Author Archives: chudamani chakravarthy

పూర్వ దినచర్య – శ్లోకం 10 – స్వయమానముఖాంభోజం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 10

స్వయమానముఖాంభోజం ద్వమానదృగంచలం!

మయి ప్రసాద ప్రవణం మధురోదారభాషణం!!

ప్రతి పదార్థము:

స్వయమానముఖాంభోజం = ఎల్లప్పుడు వికసించిన తామర వంటి చిరునవ్వుతో విలసిల్లే వారు

ద్వమానదృగంచలం = కరుణ పొంగు కన్నులు గల వారు

మయి = ఇంత కాలము వారికి ముఖము చాటేసిన దాసుడిపై

ప్రసాద ప్రవణం = కృపచూప చూపుటలో సిద్దహస్తులు

మధురోదారభాషణం = మధురమైన ఉదార భాషణము చేయ గల వారు

భావము:

అధరములో నిలిచిన మందహాసముతోను, కృపను వర్షించు కడగంటి చూపుతోను, వాటికి తగ్గ అమృత వాక్కులతోను ఒప్పుతున్న మామునుల స్వరూపము…వారు తమపై కురిపించు అనుగ్రహమును ఈ శ్లోకములో వర్ణించారు. మామునులు సదా ద్వయార్థమును ఉపదేశించుట వలన తమకు మోక్షలాభము తప్పక సిద్దిస్తుందని,తమ కోరిక నెరవేరుతున్నదని,  మందహాసమును వెలయించు చున్నారని భావము.

అంతే కాక ఈ మందహాసమును, పైన పేర్కొన్న మధురమైన ఉదార భాషణమునకు కూడా పూర్వాంగముగా చెప్పవచ్చును. సంతోషమును మందహాసముతో ప్రకటించాక కదా మధుర భాషణము చేస్తారు. దయతో ఇతరుల ధుఃఖమునకు కరుగుట, ‘మనము ద్వాయార్థము తెలుసుకోవటము వలన పొందే సంతోషము ఇంకా వీరికి లభించలేదే ,అయ్యో వీరింకా ఈ సంసారములో పడి కొట్టుకుంటున్నారు కదా!’ లోకుల ధుఃఖమును చూసి మామునులు విచారిస్తున్నారు. ఇదీకాక,దయతో ,సంతోషముతో కదా అచార్యులు శిష్యులతో మధుర సంభాషణము చేసేది.. ఈ దయ, సంతోషము ముఖ్యమైన గుణములు కదా! ‘సత్యం శుద్ది, దయ, మనసు సంచలించకుండుట, ఓర్పు,సంతోషము అనే సుగుణాలే అందరూ చేపట్టవలసిన లక్షణములు అని భరద్వాజ పరిశిష్ట వచనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి..’మయి ప్రసాద ప్రవణం ‘ అన్న ప్రయోగానికి …దాసుడిపై కృప చూపుటలో శ్రద్ద గల వారని చెపుతున్నారు.అర్థాత్ దాసుడు గతములో వారి పట్ల విముఖుడైనప్పటికీ ,ఆ మనః క్లేశమును తొలగించి ,తేట పరచి,కృపను చూపుతున్నారని అర్థము. మాట మధురముగా, అర్థగాంభీర్యముతోను ఉండవలెను అని మేదాది, అర్థగాంభీర్యముతో ఉండవలెనని శాండిల్యుడు పేర్కొన్న విషయము ఇక్కడ గ్రహించ తగినది. ఇక్కడ అర్థగాంభీర్యము అంటే ద్వయార్థ సంబంధమని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-10/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 9 – మంత్ర

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 9

మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం!

తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం!!

 

 ప్రతి పదార్థము:

మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం—– మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును నిరంతరము అనుసంధానము చేస్తూ వుండటము వలన మెల్లగా కదులుతున్న పెదవులు గల వారు….

తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం—–ఆ  ద్వయ మంత్రములోని అర్థమును స్మరిస్తూ వుండటము చేత పులకించి పోయిన శరీరము…….

భావము:

ఈ శ్లోకములో అధర సౌందర్యమును చెపుతున్నారు. “శ్రీమన్నరాయాణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణయ నమఃఅ ” అన్నది ద్వయ మంత్రము. అష్టాషరి కంటే ఉన్నతమైనదవుట చేత ఈ మంత్రమును మంత్ర రత్నమని ప్రసిధ్ధి చెందింది.  గుహ్యములలో(రహస్యములు)  పరమ గుహ్యము ఈ మంత్రము. సంసార సాగరమును దాటించేది. సమస్త పాపములను పోగొట్టగలది. అష్టాక్షరి మంత్రములోని అనుమానాలన్నింటిని పోగొట్ట గలది. ఈ శరణాగతి మంత్రము సకల సంపదలను , సుఖములను ఇవ్వగలది  అని పరాశరులు నారదుడికి ఉపదేశించారు. అనుసంధానమంటే మెల్లగా తనకు మాత్రమే వినపడే టట్లు ఉచ్చరించి రక్షించటము అని శాస్త్రము చెపుతున్నది.

ద్వయమును అర్థానుసంధానము చేయకుండా కేవలము మూలమును మాత్రమే అనుసంధానము చేయటము ఉత్తమ అధికారి లక్షణము కాదు . మామునులు  అర్థానుసంధానము చేస్తున్నారని తెలుపుతున్నారు.   ద్వయము యొక్క అర్థము పిరాట్టి పురుషకారము. వాశ్చల్యాది గుణములు, ఆగుణములతో కూడిన సిధ్ధోపాయమైన  శ్రీమన్నారయణుని , ఆయన తిరుమేనిని,  శ్రీచరణములను శరణాగతి చేయుట.

నిధన్యాన—  నితరం ధన్యానం అంగా భావనాప్రకర్షమనబడే నిరంతర ధ్యానం దానినే ” తైల ధారావత్ ” అంటారు. దీని వలన భగవద్భక్తులకు ఆశ్చర్యము వలన, సంతౌషము వలన మేనిలో గుగుర్పాటు కలుగటము సహజము. మామునులకు ఆ  గుగుర్పాటు కలిగిందని ఈ శ్లోకములో చెపుతున్నారు. ద్వయమును, దాని అర్థమును  అనుసంధానము చేయటమే ప్రపత్తి.  ప్రపత్తి ఒక్క సారే చేయవలసి వుండటముచేత  ఒక సారి చేసిన తరవాత ఆపకుండా నిరంతరము అనుసంధానము చేస్తున్నారని అర్థము. అది సాధ్యమా అన్న శంక కలగ వచ్చు. మోక్షార్థియై ఒక్క సారి ప్రపత్తి  చేసినా, సత్కాలక్షేపము కోసము, భగవత్ గుణాలను అనుభవించి ఆనందించటము కోసము  నిరంతరము అనుసంధానము చేయటము జరుగుతుంది.

“తత్త్ర తత్వ నిత్యానం” అన్న్ పదానికి మరొక అర్థము కూడా చెపుతారు.

” విష్ణుః శేషీ తదీయః సుభగుణ నిలయో విగ్రః శ్రీశఠారిః శ్రీమన్రామానుజార్య పదకమలయుగం భాతి రమ్యం తధీయం !

తస్మిన్ రామానుజార్యే గురురితి చ పదం భాతి నాన్యత్ర తస్మాత్,శేషం శ్రీమత్ గురూనాం కుల మితమఖిలం తస్య నాధస్య శేషః!!

( విష్ణువు  శేషి  అర్థాత్ మనము చేయు కైకర్యములను స్వీకరించి సంతోషించే నాయకుడు. సుగుణాల రాశి అయిన ఆయన తిరుమేని శ్రీ శఠారి అనబడే నమ్మళ్వారులు. శ్రీ శఠారి  శ్రీపాదములుగా శ్రీమన్రామానుజాచార్యులు, గురుః అనే పదము శ్రీమన్రామానుజాచార్యుల విషయములో సంపూర్ణమై వెలుగుతున్నది. మరెవరి విషయములోను ఆ సంపూర్తి గోచరించదు. కావున వారి కంటే ముందు ఉన్న ఆచార్యులు, వెనక వున్న ఆచార్యులు వారికే శేషము అవుతున్నారు.) అని పెరియ వాచ్చన్ పిళ్ళై చెప్పియున్నారు.  భగవద్రామానుజులే ద్వయములోని శ్రీమన్నారయణ శరణౌ  అనే శరణ శబ్దార్థము. అదియే ” తత్త్ర తత్వం ”  అర్థాత్ శ్రీమన్నారయణుని చరణములు వారివి కావు. మరి ఎవరివంటే భగవద్రామానుజులవి ద్వయములోని అంతరార్థము. యతీంద్ర ప్రవణులైన (భగవద్రామానుజుల భక్తులు) మామునులకు భగవద్రామానుజులనే  శ్రీమన్నారయణుని చరణములను  నిరంతరము ధ్యానించుటే కర్తవ్యము కావున ఈ ద్వయమునకే ఉన్నతమైనదని ఎరుంబియప్పా అభిప్రాయము. ద్వయార్థ తత్వ ధ్యానము వలన గుగురుపాటు పొందిన తమరినే కన్నార్ప కుండ సేవించుటను, (12వ శ్లోకము) అనటము వలన విష్ణు తత్వ గ్రంధములో చెప్పిన విధముగా నిరంతరము భగవంతుడి గునణములనే స్మరిస్తూ ,వాటిచే ఆవేశించబడి,  దానివలన గుగురుపాటు పొంది ఆనంద పరవశములో కన్నీరు కార్చు భక్తుని ఈ భూమి మీద జన్మనెత్తిన వారు చూసి తరించాలి అని చెప్పినట్లుగా మామునులను ఆనంద పరవశముతో ఎరుంబియప్పా సేవించుకుంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-9/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 8 – కాశ్మీర

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

8- వ శ్లోకము

కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా!

కౌసేయేన సమింధానం స్కంధ మూలావలంబిన !!

ప్రతిపదార్థము:

కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా—కుంకుమపూవుల రంగులో ప్రకాశిస్తున్న

స్కంధ మూలావలంబిన —- భుజముల మీద ధరించివున్న

కౌసేయేన —– పట్టు వస్త్రమును ధరించిన

సమింధానం——- గొప్పగా ప్రకాశిస్తున్న

భావము:

ఈ శ్లోకములో ఊర్ధ్వపుండ్రములను ధరించిన భుజములను దానిపై ఉన్న పట్టువస్త్రమును  వర్ణిస్తున్నారు. పట్టువస్త్రమును  ఉత్తరీయముగా ధరిచిన అందమును ఇక్కడ చెప్పుతున్నారు.  బ్రహ్మచారి,గృహస్తు, వానప్రస్తుడు. సన్యాసి అనే నాలుగు ఆశ్రమములలో బ్రాహ్మణులు  పట్టు వస్త్రమును ధరించుట విధాయకము. పరాశరులు, బ్రాహ్మణులు    యఙోపవీతమును,  ఊర్ధ్వపుండ్రమును, శిఖను,తామరతూడుల మాలను, పట్టు వస్త్రమును ధరించాలని చెప్పారు. ఈ ప్రకరణములో సన్యాసి ఉత్తరీయము ధరించరాధని చెప్పింది , అవైష్ణవులకు విధించబదినది. వైష్ణవ  సన్యాసులు  పట్టు వస్త్రమును ఉత్తరీయముగా ధరించటము  విధాయకము.  ఈ శ్లోకములో మామునులు వీధిలో నడచి వస్తున్న సందర్భములో చెప్పబడింది కాబట్టి భుజముల మీద  ఉత్తరీయమును ధరించటము దోషము కాదు. ప్రదక్షిణము చేయునపుడు, దాసొహములు సమర్పించునపుడు, దేవ పూజ చేయునప్పుడు,   హోమము చేయునపుడు, పరమాత్మను, ఆచార్యులను సేవించునపుడు భుజముల మీద  ఉత్తరీయమును ధరించటము దోషము అని శాండిల్యుడు నిర్ణయించి వున్నారు . పైగా వీరు ధరించి వున్న ఉత్తరీయము కాషాయ రంగులో వున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-8/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 7 – అంభోజ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 7

అంభోజ బీజ మాలాభిః అభిజాత భుజాంతరం!

ఊర్ధ్వ పుడ్రైః ఉపశ్లిష్టం ఉచిత స్థాన లక్షణైః!

ప్రతి పదార్థము:

అంభోజ బీజ మాలాభిః = తామర్ పూసలచే చేయబడ్డ మాలలతో

అభిజాత భుజాంతరం = అలంకరింప బడిన భుజములు, ఉన్నతమైన  హృదయ పీఠము గలవారు

ఉచిత స్థాన లక్షణైః = శాస్త్ర యుక్తమైన అవయవ సౌందర్యమును కలిగి యున్న

ఊర్ధ్వ పుండ్రైః = ఊర్ధ్వ  పుండ్రములతోను

ఉపశ్లిష్టం = అలరారుచున్న వారైన

 

భావము:

ఉన్నతమైన  హృదయ పీఠము , యఙ్ఞోపవీతమును, నాభిని మొదలగు వానిని వర్ణించిన తరవాత హృదయ పీఠమునలంకరించిన  తామర పూసలచే చేయబడ్డ మాలలతో అలరారుతున్న అందమును, ఊర్ధ్వ  పుండ్రముల శోభను వర్ణిస్తున్నారు. విష్ణు నామమును గాని, విష్ణు  భక్తుల నామమును గాని ధరించాలని భరధ్వాజమునులు చెప్పియున్నారు. అలాగే పరాశరులు  యఙ్ఞోపవీతమును, శిఖను, ఊర్ధ్వ  పుండ్రములనుతామర పూసల మాలలను, ధరించాలని , బ్రాహ్మణులు  పట్టు వస్త్రమును,యతులు కాషాయమును ధరించాలని చెప్పిన మాటలను మామునులు అనుసంధానము చేసినట్లు వర్ణించారు.  బ్రహ్మపురాణ వచనము ననుసరించి తామర మాలలు,తులసి మాలలు , పట్టుతో చేయబడిన వివిధ రంగుల పవిత్రములు ధరించారని  మాలాభిః అన్న బహు వచనము చేత అర్థమవుతున్నది.

శ్రీ పంచారాత్ర పరాశర సంహిత,బ్రాహ్మణులు  తిరుమణ్ కాప్పు ఎట్లు  ధరించ వలనో ఈ విధంగా చెప్పు చున్నది : ముక్కు చివరి లో ఒక అంగుళం రేఖ దిద్ది మరియు నుదిటి మధ్య భాగము నుంచి ఇరు వైపుల ఒకటిన్నర అంగుళము వదిలి ఒక అంగుళం రేఖ గీయ వలెను. తిరుమణ్ ముక్కు నుని నుండి మొదలు పెట్టి  నుదిటి పైన వరకు పెట్టుకోవలనేని పద్మ పురాణము సూచిస్తుంది. కను బొమ్మల మధ్య నుండి రేఖల మధ్య రెండు అంగుళములు  స్థలము వదిలి ఒక అంగుళము వెడల్పు తో  రెండు రేఖలు గీయ వలెను. విష్ణు క్షేత్ర లో నుండి మట్టి తీసుకొని , తిరుమంత్ర తో మంత్రించి , తిరుమణ్ కాప్పు ను ముఖము పై , శరీరము పై పన్నెండు చోట్ల ధరించాలి.ఎరుమ్బియప్ప తిరుమణ్ కాప్పు  అనగా శ్రీ చూర్ణం  కూడా సూచిస్తున్నారు.  శ్రీ దేవి కి అత్యంత ప్రియమైన పసుపు తో  శ్రీ చూర్ణమును చేసి తిరు మణ్ గుర్తుల మధ్య దరించ వలెను.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-7/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 6 – మృణాళ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 6

మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా!

శోభితం యఙ్ఞసూత్రేణ నాభి బింబ సనాబినా!

 ప్రతి పదార్థము:

మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! _ తామర తూడులోని పోగుల వంటి మేని ఛాయ గల విగ్రహమును

నాభి బింబ సనాభినా! _ గుండ్రని నాభి దేశముతోనూ

యఙ్ఞసూత్రేణ _  యఙ్ఞోపవీతము తోనూ

శోభితం  _  శోభించు చుండు

భావము:

ఎఱుంబిఅప్పా  ఈ శ్లోకములో హృదయ సీమనలంకరించిన యఙ్ఞోపవీతము   శోభను వర్ణించుచున్నారు. కొంగొత్త తెల్లని దారములతో  చక్కగా నిర్మింపబడిన  యఙ్ఞోపవీతమునే ధరించాలని చెప్పిన దత్తాత్రేయుని వాక్యమును ఇక్కడ స్మరించుకోవాలి.  సన్యాసులు ఎప్పుడు  యఙ్ఞోపవీతము, పళ్ళు, జలము పవిత్రము తెల్లగా ఉంచుకోవాలి. ఉపవీతం, బ్రహ్మ సూత్రం,సూత్రం, యఙ్ఞోపవీతం, యఙ్ఞసూత్రం ,దేవలక్ష్యం అనే పేర్లుగల దారముల సమూహమే యఙ్ఞోపవీతము అని మహాఋషులు చెపుతారు . “యఙ్ఞసూత్రేణ ” అనటము వలన యతులకు ఒక్క  యఙ్ఞోపవీతము,  బ్రహ్మచారులకు మౌంజిసహిత ఏక  యఙ్ఞోపవీతము, గృహస్తులకు, వానప్రస్తులకు ఉత్తరీయము కోసము ధరించే  యఙ్ఞోపవీతము ఒకటి  అదనముగా చేరుతుంది అని వ్యాసుల వారు, భరద్వాజులు తెలిపియున్నారు. ఇక్కడ వీరు సన్యాసి కావున ఏక  యఙ్ఞోపవీతమును ధరించారు. అది నాభి   దాకా ఉండి  శోభిల్లుతున్నదని చెపుతున్నారు.   యఙ్ఞోపవీతము నాభికి పైన ఉంటే ఆయుః క్షీణము ,   నాభికి కింద ఉంటే తపో క్షీణము అందువలన నాభి వరకు ఉండటము విశేషమని  ఋషి వాక్యము  అని చెపుతారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-6/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 5 – ఆంలాన

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 5

ఆంలాన కోమలాకారం ఆతామ్ర విమలాంభరం!

ఆపీన విపులోరస్కం ఆజానుభుజ భూషణం!!

ప్రతి పదార్థము:

ఆంలాన కొమలాకారమ్ – ముడుచుకోని పుష్పము వలె వారి దివ్య మంగళ విగ్రహం ఉన్నది

ఆతామ్ర విమలాంభరం_ పరిశుద్దమైన కాషాయ వస్త్రమును ధరించిన వారు

ఆపీన విపులోరస్కం _ ఉన్నతమైన వక్షస్థలము గల వారు

ఆజానుభుజ భూషణం_ ఆజాను బాహువులు కల వారు

భావము:

ఎఱుంబిఅప్పా శ్రీపాదముల అందమును అనుభవించిన తరవాత దేహ సౌందర్యమును, సన్యాసారమానికి తగ్గ కాషాయ వస్త్రము యొక్క అందమును అనుభవిస్తున్నారు.  ఆంలానః  _ ఇది అడవి చెట్టే అయినా మిగిలిన అడవి చెట్ల కంటే మృధువుగా వుంటుందట. కిందటి శ్లోకములో చూపిన విధముగా శ్రీపాదములే కాక తిరు మేని ఆసాంతము మృధువుగా వున్నదని చెప్పటం జరిగింది. వీరు సాక్షాత్తు అనంతావతారము కదా! సన్యాసులకుచితమైన కాషాయ వస్త్రమునకు ఆ రంగు కాషాయ రాళ్ళతో చేసిన నీటిలో ముంచటము వలన వచ్చింది.  కాషాయ వస్త్రము తెల్లని దేహ సౌదర్యమును ఇనుమడింప చేస్తున్నది.(పపాగ)  అది ఎలా వుందంటే పాలకడలిలో ఉన్న పగడపుచెట్టులాగా వున్నది. (ఆపీన విపులోరస్కం ) ఎగు భుజములు ఉత్తమ పురుష లక్షణము. (ఆజాను భూషణం) జానువుల దాకా అంటే మోకాళ్ళ దాకా ఉన్న చేతులు దేహ శోభను పెంచటమే కాక ఉత్తమ లక్షణము కూడా.  శిష్యుల చేతులు పట్టుకొని నడవడానికి అనువుగా వుంటుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-5/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 4 – పార్శ్వతః

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 4

పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియై!

విన్యస్యంతం శనైరంగ్రీ మృదులౌ  మేధినీతలే!!

ప్రతి పదార్థము:

పార్శ్వతః = రెండువైపులా

భవత్ = తమరి

ప్రియై = ప్రీతి పాత్రులైన కొయిల్ అణ్ణన్ గారిని, వారి తమ్ములను

పాణిపద్మాభ్యాం = తామర పూల వంటి చేతులతో

పరిగృహ్య = బాగుగా పట్టుకొని

మృదులౌ = మృధువుగా

అంగ్రీ = పాదములను

మేధినీతలే = భూమి మీద

శనైః = మెల్ల మెల్లగా

విన్యస్యంతం = ఉంచి నడచు…..

భావము:

ఎరుంబియప్పా మామునులు తమ వద్దకు వచ్చు సౌందర్యమును ఈ శ్లోకములో వర్ణిస్తున్నారు. దీని వలన ఆచార్యులే శేషి అనే భావము, వారే ఉపాయమనే ధృఢ విశ్వాసము,ఆ ఉపాయము వలన లభించిన ఆచార్య కైంకర్యము ,ఈ మూడింటీకీ తగిన అనుష్ఠానము ఉండుట వలన  కొయిల్ అణ్ణనైన వరదనారాయణ గురువు,ఆయన తమ్ముడైన శ్రీనివాస గురువు మామునుల కృపకు పాత్రులైనారు. అందము చేత, పవిత్రత చేత మామునుల కన్నులు తామరలను పోలి వున్నాయి. పరిగృహ్య…మనసులో నిండిన ప్రేమతో మామునులు వారి చేతులను బాగుగా పట్టుకున్నారని భావము. అనగా తాను పెద్ద అనీ ,వారు చిన్న అనీ భేదభావము లేని సౌశీల్యము ప్రకటితమవుతున్నది.

రెండు చేతులతో శిష్యులను పట్టుకోవటము చేత త్రిదండమును పట్టుకోలేరు కదా! సన్యాసులు సర్వకాల సర్వావస్థలలో  త్రిదండమును  పట్టుకోవాలని శ్రీ పాంచరాత్ర తత్వసార సమహితలో ఈ విధముగా చెప్పబడింది. ‘ త్రిదండమని పేరుపడ్డ విష్ణు రూపమును  యతులు ఎప్పుడూ ధరించాలి.  శ్రీ విష్ణు సమహితలో ‘ యఙ్ఞోపవీతం,త్రిదండం,కమండలు జలపవిత్రం ,కౌపీనం…మొల త్రాడు ఆజీవనము ధరించాలని చెప్పబడింది.కాని ఙ్ఞాన పరిపుష్ఠి గల సన్యాసుల విషయములో ఎదో ఒక సందర్భములో చేతిలో త్రిదండము లేకపోవుట దోషము కాదు. ‘ ధ్యానము,మంచి ప్రవర్తన,ఙ్ఞానము మొదలైనవి ఎవరికై తే పూర్ణముగా గలదో  వారికి త్రిదండాదుల వలన కలుగు ప్రత్యేక ప్రయోజనము ఏదీలేదు అనే క్రతు వచనము గ్రహించ తగినది.కోవెలకు వెళ్ళినప్పుడు పరమాత్మకు సాష్ఠాంగ దండములు సమర్పించు సమయములో ‘ దండవత్ ప్రణామం  ‘ శరీరము మొత్తము నేలను తాకుట వలన ,చేత త్రిదండమును ధరించి సాష్ఠాంగ పడుట కష్ఠము. అందు చేత కోవెలకు వెళ్ళు  సమయములో త్రిదండము చేత ధరించకున్న దోషమేమీ లేదు. నమస్కరించునపుడు చేతిలో ఏ వస్తువును పట్టుకొని నమస్కరించ రాదు అన్న నియమమున్నందున త్రిదండమును పట్టుకొని నమస్కరించుట సాధ్యము కాదు. అందు వలన సన్యాసులు సర్వకాల సర్వాస్థలలో త్రిదండమును ధరించాలన్న నియమము కోవెలెకు వెళ్ళు సమయము తప్ప మిగిలిన కాలములో ఆచరించ దగినది.

(మేధినీతలే అంగ్రీ విన్యస్యంతం )మేధినీతలే  అనగా భూమి మీద అని అర్థము.పరమాత్మ మధుకైటబాదులను సంహరించు సమయములో వారి శరీరము నుండి మేధస్సు భూమిపై పడుట వలన భూమికి మేధినీ అన్న పేరు వచ్చింది. ఆ రోజు వారి మేధస్సు వలన అపవిత్రమైన భూమి ఈ రోజు మామునుల పాదసంబంధము చేత పవిత్రమైనది అని అంటున్నారు. నాదనై నరసింగనై నవిర్దేత్తు వార్గళిన్ ఉళక్కియ పాద దూళి పడుదలల్ ఇవ్వులగం భాగ్గియం శేయ్దదే ‘(పెరియళ్వార్ తిరుమొళి 4-46) భగవత్ భక్తుల పాద ధూళి పడుట ఈభువనము చేసిన పుణ్యమే అని పెరియాళ్వార్లు అన్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-4/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 3 – సుధానిధి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 3

సుధానిధి మివ స్వైర స్వీక్రుతో దగ్ర విగ్రహం !

ప్రసన్నార్క ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం ! !

ప్రతి పదార్థము:

స్వైర స్వీక్రుత ఉదగ్ర విగ్రహం _  తనకిష్టమైన స్వరూపమును తానే స్వీకరించిన అందమైన విగ్రహ రూపుడైన

సుధానిధి మివ (సతితం) _పాల కడలి వంటి తెల్లని వర్ణము గల వాడు

ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం _ (రెప్ప వేయ కుండా చూడవలసిన) ప్రకాశాముగాను చల్లగాను, ఉండే సూర్యుని (అటువంటి వాడొకడుంటే )వంటి కాంతి స్వరూపుడు

భావము:

శిష్యుడు ఆచార్యుని దేహమును పాదాది కేశ పర్యంతము ధ్యానించాలి అని, శిష్యుడు ఆచార్యుని దేహమునకు సేవ చేసుకోవాలి అన్న సూత్రమునకు నిరూపణగా ఇక్కడ ఆచార్యుల దేహమును వర్ణిస్తున్నారు. మామునులు తెల్లని అనంతుని అవాతరమగుట వలన  తనకిష్టమైన స్వరూపమును తానే స్వీకరించిన అందమైన విగ్రహ రూపుడుగా వర్ణింప బడ్డారు .పాల కడలి  ప్రకాశము పరిమితమైనందున   సూర్యుని  కాంతిని మామునులకు  ఉపమానముగా గ్రహించారు. సూర్యుని  కాంతి ఉగ్రముగా వుంటుంది కావున ఆదోషమును తొలగించడానికి ‘ప్రసన్న ‘  అనే విశేషణమును స్వీకరించారు. అనగా తేటగా, చల్లగా ఉండే సూర్యుడొకడుంటే ఆయన లాగా మామునులున్నారని అతిశయోక్తి అలంకారమును ప్రయోగించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-3/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 2 – మయి ప్రవిశతి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 2

మయి ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగశాయినః
పత్యుః పదాంభుజం ద్రష్ట్రుం ఆయాంతం అవిదూరతః!

అవతారిక:
మొదట మంగళాశాసనము చేసిన తరవాత తమ ఆచార్యులైన మణవాళ మామునులు తమకనుగ్రహించిన విధమును ప్రస్తుతించారు. వారి శ్రీ సూక్తులను వినుట, వారిని సేవించుట,  వారిని కీర్తించుట తమకుత్తారకములని, సంసార క్లేశములను  తొలగదోయగలవని చెప్పుకున్నారు. ఆచార్యులను వారి సమక్షములోనే  కీర్తించాలని,మామునులను స్తుతించతలచి దానిని దినచర్య రూపములో  “మయి ప్రవిశతి” అని మొదలు పట్టి “అనాస్పదం”(శ్లో – 13)అని ముగించారు.

 ప్రతి పదార్థము:

శ్రీమన్ = అపారమైన కైంకర్యశ్రీ ఉన్న మణవాళ మామునులు

రంగశాయినః =శ్రీ రంగములో శయనించి వున్న  శ్రీరంగనాధుడు

మందిరం = కోవెలలోనికి

మయి  = దాసుడు

ప్రవిశతి సతి = వెళ్ళు నప్పుడు

పత్యుః = జగత్పతి అయిన శ్రీ రంగనాథుని

పదాంభుజం = పద్మముల వంటి పదములను

ద్రష్ట్రుం  – సేవించుకోవటానికి

అవిదూరతః = దగ్గరగా

ఆయాంతం = వేంచేసి వున్న వారై( ఈ శ్లోకానికి 12వ శ్లోకములోని “త్వామేవ” అనే పదముతో అన్వయము)

భావము:

‘శ్రీమన్  అనకుండా ‘శ్రీమత్  అన్నట్లైతే మంత్ర రూపము అవుతుంది. అప్పుడు కైంకర్య మనే సంపదను పొందడానికి శ్రీరంగనాథుని కోవెల బాగా తగిన స్థలమని అర్థము వస్తుంది. మొదట్లో మామునులను సేవించు కోవాలనుకోకుండా శ్రీరంగనాథుని సేవించు కోవాలనుకొని కోవెలకు వెళ్ళగా అనుకోని విధముగా అక్కడ, దాసుడికి అతి సమీపములో మామునులు, స్వామి సన్నిధిలో సేవించుకోవటానికి వేంచేసి వున్నారు. అది దాసుడికి అయత్న లాభముగా అమరిందని చెప్పుతున్నారు. మునుపు మామునుల విషయములో కొంత పరాకు చూపిన దోషము వారి కటాక్షముతో తొలగిపోయిందని చెప్పుతున్నారు. భగవంతుడి కంటే ఆచార్యులు ఎంతో ఉన్నతమైన వారు. భగవంతుడి దర్శనము కోసము వెళ్ళినప్పుడు  ఆచార్యులు అక్కడ కనపడటము ఎలాంటిదంటే, కట్టెలు కొట్టి అవి అమ్మి బతికే వాడికి,  కట్టెలు కొట్టడానికి వెళ్ళ్గాక అక్కడ ఆయాచితముగా పెద్ద నిధి దొరికినట్లు,  అని వ్యాఖ్యాత అంటున్నారు.  రామానుజులకు చేయు  కైంకర్యమే పురుషార్థము. దానికి వారి శ్రీ పాదములే ఉపాయమని తలచిన ఆచార్య నిష్ఠులైన మామునులు కోవెలకు వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటము , పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయటము కోసమే కాని సిధ్ధోపాయమైన పెరుమాళ్ళను తమ పురుషార్థానికి ఉపాయముగా స్వీకరించడానికో, ప్రపత్తి చేయటానికో, కాదు. దేవతాంతరమును, శబ్దాది విషయములను, ఉపాయ భక్తిని ,ఉపాయమైన పెరుమాళ్ళను,సమానముగా చూసి పెరుమాళ్ళు మనకు స్వామి, (వానిని స్వయం ప్రయోజనముగా సేవించి మంగళాశాసనము చేయాలని భావించాలి)అని తలచే వారు పరమైకాంతి అని శాస్త్రాలు చెప్పుతున్నాయి. మామునులు ఆ కోవలోని వారే అని ఇక్కడ భావము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-2/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 1 – అంగే కవేర

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 1

అంగేకవేర కన్యాయః తుంగేభువన మంగళే
రంగే ధామ్నిసుఖాసీనం వందే వరవరం మునిం

$3B72773B15A9C344

ప్రతి పదార్థం:

తుంగే = ఉన్నతమైన

భువన మంగళే = సకల ప్రాణుల  మంగళములకు  కారణమైన

కవేర కన్యాయః = అక్కడ కావేరి  నదీ (నడుమ )లో ఉంటుంది

రంగే ధామ్ని = శ్రీరంగ దివ్య క్షేత్రములో

సుఖాసీనం = సుఖముగా ఆసీనమైవున్న

వరవరం = స్వరూప, ఔదార్యము,  కారుణ్యము మొదలైన వాటిలో అళగియ మణవాళ పెరుమాళ్( శ్రీరంగ నాథుడు) పోలి వున్న, అళగియ మణవాళ అనే పేరు ధరించుకున్న

మునిం = ఆచార్యులే శేషినని నిరూపించిన మణవాళమామునులు

వందే = దాసోహములు సమర్పిస్తున్నాను

భావము:

“మహి సమర్పణే”(గతౌ) ధాతు రూపములో అవతరించిన మంగళము అనే పదము గమ్యమును సూచిస్తుంది.దానికి సాధనమాన ఉపాయమును తెలుపుతుంది. “కవేర కన్యాయః అంగే”  , “రంగే ధామ్ని” అనే ప్రయోగాల కు సరిపోతుంది. ఇవి రెండు మనకు  ఉపేయమును చూపుతున్నవి మరియు మిగితా ఉపేయములకు ఉపాయముగాను చెప్పుతున్నవి అనుటలో సందేహము లేదు.

“రంగం” అనే పదము ఎమ్పెరుమానుక్కు ప్రీతి కలిగిస్తుంది .” సుఖాసీనమ్” అనుటలో మణవాళమామునుల అవతారము తరవాత శ్రీరంగమునకు మహమ్మదీయుల దండయాత్రలు కాని వేరే ఎటువంటి ఉపద్రవములు లేవు అని తెలియ జేస్తున్నది. పిళ్ళై లోకాచార్యుల, వేదాంత దేశికుల కాలములోను మహమ్మదీయుల దండయాత్రలు వుండేవి. అలా మణవాళమామునుల కాలము లో ఎటువంటి ఉపద్రవుములో లేవు.

“వది-అభివాదన స్తుత్యో” అనే ధాతు రూపములో అవతరించిన “వందే “అనే ప్రయోగముతో సాష్టాంగ నమస్కారమును, సంకీర్తనను  తెలియ జేస్తుంది. ఈ రెండు మణవాళ మామునులను గురించి కాయిక , వాచిక, మానసిక. కైంకర్యములను తెలియ జేస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/purva-dhinacharya-tamil-1/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org