపిన దాసుడి బుధ్ధి యతిరాజ వింశతిని అనుగ్రహించిన మామునులనే స్మరించే స్థితికి చేరుకున్నది. కావున మునుపు ఉండిన సంచలనము వీడి స్తిమిత పడిందని ఎరుంబియప్ప చెపుతున్నారు.’ వరవరముని మేవ ‘ అనటము వలన తమ మనసు  స్తిమిత పడటానికి కారణము  యతిరాజులు కాక , వారిని కీర్తించిన మామునులని చెపుతున్నారు. భగవంతుడినో,భాగవతులనో, అచార్యులనో స్మరించటము కంటేఅ అచార్య పరతంత్రులైన మామునులను స్మరించటము వలన తేటదనము ఎక్కువ ,అది స్థిరముగా నిలుస్తుంది అని ఎరుంబియప్ప చెపుతున్నారు. కేవలము ఇరవై శ్లోకాలలో’ఏతమానైః ‘అని ఎంతో గొప్పగా కీర్తించటము ఎంబెరుమానార్లను మనసులో నిలుపుకోవటము వలననే సాధ్యమంటున్నారు. మామునులను చెప్పిన ఒకొక్క శ్లోకమును ఎంబెరుమానార్లు వెయ్యిగా భావిస్తారు కదా! ఆవ గింజనే అనంతమైన కొండగా భావించే వారు కదా మహానుభావులు!

‘ ప్రహర్షయంతం ‘ అన్న ప్రయోగములో ‘ హర్షయంతం ‘ అన్న పదమునకు ‘ ప్ర ‘ అనే ఉప సర్గతో కూడిన విశేషణమును చేర్చటము వలన ఎంబెరుమానార్ల విషయములో మామునులు స్వప్రయోజనము కోసమే తప్ప అన్య లాభములకు కాదని స్పష్టమవుతున్నది. ‘చింతయంతిం ‘ అనటము వలన శ్రీ కృష్ణుడినే తలచిన ‘చింతయంతి ‘ అనే గోపిక కంటే, ‘ దీర్గ చింతయంతి ‘అయిన నమ్మళ్వార్ల కంటే, ఈ మామునులు ఎంబెరుమానార్లనే స్మరించు ‘చింతయంతి ‘అని తేలుప పడుతున్నది. ఎంబెరుమాన్లను స్మరించు వారి కంటే  ఎంబెరుమానార్లను స్మరించు వారు ఉన్నతులు.

‘ స్మృతిమధురైరుతితైః ‘ అన్న చోట,- రుతితైః – ధుఃఖమును తెలియజేస్తున్నది.యతిరాజ వింశతిలో ‘ అల్పాపిమే ‘(6) అని ప్రారంభించి చాలా చోట్ల తమ అజ్ఞానమును, భక్తి లోపమును, పాపకర్మలలో మునుగి వుండటము మొదలైన వాటిని ఎత్తి చూపి , హా హంత హంత – ఐయ్యో ,ఐయ్యో, ఐయయ్యో, అని తమ ధుఃఖాతిశయమును తెలిపారు.ఆత్మ స్వరూపమునకు ప్రకాశమునిచ్చు  ధుఃఖము ఔన్నత్య హేతువే అగుట వలన రుతితైః – అన్న పదమునకు ధుఃఖము అను అర్థమును స్వీకరించుట న్యాయమే అవుతుంది. మొక్షాధికారి అయిన ఎంబెరుమానార్లకు మామునులు చెప్పు సంసార పరమైన ధుఃఖములు వీనుల విందే అవుతుందనటములో సందేహము లేదు.అందు వలన అది స్మృతి మధురైః అని గ్రహించాలి.

(యతిరాజ వింశతిలో సంస్కృతములో ధుఃఖించగా ఆర్తి ప్రబంధములో ద్రావిడములో ధుఃఖించారు. )

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-1/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 32 – తతః శ్శుభాశ్రయే

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 31

శ్లోకం 32

తతః  శ్శుభాశ్రయే తస్మిన్ నిమగ్నం నిభృతం మనః ।

యతీంద్ర ప్రవణం కర్తుం యతమానం నమామి తం ।।

ప్రతి పదార్థము:

తతః = యోగమైన భగధ్యానమును చేసిన తరువాత

తస్మిన్ = మునుపు చెప్పిన విధముగా

శ్శుభాశ్రయే = యోగులచే ధ్యానింప బడు పరమాత్మ విషయములో

నిమగ్నం = నిమగ్నమైన

నిభృతం = నిశ్చలమైన

మనః! = మనస్సుతో

యతీంద్రప్రవణం = యతీంద్రులని పిలివబడే శ్రీమద్రామానుజా చార్యుల విషయములో ప్రవణులుగా

కర్తుం = చేయుటకు

యతమానం = ప్రయత్నము చేయుచున్న

తం = ఆ మామునులను

నమామి -నమస్కరిస్తున్నాను

భావము:

ఇక్కడ ‘ యతీంద్రప్రవణం కర్తుం ‘ అనునది ‘ యతీంద్రప్రవణమేవ కర్తుం ‘ అని అర్థము. 16వ  శ్లోకములో ‘ యతీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేనైవ చేతసా ‘ అని చెప్పారు. అనగా శ్రీమద్రామానుజాచార్యుల శ్రీచరణములను మనస్సులో నిలుపుకొని భవదాభిగమనము మొదలైన అనుష్ఠానములన్నీ చేసినట్లుగా చెప్పారు. అర్థాత్..మామునులు తమ ఆచార్యులను,వారికి ఇష్ఠమైన పరమాత్మను తమ మనస్సులో నిలుపుకున్నావారై ,క్రమముగా తమ ఆచార్యులైన శ్రీమద్రామానుజాచార్యులను మాత్రమే మనస్సులో నిలుపుకునుటకే అని చెప్పుతున్నారు. ధ్యానము చేయువారి హేయమైన దు:ఖమును పోగొట్టునది, వారి మనసును తనయందే లగ్నము చేయ గలది అయిన పరమాత్మ దివ్యమంగల విగ్రహము  ‘ శుభాశ్రయము ‘ అని చెప్పుతున్నారు.

ఎఱుంబిఅప్పా దీని వలన మామునుల యతీంద్రప్రవణతను (చరమ పర్వ నిష్ఠను )అనుసంధానము చేసి వారికి దాసోహములు సమర్పించిన తమకు కూడా చరమ పర్వ నిష్ఠ సిధ్ధిస్తుందని ‘ యతీంద్రప్రవణం కర్తుం యతమానం నమామి తం! ‘  వ్యక్త పరుస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-32/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 31 – అబ్జాసనస్థ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 30

శ్లోకం 31

అబ్జాసనస్థ మవదాత సుజాతమూర్తిం

ఆమీలితాక్ష మనుసమ్హిత మంత్రతంత్రం ।

ఆనమ్రమౌళిభి రూపసిత మంతరంగైః

నిత్యం మునిం వరవరం నిభృతో భజామి ।।

ప్రతి పదార్థము:

అబ్జాసనస్థం = పద్మాసనములో వేచేంసి వున్న వారై

అవదాతసుజాతమూర్తిం = స్వచ్చమైన పాలవంటి తెల్లని మేని చ్చాయ గలవారై

ఆమీలితాక్షం = పరమాత్మ స్వరూపాన్నే నిరంతరం ధ్యానించుట వలన ఆమీలిత నేత్రములను కలిగి వున్న వారై

అనుసమ్హిత మంత్రతంత్రం = రహస్య మంత్రములలో రత్నము వంటి ద్వయమును కలిగియున్నవారై

ఆనమ్రమౌళిభిః = నమ్రత చేత శిరసు వంచిన వారైన

అంతరంగైః = కొయిల్ అణ్ణన్, ప్రతివాది భయంకరం అణ్ణా మొదలైన అంతరంగ శిష్యులుచే

ఉపాసితం = నిరంతరము సేవింపబడు వారైన

వరవర మునిం = వరవర మునులు

నిభృతో = ఆశక్తి గలవాడనై

నిత్యం భజామి = నిత్యము సేవిస్తాను

భావము:

అందమైన,అధికముగా గాలివీచని చదునైన ,శుభ్రమైన స్థలములో ముందుగా పీఠమును వేసి దానిపై ధర్భలను పరచి, ఆపై మౌంజీ పరచి ,దానిపై శుభ్ర వస్తమును పరచి ఆసనమును సిధ్ధము చేయాలి.ఆ ఆసనముపై స్థిర చిత్తముతో,పద్మాసనములో కూర్చున్న వాడై యోగాభ్యాసము చేయాలని విశ్వామిత్రుడు చెప్పిన విధముగా మామునులు ఇక్కద కూర్చున్నారు.  ఇరు నేత్రాలను కొద్దిగా తెరచి ముక్కు అంచునే చూస్తూ యోగాభ్యాసము చేయాలని శాస్త్రములో చెప్పిన విషముగా మామునులు అర్థ నిమీలిత నేత్రాలతో కూర్చొని వున్నారు.సదా శ్రీమహా విష్ణువు ధ్యానములో ఉండుట చేత ఆ ఆనందానుభవము వలన కనుల నుండి ఆనంద భాష్పాలు రాలుతుండగా, శరీరము పులకరించి, గగర్పాటు కలిగి రోమములు నిక్కబొడుచుకొనుట చేత యోగి అయిన మామునులు అందరికీ దర్శనీయుడు అని ఎఱుంబిఅప్పా వర్ణిస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-31/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 30 – తతః

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 29

శ్లోకం 30

తతఃశ్చేత స్సమాధాయ పురుషే పుష్కరేక్షణే ।

ఉత్తంసిత్  కరద్వందం ఉపవిష్ఠముపహ్వరే ।।

ప్రతిపదార్థము:

తతః = సాపాటు తరువాత

పుష్కరేక్షణే = తామరకన్నులవారైన

పురుషే = పరమ పురుషుడైన శ్రీరంగనాథుని వద్ద

శ్చేఅతః = తమ అభీష్టమును

స్సమాధ్యాయ = విన్నవించి

ఉత్తంసిత్కరద్వందం = చేతులు జోడించి నమస్కరించి

ఉపహ్వరే = ఏకాంతముగా

ఉపవిష్ఠం = పద్మాసనములో కూర్చొని వున్న మణవాళ మామునులను సేవించుకుంటున్నాను అని ఈ శ్లోకములో చెపుతున్నారు.

భావము:

తదీయారధన తరువాత భగవధ్యానము చేయాలని శాస్త్రము తెలుపుతున్నది.  యోగము ఆరాధాన వంటిది.  మూడు వేళల తప్పక చేయ వలసినది అని చెపుతున్నారు.. యోగులు తమ హృదయములో వేంచేసి వున్న పరమాత్మను , చంచలము లేని నిశ్చల మనసుతో ధ్యానించుటే యోగమవుతుంది.  పరమాత్మ   దేవతలు, మనుష్యులు, జంగమములు,  స్థావరములు మొదలగు సకల జీవరాసులలోను వ్యాపించివున్నాడు. ఆ స్థితినే శ్రీ మాహా విష్ణువు యొక్క అంతర్యామి స్థితి అంటారు. ఇటువంటి స్వరూపములోనే  యోగుల  హృదయములో వేంచేసి వున్నాడని పరాశరులు చెప్పారు.  యోగుల  హృదయములో వేంచేసి వున్న పరమాత్మ ,  సూర్యమండలములో ఉన్న పరమాత్మ ఒక్కరే అని తైత్తరీయోపనిషత్తులో  పేర్కొన బడింది.  సూర్యమండలములో ఉన్న పరమాత్మకు పుండరీకాక్షత్వము ఉన్నదని చాందోద్యోగము చెపుతున్నది.   అందువలననే ఇక్కడ ‘ పురుషే పుష్కరేక్షణే  ‘   యోగులైన మామునుల హృదయములో వేంచేసివున్న పరమపురుషునకు పుండరీకాక్షత్వము చెప్పబడింది. పురిసేతే—–యోగి శరీరములో వసించు వాడు అనే వ్యుత్పత్తి వలన పురుష శబ్దము పరమ పురుషుడైన విష్ణువునే సూచిస్తున్నది.  యుజి-సమాతౌ-అనే ధాతువు చేత వచ్చిన యోగ శబ్దము సమాది అవుతున్న పరమాత్మ ధ్యానమును తెలుపుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-30/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 29 – ఆరాధ్య శ్రీనిధిం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 28

శ్లోకం 29

ఆరాధ్య శ్రీనిధిం పశ్చాదనుయాగం విధాయ చ |

ప్రసాదపాత్రం మాం కృత్వా పశ్యంతం భావయామి తం ||

ప్రతి పదార్థము:

పశ్చాద్ = తరువాత (మధ్యాహ్న అనుష్ఠానానము తరువాత )

శ్రీనిధిం = శ్రీనే ధరించిన శ్రీమంతుడు (తమ ఆరాధనా మూర్తి)

ఆరాధ్య = భక్తితో

అనుయాగం = భగవంతునికి నివేదించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుటాది అనుయాగము

విధాయ =  చేసి

మాం = గతములో ఈ విషయాలలో విముఖత చూపిన దాసుడిని

ప్రసాదపాత్రం కృత్వా = తమ శేష ప్రసాదముననుగ్రహించి

పశ్యంతం = దాసుడిని కటాక్షించిన

తం = ఆ మామునులను

భావయామి = సదా స్మరిస్తాను

భావము:

ఆరాధ్య….’  యువ రాజును, మదము పట్టిన ఏనుగును,  మనకిష్టమైన అథిధులను ఎలా పూజిస్తామో అలా భగవంతుడిని పూజించాలి.  పతివ్రత తన భర్తను , స్తన్యపానముచేయు బిడ్డను ,  శిష్యుడు తమ ఆచార్యులను , మంత్రములు తెలిసిన వారు తమ మంత్రములను ఏవిధముగా  ఆదరిస్తారో ఆవిధముగా భగవంతుడిని ఆరాదించాలి’ అని శాండిల్య స్మృతిలో చెప్పబడింది.  అదే విధముగా మామునులు శ్రీరంగ నాథుని  ఆరాధించారని భావము. అనుయాగమును అనగా భగవధారాధనను అనుసరించి చేయు భగవత్ శేష ప్రసాదమును స్వీకరించుట. పరిశేషము చేసి,  ప్రాణాయ,   అపానాయ, వ్యానాయ , ఉదానాయ,  సమానాయ అని భగవంతుడి నామములను స్మరిస్తూ  ఆహుతుల రూపములో అన్నమును ఐదు మార్లు స్వీకరించి తరువాత భుజించాలి  అని భరద్వాజులు చెప్పియున్నారు.   శాండిల్యులు మన హృదయములో ఉన్న భగవంతుడిని ధ్యానము చేస్తూ తీర్థమును స్వీకరించి , తరువాత ప్రాణాయ స్వాహా..మొదలగు మంత్రములను ఉచ్చరిస్తూ అహారమును  నోటి ద్వారా హోమము చేసి అన్నములో దోషము లు చూడకుండా (ఉప్పు ఎక్కువుగా, కారం ఎక్కువగా ఉన్నదనో ) ప్రసాదముగా స్వీకరించాలని చెప్పారు.  శుధ్ద్ధమైన,  ఆరోగ్యకరమైన   ఆహారమును మితముగా స్వీకరించాలి.  అది రుచికరముగా, మనసుకు నచ్చినదై,  నేతితో శుధ్ధి చేయబడినదై కంటికింపుగా తగినంత వేడిగా ఉంటేనే  భుజించ తగినదవుతుంది.  ‘అనుయాగం విధాయచ ‘  అని వుండుట చేత మామునులు ముందు   శ్రీవైష్ణవులకు తదీయారాధన చేసిన తరువాత తాము భుజించుట గమనించ తగినది. భగవంతునికి నివేదన చేసిన తరువాత,  భగవంతుడి శేష ప్రసాదము రుచి, వాసన పెరిగి , పవిత్రమైనదై , మెత్తగా , మనో వికల్పాలను తొలగించేది అయిన ప్రసాదముతో ముందుగా శ్రీవైష్ణవులను తృప్తి పరచి,  తరువాత తాము స్వీకరించే వారని ఎరుంబియప్పా మామునుల చరిత్రలో రాసిన విషయమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.  ‘మాం ‘… దాసుడిని….అనగా ఎరుంబియప్పాను గతములో మామునులు తమ మఠములో   తదీయారాధన స్వీకరింపుమని కోరినప్పుడు,  ‘ యతి పెట్టిన అన్నము,  యతి శేషమును స్వీకరించరాదన్న సామాన్య సూత్రముననుసరించి నిరాకరించారు.  ఇప్పుడు  సద్భుధ్ధి కలుగుట వలన  అవైష్ణవ యతుల అన్నమును భుజించరాదని తెలుసుకొని మామునుల శేషమును మహా ప్రసాదముగా స్వీకరించుట  ఉన్నతముగా భావించారు.   ‘ పశ్యంతం భావయామి ‘ తమను సరిదిద్ది ఎప్పుడూ తమపై అపారమని కటాక్షమును కురిపించుచున్న మామునులను  ధ్యానిస్తున్నాను అంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-29/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 28 – తతఃస్వచారణాంభోజ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 27

శ్లోకం 28

తతః స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః।

పావనైరర్థిన స్తీర్థైః  భావయంతం భజామి తం ।।

ప్రతిపదార్థము:

తతః = దివ్యప్రబంధ సారమును ఉపదేశించిన తరువాత

స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః = తమ శ్రీపాద పద్మ సంబంధము వలన మంచి సువాసనతో కూడిన

పావనైః = మిక్కిలి పరిశుధ్ధమైన

తీర్థైః = శ్రీపాద తీర్థమును

అర్థినః = స్వీకరించుటకు ఇవ్వమని ప్రార్థిస్తున్న శిష్యులు

భావయంతం = వర్థిల్లునట్లుగా

తం = ఆ మామునులను

భజామి = నమస్కరిస్తున్నాను

భావము:

మామునులు దివ్య ప్రబంధ సారమునుపదేశించిన తరవాత తమ శిష్యుల కోరిక మేరకు తమ శ్రీపాద తీర్థమును వారికి ఇచ్చి వారిలో సత్తను పెంపొందిస్తున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు.

రామానుజులు ఈ భువిపై వేంచేసి లేనందున వారి ఉపకరణముగా తమను భావించిన  మామునులు రామానుజులనే మనసు నందు నిలుపుకొని శిష్యులకు  తమ శ్రీపాద తీర్థమును ఇచ్చినందున వారికి ఎటువంటి అవధ్యము లేదు. ఇక్కడ శిష్యుల కోరికే ప్రధాన కారణము. మామునుల శ్రీపాదములు , తామరల వంటివి కావున ఆ శ్రీపాద తీర్థమునకు శుచి,సువాసన సహజముగానే అబ్బినవి.’ తీర్థైః ‘ అని బహు వచనములో చెప్పుట వలన ముమ్మారు శ్రీపాద తీర్థమును అనుగ్రహించారని భోదపడుతున్నది. ఈ విషయముగా ‘ త్రిబిదేత్ ‘ ..ముమ్మారు శ్రీపాద తీర్థమును గ్రహించ వలెను ‘ అని స్మృతిలో చెప్పబడింది. కొందరు రెండు తడవలు మాత్రమే ఇస్తున్నారు. ఉచన స్మృతిలో శ్రీపాద తీర్థమును -యాగములో సోమలతా పాన సమముగా రెండు తడవలు స్వీకరించ తగినదని చెప్పుటే దీనికి ప్రమాణము.  రెండు పద్దతులు శాస్త్ర సమ్మతమే  కావున వారి వారి సంప్రదాయము ప్రకారము అనుష్ఠించుట తప్పు కాదు. భరద్వాజ సమ్హితలో శిష్యుడు ఆచార్యుని వద్ద ఉపదేశము పొందుటకు ,ఆచార్య శ్రీపాద తీర్థామును స్వీకరించుట అంగముగా చెప్పబడినది. క్రిందట శ్లోకములో దివ్యప్రబంధ సారమును ఉపదేశించుట పేర్కొన బడింది.అక్కడ ‘ నమామి ‘ అన్న వారు,ఇక్కడ శ్రీపాద తీర్థమును పొంది మనసు కరిగి ‘భజామి ‘అంటున్నారు.ఇంతకంటే శిష్యుడు చేయతగినది ఏమీ లేదు. మామునులు కోరు వారు కారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-28/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 27 – తత్వం దివ్య

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 26

శ్లోకం 27

తత్వం దివ్యప్రబంధానాం సారం సంసారవైరిణామ్ ।

సరసం సరహస్యానాం వ్యాచక్షాణం నమామి తం ।।

ప్రతి పదార్థం:

సంసారవైరినాం = శరీర బంధ రూపమైన సంసారం నిరసించు

సరహస్యానాం = తిరు మంత్రము, ద్వయము , చరమ శ్లోకలు అర్థ సహితముగా

దివ్యప్రబంధానాం = దివ్యప్రబంధము

సారం = సారం

తత్వం = జీవాత్మ స్వరూపమైన ఆచార్య శేషిత్వము ,ఉపాయము ,ప్రాప్యము మొదలైనవి

సరసం = స్వారస్యముగా

వ్యాచక్షణం = చక్కగా అర్థమవునట్లు వివరించు

తం = ఆ మామునులను

నమామి = నమస్కరిస్తున్నాను

భావము:

శరీర సంబంధ రూపమైన సంసార క్లేశాలను దివ్యప్రబంధము పోగొడుతుందని ఈ క్రింది ఫల శ్రుతుల వలన తెలుస్తున్నది.

1.’ మాఱన్ విణ్ణప్పం శెయ్ద  శొల్లార్ తొడైయల్ ఇన్ నూఱుమ్ వల్లార్ అళుందార్ పిఱప్పాం పొల్లా అరు వినై మాయవన్   శేఱ్ఱళ్ళల్ పొయ్న్ నిలత్తే ‘(తిరువిరుత్తం 100) (మాఱన్ విన్నప్పము చేసిన ఈ నూరు పాశురములు పాడినవారికి పునర్జన్మ లేదు. ఈ లీలా విభూతిలోను కష్ఠాలుండవు )

2.’ శెయిరిల్ శొల్లిశైమాలై ఆయిరత్తుళిప్పత్తాల్ వయిరం శేర్ పిఱప్పఱుత్తు వైకుందం నణ్ణువరే (తిరువయిమొళి 4-8-11)(ఈ పది పాశురాలను నేర్చిన వారు జన్మ పరంపరను తెంచుకొని వైకుంఠము చేరుదురు).

వెనకటి పాశురాలలో చెప్పిన రహస్యములకు పరమాత్మ శేషి,ఉపాయము,ప్రాప్యము అవుతున్నారని తెలుస్తున్నది.ఇంకా నిఘూఢముగా పరిశీలిస్తే భాగవతులే శేషి,ఉపాయము,ప్రాప్యము అవుతారని బోధ పడుతుంది. ఇంకను నిఘూఢముగా పరిశీలిస్తే రహస్యార్థములకు ముఖ్య ఉద్దేశ్యము మూడవ విషయమైన ఆచార్య ప్రపత్తి అవుతుందని ఆచార్య నిష్ఠలో ఆరితేరిన మధురకవుల లాంటి వారి ఉద్దేశ్యము. మామునులు యతీంద్ర ప్రణవులు ,కావున తమ ఆచార్యులనే శేషిగా, ఉపాయముగా, ప్రాప్యముగా, దివ్యప్రబంధ సారముగా ఉపదేశించారని గ్రహించాలి. ఎందుకంటే ఆచార్య పరంపరలో రామానుజులే ఉన్నతమైనవారని వెనక చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శేషి అంటే నాయకుడు, ప్రాప్యుడు అంటే  పొందవలసిన వాడు, ఉపాయము అంటే మార్గము. మనము కైoకర్యము చేయ తగ్గ నాయకులు ఆచార్యులైనందున ,వారిని పొందుటకు వేఱొక ఉపాయమును వెతకకుండా వారినే ఉపాయముగా స్వీకరించాలన్నది రహస్య గ్రంథముల సారము.దీనినే మామునులు శిష్యులకుపదేశిస్తున్నరని ఎఱుంబియప్పా ఈ శ్లోకములో చెపుతున్నారు. ఇంతటి గొప్ప అర్థములను ఉపదేశించు ఆచార్యులకు చేయతగ్గ ఉపకారమేముంటుంది. అందుకే  ‘ తలై అల్లాల్ కైమారిలేన్ ‘అని ఆండాళ్ చెప్పినట్లుగా శీరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్న అర్థములో ‘ తం నమామి ‘ అన్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-27/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 26 – అథ శ్రీశైలనాథా

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 25

శ్లోకం 26

అథ శ్రీశైలనాథార్య నామ్ని శ్రీమతి మండపే |

తదంఘ్రి పంకజద్వంద ఛ్ఛాయామధ్యనివాసినం ||

ప్రతి పదార్థం:

అథ = మఠమునకు వేంచేసిన తరువాత

శ్రీశైలనాథార్య నామ్ని = శ్రీశైలనాధులన బడే తమ ఆచార్యులైన తిరువాయిమొళి పిళ్ళై తిరునామము గల

శ్రీమతి = మిక్కిలి ప్రకాశము గల

మండపే = మంటపములో

తదంఘ్రి పంకజద్వంద ఛ్ఛాయామధ్య నివాసినం = చిత్ర రూపములో నున్న తమ ఆచార్యుల శ్రీపాదముల నీడలో మామునులు వేంచేసి వున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు.

భావము:

తమ మఠములో కాలక్షేప మండపమునకు తమ ఆచార్యులైన తిరువాయిమొళి పిళ్ళై నామకారణము గావించి, వారి పఠమును చిత్ర రూపములో వేంచేపు చేసుకున్నారు మామునులు. ఆ చిత్రము యొక్క శ్రీ పాదముల దగ్గర తాను వేంచేసి వున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు. శ్రీమతి మండపే మిక్కిలి ప్రకాశము గల మంటపము అన్నారు. ఆ మంటపమునకు అంతటి  ప్రకాశము ఎందుచేత అబ్బిందంటే పిళ్ళై లోకాచార్యులాది పూర్వాచార్యుల తిరుమాళిగల నుండి తీసుకు వచ్చిన మట్టితో ఆ గోడలపై పూయడం చేత ఏర్పడింది. మహానుభావులు వేంచేసి వుండిన స్థలములు , వారి శ్రీపాదములు తగిలిన స్థలములు పవిత్రములు కదా!  అందువలననే ఈ మఠమునకు శుద్ది ఏర్పడినది. ఇక్కడ ‘ తదంఘ్రి పంకజద్వందచ్చాయామధ్యనివాసినం ‘ షష్ఠీ బహువచన ప్రయోగము కనపడుతున్నది. తమ ఆచార్యుల పాద ఛ్ఛాయలో తాము అమరినట్లు తమతో శిష్యులు కూడ అమరి ఉన్నట్లు అర్థము.  పై శ్లోకములో చెప్పినట్ళు ‘దివ్యప్రబంధ సారం వ్యాచక్షాణం నమామి తం ‘ (దివ్య ప్రబంధ సారమును అనుగ్రహించు మామునులను నమస్కరిస్తున్నాను అని ) తో అన్వయము చేసుకోవాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-26/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org