Author Archives: indumathi

ఉత్తర దినచర్య శ్లోకం 6 – ఉన్మీల

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 4 & 5

శ్లోకం 6

శ్లోకము

“ ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతితల ముపరి క్షీరసంగాత గౌరం

రాగ చంద్ర ప్రకాశ ప్రచురనఖమణి ద్యోత విద్యోత మానమ్ !

అజ్ఞుల్యగ్రేషు కిఞ్చిత్ నతమతి మృదులం రమ్యజామాతృయోగీ

దివ్యం తత్పాదయుగ్మం దిశతు శిరసి మే దేశికేంద్రో దయాళుః !!

ప్రతిపదార్థము :

దయాళుః = కరుణ పొంగు గుణము కలవారైన

దేశికేంద్రః = ఆచార్యులలో ఉన్నతులైన

రమ్యజామాతృయోగీ = రమ్యమైన దేహసౌందర్యముకలిగివున్న అళగీయ మణవాళ మామునులు

ఉన్మీల గర్భ ద్యుతితలం = అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మములోపల ఉండే లేత ఎరుపురంగు వంటి కాంతితో నిండిన అరిపాదాలు

ముపరి = పాద పైభాగంలో

క్షీర సంగాత గౌరం = చిక్కటి పాల వంటి కాంతితో కూడిన రంగులో

రాగ చంద్రప్రకాశ ప్రచుర నఖమణి ద్యోత విద్యోత మానం = పున్నమి నాటి చంద్రకాంతిని పోలిప్రకాశిస్తున్న నఖములు

అజ్ఞుల్యగ్రేషు = నఖములు అంచులు

కిఞ్చిత్ నతం = కొద్దిగా వంగి వుండి

అతి మృదులం = చాలా మృదువుగా

దివ్యం = అప్రాకృతమైన

తత్ = ఉన్నతమైన

పాదయుగ్మం = పదముల జంట

మే శిరసి = దాసుడి తలపై

దిశతు = ఉంచి అనుగ్రహించాలి

భావము:

ప్రస్తుత శ్లోకము నుండి వరుసగా ఆరుశ్లోకములు శిష్యులు స్తోత్రం చేస్తున్నట్లుగా అమరి ఉన్నవి. ఈ శ్లోకములో ఒక శిష్యుడు తన తలకు ఆభరణంగా మామునుల శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించాలని కోరుతున్నాడు.

దయాళుః…….దయను చూపడం అనేది వారికి సహజ సిద్దమైన గుణము.  శిష్యులు సేవచేస్తే వారిమీద దయ చూపించే సామాన్య గురువులలా కాక ఎటువంటి సేవలను ఆశించకుండా నిర్హేతుకంగా కృపను చూపేవారని చెపుతున్నారు.

దిశతి ఉపతి శతి ఇతి దేశికః…… శాస్త్రార్థములను ఉపదేసించువారు, దేశికులని పిలువబడుతున్నారు.  “ దేశికానాం ఇమ్తరః దేశికేంద్రః “ ఆచార్యులైన దేశికులకు నాయకులు. ఆచార్యులైన దేశికులకు నాయకులు అంటే ఆచార్యులకు ఉండవలసిన జ్ఞానము, అనుష్టానము, దయ మొదలైన గుణ పరిపూర్ణులు, ఆచార్యులకే తల మాని కము వంటి వారు. మామునుల అరిపాదాలు తామర వంటి ఎరుపు రంగులో ఉంటాయి. నఖములు అంచులలో కొద్దిగా వంగి పౌర్ణమి వెన్నెల వెలుగును పోలిన రంగులో ఉంటాయి. వారి శ్రీపాదాలు మొత్తం మెత్తగా, పాలవంటి తెలుపు రంగును కలిగి ఉంటాయి.  మామునులు ఆదిశేష అవతారము కావున అప్రాకృతములు (పరమపదములో మాత్రమే ఉండే ఉన్నత పదార్థము.) అంటారు. ఈ లోకంలో ఉండే సంసారుల పాదాలలాగా సామాన్యమైనవికావు.  అందుకే వారి పాదాలను “ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతి “ తో పోల్చారు. ఇతర పోలికలు కూడా ఉత్తమ పురుషుడికి ఉండవలసిన వాటినే చెప్పారు. భగవద్భక్తులైన ఆళ్వార్లు ‘నిన్ శేమ్మా పాదపర్బుదం తలై సేర్తు‘ అని పరమాత్మను ప్రార్థించారు. అలాగే ఆచార్యులపై అపారమైన భక్తి గల శిష్యులు ఒకరు ‘పాదయుగ్మం దిశతు శిరసి మే’ అంతటి ఉన్నతమైన పాదాలను తన శిరస్సు మీద ఉంచి అనుగ్రహించ వలసిందిగా ఆచార్యులైన మామునులను ప్రార్థిస్తున్నారు. ‘తమరి శ్రీపాదాలను నా శిరసు మీద పెట్టండి‘ అని అనకుండా ’దాసుడి శిరసు మీద తమరి శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించండి’ అని ప్రార్థన చేస్తున్నారు.

ఈ విషయాన్నీ ముందు ముందు వచ్చే శ్లోకాలలో వివరంగా చూడవచ్చు.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-tamil-6/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 32 – తతః శ్శుభాశ్రయే

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 31

శ్లోకం 32

తతః  శ్శుభాశ్రయే తస్మిన్ నిమగ్నం నిభృతం మనః ।

యతీంద్ర ప్రవణం కర్తుం యతమానం నమామి తం ।।

ప్రతి పదార్థము:

తతః = యోగమైన భగధ్యానమును చేసిన తరువాత

తస్మిన్ = మునుపు చెప్పిన విధముగా

శ్శుభాశ్రయే = యోగులచే ధ్యానింప బడు పరమాత్మ విషయములో

నిమగ్నం = నిమగ్నమైన

నిభృతం = నిశ్చలమైన

మనః! = మనస్సుతో

యతీంద్రప్రవణం = యతీంద్రులని పిలివబడే శ్రీమద్రామానుజా చార్యుల విషయములో ప్రవణులుగా

కర్తుం = చేయుటకు

యతమానం = ప్రయత్నము చేయుచున్న

తం = ఆ మామునులను

నమామి -నమస్కరిస్తున్నాను

భావము:

ఇక్కడ ‘ యతీంద్రప్రవణం కర్తుం ‘ అనునది ‘ యతీంద్రప్రవణమేవ కర్తుం ‘ అని అర్థము. 16వ  శ్లోకములో ‘ యతీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేనైవ చేతసా ‘ అని చెప్పారు. అనగా శ్రీమద్రామానుజాచార్యుల శ్రీచరణములను మనస్సులో నిలుపుకొని భవదాభిగమనము మొదలైన అనుష్ఠానములన్నీ చేసినట్లుగా చెప్పారు. అర్థాత్..మామునులు తమ ఆచార్యులను,వారికి ఇష్ఠమైన పరమాత్మను తమ మనస్సులో నిలుపుకున్నావారై ,క్రమముగా తమ ఆచార్యులైన శ్రీమద్రామానుజాచార్యులను మాత్రమే మనస్సులో నిలుపుకునుటకే అని చెప్పుతున్నారు. ధ్యానము చేయువారి హేయమైన దు:ఖమును పోగొట్టునది, వారి మనసును తనయందే లగ్నము చేయ గలది అయిన పరమాత్మ దివ్యమంగల విగ్రహము  ‘ శుభాశ్రయము ‘ అని చెప్పుతున్నారు.

ఎఱుంబిఅప్పా దీని వలన మామునుల యతీంద్రప్రవణతను (చరమ పర్వ నిష్ఠను )అనుసంధానము చేసి వారికి దాసోహములు సమర్పించిన తమకు కూడా చరమ పర్వ నిష్ఠ సిధ్ధిస్తుందని ‘ యతీంద్రప్రవణం కర్తుం యతమానం నమామి తం! ‘  వ్యక్త పరుస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-32/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 31 – అబ్జాసనస్థ

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 30

శ్లోకం 31

అబ్జాసనస్థ మవదాత సుజాతమూర్తిం

ఆమీలితాక్ష మనుసమ్హిత మంత్రతంత్రం ।

ఆనమ్రమౌళిభి రూపసిత మంతరంగైః

నిత్యం మునిం వరవరం నిభృతో భజామి ।।

ప్రతి పదార్థము:

అబ్జాసనస్థం = పద్మాసనములో వేచేంసి వున్న వారై

అవదాతసుజాతమూర్తిం = స్వచ్చమైన పాలవంటి తెల్లని మేని చ్చాయ గలవారై

ఆమీలితాక్షం = పరమాత్మ స్వరూపాన్నే నిరంతరం ధ్యానించుట వలన ఆమీలిత నేత్రములను కలిగి వున్న వారై

అనుసమ్హిత మంత్రతంత్రం = రహస్య మంత్రములలో రత్నము వంటి ద్వయమును కలిగియున్నవారై

ఆనమ్రమౌళిభిః = నమ్రత చేత శిరసు వంచిన వారైన

అంతరంగైః = కొయిల్ అణ్ణన్, ప్రతివాది భయంకరం అణ్ణా మొదలైన అంతరంగ శిష్యులుచే

ఉపాసితం = నిరంతరము సేవింపబడు వారైన

వరవర మునిం = వరవర మునులు

నిభృతో = ఆశక్తి గలవాడనై

నిత్యం భజామి = నిత్యము సేవిస్తాను

భావము:

అందమైన,అధికముగా గాలివీచని చదునైన ,శుభ్రమైన స్థలములో ముందుగా పీఠమును వేసి దానిపై ధర్భలను పరచి, ఆపై మౌంజీ పరచి ,దానిపై శుభ్ర వస్తమును పరచి ఆసనమును సిధ్ధము చేయాలి.ఆ ఆసనముపై స్థిర చిత్తముతో,పద్మాసనములో కూర్చున్న వాడై యోగాభ్యాసము చేయాలని విశ్వామిత్రుడు చెప్పిన విధముగా మామునులు ఇక్కద కూర్చున్నారు.  ఇరు నేత్రాలను కొద్దిగా తెరచి ముక్కు అంచునే చూస్తూ యోగాభ్యాసము చేయాలని శాస్త్రములో చెప్పిన విషముగా మామునులు అర్థ నిమీలిత నేత్రాలతో కూర్చొని వున్నారు.సదా శ్రీమహా విష్ణువు ధ్యానములో ఉండుట చేత ఆ ఆనందానుభవము వలన కనుల నుండి ఆనంద భాష్పాలు రాలుతుండగా, శరీరము పులకరించి, గగర్పాటు కలిగి రోమములు నిక్కబొడుచుకొనుట చేత యోగి అయిన మామునులు అందరికీ దర్శనీయుడు అని ఎఱుంబిఅప్పా వర్ణిస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-31/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 30 – తతః

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 29

శ్లోకం 30

తతఃశ్చేత స్సమాధాయ పురుషే పుష్కరేక్షణే ।

ఉత్తంసిత్  కరద్వందం ఉపవిష్ఠముపహ్వరే ।।

ప్రతిపదార్థము:

తతః = సాపాటు తరువాత

పుష్కరేక్షణే = తామరకన్నులవారైన

పురుషే = పరమ పురుషుడైన శ్రీరంగనాథుని వద్ద

శ్చేఅతః = తమ అభీష్టమును

స్సమాధ్యాయ = విన్నవించి

ఉత్తంసిత్కరద్వందం = చేతులు జోడించి నమస్కరించి

ఉపహ్వరే = ఏకాంతముగా

ఉపవిష్ఠం = పద్మాసనములో కూర్చొని వున్న మణవాళ మామునులను సేవించుకుంటున్నాను అని ఈ శ్లోకములో చెపుతున్నారు.

భావము:

తదీయారధన తరువాత భగవధ్యానము చేయాలని శాస్త్రము తెలుపుతున్నది.  యోగము ఆరాధాన వంటిది.  మూడు వేళల తప్పక చేయ వలసినది అని చెపుతున్నారు.. యోగులు తమ హృదయములో వేంచేసి వున్న పరమాత్మను , చంచలము లేని నిశ్చల మనసుతో ధ్యానించుటే యోగమవుతుంది.  పరమాత్మ   దేవతలు, మనుష్యులు, జంగమములు,  స్థావరములు మొదలగు సకల జీవరాసులలోను వ్యాపించివున్నాడు. ఆ స్థితినే శ్రీ మాహా విష్ణువు యొక్క అంతర్యామి స్థితి అంటారు. ఇటువంటి స్వరూపములోనే  యోగుల  హృదయములో వేంచేసి వున్నాడని పరాశరులు చెప్పారు.  యోగుల  హృదయములో వేంచేసి వున్న పరమాత్మ ,  సూర్యమండలములో ఉన్న పరమాత్మ ఒక్కరే అని తైత్తరీయోపనిషత్తులో  పేర్కొన బడింది.  సూర్యమండలములో ఉన్న పరమాత్మకు పుండరీకాక్షత్వము ఉన్నదని చాందోద్యోగము చెపుతున్నది.   అందువలననే ఇక్కడ ‘ పురుషే పుష్కరేక్షణే  ‘   యోగులైన మామునుల హృదయములో వేంచేసివున్న పరమపురుషునకు పుండరీకాక్షత్వము చెప్పబడింది. పురిసేతే—–యోగి శరీరములో వసించు వాడు అనే వ్యుత్పత్తి వలన పురుష శబ్దము పరమ పురుషుడైన విష్ణువునే సూచిస్తున్నది.  యుజి-సమాతౌ-అనే ధాతువు చేత వచ్చిన యోగ శబ్దము సమాది అవుతున్న పరమాత్మ ధ్యానమును తెలుపుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-30/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 29 – ఆరాధ్య శ్రీనిధిం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 28

శ్లోకం 29

ఆరాధ్య శ్రీనిధిం పశ్చాదనుయాగం విధాయ చ |

ప్రసాదపాత్రం మాం కృత్వా పశ్యంతం భావయామి తం ||

ప్రతి పదార్థము:

పశ్చాద్ = తరువాత (మధ్యాహ్న అనుష్ఠానానము తరువాత )

శ్రీనిధిం = శ్రీనే ధరించిన శ్రీమంతుడు (తమ ఆరాధనా మూర్తి)

ఆరాధ్య = భక్తితో

అనుయాగం = భగవంతునికి నివేదించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుటాది అనుయాగము

విధాయ =  చేసి

మాం = గతములో ఈ విషయాలలో విముఖత చూపిన దాసుడిని

ప్రసాదపాత్రం కృత్వా = తమ శేష ప్రసాదముననుగ్రహించి

పశ్యంతం = దాసుడిని కటాక్షించిన

తం = ఆ మామునులను

భావయామి = సదా స్మరిస్తాను

భావము:

ఆరాధ్య….’  యువ రాజును, మదము పట్టిన ఏనుగును,  మనకిష్టమైన అథిధులను ఎలా పూజిస్తామో అలా భగవంతుడిని పూజించాలి.  పతివ్రత తన భర్తను , స్తన్యపానముచేయు బిడ్డను ,  శిష్యుడు తమ ఆచార్యులను , మంత్రములు తెలిసిన వారు తమ మంత్రములను ఏవిధముగా  ఆదరిస్తారో ఆవిధముగా భగవంతుడిని ఆరాదించాలి’ అని శాండిల్య స్మృతిలో చెప్పబడింది.  అదే విధముగా మామునులు శ్రీరంగ నాథుని  ఆరాధించారని భావము. అనుయాగమును అనగా భగవధారాధనను అనుసరించి చేయు భగవత్ శేష ప్రసాదమును స్వీకరించుట. పరిశేషము చేసి,  ప్రాణాయ,   అపానాయ, వ్యానాయ , ఉదానాయ,  సమానాయ అని భగవంతుడి నామములను స్మరిస్తూ  ఆహుతుల రూపములో అన్నమును ఐదు మార్లు స్వీకరించి తరువాత భుజించాలి  అని భరద్వాజులు చెప్పియున్నారు.   శాండిల్యులు మన హృదయములో ఉన్న భగవంతుడిని ధ్యానము చేస్తూ తీర్థమును స్వీకరించి , తరువాత ప్రాణాయ స్వాహా..మొదలగు మంత్రములను ఉచ్చరిస్తూ అహారమును  నోటి ద్వారా హోమము చేసి అన్నములో దోషము లు చూడకుండా (ఉప్పు ఎక్కువుగా, కారం ఎక్కువగా ఉన్నదనో ) ప్రసాదముగా స్వీకరించాలని చెప్పారు.  శుధ్ద్ధమైన,  ఆరోగ్యకరమైన   ఆహారమును మితముగా స్వీకరించాలి.  అది రుచికరముగా, మనసుకు నచ్చినదై,  నేతితో శుధ్ధి చేయబడినదై కంటికింపుగా తగినంత వేడిగా ఉంటేనే  భుజించ తగినదవుతుంది.  ‘అనుయాగం విధాయచ ‘  అని వుండుట చేత మామునులు ముందు   శ్రీవైష్ణవులకు తదీయారాధన చేసిన తరువాత తాము భుజించుట గమనించ తగినది. భగవంతునికి నివేదన చేసిన తరువాత,  భగవంతుడి శేష ప్రసాదము రుచి, వాసన పెరిగి , పవిత్రమైనదై , మెత్తగా , మనో వికల్పాలను తొలగించేది అయిన ప్రసాదముతో ముందుగా శ్రీవైష్ణవులను తృప్తి పరచి,  తరువాత తాము స్వీకరించే వారని ఎరుంబియప్పా మామునుల చరిత్రలో రాసిన విషయమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.  ‘మాం ‘… దాసుడిని….అనగా ఎరుంబియప్పాను గతములో మామునులు తమ మఠములో   తదీయారాధన స్వీకరింపుమని కోరినప్పుడు,  ‘ యతి పెట్టిన అన్నము,  యతి శేషమును స్వీకరించరాదన్న సామాన్య సూత్రముననుసరించి నిరాకరించారు.  ఇప్పుడు  సద్భుధ్ధి కలుగుట వలన  అవైష్ణవ యతుల అన్నమును భుజించరాదని తెలుసుకొని మామునుల శేషమును మహా ప్రసాదముగా స్వీకరించుట  ఉన్నతముగా భావించారు.   ‘ పశ్యంతం భావయామి ‘ తమను సరిదిద్ది ఎప్పుడూ తమపై అపారమని కటాక్షమును కురిపించుచున్న మామునులను  ధ్యానిస్తున్నాను అంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-29/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 28 – తతఃస్వచారణాంభోజ

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 27

శ్లోకం 28

తతః స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః।

పావనైరర్థిన స్తీర్థైః  భావయంతం భజామి తం ।।

ప్రతిపదార్థము:

తతః = దివ్యప్రబంధ సారమును ఉపదేశించిన తరువాత

స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః = తమ శ్రీపాద పద్మ సంబంధము వలన మంచి సువాసనతో కూడిన

పావనైః = మిక్కిలి పరిశుధ్ధమైన

తీర్థైః = శ్రీపాద తీర్థమును

అర్థినః = స్వీకరించుటకు ఇవ్వమని ప్రార్థిస్తున్న శిష్యులు

భావయంతం = వర్థిల్లునట్లుగా

తం = ఆ మామునులను

భజామి = నమస్కరిస్తున్నాను

భావము:

మామునులు దివ్య ప్రబంధ సారమునుపదేశించిన తరవాత తమ శిష్యుల కోరిక మేరకు తమ శ్రీపాద తీర్థమును వారికి ఇచ్చి వారిలో సత్తను పెంపొందిస్తున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు.

రామానుజులు ఈ భువిపై వేంచేసి లేనందున వారి ఉపకరణముగా తమను భావించిన  మామునులు రామానుజులనే మనసు నందు నిలుపుకొని శిష్యులకు  తమ శ్రీపాద తీర్థమును ఇచ్చినందున వారికి ఎటువంటి అవధ్యము లేదు. ఇక్కడ శిష్యుల కోరికే ప్రధాన కారణము. మామునుల శ్రీపాదములు , తామరల వంటివి కావున ఆ శ్రీపాద తీర్థమునకు శుచి,సువాసన సహజముగానే అబ్బినవి.’ తీర్థైః ‘ అని బహు వచనములో చెప్పుట వలన ముమ్మారు శ్రీపాద తీర్థమును అనుగ్రహించారని భోదపడుతున్నది. ఈ విషయముగా ‘ త్రిబిదేత్ ‘ ..ముమ్మారు శ్రీపాద తీర్థమును గ్రహించ వలెను ‘ అని స్మృతిలో చెప్పబడింది. కొందరు రెండు తడవలు మాత్రమే ఇస్తున్నారు. ఉచన స్మృతిలో శ్రీపాద తీర్థమును -యాగములో సోమలతా పాన సమముగా రెండు తడవలు స్వీకరించ తగినదని చెప్పుటే దీనికి ప్రమాణము.  రెండు పద్దతులు శాస్త్ర సమ్మతమే  కావున వారి వారి సంప్రదాయము ప్రకారము అనుష్ఠించుట తప్పు కాదు. భరద్వాజ సమ్హితలో శిష్యుడు ఆచార్యుని వద్ద ఉపదేశము పొందుటకు ,ఆచార్య శ్రీపాద తీర్థామును స్వీకరించుట అంగముగా చెప్పబడినది. క్రిందట శ్లోకములో దివ్యప్రబంధ సారమును ఉపదేశించుట పేర్కొన బడింది.అక్కడ ‘ నమామి ‘ అన్న వారు,ఇక్కడ శ్రీపాద తీర్థమును పొంది మనసు కరిగి ‘భజామి ‘అంటున్నారు.ఇంతకంటే శిష్యుడు చేయతగినది ఏమీ లేదు. మామునులు కోరు వారు కారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-28/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

శ్రీ వరవరముని దినచర్య – అవతారిక

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

srisailesa-thanian

వరవరముని దాసులనే పేరుతో ప్రసిద్ధి చెందిన దేవరాజగురు తమ ఆచార్యులైన మా మునుల దగ్గర నిర్విఘ్నముగా స్తోత్రము పూర్తి కావలెనని ప్రార్థిస్తున్నారు. శాస్త్రములో, ఆచార్యులను సాక్షాత్తుగా శ్రీమన్ నారాయణు అవతారముగా చెప్తారు.శిష్యుడు ఎల్లప్పుడూ ఆచార్యుని నామమును జపించాలి ధ్యానించాలి, వారి కనుచూపు మేరలో ఉండి, కైంకర్యమునకు సిద్ధముగా ఉండాలి, అచంచలమైన భక్తి తో, ఆచార్యుని ఇష్టమే తన ఇష్టంగా, ఆచార్యుని దు:ఖమే తన దు:ఖముగా ,  ఆచార్యుని పేరు, మరియు గుణములను ధ్యానించాలి, ఏ విధముగానైతే ఒక భక్తుడు తన భగవంతుని పట్ల  మరియు ఒక పనివాడు తన రాజు పట్ల ఉంటాడో , అదే విధంగా శిష్యుడు తన ఆచార్యుని పట్ల భక్తి శ్రద్ధాల తో సేవలు చేయవలెను. ఆచార్యుని శిష్యుడిగా తన అడుగుజాడలలో ఉండి, వారి యొక్క  గుణముల ధ్యనించుతూ, అందిరికి వారి గురించి ప్రభోదించుట లో గర్వముచెందవలెను.ఎఱుంబిఅప్పా శిష్యుని లక్షణము పరిపూర్ణముగా ఎరుగుదురు. శతకం, కావ్యం, చంబు మరియు మామునిగళ్ పై రాసిన అనేక గ్రంథముల తో వారికి సంతృప్తి కలుగలేదు. శాస్త్రము లో ఆచార్యుని దినచర్యను వివరించాలని చెప్పబడినది. ఆచార్యుని భక్తి తో పాటు శాస్త్రము లో విశ్వాసము ఉన్నఎఱుంబిఅప్పా మామునిగళ్ యొక్క దినచర్యను ఆరంభించి, అది నిర్విఘ్నముగా పూర్తికావలెనని విన్నవించుకుంటున్నారు.

ఎవరైతే వారి యొక్క ఉపస్థితి వలన గోష్ఠిని పునిదము చేస్తారో, అటువంటి మామునిగళ్  యొక్క జ్ఞానమును, వారి దినచర్యను మరియు భౌతిక విషయముల పట్ల వారికి గల విరక్తిని తెలియజేస్తుంది. తదియారదను జరుగు సమయములో , ప్రసాదము స్వీకరించు ముందు, సత్వ గుణము అభ్యసించు శ్రీ వైష్ణవులను శుద్ధి చేస్తుంది.తదియారదను జరుగు సమయములో , ఎవరైనా తక్కువ జ్ఞానముతో మరియు తక్కువ అనుష్టానం ఉన్నా , వారు ఆ ప్రదేశమును ఆపవిత్రగావిన్తురు. మామునులు , పవిత్ర పరుచుటకు ప్రసిద్ధి చెందినవారు . అందువలనే, ఈ స్తోత్రమును “పంక్తిపావనం” అనగా గోష్ఠి ని పావనం చేసేది అని కూడా అంటారు.

అడియేన్ ఇందుమతి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/sri-varavaramuni-dinacharya-tamil-introduction/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org