తిరువెళుకూట్ఱిరుక్కై 5వ భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << 4వ భాగము 1-2]3-4-5-6[-5-4-3-2-1 ముత్తు ణై నాన్మరై వేళ్వి అఱు తొళిల్  అన్దణర్ వణంగుం తన్మయై ప్రతిపదార్ధము :  అన్దణర్ వణంగుం తన్మైయై –బ్రాహ్మణులచే పూజింపబడువాడు  ముత్తీ – త్రై అగ్నులు  (మూడు విధము లైన అగ్నులు)మరియు నాల్ మఱై – నాలుగు రకములైన  వేదములు మరియు ఐవగై వేళ్వి – ఐదు విధములైన  యఙ్ఞములు మరియు అఱు తొళిల్ – ఆరు విధములైన కర్మలు. … Read more

తిరువెళుకూట్ఱిరుక్కై 4వ భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << 3వ భాగము 1-2-3]4-5-4-3-2-1[1-2 నాల్ దిశై నడుంగ అంజిఱై ప్పఱవై ఏఱి నాల్వాయ్  ముమ్మతత్తు ఇరుశెవి యొరుతని వేళత్తు అరందైయై ఒరునాళ్ ఇరునీర్ మడువుళ్ తీర్తనై ప్రతిపదార్థము  ఒరునాళ్ – ఒకానొకప్పుడు  నాల్ దిశై నడుంగ – నాలుగు దిక్కులు వణికిపోగ అంజిఱై  ప్పఱవై ఏఱి – అందమైన పక్షిని ఎక్కి(గరుడవాహనము నెక్కి) ఇరునీర్ మడువుళ్ – లోతుగా నీరుగల మడుగులో … Read more

తిరువెళుకూట్ఱిరుక్కై 3వ భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << 2వ భాగము (1-2-)3-4-3-2-1-(1-2-3) మూవడి నానిలం వేణ్డి ముప్పురి నూలొడు మానురి ఇలంగు మార్వినిల్ ఇరు పిఱప్పు ఒరు మాణ్ ఆగి ఒరు ముఱై ఈరడి మూవులగు అళందనై ప్రతిపదార్థము:  ఒరు ముఱై – ఒకానొకప్పుడు  ముప్పురి నూలొడు – యఙ్ఞోపవీతముతో  మానురి – జింక చర్మము ఇలంగు మార్వినిల్ – హృదయము మీద అలంకరించిన  ఇరు పిఱప్పు ఒరు మాణ్ … Read more

తిరువెళుకూట్ఱిరుక్కై – 2వ భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << 1వ భాగము ఈ రెండవ భాగములో రైతు తన చేనులోని కలుపును తీసినట్లు భగవంతుడు తాను సృజించిన లోకములను పాడు చేస్తున్న రాక్షసులను తొలగించాడని ఆళ్వార్లు పాడుతున్నారు.  1-2-3-2-1 (1-2) ఒరు ముఱై ఇరు శుడర్ మీదినిల్ ఇయఙ్గా ముమ్మతిళ్ ఇలంగై ఇరుకాల్ వళైయ ఒరు శిలై ఒన్ఱియ ఈర్ ఎయుత్తు అళల్వాయ్ వాలియిన్ అట్టనై ప్రతిపదార్థము: ఇరు శుడర్ – … Read more

తిరువెళుక్కూట్ఱిరుక్కై 1వ భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << అవతారిక అవతారికలో తెలిపినట్లుగా ఈ ప్రబంధములో ఆళ్వార్లు తమ ఆకించన్యమును,  అశక్తతను తెలియజేసుకుంటున్నారు.  అదే సమయములో పరమాత్మ సర్వ శక్తతను తెలియజేస్తున్నారు.తమను  ఈ సంసారము  నుండి బయట  పడవేయమని   తిరుక్కుడందై ఆరావముదుడిని శరణాగతి చేస్తున్నారు. 1-2-1(ఈ అంకెలు రథము ఆకారములో అమరుటకు పాశురములో ప్రయోగించబడినవి) ఒరు పేరుంది ఇరు మలర్ తవిసిల్   ఒరు ముఱై అయనై ఈన్ఱనై ప్రతిపదార్థము: ఇరు – పెద్ద … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – 9 – మిక్క వేదియర్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 8 పాశుర అవతారిక: వేదములో చెప్పబడిన   భాగవతశేషత్వము యొక్క సారమును తిరువాయిమొళి 3.7 “పయిలుం శుడరొళి” లోను,  తిరువాయిమొళి  8.10 “నెడుమాఱ్కడిమై” దశకములలోను స్పష్టముగా చెప్పారు.  ఆ విషయమును   ఈ   పాశురములో  మధురకవి  ఆళ్వార్లు  పాడుతున్నారని  నంజీయర్ల అభిప్రాయము. నమ్మాళ్వార్ల  కరుణ ఎలాంటిదని    మధురకవి   ఆళ్వార్లను అడిగితే,   ఎంపెరుమాన్ తిరువాయిమొళి 3.3.4లో చెప్పినట్లుగా  “నీశనేన్ నిఱై ఒన్ఱుం ఇలేన్, … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – 8 – అరుళ్ కొణ్డాడుం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 7 గీతాచార్య – నమ్మాళ్wఆర్ అవతారిక: నంజీయర్   అభిప్రాయము : వేదమును అనుగ్రహించి  చేతనులకు  చేసిన  భగవంతుని కృప  కంటే  తిరువాయ్ మొళిని అనుగ్రహించిన నమ్మాళ్వార్లు కృప  గొప్పదని  మధురకవులు  ఈ  పాశురములో  పాడుతున్నారని నంజీయర్ల అభిప్రాయము. నంపిళ్ళై మధురకవులు ఈ పాశురములో   “నమ్మాళ్వార్ల కీర్తిని పాడుతాను”   అని అంటున్నారని  నంపిళ్ళై మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ఎత్తి చూపుతున్నారు, ఎందుకనగా నమ్మాళ్వార్ల … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 6 అవతారిక: నంజీయర్  అభిప్రాయము : మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృప వలన తనకున్న అవరోధాలన్నింటిని  తొలగించి అనుగ్రహించారని  ఈ పాశురములో  పాడుతున్నారని  నంజీయర్  అభిప్రాయ  పడుతున్నారు. నంపిళ్ళై అభిప్రాయము: నమ్మాళ్వార్ల  నిర్హేతుక కృపను  చేతనులందరూ  పాడుతూ  తమ కష్టాలను పోగొట్టుకోవలని  మధురకవి  ఆళ్వార్లు ఈ  పాశురములో పాడుతున్నారు. పెరియవాచ్చాన్  పిళ్ళై అభిప్రాయము : మధురకవి ఆళ్వార్లను … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 5 అవతారిక: మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల కృపను  మీరు ఎలా సాధించ గలిగారని అడగగా, నమ్మాళ్వార్ తిరువాయిమొళి 4.5.3 “వీవిల్ కాలం ఇసై మాలైగళ్ ఏత్తి మేవప్ పెఱ్ఱేన్”(ఇప్పటి నుండి ఎల్లప్పుడు భగవంతుని కీర్తించు భాగ్యమును పొందాను)  అని నమ్మాళ్వార్లు  చెప్పినట్లుగా, దాసుడు  పొందగలిగాడని    మధురకవి ఆళ్వార్  అంటున్నారని నంజీయర్ భావన. మధురకవి ఆళ్వార్లను ‘ అనాది కాలముగా … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు – 5 – నంబినేన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 4 అవతారిక: మధురకవి ఆళ్వార్లు కిందటి పాశురములో చెప్పుకున్న లోపాలను ఈ పాశురములో వివరిస్తున్నారని నంజీయరు అభిప్రాయ పడుతున్నారు. అవి ఏమిటంటే  ఇతరుల భార్యలను, సంపదను కోరుతున్నాను, కాని నమ్మాళ్వార్ల నిర్హేతుకమైన కృప వలన నేను సంస్కరింపబడ్డాను. వారి అపారమైన కరుణకు సదా కృతఙుడనై ఉంటాను అని మధురకవి ఆళ్వార్లు చెప్పుకున్నారు. నంపిళ్ళై మరియు  పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ … Read more