Author Archives: sankeerth

శ్రీ దేవరాజ అష్టకమ్ – శ్లోకములు

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ దేవరాజ అష్టకమ్

<< తనియన్లు

thirukkachi-nambi-kanchi varadhar-3

శ్లోకము 1

నమస్తే హస్తభి శైలేష  శ్రీమన్! అమ్భోజలోచన ! |
శరణమ్ త్వమ్ ప్రపన్నోస్మి ప్రణతార్తి హరాచ్యుత !  ||

శ్రోతవ్యం

హే హస్తిగిరినాథ !శ్రీ పతి! అరవిన్ద లోచన! మీకు సాశ్టాన్గములు సమర్పణము చేయుచుంటిమి, హే దేవరాజ మిమ్ము కొలిచెడు భక్తులన్డరి ఆర్తులను, కష్టములను మీరు తొలగిస్తారు. దాసులను యెన్నడు విడువక వారిని ఎల్లప్పుడూ కాపాడే  వారు మీరు ,అచ్యుతులు. మిమ్ములనే సదా సర్వదా ఆశ్రియిన్చుకొని వుంటాను.

శ్లోకము 2

సమస్త ప్రాణి సన్త్రాణ ప్రవీణ కరుణోల్బణ ! |
విలసన్తు కటాక్శాస్తే మయ్యస్మిన్ జగతామ్పతే ||

శ్రోతవ్యం

సర్వ జగత్ రక్షకా! పరమ కారుణ్య స్వరూపుడా, సమస్త లోకములను కాపాడేవాడా,  మీ దయ కిరణములు నాపైన కూడా ప్రసరింప చేయండి.

.

శ్లోకము 3

నిన్దితాచార కరణమ్ నివృత్తమ్ కృత్య కర్మణ~: |
పాపీయామ్సమ్ అమర్యాదమ్ పాహిమామ్ వరద ప్రభో ! ||

శ్రోతవ్యం

హే దేవరాజా! సద్గుణ సమ్పన్నులగు పరమ పురుషులు చేయకూడని పాప కార్యములనీ నిత్యము చేయుచు, ధర్మ కార్యములను ఆచరించ కుండా, సకల పాపములలొ మునిగి వున్న , క్రమశిక్షణా రహితులైన యట్టి మమ్ములను మీరే రక్షించవలెను.

శ్లోకము 4

సంసార మరుకాన్తారే ధుర్వ్యాధి వ్యాగ్ర భిషనే |
విషయ క్షుద్ర గుల్మాద్యే త్రుశా పాతపసాలిని ||

శ్రోతవ్యం

శ్లోకము 5

పుత్ర ధార గృహ క్షేత్ర మృగ త్రుశ్న్మ్బు పుశ్కలే |
కృత్యా కృత్య వివేకాన్తమ్ పరిభ్రాన్తమ్ ఇతస్ తత: ||

శ్రోతవ్యం

శ్లోకము 6

అజస్రమ్ జాత త్రుశ్నార్తమ్ అవసన్నాన్గమక్షమమ్ |
క్షీణ శక్తి బల ఆరోగ్యమ్ కేవలమ్ క్లేశ సమ్స్రయమ్ ||

శ్రోతవ్యం

శ్లోకము 7

సన్తప్తమ్ వివిధైర్ ధు~:కై~: ధుర్వచైర్ ఏవమాధిభి: |
దేవరాజ!దయాసిన్ధో! దేవ దేవ జగత్పతే! ||

శ్రోతవ్యం

శ్లోకము 8

త్వదీక్షన సుధాసింధు వీచి విక్షేపసీకరై: |
కారుణ్య మారుతానీతై~: సీతలైరభిశిన్చమామ్ ||

శ్రోతవ్యం

4-8 శ్లోకములలో నమ్బిగారు వారి పరిస్తితులను ఒక రూపకన్గా మార్చి దేవరాజ పెరుమాళ్ ను కాపాడమని వేడుకుంటునారు. ఈ జీవితమనే యెడారిలో రోగములు అనేవి భయంకర క్రూరమగు పులులు మరియు లౌకికమైన చిన్నఆశలు  చిన్న చిన్న పొడలు, కోరికలనెడి [వృక్షములు] చెట్లు. భార్యా పిల్లలు గృహము ఆస్తులు అనేవి ఎండమావులు. ఇట్టి యెడారిలొ పిచ్చి [మతిభ్రమిన్చిన] వాడివలె యెది చెయ్యవలెనో మరియు యెది చెయ్యకూడతో తెలియక సంచరిన్చుతున్నాను, ఆచరించ కూడని పనులను ఆచరిస్తు మరియు ఆచరించ వలసిన పనులని ఆచరిమ్పక వుంటిని, మనోబలమ్, దేహబలమ్, బుద్ధిబలమ్ లేక వుంటిని, మీ పట్ల భక్తి లేక వుంటిని, హే దేవరాజ ¡ కరుణాసాగరా ¡ దేవాదిదేవా¡ మీ అవదులులేని శీతలమగు కరుణామ్రుత కటాక్ష విక్షణములచేత నన్ను రక్షించండి, మీ అవదులులేని కారుణ్య  సమ్భరితమగు కటాక్షవిక్షనములకై యాచించుతున్నాను.

అడియేన్ సన్కీర్త్ రామానుజ దాసన్

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/12/sri-dhevaraja-ashtakam-slokams/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

శ్రీ దేవరాజ అష్టకమ్ – తనియన్లు

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ దేవరాజ అష్టకమ్

thyaga-mandapam

శ్రీమత్ కంచి మునిమ్ వందే  కమలాపతి ననధనమ్ |
వరధాన్గ్రి సదా సన్గ రసాయన పరాయణమ్ ||

శ్రోతవ్యం

శ్రీ  కమలపతి పుత్రులు, మరియును నిరతము వరదరాజ శ్రీ చరణములను ఆశ్రయున్చుకొని వుండి వాటి అమృతముతో కలిసి మమెకమైనట్టి శ్రీ తిరుక్కచ్చి నమ్బి స్వామి యొక్క శ్రీ చరణాలకు ప్రణామములు.

 

దేవరాజ దయా పాత్రమ్ శ్రీ కంచి పూర్ణ మ్ ఉత్తమమ్ |
రామానుజ మునిర్ మాన్యమ్ వందే హమ్ సజ్జనాశ్రయమ్ ||

శ్రోతవ్యం

శ్రీ  వరదరాజ పెరుమాళ్ యొక్క కృపకు పాత్రులు, శ్రీ రామానుజులకు గౌరవనియులై, మంచి మనుషులకు ఆశ్రితులైనటు వంటి వారైన శ్రీ తిరుక్కచ్చి నమ్బి స్వామి శ్రీ చరణాలకు ప్రణామములు.

అడియేన్ సన్కీర్త్ రామానుజ దాసన్

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/12/sri-dhevaraja-ashtakam-thaniyans/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

శ్రీ దేవరాజ అష్టకమ్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

dhevaperumal-nachiyars-perundhevi-thayarశ్రీ పెరుందేవి తాయర్ , శ్రీ భు సమేత వరదరాజ (పెరరుళాలన్) పెరుమాళ్, కంచిపురమ్

thirukkachi-nambi-kanchiతిరుక్కచ్చి నంబి – కంచిపురమ్

Audio

శ్రీ తిరుక్కచ్చి నంబి స్వామి అనుగ్రహించిన దేవరాజాష్టకమ్ అనే 8 శ్లోకములుగల ఈ దివ్య కావ్యమ్ లో శ్రీ కంచి మహాలక్ష్మి పెరుందేవి తాయర్ పతియగు శ్రీ దేవరాజ {వరదరాజ} పెరుమాళ్ వైభవమును లోకాన చాటుచున్నారు.

న్యాయ విద్వాన్ దామల్ వన్గీపురమ్ శ్రీ ఉ.వే.పార్థసారతి ఐయ్యంగార్  ఈ ప్రబంధమునకు సరలమగు తమిళ అనువాదమును చేసినారు, ఈ అనువాదమునకు తెలుగులో ప్రతిఅనువాదమును ఇక్కడ చూడవచ్చును.

క్రింది భాగములలో ఈ గ్రంథమును చూడవచ్చును:

అడియేన్ సన్కీర్త్ రామనుజ దాసన్

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/12/sri-dhevaraja-ashtakam/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org