Category Archives: thiruppaLLiyezhuchchi

తిరుప్పళ్ళి యెళిచ్చి- 7 – అన్దరత్త

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

6వ పాశురం

dhevas - worshipping-periyaperumal

పాశుర అవతారిక: 

 • నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు క్రిందటి పాశురములో(6వ)సంక్షిప్తంగా అనుగ్రహించిన వివరణను ఈ పాశురం మరియు రాబోవు రెండు పాశురములలో సవివరంగా వ్యాఖ్యానిస్తున్నారు. నఙ్ఙీయర్ ప్రధానంగా,  ఇంద్రుడు మరియు సప్తఋషులు మొదలైన వారందరు ఆకాశమంతా నిండిపోయి ఎంపెరుమాన్ శ్రీపాదములను విశేష శ్లోకములతో కీర్తిస్తు ఆరాధిస్తున్నారు.  పెరియవాచ్చాన్ పిళ్ళై  ముఖ్యంగా ఇలా వివరిస్తారు-  త్తైత్తరీయ ఉపనిషద్ లో పేర్కొన్న “బైశాస్మాత్” (దేవతలు ఎంపెరుమాన్ కు భయపడి అతని ఆఙ్ఞకు లోబడి నడుచుకుంటారు). ఇంద్రుడు తన దాస్యమును నెరవేర్చుకొనుటకు ఇక్కడికి విచ్చేసాడు.

అన్దరత్తమరర్ గళ్ కూట్టంగళ్ ఇవైయో                                                                                                                       అరుం తవ మునివరుం  మరుదరుమివరో                                                                                                                   ఇన్దిరన్ ఆనైయుమ్ తానుమ్ వన్దివనో                                                                                                                   ఎంపెరుమాన్ ఉన్ కోయిలిన్ వాశల్                                                                                                                           శున్దరర్ నెరుక్క విచ్చాదరర్ నూక్క                                                                                                                 ఇయక్కరుమ్  మయంగినర్ తిరువడిత్తొళువాన్                                                                                                           అన్దరం పార్ యిడమిల్లై మత్తిదువో                                                                                                                   అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే.

ప్రతిపదార్థం: 

ఎంపెరుమాన్ = మా స్వామి / మా రక్షకుడా!
ఉన్ కోయిలిన్ వాశల్ = నీ కోవిల వాకిలి దగ్గర
ఇన్దిరన్  తానుమ్ = ఇంద్రుడు కూడ
ఆనైయుమ్= ఐరావతం
వన్దివనో = అందరును వచ్చిరి
అన్దరత్తమరర్ గళ్  ఇవైయో = స్వర్గలోక దేవతలు వీరు
కూట్టంగళ్= పరివారం(వాహన,కుటుంబ, పరిచారక సమేత)
అరుం తవ మునివరుం  = దుర్లభమగు తపమాచిరించిన మునులు –  సనక సనందాది ఋషులు
మరుదరుముం = మరుత్తులు వారి సేవకులతో(మరుద్గణములతో)
ఇయక్కరుమ్= యక్షులు
శున్దరర్ నెరుక్క  = గంధర్వులు క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు
విచ్చాదరర్ నూక్క = విద్యాధరులు ఒకరినొకరు  త్రోసుకుంటున్నారు
తిరువడిత్తొళువాన్    మయంగినర్ = మీ పాదములను సేవించుటకు మోహించి ఉన్నారు
అన్దరం  = ఆకాశం
పార్ = భూమి
యిడమిల్లై= చోటులేదు/స్థలాభావం
అరంగత్తమ్మా!శ్రీ రంగమున పవళించిన నా దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= దయతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

ఓ దేవాది దేవా! దేవతలకధిపతైన ఇంద్రుడు తన పరివారంతో(వాహన,కుటుంబ, పరిచారక సమేత) మీ కోవిల వాకిలి వద్ద నిల్చొను ఉన్నాడు. వీరేకాక స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విధ్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు వచ్చిఆకాశమున మరియు భూమి యందున చేరుట వల్ల స్థలాభావంతో క్రిక్కిరిసి ఒకరినొకరు తోసుకుంటు నిల్చున్నారు. వారందరు తమ శ్రీపాదములను అర్చించడానికి వ్యామోహముతో వచ్చి ఉన్నారు. కాన ఓ దేవాది దేవా! శ్రీరంగమున పవళించిన నా స్వామి ! పడక నుండి లేచి మమ్ములను అనుగ్రహింపుము.

  నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు

 • ఇద్రాంది దేవతలు స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు ఎంపెరుమాన్ శ్రీపాదములను అర్చించడానికి విచ్చేయడం శ్రీమన్నారాయణుని ” సర్వస్వామిత్వం”(అందరికి రక్షకుడు/అధిపతి) ను తెలుపుతుంది.
 • అరుం తవ మునివరుం అను పదము-  దుర్లభమగు తపమాచిరించిన బ్రహ్మమానస పుత్రులగు (మనస్సు నుండి జన్మించినవారు)  సనక, సనాతన, సనందన మరియు, సనత్కుమారులను ఋషులను తెలుపును.
 • చాలా సమూహములు రావడం వల్ల ద్వారపాలకులు కూడ నిలబడుటకు స్థలాభావం ఏర్పడినది.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు

 • ఈ పాశుర భావములో దేవతలు, ఋషులు మొదలైనవారి క్రమంలో 3వ వారిగ తెలుపబడ్డాడు ఇంద్రుడు. ఇంద్రుడు వీరికి మాత్రమే అధికారి కావున అతని  ఆగమనం చెప్పబడింది మొదట. దీనికి సామ్యమైన ఉదాహరణ – ప్రణవం. దీనిలో పదాల వరుసక్రమం-(అ,ఉ,మ)  జీవాత్మ యొక్క స్వభావమును తెలుపుతు -‘అ’ కార వాచ్యుడగు పరమాత్మకు ‘మ’ కార వాచ్యుడగు  జీవాత్మ సదా దాసుడు. సారమేమనగా భగవానుడు సర్వులకు అధికారి
 • అరుం తవ మునివరుం అను పదము- గొప్ప తపమాచరించిన సప్తర్షులను తెలుపుతుంది.
 • విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన సమూహములు గానములో నృత్యములలో వివిధ సామర్థ్యం కలిగిన వారు.

అడియేన్ నల్లా శశిధర్ రమానుజదాస

Source:  http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-7-antharaththu/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి- 6 – ఇరవియర్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

5వ పాశురం

periyaperumal-art-2

పాశుర అవతారిక:

 • నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి – సమస్తదేవతలు కలసి ఈ భౌతిక విశ్వమునకు(భగవంతుని చే సృష్ఠి కావింపబడ్డ)  కార్యకలాపాలు నిర్వహించుటకు దేవసేనా నాయకుడి స్థానాన్ని సుబ్రమణ్యునకు  ఇచ్చి పట్టం కట్టిరి. దేవతలందరు తమ తమ భార్యలతో, సేవకులతో  మరియు వాహనాలతో ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై వచ్చి తమతమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. (కనుక‌) తొండరడిపొడిఆళ్వార్ ఎంపెరుమాన్ ను మేల్కొని వారి కృపాదృష్ఠిని తమపై  ప్రసరింపచేయుమని ప్రార్థిస్తున్నారు.

ఇరవియర్ మణి నెడుం తేరొడుమివరో                                                                                                           ఇఱైయవర్ పదినొరు విడైయరుమివరో                                                                                                                   మరువియ మయలినన్ అరుముగనివనో                                                                                                             మరుదరుమ్ వశుక్కళుమ్ వన్దువన్దు ఈణ్డి                                                                                                           పురవియోడు ఆడలుమ్ పాడలుమ్ తేరుమ్                                                                                                               కుమర తణ్డమ్ పుగున్దు ఈణ్డియ వెళ్ళమ్                                                                                                         అరువరై అణైయ నిన్ కోయిల్ మున్నివరో                                                                                                       అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం:
మణి= ఉత్తమ
నెడు= పెద్దనైన
తేరొడుమ్ = రథములతో
ఇరవియర్= ద్వాదశాదిత్యులు
ఇఱైయవర్  = నిర్వాహకులు(సంసారుల)
పదినొరు విడైయరు= ఏకాదశ రుద్రులు
మరువియ= అమరిన/అనుకూలమైన
మయలినన్= నెమలి వాహనంగా కలవాడు
అరుముగనిన్ = షణ్ముఖుడు(ఆరుతలలవాడు)
మరుదరుమ్ = మరుత్తులు(49 మంది)/వాయుదేవతలు
వశుక్కళుమ్= (అష్ఠ) వసువులు
వన్దువన్దు= గుంపు గుంపుగా ఒకరినొకరు తోసుకుంటు
ఈణ్డి= సన్నిహితంగా వచ్చి(చేరి)రి
పురవియోడు  తేరుమ్= గుర్రములు,   రథములతో(ఆయా దేవతలు)
ఆడలుమ్ పాడలుమ్= ఆటలతో పాటలతో
కుమర తణ్డమ్ పుగున్దు=గుంపులు గుంపులుగా వచ్చి చేరిన దేవతలు
ఈణ్డియ వెళ్ళమ్= దట్టంగా/అధికంగా  ఉన్న సమూహం(నీటి ప్రవాహం వలె)
అరువరై అణైయ= మేరు పర్వతం వలె
కోయిల్= దేవాలయంలో
నిన్  మున్ = మీ దృష్ఠి ముందు
ఇవరో ,ఇవనో= వారందరు ఉపస్థితులైనారు
అరంగత్తమ్మా! = శ్రీరంగమున పవళించిన స్వామి,దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= (కనుక)శయనము నుండి లేచి మమ్ములను కృపచూడుము.

సంక్షిప్త అనువాదం:

ద్వాదశాదిత్యులు తమ ఉత్తమ రథములపై వచ్చిరి. ఈ భౌతిక ప్రపంచమునకు నియంత్రికులైన /నిర్వాహకులైన   ఏకాదశరుద్రులు మరియు ప్రాపంచిక జనాలు వచ్చిచేరిరి. ఆరు తలలు కలిగి నెమలి వాహనాధిపతైన  షణ్ముఖుడు వచ్చిచేరిరి. నవచత్వారింశత్ (49) మరుత్తులు  మరియు అష్ఠవసువులు మొదలైన వీరందరు ఒకరినొకరు తోసుకుంటు వచ్చిచేరిరి. శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! లేచి మమ్ములను కృపచూడుము. పెద్దసంఖ్యలో దేవతలు తమతమ వాహనాలైన  రథాలు మరియు అశ్వములతో గుంపులు గుంపులుగా ఆటపాటలలో  నిమగ్నమై వచ్చిచేరిరి. పెద్దని మేరుపర్వతము వలె నుండు మీ దేవాలయం ముందర సుబ్రమణ్యునితో సహా దేవతా గోష్ఠులు  మీ అనుగ్రహమునకై  వచ్చి ఉన్నారు. శ్రీరంగమున పవళించిన నా దేవాది దేవా! మేల్కొని తమ కృపాదృష్ఠిని మాపై ప్రసరింపచేయుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

 • ప్రయోజనాంతపరులు (ప్రాపంచిక కోరికలు తీర్చుకొనేవారు)అగు దేవతలు మరియు అనన్య ప్రయోజనపరులు (ఎంపెరుమాన్ కైంకర్యమే పరమ ప్రయోజనముగా కలవారు – ఆళ్వారుల మాదిరి)  వచ్చి ఉన్నారు, పెరియపెరుమాళ్ మీరు దయతో లేచి కృపాదృష్ఠితో వారిని కరుణించుము అని తొండరడిపొడిఆళ్వార్, ప్రార్థిస్తున్నారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు::

 • ఏకాదశ రుద్రులు “ఇఱైయవర్” (నియంత్రికులు/నిర్వాహకులు)గా సంభోధించబడ్డారు- యజుః సంహిత 6.2.8 లో రుద్రుడు తాను దేవతలతో ఇలా ప్రార్థింపబడుచున్నాడు- “సోబ్రవీత్ వరమ్ వృణా అహమేవ|పశునామధిపతిరసాణితి తస్మాత్ రుద్రః పశునామధిపతిః||” నాతో ప్రార్థన చేస్తున్న దేవతలారా! నేను పశువలె  (గోవు/పశువులు/జంతువులు ) ఉన్న సంసారులకు అధిపతిని.   కావుననే ఆళ్వార్ చే వీరు ఇఱైయవర్ గా సంభోధించబడ్డారు. కావున వీరు కేవలం ఈ భౌతిక ప్రపంచ ప్రజలకు మాత్రమే నియంత్రికులు/నిర్వాహకులు.
 • ఈణ్డియ వెళ్ళమ్(వరద)అనగా-  వరద మాదిరి  దేవతలు గుంపులు గుంపులు గా ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై శ్రీరంగమునకు వచ్చి ఉన్నారు.
 • కుమర దణ్డమ్– కు రెండు అర్థవివరణలు ఇవ్వబడ్డాయి.
  • మొదటిది- కుమరడు అనగా సుబ్రమణ్యుడని, + దణ్డమ్ అనగా దండం/కాండం/బెత్తం( సమర్థవంతమైన మందపాటిది అను సందర్భములోనిది) అని అర్థం. అనగా సేవకులు/సైన్యము లు పటిష్ఠమైన ధరించిన దండము( దేవతలు స్థలాభావం, భారీసమూహం చే  అతి దగ్గరగా నిలబడ్డారు)  .
  • రెండవది, దేవతలు సదా యవ్వన దశ(పదహారేండ్ల వయస్సు) లో కనబడతారు- ఎప్పుడు తమ యవ్వన స్థితిని కోల్పోరు. దణ్డమ్ – అనగా సేకరణ.  కనుక “కుమర దణ్డమ్” అన్నారు- అనగా దేవతల పెద్ద సమూహం.  దణ్డమ్ అనగా వారందరు ధరించిన ఆయుధములు అని కూడా అర్థం  వచ్చును.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source:  http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-6-iraviyar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి – 5 – పులంబిన

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

4వ పాశురం

srirangam golden vimana historyశ్రీరాముడు శ్రీరంగవిమానమును  మరియు శ్రీరంగనాథుణ్ణి , శ్రీవిభీషణాళ్వాన్ కు అనుగ్రహించుట

పాశుర అవతారిక:

 • నఙ్ఞీయర్ వ్యాఖ్యానమున- తొండరడిపొడి ఆళ్వార్ ,  ఎంపెరుమాన్ ను ఇలా ప్రాధేయపడుతున్నారు ‘భక్తులయందు తారతమ్యం చూపని  ఎంపెరుమాన్ సన్నిధికి  దేవతలందరు పూమాలికలతో ఆరాధించుటకు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు,  కనుక మీరు మేల్కొని వారందరి కైంకర్యమును స్వీకరించుము’.
 • పెరియవాచ్చాన్ పిళ్ళై – క్రిందటి పాశుర వ్యాఖ్యానమున , పచ్చిక బయళ్లయందు పడుకున్న తుమ్మెదల గురించి ప్రస్తావించారు, ఈ పాశురమున ఆళ్వార్ తోటలలో పడుకున్న పక్షులగురించి వివరించారు. పచ్చిక బయళ్ళలో పడుకున్న ఈ తుమ్మెదలు సూర్యోదయం మునుపే సులువుగా మేల్కొంటాయి- ఈ స్థితి ఇంద్రియనిగ్రహము ఉన్న భక్తులను సూచిస్తుంది. కాని తోటలలో పడుకున్న  పక్షులు పూర్తిగా సూర్యోదయం అయిన తర్వాత మేల్కొంటాయి- ఈ స్థితి ప్రాపంచిక సుఖములయందు తమ ఇంద్రియాలను  వినియోగించే బద్ధజీవులను సూచిస్తుందని వివరణ.

పులంబిన పుట్కళుం పూమ్  పొళిళ్ కళిన్ వాయ్                                                                                            పోయిత్తు క్కంగుళ్ పుగుందదు పులరి                                                                                                                కలన్దదు కుణదిశై కనై కడలరవం                                                                                                                            కళి వణ్డు మిళత్తియ కలమ్బగన్ పునైన్ద                                                                                                          అలంగళ్ అమ్ తొడై యళ్ కొణ్డు అడియిణై పణివాన్                                                                                                అమరర్ గళ్ పుగున్దనర్ ఆదలిల్ అమ్మా                                                                                                            ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్                                                                                                          ఎంబెరుమాన్ పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం

పూమ్=వికసించిన                                                                                                                                             పొళిళ్ కళిన్ వాయ్=తోటలయందు
పుట్కళుం= పక్షులు
పులంబిన=(మేల్కొని)=కూస్తున్న
క్కంగుళ్=రాత్రి
పోయిత్తు=పోయినది
పులరి=ఉషఃకాలము
పుగుందదు=ప్రవేశించెను
కుణదిశై= తూర్పుదిక్కున
కనై= శబ్దించు
కడల్= సముద్ర
అరవం=ఘోష
కలన్దదు=వ్యాపించెను
కళి=మదించిన(మధువును సేవంచిన)
వణ్డు= తుమ్మెదలు
మిళత్తియ= పాడుచున్నవి(ఝుంకారం చేస్తున్నవి)
కలమ్బగన్ పునైన్ద= అనేక/వివిధ పూలతో కూర్చిన
అమ్= అందమైన
అలంగళ్ తొడై యళ్ కొణ్డు=కదిలే పూమాలికలను తీసుకొని
అమరర్ గళ్= దేవతలు
అడియిణై పణివాన్=పాదద్వయమును సమర్పింప
పుగున్దనర్= ప్రవేశించిరి                                                                                                                                    – ఆదలిల్ = కనుక                                                                                                                                     అమ్మా=సర్వ స్వామీ!
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్=లంకాధిపతి అయిన విభీషణాళ్వాన్ శ్రీరంగమున దాస్యముచేయు
ఎంపెరుమాన్ = ఓ నన్నుఏలిన స్వామి!
పళ్ళియెళుందరుళాయే= పవళించిన స్వామి మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

బాగా విరబూసిన పుష్పములతో ఉన్న ఆ తోటలలో పక్షులు హృదయ ఉల్లాసమైన కిలకిలరావాలు చేస్తున్నాయి.రాత్రి ముగిసినది తెల్లవారుజాము ఆరంభమైనది. తూర్పు  సముద్రపు ఘోష అన్నివైపులా వినబడుతుంది .  మధువును త్రావిన తుమ్మెదలు మత్తుగా,  ఆనందంగా  ఝుంకారములు చేస్తున్న పరిమళభరిత పుష్పములతో కూడిన మాలలను దేవతలందరు చేబూని తమ దివ్యపాదారవిందములను ఆరాధించుటకై వచ్చి ఉన్నారు. లంకాధిపతియైన విభీషణాళ్వాన్ చేత ఆరాధింపడు , శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! ఇక లెమ్ము కృపతో మమ్ములను అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

 • ప్రతివారిని ఆవహించి నిద్రకు ఉపక్రమించేలా  చేయు   తమోగుణము  రాత్రితో సూచించబడుతున్నది. ప్రతివారియందు ప్రాతః కాలమున  సత్త్వగుణం ఉద్భవించు ను కావున ఆ ప్రాతః కాలము ఎంపెరుమాన్ ను ఆరాధించుటకు అనుకూలమైన/అనువైన సమయం .
 • విభీషణాళ్వాన్,  తనతో అత్యంత శత్రుత్వము ఉన్న రావణుడి సోదరుడైనప్పటికి లంకాధిపతిగా పట్టాభిషేకమును ఎంపెరుమాన్  చేశారు. తాను  కేవలం విభీషణాళ్వాన్ లోని  భక్తిని మాత్రమే చూసి తన సోదరునిగా  అంగీకరించాడు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

 • తొండరడిపొడిఆళ్వార్  తమ తిరుమాలై ప్రబంధము 14వ పాశురమున ” వణ్డినం ఉరులుంశోలై మయిల్ ఇనమ్ ఆలుం శోలై కొణ్డల్ మీదు అణవుం శోలై”– దీనర్థం :    “తుమ్మెదలు  ఆనందంగా ఝుంకరిస్తున్న , నెమళ్ళు గుంపులుగా గుంపులుగా  నాట్యమాడుచున్నఅందమైన తోటలతో , కారు(మబ్బులు)మేఘము కమ్ముకొని ఉండటం  వలన చల్లగా ఉండును శ్రీరంగము” అని వివరించిరి. ఆ శబ్దములన్నీ  పెరియ పెరుమాళ్ ఇంకను  పవళించి ఉన్నారే?” అని   ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నవి.
 • పెరియవాచ్చాన్ పిళ్ళై – ప్రయోజనాంతపరులగు( తమ  స్వార్థ కోరికలు నెరవేర్చుకొను) దేవతలు పెరియపెరుమాళ్ ను సేవించుకొనుటకు వేచి ఉన్నారు. కాని పెరియపెరుమాళ్ ఇంకను మేల్కొనలేదు. – పెరియ పెరుమాళ్ శ్రీరంగమున దక్షిణ ముఖంగా    శయనించి రావణుని కనిష్ఠ సోదరుడై, లంకానగరానికి   పట్టాభిషేకం చేసిన విభీషణాళ్వాన్   కోసం ఎదురుచూస్తూ  పరున్నావా?వారు వస్తే కాని మేల్కొనవా?  అని    పెరియవచ్చాన్ పిళ్ళై ప్రస్తావిస్తున్నారు.
 • ఆళ్వార్, విభీషణాళ్వాన్ ను ప్రస్తావిస్తూ  ఇలా అంటున్నారు ” మీరు  విభీషణాళ్వాన్ చే ఇక్కడ కొనితేబడ్డారు/తీసుకరాబడ్డారు. దానికై వారు వచ్చి మేల్కొలిపితే గాని లేవరా?”
 • మరలా ఇలా అంటున్నారు- ‘వళిపాడు సేయ్ గై'(ఆరాధన)- ఎంపెరుమాన్ సంకల్ప ప్రకారం నడుచుకుంటాము. ఎంపెరుమాన్  ఆశ్రిత పరాధీనుడు(భక్తుల పరాధీనుడు). వాస్తవానికి పెరియపెరుమాళ్ తాను విభీషణాళ్వాన్ చేత లంకానగరమునకు తీసుకొనిపోబడుతున్నారు, ఆ క్రమంలో తాను లంకకు వెళ్ళక అందరిని ఉద్దరించుటకు  శ్రీరంగముననే  స్థిరబడిపోయారు. మరి ఆ కోరిక నెరవేర్చుకొనుటకు మీరు లేచి మమ్ములను అనుగ్రహింపుము స్వామి అని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు.

సాధారణంగా పదవ పాశురం తప్ప మిగిలి పాశురాలలో అరంగత్తమ్మా అని (మకుటం) ప్రయోగించబడినది, కాని ఈ పాశురమున ఎంపెరుమాన్ అని ప్రస్తావించబడినది. పెరియపెరుమాళే ” ఎంపెరుమాన్” అనగా  నా (ఆళ్వార్ యొక్క) ఇష్ఠమైన దైవం అని అర్థం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-5-pulambina/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – 4 – మేట్టిళ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళిచ్చి

3వ పాశురం

100_0659

పాశుర అవతారిక:

 • తొండరడిపొడి ఆళ్వార్ ,   ఎలాగైతే శ్రీరాముడు తన భక్తులను కాపాడుటకై శత్రువులను  నిర్మూలించాడో ఆ మాదిరి  మీరు కూడ మిమ్ములను అనుభవించే/ఆనందించుటకు గల అడ్డంకులన్నీ తొలగించుటకు మేల్కొనవలెను అని ఎంపెరుమాన్  ను ప్రార్ధన చేస్తున్నారని నఙ్ఞీయర్ తమ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు .
 • గోపాలురు తమ పశువులను మేతకు( ఇష్ఠానుసారంగా తిరుగుటకు మరియు గడ్డిని మేయుటకు)తీసుకపోతారు. తెల్లవారున వారు పశువుల మెడలలోని చిరుగంటల శబ్దమును మరియు తుమ్మెదల  ఝంకారమును విపిస్తుంది. కాన ఆళ్వార్,  శత్రుహంతకుడు మరియు సర్వరక్షకుడగు   ఎంపెరుమాన్ ను మేలుకొని తమని అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం.

మేట్టిళ మేదిగళ్ తళైవిడుం ఆయర్ గళ్

వేయ్ ఙ్గుళలోశైయుమ్ విడై మణి క్కురలుమ్

ఈట్టియ ఇశై దిశై పరన్దన వయలుళ్

ఇరిందన శురుమ్బినమ్  ఇలంగైయర్ కులత్తై

వాట్టియ వరిశిలై వానవర్ ఏఱే

మాముని వేళ్వియై కాత్తు అవపిరదమ్

ఆట్టియ అడుతిఱళ్ అయోత్తి ఎమ్మరశే

అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం 

మేట్టిళ మేదిగళ్=పొడవైన లేత వయస్సులో ఉన్న గేదెలు
తళైవిడుం= మేపుటకు వదలబడిన
ఆయర్ గళ్= గోపకులు
వేయ్ ఙ్గుళలోశైయుమ్ = వెదురు వేణువు శబ్దం
విడై మణి = ఎద్దుల మెడలలోని గంటలు
క్కురలుమ్ = (గంటల)ధ్వని
ఈట్టియ ఇశై= రెండు రకముల శబ్దములు(వేణుశబ్దం మరియు గేదెల మెడలలోని గంటల శబ్దం)
దిశై పరన్దన= అన్నిదిక్కుల వ్యాపించిన
వయలుళ్ = పచ్చిక మడుల/బయళ్ళ యందు
శురుమ్బినమ్ = తుమ్మెదల గుంపు
ఇరిందన = ఆహ్లాదకరమైన శబ్దం (ఝుంకారం)మొదలైయినది
ఇలంగైయర్ కులత్తై = రాక్షస(లంకానగర)వంశము
వాట్టియ= నాశనంచేసిన /సంహరించిన
వరిశిలై = శారఙ్గమనెడి ధనుస్సును (ధరించిన)
వానవర్ ఏఱే = దేవాది దేవ!
మాముని= గొప్పముని(విశ్వామిత్రముని)
వేళ్వియై = యాగమును
కాత్తు= కాపాడి
అవపిరదమ్ ఆట్టియ = అవబృధస్నానం చేయించిన (యాగం పరిపూర్ణం అయిన తర్వాత చేయు పవిత్ర స్నానం)‌
అడుతిఱళ్ = శత్రువులను తుదముట్టించు గొప్ప/మిక్కిలి  పరాక్రమం/బలం  కలిగిన
అయోత్తి ఎమ్మరశే = అయోధ్యను ఏలు/పరిపాలించు  మా రక్షకుడా!
అరంగత్తమ్మా!= శ్రీరంగమున శయనించిన దేవాది దేవా!                                                                                                 పళ్ళియెళున్దరుళాయే.= (కావున) కృపతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం :
వేణువు నుండి వచ్చిన శబ్దం మరియు గోపాలకులచే మేతకు వదలబడిన లేత వయస్సులో ఉన్న గేదెల మెడలలోని గంటల శబ్దం అంతటా వ్యాపించినవి. పచ్చిక బయళ్ళలోని తుమ్మెదలు  దినారంభమున      ఆహ్లాదమైన తమ ఝుంకారములతో ప్రారంభించినవి. రాక్షసులను సంహరించి  విశ్వామిత్రుని యాగమును  పరిపూర్ణము గావించి అవబృధస్నానమును చేయించిన ఓ శ్రీరామా! శత్రువులను అతి సులువుగా సంహరించు గొప్ప/మిక్కిలి పరాక్రమము కలిగిన,  అయోధ్యను ఏలు మా రక్షకుడవు. శ్రీరంగమున శయనించిన దేవాది దేవా! మేల్కొని మమ్ములను కృపచూడుము.

నఙ్జీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

 • రావణునిచే తిప్పలు/కష్ఠాలు  పడ్డ ఆ దేవతల కోరికపై(బ్రహ్మను మొదలుకొని) ఎప్పుడైతే రావణుని తన శారఙ్గమను బాణంచే సంహరించాడో అప్పుడు   రాముడు ఎంతో సంతృప్తి చెందాడు. అలాగే  ఎంపెరుమాన్ కు  తన భక్తులు రక్షించబడ్డప్పుడే తనకు ఆనందం  అని విశేషంగా తెలుపబడుచున్నది.
 • ఇక్కడ అర్చావతార ఎంపెరుమాన్ వైభవం కీర్తించబడుతున్నది. శ్రీరాముడు తాను అయోధ్యలో వేంచేసి/జీవించి ఉన్నకాలంలో సేవించుటకు సాధ్యం , కాని శ్రీరంగనాథుణ్ణి (అర్చావతారం ) తరతరాల (శ్రీరామ విభవాతారం కన్నాతర్వాత నుండి) నుండి ఇప్పటివరకు సేవించవచ్చును. అర్చావతారములో ఉన్న  సౌలభ్యం గుణం ఇదే. అందరు అనుభవించుటకు సులభుడు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

 • పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క చమత్కార/ అందమైన భావన- ఆళ్వార్ భావన- ఆవులు మరియు లేగదూడలు మేల్కొనుటను ఎంపెరుమాన్ కు సూచిస్తున్నారు “అల్ఫఙ్ఞానము కలిగినవే మేల్కొన్నాయి, మరి తమరు సర్వశక్తిమంతుడవైన మహాఙ్ఞాని కదా మరి ఇంకా మేల్కొనలేదే?”
 • నరసింహ పురాణ శ్లోకంలో16.13- ఆహార నిద్రా భయ మైథునం తుల్యాని కల్వత్ర సమస్తజన్తోః| ఙ్ఞానాత్ విశిష్ఠో హి నరః పరేభ్యో ఙ్ఞానేన హీనః పశుభిః సమానః||దీనర్థం- ఆహారం, నిద్రా, భయం ,మైథునములు అన్నీ జీవులకు సాధారణమే. కాని మనిషి అన్నీ జీవులకన్న తెలివైనవాడు. ఒకవేళ మానవుడు ఙ్ఞానమును మంచికై వినియోగించకున్నచో వాడు పశు సమానుడు.
 • ఇక్కడ మాముని (గొప్పముని) అని విశ్వామిత్రుణ్ణి సంభోధించుటకు కారణం అందంగా వర్ణించబడింది. ముని అనగా – స్థిరమైన ఙ్ఞానాన్ని కలిగిన వాడు. విశ్వామిత్రుడు  తన తీవ్రమైన తపఃశక్తి వలన తాను ఏదైన సాధించగల సామర్థ్యం కలవాడు, కాని తన శక్తిని అల్ఫమైన కోరికలకు వినియోగించలేదు. తన స్వాతంత్ర్యమును వదలి ఆ యాగ రక్షణను శ్రీరాముని యందు ఉంచి  ఆ కార్యమును నేరవేర్చుకున్నాడు. ఎంపెరుమాన్ యందు ఉన్న ఈ పారతంత్ర్యము వలన తాను ‘మాముని’  అని ఆళ్వార్ చే సంభోధించ బడ్డాడు.
 • శ్రీరామాయణం బాలకాండ1.97లో “దశవర్ష  సహస్రాణి దశవర్ష శతాని చ| రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి||శ్రీరాముడు తన రాజ్యాన్ని 11000వేల ఏండ్లు పరిపాలించి తన నివాసానికి తిరిగి వెళ్ళి పోయాడు.శ్రీరాముడు కేవలం 11000 మాత్రమే జీవించాడు. కాని శ్రీరంగనాథుడు ఎన్నో ఎన్నోవేల సంవత్సరముల నుండి వేంచేసి ఉన్న భక్తసులభుడు, కావున శ్రీరంగమున పవళించిన దేవాదిదేవ! లేచి మమ్ములను అనుగ్రహించుము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-4-mettila/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – 3 – శుడరొళి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుపళ్లి యెళిచ్చి

2వ పాశురం

namperumal2

పాశుర అవతారిక:

శుడరొళి పరన్దన శూళ్ దిశై యెల్లాం

తున్నియ తారకై మిన్నొళి శురుఙ్గి

పడరొళి పశుత్తనన్ పనిమది ఇవనో

పాయిరుళ్ అగన్ఱదు పైమ్పొళిల్ కముగిన్

మడలిడై క్కీఱి వణ్ పాళైగళ్  నాఱ

వైకఱై కూరన్దదు మారుదం ఇదువో

అడలొళి తిగళ్ తరు తిగిరియన్దడక్కై

అరంగత్తమ్మా! పళ్ళియెళున్దరుళాయే.

ప్రతిపదార్థం

శూళ్ దిశై యెల్లాం= అంతటా(అన్ని దిక్కులయందు)

శుడరొళి= సూర్యుని కిరణాలు
పరన్దన = విస్తరంచినవి
తున్నియ=దగ్గరగా /దట్టంగా ఉన్న  (ఆకాశమున)                                                                                                       తారకై = నక్షత్రములు
మిన్నొళి= తేజస్సు
శురుఙ్గి= క్షీణించిన/తగ్గిన
పడరొళి= బాగా విస్తరించిన వెలుగు
పనిమది ఇవనో= ఈ చల్లని చంద్రుడు కూడ
పశుత్తనన్= తమ తేజస్సును కోల్పోయ్యారు
పాయిరుళ్= బగా విస్తరించిన అంధకారం
అగన్ఱదు= తొలగించబడింది
వైకఱై మారుదం ఇదువో= తెల్లవారుజాము యొక్క మలయమారుతం
పై పొళిల్=హరిత వనములు
కముగిన్= వక్క వృక్షములు
మడలిడై క్కీఱి = ఆ పత్రములు/మట్టలు వీడుట వలన
వణ్ పాళైగళ్  నాఱ= మంచి సువాసన
కూరన్దదు=వీచు (సుగంధమును మోస్తున్న)
అడల్=చాలా బలమైనది
ఒళి తిగళ్ తరు=తేజస్సుతో ప్రకాశించు
తిగిరి=శ్రీ సుదర్శనాళ్వాన్
అమ్ తన్దడక్కై=దివ్యమైన శ్రీ హస్తములు
అరంగత్తమ్మా!=    శ్రీరంగమున శయనించిన దేవాది దేవా!                                                                                  పళ్ళియెళున్దరుళాయే.= (కావున) కృపతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం: 
సూర్యకిరణములు అంతటా ప్రసరించినవి. బాగా ప్రకాశించిన నక్షత్రములు మరియు చంద్రుడు సూర్యుని కిరణముల వల్ల తాము ప్రకాశహీనమైనట్లు తెలుపుచున్నవి. గాండాంధకారము క్షీణించినది. తెల్లవారుజాము మలయమారుతం, వనములలోని వక్కచెట్ల దళములు/మట్టలు విడుట వలన వాటి సుగంధమును మోసుకొస్తున్నాయి. బాగా ప్రకాశవంతమై, ప్రభావం కలిగిన సుదర్శన చక్రమును దివ్యహస్తముల యందు ధరించి శ్రీరంగమున శయనించిన దేవాదిదేవా! కృపతో మేల్కొని మమ్ములను  అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు

 • ఎలాగైతే రాజు అగుపించగానే మోసగాళ్ళు పారిపోతారో(జీవితం పై  భయపడి). అలానే సూర్యుడు కనిపించగానే అంధకారం వెంటనే తొలగిపోవును.
 • శత్రువులందరు శ్రీచక్రత్తాళ్వార్ (శీసుదర్శనులు) ప్రభావం వలన నశిస్తారు. మనను తన ఆధీనంలో ఉంచుకొను  సహజ శత్రువు (మనతో జన్మించు శత్రువు) అగు మన ఇంద్రియములను ఎంపెరుమాన్ పై మరలించి వానిని అనుభవించినపుడు ఈ అంతర్గత శత్రువు నశించును.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

 • సూర్యుని తేజస్సు ప్రకాశించినప్పుడు, మీ తేజస్సు (సూర్యుని తేజస్సుకు ఆధారమైన) కూడా ప్రకాశించును. అందుకే మేల్కొనుము. “తేజసామ్ రాశిమూర్జితం“- ( విష్ణుపురాణం 1.9.67)అను శ్లోకం  మరియు “పయులుం శుడరొళి” (తిరువాయ్ మొళి 3.7.1)అను పాశురములు భగవానుని తేజస్సు గురించి వివరిస్తాయి.
 • సుదర్శనచక్ర రహితముగా కూడా భగవానుని దివ్య హస్తములు సుందరముగా ఉండును. అదే సుదర్శనచక్ర సహితమైన శ్రీహస్తముల తేజస్సు బహుళ రెట్లు అధికమగును.
 • సంసార బాధలను అనుభవిస్తు, మీ దర్శణార్థం ఎదురు చూస్తున్న వారికై మీరు మీ దర్శనము ఇవ్వవలసినది. మేల్కొనుటకు బదులు ఇంకా శయనించితిరేలా? మీ అవతార ప్రయోజనమైన అనుగ్రహము ద్వారా మమ్ములను కరుణించుము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-3-sudaroli/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – 2 – కొళుంగొడి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

gajendramoksham

తిరుపళ్లి యెళిచ్చి

1వ పాశురం

పాశుర అవతారిక

కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి
కూరన్దదు కుణతిశై మారుదం ఇదువో
ఎళుందన మలర్  అణై ప్పళ్ళికొళ్ అన్నం
ఈన్బని ననైంద తంఇరుం జిఱగుదఱి
విళుంగియ ముదలైయిన్ పిలం పురై పేళ్వాయ్
వెళ్ళెయిరుర అదన్ విడత్తినుక్కనుంగి
అళుంగియ ఆనైయిన్ అరుందుయర్కెడుత్త
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

కుణతిశై మారుదం = తూర్పు నుండి వీచు వాయువు.
కొళుంగొడి = బాగా వికసించిన  తీగ
ముల్లైయిన్ = మల్లె తీగ
కొళు మలర్=  అందమైన పుష్పములు
అణవి= స్పర్శ
ఇదువో= ఈ
కూరన్దదు= వీచు
మలర్  అణై = పుష్పపానుపు
ప్పళ్ళికొళ్= శయనించుట
అన్నం= హంసలు
ఈన్బని ననైంద= మంచు కురుయుట వలన తడిసిన
తం= వారి
ఇరుం జిఱగుదఱి= అందమైన రెక్కలు గల
ఉదఱి = వణుకుచున్న
ఎళుందన = మేల్కోనుట
విళుంగియ= మ్రింగిన/పట్టుకొనిన(ఏనుగు యొక్క కాళ్ళను)
ముదలైయిన్ = మకరం(మొసలి)
పిలం పురై  = గుహ వలె
పేళ్వాయ్= పెద్దని నోరు
వెళ్ళెయిరుర = తెల్లని/పదునైన దంతములతో కరచిన/గాయపరచిన
అదన్ = ఆ ఏనుగు
విడత్తినుక్క= ఆ హానికి(ఆ దంత క్షతం వలన)
అనుంగి అళుంగియ=  విపరీతమైన నొప్పితో బాధపడుతున్న
ఆనైయిన్ = ఆ ఏనుగుయొక్క(గజేంద్రాళ్వాన్)
అరుందుయర్ = చాలా బాధపడుచున్నవి
కెడుత్త= పోగొట్టు
అరంగత్తమ్మా! = శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా!
పళ్ళియెళుందరులాయే= (కావున) మీరు కృపతో   మేల్కొని మమ్ము కటాక్షించుము

సంక్షిప్త అనువాదం :

తూర్పు పవనములు(మలయ మారుతములు) బాగా వికసించిన మల్లె తీగలను క్రమంగా తగులుతూ వీస్తున్నవి. పూలపాన్పుపై శయనించిన  హంసలు పొగమంచుచే తడిసిన తమ రెక్కలను మరియు ఈకలను విదిలించుచూ లేస్తున్నవి.  తన గుహలాంటి పెద్దని నోరుతో మరియు వాడియైన విషదంతములచే  ఆ మకరము, గజేంద్రాళ్వాన్ పాదములను పట్టుకొని మ్రింగప్రయత్నించగా  భరించలేని ఆ బాధను పోగొట్టగల గొప్పసామర్థ్యం కలవాడవు నీవు మాత్రమే. కావున   శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా!  మీరు కృపతో   మేల్కొని మమ్ము కటాక్షించుము.

 నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు 

 • పెరియ తిరుమొళి 4.7.3 లో  భగవానుడు తాను హంసావతారంలో వేదములను వెల్లడించాడు “అన్నమాయ్ అన్ఱు అంగరు మఱై  పయందాన్ అరంగమా నగర్ అమరన్దానే” కాన ఆ హంసలు మేల్కొన్నాయి, శ్రీరంగనాథ మీరు కూడ అలానే మేల్కొనుము అని ఆళ్వార్ అభ్యర్థిస్తున్నారు.
 • “పరమాపదం ఆపన్న” అని విష్ణుధర్మం- గజేంద్రాళ్వాన్  పెద్దఅపాయముతో చిక్కుకున్నాడు. కాన ఎంపెరుమాన్ అక్కడకు చేరుకొని   గజేంద్రాళ్వాన్ అపాయమును తొలగించి వానిచే తామరపుష్పమును( గజేంద్రాళ్వాన్ తాను ఎంపెరుమాన్ కై పట్టుకొన్నది)  తన పాదముల యందు సమర్పింప చేసుకొన్నాడు.
 • ఇదే భగవంతుడి యొక్క అనుగ్రహం. అదే విధంగా తాను సంసారులను(విభవ అవతార అనంతరం ఉన్న)   ఉజ్జీవింపచేయుటకు  శ్రీరంగమున అర్చారూపి శ్రీరంగనాథుడిగా అవతరించాడు. తమ కోరికలను తీర్చి కటాక్షించుమని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు. ( గజేంద్రాళ్వాన్ యొక్క ఆపదను తొలగించినటుల)

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

 • ఆళ్వార్ “పళ్ళికొళ్ అన్నమ్”అంటున్నారు- దివ్యదేశములలో(భగవానునకు చాలా ప్రీతి అయిన)అన్నింటికి -అనగా హంసలు కూడ గౌరవించబడతాయి. ఎంపెరుమానార్ తిరువేంకటమ్(తిరుమల)ని దర్శించడానికి వెళ్ళినప్పుడు తన మేనమామ మరియు ఆచార్యులైన  పెరియ తిరుమలనంబి తానే స్వయంగా వారిని ఆహ్వానించడానికి ఎదురుగా వెళ్ళారు.
 • అప్పుడు ఎంపెరుమానార్ వారితో ‘మమ్ములను ఆహ్వానించుటకు మీరెందుకు వచ్చారు ఎవరినైన చిన్నవారిని (స్థాయిలో) పంపవచ్చును కదా?’అని అన్నారు. దానికి  పెరియ తిరుమలనంబి ” నమ్మిల్  శిఱియారిల్లై ఇంగు వత్తిప్పారిల్” (తిరుమల లో నివసించేవారిలో మా కన్నా చిన్నావారు (స్థాయిలో) ఎవరునూ లేరు)అని అన్నారు- ఇది అతని వినయానికి తార్కాణం.
 • (నఙ్ఞీయర్ వ్యాఖ్యానము వలె) కావున ఆ హంసలు మేల్కొన్నవి, అలాగే ఆ హంస వలె  ఉన్న ఎంపెరుమాన్  మీరు కూడ  మేల్కొనుము.
 • ఇక్కడ ఆళ్వార్” విళుంగియ” (పట్టుకొనబడిన)అని అంటున్నారు, ఆ మకరం బిగుతుగా/గట్టిగా  గజేంద్రుని కాళ్ళను గాయపరచి పట్టుకున్నాడు. ఒక తల్లి తన పిల్లవాడు నూతి గోడపై అపాయంగా కూర్చున్నపుడు భయంతో ” అయ్యో పిల్లాడు ” అని గాబరాగా అరుస్తుందో అలా ఉన్నది ఈ స్థితి.
 • “అరుమ్ తుయర్” – ఈ అపాయము చాలా క్లిష్ఠమైనది కావున పెరుమాళ్ ,  గజేంద్రాళ్వాన్ ను రక్షించడానికి నేరుగా పరమపదం  నుండి దిగాడు.
 • సముద్రమను ఈ సంసారమున మకరము వంటి ఐదు ఇంద్రియములచే మ్రింగివేయబడుచున్న మమ్ములను కాపాడుటకు లేచిరాక ఇంకా శయనించితివి  ఏలా?

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-2-kozhungodi/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – 1 – కదిరవన్

Published by:

namperumal

పాశుర అవతారిక :

 • ఎంపెరుమాన్ ను ఆరాధించడానికి వచ్చిన దేవతలను, ఆళ్వార్ వారిని ఎంపెరుమాన్ ను మేల్కొలపమని అర్థిస్తున్నారని నఙ్జీయర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడు అందరి దేవతలకు మరియు ఆరాధించే వారికి ఆరాధించడం లో అత్యున్నతుడని/సర్వోన్నతుడని /పరతత్వం అని స్థాపన చేస్తున్నారు .
 • సూర్యభగవానుడు కేవలం బాహ్యాంధకారాన్ని పోగొట్టగల సామర్థ్యం కలవాడు, కాని శ్రీమన్నారాయణుడు మాత్రమే అంతర్గత అంధకారాన్ని(అఙ్ఞానం)నిర్మూలించే సామర్థ్యం కలవాడు అని పెరియవాచ్చాన్ పిళ్ళై నిర్థారణ చేస్తున్నారు. అఙ్ఞానం తొలగినదని  మరియు ఎంపెరుమాన్ తాము మేల్కొని తనను  ఆరాధించడానికి వచ్చిన దేవతలను,రాజులను మొదలైనవారిని కటాక్షించుమని   ఆళ్వార్  ప్రార్థిస్తున్నారు.

కదిరవన్ కుణైదిశై చ్చిగరం వన్దణైందాన్
కనైయిరుళ్ అగన్ఱదు కాలైయం పొళుదాయ్
మదు విరిందొళుగిన మామలర్ ఎల్లాం
వానవర్ అరశర్గళ్ వన్దు వన్దీండి
ఎదిర్ దిశై నిఱైందనర్ ఇవరొడుమ్ పుగుంద
ఇరుంగళిర్ ఈట్టముమ్ పిడియొడుమురశుం
అదిర్ దలిళ్ అలై కడల్ పోన్ఱుళదు ఎంగుం
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
ప్రతిపదార్థం 

అరంగత్తమ్మా= హే ప్రభూ! శ్రీరంగమున శయనించిన దేవాదిదేవా
కదిరవన్= సూర్యుడు
కుణైదిశై=తూర్పు దిశ
చ్చిగరం=శిఖరం పై (ఉదయగిరి పైన )
వన్దణైందాన్= తన స్థానంలోకి వచ్చినాడు
కనైయిరుళ్ = గాఢాంధకారం(రాత్రి సమయపు)
అగన్ఱదు= నశించినది
అం= అందమైనది
కాలై పొళుదాయ్ = ఉదయమే చేరుకున్న
మామలర్    ఎల్లాం= ఉత్తమ/ విశేషమైన పుష్పములు
విరిన్దు= వికసించిన
మదు ఒళుగిన= విరివిగా తేనె తో నిండిన
వానవర్= దేవతలు
అరశర్గళ్= రాజులు
వన్దు వన్దు =తొందరగా వచ్చి ఒకరినొకరు తోసుకుంటున్నారు
ఈండి= గుంపులుగా
ఎదిర్ దిశై = భగవానుని దివ్యమైన దృష్ఠి ప్రసరించు దక్షిణదిశ
నిఱైందనర్=  అంతటా నిల్చోవడం వల్ల నిండిపోయినది
ఇవరొడుమ్ పుగుంద=వారితో పాటు వచ్చి చేరిన
ఇరుంగళిర్ ఈట్టముమ్= మగ ఏనుగుల గోష్ఠి/గుంపు  (దేవతల మరియు రాజుల వాహనములు)
పిడియొడు= ఆడ  ఏనుగుల గోష్ఠి
మురశుం = సంగీత వాయుద్యాలు
అదిర్ దలిళ్= ఆ గుంపుల వల్ల పెద్ద శబ్దం ఉత్పన్నమవుతున్నది
ఎంగుం=అంతటా
అలై కడల్ పోన్ఱుళదు = అలలు.సముద్రపు తీవ్రమైన తరంగముల వల్ల వచ్చు శబ్దం
(ఆదలాల్)పళ్ళియెళుందరులాయే=(కవున) మీరు మేల్కొని మమ్ములను కటాక్షించుము

సంక్షిప్త అనువాదం:

శ్రీరంగమున శయనించిన దేవా! సూర్యుడు  ఉదయగిరిన ఉదయించి రాత్రి యొక్క గాడాంధకారాన్ని పోగొడుతున్నాడు. ప్రసన్నమైన ఉదయం ఆసన్నమైనది, పుష్పముల నుండి మధువు కారుచున్నది. మీ దృష్ఠి ప్రసరించు  దక్షిణం వైపునకు  దేవతలు మరియు రాజులు ఒకరినొకరు తోసుకుంటు గుంపులు గుంపులుగా సన్నిధికి వచ్చిచేరిరి. ప్రాంగణమంతా నిండి పోయినది. వారందరు  ఆడ మగ ఏనుగుల సమూహముతో(తమ తమ వాహనలు)‌ సంగీత వాయిద్యములతో కూడ వచ్చి చేరిరి. ఆసక్తిగా మరియు ఉత్సాహముగా ఎదురుచూస్తు వారి గోల మరియు వాయిద్యాల శబ్దం సముద్ర ఘోషను పోలి  నలుదిశలా ప్రసరిస్తున్నవి .   ఇక్కడ సమావేశమైన వారందరి కోసం  మీరు మేల్కొనికటాక్షించుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ముఖ్యవిషయాలు:

 • పెరియాళ్వార్ తిరుమొళి 4.1.1 “కదిరాయిరం ఇరవి కలందెరిత్తాళ్ ఒత్త నీళ్ ముడియన్”- భగవానుని దివ్య శిరస్సు వేయి సూర్యుల కాంతితో స్వతహాగా ప్రకాశిస్తుంది.  శ్రీరంగనాథుని పాదపద్మములు ఉన్న దిశయగు తూర్పున సూర్యోదయం అగును. కావున ఇరు దిశలయందు భగవానుని తేజస్సు ప్రకాశంగా వెలుగుతుంది.
 • ప్రాతః కాలము విశేషముగా ఎంపెరుమాన్ ను ధ్యానించుటకు చాలా శుభప్రదమైన సమయం.
 • దేవతలు మరియు రాజులు(అహంకార భూతులగు)తమ తమ క్షుద్రమైన కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంపెరుమాన్ సన్నిధికి చేరుతారు.
 • శ్రీరంగనాథుడు ఉభయవిభూతి నాథుడిగా(పారలౌకిక /ఆధ్యాత్మిక మరియు భౌతిక/లౌకిక లోకాలని నియమించేవాడు)   స్వతాహాగా కీర్తంపబడుతున్నాడు. ఆళ్వార్ తమను అనయన గతికునిగా భావిస్తున్నారు- దీనర్థం భగవానుడే తప్ప మరేతరులు తమకు రక్షకులు/శరణ్యులు  కారని.

పెరియవచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ముఖ్యవిషయాలు:

 • దినమును వెలుగు పరచుటకు పరిచారకుడు/దాసుడు ఎలాగైతే దీపమును తీసుకవస్తారో అలాగే మీరు మేల్కొనిన సూర్యుడు తనంతట తాను తన కిరణములను ప్రసరింపచేస్తాడు.  ఇది సూర్యుడు మీకై చేయు చిన్న కైంకర్యము. మీ దర్శనము మరియు కటాక్షమునకై తానుకూడ తూర్పున ఉదయిస్తున్నాడు. “బిషోదేతి  సూర్య”- అని తైత్తరీయోపనిషధ్ లో చెప్పినటుల  సూర్యుడు మీ భయముతో సరైన సమయమందు తన విధిని నిర్వర్తిస్తున్నాడు.
 •  పరాశరస్మృతి యందు”బ్రాహ్మే ముహూర్తం చ ఉత్తాయ చిన్తయేత్ ఆత్మానో హితమ్/ హరిః హరిః హరిః ఇతి వ్యాహరేత్ వైష్ణవః  పుమాన్” (వైష్ణవుడు తెల్ల వారుజామునే (దాదాపు 4గం||)లేచి  తన ఆత్మోజీవనమునకై ధ్యానము చేయ వలెను). హరి నామమును ముమ్మారు ఉచ్ఛరించాలి). తిరుప్పావై 29వ పాశురంలో “శిత్తుం శిరుకాలే వన్దున్నైచేవిత్తు”(తెల్లవారు జాముననే నిన్ను ఆరాధించుటకు వచ్చినాము)
 • శ్రీరంగనాథుడు తన దేవేరి అయిన శ్రీరంగనాయకి తో ఏ ఎడబాటులేక తన నివాసస్థలమగు శ్రీరంగ దివ్యదేశమున వేంచేసినాడు, మగగజము తన సహచరము(ఆడ గజం)తో ఈ దివ్యదంపతులను సేవించడానికి వచ్చినవి.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-1-kathiravan/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – అవతారిక

Published by:

periyaperumal-art  పెరియపెరుమాళ్ శ్రీరంగం

thondaradipodi-azhwar-srirangam                                                           తొండరడిపొడిఆళ్వార్ శ్రీరంగం

నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ల అవతారిక పరిచయం

నఙ్ఞీయర్  అవతారిక పరిచయం  

“అనాది మాయయా సుప్తో  యదా జీవః ప్రబుధ్యతే”అన్న వచనానుసారం- ఎప్పుడైతే జీవాత్మ సుప్తావస్థనుండి జాగృతం చెందునో) పెరియపెరుమాళ్ తన నిర్హేతుక కృపాకటాక్షం వలన విప్రనారాయణు ను   అఙ్ఞానము నుండి జాగృతం చేశారు. అనుగ్రహింపబడిన దివ్యమైన ఙ్ఞానం చేత ఆళ్వార్, పెరియపెరుమాళ్ ప్రాప్యం(లక్ష్యం) మరియు ప్రాపకం(సాధనం) అని గ్రహిస్తారు, ఇదే విషయాన్ని తమ తిరుమాలై ప్రబంధమున కూడ వివరిస్తారు. పిదప ఆళ్వార్ తాను పెరియపెరుమాళ్ కు కైంకర్యమును చేయదలచి ఎంపెరుమాన్ కు మేల్కొలుపుగా తిరుపళ్ళియెళిచ్చిని గానం చేశారు.(పాత్రలు పరస్పరం వ్యతిరిక్తమైనవి- ప్రథమంగా ఎంపెరుమాన్ తాను ఆళ్వార్ ను జాగృతిపరచగా పిదప ఆళ్వార్ తాము   ఎంపెరుమాన్ ను మేల్కొలిపిరి)

భగవానుడే లక్ష్యం మరియు సాధనం  అని తెలుసుకుంటే, సహజముగానే వారు నిరంతరం అతనినే  ధ్యానిస్తారు మరియు భగవానుని దైవిక నిద్రను, దివ్య సృష్ఠిని అనుభవిస్తారు. తాము పూమాలా కైంకర్యము  భగవానునకై చేస్తారు.

ఆండాళ్ ఈ భావనను తన తిరుప్పావై 23వ పాశురమగు “మారిమలై ములైంజిల్” లో అనుభవిస్తుంది. నమ్మాళ్వార్ తిరువాయ్ మొళి 8.10దశకంలో “నెడుమార్కడిమై”   విశేష కైంకర్యము భాగవతులది అని స్థాపిస్తారు. అలాగే తిరువాయ్ మొళి 9.1దశకంలో “కొండపెండీర్ మక్కలే”లో ప్రధానమైన సూత్రాలను మానవులకు ఉపదేశిస్తారు.   “కిడన్ద  నాల్  కిడన్దై” అను తిరువాయ్ మొళి 9.2.3 పాశురంలో ఎంపెరుమాన్ మేల్కొనిన పిదప వారికి కైంకర్యమును చేయాలని  తమ ఆశను వెల్లడిస్తారు. విశ్వామిత్రఋషి, శ్రీమద్రామాయణం బాలకాండ-23.2 లో “కౌసల్యా సుప్రజా రామా” అని శ్రీరాముణ్ణి మేల్కొలుపుతాడు. అదే తరహాలో తొండరడిపొడిఆళ్వార్ , పెరియపెరుమాళ్ సౌందర్యమును అనుభవించి కైంకర్యముగా తిరుపళ్ళియెళిచ్చిని గానం చేశారు.

ఆదిత్యుడు ఉదయగిరి (తూర్పున ఉన్న పర్వతం)యందు అగుపిస్తాడు. తాను వెలుగును ప్రసాదించగానే, దేవతలు మరియు రాజులు  దేవాలయ దక్షిణ దిక్కున   వస్తుసామాగ్రిని తీసుకొని తిరువారాధనకై చేరుతారు. ఎంపెరుమాన్ కృపకు పాత్రులమవ్వాలని ఒకరినొకరు తోసుకుంటు ఎంపెరుమాన్ ముందు నిలబడతారు.

ఆళ్వార్, ఎంపెరుమాన్(అందరికి రక్షకుడు, శ్రీమహాలక్ష్మికి పతిఅయినవాడు, భక్త మందారుడు , అందరికి సులభుడు) ను తమ కైంకర్యమునందు తనను  న్నిమగ్నము చేయుమని అభ్యర్ధిస్తారు. ఎలాగైతే కొందరు తమ పిల్లలను చూపి తమ జీవనోపాధిని పొందుతారో, అలా ఆళ్వార్ ఉపస్థితి అయిన దేవతల(తమ స్వార్థకోరికలు తీర్చుకొనుటకై ఎదురుచూచు వారు)  చూపుతు తమ కోరికను(కైంకర్యము)నెరవేర్చమని ప్రార్థిస్తారు.

నఙ్జీయర్ అవతారిక పరిచయం ముగిసినది.

పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారికా పరిచయం

తొండరడిపొడిఆళ్వార్ తొలుత స్వరూప(నిజస్వభావం), ఉపాయ(సాధనం) మరియు పురుషార్ఠము యందు అఙ్ఞులుగా ఉండి తమ దేహమునే ఆత్మగా భావించేవారు.తాను  ప్రాపంచికానందముల యందు మరియు సన్నిహితులందు నిమగ్నమై ఉండేవారు.

పెరియపెరుమాళ్ తన నిర్హేతుక కృపవల్ల తమ సౌందర్యమును ఆళ్వార్ కు అనుగ్రహించారు. ఆళ్వార్ యొక్క ప్రాపంచిక కోరికలను నిర్మూలించి తమ వైపుకు ఆకర్షించారు.  ఆళ్వార్ కూడ పెరియపెరుమాళ్ కు  కైంకర్యం చేయు ఉద్దేశ్యముతో ఆశ్రయించిరి.  కాని పెరియపెరుమాళ్ (అర్చావతార రూపి) భౌతికంగా అతనితో కలవక అలా పడుకొని ఉన్నాడు.

తాను శయనించడం (మయా నిద్ర) ఆళ్వార్ ను విస్మరించుట కాదు అతనికి ఇంకా ప్రియమగుటకే. ఎంపెరుమాన్ శుద్ధసత్వగుణపూర్ణుడు. కావున తన  శయనం తమోగుణం వల్ల లేదా అజీర్తివల్ల కాదు కేవలం ఆళ్వార్ కోసమే.

 • జీవాత్మ అనుచిత సహజ స్వభావమగు భౌతిక స్థితిని   సంపూర్ణంగా తెలుకొనుట.
 • జీవాత్మ యొక్క సహజ  స్వభావం  మగు భాగవతులకు దాసునిగా ఉండుట గ్రహించుట.
 • ఆత్మ మరియు పదార్థం గురించి సంపూర్ణ ఙ్ఞానం కలిగి ఉండుట.
 • తన ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట.
 • ఇతర ఉపాయములైన కర్మ, ఙ్ఞాన మరియు భక్తి యోగములతో అనుబంధము లేకుండ ఉండుట.

పెరియపెరుమాళ్ తాను శ్రీరంగమున శయనించుట తన ప్రియమైన భక్తుడైన ఆళ్వార్ ను పొందుటకు చేయు ధ్యానమే, తన స్వవైభవం పరిగణలో ఆళ్వార్ ను సంస్కరించుట మరియు జీవాత్మలను ఎలా ఆళ్వార్ స్థాయికి తీసుకవచ్చి  ఉజ్జీవింపచేయాలనే చింతనమే మాయా నిద్ర.

సీతాపిరాట్టి వియోగ కారణంగా శ్రీరాముడు ఎన్నడు నిద్రించలేడు, అలాగే పెరియపెరుమాళ్ కూడ ఆళ్వార్ తన భక్తుడు అయ్యేంత వరకు నిద్రించలేడు.

కాని ఆళ్వార్ తన భక్తుడయ్యేసరికి పెరుమాళ్ ప్రశాంతంగా  నిద్రించసాగిరి.

ఆనాటి నుండి ఆళ్వార్ విషయాంతారాల వైపు వెళ్ళకుండ కేవలం కైంకర్యం మాత్రమే చేయసాగిరి. విశ్వామిత్రులవారు శ్రీరాముణ్ణి ‘కౌసల్యా సుప్రజారామా’ అని మేల్కొలుపుటను ఇదివరకే తెలుసుకున్నాము. అలాగే సీతాదేవి కూడ శ్రీమద్రామాయణం, సుందరకాండలో 38.25లో  “స మయా బోధిత శ్రీమాన్” అని మేల్కొలిపినది, ఆండాళ్ తన తిరుప్పావై 17వ పాశురాన కణ్ణన్ ను “ఉమ్బర్ కోమానే ఉఱంగాదెళుందిరాయ్”  అని ఆళ్వార్ తమ ప్రబంధములో   పెరియపెరుమాల్ ని ” అరంగత్తమ్మా పళ్ళియొళుందెరుళాయే” -మేల్కొలిపి తాను భాగవతుల సేవాకైంకర్యము యందు నిమగ్నమవ్వాలని  తమ ప్రబంధం చివరన ” తొండరడిపొడి యెన్నుమ్  అడియనై అళియ నెణ్ణఱుళి ఉన్నడియార్కు ఆట్పడుత్తాయ్” అని కోరుకున్నారు.

ఆళ్వార్  బలవంతముగా ఎంపెరుమాన్ ను మేల్కొలపడం తాము వారి కైంకర్యమున నిమగ్నమవ్వడం, కారణం ఎంపెరుమాన్ కు ఆనందముతో చేయు కైంకర్యమే తమ ప్రధాన లక్ష్యం.

ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీమద్రామాయణం- అయోధ్యకాండ-31.25శ్లోకమున “అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపతశ్చ తే” -నేను మీరు మేల్కొని ఉన్నప్పుడు , శయనించినపుడు సర్వావస్థల యందు సర్వవిధ కైంకర్యము చేయుదును” అని అన్నాడు. తిరువిరుత్తము 3.3.1 న   “ఒళవిళ్ కాలమెల్లాం ఉడయనాయ్ మన్ని” అను దశకమున నమ్మాళ్వార్ ఇలా అంటున్నారు-తాము సర్వావస్థలయందు , సర్వాకాలమందు, సర్వదా ఆనందము గురించి ఎంపెరుమాన్ కు కైంకర్యము చేస్తానని,అలాగే   తిరువాయ్ మొళి 2.9.4 యందు “మా ఆనందమునకై మీసేవలో సదా నిమగ్నపరుచుము”అని కోరుచున్నారు.

ఎంపెరుమాన్ నుండి ఆఙ్ఞను గైకొని  కైంకర్యము చేయునప్పుడు ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీమద్రామాయణం- అరణ్యకాండ-1.57శ్లోకమున ఇలా అన్నారు  ” క్రియతామితి మామ్ వద” – మీరు కుటీరనిర్మాణం చేయుమని నాకు ఆఙ్ఞను ఇవ్వండి( సీతాదేవి మరియు మీ ముఖోల్లాసమునకై)

ఆళ్వార్ తిరువాయ్ మొళి 8.5.7న ఎంపెరుమాన్ తో ఇలా అంటున్నారు ” ముగప్పే కూవిపణి కొల్లే”- మీముందుకు పిలచి నాకు మీ కైంకర్యమున నిమగ్నము చేయుము. కావున ఆళ్వార్ , ఎంపెరుమాన్ ను మేల్కొలిపి తమను కైంకర్యమున    నిమగ్నము చేయుమని అభ్యర్థిస్తున్నారు.

అంతిమంగా పెరియవాచ్చాన్ పిళ్ళై, తిరుమాలై మరియు తిరుపళ్ళియెళిచ్చి యందున్న వ్యత్యాసమును విశదపరచుచున్నారు.

 • తిరుమాలై లో – పెరుమాళ్ తాను ఆళ్వార్ (అనాదిగా సంసారమున ఉన్న) ను అఙ్ఞానము నుండి మేల్కొలిపారు. ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి) ఆళ్వార్ తాను పెరుమాళ్(ఆళ్వార్ యందున్న ప్రేమతో అన్నీ మైమరచిపోయిన) ను మేల్కొలుపుచున్నారు.
 • తిరుమాలై లో – ఆళ్వార్ వాచిక కైంకర్యమును కీర్తించారు(45-పున్ కవిదైయేలుమ్ ఎంబిరార్కు ఇనియవాఱే) గానము ద్వారా ,మాటలాడుట ద్వారా కైంకర్యము, ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి)- కాయిక కైంకర్యమును కీర్తించారు(10- తొడైయొత్త తుళవముం కూడైయుమ్ పొలిన్దు తోన్ఱియ తోళ్) శరీరముచే కైంకర్యము- అనగా వనమును ఏర్పరుచుట మాలలను కట్టుట వంటివి).
 • తిరుమాలై లో ఎంపెరుమాన్ కు ప్రీతి కల్గించు కైంకర్యమును స్వీకరించారు.(45-ఎంబిరార్కు ఇనియవాఱే).ఇక్కడ,(తిరుపళ్ళియెళిచ్చి) భాగవతులకు ప్రియమైన కైంకర్యమును ఒసగమని ప్రార్థించారు(అడియార్కు ఆట్పడుత్తాయ్)
 • తిరుమాలై లో- ఎంపెరుమాన్ ప్రయత్నములు ప్రథానమైనవి(ఆళ్వార్ ను సంస్కరించుటకు).ఇక్కడ (తిరుపళ్ళియెళిచ్చి)ఆ ప్రయత్నపు ఫలితములు ప్రతిఫలించుట ప్రథానమనది.
 • తిరుమాలై లో- ఆళ్వార్ , ఎంపెరుమాన్ ను తనను అంగీకరించి ఆశీర్వదించమన్నారు(ఎళియదోర్ అరుళుమన్ఱే ఎన్ తిఱత్తు).   ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి) పరిణితి ఙ్ఞానముచే ఎంపెరుమాన్ ను కీర్తించుట(9-అవర్కు నాలోలక్కమరుళ)

పెరియవాచ్చాన్ పిళ్ళై  దివ్యప్రబంధ అవతారిక పరిచయం ముగిసినది.

అడియేన్ నల్లా శశిధర్  రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-introduction-avatharikai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి తనియన్లు

Published by:

vyuhavasudevan                                                                       వ్యూహవాసుదేవుడు

తిరుమలై ఆండాన్ చే కృపచేయబడ్డ తనియన్

తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్ |
ప్రాబోధికీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంతమీడే ||

ప్రతిపదార్థం 

యః -ఎవరైతే (ఆళ్వార్)

రాజవత్ – రాజువలె

అర్హణీయమ్- ఆరాధింప తగిన 

రంగేశయం – శ్రీరంగమున ఆదిశేషుని పై పవళించిన పెరియపెరుమాళ్ 

తం పరవాసుదేవం ఏవ- తమరే పరవాసుదేవులు (శ్రీవైకుంఠములోని) 

మత్వా – భావించి

ప్రాబోధికీం – ప్రాభోధమున(ప్రాతః  కాలమున) మేల్గాంచునది  

సూక్తిమాలాం- సూక్తుల మాల(దండ)

ఆకృత- పరమ కృపతో అనుగ్రహించిన

తం -అలాంటి
భగవంతం – ఙ్ఞానాది ఆరు కల్యాణ గుణములను కలిగి ఉన్న

భక్తాంఘ్రిరేణుం- తొండరడిపొడి ఆళ్వార్  ను

మీడే- కీర్తిస్తున్నాను

సంక్షిప్త అనువాదం

ఙ్ఞానాది ఆరు కల్యాణగుణములను కలిగి, పరమకృపతో అనుగ్రహించిన  సూక్తుల పూమాలతో శ్రీవైకుంఠములోని పరవాసుదేవుని వలె శ్రీరంగమున ఆదిశేషుని పై పవళించిన పెరియపెరుమాళ్  ను తమ ప్రాభోధకీయముతో మేల్కొలిపిన  తొండరడిపొడి ఆళ్వార్  ను కీర్తిస్తున్నాను.

పిళ్ళైలోకాచార్యుల వ్యాఖ్యానములోని విశేషములు:

 • రాజవదర్హణీయమ్- సమస్త భరతఖండమునకు చక్రవర్తియై ,ఏ ఆక్షేపణాదోషం లేని దశరథ తనయుడైన శ్రీరాముని వరకు ఆరాధింపబడ్డ శ్రీరంగనాథుడు(ఇక్ష్వాకు వంశస్థుల కులదైవం అయిన) పెరియపెరుమాళ్  గా సమస్తులందరికి రాజాధిరాజుగా వ్యవహరింపబడుచున్నారు.   
 • రంగేశయం – అర్చావతార ఎంపెరుమాన్ వైభవం పూర్తిగా విదితమే-  దివ్యరూపాలను, సకల గుణములను కలిగి  పరమపదము నుండి అవతరించిన  రూపం.  ఈ అర్చావతారమున  సౌలభ్యం ప్రకటింప బడుతుంది. పరవాసుదేవుని  వలె కాక  అర్చావతారం అందరిచేత సులభంగా పొందదగినది.  
 • పరవాసుదేవం-  శ్రీరంగనాథుడు ద్వాదశాక్షరిచేత (వాసుదేవ మంత్రం) తమ తిరువారాధనలో ఆరాధింపబడుచున్నాడు. ఇక్కడ వాసుదేవ నామం  తెలుపబడింది. ఎంపెరుమాన్ యొక్క నాలుగు వ్యూహరూపములలో వాసుదేవ నామం మొదటిది.  క్షీరాబ్ధి నాథుడు-  పాలకడలిలో శయనించి   సదా జీవాత్మ ఉజ్జీవనమునకై చింతించు  సౌహార్ధ గుణముచే ప్రకాశించురూపం. శ్రీరంగనాథుడు కూడ ఇదే కార్యమును చేస్తున్నాడు-తాను శ్రీరంగమున పవళించి ఈ సంసారమున కొట్టుమిట్టాడుతున్న జీవాత్మ ఉజ్జీవనమునకై చింతిస్తున్నాడు.
 • చివరగా తొండరడిపొడి ఆళ్వార్  ఙ్ఞాన వైరాగ్య భూషణులుగా మరియు తిరుపళ్ళి యెళిచ్చి అను అద్భుతమైన  పాశుర మాలికను అనుగ్రహించిన ఉపకారకునిగా  కీర్తింపబడుచున్నారు. 

తిరువరంగపెరుమాళ్ అరైయర్ కృపచేసిన తనియన్

మణ్డంగుడియెంబర్ మామఱైయోర్

మన్నియశీర్ త్తొండరడిపొడి త్తొన్నగరం

వండు తిణర్ త్త వయల్  తెన్న రంగత్తమ్మానై

పళ్ళి ఉణర్తుం పిరాన్  ఉదిత్తఊర్

ప్రతిపదార్థం

వండు- తుమ్మెదలు

తిణర్ త్త -(అన్యోన్యతతో) సమీపమున నివసిస్తున్న

వయల్ –  సారవంతమైన నేలలో పచ్చికబయళ్ళ తో చుట్టబడి ఉన్న

తెన్న – అందమైన
రంగత్తు- శ్రీరంగమున(పవళించిన)

అమ్మానై- పెరియపెరుమాళ్
పళ్ళి ఉణర్తుం – అతనిని మేల్కొలుపుట
పిరాన్- ఉపకారకుడు
తొండరడిపొడి- తొండరడిపొడి అను  నామధేయంగల ఆళ్వార్
ఉదిత్తఊర్- అవతార స్థలం
శీర్ మన్నియ -వైభవం గల
మణ్డంగుడి – తిరుమణ్డంగుడి
త్తొళ్ నగరం- ప్రాచీన నగరం
యెంబర్  మామఱైయోర్- వేదములో నిష్ణతులగు పండితులు గల

సంక్షిప్త అనువాదం 
వేదములో ప్రావీణ్యం గల మహానుభావులు నివసిస్తున్న, పరస్పరం అతి అన్యోన్యత తో నివసిస్తున్న తుమ్మెదలుతో, సారవంతమైన నేలలో పచ్చికబయళ్ళ తో చుట్టబడి ఉన్న, శ్రీరంగమున పవళించిన పెరియపెరుమాళ్ కు మేల్కొలుపును కృపచేసిన  , మహిమాన్విత వైభవం కల ఆళ్వార్ అగు తొండరడిపొడిఆళ్వార్ అవతారస్థలం తిరుమణ్డంగుడి.

పిళ్ళైలోకం జీయర్ వ్యాఖ్యనంలోని విశేషములు

 •  ఎంపెరుమాన్ కు ప్రియమైనటువంటి తిరుకణ్ణంగుడి, కురుంగుడి, పుళ్ళంభూతంగుడి వంటి  దివ్యదేశముల వలె మణ్డంగుడి కూడ అతి వైభవం కలదిగా వర్ణించబడుతుంది ఇక్కడ. నమ్మాళ్వార్ అవతార స్థలమగు ఆళ్వార్ తిరునగరి తో సరిపోల్చతగినది ఈ మణ్డంగుడి.
 • విరివిగా అనేక తుమ్మెదలు సంచరించుట ప్రకృతి సౌందర్యమునకు ప్రతీక. శ్రీరంగం కూడ  అత్యంత సుందరప్రదేశముగా దాదాపు అన్నీ ప్రబంధములలో వర్ణించబడినది.
 • విశేష వివరణ- తొండరడిపొడిఆళ్వార్ స్వయంగా శ్రీరంగం కూడా విరివిగా తుమ్మెదలు సంచరించు ప్రకృతి సౌందర్యం గల వనములను కలిగి ఉన్నదని తమ తిరుమాలై ప్రబంధమున ప్రశంసించారు.
 • కేవలం ఎంపెరుమాన్ ను మేల్కొలపడమే కాక, మనం కూడ పాడి తరించుటకు మనలను ఈ  తిరుపళ్ళి యెళిచ్చి ప్రబంధము ద్వారా అనుగ్రహించుట అను గొప్ప ఉపకారం చేసినారు.
 • తూర్పున సూర్యోదయముతో అంధకారము తొలగినటుల, తిరుమణ్ణంగుడిలో ఆళ్వార్ అవతారం వలన అఙ్ఞుల అఙ్ఞానం తొలగిపోవును.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezuchchi-thaniyans/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి

Published by:

తొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) కృపచేసిన తిరుప్పళ్ళి యెళిచ్చి దివ్యప్రబంధమునకు ఉద్దేశ్యం/లక్ష్యం  శ్రీరంగనాథుడు

periyaperumal  పెరియపెరుమాళ్ (శ్రీరంగనాథుడు)శ్రీరంగం

thondaradipodi-azhwar-mandangudiతొండరడిపొడిఆళ్వార్ (భక్తాంఘ్రి రేణు) – తిరుమణ్ణంగుడి

ఆచార్యహృదయమునందు విశేషంగా  85వ చూర్ణికలో అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  సుప్రభాతం(తమ దివ్యగానంతో మేల్కొలుపుట) తో ఎంపెరుమాన్ ను మేల్కొలుపు  మహాత్ములని వర్ణించారు.ఎంపెరుమాన్ కు కీర్తనా కైంకర్యము చేయడంలో  నంపాడువాన్(తిరుక్కురుంగుడి మలైమేల్ నంబికి పరమభక్తుడు ) యొక్క వైభవమును కీర్తిస్తు వీరిని విశ్వామిత్రునితో , పెరియాళ్వార్ తో మరియు తొండరడిపొడి ఆళ్వార్ తో పోల్చారు (ఎంపెరుమాన్ కు తులసి కైంకర్యము చేయడానికి తులసి వనాలను ఏర్పాటు చేయువాడు).నాయనార్ యొక్క  విలువైన పదాలను మామునులు వెలికి తీశారు.

విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ‘కౌసల్యా సుప్రజారామా’ (శ్రీరామాయణం, బాలకాండ 23.2)అనే ప్రఖ్యాతిగాంచిన శ్లోకముతో మేల్కొలిపారు.ఇది అందరికి విదితమే.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్||

కౌసల్యకు ప్రియపుత్రుడవైన ఓ శ్రీరామ! తెల్లవారినది . ఓ నరశార్దూల! మేల్కొనుము, పవిత్రమైన ఉదయ సంధ్యా కార్యక్రమములో నిమగ్నుడవు కమ్ము.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి2.2.1లో కణ్ణన్ ఎంపెరుమాన్ ను ఇలా మేల్కొలుపుచున్నారు.

ఆదిశేషునిపై పవళించిఉండే ఈ గోపాల బాలుడా! లెమ్ము, ఆరగించుటకు సిద్ధముకమ్ము

అరవణైయాయ్ ఆయర్ ఏరే ! అమ్మం ఉణ్ణత్తుయిల్ ఎళాయే…

తొండరడిపొడి ఆళ్వార్  చే కృపచేయబడి శ్రీరంగనాథుణ్ణి మేల్కొలుపు ఈ ప్రబంధమునకు తిరుపళ్ళి యెళ్ళిచ్చి అని పేరు.

తొండరడిపొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపైనే తమ దృష్ఠిని కేంద్రీకరించి వనమును ఏర్పరచి పూమాలలను సమర్పించేవారు.తిరుపళ్ళి యెళ్ళిచ్చి పై రెండు వ్యాఖ్యానాలు ఉపలబ్దమగుచున్నవి.

మొదటిది నంజీయర్ చే కృపచేయబడింది, తరువాతది పిళ్ళైలోకాచార్యులచే కృపచేయబడింది.

 

nanjeeyar నంజీయర్

periyavachan-pillai పిళ్ళైలోకాచార్యులు – తిరుశఙ్గనల్లూరు

తనియన్ల కు పిళ్ళైలోకం జీయర్ వ్యాఖ్యానాన్ని అందించారు.

pillailokam-jeeyarపిళ్ళైలోకం జీయర్

పుత్తూర్ కృష్ణస్వామి అయ్యంగార్  ఉపలబ్దమగుచున్న వ్యాఖ్యానాలకు విస్తృతమైన వివరణను తమ దివ్యప్రబంధ  వ్యాఖ్యానమున ప్రకటించారు.  ఎంపెరుమాన్, ఆళ్వార్లుల, ఆచార్యుల మరియు అస్మదాచార్యుల కృపా కటాక్షముచే ఈ ఈ వ్యాఖ్యానాలను మనం అనుభవిద్దాం.

 

Puttur-Swami

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయం (లక్ష్యం) – http://koyil.org
ప్రమాణం(scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాతpramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org