Author Archives: chudamani chakravarthy

యతిరాజ వింశతి – 4

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 3

నిత్యం యతీంద్ర తవ దివ్యవపుస్సమ్రుతౌ మె సక్తం మనో భవతు   వాగ్గుణకీర్తనేస్సౌ!  
కృత్యంచ దాస్యకరణం తు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ!!

ప్రతి పదార్థము:

హే యతీంద్ర = ఓ యతిరాజా

మె = దాసుని

మనః = మనస్సు

తవ = దేవరవారి

దివ్యవపుస్సమ్రుతౌ  = దివ్య తిరుమేనిని స్మరిస్తూ

నిత్యం = ఎల్లప్పుడు

సక్తం = ఆసక్తి కలిగి

భవతు = ఉండుగాక

అస్సౌ మె వాక్ = తమ కీర్తించకుండా చాలా దూరములో ఉన్న దాసుని వాక్కు

తవ = తమరి

గుణకీర్తనె = కల్యాణ గుణములను ఇష్టముగా కీర్తించుటలో

సక్తా భవతు = ఆసక్తి కలిగి ఉండుగాక

కరద్వయస్య = కరద్వయములు

తవ = తమరికి

దాస్యకరణం తు = దాస్యము చేయుటయే

కృత్యం = కృత్యముగా

కరణత్రయం = త్రికరణములు (మనస్సు, వాక్కు,కర్మలు)

వృత్యంతరే = ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో

విముఖం చ అస్తు = విముఖలై వుండుగాక

భావము:

కింది శ్లోకములో యతిరాజుల శిష్యులైన కూరత్తళ్వాన్ మొదలైన వారి దాసులై వుండుటకై ప్రార్థన చేసారు. యతిరాజులకు దాసులవ్వాలని ఈ శ్లోకములో కోరుకుంటున్నారు.” కృత్యం చ ” అన్న చోట ” చ ” కారములో కళ్ళు, చెవులు ,మనస్సు రామానుజుల మీదే కేంద్రీకరించాలని కోరుకుంటున్నారు. శ్లోకములోని  మొదటి మూడు భాగాలలఓ త్రికరణ శుద్దిగా రామానుజులకే దాసులవ్వాలని, వారి కైంకర్యములలోనే నిమగ్నమై వుండాలని కోరుకొని నాలుగవ భాగములో ఇతరులను స్మరించుట, కొలుచుట ,కీర్తించుట ఇత్యాది విషయములలో విముఖలై వుండాలని కోరుతున్నారు. భవతు ,అస్తు అనే క్రియలు ప్రార్థనను తెలియజేస్తున్నాయి. కృత్యం అంగా తప్పని విధిని చెపుతున్నది. తవ, మె అనేవి నాలుగు భాగాలకు వర్తిస్తున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-4/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 3

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 2

azhwan-emperumanar-andan

ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ – వారి యొక్క అవతార స్థలములలో

వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం !
కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం పాదానుచింతనపరస్సతతం భవేయం !! 

ప్రతి పదార్థము:

హే యతీంద్రా = ఓ యతిరాజా

మనసా = మానసిఖముగా

వాచా = వాక్కు చేత

వపుషా చ = కర్మణా

యుష్మత్ = తమరి

పాదారవిందయుగళం = పాదారవిందములను

భజతాం = సేవించుకుంటాను

గురూణాం = అచార్యులైన

కూరాధినాథకురుకేశముఖాధ్యపుంసాం = కూరేశాదుల నుండి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొదలగు పూర్వాచార్యులను

సతతం పాదానుచింతనపరః = సతతం వారి శ్రీపాదములను చింతన చేయుటలో తరించేవాడిని

భవేయం = అవుతాను

భావము:
యతిరాజులను, వారి శిష్యులను సేవించుకోవటానికి అనుమతించ వలసినదిగా మామునులు ప్రార్థిస్తున్నారు.” కూరాధినాథ ” అంటే కూరేశులు,”కురుకేశు ” లనగా తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. వీరు రామానుజులకు మానస పుత్రులు.” ముఖ ” అంటే ఎంబార్, ముదలియాండాన్ ఇంకా ఇతర శిష్యబృందం.  “గ్రుణాంతి ఇతి గురవః ”  గురువు అన్న పదానికి ఉపదేశించు వాడు అని వ్యుత్పత్తి అర్థము. ఇంకా “గు ” అంటే అజ్ఞానము ,అంధకారము అని అర్థము. ” రు ” అంటే ఆ అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. అర్థాత్ గురువనగా ఉపదేశము చేత అజ్ఞానమును ,అంధకారమును తొలగించు వాడు. ఇది కూరేశాదులందరికి వర్తిస్తుంది.        ” పుంసాం ” – పునాంతి ఇతి పుమంసుః- అనగా పరిశుధ్ధులు అని సాధారణ అర్థము.ఇక్కడ అది భగవంతుడికి దాసులైన కూరేశాదులకు,వారి శిష్యులకు, ముఖ్యముగా ఎంబార్లకు అన్వయము.” అనుచింతన ” అనగా కూరత్తళ్వాన్ ,వారి శిష్యులు రామానుజులను వారి పతిగా తలచి ధ్యానము చేయటము. వాక్యార్థము కూరత్తళ్వాన్ ,వారి శిష్యులకు మాత్రమే వర్తించినా రామానుజులకు కూడా అనువర్తిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-3/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 2

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

 

యతిరాజ వింశతి

<< శ్లోకము 1

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం!
శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం !!
శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం!
శ్రీవత్సచిన్హశరణం యతిరాజమీడే!!

ప్రతిపదార్థము:

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం = శ్రీరంగరాజ స్వామి పాదములనే పద్మముల నీడలో ఒదిగిన రాజహంస లాంటి వారు

శ్రీమత్పరాంకుశపదాంబుజబృంగరాజం = శ్రీమత్పరాంకుశులైన నమ్మళ్వార్ల పాదములనే పద్మములలోని తేనెలను తాగుటకు ఒదిగిపోయిన తుమ్మెదల వంటి వారు

శ్రీభట్టనాథపరకాలముకాబ్జమిత్రం = శ్రీభట్టనాథులైన పెరియాళ్వార్లు , పరకాలులైన తిరుమంగై ఆళ్వార్లు ముఖకమలములను వికశింపచేయు సూర్యుని వంటి వారు

శ్రీవత్సచిన్హశరణం = శ్రీవత్సచిన్హులైన కూరత్తళ్వాన్లను  చరణములుగ కలిగియున్న వారు

యతిరాజం = యతిరాజులైన ఎంబెరుమానార్లకు

ఈడే =  నమస్కరిస్తున్నాను

భావము:

మానుష జన్మము అతి దుర్లభము అంతే త్వరగా ముగిసిపోతుంది అని శ్రీమద్భాగవతములో చెప్పబడింది. మానవ జన్మము దొరికినా వైకుంఠనాధునికి ప్రియమైన భాగవతులను చూడటము ఇంకా కష్ఠము. (శ్రీ భాగవతము 11-2-29). దీనిని బట్టి భాగవతుల సంఖ్య ఎంత తక్కువో అర్థమువుతున్నది. అలాంటి భాగవతులచే చేయబడిన యతిరాజ వింశతికి ఎంత ఔన్నత్యము ఉందో ఆలోచించాల్సిందే. మామునులు  శ్రీ రంగరాజా అని మొదలయ్యే  మరొక మంగళ శ్లోకముతో యతిరాజులను కీర్తిస్తున్నారు. ” శ్రీ”  అంటే ఇక్కడ శ్రీ వైకుంఠము అని అర్థము , రంగరాజుల తామర వంటి పాదము అని చెప్పుకోవచ్చు.  ఎందుకంటే వాటికి సహజ సిద్దమైన అందము మృధుత్వము, సువాసన ఉంటాయి. పరాంకుశులకున్న సంపద మూడు విధములు .అవి 1. పరమాత్మ అనుభవము 2. ఆయనకు చేయగల కైంకర్యము 3.జీవాత్మ పరభక్తి, ఫరజ్ఞానము, పరమ భక్తి పొందుటకోశము కైంకర్యము చేయుట. పరభక్తి అంటే పరమాత్మను చూడాలన్న కోరిక. ఫరజ్ఞానము అంటే పరమాత్మను చూసాక ఆయనలో ఐక్యమవాలనే కోరిక. పరమ భక్తి అంటే పరమాత్మలో  ఐక్యమయ్యాక విడిపోవాల్సి వస్తుందేమోనన్న శంఖ. ఆహారము తీసుకోవడానికి ఆకలి ఎంత అవసరమో,  పరమాత్మకు కైంకర్యము చేయడానికి ఈ మూడు అర్హతలుగా వుందాల్సిందే. ఆకలి లేకుంటే ఆహారము రుచించదు. ఈ మూడు లేని పూజ వృధా ప్రయాస మాత్రమే అవుతుంది.  కాబట్టి ఇక్కడ శ్రీమత్ అన్న పదము  నమ్మళ్వార్లకు పై మూడు గుణములు అపారముగా గలవని తెలుపున్నది. శ్రీ భట్టనాథ ఫరకాల అనటము వలన ఆళ్వారిద్దరికి ఇది వర్తిస్తున్నది. పరమాత్మకు తిరుప్పల్లాండు పాడటము వలన భట్టనాథులకు ఈ సంపద అబ్బినది. శ్రీ పరకాలులకు ఇతర మతములను గెలుచుట శ్రీరంగములోని కోవెలకు ప్రాకారాము నిర్మించుట వలన ఈసంపద అబ్బినది. శ్రీ పరకాలులు పెరియ తిరుమొళి 4.9.6. లో ఈ విషయమును చెప్పుకున్నారు. అణ్ణావప్పన్గార్అ స్వామి ఇక్కడ  తిరువిందలూరు  పెరుమాళ్ళను కూరేశులతో పోల్చారు.  శ్రీవత్సచిహ్న అంటే వక్షము మీద చిహ్నము కలవారు అని అర్థము. పరమాత్మ వక్షము మీద చిహ్నము కలవారు కదా! అలాగే కూరేశులు కూడా వక్షము మీద చిహ్నము కలిగి వున్నారు.  శ్రీని  శ్రీవత్సచిహ్నులతో పోలిక చేశారు. సీత అశోక వనములో తనను బాధించిన ఒంటి కంటి రాక్షసులను రక్షించినట్లు కూరేశులు కూడా తన కళ్ళు పోవడానికి కారణమైన నాలూరానును ఈ లోకపు క్లేశములనుండి రక్షించి మోక్ష సామ్రాజ్యములో స్థానము కల్పించారు. “ ప్రణమామి మూర్ద్న” అన్న ప్రయోగముతో మొదటి శ్లోకములో శిరసు వంచి నమస్కరించారు. ఈ  శ్లోకములో “ ఈడే “అన్న ప్రయోగము వాచిక కైంకర్యమును సూచించారు. మనసులో చింతన చేయనిదే వాచిక కైంకర్యము సాద్యము కాదు. కావున మొదటి రెండు శ్లొకములలో త్రికరణ సుద్దిగా మంగళము పాదారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-2/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

ramanujar-alwai

భవిష్యదాచార్యులు, ఆళ్వార్ తిరునగరి

mamunigal-srirangam

మణవాళ మహామునులు,శ్రీరంగం

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygjUzfftL54KaEesD

ముందు మాట:

మన్నుయిర్కాళింగే మణవాళమామునియవన్
పొన్నడియాం చ్చెంగమల పోదుగళై-ఉన్ని
శిరత్తాలే తీండిల్ అమానువనం నమ్మై
కరత్తాలే తీండల్ కడన్

ఎందరో మహాచార్యులవతారము వలన పునీతమైన ఈ పుణ్యభూమిలో పూర్వాచార్య పరంపరగా ఈనాటికీ అందరిచే కొనియాడేబడే పరంపర మణవాళ మామునులతో సుసంపన్నమైనది. వారి తరవాత కూడా మహాచార్యులు ఎందరో అవతరించినప్పిటికీ, నంపెరుమాళ్ళనబడే శ్రీరంగనాధులే స్వయముగా శిష్యులుగా కూర్చుని తిరువాయ్ మొళికి ఈడు వ్యాఖ్యనమును విని,అచార్య కైంకర్యముగా తనియన్ చెప్పినందున మామునులతో ఆచార్య పరంపర సుసంపన్నమైనట్లు పెద్దలచే నిర్ణయించబడినది. తిరునావీరుడయపిరాన్ దాసర్ కుమారులుగా సాధారణ నామ సంవత్సరములో,సింహ మాసములో,మూలానక్షత్రయుక్త శుభదినములో వీరు ఆళ్వార్ తిరునగరిలో  అవతరించారు.తిరువాయిమొళి పిళ్ళై వీరి  ఆచార్యులు.

తిరువాయిమొళి పిళ్ళై ఒక రోజున ఉడయవర్ల గుణానుభవము  చేస్తూ,మాఱన్ అడి పణిందు ఉయ్ద రామానుశన్ అని పేర్కొన్న పలు ఫాశురాలను తలచుకుంటూ నమాళ్వార్ల మీద ఉడయవర్లకు ఉన్న భక్తి, అనురాగములకు పొంగి పోయి, ఉడయవర్లకు అక్కడ (ఆళ్వార్ తిరునగరి)విడిగా ఒక ఆలయము నిర్మిచాలని శిష్యులను ఆదేశించారు.

మామునులుకూడా ఉడయవర్ల మీద అపారమైన భక్తి కలిగి వుండి,అనేక కైంకర్యములను చేస్తూ వచ్చారు. ఉడయవర్ల మీద ఒక స్తొత్రమును విఙ్ఞాపనము చేయాలని ఆచార్యుల ఆఙ్ఞ అయినందున ఈ ‘యతిరాజ వింశతి ‘ని విఙ్ఞాపనము చేశారు. ఇందులోని మాధుర్యమును మొదలైన గుణ విశేషములను కోయిల్ అణ్ణా వరవరముని శతకములో చక్కగా వివరించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి (అవతారికా / అవతారిక)

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

yathirajar

అవతారికా

యెరుంబియప్ప తమ పూర్వ దినచర్యలో నిత్యానుష్టానమును వివరిస్తూ అభిగమము, ఉపాదానం, ఇజ్జా అనే మూడు విధానాలను తమ ఆచార్యుల పరముగా తెలియజేశారు. ఇక నాలుగవ అనుష్టానమిన స్వాధ్యాయమును ఆచార్య పరముగా అనుభవించాలని తలచారు. స్వాధ్యాయములో పూర్వాచార్య గ్రంధములను శిష్యులకుపదేశించుట అను విధానమును స్వీకరించారు. ‘వాక్యాలంకృతి వాక్యానాం వ్యాక్యాధారం ‘ (ఉత్త దినచర్య-1) అని చెప్పతలపెట్టి, కొత్త గ్రంధమును రచించుట ప్రారంభించి , ముందుగా, మణవాళ మామునుల ఆచార్య నిష్టకు ప్రతీకగా వారు తమ ఆచార్యులైన యతిరాజుల మీద రచించిన ‘ యతిరాజ వింశతిని ‘కి తనియన్ చెప్పి ఎరుంబియప్పా ఆచార్య నిష్టను చాటుకున్నారు.

పరమ పూజ్యులైన మణవాళ మామునులు ప్రపన్న జన కూఠస్తులైన (మొక్షమును పొందుటకు శ్రీమన్నరాయణుడే  ఉపాయమని,దానికై ప్రపత్తిని అనుష్టించే పెద్దలకు మూల పురుషులు ) నమ్మాళ్వార్లు మొదలైన పూర్వాచార్య పరంపర లభించినందుకు,తమ అచార్యులైన తిరువాయిమొళి పిళ్ళైచేత తాము ఉపదేశము పొందుట, మంత్రత్రయ సార రూపమైన శ్రీమద్రామానుజాచార్యులను మొక్షోపాయముగా,ఉపేయముగా విశ్వసించారు. వారి మీద తమకు గల అపారమైన భక్తి చేత,ఈ సంసారములో పడి కొట్టుకుంటున్న ప్రజలను ఉధ్ధరించగలవారగుటచేత, తమ కారుణ్య భావము వలన ‘ యతిరాజ వింశతిని ‘ రచింప తలపెట్టి ఈ పనికి అవరోధములు కలుగకుండా , సంపూర్తి అవటము కోసము యతిరాజ నమస్కార రూపముగా ఈ రెండు శ్లోకాలను చెప్పారు.

రహస్యమంత్రార్థముగా వెలసిన ఈ గ్రంధము రహస్యమంత్రములైన తిరు మంత్రము,ద్వయ మంత్రము ,చరమశ్లోకముల మొత్తము అక్షరముల సంఖ్య ఇరవై కాగా రహస్యమంత్రార్థముగా వెలసిన ఈ గ్రంధములోని శ్లోకాలు  అదే సంఖ్యలో అమరుట విశేషము.

తనియన్

యఃస్తుతిం యతిపతిప్రసాధినీం వ్యాజహార యతిరాజ వింశతిం |
తం ప్రపన్నజన చాతకాంభుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం ||

ప్రతి పదార్థము:

య@ = ఎవరైతే

యతిపతి ప్రసాధినీం = యతిరాజులైన ఉడయవర్లను అనుగ్రహింప చేశారో

యతిరాజ వింశతిం = ఆ యతిరాజుల విషయమై ఇరవై శ్లోకములను కలిగివుండుట వలన యతిరాజ వింశతి అనే పేరును కలిగి వున్న

స్తుతిం = స్తోత్రమును

వ్యాజహార = అనుగ్రహించారో

ప్రపన్నజన చాతకాంభుదం = ప్రపన్నజన జన కూఠస్తులకు చాతక పక్షి లాగా దాహమును తీర్చు మేఘము వంటి వాడైన

తం సౌమ్యవరయోగి పుంగవం = ఆ అళగియ మణవాళరన్న పేరును కలిగి వున్న ముని శ్రేష్టులను

నౌమి = స్తుతిస్తున్నాను

భావము:

ఈ తనియన్ ఎరుంబియప్పా అనుగ్రహించినది.  యతిపతిప్రసాదినీ – ఈ యతిరాజ వింశతిని అనుసంధానము చేయువారిని అనుగ్రహించకుండావుండలేని ఉడయవర్లు అన్న అర్థములో ప్రయోగింపబడినది.   ప్రపన్నజన చాతకాంబుదం –  చాతక పక్షి ప్రాణప్రదమైన కారుమేఘముల వంటి వారు.  ప్రపన్న జనులకు మొక్షమునొసగి రక్షించువారని అర్థము.  యోగిపుంగవ  – యోగులలో ఉత్తములైన మామునులు అని  భావము  .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-thaniyan/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 16 – తతః

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 15

శ్లోకం 16

తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పౌర్వాహ్ణికీః క్రియాః!
యతీంద్ర చరణ ద్వన్ద్వ ప్రవణేనైవ చేతసా!!

ప్రతి పదార్థము:
తతః =దాని తరవాత
ప్రత్యుషసి = అరుణోదయ కాలములో
స్నాత్వా = స్నానము చేసి
పౌర్వాహ్ణికీః = ప్రాతః కాలములో చేయ వలసిన
క్రియాః = క్రియలు అనగా శుధ్ధ వస్త్రమును ధరించుట, సంధ్యావందనాది కార్యములు
యతీంద్ర చరణ ద్వన్ద్వ ప్రవణేన ఏవ = యతిరాజులైన ఉడయవర్ల శ్రీపాదముల చెంత తమకున్న ప్రవనతను
చేతసా = చేతలలో
కృత్వా = ప్రకటించి

భావము:
ప్రత్యుషః: అరుణోదయ కాలములో , అనగా సూర్యోదయమునకు ముందు నాలుగు ఘడియల కాలము , నాలుగు ఝాములల రాత్రిలో చివరి ఝాము…. ఈ శ్లోకములో చెప్పిన స్నానాధికములు ,కిందటి శ్లోకములో  పేర్కొన్న గురుపరంపర,పెరుమాళ్ యొక్క ఆరు స్థితులు మొదల్గు వానిని ధ్యానించుటకు మధ్యన చేసుకునే దేహ శుధ్ధి, దంత శుధ్ధిగా గ్రహించాలి.  మునుపు ఆరు,ఏడు,ఎనిమిది, శ్లోకములో చెప్పిన కాషాయమును ధరించుట ,ఊర్ధ్వ పుండ్రములను ధరించుటను  ,తులసి మాల , తామర పూసల మాల ధరించుట కూడా ఇక్కడ కలిపి చూడాలి. ఆచార్యులే సర్వస్వమని భావించు శిష్యులు ,పరమాత్మ తానే ఆచార్య రూపములో అవతరిస్తారన్న శాస్త్రముననుసరించి , ఆచార్య రూపములో పరమాత్మ ముఖోల్లాసము కోసము నిత్య ,నైమిత్తిక కర్మలను ఆచరిస్తారు. మామునులు ఉడయవార్ల శ్రీ పాదముల మీద భక్తి నిండిన మనసుతో ఇవన్నీ అనుష్ఠిస్తున్నారని గ్రహించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-16/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 15 – ధ్యాత్వా

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 14

శ్లోకం 15

ధ్యాత్వా రహస్యత్రితయం తత్త్వ యాధాత్మ్య దర్పణం ।

పరవ్యూహాదికాన్ పత్యుః ప్రకారాన్ ప్రణిధాయ చ ।।

 ప్రతి పదార్థము:

తత్త్వ యాధాత్మ్య దర్పణం = జీవాత్మ స్వరూపము యొక్క  నిజ రూపమును అద్దములో ప్రతిబింబములా చూపువాడా

రహస్యత్రితయం = రహస్యత్రములనబడే తిరు మంత్రము,  ద్వయ మంత్రము, చరమశోకములను

ధ్యాత్వా = అర్థముతో అనుసంధానము చేయు

పరవ్యూహాదికాన్ = పరం,వ్యూహం మొదలగు సర్వ జగత్తుకు

పత్యుః = పతి అయిన శ్రీమన్నారాయణుని

ప్రకారాన్ = ఐదు స్థితులలోను

ప్రణిధాయ చ = ధ్యానము చేయువాడా

భావము:

జీవాత్మ స్వరూపము యొక్క  నిజ రూపములు మూడు. అవి ఏవనగా,   శ్రీమన్నారాయణుడు ఒక్కడికే దాసుడై వుండుట , ఆయననే మోక్షమునకు ఉపాయముగాను ,  భోగ్య పదార్థముగాను     గ్రహించుట .

తిరు మంత్రములో వున్న “ ఓం నమః నారాయణాయ  “ అనే మూడు పదములు పైన తెలిపిన మూడు రూపములను స్పష్టీకరిస్తున్నది.  దీనిలోని ”    నమః ” పదము సిద్దోపాయమైన పరమాత్మను   మోక్షమునకు ఉపాయముగా తెలియ జేస్తున్నది.  ద్వయ మహామంత్రములోని మొదటి భాగమైన ” శ్రీమన్నరాయణచరణౌ శరణం ప్రపద్యే ”  అనే మూడు పదాలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పుతున్నాయి . శ్రీ కృష్ణుడు గీతలో అర్జుననుకు చెప్పిన చరమశ్లోకములోని మొదటి భాగమైన “సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ” అనటము వలన శ్రీ కృష్ణుడు ,శ్రీమన్నరాయణుడైన తననే మోక్షాధికారిగా తెలుసుకొని శరణాగతి చేయమని ఉపదేశించటము  వలన ఈ మూడు మంత్రములను  అద్దము వంటివిగా చెపుతున్నారు.  ఈ విషయము రహస్యత్రయార్థములో వివరించబడింది.

  1. పరమపదములో నిత్యసూరులు, ముక్తపురుషులు అనుభవించు పరస్వరూపము
  2. పాలకడిలో శేష తల్పము మీద పవళించి బ్రహ్మాదుల ఆర్తనాధమును విని వారిని రక్షించుటకు సిధ్ధముగా వుండే వ్యూహ స్వరూపము.
  3. అసుర ,రాక్షసాదుల నుండి సాదువులను రక్షించుటకై ఈ భూలోకములో రామ ,కృష్ణాది అవతారములైన విభవ రూపము .
  4. 4.చిత్ ,అచిత్ లన్నింటి యందు లోపల బయట వ్యాపించి వుండుట , జ్ఞానుల హృదయ కమలములో వారి ధ్యానమునకు ఆధారమవుట కొరకు దివ్య మంగళ రూపములో నిలిచు అంతర్యామి  రూపము .
  5. పై రూపముల లాగా సామాన్యులకు దుర్లభము కాకుండా అఙానమావరించి వున్న మనము నివసించు స్థలములో , మనము నివసించు కాలములో , మన హ్రస్వ దృష్టికి కూడా కనపడే విధముగా కోవెలలో ,గృహములలొ మనము కోరు కున్న రూపములో కొలువు తీరి వున్న అర్చామూర్తి .

ఇవి కాక ఆచార్య రూపములో ఆరవ స్థితిలోను మనకు దర్శనము నిస్తున్నాడు. “పీదక వాడై    పిరానార్  పిరమగురువాగి వందు……..”(పెరియాళ్వార్ తిరుమొళి 5-2-8 ), (పీతాంభరధారుడు పరమ గురువుగా వచ్చి…..) అని    పీతాంభరధారుడు పరబ్రహ్మను గురించి ఉపదేశించు ఆచార్యులుగా అవతరించారని  పెరియాళ్వార్ తిరుమొళి లో చెపుతున్నారు.  దీని వలన గురుపరంపరకు ముందుగా అనుసంధించి తరువాత పరమాత్మ ఆరు రూపములను మామునులు సంధ్యా సాయంకాలమున అనుసంధానము చేస్తున్నారని బోధ పడుతుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-15/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 14 – పరేద్యుః

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 12, 13

శ్లోకము 14

పరేద్యుః పశ్చిమే యామే,యామిన్యా స్సముపస్థితే ।

ప్రబుధ్ధ్య శరణం గత్వా పరాం గురుపరంపరాం ।।

ప్రతి పదార్థము:

పరేద్యుః = తమకు ఎదురు చూడని విధముగా  మామునులతో కలయిక లభించిన మరునాటి

యామిన్యా = రాత్రి

పశ్చిమే యామే = నాలుగవ ఝాములో

స్సముపస్థితే సతి = లభించిన మేరకు

ప్రబుధ్ధ్య = నిద్ర లేచి

పరాం = ఉన్నతమైన

గురుపరంపరాం = గురుపరంపరను

శరణం గత్వా = ధ్యానించి శరణాగతి చేసితిని

భావము:

ఆచార్య పర్యంతం పరమాత్మను సిధ్ధో పాయమని ఆశ్రయించు వాడు సర్వ ధర్మములను వదిలి వేయాలని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ , నిత్య కర్మములను భగవత్కైంకర్యముగానో , లోక కల్యాణార్థమో అనుష్టించే తీరాలని శాస్త్రము చెప్పుతున్నది.  దానిననుసరించి పరమ కారుణికులైన మామునులు అభిగమము, ఇజ్జ మొదలగు  ఐదు కర్మలను, ఐదు వేళలా అనుష్ఠించు వారు. కావున, “గురువుగారి నిత్యకర్మానుష్ఠానము శిష్యుడు అనుసరించాల” న్న శాస్త్ర నియమముననుసరించి , ఆచార్య భక్తి వలన  ఎఱుంబిఅప్పా  “మామునుల దినచర్య” అనే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు. తదీయారధన సమయములో శ్రీవైష్ణవుల పంక్తిని పావనము చేసేది ఈ ప్రబంధమేనని ముందే చూసివున్నాము.

ముందటి శ్లోకములో రహస్య త్రయానుసంధానమును పేర్కొనటము చేత , ఈ గురుపరంపర అనుసంధానమును దానికి అంగముగా భావించు కోవాలి. గురుపరంపరను ధ్యానము చేయకుండా రహస్య త్రయానుసంధానమును  చేయరాదు. ఇక్కడ గురుపరంపర  ధ్యానము  అంటే,  పరమపదములో ఆచార్య ప్రీతి కోసము చేసే భగదనుభవమనే మొక్షమనే అర్థము. ఆచార్య పర్యంతముగా పరమాత్మ ఒక్కడినే ఉపాయముగా ఉపదేశించే స్వాచార్య పరంపరగానే స్వీకరించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-14/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 12,13 – భవంత,త్వదన్య

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 11

శ్లోకం 12

భవంత మేవ నీరన్థ్రం పశ్యన్ వశ్యేన చేతసా!

మున ! వరవర స్వామిన్! ముహూస్త్వామేవ కీర్తయన్!!

ప్రతి పదార్థము:

స్వామిన్ వరవర___తమరి సొత్తైన దాసుడి మీద తమరే అభిమానము చూపే స్వామిత్వము గల మణవాళ మామునులే……!

మునే___దాసుడిని స్వీకరించేందుకు ఉపాయమును మననము చేయు మహానుభావా!

భవంత మేవ___దేహ సౌందర్యము, మనో సౌశీల్యము గల దేవర వారు..

నీరన్థ్రం ___ఎడతెగక

పశ్యన్_____కటాక్షించి

వశ్యేన చేతసా__(తమరి కృ ప వలన దాసుడికి) వశపడిన మనసుతో

తవామేవ___స్తోత్రము చేయతగ్గ తమరిని

ముహూ___తరచుగా

కీర్తయన్___స్తోత్రము చేసుకుంటాడు(అహం_దాసుడు)

శ్లోకం 13

త్వదన్య విషయస్పర్శ విముఖై రఖిలేంద్రియైః!

భవేయం  భవదుఃఖానాం మసహ్యనామనాస్పదమ్!!

ప్రతి పదార్థము:

త్వదన్య విషయస్పర్శ విముఖై___దేవర వారి కంటే వేరైన శబ్దాది విషయములందు పరాముఖుడైన

అఖిలేంద్రియై___కర్మేంద్రియములు, ఙ్ఞానేంద్రియముల వలన

అసహ్యనాం___సహించలేని

భవదుఃఖానాం___ జన్మ వలన కలిగిన దుఃఖములకు

అనాస్పదం___కేంద్రము కాకుండా

భవేయం__దాసుడ ఉండుగా

భావము

త్రికరణ శుద్దిగా అనగా కంటితో ఆచార్యునే చూస్తూ, నోటితో స్తుతిస్తూ, కరచరణములతో వారి సేవ చేస్తూ కాలము గడిపితే మోక్షము పొందటానికి అర్హత కలుగుతుంది. ఇప్పటి దాకా తమ ఇంద్రియములు లోకములోని శబ్దాది విషయములందే లయించి వుండటము వలన సంసారములో తాననుభవించిన దుఃఖములు ఇక ముందు కలుగకుండా వుండాలని మామునులను ఎఱుంబిఅప్పా ప్రార్థిస్తున్నారు. ఇక్కడ “పశ్యన్”,” కీర్తయన్” అనే రెండు ప్రత్యయాలకు చూచుటవలన, స్తుతించుట వలన అన్న అర్థమును స్వీకరించ వలసి వుంది.

తరువాతి పాదములో ” భవ దుఃఖానాం అనాస్పదం భవేయం ” అనే పాదముతో అన్వయించు కోవాలి. భవేయం _ అన్న లోట్ ప్రత్యయమునకు ప్రార్ధన అనే అర్థమును అన్వయించుకోవాలి. దేవర వారినే చూస్తూ వుండటము , స్తోత్రము చేస్తూ వుండటము వలన, ఇతర శబ్దాది విషయములను వదిలి  దేవర వారినే సేవించటము వలన మోక్షము  పొందుటకు అర్హుడనవుతున్నాను. ఆచార్యుని చూచుట , స్తొత్రము చేయుట వలన, పరమాత్మ హృదయములో ప్రీతిని పొంది, శిష్యుడు మోక్షమును పొందుట ,   శిష్యుడు సంసార దుఖఃమునకు హేతువు కాకుండుట  ఆచార్య దర్శనము, ఆచార్య స్తొత్రము కారణమని గ్రహించాలి.

ఇంద్రియములు ఎదో ఒక విషయమును ఆశ్రయించకుండా వుండవు కదా! అందు వలన,  మామునులే! దాసుడి సకలేంద్రియములు దేవర వారి విషయములోనే నిమగ్నమై   వుండేవిధముగా మొక్షమును పొందు అర్హత అనుగ్రహించ గలరు. నీచమైన శబ్దాది విషయములకు లోను కాకుండా , మరల మరల జన్మించు క్లేశమును తొలగించవలెను. కర్మేంద్రియములు, ఙానేంద్రియములన్నీ భగవద్భాగవత కైంకర్యములలోనే ఎల్లప్పుడు నిమగ్నమై వుండాలి. లౌకికమైన నీచ విషయములలో  నిమగ్నమై వుండరాదని శాండిల్య  స్మృతి , భారద్వాజ పరిశిష్టం మొదలగు ధర్మ శాస్త్రములు తెలుపుతున్నవి.

ఇప్పటి దాకా చూసిన శ్లోకములు వరవరముని దినచర్యకు ఉపోద్ఘాతము మాత్రమే.   ఇక్కడనుండి చెప్పబోవు ఐదు కాలములలో చేయ వలసిన అభిగమనం, ఉపాదానం, ఇజ్జ,  స్వాధ్యాయం,  యోగం  అనే ఐదు అంశములలో   ఇజ్జ తప్ప మిగిలిన నాలుగు అంశములు వివరింపబడినవి.  అభిగమనం పెరుమాళ్ళను సేవించుట, “పత్యుః పదాం భుజం ద్రష్టు మయంత మవిదూరతః”(2)అని జగపతి అయిన అళగియ మణవాళుని సేవించటము కోసము మామునులు కోవెలకు వెళ్ళటమును ఉటంకించటము వలన సూచింప బడినడి.  పెరుమాళ్ళకు సమర్పించ వలసిన ద్రవ్య సేకరణ , ఆత్మ లాభాత్ పరం కిఞ్చిత్ అన్యన్నాస్తీతి నిశ్చయాత్! ఇమం జనం_ అఙీకర్తు మివ ప్రాప్తం(11) అని పరమాత్మకు జీవాత్మకు దాసుడై పరమాత్మను పొందుటయే పరమ ప్రయోజనమని తెలుపుతున్నారు. అందుకనే మామునులు దాసుడిని అనుగ్రహించటము కోసమే అక్కడికి వేంచేశారని భావిస్తున్నారు. మామునులు పరమాత్మకు సమర్పించ వలసిన ఎఱుంబిఅప్పాను స్వీకరించుటే  ఉపాదానమని సూచింపబడింది. స్వాధ్యాయము  అనగా వేద మంత్రములను పఠించుట.  ఇది ” మంత్ర రత్నాను సంథాన సంతత స్ఫురితాధరం (9) అని వేద మంత్రములలో ఉన్నతమైన ద్వయమును నిరంతరము అనుసంధానము చేయు అధరాల కదలికతో సూచింప బడినది.  ఇక యోగ మనేది భగవత్ విషయమైన ధ్యానము. ఇది “తదర్థతత్వ నిధ్యాన సన్నధ్ధ పులకోధ్గమం” అని ద్వయ మంత్రార్థమైన పిరాట్టి పెరుమాళ్ళు మొదలగు  అనే అర్థములో  , భగవత్ రామానుజమునులను ధ్యానము చేయుట  సూచితము.  ఇక్కడికి పైన చెప్పిన ఐదు  అంశములలో నాలుగు వివరింపబడినవి. కావున ఈ ఉపోద్ఘాతము పై నాలుగింటికి సంగ్రహముగా అమరి వున్నవి. ” పెరుమళ్ళను దర్శిచుట, ఆరాధించుటకు కావలసిన ద్రవ్యములను సేకరించుట ,  ఆరాధించుట, వేద మంత్రాధ్యయనము చేయుట, ధ్యానము  చేయుట  మొదలగు ఐదు అంశములతో పొద్దు పుచ్చాలని భారద్వాజ మునులు  చెప్పియున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-12-13/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 11 – ఆత్మలాభాత్పరం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 11

ఆత్మలాభాత్పరం కించిద్ అన్యన్యాస్తితి నిశ్చ్యాత్

అంగీకర్తుమివ ప్రాప్తం ఆకించనమిమం జనం

ప్రతి పదార్థము:

ఆత్మలాభాత్ : పరమాత్మకు జీవాత్మను తన దాసుడిగా చేసుకోవటము కంటే

అన్యత్ కించిద్ : అన్యమైన పని

పరం నాస్తితి : ఉన్నతమైన విషయము వేరే లేదు

ఇతి నిశ్చ్యాత్ : ఇదే నిశ్చయమైనదని

ఆకించనం : ఇతర సాధనములేవీ లేని వాడు

ఇమం జనం : (దానికి  బదులుగా సకల దుర్గుణములు కల ) దాసుడిని

అంగీకర్తుం : (దిద్దుబాటు చేసి శ్రీలక్ష్మి నాథుడి దాసుని గావించుటకు )అంగీకరించుటకు

ప్రాప్తమివ : (దాసుడు ఎదురు చూడ కుండానే) దాసుడి ముందు ప్రత్యక్షమైనట్లు…….

భావము :

కిందటి శ్లోకములోని మందహాసము, కరుణ పొంగే కన్నులు , మధుర సంభాషణ మొదలగు వానిని చూసి దాసుడు ఈ రకముగా ఊహించుకుంటున్నాడు. దాసుడు కోవెలకు వచ్చే సమయానికే తాను కూడా వచ్చినది  దాసుడిని కరుణించటము కోసమే.  మందహాసము చిందించుతూ, కరుణ పొంగే కన్నులతో, మధుర సంభాషణము గావించారేమో. మామునులతో కలయిక  తనకు యాదృచ్చికము కాదు. వారి కృప మాత్రమే కారణము. జన–ఈ భూమిలో పుట్టిన వాడు , ఆకించన—- గుణములేవీ లేని వాడు,  ఇమమ –(అయం) (స్వరమును బట్టి వస్తువును పొందుట)-సమస్త దోషములకు మూలమైన వాడిని —భూమికి భారముగా ,కంటకముగా, వుండటమే కాక జన్మకు సాధనమైన దోషములను తొలగించు కోవటము , గుణములను పొందటము అన్న న్యాయమునకు కట్టు పడని పాపాత్ముడను అని  నైచ్యానుసంధానము చేసుకుంటున్నారు. అంతే కాక ఇటువంటి వాడిపై కృప చూపుతున్న మామునుల మహాత్మ్యము ఎంత గొప్పదని ఆశ్చర్య పోతున్నారు.  ప్రాప్తమివ —- ఇక్కడ ,మివ అని ఉత్ప్రేక్షలో చెపుతున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-11/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org