శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
తిరుమంగై ఆళ్వార్లు ఈ సంసారములోని సుఖ: దుఖ:ములను చూసి విరక్తి చెందారు. పెరియ తిరుమొళిలో, అనేక దివ్య దేశములను వర్ణించారు. అది చూసి ఈయన శ్రీవైకుంఠమునే మరచిపోయారని భగవంతుడే ఆశ్చర్య పోయి ఈ సంసారము యొక్క స్వరూపమును చూపారు.
పెరియ తిరుమొళిలో ఆఖరి దశకము “మాఱ్ఱముళ”లో ఆళ్వార్లు ఈ సంసారములో ఉండటము నిప్పులలో ఉన్నట్లు అని పాడారు. ఆ దుఖ:మును తొలగించుకోవటానికి తిరుక్కుఱుంతాణ్డగమును పాడారు.
అందులోని “వాక్కినాల్ కరుమం తన్నాల్(4)” లో ఈ సంసారము మీద వైరాగ్యముతో, త్రికరణ శుద్దిగా భగవంతుడిని శరణాగతి చేశారు.
భగవంతుడు ఆళ్వార్లను ఈ సంసారములోని దుఖ:మును తొలగడానికి తన నుండి ఏమి ఆశిస్తున్నారని అడిగారు. ఈ సంసారము యొక్క రుచి వాసనలున్నా అవి తనను భగవదనుభవమునకు దూరము చేస్తున్నాయి. అందువలన రుచి వాసనలతో సహా తొలగించి దీని నుండి తనను బయట పడేయాలని అడిగారు ఆళ్వార్లు. సమస్త పదార్థములు నీచే సృష్టించబడి, రక్షింప బడుతున్నాయి. అందువలన నీవు తప్ప మాకు రక్షకులు ఇంకెవరూ లేరు. నన్ను నేను రక్షించుకోగలిగితే నేను శ్రీవైకుంఠమునకు ఎప్పుడో చేరుకునేవాడిని కదా! నీవు మాస్వామివి అన్నారు. ఆళ్వార్లందరూ ఈ విషయాన్నే చెప్పారు, తమను ఆయన సొత్తుగా అంగీకరించారు. తిరువాయిమొళి 5-8-3 లో “ఉన్నాలల్లాల్ యావరాలుం ఒన్ఱుం కుఱై వేణ్డేన్ ” (నీ వలన కాక పోతే ఇంకెవరి వల్ల అవుతుంది) అన్నారు నమ్మాళ్వార్లు. అలాగే ఇక్కడ తిరుమంగై ఆళ్వార్లు తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు. ఈ ప్రబంధములో ఈ విషయమునే పాడారు. నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమొళి 5వ దశకములో తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు.
కోమళవల్లి సమేత ఆరావముదన్ , తిరుక్కుడందై.
కుమదవల్లి నాచ్చియార్ సమేత తిరుమంగై ఆళ్వార్, ఆళ్వార్ తిరువారాధన పెరుమాళ్- శిన్దనైక్కినియ పెరుమాళ్(నీల వర్ణ వస్త్రం ఉన్న వారు)
రెండవ అవతారిక వ్యాఖ్యానము:
పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధమునకు కాలక్షేపము పూర్తి చేసిన తరువాత శ్రీవైష్ణవులు కొందరు అక్కడికి వచ్చారు. వారి ప్రార్థన మేరకు కృపతో ఆచార్యులు మళ్ళీ కాలక్షేపము చేసారు. పెరియవాచ్చాన్ పిళ్ళై ఆచార్యులైన నంపిళ్ళై గారికి కూడా తిరువాయిమొళికి, ఈడు36000 పడికి కాలక్షేపము చేసిన సమయములో, ఇలాగే మూడు సార్లు జరిగింది. అందువలననే ఈడు 36000లో శ్రీయ:పతి పడి’ మూడు సార్లు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.
తమస్సుచే ఆవరింపబడి, నామ రూపములు లేకుండా, ఙ్ఞాన శూన్యులుగా, అచిత్తులా పడి వున్న జీవులకు నువ్వు కృపతో నామ రూపములనిచ్చి, ఙ్ఞానము నిచ్చి, మాకు , నీకు వున్న సంబంధమును నిరూపించావు అని తిరువెళుకూఱ్ఱిరుక్కై రెండవ అవతారికలో పెరియవాచ్చాన్ పిళ్ళై చెపుతున్నారు.
ఆళవందార్ తమ స్తోత్ర రత్నము(10)లో, ‘అమూని భువనాని భవిధుం నాలం’ (ఈ సమస్త భువనములు నీవు లేనిదే సృజింపబడేవి కావు. సమస్తము నీ ఆధీనములోనిదే కాని వేరు కాదు) అన్నారు.
అదే అర్థములో నమ్మాళ్వార్లు (తిరువాయిమొళి 1.1.6) లో, “నిన్ఱనర్ ఇరుందనర్ … నిన్ఱిలర్ ఇరుందిలర్” అన్నారు.
పొయిగై ఆళ్వార్లు ముదల్ తిరువందాది (60)లో, “చరణామఱై పయంద” (చతుర్ముఖ బ్రహ్మతో సహా చిత్, అచిత్ పదార్థములన్నీ తమ రక్షణ కోసము చక్రధారివైన నిన్నే ఆశ్రయిస్తారు. ఈ సంసారము నుండి తమను తాము రక్షించుకోలేరు) అన్నారు.
అలాగే నమ్మాళ్వార్లు https://guruparamparaitelugu.wordpress.com/2013/09/11/nammazhwar/(తిరువాయిమొళి 10.10.6)లో, “ఉణ్దిత్తాయి ఇని ఉణ్డొళియాయ్ “(నీలో నుంచి సృజించావు. మరి మళ్ళి నిలో చేర్చుకో) అన్నారు.
వశిష్ట, విశ్వామిత్రుల వంటి ఙ్ఞాన సంపన్నులుండగా రక్షించేవారు లేరని ఎలా చెపుతునారని భగవంతుడు అడిగాడు.
దానికి, ఆళ్వార్లు “నైవ కించిత్ పరోక్షం తే ప్రత్యక్షోసి న కస్యచిత్ | నైవ కించిద సిధ్ధం తే న చ సిధ్ధోసి కస్యచిత్” (జితంతే 1-6), నీకు తెలియనిదేది లేదు. నిన్ను తెలిసిన వారు లేరు. నువ్వు నీ కృపచే తప్ప ఎవరి స్వయం కృషితోను పొందగలిగిన వాడవు కాదు.) అన్నారు. గుడ్డి వాడు చూపు వున్న వడి సహాయము లేనిదే నడవలేడు. అలాగే ఎంతటి ఙ్ఞాన, బల, శక్తి వంతులైనా నీ కృప లేనిదే నిన్ను పొందలేరు.
తమరిచ్చిన ఙ్ఞాన, బల, శక్తులున్నా,నీ కృప లేనిదే నేను శ్రీవైకుంఠము చేరగలనా? అనడిగారు ఆళ్వార్లు. (భగవంతుడు ఆలస్యము చేస్తున్నాడని కాదు , పసి బిడ్డ తల్లి కనపడక పోతే ఏడ్చి సాధించినట్లు ఆళ్వార్లు కూడా ఈ సంసారము నుండి బయట పడవేయమని విన్నవించుకుంటున్నారు).
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి
Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/thiruvezhukurrirukkai-introduction/
archived in http://divyaprabandham.koyil.org
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org